కాంగ్రెస్‌లో కొనసాగేనా?.. బీజేపీలోకి జంపా! | Rajagopal Reddy Will Join In BJP Or Continue In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కొనసాగేనా? లేక బీజేపీలోకి జంపా!

Published Sat, Jul 13 2019 10:07 PM | Last Updated on Sat, Jul 13 2019 10:09 PM

Rajagopal Reddy Will Join In BJP Or Continue In Congress - Sakshi

సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతార? లేక యూటర్న్ తీసుకుంటారా? ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ఇటీవల వార్తలొచ్చాయి. స్వయంగా అతనే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి బీజేపీయే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇటీవల అమిత్ షా పర్యటనలో బీజేపీలో చేరుతారని అందరూ ఊహించారు. కానీ అతను వెళ్లలేదు. నియోజకవర్గoలో క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.
చదవండి: రాజ్‌గోపాల్‌ రెడ్డి యూటర్న్‌.. బీజేపీకి నో!

నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన చౌటుప్పల్, చండూర్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల పైనే ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో పోటీ కాంగ్రెస్ నుంచా బీజేపీ నుందా అనే సస్పెన్స్ క్యాడర్ లో నెలకొంది. బీజేపీలోకి వెళితే 2024లో తానే సీఎం అని కార్యకర్త కు చెప్పిన ఫోన్ సంభాషణ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కోమటిరెడ్డికి కొంచెం ఇబ్బంది పరిస్థితి నెలకొంది. పార్టీలో చేరక ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ పెద్దలకు నచ్చలేదు. అదే విధంగా తాను పార్టీ మారితే క్యాడర్ అంతా తన వైపే వస్తుందనుకున్న రాజగోపాల్ రెడ్డికి చాలా వరకు కార్యకర్తలు బీజేపీ అంటే ఆసక్తి చూపకపోవడంతో రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. అటు కాంగ్రెస్ పై ఘాటైన విమర్శలు చేసినప్పటికీ అధిష్టానం చర్యలు తీసుకోలేని పరిస్థితి.

ఒకవేళ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ చేస్తే ఫిరాయింపుకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇది రాజగోపాల్ రెడ్డికి కొంత కలిసొస్తుంది. ఈ ఒక్క నెల ఆగితే మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తవుతాయని అప్పటికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుందని వేచిచూస్తున్నారు. తాను పార్టీ మారితే సోదరుడు ఎంపీ వెంకటరెడ్డి కూడా తనతో వస్తారని భావించిన రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలొనే కొనసాగుతానని చెప్పడంతో డైలమాలో ఉన్నారు. ఒక్కరూ వెళితే అంతగా ప్రాధాన్యత ఉండదని భావించిన రాజగోపాల్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి ఇద్దరూ ఒకే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement