డ్రగ్స్‌ మాఫియాపై  స్పందించరేం.. మల్లురవి  | Congress Ex Mp Mallu Ravi Comments Over On Drugs | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మాఫియాపై  స్పందించరేం.. మల్లురవి 

Published Thu, Jan 6 2022 4:53 AM | Last Updated on Thu, Jan 6 2022 9:56 AM

Congress Ex Mp Mallu Ravi Comments Over On Drugs - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డ్రగ్స్‌ మాఫియా చేతుల్లో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటనలు తీవ్రంగా పరిగణించకపోతే.. భవిష్యత్తులో పరిస్ధితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు,మాజీ ఎంపీ మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీనగర్‌లో  డ్రగ్స్‌ మాఫియా నరసింహరావ్‌ రెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపిందని ఆరోపించారు.

డ్రగ్‌ మాపియా పై సీఎం కెసిఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారని,రాజ్‌ భవన్‌ లో గ్రీవెన్స్‌ బాక్స్‌ లో సైతం లేఖ వేసినట్లు తెలిపారు. ప్రగతి భవన్‌కి వెళితే లేఖ తీసుకోలేదని, కనీసం ప్రగతి భవన్‌ ముందు గ్రీవెన్స్‌ బాక్స్‌ అయిన పెట్టాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ మాఫియాపై  ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి కోరారు. త్వరలో డ్రగ్స్‌ మాపియా పై పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తామని, చనిపోయిన నరసింహరావ్‌ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం వర్తింపజేయాలన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement