కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకే రేవంత్‌ రెడ్డిపై విమర్శలు | Rajgopal Reddy Allegations To Weaken Congress Says Mallu Ravi | Sakshi
Sakshi News home page

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీ కోసం పనిచేశారు.. పార్టీకి నష్టం చేయాలనే విమర్శలు

Published Sun, Aug 7 2022 9:22 AM | Last Updated on Sun, Aug 7 2022 9:22 AM

Rajgopal Reddy Allegations To Weaken Congress Says Mallu Ravi - Sakshi

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదన్నారు. ఓపిక లేకపోవడం వల్లే దాసోజు శ్రావణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి వెళ్లారని పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ అధిష్టానం నియమించిన పీసీసీ అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా పార్టీకి నష్టం చేయాలన్నదే వారి ఆలోచన అన్నారు.

శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదన్నారు. ఓపిక లేకపోవడం వల్లే దాసోజు శ్రావణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి వెళ్లారని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారిన నేతలు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించవద్దని మల్లు రవి హితవు పలికారు.
చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement