Mallu Ravi
-
విమర్శలు తప్ప.. కేటీఆర్ చేసిందేమీలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ/కాజీపేట రూరల్: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు లభించింది. టెక్స్టైల్స్ శాఖ కమిటీలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం కల్పిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్‌గా ఆ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ వ్యవహరించనుండగా, సభ్యునిగా చామలకు అవకాశం దక్కింది.ఈ కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి.. మొత్తం 14 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో ఎంపీలు మల్లు రవి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్యలకు చోటు దక్కింది. కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏడుగురు చొప్పున 14 మంది, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 మంది సభ్యులతో ఈ కమిటీ పని చేయ నున్నట్లు ఆయా మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్మెంట్కు కృషి సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మ«ధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.జైన్‌తో తెలంగాణ, కర్ణాటక ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. -
కొందరికి రుణమాఫీ కాలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు.. ఆ విషయం తమకు తెలుసు అని కామెంట్స్ చేశారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఐదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో 20వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం మాకు తెలుసు. రుణమాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం. రెండు లక్షలలోపు ఉన్న వారికే రుణాలు మాఫీ అవుతుంది. ఎవరికైనా మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం.ఇక, అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో అన్నారని కేటీఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి. ఇప్పటిదాకా బండి సంజయ్ మాటలు విని ఇక నుంచి వినడం అనవసరం. కేటీఆర్‌కు పీసీసీ అనడంలో అర్థం ఉందా?. కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. -
నాగర్ కర్నూల్ టికెట్ ఫైట్
-
బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మల్లు రవి మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించకపోతెనే అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లు వచ్చాయి. ముందే ప్రకటించి ఉంటే 80కి పైగా సీట్లు వచ్చేవి. ప్రజాపాలన కేటీఆర్ కళ్ళకు కనిపించడం లేదా?. తెలంగాణలో ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ...బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కేసుల భయంతో బతికారు. గత ప్రభుత్వంలో ప్రజలు లేక వెలసిపోయిన సెక్రటేరియట్, ఇప్పుడు మంత్రులను సాధారణ ప్రజలు డైరెక్టుగా కలుస్తున్నారు. కేటీఆర్ తరహా వ్యాఖ్యలు పుట్టుకతోనే గుడ్డి, చెవుడు ఉన్నల్లే చేస్తారు. 420 అన్న వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెట్టాలి. 10 లక్షల ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే 6వేల మంది పేదలు లబ్ధి చెందారు’ అని మల్లు తెలిపారు. -
ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా
జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్‌సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్‌తో చర్చించానని, ఎంపీ టికెట్‌కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్‌కుమార్‌లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. -
రూ.300 కోట్లు డంప్ చేశారు
బంజారాహిల్స్: విశ్రాంత ఐఏఎస్, మాజీ ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఎన్నికల కోసం ఏకే గోయల్ ఇంట్లో సుమారు 300 కోట్ల రూపాయల డంప్ ఉందని దీనిపై విచారణ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు జూబ్లీహిల్స్‌లోని గోయ ల్ ఇంట్లో సోదాలు జరిపారు. ఐదుగురు అధికారుల బృందం లోపలికి వెళ్లగా జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న మల్లు రవితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గోయల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన వాహనాలతోపాటు టాస్‌్కఫోర్స్ సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినప్పటికీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశ్, జ్ఞానేశ్వర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజారుద్దీన్ అండ్ కో ధర్నా పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో జూబ్లీహిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సీ నియర్ కాంగ్రెస్ నాయకుడు భవాని శంకర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసి న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశా రు. దీంతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితమే సమాచారం: మల్లు రవి గోయల్ ఇంట్లో నుండి డబ్బులు తరలిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే తమకు సమాచారం అందిందని మల్లు రవి తెలిపారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి నిర్ధారించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చాక కొన్ని వాహనాలు బయటికి వెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆరోపించారు. సోదాలు రాత్రి పొద్దు పోయేవరకు సాగాయి. పశ్చిమ మండలం అడిషనల్ డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపు
-
vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అలాగే చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశాలుగా మారాయి. ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, అటుపై లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించి పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్వయహరించారు. అటుపై 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. విజయశాంతి కడప రేసు నుంచి తప్పుకున్నారు. దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన ఆమె.. 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్‌తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. 2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్లో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
హాట్ టాపిక్ గా మారిన టీ-కాంగ్ వరుస భేటీలు
-
ఈనెల 12న పొంగులేటి ప్రకటన ఉండొచ్చు!: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్షారావు కలిశారు. కాగా, వీరి భేటీ అనంతరం మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగాయి. నాగర్ కర్నూల్లో నాగం జనార్ధన్ రెడ్డితో చర్చిస్తాం. నాగంతో ఇప్పటికే జనారెడ్డి చర్చించారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించాం. ఈనెల 12న పొంగులేటి శ్రీనివాస్ నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మల్లు రవి నివాసానికి వనపర్తి నియోజకవర్గానికి చెందిన పెద్ద మందాడి బీఆర్ఎస్ ఎంపీపీ మేఘా రెడ్డి చేరుకున్నారు. మల్లు రవితో మేఘారెడ్డి భేటీ అయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితమే మేఘారెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్ -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైపోగా.. మరోవైపు జూపల్లి సైతం హస్తం వైపే మొగ్గ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) జూపల్లి కృష్ణారావుతో కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి భేటీ అయ్యి.. చేరిక గురించే చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈలోగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాలమూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, మల్లు రవితో భేటీ కానున్నట్లు సమాచారం. తన తనయుడు రాజేష్‌తో సహా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వర్గీయులపై.. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని దామోదర్‌రెడ్డి.. తన వర్గీయుల వద్ద ప్రస్తావించినట్లు భోగట్టా. అదే విధంగా తనయుడు రాజేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. పార్టీ మారాలని దామోదర్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. విడిగా కాకుండా జూపల్లి కృష్ణారావుతో పాటే చేరితే మరింత మేలు జరగవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వర్గీయులు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి. ఇదిలా ఉంటే మల్లు రవితో పాటు కొల్లాపూర్ నియోజక వర్గ నేత జగదీశ్వర్ రావుతోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఈ వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో ఇలాగైతే కష్టమే! -
మరి బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత మల్లు రవి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. కాగా, మల్లు రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ కాదా?. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేసినప్పుడు బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?. కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. రాజకీయం కోసం అబద్ధాలతో గడుపుతున్నారు. బీజేపీ నేతలు చేసే ప్రతీ ప్రకటన అబద్ధాలతో కూడుకున్నది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు గత పదేళ్లుగా నడుస్తున్నవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతకు ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈటల మాట్లాడుతూ.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశాను. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి కామెంట్స్.. జగ్గారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్‌నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. -
వార్ రూమ్ కేసులో ప్రధాన నిందితుడిగా మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రధాన నిందితుడిగా మారనున్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో ఇదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోపక్క ఈ కేసులో నోటీసులు అందుకున్న మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవిని దాదాపు రెండు గంటలపాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేసి పంపారు. వార్‌రూమ్ ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి మల్లు రవి తెరపైకి వస్తున్నారు. వార్‌రూమ్‌పై దాడి, సోదాలు జరిగిన సమయంలోనూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడూ రవి స్పందించారు. వార్‌రూమ్ ఇన్చార్జ్గా ఉన్న తన నుంచి ముందు వాంగ్మూలం నమోదు చేయమంటూ పోలీసులకు లేఖ రాశారు. సునీల్ కనుగోలు విచారణ తర్వాత కేసులో మల్లు రవిని నిందితుడిగా చేర్చిన అధికారులు, ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత వస్తానంటూ సమయం కోరిన మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు. తానే వార్‌రూమ్ ఇన్చార్జ్ అంటూ అంగీకరించిన ఆయన, అక్కడి వాళ్లు పోస్టు చేసే ప్రతి అంశంతోనూ తనకు సంబంధం ఉండదని పేర్కొన్నారని తెలిసింది. తాము కేవలం కాన్సెప్ట్ మాత్రమే చెప్తామని, అక్కడి వాళ్లు దానికి అనుగుణంగా వీడియోలు, మీమ్స్ తయారుచేసి పోస్టు చేస్తారని వివరణ ఇచ్చారని సమాచారం. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన రవి పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తారనే సమాచారం తనకు తెలియదని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరిస్తానని అన్నారు. వార్ రూమ్ నుంచి మా పార్టీకి సంబంధించి విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకొచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణ ముగిసిన తరవాత ఆ సమాచారం తిరిగి ఇవ్వాలని కోరతానన్నారు. చదవండి: ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు! -
ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విచారణ ముగిసింది. బుధవారం సుమారు మూడు గంటలపాటు ఆయన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వార్ రూం కు నేనే ఇంఛార్జి గా ఉన్నాను. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు అని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూం ఇన్ఛార్జిగా తానే ఉన్నానని, అక్కడ జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ‘‘కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నాం. ఎవరినీ కించపరచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నాం. అలాగే.. సునీల్ కనుగోలుకు, వార్ రూంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మల్లు రవి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏం జరుగుతోంది? -
నాపై కేసు పెట్టిన విషయం తెలియదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు. 'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు. చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్) -
మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు
-
కాంగ్రెస్ వార్ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్‌కు వ్యూహాలు మాత్రమే చెప్తాను. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’ :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘వార్ రూమ్’ కేసులో మల్లు రవి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం నమోదు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాయడం, సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజరవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ
-
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినంటూ ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగా, వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు సోమవారం హాజరయ్యారు. గంట పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
రేవంత్‌ను విమర్శిస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ భిక్షతో రాజ కీయంగా ఎదిగి, డబ్బుల కోసం పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని బ్లాక్‌మెయిలర్ అని కోమటిరెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, నాలుక చీరేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో ఎంపీగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించి, కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూడటం నీచమైన చర్య అని విమర్శించారు. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. -
శశిధర్ రెడ్డికి కాంగ్రెస్‌ను నిందించే హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ వచ్చిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉన్నాయని, అయినా బీజేపీలో చేరాలనుకునేవారికి కాంగ్రెస్ పార్టీని నిందించే హక్కులేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎవరికైనా పార్టీ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛ ఉంటుంది కానీ పార్టీని విమర్శించే హక్కు ఉండదని పేర్కొన్నారు. 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చారని, ఎంతో మంది వెళ్లిపోయారని, ఎవరు ఎలాంటి వారో, ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్తులో తేలిపోతుందని పేర్కొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్సే: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ మల్లురవి స్పష్టం చేశారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. టీపీసీసీ ప్రతినిధి చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలసి మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్రంలో, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తేవాలన్న సంకల్పంతోనే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని, ఈ పాదయాత్ర ద్వారా దేశంలో చెలరేగుతున్న హింస, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలపై ఆయన సమరశంఖం పూరించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మల్లు రవి వెల్లడించారు. -
టీపీసీసీ పదవికి మల్లు రవి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) సీనియర్ ఉపాధ్యక్ష పదవికి మాజీ ఎంపీ మల్లు రవి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే పక్షాన ప్రచారం చేసేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీలో తన హోదాను వదులుకుంటు న్నట్టు మల్లు రవి విలేకరులకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకునే నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం ద్వారా పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరిగేందుకు సహకరించాలన్న పార్టీ అధిష్టానం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసు కున్నట్టు ఆయన తెలిపారు. తన రాజీనా మాను మల్లు రవి బుధ వారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పంపార -
అంబేడ్కర్‌తో కేసీఆర్‌కు పోలికా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌గా పోలుస్తూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించడమేనని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినందుకు ఆయన్ను కలెక్టర్ అభినవ అంబేడ్కర్ అన్నారా? అని సోమవారం ఒక ప్రకటనలో మల్లు రవి ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా ఎనిమిదేళ్లుగా మోసం చేసినందుకు ఆయన అభినవ అంబేడ్కర్ అవుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చేసినందుకు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించినందుకు కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అయ్యారా అని నిలదీశారు. సంగారెడ్డి కలెక్టర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకే రేవంత్ రెడ్డిపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ అధిష్టానం నియమించిన పీసీసీ అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా పార్టీకి నష్టం చేయాలన్నదే వారి ఆలోచన అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదన్నారు. ఓపిక లేకపోవడం వల్లే దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లారని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారిన నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించవద్దని మల్లు రవి హితవు పలికారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
AARAA Mastan Survey Report: తెలంగాణ ఎన్నికలపై ‘ఆరా’ రిపోర్టు.. స్పందించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన వివరాలు అబద్ధం మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. -
డ్రగ్స్ మాఫియాపై స్పందించరేం.. మల్లురవి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డ్రగ్స్ మాఫియా చేతుల్లో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటనలు తీవ్రంగా పరిగణించకపోతే.. భవిష్యత్తులో పరిస్ధితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీనగర్లో డ్రగ్స్ మాఫియా నరసింహరావ్ రెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపిందని ఆరోపించారు. డ్రగ్ మాపియా పై సీఎం కెసిఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారని,రాజ్ భవన్ లో గ్రీవెన్స్ బాక్స్ లో సైతం లేఖ వేసినట్లు తెలిపారు. ప్రగతి భవన్‌కి వెళితే లేఖ తీసుకోలేదని, కనీసం ప్రగతి భవన్ ముందు గ్రీవెన్స్ బాక్స్ అయిన పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియాపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి కోరారు. త్వరలో డ్రగ్స్ మాపియా పై పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తామని, చనిపోయిన నరసింహరావ్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం వర్తింపజేయాలన్నారు. -
మూడెకరాలపై కేసీఆర్ అబద్ధాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమిని ఇస్తా మని చెప్పి ఆయా వర్గాల ఓట్లు వేయించుకుని రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని 15వ పేజీ లోని 5వ అంశంగా దళితులకు మూడెకరాల భూమి ఉందని వెల్లడించారు. మేనిఫెస్టో తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్న కేసీఆర్ పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఓ ప్రకటనలో తెలి పారు. దళితబంధు, నిరుద్యోగభృతి, డబుల్బెడ్రూం ఇళ్లపై కేసీఆర్ ఏదో ఒకరోజు అదేమాట అంటారని ఎద్దేవా చేశా రు. దళితులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి మేలు చేసింది కాంగ్రెస్‌నేనని అన్నారు. -
జగ్గారెడ్డి పంచాయితీ.. కాంగ్రెస్‌లో టీ కప్పులో తుపానే..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసమ్మతి దుమారం టీకప్పులో తుపానులా ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై శుక్రవారం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శనివారం వెనక్కు తగ్గారు. మరోమారు పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాతో మాట్లాడనని పార్టీపెద్దలకు హామీ ఇచ్చారు. తాను అలా వ్యాఖ్యానించడం తప్పేనని అంగీకరించారు. దీంతో జగ్గారెడ్డి అసమ్మతి వ్యవహారానికి ఫుల్స్టాప్ పడినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అధిష్టానం ఆరా..: రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన ఏం మాట్లాడారన్న దానిపై అధిష్టానం ఆరా తీసింది. ఈ విషయమై ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసకృష్ణన్‌లతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడారు. జగ్గారెడ్డిని పిలిపించి మాట్లాడాలని సూచించారు. దీంతో శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల సమావేశానికి హాజరైన జగ్గారెడ్డితో బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లు ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ వ్యవహారాలను అంతర్గత వేదికలపై చర్చించుకోవాలే తప్ప మీడియాతో మాట్లాడడం సరికాదని వారు జగ్గారెడ్డికి సూచించారు. పెద్దల మాటను గౌరవిస్తా: జగ్గారెడ్డి పార్టీ విషయాలు బయట మాట్లాడవద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన సూచనను గౌరవిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని నాయకులం అన్నదమ్ములం లాంటివాళ్లమని, కూర్చుని మాట్లాడుకుని కలిసి పనిచేసుకుంటామని, టీఆర్ఎస్, బీజేపీలపై యుద్ధం చేస్తామని అన్నారు. ‘మీడియాతో పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడాను. ఇకపై మాట్లాడను. అది నేను ఒప్పుకున్నా. పార్టీకి సంజాయిషీ ఇచ్చాను. అలాం టి పరిస్థితి మళ్లీ రాకుండా జాగ్రత్త తీసుకుంటా’అని జగ్గారెడ్డి వెల్లడించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జగ్గారెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందన్నవార్తలో నిజం లేదన్నారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు కూడా చర్చించదగినవేనని, ఈ ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్ పడిందని, ఈ విషయంలో పార్టీ కేడర్ గందరగోళానికి గురికావద్దని ఆయన వ్యాఖ్యానించారు. మల్లు రవి వర్సెస్ జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష జరిపారు. అయితే, ఈ భేటీలో జగ్గారెడ్డి, మల్లు రవిల మధ్య మాటల యుద్ధం జరిగింది. రేవంత్‌నుద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి అభ్యంతరం తెలపగా జగ్గారెడ్డి కూడా ఇందుకు దీటుగానే స్పందించారు. బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్లు సర్దిచెప్పడంతో శాంతించారు. కాగా, బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పకడ్బందీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. -
దళిత, గిరిజనులకు చేసిందేమిటి?
గజ్వేల్: అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలతో కాలం గడపడం తప్ప దళిత, గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. అంతకుముందు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదన్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2014 నుంచి 2021 వరకు దళితుల అభ్యున్నతికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించారన్నారు. అధికార పార్టీ మోసాలను ఎండగట్టగడానికే రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తాం: మల్లు రవి
-
ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది
సాక్షి, హైదరాబాద్ : ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన పోడు భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. దళితులకు దళితబంధు ఇవ్వడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టేందుకు ఇంద్రవెల్లిలో ఆత్మగౌరవ సభ జరగనుందని తెలిపారు. -
కేటీఆర్ సమర్థుడైతే.. కేసీఆర్ అసమర్థుడా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి మంత్రి కె.తారకరామారావు సమర్థుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తప్పుబట్టారు. కేటీఆర్ సమర్థుడని అంటే సీఎం కేసీఆర్ అసమర్థుడా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా.. ‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్థ్యం ఉంది’ అని గుత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (చదవండి: ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ) Certifying #KTR as an able candidate for CM by MLC Sukender Reddy is like saying #KCR as incapable CM. What’s happening in TRS Government?#WakeUpTelangana @INCIndia @INCTelangana @AICCMedia — Dr. Mallu Ravi (@DrMalluRavi1) January 3, 2021 -
రేవంత్‌రెడ్డి పేరు మీడియాకు చెప్పాను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం ఖరారైరందన్న వార్తల నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతారావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. అదే విధంగా అభిప్రాయ సేకరణలో భాగంగా ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వీహెచ్ వ్యాఖ్యలపై మల్లు రవి శనివారం స్పందించారు. మాణిక్యం ఠాగూర్ సహా ఇతర కాంగ్రెస్ నేతలపై హనుమంతారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.(చదవండి: రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే పార్టీలో కొనసాగలేను) ఇవేం మాటలు?! ఇక పీసీసీ చీఫ్ ఎంపిక అంశం గురించి మాట్లాడుతూ.. ‘‘165 మంది నాయకులతో పాటు నా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టే. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థాయిల్లోని నాయకులతో ఏఐసీసీ ఇంఛార్జీలు, 4 రోజులపాటు సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు మరి కొంత మంది ముఖ్యనేతలతో మరో దఫా చర్చలు జరిపారు. ఇంతలోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలతో మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నిజానికి ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి. గతంలో జరిగిన అనేక కీలక నిర్ణయాలలో కూడా సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేశారు. నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదు, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు. క్రమశిక్షణా ఉల్లంఘించి మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలము.. కానీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నాయకులం కాబట్టి అలా చేయం. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుందో పార్టీ అధిష్టానానికి తెలుసు. పార్టీ బాగుపడాలని, తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆశయ సాధన లక్ష్యం నెరవేరాలని కోరుకునే వాళ్ళం. అధిష్టానం కూడా అలాగే ఆలోచిస్తుంది’’ అని మల్లు రవి పేర్కొన్నారు. -
‘జరిగేదంతా వారి కనుసన్నల్లోనే’
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ప్రధాని మోదీ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాజస్తాన్‌లో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసి గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘మోదీ, అమిత్‌షా కనుసన్నల్లోనే ఇలాంటి విధానాలు అవలంభిస్తున్నారు. మోదీ, బీజేపీ తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ అంతిమ విజయం మాదే. తెలంగాణ లో కూడా నిరసన తెలిపే హక్కు లేదు. ఎక్కడిక్కడ పోలీసులను పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు. తీవ్రంగా ఖండిస్తున్నామని’’ ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు.. రాజస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలని ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తమకు ఉన్న మెజార్టీని అమిత్‌షా, మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ పరిణామాలపై నిరసనగా సోనియాగాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చలో రాజ్‌భవన్‌కు పిలుపు నిచ్చామని పేర్కొన్నారు.కేంద్రంలో బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ అడ్డుకుంటుందని.. పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. -
కరోనా నియంత్రణకు అఖిలపక్షాన్ని పిలవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రమవుతున్న ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే కార్యాచరణపై చర్చించి ప్రణాళిక ఖరారు చేయడానికి వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ పద్ధతిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ఈ సమయంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలను పెంచాలని, తీవ్రత లేని వారికి ఇంట్లోనే చికిత్స చేసి, తీవ్రమైన కేసులను మాత్రమే ఆసుపత్రులలో చేర్చాలని మల్లు రవి కోరారు. ఈ వ్యాధి చికిత్సపై ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
అడగాల్సింది మమ్మల్ని కాదు సీఎంను..
సాక్షి, హైదరాబాద్ : జలయజ్ఞంలో భాగంగా కృష్ణా నదిపై ప్రారంభమైన ప్రాజెక్టుల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మంత్రులు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం మానుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాజెక్టులపై నిలదీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు కేవలం సీఎం దగ్గర పరపతి కోసమే కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని, చేతగానితనంతోనే తమను విమర్శిస్తున్నారని రవి మండిపడ్డారు. -
వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను మోసం చేసినవాళ్లే
సాక్షి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన సాగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రుణమాఫీ చేయకుండా సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీని మోసం చేసినవాళ్లేనని విమర్శించారు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లానన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఒక సంవత్సరం నుంచి కొల్లాపూర్‌లో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీశారు. తల్లిపాలు తాగి రొమ్ము విరిచినట్లుగా కాంగ్రెస్‌కు జూపల్లి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మోసం చేశారని మల్లు రవి పేర్కొన్నారు. టీఆర్ఎస్లో ఏ నాయకుడికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి రహస్య ఒప్పందముందని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 20కి 20 వార్డులు గెలుచుకుని చైర్మన్‌ను కైవసం చేసుకుంటుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: మున్సిపల్ ఎన్నికలు: గీత దాటితే వేటే -
ఉల్లి ధర: కేసీఆర్ సమీక్ష చేయాలి
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఉల్లి ధరలు కొండెక్కడంతో.. ధరల నియంత్రణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్ష చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లును కేంద్రం అత్యవసరంగా ఆమోదించింది కానీ, నిత్యావసరాల ధరలను మాత్రం ఎందుకు నియంత్రించలేకపోతోందని విమర్శించారు. ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతోనే ధరలు మరింతగా పెరుగుతున్నాయని, ధరలను నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉల్లి బ్లాక్ మార్కెట్ తరలకుండా చేయడంతోపాటు ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య నడుస్తున్న గొడవను బీజేపీ, టీఆర్ఎస్లు ప్రోత్సహిస్తున్నాయని మల్లు రవి ఆరోపించారు. -
ఆర్టీసీ విలీనంపై చర్చలు జరపాలి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను జేఏసీ పక్కన పెట్టిన నేపథ్యంలో వెంటనే చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. ప్రధాన డిమాండ్‌ను కార్మికులు పక్కన పెట్టినందున, హైకోర్టు సూచనలు గౌరవించి ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
‘ఆ ఆలోచన విరమించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: తక్షణమే యురేనియం తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చి..చెంచుల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు. నల్లమల అడవులను కాపాడాలని కోరారు. రాష్ట్ర్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్లకు అనుమతి ఇచ్చిందనే ప్రచారం జరుగుతుందని..తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. యురేనియం తవ్వకాలతో అభయరణ్యంలో పులులు అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు. -
కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి
సాక్షి, హైదరాబాద్ : రాత్రిపూట అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేసి చెత్త కుప్పలో వేశారని మాజీ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిశామని, అఖిల పక్షం భేటీ జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంగళవారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి వెళితే లారీతో పాటు విగ్రహం కూడా తీసుకెళ్లారన్నారు. వి.హనుమంతరావుతో పాటు దాదాపు 60మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్ దళితుల వ్యతిరేకి అని మల్లు రవి నిప్పులు చెరిగారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు అనిచెప్పి చేయలేదని, ఆ తరువాత ఉప ముఖ్యమంత్రిని చేసి కారణం లేకుండా తొలగించారని తూర్పారబట్టారు. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారని, వెంటనే ప్రభుత్వమే విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
రాహుల్ కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్: రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకను అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రోజు సమావేశంలో డీసీసీలకు తగు సూచనలు చేశామని వెల్లడించారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు విప్ జారీ చేసేందుకు డీసీసీలకు అధికారం ఇచ్చామని పేర్కొన్నారు. గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కాపాడుకునేందుకు తగు సూచనలు డీసీసీలకు ఇచ్చామన్నారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల కోసం పీసీసీ నుంచి ప్రత్యేకంగా పరిశీలకులను పీసీసీ నియమించిందని మల్లు రవి తెలిపారు. ఈ ఎన్నికల బాధ్యతను పూర్తిగా డీసీసీలకు అప్పగించామని వ్యాక్యానించారు. -
మేమే రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది రాహుల్ గాంధీ కాదని, ఆయా రాష్ట్రాల నాయకత్వాలుగా ఉన్న తామేనని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని నడిపించడంలో రాహుల్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, 2019 ఎన్నికల్లో ఆయన పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రచారం నిర్వహించారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిని రాహుల్‌కు ఆపాదించడం సరైంది కాదని అన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన పనిలేదని, దీనికి ఆయా రాష్ట్రాల నాయకత్వాలే బాధ్యత తీసుకుని రాజీనామాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ కొనసాగాలి: రంగారెడ్డి, మల్లు రవి రాహుల్ నిర్ణయం సరైంది కాదని, ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండటాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ తప్ప ఎవరు అధ్యక్షుడైనా.. పార్టీ పటిష్టం కాలేదని, ఆయనే కొనసాగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. వితండవాదం మానుకోండి: కోదండరెడ్డి నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వితండవాదాన్ని మానుకోవాలని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ అన్వేష్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎస్యూఐ ప్లకార్డుల ప్రదర్శన రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ తన పదవిలో కొనసాగాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కి 220 సీట్లు వస్తాయి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ తప్ప ఏ పార్టీ మద్దతిచ్చినా తీసుకుంటామని, అందులో టీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు ఉంటాయ ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి 220 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారశైలి గోడ మీద పిల్లిలా ఉందని వ్యాఖ్యానించారు. భావసారూప్య పార్టీలతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తుది విడత ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సం దర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మోదీ మాట తీరుకు, రాహు ల్ మాట తీరుకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీని విలేకరులు ప్రశ్నలు అడిగితే అమిత్ షా సమాధానం చెప్పారని ఎద్దేవా చేశా రు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, తాను నాగర్‌కర్నూల్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
నైతిక బాధ్యత కోసం అఫిడవిట్: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి నైతిక బాధ్యత కోసమే అఫిడవిట్ అడుగుతున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ అందరినీ నిర్వీర్యం చేసేలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందన్నారు. మేము సెలక్ట్ అండ్ ఎలక్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. -
అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రమే గుర్తుకొచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెట్టడం దారుణమని, కేసీఆర్ లాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. మాజీమంత్రి డి.కె.సమరసింహారెడ్డితో కలసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అన్ని ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి గెలుపొం దినట్టుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని, దీనిలో భాగంగానే రెవెన్యూలో అవినీతి అంటూ ఊదరగొడుతన్నా రని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు పరిపాలన రంగంపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని డి.కె.సమరసిం హారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కలెక్టర్ల అధికారాలను మంత్రులకు కట్టబెట్టి డమ్మీ మంత్రుల తో పరోక్షంగా తానే అధికారం చలాయించాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సీఎంల ఇష్టానుసారం చట్టా లు చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదని, అలా చేస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు. గతంలో ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టు చీవాట్లు పెట్టింద ని గుర్తు చేశారు. రెవెన్యూను పంచాయతీరాజ్‌లో విలీనం చేయడమంటే గ్రామాల్లో రాజకీయ జోక్యా న్ని ప్రోత్సహించడమేనన్నారు. దీనిపై ఐఏఎస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. -
నాగర్ కర్నూల్లో నారాజయ్యేదెవ్వరు..?
సాక్షి. నాగర్‌కర్నూల్ : ఒకప్పుడు వలసలు, తీవ్ర కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల యుద్ధం దాదాపు ఏకపక్షంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నా.. ప్రచారంలో మాత్రం ‘కారు’ దూసుకెళ్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయగా, నియోజకవర్గ ఇన్చార్జి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చేతిలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే జారుకోవడం, నేతల మధ్య సమన్వయ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. బీజేపీ మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది. ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలు ప్రచారాస్త్రాలైనా.. ప్రధానంగా సాగునీరు, రైల్వేలైన్, జోగుళాంబ ఆలయ అభివృద్ధి చుట్టూ ఇక్కడ రాజకీయం తిరుగుతోంది. నాగర్‌కర్నూలు నియోజకవర్గం అంతా ఒకప్పుడు తీవ్ర కరువు కాటకాలు, వలసలకు పేరుగాంచింది. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక కరువు నివారణ చర్యల్లో భాగంగా సాగునీటి వసతిని కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. వైఎస్ మరణానంతరం ఈ పనులు నెమ్మదించినా, అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వేగిరం చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద మొత్తంగా 8.77 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటికే 6.03 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ఇందులో ఒక్క కల్వకుర్తి కిందే 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టు కింద 700కు పైగా చెరువులను నింపారు. సాగుకు నీరందడంతో ఈ ప్రాంతంలో వలసలు ఆగాయి. దీనికి తోడు కొత్తగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా పూర్వ పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే నాగర్‌కర్నూలు పరిధిలోని ప్రాంతాలన్నీ సస్యశ్యామలమవుతాయి. అదే జరిగితే వలసలకు అడ్డుకట్ట పడినట్టేనని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, కాల్వల పనులు పూర్తి, ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. జోగుళాంబ.. రైల్వేలైన్..గట్టు.. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు కీలకాంశాల చుట్టూ అన్ని పార్టీలు ప్రదక్షిణం చేస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారింది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. సాధ్యం కాలేదు. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికీ పనులు కొలిక్కి రాలేదు. గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు మళ్లీ మారడంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టేలా ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ సరైన రవాణా వసతులు లేవు. ఆలయ అభివృధ్ధికి పురావస్తు శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అయితే, పనులు మొదలు కావాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు, కొల్లాపూర్ నియోజకవర్గంలో సోమశిల బ్రిడ్జి నిర్మాణం, శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98 జీఓ అమలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,99,182 మహిళలు 7,89,529 ఇతరులు 35 మొత్తం 15,88,746 నాగర్‌కర్నూలు లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి రేసులో ముందున్న ‘కారు’ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరింట టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొత్తంగా 2 లక్షల మెజారిటీ వచ్చింది. ఆ పార్టీకి 6,36,002 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 4,44,084 ఓట్లు వచ్చాయి. అయితే 2004 నుంచి ఈ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ గెలవలేదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య టీఆర్ఎస్ అభ్యర్థిపై 17,800 ఓట్లతో గెలిచారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగర్‌కర్నూలులో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయాలని పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ అన్ని పార్టీల కన్నా ముందే కదన రంగంలోకి దిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సభ పేరుతో వనపర్తి సభకు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 51 శాతం ఓట్లు వచ్చిన దృష్ట్యా, ఈసారి ఎలాగైనా 4 లక్షల ఓట్ల మెజార్టీతో పార్టీ అభ్యర్థి పి.రాములును గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో పాటే కొల్లాపూర్ నియోజకవర్గం నంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. అనంతరం గత నెల 31న వనపర్తిలో సీఎం కేసీఆర్ సభ విజయవంతం కావడంతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రతి నియోజకవర్గంలో వంద స్థానాలకు పైగా కైవసం చేసుకోవడం పార్టీకి కలిసొస్తోంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ముఖ్య నేతలు పార్టీలో చేరుతుండటం ఊపునిస్తోంది. కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, దీని ద్వారా 400కు పైగా చెరువులను నింపడం, శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని, సిధ్ధేశ్వరం బ్రిడ్జి నిర్మించి తీరుతామని చేసిన వాగ్దానాలు కలిసొస్తున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరిస్తామన్న సీఎం హామీ సైతం ఇక్కడ బాగా పనిచేస్తోం ది. ‘ఎన్నికల తర్వాత ఇక్కడికొచ్చి మూడు రోజులు ఉంటా.. అన్ని సమస్యలు ప్రజా దర్బార్‌లో పెట్టి పరిష్కరించుకుందాం’ అని సీఎం కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించడం ఇక్కడ ప్రజలను ప్రభావితం చేస్తోంది. పోటీలో ఉన్న పి.రాములుకు సౌమ్యుడనే పేరుండటం, ఆయనకు మాజీ ఎంపీ మందా జగన్నాథం నుంచి సహకారం అందుతుండటంతో విజయవకాశాలు మెరుగయ్యాయి. పై‘చేయి’ కష్టమే.. ఈ నియోజకవర్గంలో తొలి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. 2009, 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. మొత్తంగా ఈ స్థానానికి 12సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీపీఎస్ గెలుపొందాయి. ఇందులో 1980–84, 1989–91 మధ్య కాలంలో మల్లు అనంతరాములు, 1991–96, 1998–99 మధ్యకాలంలో మల్లు రవి ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం మళ్లీ మల్లు రవి పోటీలో ఉన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ నియోజకవర్గంపై పట్టు ఉండటం, సీనియర్ నేత కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే ఈ టికెట్ కేటాయించింది. ప్రస్తుతం పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపులు ఆయనకు ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌దాస్ సైతం పార్టీని వీడారు. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో నిలిచారు. ఇదే పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి మహబూబ్‌నగర్ పోటీలో ఉన్నారు. దీంతో మల్లు రవికి కీలక నేతల సహాయం కొరవడింది. సీనియర్ నేత చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. గట్టు ఎత్తిపోతల చేపట్టకపోవడం, తుమ్మిళ్ల రెండో ఫేజ్, కల్వకుర్తి, నెట్టెంపాడు పనుల పూర్తిలో విఫలం వంటి అంశాలను మల్లు రవి తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జడ్చర్ల–మాచర్ల రైల్వేలైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తిలో రాహుల్‌గాంధీ బహిరంగసభ సక్సెస్ కావడం కాంగ్రెస్‌లో సంతోషాన్ని నింపింది. ‘కమల’ వికాసం ఎంత? బీజేపీ తరఫున పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శ్రుతి పోటీలో ఉన్నారు. 2006 నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందిస్తున్న ఆమె ప్రస్తుతం బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె తన విజయానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయితే కల్వకుర్తి పరిధిలో తప్ప మరెక్కడా ఆమెకు చెప్పుకోదగ్గ బలం లేదు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆచారికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. అక్కడ మినహా బీజేపీ ఎక్కడా బలంగా లేదు. కొంతమేర వనపర్తిలో మాత్రం పార్టీకి పట్టున్న నేతలున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అస్తిత్వాన్ని కాపాడేందుకు శ్రుతి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. దేశ సమగ్రత విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సేవలు, అవినీతి నిర్మూలన, సర్జికల్ స్ట్రయిక్స్, స్కిల్ ఇండియా వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడం, శక్తిమేర బీజేపీ శ్రేణులు కలిసిమెలిసి పనిచేయడం కొంత సానుకూలంగా ఉన్నాయి. నాగర్‌కర్నూలుæ పార్లమెంట్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తానంటూ ఆమె చేస్తున్న ప్రచారం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. -
పార్టీల దోబూచులాట..!
సాక్షి, మహబూబ్‌నగర్ : ఓ వైపు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుండడంతో.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులే మిగిలి ఉన్నా ఇప్పటి వరకు ఏ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ఇంకా జాప్యం చేస్తే.. మిగిలిన కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ నియోజకవర్గమంతా చుట్టి రావడం అభ్యర్థులకూ సవాల్‌గా మారనుంది. దీంతో ఆశావహులు తమ అధిష్టానాలు చేయనున్న అభ్యర్థుల ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏ పార్టీ తన అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తుందా అని సామాన్య ప్రజలూ చర్చించుకుంటున్నారు. అయితే నామినేషన్ల దరఖాస్తుకు మరో మూడు రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతోనే పార్టీలు సైతం అభ్యర్థుల ప్రకటించేందుకు జాప్యం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఉత్కంఠకు తెర పడేదెన్నడో ? రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాలకు కేం ద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తోన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. షెడ్యూల్ వెలువడిన నాలుగైదు రోజుల్లోనే అన్ని పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ భావించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 15న తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మరుసటి రోజే మిగిలిన తొమ్మిది స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో కనీసం రెండో జాబితాలోనైనా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఉంటా రని అందరూ భావించారు. అయినా ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే టీఆర్ఎస్కు చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఈ సారి ఆ పార్టీ నుంచి టికెట్ రాదనే ప్రచారం జరిగింది. ఒకవేళ జితేందర్‌రెడ్డికి అధికారి పార్టీ నిరాకరిస్తే ఆయన్ను కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దింపాలనే యోచనలో ఉందనే రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ సైతం జితేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి? ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లురవిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటు మహబూబ్‌నగర్ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అరుణను పోటీ ఉండేందుకు అధిష్టానం ఒత్తిడి తెస్తున్నా.. ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఖరారవుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ‘పోతుగంటి’కే నాగర్‌కర్నూల్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి నాగర్‌కర్నూల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న అధికార టీఆర్ఎస్ ఆ స్థానం నుంచి సౌమ్యుడు, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుగంటికి అంతర్గత సమాచారం అందినట్లు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన పోతుగంటి నామినేషన్ వేసేందుకు ఈ నెల 22న ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి విషయం లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆశావహుల్లో ఒకరు కేసీఆర్‌ను కలిసి టికెట్‌పై హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జితేందర్‌రెడ్డి మళ్లీ తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. కమలంలోనూ అంతర్మథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం జిల్లాలో ఎంపీ అభ్యర్థుల విషయంలో స్పష్టతకు రాలేదు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా బంగారు శ్రుతి పేరు దాదాపు అయినట్లు ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
రాష్ట్రంలో రాచరిక పాలన: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం అంటారని, అదే రాచరిక పాలనలో ప్రతిపక్షం ఉండదని అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని శాడిజం పొందుతున్నారని, ఏదో ఒక రోజు ఓవర్‌లోడ్ అయి టీఆర్ఎస్ పడవ మునిగిపోతుందని ఆరోపించారు. టీఆర్ఎస్లో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి తీరని లోటు అని, ఆయన మృతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేతల ‘గెట్ టు గెదర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క తరఫున ఆయ న సోదరుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కాంగ్రెస్ నేతలకు విందు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యార -
‘ఎన్నికల సంఘం టీఆర్ఎస్కు తొత్తుగా మారింది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు జరిగాయని స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పిందన్నారు. మరి ఆ తప్పులకు బాధ్యులేవరు.. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేసేంత చిత్తశుద్ధి కూడా లేదంటూ విమర్శించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రజస్వామ్యాన్ని ఫుట్‌బాల్ అడుకుంటుందని శశిధర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం ఏంటో జనాలకు బాగా అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే నంబర్ వన్‌గా ప్రజస్వామ్యన్ని ఎలా ఖూని చేయాలో కేసీఆర్ చూపించారంటూ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : మల్లు రవి సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని మల్లు రవి ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌ను ఆఘమేఘాల మీద ఎందుకు ట్రాన్సఫర్ చేశారని ప్రశ్నించారు. రఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే సీబీఐ డైరెక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. ఆలోక్ వర్మను తప్పించడం వంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థమవుతుందన్నారు. -
‘మోదీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్నమోదీ, కేంద్రంలోని పెద్దమోదీ లను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇద్దరు నియంతలు పాలిస్తున్నారని విమర్శించారు. వీరిని ఎప్పుడు ఓడించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణలో వచ్చే నిశ్శబ్ద విప్లవంలో 80–85 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పారు. -
టీఆర్ఎస్ 12 స్థానాలు గెలిస్తే గొప్ప: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ఎన్నికల్లో పది పన్నెండు స్థానాలు వస్తే అదే గొప్ప అని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్ఎస్ గ్రాఫ్ పతనం దిశగా పయనిస్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చకుండా 9 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలనలో జరిగిన ప్రగతి అంకెల గారడీ అని అభివర్ణించారు. ప్రగతి నివేదన సభకు లక్ష ట్రాక్టర్లలో జన సమీకరణ చేపట్టగా.. సగం ఖాళీ ట్రాక్టర్లే వచ్చాయని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు చేసిన వాగ్దానాలను నేరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఓటమి భయంతో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కక్ష సాధింపులను వడ్డీతో సహా వసూలు చేయడం ఖాయమని మల్లు రవి హెచ్చరించారు. -
‘మోదీ, కేసీఆర్‌లు బానిస సిద్ధాంతాన్ని ఆవలంబిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో దేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాయి కానీ మోదీ, కేసీఆర్ పాలనలో కేంద్ర, రాష్ట్రాల సంపద కేవలం కొందరి చేతుల్లోకే వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్.. దేశాభివృద్ధికి ఎంతో పాటుపడిందని పేర్కొన్నారు. పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకుల జాతీయం వంటి దేశాభివృద్ధికి తోడ్పడే పలు సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ దేశాన్ని పాలించింది కానీ మోడీ, కేసీఆర్ విధానాల వల్ల దేశ, రాష్ట్ర సంపద కొంత మంది సంపన్నుల చేతుల్లోకి వెళ్తోందని మల్లు ఆరోపించారు. మోదీ, కేసీఆర్ బానిస సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని అంటున్నారని.. ఇది ఆయన అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. సరూర్ నగర్ సభలో రాహుల్ చాలా మెచ్యూరీటితో మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రెటరీ .. డీజీపీ అన్నట్లుగా కేసీఆర్ బావిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చేప్తారని జోస్యం చెప్పారు. అలానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
హోదాకు కేసీఆర్, కవిత మద్దతిచ్చారు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ సోయి లేకుం డా మాట్లాడుతున్నారని పీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఏపీ నేతలు వ్యతిరేకించినా, సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు స్వరాష్ట్రాన్ని సాకారం చేశారని, అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించా రని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తలసానికి ఈ విషయం తెలియకపోవచ్చు గాని, ఉద్యమంలో పాల్గొన్న జగదీశ్‌రెడ్డికి కూడా తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎంపీ కవిత కూడా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తించాలని ఆయన కోరారు. -
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
-
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో నేడు ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. మూడు విడతలుగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇంచార్జ్‌లు, అసెంబ్లీ ఇంచార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ సమావేశంలో ముందస్తు ఎన్నికలు, పార్టీ బలోపేతం, శక్తి యాప్‌లపై తీవ్రంగా చర్చించారు. ఈ సమావేశ తీరుపై టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ సమావేశానికి సీనియర్లు, సిటింగ్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సమాచారం. టీపీసీసీపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాక కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నాలుగు వేల ఒట్లు తెచ్చుకొని నేతను నాతో సమానమైన హోదా కల్పిస్తారా అని మాధవ రెడ్డి మండిపడ్డారు. మాధవ రెడ్డి ఆగ్రహంతో పీసీసీపైకి దూసుకెళ్లారు. నీ వల్లె పార్టీ నాశనం అవుతుందని అంటూ తీవ్ర పీసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ముగ్గురు సహాయ ఇంచార్జీలకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించామన్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. బూత్, మండల, జిల్లా కమిటీలను జూలై 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. జూలై 1 నుంచి 15లోపు సహాయ ఇంచార్జీలు వారికి కేటాయించిన జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తారు. క్షేత స్థాయి పార్టీ పరిస్థితులపై నేతల అభిప్రాయం పీసీసీ తీసుకుందన్నారు. మరో మూడు నాలుగు రోజులు సహాయ ఇంచార్జ్‌లు వారికి కేటాయించిన నియోజకవర్గ నేతలతో సమాలోచనలు చేస్తారు. మీటింగ్‌కు హాజరుకాని సీనియర్లు పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోతున్నామని పీసీసీకి వివరణ ఇచ్చారని తెలిపారు. -
ఇద్దరు అధికార ప్రతినిధులను తొలగించిన టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బుధవారం ఇద్దరు అధికార ప్రతినిధులను టీపీసీసీ తొలగించింది. వీరిద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. సిరిసిల్లాకు చెందిన అధికార ప్రతినిధి ఉమేష్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా కమిటీ బాధ్యులు మల్లు రవి ఉత్తుర్వులు జారీ చేశారు. అలాగే అధికార ప్రతినిధి, మీడియా కమిటీ కన్వినర్ కొనగాల మహేష్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. పార్టీలో ఉమేష్ రావు, కొనగాల మహేష్‌లపై అనేక ఫిర్యాదులు రావడంతో వారిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. -
వేతనాల జాప్యంపై బదులివ్వండి: మల్లు
సాక్షి, హైదరాబాద్: ధనిక రాష్ట్రమని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల వేతనాల ఆలస్యంపై సమాధానం చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మె చేసే వరకు వ్యవహారం ముదిరిందని అన్నారు. ముఖ్యమంత్రి తన విలాసాలకు వేలాది కోట్లు ప్రజా ధనాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. పథకాల ప్రచారానికి కార్మికుల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 13 నుంచి కాంగ్రెస్ మూడో విడత యాత్ర సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మూడో విడత బస్సుయాత్రను ఈ నెల 13 నుంచి 17 వరకు చేపట్టనున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఈ నెల 13న మంచిర్యాల, 14న చెన్నూరు, 15న సిర్పూర్ కాగజ్‌నగర్, 16న ఆసిఫాబాద్, 17న బెల్లంపల్లిలో బస్సు యాత్ర చేపట్టనున్నామని పేర్కొంది. ఆయా నియోజకవర్గాల్లో అదే రోజు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పంట నష్టంపై కమిటీ వేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పొంగులేటి సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. పంట నష్టంపై తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. -
రాజకీయాల్లో నిలకడలేని వ్యక్తి కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో నిలకడ లేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు ఓటేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీకి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, రుణాల మాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. హామీలను విస్మరించిన టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారు’అని అన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయనే రాజు..ఆయనే మంత్రి’
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పెట్టబోయే థర్డ్‌ఫ్రంట్ కి ఆయనే రాజు..ఆయనే మంత్రి..ఆయనే బంటు అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నేతలు ఎవరూ కేసీఆర్‌తో కలిసి రారని జోస్యం చెప్పారు. కేసీఆర్ రాజకీయ నిలకడలేని వ్యక్తి అని, ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల తర్వాత ఓ మాటా మారుస్తాడని విమర్శించారు. దేశంలో భూకంపం సృష్టిస్తా అంటున్నాడు అంటే ప్రజలను, ప్రకృతి సర్వనాశనం చేయడమేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదని, మద్దతు ధర కల్పించలేకపోయారని మల్లు రవి ఆరోపించారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ ఎటువంటి గుణాత్మక మార్పు తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం, కేజీ టూ పీజీ, దళితులకు భూమి లాంటి ఏ పథకాలను సరిగా అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి, టీఆర్ఎస్ కి ఓటమి తప్పదని మల్లు రవి జోస్యం చెప్పారు. -
వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని మంత్రి లక్ష్మారెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘పేదలకు అత్యంత అవసరమైన ప్రభుత్వ వైద్యరంగాన్ని, ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉస్మానియాలో రెండు నెలలుగా అత్యవసర ఆపరేషన్లు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రచారం కోసం బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని చెబుతున్నా పెద్ద ఆస్పత్రుల్లోనే మందులు లేవు. ప్రభుత్వ వైద్యాన్ని నీరుగార్చి, ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు లాభం చేకూరే విధంగా మంత్రి లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నారు’అని విమర్శించారు. -
టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారా?
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కూని చేసిందని టీపీసీసీ నేత మల్లు రవి విమర్శించారు. శాసన సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు అణిచివేస్తున్నారని, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో టీఆర్ఎస్ నేతలు ఈ నాటకాన్ని సృష్టించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తున్నా అక్కడ సభను వాయిదా వేశారే తప్ప ఇక్కడిలా సస్పెండ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్‌తో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆర్టీసీ కార్మికులకు భద్రత ఏది?: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఎన్నికలలో గెలిచిన యూ నియన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండటంతో కార్మికుల ప్రయోజనాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆర్టీసీకి చెందిన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ప్రకటన ఇంతవరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీ సీని గట్టెక్కించేందుకు రూ.670 కోట్లు ఇస్తామని చెప్పి రూ.260 కోట్లే విడుదల చేశారన్నారు. ఏఐటీయూసీ నేత అబ్రహం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచుతామని సీఎం చెప్పారని, కానీ ఇంతవరకు అమలు కాలేదని, సకల జనుల సమ్మెకు సంబంధించి వేతనంతో కూడిన సెలవుల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు: నగేశ్ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈ యాత్రలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, బస్సు యాత్ర తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ వ్యాఖ్యానించారు. -
కందుల కొనుగోళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మంగళవారం మండిపడ్డారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల మూసివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల కంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దుర్మార్గపు చర్యలను మానుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. -
ఉత్తమ్ ఇంటి వద్ద సంబరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులను కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకొని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఉత్తమ్ కు çపుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు రవి, గుడూరు నారాయణ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద, రంగారెడ్డి జిల్లా నాయకులు క్యామ మల్లేశం, బి.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వరంగల్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్ అన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే తెలంగాణ వచ్చిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో అధికారం సాధించిన కేటీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని, కన్నూమిన్నూ కానకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని అసమర్థతను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. సమస్యల గురించి మాట్లాడకుండా కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, దూషణలు మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని మల్లు రవి హెచ్చరించారు. -
సీఎం కేసీఆర్ కూడా పెద్ద గొర్రె: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను గొర్రెల తో పోల్చడం దారుణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అలాగైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ నాయకుడైన కేసీఆర్ కూడా పెద్ద గొర్రె అని విమర్శిం చారు. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులను గొర్రెలుగా అభివర్ణించడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమన్నారు. దీనికి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ వీరయ్యతో కలసి గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగిడిన కర్ణాటక మంత్రి రేవన్నపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలియకుండా మాట్లాడిన కర్ణాటక నేతపై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వీరయ్య మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ భయపడుతోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి టీఆర్ఎస్ నేతలు, మంత్రులు భయపడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి లక్ష్మారెడ్డి కళ్లున్నా చూడలేని కబోది అని విమర్శించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఆదరణ గురించి నిఘా వర్గాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.సీఎం కేసీఆర్‌ను నమ్మించడానికి ఈ సభ గురించి మంత్రి తప్పుగా మాట్లాడుతున్నారని రవి అన్నా రు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడు తున్న లక్ష్మారెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నా రో చెప్పాలన్నారు. మంత్రులంతా టాకింగ్ డాల్స్ లాగా మారారని ఎద్దేవా చేశారు. -
కేసీఆర్‌ను గద్దె దించేందుకే..
చౌటుప్పల్ (మునుగోడు) : కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. మండల కేంద్రంలోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఇప్పుడే ప్రారంభమాయ్యిందన్నారు. ప్రజాసామ్య పరిరక్షకులు, ప్రజసామ్య భక్షకులు అనే రెండు వర్గాలుగా సమాజం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. ఈ విషయాన్ని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. పెద్దనోట్లు రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ నెల 20న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాహూల్‌గాంధీ హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి స్రవంతిరెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పున్న కైలాస్, కుంభం క్రిష్ణారెడ్డి, పాశం సంజయ్‌బాబు, చింతల వెంకట్‌రెడ్డి, గుండు మల్లయ్య, చిక్క నర్సింహ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి పనులు: మల్లు
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేసి, తామే కల్వకుర్తి ప్రాజె క్టును తెచ్చినట్లు టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ భవ న్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెట్టెంపాడు, కోయల్ సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు నిధులిస్తే పనులు పూర్తవు తాయని వివరించారు. రైతుల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుంటే.. రైతులకు వ్యతి రేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించడం హాస్యా స్పదంగా ఉందన్నారు. -
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: కోటి మంది కేసీఆర్‌లు అడ్డొచ్చినా.. ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, వాళ్లకు అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో 30 ఇరిగేషన్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ రూపకల్పన చేసి పనులు ప్రారంభించిందన్న విషయం కేసీఆర్ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అనుకూలమని, టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం మర్చిపోయి మూడేళ్లుగా మాటలతో గడిపేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత–చేవెళ్లకు రీ డిజైనింగ్ అని చెప్పిన ఏడాది తర్వాత పనులు చేపట్టారన్నారు. ప్రజల సమస్యలపై పోరాడిన ఉత్తమ్ లక్ష మంది ఉత్తమ్‌లలాగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. పులిచింతల నిర్వాసితులకు ఉత్తమ్ పోరాడి పరిహారం ఇప్పించారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. -
అభిప్రాయ భేదాల్లేని రాజకీయపార్టీ ఉందా?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల్లో విభే దాలు సహజమేనని, భేదాభిప్రాయాల్లేని రాజకీయ పార్టీ ఏదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నిం చారు. మంగళవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎన్ని అభిప్రా యభేదాలున్నా వచ్చే ఎన్నికల్లో కనీసం 70 స్థానాల్లో పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తుందన్నారు. విభేదాలపై పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడి, పరిష్క రించుకుంటామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం విన్నామని, అయితే సమాచారం లేకుండా మాట్లాడలేనన్నారు. నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామా చేస్తే ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మల్లు రవి చెప్పారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయమైన చర్యన్నారు. రైతు సమితులన్నీ టీఆర్ఎస్ కమిటీలే అన్నారు. -
మైండ్ గేమ్‌లు టీఆర్ఎస్వే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మైండ్ గేమ్ పేటెంట్ టీఆర్ఎస్ సొంత మని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై సీఎం కేసీఆర్ చేసిన సర్వే బూమరాంగ్ అయ్యిందని అన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగళ్ల మహేశ్, మైనారిటీ సెల్ చైర్మన్ ఫక్రు ద్దీన్లతో కలసి ఆయన గురువారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అభద్రతతోనే కేసీఆర్ ఇప్పుడు సిట్టింగులు అందరికి టికెట్లు అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, రెండవ స్థానంలో ఎవరుంటారో టీఆర్ ఎస్, బీజేపీ తేల్చుకోవాలన్నారు. అసలు 2019 వరకు టీఆర్ఎస్ అధికారంలో ఉం టుందో లేదో కూడా అనుమా నమేనని, మంత్రి హరీశ్‌రావు బాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. భూ సర్వేకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, రైతు సమితిలో టీఆర్ఎస్ నేతలను నింపడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. తక్షణమే జీవో 39ని రద్దుచేసి అఖిలపక్ష సమావేశం జరపాలని రవి డిమాండ్ చేశారు. -
దక్షిణ తెలంగాణపై వివక్ష : మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు, సాగునీటి విషయంలో దక్షిణ తెలంగాణకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయడంలేదన్నారు. ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు 90 శాతం పూర్తయినా 10 శాతం పనులను మూడేళ్లుగా ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టకపోతే ఉద్యమం చేయాల్సి వస్తుందని మల్లు రవి హెచ్చరించారు. -
నిర్బంధానికి పరాకాష్ట
పొన్నం దీక్ష భగ్నంపై ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను తెల్లవారుజామున అరెస్టు చేయడం టీఆర్ఎస్ నిర్బంధకాండకు పరాకాష్ట అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజాస్వామికంగా కొట్లాడటమే తప్పా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ పాలకుల దాష్టీకానికి గురైన దళితులను పరామర్శించడానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ సభ పెడతామంటే అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడేమో ఇచ్చిన హామీపై మాట్లాడకుండా పొన్నంను అరెస్టు చేశారని విమర్శించారు. మెడికల్ కాలేజీపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రగతి భవన్లో, ఫాంహౌజ్‌లో గడుపుతూ ప్రజల మధ్యకు రావడానికి భయపడుతున్నారని దుయ్యబట్టారు. సిరిసిల్లలో దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీని ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బాధిత దళితులను దొంగచాటుగా వేములవాడలో పరామర్శించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
దాడులు కొనసాగితే పౌరయుద్ధం: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలపై భౌతిక దాడులు, ప్రజలపై అరాచ కాలు ఇదే విధంగా కొన సాగితే దేశంలో పౌర యుద్ధం వస్తుందని టీపీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి హెచ్చరించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లా డుతూ... దేశంలో నియంతపాలన నడుస్తోందని విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుజరాత్లో జరిగిన దాడి దేశంలో నియంత పాలనకు పరాకాష్ట అని అన్నారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన నేతకే రక్షణ లేకుండా పోయిందని, ఇంకా సామాన్యులకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అండ చూసుకునే ఈ దాడులు జరిగాయని ఆరో పించారు. గోమాంసం తింటున్నారన్న నెపంతో మనుషులను కొట్టి చంపుతున్నారని అన్నారు. -
తెలంగాణలో రాజ్యహింస పెరిగింది: మల్లు
హైదరాబాద్: తెలంగాణలో రాజ్యహింస పెరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి మల్లు రవి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుందని.. టీఆర్ఎస్ అనడం సిగ్గు చేటన్నారు. దళితుల మీద థర్డ్ డిగ్రీ జరిపితే.. ఒక దళిత ఎంపీగా బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ నోరు విప్పలేదు కాబట్టే.. కాంగ్రెస్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఆర్గనైజేషన్‌లో ఎవరు ఎక్కడ ఉండాలన్నది అధిష్టానం చూసుకుంటుందని వివరించారు. -
'ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి'
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గురువారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. బడ్జెట్లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మల్లు రవి విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి రాజకీయ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలకు ఉపయోగపడే రాష్ట్ర విభజన హామీలపై సీఎం కేసీఆర్‌కు ఎందుకు లేదని మల్లు రవి ప్రశ్నించారు. -
మతతత్వ అభ్యర్థికి ఓట్లేస్తారా: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతున్నదని, మతతత్వ పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తారా అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమన్నారు. బీజేపీ దీనికి విరుద్ధంగా మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. కోవింద్ లాంటివ్యక్తి రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. భారతదేశ భవిష్యత్తును గమనంలో ఉంచుకుని, ఓటర్లంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరారు. రైతులను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. -
‘బీజేపీ వారిద్దరికి వ్యతిరేకం ’
హైదరాబాద్: బీజేపీ భారత దేశ ప్రజలను కులాలు, మతాల పరంగా విడదీస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. దళితులకు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కూడా అదేవిధమైన భావాలు ఉన్నాయన్నారు. కోవింద్ రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ అయిందని వెంకయ్య వాఖ్యలు చేయడం రైతుల్పి అవమాన పరచడమేనని అన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయానలి ఎమ్మెల్యేలను కోరారు. రాష్ట్రపతి ఎన్నికలు రెండు భిన్న సిద్ధాంతాల పోరుగా అభివర్ణించారు. -
ఎన్డీయేకు మద్దతా?: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దళితుడని మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడం పచ్చి వంచన అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌తో కలిసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని ఆ పదవిలో కూర్చున్న కేసీఆర్ వారికి ఇస్తానన్న మూడెకరాల భూమిని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను గెలిపించడానికి డిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్న తర్వాతనే హైదరాబాద్‌కు తిరిగిరావాలని డిమాండ్ చేశారు. -
దళితులను మోసం చేస్తూ ఎన్డీయేకు మద్దతా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దళితుడని మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడం పచ్చి వంచన అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌తో కలిసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని ఆ పదవిలో కూర్చున్న కేసీఆర్ వారికి ఇస్తానన్న మూడెకరాల భూమిని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను గెలిపించడానికి డిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్న తర్వాతనే హైదరాబాద్‌కు తిరిగిరావాలని డిమాండ్ చేశారు. మతతత్వ రిజర్వేషన్లను వ్యతిరేకించిన బీజేపీ అభ్యర్థికి ఆయన ఎలా మద్దతును ఇస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. -
గాంధీకి కులాన్ని అంటగట్టడం కుట్రే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు మహాత్మాగాంధీని వైశ్యుడు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కులాన్ని అంటగడుతూ మాట్లాడటం వెనుక కుట్ర దాగి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఆదివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే గాంధీని చంపిన గాడ్సేకు గుడి కడ్తామని చెప్పిన విధంగానే, ఇప్పుడు గాంధీపై విషాన్ని చిమ్ముతున్నారని విమర్శించారు. అహిం స, సత్యాగ్రహం వంటి గాంధేయ సిద్ధాం తాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు. -
కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ప్రజలు తిరగబడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల హక్కులకోసం జరుగుతున్న పోరా టానికి అండగా ఉంటామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ప్రకటించారు. చట్ట ప్రకారం భూసేకరణ చేయకుండా ప్రభుత్వమే రియల్ఎస్టేట్ బ్రోకరులాగా రైతులను బెది రించి భూములను బలవంతంగా కొనుగోలు చేస్తున్నదని విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు వేములఘాట్ గ్రామంలో ఏడాదిగా చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. దేశంలోనే వేములఘాట్ రైతుల పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భూమిపై రైతులకు హక్కులు లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య అని ఉత్తమ్ విమర్శించారు. భూములు కోల్పోయే రైతులు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చేతకానితనంతో కేటీఆర్ విమర్శలు: మల్లు రవి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాని మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా గర్జనసభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల మనసులోని మాటలను బయట పెట్టారని తెలిపారు. దేశంకోసం ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి, పదవులకోసం దిగజారే సీఎం కేసీఆర్ కుటుంబానికి పోలికేలేదన్నారు. -
కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ
సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాను ఆవిర్భావ దినోత్సవం రోజున టీఆర్ఎస్ మరచిపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించా రు. పదవుల్లో ఉన్నవారు సంబరాలు చేసుకుంటున్నా ప్రజలు సంతోషంగా లేరన్నారు. -
తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మతి తప్పి మాట్లాడుతున్నారని, మంత్రి స్థాయిని దిగజార్చినందుకు వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దిగజారిపోయి ప్రవర్తిస్తున్న తలసానిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై, నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తమ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని మల్లు హెచ్చరించారు. -
కోమటిరెడ్డిపై దాడి అమానుషం
టీఆర్ఎస్పై ధ్వజమెత్తిన జానా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగిందన్నారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రభుత్వ దుందుడుకు చర్యలను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నాయకులతోపాటు కోమటిరెడ్డితో త్వరలో సమావేశమై ఒక కార్యాచరణ చేపడతానన్నారు. ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అమానుషం: షబ్బీర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మండలి కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రతిచోటా అధికార కార్యక్రమాల్లో విపక్ష ప్రజాప్రతినిధులను పాల్గొననీయకుండా చేయడం అమానుషమని పేర్కొన్నారు. మంత్రులు ఈ వైఖరిని విడనాడకుంటే, ఇకపై జరిగే పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ హెచ్చరించారు. హోంమంత్రి రాజీనామా చేయాలి: మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని పీసీసీ ఉపాధ్యక్షుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి మల్లు రవి విమర్శించారు. ప్రభుత్వ చెప్పుచేతల్లో పోలీసురాజ్యం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యాలకు నైతిక బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
పాలన గాడి తప్పింది: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిందని, ప్రభుత్వమే ప్రజల మధ్య కొట్లాటలను పెట్టి హింసను ప్రోత్సహిస్తున్నదని టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి, మాజీమంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ రెండు వర్గాలకు ఒకేసారి ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ధర్నాచౌక్ తరలింపుపై ప్రజాందోళనలకు భయపడిన ప్రభుత్వం, టీఆర్ఎస్ కొత్త కుట్రలకు తెరలేపాయన్నారు. ఇందిరాపార్కు ప్రాంతంతో సంబంధంలేని ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల టీఆర్ఎస్ నాయకులు ధర్నా పేరిట ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ధర్నాచౌక్ వద్ద ప్రతిపక్షాలు, జేఏసీ ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దాడులు చేశారని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శించారు. -
టీపీసీసీ అధ్యక్షుడే సీఎం అభ్యర్థి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నవారే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఉంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై అనుమానాలు, చర్చలేమీ లేవన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే 2019 ఎన్నికలకు వెళతామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయడం లేదని విమర్శిం చారు. సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేసినా, నిరసనలను వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్ స్పందించడంలేదన్నారు. ఆశ వర్కర్స్, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తే మూడేళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఆశ వర్కర్లకు రూ.9000 వేలు ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేశారు. -
’కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎవరిని నిలపాలనేదానిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరికివారు ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని..’అని ప్రకటించుకుంటున్న తరుణంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం గాంధీభవన లో విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ ఇచ్చారు. ’పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవారే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో పోరాడతాం. కాబట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే’ అని మల్లు రవి చెప్పారు. ఆశా వర్కర్లు , విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేసినప్పుడు పట్టించుకోని కేసీఆర్.. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే వాళ్లందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆశా వర్కర్ల వేతనం రూ.6,000 కాదు, రూ.9,000కు పెంచాలని మల్లు డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ కోసం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూలి డబ్బుల పేరుతో అధికార టీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు భయపడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కూలి పేరిట నిధులను ఇచ్చారన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాల్సి ఉన్నా విద్యార్థులు చెప్పులు వేస్తారని, నల్ల జెండాలు ఎగురవేస్తారని భయపడి ప్రసంగించలేదని మల్లు రవి ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేని అసమర్థ పాలనను రాష్ట్రపతి స్వయంగా చూశారని పేర్కొన్నారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: మల్లు రవి
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేశామంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కేసీఆరే వ్యవసాయాన్ని దండగ చేశాడన్నారు. మార్కెట్లకు హాలిడే ప్రకటిస్తున్న దుస్థితి నెలకొందని, మద్దతు ధర లేక రైతులు మిర్చి, కందులను పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం పరామర్శించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, సర్కార్ కళ్ళు ఉండి చూడలేని దుస్థితిలో ఉందని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తేనే రైతులకు ఊరట కలుగుతుందని సూచించారు. టీఆర్ఎస్ కూలి పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని, నిజమైన కూలీని వారు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. -
ఉద్యోగులను చెప్పులతో కొట్టాలా?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులను చెప్పులతో కొట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం అభ్యంతరకరమని, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను అవమానించడం సరికాదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను తరిమేయాలన్న కేటీఆర్ తీరు టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. భద్రాద్రి రాముని కళ్యాణంలో ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ మనవడు పట్టు వస్త్రాలు సమర్పించడం రాచరికపు పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు. ఏ అర్హతతో కేసీఆర్ మనవడు పట్టువస్త్రాలు సమర్పించారని ప్రశ్నించారు. మాట తప్పడంలో దేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తారన్నాని రవి విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు చెప్పేదొకటి, చేసేదొకటని.. కాంగ్రెస్‌ను తిట్టేందుకే కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. కవిత ఎందుకు బంగారం?: మహేశ్‌కుమార్ ఏం చేశారని నిజామాబాద్ ఎంపీ కవిత బంగారమయ్యారో మంత్రి కేటీఆర్ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేటీఆర్ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిందేమిటో ఆ వేదిక మీదున్న డి.శ్రీనివాస్‌ను అడిగితే తెలిసేది కదా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు అదుపులో ఉంచుకోకపోతే సీఎం కేసీఆర్ గత చరిత్ర విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. -
కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టండి అంటూ కేటీఆర్ మాట్లాడటం అనుచితం. మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పులతో కొట్టండి, తరిమికొట్టండి అంటూ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం. భద్రాచలంలో శ్రీరాముడి కల్యాణానికి ప్రభుత్వం తరుపున .. కేసీఆర్ మనవడు పట్టుబట్టలు సమర్పించడం రాచరికపు పోకడకాక మరేంటని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఏ అర్హతతో కేసీఆర్ మనవుడు పట్టువస్ర్తాలు సమర్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో చేసిన హామీలనే ఇంతవరకు నెరవేర్చడం లేదు. దేశంలో మాట తప్పడంలో మెదటి స్థానంలో నిలిచే ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ సర్కార్ చెప్పేదొకటి .. చేసేదొకటి. కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసేందుకే కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లుగా వుంది. వాస్తవాలు జనానికి తెలుసు.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటే ప్రజలు నమ్మరు. గొర్రెలు .. చేపలు పంపిణీ ఇప్పుడు కొత్త కాదు .. కాంగ్రెస్ హయాం లో ఇలాంటి స్కీంలు చాలా చేసింది. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి .. లేకుంటే మేం కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి వస్తుందని’’ హెచ్చరించారు. -
మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయన్నారు. దోషులకు శిక్ష పడే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని రవి డిమాండ్ చేశారు. -
'మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి'
ప్రభుత్వాన్ని కోరిన మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి స్పందించాలని, సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ సంఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, అసలైన దోషులకు శిక్ష పడేవిధంగా సమగ్ర విచారణ జరిపించాలని మల్లు రవి అన్నారు. మధుకర్ శవంపైన దెబ్బలున్నాయని, మర్మావయాలపై గాయాలున్నాయని, అది హత్య అనే అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించాలని రవి కోరారు. -
ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి కూలీలకు నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ కడుపుకొడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ కూలీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర రాకపోవడం, కొనేవారు లేకపోవడంతో మిర్చి పంటను రైతులు కాల్చివేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం బాధాకరమని విమర్శించారు. -
వారసత్వ ఉద్యోగాల పేరుతో ద్రోహం
టీఆర్ఎస్ సర్కారుపై మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ జాగృతి నాయకులతో కేసులు వేయించిందని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వేణుగోపాలరావు, ఆరేపల్లి మోహన్, పి.శశిధర్‌రెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లా డుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో కోర్టులో కేసులు వేయించారన్నారు. టీఆర్ఎస్ ద్రోహ పూరిత రాజకీయాలను సింగరేణిలో ప్రచారం చేయడానికి 20 మందితో టీపీసీసీ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రవి వెల్లడిం చారు. దీనికి మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి చైర్మన్‌గా, ఐఎన్టీయూసీ ఉపా ధ్యక్షుడు జనక్‌ప్రసాద్ కన్వీనర్‌గా, డి.శ్రీధర్ బాబు, బలరాంనాయక్, టి.నాగయ్య, మహేశ్వర్ రెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు. -
అవినీతి కూపంలో ప్రభుత్వ ఆస్పత్రులు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్లక్ష్యమే దీనికి కారణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటే భయపడే స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో రూ.150 కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటనతోనైనా కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కళ్లు తెరవాలన్నారు. గాంధీ, నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో చాలా సంఘటనలు జరిగాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రిమౌనం ఎందుకు?’
హైదరాబాద్: పోలీసుశాఖలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. వేధింపుల కారణంగానే దుబ్బాక ఎస్సై చిట్టి బాబు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడన్నారు. గతంలో కూడా ఓ ఎస్సై సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడని తెలిపారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ నియంత్రణ ఏమైందని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో అవినీతి ఇంత మితిమీరి పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హరీష్ సొంత జిల్లాలో పోలీసులు ఉన్నతాధికారుల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూంటే .. మంత్రిగా హరీష్ రావు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎస్సై ఆత్మహత్యపై హోంమంత్రి ఎందుకు మౌనం దాల్చారన్నారు. ఈ ఆత్మహత్యలపై హోం మంత్రి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని, కాంగ్రెస్‌ను ఉరి తీయాలని మంత్రి హరీష్ రావు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరుల వ్యవహారంపై సమన్వయ కమిటీలో సీరియస్ గానే చర్చ జరిగిందని చెప్పారు. దీనిపై దిగ్విజయ్‌సింగ్ నేతలందరికి సరైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. దిగ్విజయ్ సింగ్‌పై టీఆర్ఎస్ నేతల విమర్శలు చేయటం సరికాదన్నారు. వారికి ఆ అర్హత లేదన్నారు. జాతీయపార్టీలో ఉన్న తమ పార్టీ జాతీయనేతలు రాష్ట్రానికి రావడం సహజమని, ఆ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. -
జైపాల్‌రెడ్డిపై విమర్శలు సరికాదు
టీఆర్ఎస్ ఎంపీలపై మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో విపక్షాలను సమన్వయపరచడంలో ఆయన కీలకమైన పాత్రను నిర్వహించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర లేదంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బుధవారం మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక జైపాల్‌రెడ్డిని మొదట కేసీఆర్ కలసిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర ఏమిటో సీఎం కేసీఆర్‌ను అడిగితే టీఆర్ఎస్ నాయకులకు తెలుస్తుందన్నారు. కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఆయన ఏ విధమైన దీక్ష చేశారో, ఎలా విరమించారో, దానిపై ఓయూ విద్యార్థుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాదని టీఆర్ఎస్ నాయకులు నిరూపించగలరా అని ప్రశ్నించారు. -
కేసీఆర్‌ది దొంగ దీక్ష కాదని నిరూపిస్తారా?
హైదరాబాద్: ‘కేసీఆర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాలేదు. ఆయన ఎలా దీక్ష చేశారో .. ఎలా విరమించారో .. ఉస్మానియా విద్యార్థుల నుంచి ఎలా నిరసన ఎదుర్కొన్నారో జనానికి తెలుసని’ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష కాదని తెరాస నేతలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేదని తెరాస నేతలు మాట్లాడటం, ఆయన పై విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానమేనన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక కేసీఆర్ మొదట జైపాల్ రెడ్డిని కలిసిన విషయం తెరాస నేతలు మర్చిపోయారా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నేతలు చేసిన కృషి ప్రజలకు తెలుసు, తెరాస మాటలను జనం నమ్మరని తెలిపారు. కేసీఆర్ వేయి రోజుల పాలనలో వేయి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రుణమాఫీ పథకాన్ని వడ్డీ మాఫీ పథకంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పాటలు పాడిన ధూంధాం కళాకారులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచితహామీని అటకెక్కించారని అన్నారు. 2013 చట్టం ప్రకారమే ప్రాజెక్టుల భూసేకరణ జరగాలని డిమాండ్ చేశారు. -
ఆరోగ్యశాఖకే రోగం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు దిక్కు లేకుండా పోయిందని, ఆరోగ్యశాఖకే పెద్దరోగం వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల ఆరోగ్యమంటే సీఎం కేసీఆర్‌కు లెక్క లేకుండా, చులకనగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై, ఆరోగ్యశాఖ పనితీరుపై సీఎం ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్ప త్రులపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో నిరంకుశ, నిర్లక్ష్య ధోరణిని ప్రభుత్వం వీడకపోతే కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని మల్లు రవి హెచ్చరించారు. -
లక్ష్మణ రేఖ దాటిన కోమటిరెడ్డి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: గడ్డాలు, మీసాలు పెంచితే పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే బోగస్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ తదితరులు శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లం ఘించేలా మాట్లాడారని, పార్టీ లక్ష్మణ రేఖను దాటి రెండోసారి మాట్లాడారని మల్లు రవి అన్నారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడటం సరైందికాదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ అక్రమాలు: వంశీచంద్ కాగా, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శించారు. -
నయీం కేసుతో కేసీఆర్ రంగేమిటో తేలింది
మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును మూసివేయ డానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అసలు రంగు ఏమిటో బయటపడిందని పీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి ఆరోపించారు. మంగళ వారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదనే విషయం దీంతో తేలిపోయిం దన్నారు. నయీం కేసులో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని, నయీంతో అంటకాగిన వారందరి జాతకాలు బయ టపెడ్తామని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతల పాత్ర బయటకు రావడంవల్లనే ఈ కేసును నీరుగారుస్తు న్నారన్నారు. రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు న్నట్టుగా ఫొటోలు,ఆధారాలు లభించినా కేసును ఎందుకు మూసేస్తున్నారో ప్రజల కు చెప్పాలని మల్లు రవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
ఆరోగ్యశాఖకు రోగం వచ్చింది: మల్లు రవి
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖకు రోగం వచ్చిందని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యం పడకేసిందని ఆరోపించారు. నిలోఫర్ ఆస్పత్రిలో సరిపడా మందులు లేక గర్భిణీలు చనిపోవడం దారుణమన్నారు. ఆరుగురు బాలింతల చావుకు ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. ప్రభుతాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఇటీవలి కాలంలో సంభవించిన వరుస చావులపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తాం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీనగర్‌లో గల నిమ్స్ ఆస్పత్రికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించాలంటూ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిమ్స్ వద్ద మంగళవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రిని నిర్మించారని, అలాగే 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. -
చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి
-
చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: చెరువులలో చేపపిల్లలు వేసే పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ స్కామ్‌పై ప్రత్యేక విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీభన్ న్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తక్కువ చేపపిల్లలు వేసి, ఎక్కువ లెక్కలు చూపించడం ద్వారా కాంట్రాక్టర్లు, అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని, యాసంగి పంట కాలంలో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం, రైతు వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని మల్లు రవి ఆరోపించారు. -
చెరువులో చేపపిల్లలు.. పెద్ద స్కామ్: మల్లు
హైదరాబాద్: చెరువుల్లో చేప పిల్లలు వేయడంలో పెద్ద స్కామ్ జరుగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తక్కువ చేప పిల్లలు వేస్తూ పెద్దమొత్తం లో చేప పిల్లలు వేస్తున్నట్లు కాంట్రాక్టర్లు, అధికారులు పెద్ద ఎత్తున తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఈ వ్యవహారం పై తక్షణమే ప్రభుత్వం కమీషన్ వేసి స్కామ్ లో ఉన్నవారి పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
నోట్ల రద్దు నష్టాలపై విస్తృత ప్రచారం చేయండి
- కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ సూచన - నల్లకుబేరులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటోంది సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దువల్ల సామా న్యులు పడుతున్న కష్టాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, నల్లధనం పోగేసిన నేతలకు కొమ్ము కాస్తున్న వైనాన్ని కూడా ఎండ గట్టాలని కోరారు. గురువారం సాయంత్రం గాంధీ భవన్లో శ్రీనివాసన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కమిటీ సభ్యులు జి.నాగయ్య, మల్లు రవి తదిత రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీనివా సన్, భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోరుుందని, కేంద్ర అనాలోచిత చర్యల వల్ల 120 కోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చి తీవ్రంగా అల్లాడిపోతున్నారని దుయ్యబట్టారు. అరుునప్ప టికీ నోట్ల రద్దు పెద్ద ఘన కార్యంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, దీనిని సమర్థవం తంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు. నల్లధనం పోగేసుకున్న వారికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని, విజయ్ మాల్యాకు వేలాది కోట్ల రుణం మాఫీ చేయడమే ఇందుకు నిదర్శనమ న్నారు. ఆయా అంశాలతో పాటు రెండున్నరేళ్లలో కేంద్రం చేసిన తప్పిదాలపై వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో నినాదాలతో కూడిన పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. -
చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి
సూర్యాపేట : దేశానికి స్వాతంత్య్రం ఎవరు తెచ్చారో చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఒక్కరే స్వాతంత్య్రం కోసం పోరాడినట్లుగా మాట్లాడడంలో అర్థం లేదన్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారతదేశ చరిత్రను వక్రీకరించి బీజేపీ చరిత్ర రాయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలిపారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లు కలిసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని పేర్కొన్నారు. పటేల్.. నెహ్రూ కంటే గొప్ప వ్యక్తి అని.. నెహ్రూను కించపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జైపాల్‌రెడ్డి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడని.. అమిత్‌షా కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన నాయకుడన్నారు. దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడే సమయంలో బీజేపీ లేదన్నారు. పటేల్.. కాంగ్రెస్‌లో ఏఐసీసీ అధ్యక్షుడిగా.. దేశ ఉప ప్రధాన మంత్రిగా కొనసాగారని తెలిపారు. బీజేపీ మాత్రం పారిశ్రామికవేత్తల పక్షాన ఉందే తప్పా పేద ప్రజలపక్షాన లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేవలం సికింద్రాబాద్‌కే కేంద్ర మంత్రి అన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వరరావు, బైరు వెంకన్నగౌడ్, చెంచల శ్రీనివాస్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, ధరావత్ వీరన్న, అయూబ్‌ఖాన్, తూముల సురేష్‌రావు, బంటు చొక్కయ్యగౌడ్, చిలుముల సునీల్‌రెడ్డి, ఆలేటి మాణిక్యం, కక్కిరేణి శ్రీను పాల్గొన్నారు. -
విద్యార్థులకు అండగా ఉంటాం: పీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో జేఎన్టీయూ విద్యార్థులకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను శనివారం కలిశారు. డిటెయిన్ చేశారని విద్యార్థులు పోరాడితే పరీక్ష రాసే అవకాశం కల్పించారని,కానీ వారిలో దాదాపు 10వేల మందిని కావాలని ఫెయిల్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. జూనియర్ విద్యార్థులతో కలసి చదువుకోవాలని వారికి సూచించడం తీవ్ర అన్యాయమన్నారు. సిలబస్‌లో చాలా మార్పులు వచ్చాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయని, ప్రభుత్వ విధానాలపై పోరాడుతామన్నారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యలతో నష్టం: మల్లు రవి రాష్ట్రం అభివృద్ధిలో ఉందని గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యల వల్ల కేంద్రం నుంచి నిధులు తగ్గిపోతాయని, తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రైతులకు రుణమాఫీ లేదని, కరువు నిధులు ఇవ్వలేదని, వరదల బారిన పడిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని, స్కాలర్షిప్లు లేవని, బియ్యం సరిగా అందడం లేదని, ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లేవని, అభయహస్తం పింఛన్లు అందడం లేదని ఆరోపించారు. వీటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన గవర్నరే అంతా బాగుందంటే ఎలా అని, రాష్ట్రంలో ఉన్న సమస్యలు గవర్నర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
‘గడ్డం గురించి కాదు..అవినీతిపై మాట్లాడాలి’
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం గురించి కాకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన అవినీతి గురించి చెప్పాలని మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సూచించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి, అధికార మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాలనే సంకల్పంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని, కించపరిచేవిధంగా మాట్లాడటం కేటీఆర్‌కు తగదని మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు చెల్లించుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయకుండా కేవలం తన గడ్డం మాత్రమే ఉత్తమ్ పెంచుకుంటున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులైనా సహించబోనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడే చేస్తున్నారని, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన 300 కోట్ల కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడటం లేదని మల్లు రవి ప్రశ్నించారు. -
'కొత్త క్యాంపు ఆఫీసు ఎందుకు?'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాచరిక పోకడలు అనుసరిస్తున్నారని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కావాలనే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ పేదలకు ఇళ్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రజారోగ్యంపై ఎలాంటి శ్రద్ధ లేదు: మల్లు రవి
హైదరాబాద్: పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం ఉన్న ఆస్పత్రులనే పట్టించుకోవటం లేదని విమర్శించారు. పేదలు డెంగీ, మలేరియా వంటి రోగాలతో బాధపడుతుండగా వారిని పట్టించుకోవం మానేసి సెక్రటేరియట్, క్యాంప్ ఆఫీసు కట్టుకోవటానికే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ ఎజెండా అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయలేదని, పంట నష్టాన్ని అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. -
ఇష్టారాజ్యంగా జిల్లాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శకాలు, నిర్దిష్టమైన విధివిధానాల్లేకుండా జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజన చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినా, దానికి పవర్ లేకుండా చేశారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్లను జిల్లా చేయాలని తాము కోరినట్టుగా మల్లు రవి వెల్లడించారు. దీనికోసం ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని రవి విమర్శించారు. జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ తీరు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా మారిందని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. -
వైఎస్ హయాంలోనే 36 ప్రాజెక్టులు: మల్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులతోనే రాష్ట్రంలో జలకళ సాధ్యమైందన్నారు. జూరాల, శ్రీశైలం, నిజాంసాగర్, మిడ్‌మానేరుతో సహా ఇప్పుడు నిండిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిచేసినవేనన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి వంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపాదించిందని మల్లు రవి గుర్తుచేశారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. -
బాబు జైలుకెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్!
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒక అవగాహనకు వచ్చారనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డా. మల్లు రవి అన్నారు. ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారన్నారు. వీరిద్దరూ కూడా పరస్పరం ఒకరి సలహాలు, సూచనలపై మరొకరు పనిచేస్తున్నారన్నారు. ఒకరికి ఇబ్బంది వచ్చినపుడు మరొకరు ఆదుకుంటున్నారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక భూమికను పోషించిన సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిని అవమానించేలా మాట్లాటడం సరికాదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ అధికారప్రతినిధి ఇందిరా శోభన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు డెరైక్షన్‌లో కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమైనవన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసిన సందర్భాలు ఎప్పుడూ లేవని మల్లు రవి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లి చంద్రబాబును పొగడడం, పట్టీసీమ ప్రాజెక్టును మెచ్చుకోవడం, కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి చంద్రబాబు రావడం వంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన వ్యాఖ్యల ద్వారా హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
గద్వాలపై ఎందుకంత పంతం?
మాజీ మంత్రి డీకే అరుణ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన రాజకీయ అవసరాలకోసమా, ప్రజల సౌకర్యంకోసమా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. పంతంపట్టి గద్వాల జిల్లాను పక్కనబెట్టారని, గద్వాల ప్రజలపై సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకత, కసి ఎందుకని ప్రశ్నించారు. గద్వాల జిల్లాకు సంబంధించిన అభ్యంతరాలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని సీఎం అనడం తగదని, ఒక వ్యక్తి 6 వేల విజ్ఞప్తులు ఆన్లైన్లో పంపించడం సాధ్యమా అని ప్రశ్నించారు. గద్వాల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య విధానాన్ని వంచించేవిధంగా సీఎం స్థాయిలో కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. జిల్లాల విభజన పారదర్శకంగా లేదని.. ఏ ఒక్క గ్రామంలోనైనా గ్రామసభలు నిర్వహించారా అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తలసానికి అధికార గర్వం: మల్లు రవి తలసాని అధికార గర్వంతో విర్రవీగుతూ ‘నాలుక చీరేస్తా’ అంటూ నోరు పారేసుకుం టున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అభ్యంతరాలు పట్టించుకోకుండా జిల్లాల ముసాయిదాలు అమలుచేసేందుకు కలెక్టర్లతో సీఎం సమీక్షలు చేయ డం తగదన్నారు. కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. -
'ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలేయండి'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి హితవు పలికారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సన్నాసులు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అసహనంతోనే కేసీఆర్ తిట్ల పురాణం అందుకున్నారన్నారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం ప్రతిపక్షాల ప్రాధమిక హక్కు అని తెలిపారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. -
మహారాష్ట్ర ఒప్పందంపై నిర సన
మహబూబ్‌నగర్ అర్బన్ : ప్రాజెక్టులపై మహా రాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ కాం గ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక న్యూటౌన్‌లోని డీసీసీ కార్యాలయం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ ర్యాలీగా తరలి వెళ్కిల బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అక్కడి నుంచి వెళ్లి కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ హక్కుల తాకట్టు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. వాస్తవాలను మరుగున పెట్టి కోటి ఎకరాలకు నీరిస్తామని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్.రవీందర్‌రెడ్డి, కష్ణ, కె.మణెమ్మ, ముత్యాల ప్రకాశ్ పాల్గొన్నారు. -
మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే
జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్ సెంటర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షు డు అశోక్‌యాదవ్, మార్కెట్ కమిటీæమాజీ వైస్‌చైర్మెన్ మాలిక్ షాకీర్ పాల్గొన్నారు. -
ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే : మల్లు రవి
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఈ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిదిలా మారిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులపై టీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా పడినట్లు మల్లు రవి తెలిపారు. -
రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్ భరో: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: చరిత్ర ఆధారంగానే రాహుల్ గాంధీ మాట్లాడారని, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని అరెస్టు చేసి జైల్లో పెడితే దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఉన్నప్పుడు కొంతకాలం ఆర్ఎస్ఎస్ను నిషేధించింది వాస్తవం కాదా?, గాడ్సేకు గుడి కట్టాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన విజ్ఞప్తి నిజం కాదా అని మల్లు రవి ప్రశ్నించారు. -
పాలమూరు డీపీఆర్‌ను ప్రజల ముందుంచాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి డీపీఆర్(డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను ప్రజల ముందు ఉంచాలని, వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని టీపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలు వల్లూరు, ఉందడాపూర్, కిష్టారం తదితర గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలో జూరాల నుంచి 24 టీఎంసీల నీటిని తరలించే విధంగా రూ.7.50 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ డిజైన్‌ను మార్చి శ్రీశైలం నుంచి వరదనీటిని తరలించే విధంగా మరో డిజైన్‌ను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. డిజైన్ మార్పుల ఎందుకు చేపట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. అదేవిధంగా లోకిరేవులో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని మొదట పేర్కొని తరువాత ఉదండాపూర్‌కు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు నార్లాపూర్ వద్ద నేషనల్ టైగర్ ప్రాజెక్టు అడ్డుకానుందన్నారు. ఇందుకు కేంద్రం అనుమతించాల్సి ఉందన్నారు. ఊళ్లను,భూములను ముంచే విధంగా రూపొందించిన 16 టీఎంసీల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 6.08 టీసీఎంలకు తగ్గించాలని కోరారు. అదేవిధంగా 2013 చట్టం కాదని 123జీఓ ప్రకారంగా పరిహారం చెల్లించడం తగదన్నారు. కలెక్టర్ గ్రామాలకు వచ్చి రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అందించే పరిహారాన్ని సమగ్రంగా వివరించాలని కోరారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు కేవలం రూ.10వేల కోట్లు కేటాయిస్తే జిల్లాలో 7.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కానీ ఆయా ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు అండగా ఉంటామని, అధికారుల బెదిరింపులకు ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర కాంగ్రెస్ ఇన్చార్జి పవన్‌కుమార్, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రవినాయక్, డీసీసీ నాయకులు జూపల్లి భాస్కర్‌రావు, నిత్యానందం, అశోక్‌యాదవ్, బుక్క వెంకటేశం, యాదయ్య, రేణుక పాల్గొన్నారు. -
ఆ పథకం కాంగ్రెస్‌ది కాబట్టే..
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ విజయవంతం అయితే కాంగ్రెస్‌కి ఎక్కడ పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వటం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందన్నారు. ఇలాంటి చర్యలతో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కాకపోతే నష్టపోయేది పేదలేనని అన్నారు. ప్రచారానికి, ఆడంబరానికి వందల కోట్లు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీకి కేటాయించడాని డబ్బులు లేవా అని ప్రశ్నించారు. న్యాయాధికారుల సస్పెన్షన్స్ ఎత్తివేసి వారితో చర్చలు జరపాలన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుండా చర్చలకు రమ్మనడం సరికాదన్నారు. న్యాయాధికారుల సమస్య, హైకోర్టు విభజనపై ఇద్దరు సీఎంలతో చర్చించేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలన్నారు. -
టీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచింది: మల్లు రవి
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం పేద ప్రజలపై 1800 కోట్ల భారాలు మోపిందన్నారు. కాంట్రాకర్లకు, ధనవంతులకు, వ్యాపారులకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రాధాన్యత లేని పనులకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, పేద ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపొడిచిందని మల్లు రవి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ధరలు పెంచారని అన్నారు. పెంచిన విద్యుత్, ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకుంటే తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. -
‘కాకా ఫొటోలు టీఆర్ఎస్ మీటింగ్లోనా’
తుది వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న కాకా(వెంకటస్వామి) ఫొటోలను టీఆర్ఎస్ మీటింగుల్లో ఎలా పెట్టుకుంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ఫిరాయింపులను కూడా టీఆర్ఎస్ పండుగ మాదిరిగా జరుపుకుంటోందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి లెసైన్స్ ఇచ్చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్ మధ్య వారసత్వ పోరు అధికార పార్టీలో ఉన్నట్లుందని పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌ను సమర్ధించుతున్నట్లు కనిపిస్తోందని మల్లు రవి చెప్పారు. -
వ్యాపారంగా రాజకీయాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలను వ్యాపారంగా మార్చారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను నయానా భయానా టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్లపై ఆరోపణలు చేసిన గుత్తా ఇప్పుడదే టీఆర్ఎస్లో ఎలా చేరుతున్నారన్నారు. టికెట్ ఇప్పించిన జానారెడ్డికి ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచారన్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో పనిచేసిన వెంకట స్వామి ఆత్మ క్షోభించేలా తనయులు వివేక్, వినోద్ పార్టీ మారుతున్నారన్నారు. -
రైతుల హక్కులను కాలరాస్తున్న సర్కారు: మల్లు రవి
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 123 జీవో రైతుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ టీపీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడో విడత రుణమాఫీని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. కోదండరామ్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందని విమర్శించారు. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడంపై అన్ని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. -
'కొత్త జిల్లాలపై మా అభిప్రాయాలు తీసుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడం సరికాదన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అందరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణలో మూడో విడత రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని మల్లు రవి చెప్పారు. -
బీజేపీ అసలు స్వరూపం బయట పడింది: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పట్ల ఏబీవీపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ బహదూర్ రాయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేత పవన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వెంటనే రామ్ బహదూర్ రాయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు ఖండించాలన్నారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామన్నారు. -
సర్కారు పునాదులు కదులుతున్నాయి
కోదండరాం ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పాలి: మల్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకం చేసిన శక్తి కోదండరాం అని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదండరాం చేసిన ఐక్య ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలపై ప్రజల పక్షాన కోదండరాం ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పకుండా మంత్రులంతా దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ఎస్ నేతలకు తమ పాలనపై విశ్వాసం ఉంటే కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేతకాకుంటే కోదండరాంకు క్షమాపలను చెప్పాలని డిమాండ్ చేశారు. కోదండరాం మాట్లాడే ప్రతీ మాట తెలంగాణ ప్రజల గొంతుక అని అన్నా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు విరుచుకుపడటం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనానిని, అభద్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలంగాణ గాంధీ కోదండరాంపై టీఆర్ఎస్ దొంగలు విరుచుకుపడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. అధికార పార్టీ నేతలు కోదండరాంపై విమర్శలు చేసినందుకు మంగళవారం ఆయన అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పిం చారు. కేసీఆర్‌కు చెంచాలుగా ఉన్న వారు కోదండరాంపై దాడికి దిగుతుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. రైతుల పక్షాన మాట్లాడితే తప్పా? రైతుల పక్షాన మాట్లాడటమే కోదండరాం చేసిన తప్పా అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండరాంపై దాడి అప్రజాస్వామికమన్నారు. కోదండరాం పక్షాన తెలంగాణ ప్రజానీకం ఉంటుందన్నారు. జర్నలిస్టు నేతలతో చర్చలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో జర్నలిస్టు సంఘాల నేతలు మంగళవారం చర్చించారు. చర్చల అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. -
జైపాల్‌పై వ్యాఖ్యలు సరికాదు: మల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ఒప్పించిందే అప్పటి కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో జైపాల్ రెడ్డి చేసిన కృషిపై అవగాహన లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్‌కు రాకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌తో తెలంగాణ రాలేదని రవి అన్నారు. పార్టీలో ఉన్న నేతలంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. దీనికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అతీతుడు కాదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తప్పు అని, ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. నంది ఎల్లయ్యపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
'కోమటిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: జైపాల్ రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ సుమన్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ ను ఒప్పించింది కేసీఆర్ కాదని, జైపాల్ రెడ్డి అని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పై కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగా లేదన్నారు. పార్టీలో ఎంతటి నేతలైనా క్రమశిక్షణకు కట్టుబడాల్సిందేనన్నారు. -
రాష్ట్రంలో చీకటి పాలన: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంతృత్వ, చీకటి పాలన నడుస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మీడియాను ఇబ్బందులు పెట్టారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎన్కౌంటర్లు చేయించారన్నారు. యూనివర్సిటీలో ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. విమర్శించారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆరే పదవీ వ్యామోహంలో పడిపోయారని మల్లు రవి విమర్శించారు. జిల్లాల ఏర్పాటుతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. -
'సెంట్రలైజ్డ్ కరప్షన్ కు టీఆర్ఎస్ తెరలేపింది'
ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజా ప్రతినిధులను బెదిరించి పార్టీలోకి తీసుకున్నారు.. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సూచీగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. టీఆర్ఎస్ సెంట్రలైజ్డ్ కరప్షన్ కు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ, చీకటి పాలన నడుస్తోందని, టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని, రాష్ట్రం వచ్చి రెండేళ్లయిన ప్రజల ఆశలు నెరవేరలేదని పేర్కొన్నారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీడియాను ఇబ్బందులకు గురిచేశారని, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని చెప్పిన టీఆర్ఎస్.. వరంగల్ లో సభను అడ్డుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై కెమెరాలతో నిఘా పెట్టారు' అని మల్లు రవి మండిపడ్డారు. భూటకపు ఎన్కౌంటర్ లు చేశారని, విభజన చట్టంలో అంశాలను సాధించలేక పోయారని పేర్కొన్నారు. పెన్షన్ లు తప్ప మేనిఫెస్టో హామీలేవీ నెరవేర్చలేదని, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ జరగలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, దళితులకు 3 ఎకరాలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, కేజీ టు పీజీ, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలేవి ఈ రెండేళ్లలో అమలుకాలేదని చెప్పారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా సాధించలేక పోయారని, కనీసం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మల్లు రవి సూచించారు. -
ఓయూలో సీసీ కెమెరాలు ఎందుకు?: పీసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా వర్సిటీలో సీసీ కెమెరాలెందుకు పెడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్న టీఆర్ఎస్.. ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కుతుందన్నారు. తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్లిన ప్రజాస్వామ్యవాదులు, ప్రొఫెసర్లను అరెస్టు చేయడం కంటే నియంతృత్వం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అరెస్టులకు దిగుతున్నారన్నారు. సభలు నడుపుకోవాలంటే హైకోర్టుకు పోవాల్సిన దుస్థితిని రాష్ట్రంలో టీఆర్ఎస్ తెచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతల్లేవంటూ దుయ్యబట్టారు. నల్లధనం వెనక్కి తెచ్చి కుటుంబానికి రూ.15 లక్షలను జమచేస్తామని చెప్పి, మోసం చేశారని విమర్శించారు.