సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని.. బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెస్‌లో చేరినా ఆయనను గద్దె దించేందుకేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
‘‘సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
కాగా, తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు మరికాసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది బీజేపీనే
Comments
Please login to add a commentAdd a comment