
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్
సాక్షి, నల్లగొండ : మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ దంపతులకు తృటిలో విద్యుత్ ప్రమాదం తప్పిం ది. శాలిగౌరారం మండలం చిత్తలూరుగ్రామంలోని సాంభవి శంభులింగేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కల్యాణం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేకు వేదికపై సన్మానం చేశారు. ఈ క్రమంలో ఉత్సవాలకు ఏర్పాటు చేసిన లైటింగ్ విద్యుత్ వైరు తేలి ఉంది. దానిపై ఓభక్తురాలు కాలు వేయడంతో షాక్‌కు గురై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మిపై పడింది. దీంతో వీరిద్దరికి కూడా షాక్ కొట్టి కిందపడ్డారు. పది నిమిషాల తర్వాత తేరుకున్నారు. ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment