
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పు కోవాలంటూ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనమండలిలో మంగళవారం ‘పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, శాంతి భద్రతల నిర్వహణ’పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటోం దని, ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాలని, లేకుంటే తమను బదిలీ చేస్తారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పోలీసులను ఇతర పార్టీలపైకి ఉసిగొల్పితే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ తమ పార్టీకి లక్షల మంది సభ్యులున్నారని, ఇతర పార్టీల నుంచి తీసుకోవా ల్సిన అవసరం లేదన్నారు.
ఇంతలోనే ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ జోక్యం చేసుకొని 24 మంది టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోలేదా అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందేనని, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. వందల వేల కేసులున్నాయని, ఎన్నని చెప్పాలని కోమటిరెడ్డి అనగా, మైకుంది కదాని ఏదిపడితే అది మాట్లాడితే ఎలా? నిరాధారమైన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment