
టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బుధవారం ఇద్దరు అధికార ప్రతినిధులను టీపీసీసీ తొలగించింది. వీరిద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. సిరిసిల్లాకు చెందిన అధికార ప్రతినిధి ఉమేష్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా కమిటీ బాధ్యులు మల్లు రవి ఉత్తుర్వులు జారీ చేశారు. అలాగే అధికార ప్రతినిధి, మీడియా కమిటీ కన్వినర్ కొనగాల మహేష్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. పార్టీలో ఉమేష్ రావు, కొనగాల మహేష్‌లపై అనేక ఫిర్యాదులు రావడంతో వారిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment