representatives
-
బీసీ రిజర్వేషన్ల పెంపే మా ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోనీ బాలరాజుగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బీసీ ప్రతినిధుల బృందానికి డిసెంబర్‌లోగా కుల గణన సర్వే పూర్తి చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉండటం పట్ల బీసీ సంక్షేమసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను సందర్భంగా కోరారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేంద్ర ఆర్థికమంత్రితో ఏపీ చాంబర్స్ ప్రతినిధుల భేటీ
లబ్బీపేట (విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పలు అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రతిపాదించిన ఆరు ఇండస్ట్రీయల్ నోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్రం కోసం ప్రతిపాదించిన మూడు మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుల వేగవంతమైన అభివృద్ధి, ఫోర్ట్ లీడ్ ఎకానమీ అభివృద్ధికి తోడ్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్‌రేటింగ్, సిబిల్ స్కోర్లను సులభతరం చేయడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్య, ఎంఎస్ఎంఈ నుంచి తప్పనిసరి సేకరణ వంటి అంశాలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని పునరుద్ధరించి, సర్వీసులు పెంచాలని, ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలతో కార్గో సౌకర్యాలను అందించాలని ఆమెను కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు ప్రతిపాదిత వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక విషయాలు చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ బి రాజశేఖర్, సీఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, ఆల్ ఇండియా మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు, ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, క్రెడాయ్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రమణరావు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, కోవే ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు రాధిక ఉన్నారు. -
శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): ఒసాకాలోని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) డైరెక్టర్ జనరల్ మురహషి మసుయుకి, ఒసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ బిజినెస్ కమిటీ చైర్మన్ టొమిటా మినోరు ఆధ్వర్యంలో 23మంది ప్రముఖ జపాన్ వ్యాపార ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మౌలిక సదుపాయాలు పరిశీలించడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వీరి పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీసిటీ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)సతీష్ కామత్ వారికి స్వాగతం పలికారు. శ్రీసిటీలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అభివృద్ధి, తయారీ యూనిట్లను నెలకొల్పడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బోడ్గన్ జార్జ్ వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార ప్రతినిధులు, జెట్రో, ఓసీసీఐ ఉన్నతాధికారులు పర్యటనకు రావడంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జపనీస్ భారీ పరిశ్రమలకు అవసరమైన సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేట్టు ప్రోత్సహించే అనువైన పర్యావరణ వ్యవస్థ శ్రీసిటీలో ఉందంటూ ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం పై టొమిటా మినోరు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వ్యాపార సామర్ధ్యం, వేగవంతమైన అభివృద్ధి తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా వివిధ అంశాలపై జపాన్ ప్రతినిధుల బృందం ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ ఆటో విడిభాగాలు, టెక్నికల్, టెక్స్టైల్స్ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
AP at US : వరుసగా నాలుగోసారి రత్నాకర్‌కు కీలక బాధ్యతలు
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ మరోసారి ఎంపిక అయ్యారు. కడప జిల్లా రాజంపేట కు చెందిన వైయస్ఆర్ సీపీ నేత అయిన రత్నాకర్‌ను ఈ పదవిలో నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవి ఆయన్ను వరించడం ఇది వరుసగా నాలుగోసారి. 2019లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన రత్నాకర్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆపై 2021, 2022లో ప్రభుత్వం రత్నాకర్ పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఇపుడు తాజాగా మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు వరుసగా నాలుగోసారి పదవి వరించడంతో రత్నాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న పార్టీలోని కీలక నాయకులకు, సహచర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన రత్నాకర్.. తన పట్ల నమ్మకం ఉంచినందుకు సీఎం YS జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేస్తానని, ప్రవాసాంధ్రులకు అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. Thank you Jagan anna for extending my role as AP govt special rep to North america ( USA & canada) for 4 th time. I am blessed & honured to work under your leadership & associate with our party .@ysjagan @JaganannaCNCTS pic.twitter.com/q8TxO5woPW — Kadapa Rathnakar (@KadapaRathnakar) October 14, 2023 దశాబ్ద కాలంగా పార్టీతో ప్రయాణం బలిజ/ కాపు సామాజికవర్గానికి చెందిన రత్నాకర్ వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించారు. 2014 ఎన్నికలు, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ కోసం తనవంతుగా కృషిచేశారు. 2017 నుండి 2019 వరకు సాగిన వైయస్ జగన్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో అధినేతతో కలిసి అడుగులు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలు, తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాoగంతో కలిసి అభ్యర్థుల గెలుపుకు పనిచేశారు. 2015 నుండి రత్నాకర్ వైయస్ఆర్ సీపీ అమెరికా విభాగానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో వైయస్ఆర్ సీపీ మద్దతుదారులను ఏకీకృతం చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఏపీలో జరిగే వైయస్ఆర్ సీపీ కార్యక్రమాల్లో ఆయనను చురుగ్గా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ వేలాది వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు రత్నాకర్ చేరువయ్యారు. సమర్థత, విధేయతకు పట్టం కడుతూ వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అమెరికా, కెనడాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ను ఎంపిక చేశారు. అమెరికాలో తెలుగు విద్యార్థులకు తోడుగా ఇటీవల ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులతో కూడిన బృందం అమెరికాలో పర్యటించింది. ఈ పర్యటనను రత్నాకర్ దగ్గరుండి పర్యవేక్షించారు. పర్యటన ఆద్యంతం ఏపీ నుండి వచ్చిన బృందానికి సహాయ సహకారాలు అందించారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వైట్ హౌస్, కొలంబియా యూనివర్సిటీలో ఏపీ విద్యార్థులు "విద్య" పై ప్రసంగించారు. విద్యావ్యవస్థలో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, నిరుపేదల చదువుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు. నిరుపేదలైన విద్యార్థులు ప్రపంచ వేదికలపై అనర్గళంగా మాట్లాడడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో సీఎం వైయస్ జగన్ విద్యావిధానాలను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో రత్నాకర్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ఇదొక్కటే కాదు, అమెరికా, కెనడాల్లో ప్రవాసాంధ్రులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా తానున్నానంటూ అండగా ఉన్నారు రత్నాకర్. I take immense pleasure to be associated with the contingent of government school students from Andhra Pradesh who are currently in the USA to participate in the UN SDG Summit tomorrow. The world is about to witness the strength of the Andhra Pradesh education system and its… pic.twitter.com/f500iBwqy8 — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 16, 2023 ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఇది సీఎం వైయస్ జగన్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడని, నాలుగున్నరేళ్ల పాలనలో పేదల జీవితాలు మార్చేలా అద్భుతాలు సృష్టించిన ఘనత ఆయనదని రత్నాకర్ కొనియాడారు. ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు. 2024 ఎన్నికల్లో YSRCP ప్రభుత్వం మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని.. సీఎం జగన్ 2.0 ప్రభుత్వం కోసం రాష్ట్రప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 2024 తర్వాత కూడా మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలతో ఏపీని దేశంలోనే నెం 1 రాష్ట్రంగా సీఎం జగన్ నిలబెడతారని రత్నాకర్ పేర్కొన్నారు. మిషన్ 2024 వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు రానున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు సమర్థత, సంక్షేమానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి వేలాది మంది అమెరికాలో ఉన్నారని, వీరందరిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని, సీఎం జగన్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు, తెలుగు మహా సభల ద్వారా ప్రవాసాంధ్రుల మద్ధతుతో YSRCP ఘనవిజయానికి శాయశక్తులా కృషి చేస్తామని రత్నాకర్ తెలిపారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు ! వాటిని చుట్టాలూగా చేసుకోని , అన్నీ వ్యవస్తలను మేనేజ్ చేస్తూ ప్రత్యర్థులను , సొంత వాళ్లను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నిజ స్వరూపము అందరికీ తెలిసేలా చేసిన అన్నీ వ్యవస్థలకు కృతజ్ఞతలు#CorruptBabuNaidu #EndOfTDP pic.twitter.com/gF3HNZcN9b — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 10, 2023 -
సీఎం జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందని పేర్కొన్నారు. శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేని చోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని సీఎం వివరించారు. చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ -
కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం జగన్ పాలన
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం ప్రతి కార్యకర్త గొప్ప అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు జగనే మళ్లీ ఎందుకు సీఎం కావాలనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వం నిరంతరం ప్రజల్లోనే పని చేసేలా రూపొందించిన నాలుగు ప్రధాన కార్యక్రమాలను సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘జగనన్న ఆరోగ్య సురక్ష, ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. జగనే మళ్లీ ఎందుకు రావాలంటే, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్తా ఓ సైనికుడిగా సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచిని వివరించాలని కోరారు. అంతకు ముందు పలువురు ప్రజా ప్రతినిధులు మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను గెలిపించుకునే ఆవశ్యకతపై ప్రసంగించారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే.. జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలి కుల, మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు కూటములు కడుతుంటే.. సీఎం జగన్ ఒంటరిగానే పేదలకు మేలు చేస్తున్నారు. గత ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఇప్పుడు నెలకు రూ.2 వేల కోట్లు. ఇంత మంచి చేస్తున్న జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలని గ్రామాల్లోని అవ్వతాతలకు, అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. – మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ సంక్షేమ రాజ్యానికి ఏపీ ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ రాజ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రతీకగా నిలుస్తోంది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా వాడవాడలా అంబేడ్కర్ భావజాలం విరాజిల్లుతోంది. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక అసమానతలు తొలగించి సామాన్యుల స్థితిగతుల్లో మార్పు తెచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో మనోధైర్యం పెరిగింది. ఏ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు ఇన్ని రాజకీయ పదవులు దక్కాయి? ఇంత గౌరవం వచ్చింది? జగన్ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక సమతుల్యత ప్రజ్వరిల్లుతోంది. అందుకే జగనే మళ్లీ కావాలి.. మళ్లీ అధికారంలోకి రావాలి. – మేరుగు నాగార్జున, రాష్ట్ర మంత్రి ఓటర్లకు జవాబుదారీగా ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటి ముంగిటకు చేర్చారు సీఎం జగన్. దశాబ్దాలుగా గిరిజన ప్రజలు ఎరుగని సామాజిక చైతన్యం ఇప్పుడు ప్రజ్వరిల్లుతోంది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వం ఓటు వేసిన ప్రజలకు జవాబుదారీగా పని చేస్తోంది. అందుకే రాష్ట్రంలోమళ్లీ సీఎంగా జగన్ ఉండాలి.. పేదలకు మరింత మేలు జరగాలి. – కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే జగన్‌తోనే సామాజిక న్యాయం స్వాతంత్య్రం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అందరూ పేదల గురించే, సామాజిక న్యాయం గురించే మాట్లాడేవారు. కానీ తొలిసారిగా సామాజిక న్యాయం నినాదం కాదని, అది అమలు చేయాల్సిన విధానమని నిరూపించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ పేదవాడి గుండె చప్పుడుగా నిలబడితే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్ధంలో పేదలు గెలవాలంటే, వారి జీవితాలు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ జగనే సీఎం కావాలి. – మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ సీఎం జగన్ అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. వైనాట్ 175 ధీమా వెనకాల నాలుగున్నరేళ్ల ప్రభుత్వ సంక్షేమం ఉంది. నిస్వార్థంగా పేదల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. అందుకే త్వరలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తున్నాం. ఇది సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగే మంచిని వివరించే యాత్ర. దాదాపు 175 నియోజకవర్గాల్లో మీటింగులు పెడతాం. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఉంటారు. ప్రతిరోజూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగులు ఉంటాయి. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడికి, పెత్తందారుకీ మధ్య జరిగే యుద్ధంలో గెలవడానికి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు సన్నద్ధం కావాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పేదల సంతోషం కోసమే జగన్ పేదలు సంతోషంగా బతకాలంటే సీఎంగా జగన్ ఉండాలి. పేద గడప నుంచి వచ్చిన మన పిల్లలను అంతర్జాతీయ మెట్లు ఎక్కిస్తున్నారు. అనారోగ్యం వస్తే ఇంటికే డాక్టర్ వస్తున్నారు. రైతన్నకు తోడుగా భరోసా ఇస్తున్నారు. వలంటీర్ల సైన్యంతో కరోనాను ఎదిరించడమే కాదు.. ప్రజా సంక్షేమాన్ని గడపగడపకు చేరుస్తున్నారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన జగన్ ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రజలకు గత మాఫియా పాలనను, ప్రస్తుత సంక్షేమ సారథ్యాన్ని వివరించాలి. – విడదల రజిని, రాష్ట్ర మంత్రి ధనిక, పేదల మధ్య అంతరంపై పోరు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలంటే 2024లోనూ మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకోవాలి. ధనిక, పేద అనే తారతమ్యాలను తొలగించే లక్ష్యంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. అందుకే ప్రతి రంగంలోనూ ఏపీ సత్తా చాటుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తే.. సీఎం జగన్ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, డిజిటల్ లెర్నింగ్ విధానాలను ప్రోత్సహిస్తున్నారు. 3257 ప్రొసీజర్లలో ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య ఆసరా, ఇంటి వద్దకే వైద్యం దక్కుతోంది. ఇవన్నీ ఉండాలంటే మళ్లీ సీఎంగా జగన్ రావాల్సిందే. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి బాబును నమ్మి బాగుపడింది లేదు చంద్రబాబు పెత్తందారులతో కలిసి పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తే.. అదే పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సౌకర్యాలు అందిస్తున్న మనసున్న వ్యక్తి జగన్. దేశంలో చంద్రబాబును నమ్మి బాగుపడిన వాళ్లు లేరు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆనందపడని వాళ్లూ ఉండరు. రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తే.. దానిని సీఎం జగన్ సమర్థవంతంగా గాడిన పెట్టారు. స్కాముల్లో తన స్కిల్ చూపించి రూ.కోట్లు కొట్టేసిన ఘనుడు చంద్రబాబు. స్కిల్ కేసులో తండ్రి అడ్డంగా దొరికిపోయి జైలులో ఉంటే.. కొడుకు లోకేశ్ ఢిల్లీ పారిపోయి తలదాచుకుంటున్నాడు. ఇలాంటి దుష్టశక్తులు ఏం చెప్పినా మన జీవితాలతో మళ్లీ ఆటలు ఆడుకోవడానికేనని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. – నందిగం సురేష్, బాపట్ల ఎంపీ వై ఏపీ నీడ్స్ జగన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం పేదలు గుడిసెల్లోనే ఉండాలని, కాలనీల్లో ఉండకూడదనుకునే మనస్తత్వం చంద్రబాబుది. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అవమానించారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కించపరిచిన కుసంస్కారం చంద్రబాబుది. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేనిఫెస్టో కూడా కనపడకుండా చేశారు. కానీ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను నెరవేర్చి పేదల గుండెల్లో నిలిచిపోయారు. ఏకంగా చట్టం తెచ్చి నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని అందరమూ ప్రజల్లోకి తీసుకెళ్దాం.– పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను చైతన్య పరచాలి దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనంతగా ఏపీలో సంక్షేమ ఫలాలు నిజమైన పేదలకు దక్కుతున్నాయి. గ్రాఫిక్స్ బొమ్మల మాయలేదు. పథకం పేరుతో దోపీడీ లేదు. స్కాంలు లేవు. అందువల్లే రాష్ట్ర పేద ప్రజలందరికీ నేరుగా రూ.2.60 లక్షల కోట్లు లబ్ధి జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలహీనులైన పేదలను బలవంతులుగా మార్చిన నాయకత్వం ఇది. మహానేత వైఎస్సార్ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఇస్తే.. జగన్ ముస్లిం పిల్లలను కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే జగన్ ఏపీకి కావాలి. చంద్రబాబు అధికారం కోసం చెప్పే అబద్ధాలు నమ్మొద్దని ప్రజలను చైతన్యపరచాలి. – హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే సంక్షేమ పథకాల విప్లవం సీఎం జగన్ అంటేనే ఒక సంకల్పం. పేదరికాన్ని రూపుమాపడమే ఆయన లక్ష్యం. అందుకే సంక్షేమ పథకాల విప్లవాన్ని సృష్టించారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల్లోని పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పౌర సేవలను డోర్ డెలివరీ చేయడంతో పాటు మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను ప్రకటించారు. ఇది గతంలో ఏ పాలకుడికీ సాధ్యం కాలేదు. గత పాలకులకు భిన్నంగా చెప్పిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మళ్లీ జగనే రావాలి.. పేదలకు మరింత న్యాయం జరగాలి. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి -
మన పొత్తు ప్రజలతోనే: సీఎం జగన్
ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానే. ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నాయే. ఒకరైతే పార్టీ స్థాపించి 15 ఏళ్లవుతున్నా ఇవ్వాళ్టికీ ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్త లేడు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజానికెత్తుకుని మోయడమే. చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడంలో ఆయన పార్ట్నర్. వారిద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం వారికి లేదు. – వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల సంగ్రామంలో తమ పొత్తు ప్రజలతోనేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. పొత్తుల కోసం ప్రతిపక్షాలు వెంపర్లాడుతున్నాయని.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానేనంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వ్యంగ్యోక్తులు విసిరారు. ‘మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. దేవుడ్ని.. ఆ తర్వాత ప్రజలనే నమ్ముకుంటాడు. మన పొత్తు నేరుగా ప్రజలతోనే’ అని పేర్కొన్నారు. దేవుడి దయతో ప్రజలకు మనం చేసిన మంచే మన బలమని.. మన ధైర్యం.. మన ఆత్మవిశ్వాసమని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికీ వెళ్లిన పార్టీ మనదే.. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన 99 శాతం వాగ్ధానాలను అమలు చేసిన ప్రభుత్వం మనది. సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనది. ఇదే మన ధైర్యం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం మనది. ఇలాంటివన్నీ సాధ్యపడతాయని ఎవరైనా కలలోనైనా అనుకున్నారా? ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా, అర్హతే ప్రామాణికంగా మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆర్థిక సహాయం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విప్లవాత్మక చర్యలు మన సొంతం. నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకం అమలూ ఒక విప్లవమే. ఎన్నికల మేనిఫెస్టోను వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఇదిగో వీటిని అమలు చేశామంటూ ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకున్న పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ సీపీనే. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు ఎమ్మెల్యేల్లో కొంతమందికి కష్టం అనిపించినా ఇప్పుడు వారిలో చిరునవ్వులు చూస్తున్నాం. బాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే! చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఒకటే. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటే.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలే. అదే మన పార్టీని చూసినప్పుడు, జగన్‌ను చూసినప్పుడు సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం, స్కూళ్లు, వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్షలేని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. ఫోన్ తీసుకుని అక్క చెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్థితి గుర్తుకు వస్తుంది. దిశ యాప్ æద్వారా వారికి లభించే భరోసా గుర్తుకు వస్తుంది. 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు ఊపినా.. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా పోలీసులు వెంటనే వారి వద్ద ఉంటారు. రాష్ట్రంలో మంచి పోలీసన్న రూపంలో జగనన్న ఆ మహిళలకు గుర్తుకొస్తారు. ఎస్‌వోఎస్ కాల్ ఫీచర్ ద్వారా ఇప్పటికే 30,336 మంది అక్కచెల్లెమ్మలు సహాయం పొందారు. రాజకీయమంటే.. చంద్రబాబు, ఆయన పార్ట్నర్కు రాజకీయం, విశ్వసనీయత అంటే తెలియదు. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలనే ఆలోచన వారికి లేదు. వారికి తెలిసిన రాజకీయమంతా అధికారంలోకి రావడం.. దోచుకోవడం.. పంచుకోవడం.. తినడమే. రాజకీయం అంటే ఇది కాదు. చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెలో బతికి ఉండటం.. ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండటం అన్నది మనకు తెలిసిన రాజకీయం. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు. నేరుగా ప్రజలతోనే మన పొత్తు. అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోండి. కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ప్రజలను అడగడానికి ధైర్యం చేయని విషయాలను మీ బిడ్డ అడగగలుగుతున్నాడు. కష్టమైనా మాట తప్పలేదు.. మన ప్రభుత్వం చేసిన మంచి పనులే మన బలం. కోవిడ్ సమయంలోనూ, ఆదాయాలు తగ్గిన సమయంలో కూడా రాబడి తగ్గినా ఇచ్చి న మాటకు కట్టుబడి కష్టమైనా సరే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేశాం. ఇదే మన బలం. మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయత అనే పదానికి నిజమైన అర్థం చెప్పడం మన బలం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు అండగా నిలవడం మన బలం. అవ్వాతాతల గురించి ఆలోచించి సమయానికి వారికి మంచి చేయడం మన బలం. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలలో మనం తెచ్చి న మార్పులు మన బలం. అధికార వికేంద్రీకరణ, పారదర్శకత వ్యవస్థ, లంచాల్లేని వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకురావడం మన బలం. ఇన్ని బలాలతో మనం ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాం. ఏ గ్రామాన్ని చూసినా, ఏ నియోజకవర్గాన్ని చూసినా ప్రతి ఇంటికీ మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకొచ్చి న మార్పు కనిపిస్తుంది. అలాంటప్పుడు వైనాట్ 175? అని అడుగుతున్నా. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం (ఫొటోలు)
-
ప్రతిభకు సర్కారు పట్టం
సాక్షి అమరావతి : రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న, కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్తె శివలింగమ్మ, టీచర్ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్ కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్ కుమార్తె చంద్రలేఖ.. వీరి కుటుంబాలకు పని ఉంటేనే రోజు గడిచేది.. లేకపోతే పస్తులే. ఇలాంటి వారి గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? అని అనిపించడం సహజం. పైగా.. ఈ కోవకు చెందినవారు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు.. పత్రికలో రాసేటంతగా విషయం ఏముంటుంది అని కూడా అనుకోవచ్చు.. కానీ, చదువులో రాణించి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే వీరు సాధించిన గొప్ప విజయం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన 150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష నిర్వహించగా మొత్తం 30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి పై 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఇప్పుడు వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు ప్రభుత్వ ఖర్చుతో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలపైన, పాఠశాలల అభివృద్ధిపైన మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ పర్యటనలో వీరు అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం సందర్శిస్తారన్నారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లుచేసినట్లు వారు వివరించారు. ఇక ఈ విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. గిరిజన బాలికకు అద్భుత అవకాశం.. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన సామల మనశ్విని తల్లి కృష్ణవేణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన మనశ్విని అమెరికా వెళ్లనున్న పది మంది విద్యార్థుల్లో ఒక్కరిగా నిలిచింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభలో తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. రైతు బిడ్డకు గొప్ప వరం కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మ ల నాలుగో సంతానం శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతి 541 మార్కులతో పాసైంది. బాలిక తండ్రి సోమనాథ్ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శివలింగమ్మ అమెరికా వరకు వెళ్లే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సోమనాథ్ ఎక్కడలేని ఆనందం వ్యక్తంచేశారు. ఐరాస సదస్సుకు రైతుబిడ్డ.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన వంజవాకం నాగరాజు, విజయ దంపతుల రెండో కుమారుడు యోగీశ్వర్. తండ్రి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే రైతు. ఇద్దరి సంతానంలో పాప విద్యశ్రీ ఇంటర్ చదువుతుండగా, కుమారుడు యోగీశ్వర్ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానం సాధించాడు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తమబిడ్డల చదువుకు ఎంతో సహకరించాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేక.. చంద్ర లేఖ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతుకూరి రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె చంద్రలేఖ. రాష్ట్ర విభజనతో కుటంబంతో భద్రాచలం నుంచి ఎటపాకకు వచ్చిన రామారావు చంద్రలేఖను స్థానిక కేజీబీవీలో చదివించారు. ఇటీవల పదో తరగతిలో 523 మార్కులు సాధించి కేజీబీవీ జిల్లా టాపర్‌గా నిలిచి ప్రభుత్వం అందించిన జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ఈ విజయమే ఆమెను ఐక్యరాజ్య సమితికి వెళ్లేలా బాటవేసింది. తల్లి కష్టంతో తల్లడిల్లి.. పూట గడవడం కూడా కష్టమైన ఇంట్లో పుట్టిన షేక్ అమ్మాజాన్ ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. రైతుకూలీ అయిన తల్లి కష్టంచూసి చదువుల్లో రాణించాలనుకుంది. ఐదో తరగతిలోనే వైఎస్సా ర్జిల్లా వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు తెచ్చుకుంది. ఇటీవల టెన్త్‌లో 581 మార్కు లు సాధించి రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యా లు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఐరాస గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరింది. ప్రతిభ చాటిన సెక్యూరిటీ గార్డు బిడ్డ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య గృహిణి. వీరి రెండో కుమార్తె జ్యోత్స్న టెన్త్‌లో 589 మార్కులు సాధించింది. దీంతో పాటు జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతూ అమెరికా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కౌలురైతు కొడుకు ఘనత.. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన జి.గణేష్ అంజనసాయి ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెం గురుకుల పాఠ శాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. తండ్రి గోపి కౌలురైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. కుటుంబానికి చదువు భారం కాకూడదని గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు. 590 మార్కులతో అదరహో.. తండ్రి కూలీ, తల్లి గృహిణి. తండ్రికి పని దొరికితేనే పూటగడిచే పరిస్థితి. తన భవిష్యత్‌ను చదువుల ద్వారా తీర్చిదిద్దుకుని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బలంగా అనుకుంది పసుపులేటి గాయత్రి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివి ఏకంగా 590 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. అమెరికా బృందానికి ఎంపికైంది. మెరిసిన మెకానిక్ కుమార్తె.. విజయనగరం శివారు జమ్మునారాయణపురంలో నివాసముండే అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డి రెండో కుమార్తె రిషితారెడ్డి స్థానిక మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ చదివి 587 మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. ఇప్పుడు అమెరికా వెళ్లే అరుదైన అవకాశం దక్కించుకుంది. నంద్యాల నుంచి అమెరికాకు.. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన విద్యార్థిని సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్, భార్య రామలక్ష్మమ్మ ఇంటివద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో టెన్త్ చదివి 583 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ఐరాసకు వెళ్లే అరుదైన అవకాశం కైవసం చేసుకుంది. -
రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం
-
ఏఐసీసీ కొత్త విధానం... ఇంటర్వ్యూ తర్వాతే ఎంపిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికకు కొత్త పద్ధతి రానుంది. ఇంటర్వ్యూల ద్వారా వీరిని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీ ప్రతిపాదించిన అధికార ప్రతినిధులకు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో లాగా టీపీసీసీ ప్రతిపాదించిన అందరినీ అధికార ప్రతినిధులుగా నియమించే అవకాశం లేదని, ఇంటర్వ్యూల అనంతరం ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, ఏడుగురు అధికార ప్రతినిధుల పేర్లను ఏఐసీసీనే అధికారికంగా ప్రకటిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం నుంచి అధికార ప్రతినిధుల జాబితాను ఏఐసీసీకి పంపగా, త్వరలోనే తాము వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని ఏఐసీసీ నుంచి సమాచారం వచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 14న మంచిర్యాలకు వచ్చి వెళ్లిన తర్వాత ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. అధికార ప్రతినిధులతో పాటు ముగ్గురి నుంచి ఐదుగురు ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించనున్నారు. అప్పుడే సూర్యాపేట, రంగారెడ్డి, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ, ఆసిఫాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కోఆప్షన్ శాతాన్ని 25కు పెంచడంతో ఏఐసీసీ సభ్యులుగా ఈసారి రాష్ట్రం నుంచి ఐదుగురికి అదనంగా అవకాశం లభించనుంది. చదవండి: అడ్డగోలుగా కేసీ అండ్ సీఎస్‌కు నిర్మాణ అనుమతులు -
CM Jagan: ఇది మన ప్రభుత్వం.. గుర్తుపెట్టుకోండి
సాక్షి, గుంటూరు: ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని.. అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ముస్లిం సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని తెలిపారాయన. సోమవారం తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ‘‘ఇది మనందరి ప్రభుత్వం అనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే.. దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో తమ సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు వాళ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను తెలియజేశారు. ఈ అంశాలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్ అధికారులను అదేశించారు. అలాగే.. విజయవాడలోనూ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో.. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని నిర్ణయించారాయన. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటు ఉండాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు సైతం సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే.. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా.. ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలియజేశారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. -
ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో ముగిసిన సీఎం భేటీ
-
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన నాటా ప్రతినిధులు
-
ఢిల్లీ: సీఈసీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
-
సీఎం జగన్ ను కలిసిన పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
-
ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్‌కు మరో అవకాశం
సాక్షి, అమరావతి: అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడో సారి పదవీ కాలాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మూడో సారి ఈ బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల, తన పట్ల నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పండుగాయల రత్నాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని, సీఎం జగన్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని రత్నాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చేపడుతున్న వివిధ పనులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ఎన్నారైల సభలు, సమావేశాలతో పాటు వివిధ వేదికల ద్వారా ఏపీ ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దీని వల్ల ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నారైల భాగస్వామ్యం పెంచామని రత్నాకర్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వేర్వేరు పాఠశాలల్లో ఎంతో మంది ప్రవాసాంధ్రులు తమ వంతుగా విరాళాలందించే దిశగా కృషి చేస్తున్నామని, అలాగే ఆస్పత్రుల అభివృద్ధి కోసం నిధులిచ్చేలా ప్రోత్సహించామని తెలిపారు. కరోనా విపత్కాలంలో వెంటిలేటర్లతో పాటు బెడ్స్‌ను ఏర్పాటు చేయడంలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేశామన్నారు. దీంతో పాటు పుట్టిన నేల రుణం తీర్చుకునేలా ఎన్నారైలను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ‘‘విద్యా మూలం ఇదం జగత్" అన్న నానుడిని మనసావాచ నమ్ముతున్న ముఖ్యమంత్రి.. విద్యయే ప్రభుత్వానికి ప్రధాన అంశంగా భావిస్తూ అడుగులు వేస్తున్నారని రత్నాకర్ తెలిపారు. భారత దేశ చరిత్రలోనే విద్యా వ్యవస్థ పై ఇంతలా దృష్టి సారించిన నాయకుడు మరెవ్వరూ లేరని, ఏ రాష్ట్రంలోనూ విద్య కోసం ఇన్ని పథకాలు, ఇంత ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. అన్ని సమస్యలకు చదువే సమాధానం అని సీఎం నమ్మడం ఆయనలోని ఓ కొత్తతరం నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యావ్యవస్థ బాగుచేయడంతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు రత్నాకర్. పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, 8 మేజర్ పోర్టుల నిర్మాణం, వ్యవసాయ-ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, తదితర ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వచ్చే రెండేళ్లలో గొప్పగా అభివృద్ధి చెందబోతోందని, ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని పేర్కొన్నారు. -
విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అద్భుతం
సాక్షి, అమరావతి: ఏపీలో అమలుచేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని గోవా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతినిధులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఈ కార్యక్రమాలు నిలుస్తున్నాయన్నారు. గోవా స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు, గురువారం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ను సందర్శించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విధానాలను పరిశీలించారు. మల్టీ డిసిప్లినరీ, ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఇంటర్న్‌షిప్, న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్, ఎన్బీఏ ర్యాంకింగ్స్‌లో ఏపీ చేపడుతున్న చర్యల గురించి మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రతినిధి బృందానికి వివరించారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువు తర్వాత ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్, ఆపై పరిశోధనతో నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఏపీ ఎలా ప్రవేశపెట్టిందో తెలిపారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలు ఇంటర్న్‌షిప్‌ల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం కోసం ’ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ పోర్టల్’ను ఏర్పాటుచేశామన్నారు. ఎల్ఎంఎస్ పోర్టల్ ద్వారా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ మొదలైన బహుళజాతి కార్పొరేట్ సంస్థలు, నాస్కామ్ సహకారంతో 1.75 లక్షల మందికి ఆన్లైన్ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నట్లు హేమచంద్రారెడ్డి వివరించారు. ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాల నిర్వహణ గురించి కూడా ఆయన వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా అభినందనలు ఇక పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అయిన జగనన్న విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని గోవా బృందం అభినందించింది. రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 86 శాతం మంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరుతుండడం అద్భుతమని.. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాల్లేవని కొనియాడింది. నూతన విద్యా విధానం–2020ని అమలుచేయడంలో ఏపీ కృషిని బృందం ప్రశంసించింది. అలాగే, రూ.32.కోట్లతో ప్రత్యేక పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రశంసించింది. మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ కె. రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొ. సుధీర్ ప్రేమ్‌కుమార్ కూడా బృందంతో సంభాషించారు. గోవా బృందంలో టీచింగ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ నియాన్ మార్చోన్, హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ (అకడమిక్స్) ప్రొ. ఎఫ్ఎం నదాఫ్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వందనా నాయక్, ఉన్నత విద్యా డైరెక్టరేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సందేశ్ గాంకర్, సిద్ధి భండాంకర్, మెలాన్సీ మస్కరెన్హాస్, నెట్వర్క్ సిస్టమ్ ఇన్చార్జి డారిల్ పెరీరా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్ -
ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రథమ మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్(58) బాధ్యతలు చేపట్టారు. సంబంధిత అధికార పత్రాలను మంగళవారం ఆమె ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అందజేశారు. 1987 ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్, గతంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2002–2005 సంవత్సరాల్లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో రుచితా జూన్‌లో నియమితులయ్యారు. -
చైనాకు చెక్ పెట్టేలా... భారత్‌కి అమెరికా అండ
US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్‌కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్‌కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్‌కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను యూఎస్ ప్రతినిధులు సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్‌బ్లాక్ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్‌కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి యూఎస్ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది. దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్‌కి అసాథ్యం అని యూఎస్ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్‌కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్‌కి కాస్త ఊరట లభించింది. There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7 — Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022 (చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం) -
మాట ఇచ్చాం.. హామీలు నెరవేర్చాం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ఈ సందర్భంగా వారు ప్రజలకు చెప్పారు. -
తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
తైపీ: తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అయిదుగురు అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. -
సీఎం జగన్‌ను కలిసిన యునైటెడ్ టెలిలింక్స్, నియోలింక్ కంపెనీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో యునైటెడ్ టెలిలింక్స్ నియోలింక్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రూ.2150 కోట్ల పెట్టుబడితో 6వేల మందికి పైగా ప్రత్యక్షంగా 15 నుంచి 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యూటీఎన్పీఎల్ ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్, నియోలింక్‌తో కలిసి తిరుపతి, వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్ఆర్ ఈఎంసీలో ఫ్యాక్టరీల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు కంపెనీల ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో యూటీఎల్ ఛైర్మన్, డైరెక్టర్ సుధీర్ హసీజ, నియోలింక్ గ్రూప్ ఛైర్మన్ రువెస్ షెబెల్, గోల్డెన్ గ్లోబ్ ఎండీ రవికుమార్, వైఎస్సార్ ఈఎంసీ సీఈవో నందకిశోర్‌రెడ్డి ఉన్నారు. -
సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశాలున్నట్లు తాము భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రస్తుత సంక్షోభం నేర్పిన పాఠాలతో పరిశ్రమలు, ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూరోపియన్ బిజినెస్ గ్రూప్ (ఈబీజీ) ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పలు దేశాల రాయబారులతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒకే దేశం లేదా ఒకే ప్రాంతంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టే అంశంపై కంపెనీలు పునరాలోచనలో పడ్డాయని, ఈ నేపథ్యంలో భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ఆ దేశాల రాయబారులను ఆయన కోరారు. ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టెక్స్టైల్ వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నందున పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రపంచ ప్రమాణాలు.. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈఓడీబీలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్–20 జాబితాలో ఉండే అవకాశం ఉందని, విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను రాష్ట్రాల కోణాల్లో చూడాల్సి ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఐదేళ్లలో 13వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు ఉన్న అనుకూల అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రపంచ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని, గత ఐదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మీ వాళ్లకు ఇక్కడ భయం లేదు
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పెద్దన్న అమెరికాను కూడా గడగడలాడిస్తుంది. రోజు రోజుకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా సోకి మరణించిన వారి సంఖ్యలో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికాలో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి రత్నకర్ ఆర్ పాండుగయాలా ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో ఏప్రియల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుంది. అదే విధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 2.5 లక్షల వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటిని సోదా చేస్తూ ఏ కొంచెం కరోనా లక్షణాలు ఉన్నా వారికి వెంటనే వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చరిత్రలో చూసి ఉండరు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... ‘నార్త్ అమెరికాలో ఉంటున్న తెలుగువారందరికి మీ కుటుంబం పట్ల మీరు భయపడాల్సిన పని లేదని నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల శ్రద్దతో కరోనా వైరస్వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీరు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండండి. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన మార్గదర్శకాలు పాటించి కరోనా వైరస్ విస్తరించకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించండి. ఎప్పటిప్పుడు చేతులను శానిటైజర్‌తో కడుక్కోండి. మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చూపించుకోండి. సామాజిక దూరాన్నిపాటించి ప్రభుత్వాలకు సహాకరించండి. మనం కలిసికట్టుగా పోరాడితే ఈ కష్టకాలం నుంచి బయటపడవచ్చు’ అని పేర్కొన్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణపై ఉత్తరాంధ్ర సదస్సు
-
బాధ్యతలు స్వీకరించిన రత్నాకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పేర్కొన్నారు. అదేవిధంగా నార్త్ అమెరికాలో ఉన్న ఎన్నారైల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నార్త్ అమెరికాకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం అయిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రత్నాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. -
నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్
-
ఈ పాదయాత్ర సమకాలీన రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది
-
ఈ నిర్మాణాలు అద్భుతం..
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రముఖ బౌద్ధక్షేత్రమైన నాగార్జునకొండను గురువారం పలు దేశాలకు చెందిన బౌద్ధమత ప్రతినిధులు, గురువులు సందర్శించారు. వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, టూరిజం విభాగం జీఎం జోయెల్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రత్యేకా«ధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు బౌద్ధమత సంబంధ దేశాల గురువులు సాగర్ జలాశయతీరంలో 275 ఎకరాలలో నిర్మాణాలు జరుగుతున్న శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని సందర్శించేందుకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న 215 మంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఆరు బస్సులు, ఇతర వాహనాల్లో నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. వీరు హిల్‌కాలనీలో బుద్ధవనంలోని మహాస్థూపం, జాతకకథల పార్కులు, ప్రపంచంలోని వివిధ బౌద్ధ క్షేత్రాల్లో వెలుగు చూసిన స్థూపాల నమూనాలను ఆసక్తితో తిలకించారు. విజయవిహార్‌లో అధికారులు తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాల చరిత్రను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్ నుంచి ప్రత్యేక లాంచీలలో నాగార్జునకొండకు చేరుకున్నారు. అక్కడి మ్యూజియంలోని బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు, సింహళవిహార్, అశ్వమేధ యాగశాలను తిలకించారు. దలైలామా నాటిన బోధివృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆర్కియాలజి విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ సుశాంత్‌కుమార్, మరో అధికారి సత్యనారాయణలు గైడ్‌గా వ్యవహరించారు. కొండను సందర్శించిన బౌద్ధ ప్రతినిధుల బృందంలో తైవాన్‌కు చెందిన బౌద్ధమత గురువు షిషిన్టింగ్తోపాటు తైవాన్‌కు చెందిన 129 మంది, మలేషియాకు చెందిన 27 మంది, హాంగ్‌కాంగ్‌కు చెందిన 43 మంది, అమెరికా కు చెందిన ముగ్గురు, ఇండోనేషియా, థాయిలాండ్, ఇంగ్లండ్, సింగపూర్, చైనాతోపాటు మన దేశానికి చెందిన ఒక్కొక్కరు చొప్పున బౌద్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరి వెంట నాగార్జునకొండ మ్యూ జియం క్యూరేటర్ సాయికృష్ణ, రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు, నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, సాగర్, పెద్దవూర ఎస్ఐలు సీనయ్య, రాజు ఉన్నారు. అద్భుత నిర్మాణాలు.. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని, అంతా పూర్తయితే ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలన్నీ సందర్శించినట్లుగా ఉంటుందని మలేషియాకు చెందిన బౌద్ధ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఇక్కడ తమ దేశానికి చెందిన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని, తైవాన్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే ఒకసారి మతగురువులు వచ్చి స్థల పరిశీలన చేశారని వెల్లడించారు. బుద్ధవనంలో పరిశోధన కేంద్రం శ్రీపర్వతారామంలోని బుద్ధవనంలో పరి శోధన కేంద్రం ఏర్పాటుకు తైవాన్ సంస్థ ముం దుకు వచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సాగర్‌లోని శ్రీపర్వతారామంలో ఆరా మాలు, యూనివర్సిటీ, అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు వివిధ సంస్థలను ఆహ్వానించేందుకు గతేడాది బౌద్ధమతాన్ని ఆచరించే పలు దేశాలకు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్లి వచ్చారు. అక్కడ పలు సంస్థలను కలసి బుద్ధవనం ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ ఏడాది మొదట్లో తైవాన్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులు వచ్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకుస్థల పరిశీలన చేసి వెళ్లారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పుడు మరోమారు సందర్శనకు వ చ్చినట్లు పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు. -
ప్రైమరీల్లో అరుణ మిల్లర్ ఓటమి
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో అడుగు పెట్టాలనుకుంటున్న భారత సంతతి అమెరికన్లకు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆరుగురు భారత సంతతి అభ్యర్థులు ఓడిపోయారు. మేరిల్యాండ్లోని ఆరవ కాంగ్రెషనల్ జిల్లాకు జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్, హైదరాబాద్‌లో పుట్టిన అరుణ మిల్లర్(53), వ్యాపారవేత్త డేవిడ్ ట్రోనే చేతిలో ఓడిపోయారు. న్యూయార్క్ 12వ కాంగ్రెషనల్ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ సూరజ్ పటేల్ ఓటమి చవిచూశారు. మేరిల్యాండ్ 8వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీ ఎన్నికల్లో ఉత్తమ్ పాల్ 3.7 శాతం ఓట్లతో ఘోర ఓటమిని చవిచూశారు. న్యూయార్క్ 11వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో ఇండో అమెరికన్లు ఒమర్ వైద్, రాధాకృష్ణ మోహన్‌లు 3,4 స్థానాల్లో నిలిచారు. కొలరెడోలో మొదటి కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో సైరారావు ఓడిపోయారు. నవంబర్ 6న అమెరికా ప్రతినిధుల సభలోని 435 సీట్లకు, సెనేట్‌లోని 100 స్థానాలకు గానూ 33 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ప్రైమరీ విజేతలే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. జో క్రౌలీ పరాజయం అమెరికా ప్రతినిధుల సభలో భారత్‌కు మద్దతుదారుగా ఉన్న జో క్రౌలీ మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీకి గట్టిపట్టున్న న్యూయార్క్‌లో క్రౌలీని సోషలిస్ట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో ఓడించారు. భారత్–అమెరికా సత్సంబంధాల కోసం క్రౌలీ కృషిచేశారు. -
ఇద్దరు అధికార ప్రతినిధులను తొలగించిన టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బుధవారం ఇద్దరు అధికార ప్రతినిధులను టీపీసీసీ తొలగించింది. వీరిద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. సిరిసిల్లాకు చెందిన అధికార ప్రతినిధి ఉమేష్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా కమిటీ బాధ్యులు మల్లు రవి ఉత్తుర్వులు జారీ చేశారు. అలాగే అధికార ప్రతినిధి, మీడియా కమిటీ కన్వినర్ కొనగాల మహేష్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. పార్టీలో ఉమేష్ రావు, కొనగాల మహేష్‌లపై అనేక ఫిర్యాదులు రావడంతో వారిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. -
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ మంద జగన్నాథంను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మందా జగన్నాథం కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటీకే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా వేణుగోపాలచారి, తేజావత్, రామచంద్రులు ఉండగా తాజాగా మందాను నియామించడంతో ప్రభుత్వ ప్రతినిధు సంఖ్య నాలుగుకు పెరిగింది. -
చేపల పెంపకం బాగుంది
కూసుమంచి: పాలేరులోని పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రాన్ని ఆదివారం ఆఫ్రికన్ దేశాలకు చెందిన 15 మంది ప్రతినిధులు సందర్శించి..ఇక్కడి చేపల పెంపకం తీరు బాగుందని కొనియాడారు. ఇండో–ఆఫ్రికన్ సమ్మిట్–3 లో భాగంగా వారు కేంద్రప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆçఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చ ర్ సంయుక్త ఆద్వర్యంలో వారు పర్యటకు వచ్చారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఇట్టి బృందానికి శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ నాయకత్వం వహించారు. ప్రధాన శాస్త్రవేత్త విద్యాసాగర్‌రెడ్డి, సిబ్బంది ఘన స్వాగతం పలికి..చేపల పెంపకం, యాజమాన్య పద్ధతులు, పరిశోధనలు తదితర అంశాలను ప్రధానశాస్త్రవేత్తలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పరిశోధన కేంద్రంలోని చేపలు పెంచే ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్‌ను సందర్శించగా..వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పద్ధతిలో చేపల పెంపకంపై ప్రతినిధులు ఆసక్తిని కనబరిచారు. ఇక్కడ చేపల పెంపకం చాలా బాగుందని కితాబిచ్చారు. పరిశోధనా కేంద్రంలో మొక్కలను నాటారు. అనంతరం ఇక్కడే భోజనాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ సాంకేతికత ఇచ్చిపుచ్చుకునేందుకే... ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ మాట్లాడుతూ.. గత నెల 15 నుంచి ఈ బృందం తెలంగాణాలో పర్యటిస్తుందని అన్నారు. ఇండో–ఆఫ్రికన్ దేశాలు వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. దీనిలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై అధ్యయనం చేసేందుకు ఆఫ్రికన్ ప్రతినిధుల బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. నైజీరియా నుంచి 10 మంది, ఇథియోఫియా నుంచి నలుగురు, మలానీ నుంచి ఒక్కరి చొప్పున ఈ బృందంలో ఉన్నారని వివరించారు. ఉన్నారని అన్నారు. ఈబృందం ఈనెల 7వరకు వివిధ పరిశోదన కేంద్రాలను సందర్శిస్తారని అన్నారు. -
విదేశీ ప్రతినిధులకు సంప్రదాయ స్వాగతం
శంషాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. సోమవారం వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఉద్యోగులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. మన సంప్రదాయ స్వాగతం విదేశీ ప్రతినిధులకు ఆకట్టుకుంది. కొందరు విదేశీ ప్రతినిధులకు నగరంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేయగా.. మరికొందరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలోని నోవాటెల్ హోటల్లో వసతి కల్పించారు. హోటల్ వరకు వీరిని తీసుకెళ్లడానికి ఆర్టీసీ ప్రత్యేకంగా 50 ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. గతంలో ఆర్డర్ ఇచ్చిన 21 కొత్త బస్సులు ఈ సదస్సు సమయానికి వచ్చేలా ప్లాన్ చేసిన అధికారులు వాటితోపాటు మరో 49 వినియోగంలో ఉన్న గరుడ ప్లస్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం విమానాశ్రయం వద్ద వీటిని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ చేరుకున్న 150 దేశాల ప్రతినిధులు
-
నిషిత్ మృతిపై ‘బెంజ్’ రిపోర్ట్‌లో ఏముంటుంది?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు అరవింద్ ఘోర బెంజ్ కారు ప్రమాదానికి గురై చనిపోవడంపట్ల జర్మనీ బెంజ్ ప్రతినిధులు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు ప్రమాదం జరిగిన చోటును పరిశీలించినవారు జూబ్లీహిల్స్ పోలీసులకు తమ రిపోర్ట్‌ను అందజేయనున్నారు. గత వారం నిషిత్ అతడి స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లో వేగంగా వెళుతూ నేరుగా మెట్రోపిల్లర్ 36కు ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, అత్యాధునిక సౌకర్యాలున్న ఆ విలువైన కారులో ప్రయాణించిన వారు చనిపోవడానికి గల సరైన కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి? నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి? మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా..? స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి? ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి? సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా అందులో కోరారు. దీంతో ఈ విషయంపై ఆరా తీసి పోలీసులకు వివరణ ఇచ్చేందుకు జర్మనీ నుంచి వచ్చిన నలుగురు ప్రతినిధులు ప్రమాద స్థలిని పరిశీలించడంతోపాటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అలాగే ప్రస్తుతం బోయినపల్లిలోని బెంజ్ షోరూంలో ఉన్న కారును పరిశీలించి అసలు డ్రైవింగ్ చేసినప్పుడు వారు సీటు బెల్టు పెట్టుకున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కారు వేగం, సీటు బెల్టు, బెలూన్లు, ఆ సమయంలో ఇంజిన్ పరిస్థితివంటి అంశాలపై ప్రధానంగా బెంజ్ ప్రతినిధులు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నిషిత్ మృతిపై ‘బెంజ్’ రిపోర్ట్‌లో ఏముంటుంది?
-
విద్యుత్ ఉద్యోగులకు అండగా ఉంటాం
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు బుధవారం కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును కలిశారు. ఈ నెల 14వ తేదీన రాజమహేంద్రవంలో జరగనున్న సంఘ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి హాజరుకావాల్సిందిగా కన్నబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పార్టీ తరుపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల డైరీని కన్నబాబుకు అందజేశారు. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్కాంతరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పి.సత్తిబాబు మాట్లాడుతూ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ ప్రతినిధులు వి.కాంతారావు, సాకా సుబ్రహ్మణ్యం, సాకా శ్రీనివాసశేఖర్ తదితరులు ఉన్నారు. -
కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు
-పలు ప్రాంతాల్లో పర్యటన -కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పరిశీలన అంబాజీపేట (పి.గన్నవరం) :కోనసీమలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల అ«ధ్యయనానికి ఇంటర్నేషన్ బిజినెస్ మెషీన్(ఐబీఎం)కు చెందిన ముగ్గురు ప్రతినిధులు శనివారం కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా అమెరికాకు చెందిన మెర్రీలాన్, డెన్మార్క్‌కు చెందిన క్రిస్టిన్, ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్రీల బృందానికి ఇక్రిశాట్ మేనేజర్ జి.పార్థసారథి నాయకత్వం వహించారు. అంబాజీపేటలో విలేకరులతో సమావేశమయ్యారు. అయినవిల్లిలో కొబ్బరికాయల దింపు, వలుపు, కాయలను ముక్క పెట్టడం, ప్యాక్ హౌస్‌లలో నిల్వ చేయడాన్ని పరిశీలించారు. అయినవిల్లిలంకలో కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించి తాడు తయారీ, మార్కెటింగ్, కొబ్బరి తోటలలో అంతర పంటల సాగును పరిశీలించారు. అయినవిల్లికి చెందిన విళ్ళ దొరబాబు నిర్వహిస్తున్న ఎకో టూరిజంను సందర్శించి ఉద్యాన శాఖ విద్యార్థులకు ఏవిధంగా శిక్షణ ఇస్తున్నారో పరిశీలించారు. అమలాపురం రూరల్ మండలం చిందాడ గరువులో కొబ్బరి చెట్ల నుంచి కల్పరస తీసే విధానం, వర్మీ కంపోస్టు నిర్వహణ, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణల గురించి నిర్వాహకుడు అడ్డాల గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎంట్రికోనలో కొబ్బరి కలెక్షన్ గ్రేడింగ్ సెంటర్‌ను సందర్శించారు. బండారులంకలో సమయమంతుల పండుకు పొలంలో కోప్రా డ్రైయర్, అరటి పళ్ళను సహజంగా ముగ్గపెట్టే పద్ధతిని పరిశీలించారు. అంబాజీపేటలోని కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులుతో సమావేశమై కొబ్బరి కాయలు వలిచే యంత్రాన్ని, గణపతి బాబులుకు చెందిన మిల్లులో కొబ్బరి నూనె తీసే విధానాన్ని పరిశీలించారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు నిర్మిస్తున్న ప్యాక్ హౌస్‌ను సందర్శించి ఆయన సాగు చేస్తున్న 24 రకాల మొక్కలను పరిశీలించారు. గత పది రోజులుగా ఈ బృందం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నారని, ప్రభుత్వానికి నేరుగా నివేదిక సమర్పిస్తారని ఇక్రిశాట్ మేనేజర్ పార్థసారథి తెలిపారు. వీరి వెంట అమలాపురం ఏడీహెచ్ సీహెచ్ శ్రీనివాస్, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీలు, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, దంగేటి గిరిధర్, ఉద్యాన శాఖ ఏఓ వెంకటేశ్వరరావు, ఎంపీఈఓ సీహెచ్ రాజేష్ ఉన్నారు. -
సాదాసీదాగా మున్సిపల్ సమావేశం
77 అంశాల ఎజెండా పాస్ ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మెజార్టీ సభ్యులతో ఎజెండా ఆమోదం పొందింది. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అధ్యక్షత వహించగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారులు ఉన్నారు. సమావేశ ప్రారంభం కాగానే మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ మున్సిపల్ వైస్‌చైర్మెన్ ఫరూక్ అహ్మద్ తల్లి నూర్జహన్బేగం మతికి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావు దేశ్‌పాండే మతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ జహీర్ రంజానీ మాట్లాడుతూ అధికారులు తీరులో మార్పు రావాలన్నారు. అధికారులు కౌన్సిలర్ల ఫోన్లకు స్పందించడం లేదని, కొత్తగా కమిషనర్ , స్టాఫ్ సైతం రావడంతో అభివద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చైర్పర్సన్ మనీష వెంటనే కమిషనర్‌కు 36 వార్డు సభ్యుల ఫోన్‌నంబర్లు ప్రతీ అధికారి వద్ద ఉండాలని, వారి ఫోన్లకు స్పందించాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగుల శైలిలో మార్పు రావాలి... కొందరు అధికారులు శనివారం ఇండ్లలోకి వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం వరకు కూడా రావడం లేదని ఈ విధానం మారని పక్షంలో చర్యలు తప్పవని చైర్పర్సన్ హెచ్చరించారు. అవసరాలున్న సెక్షన్లలో సిబ్బందిని ఎక్కువగా నియమించాలన్నారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ మాట్లాడుతూ టీపీవో సెక్షన్లో పనులు జరగడం లేదని, అందరు కొత్త అధికారులు ఉండటంతో పనులు సక్రమంగా చేయడం లేదని , వెంటవెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు వినాయక చతుర్థిని పురస్కరించుకొని గుంతలు పూడ్చేందుకు మొరం మట్టి ఎజెండా అంశాల్లో చేర్చడం హర్షించదగ్గ విషయమని , త్వరితగతిన మొరం తెప్పించాలని కోరారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అజయ్ మాట్లాడుతూ 37వ అంశంలో పరిశీలించాలని కోరగా మెజార్టీ సభ్యులు పాస్ అనడంతో ఆ అంశం చర్చకు రాలేదు. 24వ అంశంలో ఇంటిపన్ను వసూలు అడ్రస్సులు , కోర్టు కేసులు అంశాలతో కూడి ఉండటంతో వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ మనీశా ప్రకంటించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అజయ్, జ్యోతి, సుష్మలు 37, 68 అంశాలను వ్యతిరేకిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్‌కు డీసెంట్ నోటీసు అందజేశారు. -
పదవులున్నా.. శ్రమజీవులే...
అటు ప్రజాప్రతినిధులుగా.. ఇటు కూలీలుగా సమర్థం గా బాధ్యతలు అధికార పెత్తనానికి పోకుండా సాధారణ జీవితం ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కల్హేర్: ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులైనప్పటికీ కొందరు శ్రమైక జీవనాన్ని సాగిస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూనే మరోవైపు తమ కుటుంబాలకు చేయూత నిస్తున్నారు. ప్రజాప్రతినిధి అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ అటు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమేగాకుండా కుటుంబ పోషణలో తమవంతు సహకారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్హేర్ మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు. మండలంలో 18 పంచాయతీలు, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు తమ కుటుంబ పోషణకు గాను వ్యవసాయ, కూలీ పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పెసర పంటపై దృష్టి పెట్టిన సంతోషమ్మ.. బీబీపేట సర్పంచ్ సంతోషమ్మ ప్రస్తుత ఖరీఫ్‌లో పెసర పంట సాగు చేస్తున్నారు. మరో 15 రోజులు గడిస్తే పంట చేతికొస్తుంది. ఈమెకు గ్రామ శివారులో నల్లవాగు ఆయకట్టు కింద రెండు ఎకరాల పొలం ఉంది. సరైన వర్షాలు లేకపోయినా పెసర సాగు చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఈమె రిజర్వేషన్ కారణంగా బీబీపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. కుటుంబమూ ముఖ్యమేనంటున్న హిరిబాయి రాపర్తి పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లి తండాకు చెందిన హిరిబాయి రాపర్తి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సర్పంచ్‌గా కొనసాగుతూనే కుటుంబ నిర్వహణకు గాను సొంత పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేస్తున్నారు. రాపర్తిలో ఇటీవలే 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం జరిగింది. వీటి ఏర్పాటులో ఈమె ఎంతో చొరవ చూపారు. పదవి ఉందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేమని చెబుతున్నారు హిరిబాయి. సొంత పనులు కూడా చేసుకుంటేనే ప్రతిఫలం దక్కుతుందని చెబుతున్నారు. మాదవ్వ సొంత పొలంలో పనులు... మాదవ్వ పెద్దముబారక్పూర్ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. పెద్దముబారక్పూర్, చిన్న ముబారక్పూర్ గ్రామాలకు ప్రథమ పౌరులు అయినప్పటికీ గ్రామ అభివృద్ధితోపాటు కుటుంబ సంక్షేమంపై దృష్టిపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటకీ ఈమె సొంత వ్యవసాయ పనులు చేస్తుంటారు. పనులు చేసేందుకు కూలీలు దొరకని పరిస్థితిలో సొంత పనులు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. మాదవ్వ హయంలో పంచాయతీ భవనం, మురికి కాల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. వరినాట్ల పనులు.. బాలయ్య బొక్కస్‌గాం సర్పంచ్. ఈయనకు గ్రామ శివారులో రెండు ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది. ఎకరం వరకు పెసర సాగులో ఉంది. మరో ఎకరంలో వరి సాగు పనులు మొదలు పెట్టారు. సొంత పొలంలో పనులు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలీల కొరత కారణంగా సొంత పనులు చేసుకోవడంలో తప్పులేదంటున్నారు సర్పంచ్ బాలయ్య. ప్రజాప్రతినిధి హోదా ఉన్నా సొంత పనులను విస్మరించలేమంటున్నారు. రెండు వైపులా దృష్టి సారించి అటు గ్రామానికి ఇటు కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. కుటుంబానికి సహకరిస్తున్న లచ్చవ్వ పెరుమాండ్ల లచ్చవ్వ కల్హేర్ ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈమె భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిగా బాధ్యతాయుతంగా పనిచేస్తూనే మరోవైపు కుటుంబానికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఈమె వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. భర్త బాలయ్యతో కలిసి సొంత పొలంలో మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేస్తున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఒకేరకంగా ఉండాలని లచ్చవ్వ అభిప్రాయపడుతున్నారు. ఆ ఉద్దేశంతోనే సొంత పనులను కూడా చేపడుతున్నారు. అహం వీడి.. సాధారణ జీవితం... అంతర్గాం ఎంపీటీసీ సభ్యురాలిగా లాలవ్వ పనిచేస్తున్నారు. వృద్ధాప్యంలోనూ ఈమె ఓవైపు ప్రజాప్రతినిధిగా మరోవైపు కుటుంబానికి చేయూతనిస్తున్నారు. వయస్సుమీద పడుతున్నా శరీరం సహకరిస్తున్న మేరకు ఇంటి పనులు చేపడుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిని అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారు. సొంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. అంతర్గాం, పెద్దముబారక్పూర్ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. లాలవ్వ కృషీ మేరకు అంతర్గాంలో పంచాయతీ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఉపాధిహామీ పనుల్లో కీలకం మిరిబాయి రాపర్తి ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలైనప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లిలో భర్త తావుర్యానాయక్తో కలిసి స్వయంగా ఉపాధి పనులు చేస్తూ తోటి కూలీల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కూలీలకు అండగా ఉంటూ పనులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయ పనులు, ఇతర పనులతో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. -
అంత్యంత మాత్రమే
పుష్కర ఏర్పాట్లపై చొరవ చూపని ప్రజాప్రతినిధులు నోరుమెదపని రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే కారణమా? నగరపాలక సంస్థ అధికారులపైనే ఏర్పాట్ల భారం బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన ట్టుగా.. డబ్బులు వచ్చే అవకాశమున్న ఏ కార్యక్రమంలోనైనా రాజకీయ నేతల హడావిడి కనిపిస్తుంటుంది. అదే డబ్బులు రాని కార్యక్రమాలైతే.. ఆ దరిదాపుల్లోనే రాజకీయ నేతలు కనిపించరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గోదావరి అంత్య పుష్కరాలే. గతేడాది గోదావరి పుష్కరాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లంతా తామే నిర్వహిస్తున్నట్టుగా హడావిడి చేశారు. తీరా అంత్య పుష్కరాలవిషయానికొచ్చే సరికి కనీసం వాటి ఊసెత్తే ప్రజాప్రతినిధే కరువయ్యారు. – సాక్షి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. అంత్య పుష్కరాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ యంత్రాంగమే చేస్తోంది. నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు కసరత్తు చేశారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. వరదలతో ఘాట్లపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపకశాఖ తొలగించాల్సిన ఉన్నా, సమయం దగ్గరపడుతుండడంతో నగరపాలక సంస్థ సిబ్బందితో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్లలో సీసీ కెమారాలను పునరుద్ధరిస్తున్నారు. అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు వివిధ సేవలందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి వారు చేయాల్సి పనులపై సూచనలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు గతేడాది నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో నగరంలోని 50 డివిజన్లలో అవసరమైన చోట రోడ్లు వేయడం, దెబ్బతిన్న వాటì కి మరమ్మతులు చేయడం, నగర సుందరీకరణ పేరుతో నగరపాలక సంస్థ పాఠశాలలకు రంగులు వేయడం వంటి అనేక పనులకు నిధులు కే టాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. వీటిలో తమ పరిధిలో చేసే పనులలో కమీషన్లు వస్తాయని కార్పొరేటర్లు, తమకు గంపగుత్తగా ముడుపులు అందుతాయని ఎమ్మెల్యే, ఎంపీలు పుష్కరాలు ప్రారంభానికి నెలల ముందు నుంచి తెగ హడావిడి చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది అంత్యపుష్కరాలనూ ఘనంగా నిర్వహిస్తామని ఆయా ప్రజాప్రతినిధులు శపథం చేశారు. ఇంకా నాలుగురోజులే ఉంది.. ఈ నెల 31 నుంచి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 11 వరకు ఇవి జరగనున్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల మంది వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. ఇక ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయమున్నా ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై ప్రజాప్రతినిధులు ఎక్కడా మాట్లాడలేదు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో కనీసం పరిశీలించేవారే కరువయ్యారు. దీనికి కారణం అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం, రాష్ట్రంలో జరిగే ఏ చిన్న విషయంపైనైనా విలేకర్ల సమావేశాల్లో అదరగొట్టే రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై నోరుమెదపకపోవడం విశేషం. ఇక రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ గతేడాది పుష్కరాలు ముగింపు రోజున ప్రధాన రైల్వే స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని, ఇదే విధంగా అంత్యపుష్కరాలు, గోదావరి ఉత్సవాలు కలిపి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక్కడ అంత్య పుష్కరాల ముగింపు, అక్కడ కృష్ణా పుష్కరాలు ఆరంభం అంటూ గొప్పగా చెప్పారు. తీరా అంత్యపుష్కరాలు సమీపిస్తున్న ఆయన కనీసం స్పందించలేదు. నేతలిచ్చిన హామీలపై నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మిన్నుకుండిపోయారు. కొద్దోగొప్పో నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఘాట్లు పరిశీలిస్తూ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. -
శ్రీమంతులు కాదు.. 'సిరి'మతులే!
‘ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఊరిని అభివృద్ధి చెయ్.. లేదంటే ‘లావై’పోతావ్..’... గ్రామాల దత్తత కథాంశంతో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో కథానాయకుడి డైలాగ్ ఇది. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తామని హామీలు కురిపించారు. పోటీలు పడి మరీ గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటనలు చేశారు. మాటల్లోనే కోట్లు కుమ్మరించారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోకుండా, అసలు పట్టించుకోకుండా ‘లావై’పోతున్నారు. అంతా సిరిమతులే (డబ్బు మనుషులే) అని నిరూపించుకుంటున్నారు. తమ సమస్యలు తీరుతాయన్న ఆశతో ఉన్న ప్రజలకు నిరాశ మిగుల్చుతున్నారు. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరూరూ తిరగాలని, అంతా కలసి ఊరికి ఏం కావాలో గుర్తించి, సమకూర్చాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే మర్చిపోయారు. కొన్ని చోట్ల మాత్రమే పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఈ అంశంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనే ఈ వారం ఫోకస్.. - సాక్షి నెట్వర్క్ ఆర్భాటంగా దత్తత ప్రకటనలు ఆనక మరిచిపోయిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ♦ అన్నీ ఉత్తుత్తి హామీలే.. పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితం ♦ సమస్యలతో సతమతమవుతున్న గ్రామాలు ♦ రెండు మూడు చోట్ల మాత్రం పరిస్థితి కొంత మెరుగు ♦ అటకెక్కిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ ‘మంత్రించని' అభివృద్ధి మంత్రుల దత్తత గ్రామాల్లో అభివృద్ధి, ప్రగతి పనుల తీరు తీసికట్టుగా ఉంది. దత్తత తీసుకున్నట్టు మంత్రులు ఘనంగా ప్రకటనలు చేసినా... తరువాత నిధుల మంజూరు, పర్యవేక్షణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకున్న దాఖలాల్లేవు. ఇతర గ్రామాల తరహాలోనే ఈ దత్తత గ్రామాలు కూడా పలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. పరిష్కరించదగ్గ చిన్న చిన్న సమస్యలూ తిష్టవేశాయి. దాదాపు అన్నిచోట్లా ఒకట్రెండు పనులకు శ్రీకారం చుట్టి వదిలేశారు. వాటి ప్రగతిని మళ్లీ సమీక్షించిన దాఖలాలు లేవు. నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షిత నీరు వంటి సమస్యలతో ఈ గ్రామం ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతోంది. హైస్కూల్‌ను డిజిటలైజేషన్ చేస్తాననే హామీ నెరవేరలేదు. ఈ గ్రామంలో 268 కుటుంబాలకు నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అక్కడక్కడా చెత్తకుండీల ఏర్పాటు ఒక్కటే కొత్తగా కనిపిస్తున్న దృశ్యం. నల్లగొండ జిల్లా కొలనుపాక గ్రామంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్ ⇒ మంత్రుల దత్తత గ్రామాల్లో దుస్థితి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) బేల మండలంలోని బెదోడ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు కంకర తేలి వెక్కిరిస్తున్నాయి. గ్రామంలో విద్యాబోధన కుంటుపడింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామం దేవాదాయ, న్యాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వస్థలం. దీంతోపాటు ఆలూరు, పొన్కల్, మల్లాపూర్, గుండంపల్లి గ్రామాలనూ ఆయన దత్తత తీసుకున్నారు. ఎల్లపెల్లి కాస్త మెరుగ్గా ఉన్నా గృహ నిర్మాణ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వగ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడలేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి (నల్లగొండ జిల్లా) ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు, సూర్యాపేట మండలం పిల్లలమర్రి, చివ్వెంల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపూరు ఇంతైనా రూపు మారలేదు. వర్షం వస్తే ఊరు-మురుగు ఏకం కావాల్సిందే. ప్రత్యేక నిధులు రూ.5 లక్షలతో సీసీరోడ్లు నిర్మిం చారు. రూ.50 లక్షలతో 420 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టగా 80 శాతం పూర్తయ్యాయి. పిల్లలమర్రిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం 50 శాతమే పూర్తయింది. చివ్వెంలలో రోడ్ల నిర్మాణం జరిగినా గూడాలలో తాగునీటి సమస్య నెలకొంది. ముఖ్యంగా బస్సు సౌకర్యం లేక విద్యార్థులు 2 కిలోమీటర్లు నడిచి మండల కేంద్రంలోని పాఠశాలలకు వెళ్తున్నారు. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గిరిజన మంత్రి చందూలాల్ స్వగ్రామం. ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని ఏడాదవుతున్నా మచ్చుకైనా ఏ చిన్న పనీ కాలేదు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్డు సమస్యలది దత్తతకు ముందు నాటి పరిస్థితే. ఆశ్రమ పాఠశాల భవనానికి రూ.95 లక్షలు, బాలికల కళాశాల భవనానికి రూ.3.45 కోట్ల కేటాయింపు ఒకింత ఊరట. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైనా పనులు మొదలుకాలేదు. ఇక మండల కేంద్రం వెంకటాపురం కూడా ఆయన దత్తత గ్రామమే. కుగ్రామం కంటే దారుణంగా ఉన్న పరిస్థితులతో ఇక్కడి పది వేల మంది జనాభా ఇక్కట్లు పడుతున్నారు. ఏడాదిగా మంత్రి రూపాయి కూడా మంజూరు చేయించలేదని గ్రామస్తులు అంటున్నారు. * ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్(కరీంనగర్ జిల్లా) చెల్పూ ర్, సిరిసేడు, వీణవంక, కమలాపూర్ గ్రామాలను దత్తత తీ సుకుంటున్నట్టు ప్రకటించారు. దసరా తరువాత రూపురేఖలే మార్చేస్తానన్నారు. కానీ రెండేళ్లుగా వీసమెత్తు పని జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెల్పూర్ అభివృద్ధికి రూ.20 కోట్ల మేరకు తీర్మానాలు చేసి సరిపెట్టారు. * భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం మాటిండ్ల(మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం )లో అభివృద్ధి పనులకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. రూ.67లక్షలతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. * రంగారెడ్డి జిల్లా ముద్దాయిపేట, కొండాపూర్, నీళ్లపల్లి.. ఈ మూడూ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దత్తత గ్రామాలు. సమస్యల్లో ఇవి ఇతర గ్రామాలతో పోటీపడుతున్నాయి. * సోమేశ్వర్, పోచారం, బీర్కూర్, బీర్కూర్ తండా, రుద్రూర్, కోటగిరి, సోంపూర్.. వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి(నిజామాబాద్ జిల్లా) దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. సోమేశ్వర్‌లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. * మంత్రి లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్ జిల్లా) దత్తత తీసుకున్న జడ్చర్ల మండలం కోడ్గల్‌లో అంతంతగానే అభివృద్ధి కనిపిస్తోంది. సమస్యల్ని ఇంకా గుర్తించే పనిలోనే ఉన్నామని ఆయన చెబుతున్నారు. అధికారుల ‘ఊళ్ల’లో అంతో ఇంతో..! * ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామాన్ని అధ్వానమైన రోడ్లు, మురుగు సమస్య పీడించేవి. జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ దత్తత తీసుకున్నాక గ్రామం రూపురేఖలు కొంత మారాయి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. * మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దత్తత తీసుకున్న నవాబుపేట (హత్నూర మండలం)లో సీసీ రోడ్ల రూపు మారాల్సి ఉంది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయింది. ఇంటింటికీ ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈయనే దత్తత తీసుకున్న రాణాపూర్ (మనూరు మండలం)కు ఏడాదిలోనే రూ.1.25 కోట్లు మంజూరయ్యాయి. ఇక షాదుల్లానగర్ను ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ సుమతి దత్తత తీసుకున్నా అభివృద్ధేమీ చేయలేదు. * ఖమ్మం జిల్లాలో మండల కేంద్రమైన వెంకటాపురాన్ని జెడ్పీ సీఈవో దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా.. ఇప్పటికీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. 2,000 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడితే వంద మాత్రమే పూర్తయ్యాయి. ప్రకటనలు ఆర్భాటం.. పనులు శూన్యం * మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గన్యాగుల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ఊరిలో అడుగుపెట్టలేదు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. వివిధ పనులకు నిధుల కేటాయింపే తప్ప.. పనులు జరుగుతున్న జాడలేదు. గ్రామస్తులు కూడా ఆయా సమస్యల పరిష్కారంపై ఆశ వదులుకున్నారు. * మెదక్ జిల్లాలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకున్న కల్హేర్ మండలం సిర్గాపూర్, ఝరాసంగం మండలం ఈదులపల్లి గ్రామాల్లో మచ్చుకైనా అభివృద్ధి జాడలేదు. దత్తత తీసుకున్న రోజున హడావుడి చేసిన ఎంపీ.. ఆపై మరిచేపోయారని గ్రామస్తులు అంటున్నారు. బీబీ పాటిల్ దత్తత తీసుకున్న మరో గ్రామం నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్దీ అదే పరిస్థితి. గాంధారిలో మాత్రం సీసీ రోడ్లు వేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దత్తత తీసుకున్న పన్యాల, అహ్మద్‌నగర్, కోనాపూర్ గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయి. * ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ వల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక తీర్మానాలు చేసినా.. కార్యాచరణ కొరవడింది. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దత్తత గ్రామంలో హామీలన్నీ నీటి మూటలయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు 20 కట్టిస్తామని ప్రకటించినా.. లబ్ధిదారుల ఎంపికే జరగలేదు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన ఐదు దత్తత గ్రామాలకు అభివృద్ధి రూపేణా పైసా కూడా ఇవ్వలేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన దత్తత గ్రామమైన దంతలబోరులో ఇటీవలే సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు, పైప్‌లైన్ నిర్మాణం వంటి రెండు పనులే జరిగాయి. ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. * నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత గ్రామాలైన కందకుర్తిలో రూ.1.10 కోట్లతో, మాణిక్‌భండార్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే దత్తత గ్రామాలైన వడ్యాట్, చౌట్పల్లి, కొత్తపల్లి, పడగల్, బడాభీమ్గల్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బోధన్ ఎమ్మెల్యే దత్తత గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దత్తత జాబితాలోని ఇందల్వాయి, సిరికొండ, తొర్లికొండ, ధర్పల్లి, మంచిప్ప గ్రామాల్లో... ఎమ్మెల్సీ వీజీగౌడ్ దత్తత గ్రామమైన రాంపూర్‌లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు మాత్రమే తయారయ్యాయి. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్వగ్రామం బస్వాపూర్‌లో పనులు ఫర్వాలేదనిపిస్తున్నా.. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దత్తత గ్రామాలైన మామిడిపల్లి, వెల్మల్, మాక్లూర్లకు ఇప్పటివరకు హామీలు మాత్రమే ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి పోచారం, తిమ్మారెడ్డి, ఎర్రపహాడ్, జువ్వాడి, ఉప్పల్వాయి గ్రామాల్ని దత్తత తీసుకుని సీసీ రోడ్లు వేయించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దత్తత గ్రామంలో చెప్పుకోదగిన అభివృద్ధేమీ జరగలేదు. * కరీంనగర్ జిల్లాలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తన నియోజకవర్గంలోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నా.. ఒక్కోసారి పర్యటించడం మినహా చేసిందేమీ లేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు దత్తత తీసుకున్న తిప్పాపూర్, రుద్రంగి, మామిడిపల్లి, తుర్తి, కట్లకుంట గ్రామాల్లో ఒక్క మామిడిపల్లిలో రూ.43 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి పరిస్థితి అధ్వానంగా ఉంది. * రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజీపూర్‌ను దత్తత గ్రామంగా ప్రకటించి చాలా హామీలిచ్చినా.. ఇప్పటి వరకు బీటీ రోడ్డు మాత్రం వేయించగలిగారు. జెడ్పీ చైర్పర్సన్ల ఇలాకాల్లో.. * ఆదిలాబాద్ చైర్పర్సన్ వి.శోభారాణి సొంత గ్రామమైన కడ్తాల్(నిర్మల్ మండలం)లో రోడ్డు పనులు చేయిస్తున్నా.. ఇక్కడి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు కిచెన్ షెడ్లు కరువయ్యాయి. * మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రాజమణి దత్తత గ్రామం నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో అభివృద్ధి పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. * రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దత్తత గ్రామం తిమ్మాయిపల్లిలో మహిళల ఉపాధికి బాటలు వేయగలిగారు. మంత్రి దత్తత తీసుకున్నా అంతంతే.. ‘‘మంత్రి జగదీశ్‌రెడ్డి ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. నీళ్ల కోసం మహిళలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలి.’’ - నజీర్, ఏపూరు, నల్లగొండ జిల్లా అంతా ఆర్భాటమే.. ‘‘సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు ఏమేం కావాలో ఆరా తీశారు. అంతే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ‘మన ఊరు-మన ప్రణాళిక’కు బూజు పట్టింది.’’ - మహ్మద్ రఫీఖాన్, కరీంనగర్ జిల్లా సిరిసేడు మాజీ సర్పంచ్ నియోజకవ ర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తా ‘‘నాకంటూ దత్తత గ్రామాలేవీ లేవు. నియోజకవర్గాన్ని సమదృష్టితో అభివృద్ధి చేస్తా. గిరిజన సబ్‌ప్లాన్, ఇతర శాఖల నిధుల మంజూరుకు కృషి చేస్తా. పదవీ కాలం ముగిసేలోపు నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.’’ - మంత్రి చందూలాల్ అభివృద్ధి వేగవంతం చేస్తాం ‘‘నిర్మల్ నియోజకవర్గంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తా. ఇప్పటికే మరుగుదొడ్లు, మురికి కాలువలు, సీసీరోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఎల్లపెల్లిలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తాం.’’ - మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి ‘‘జిల్లాలోని దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బాన్సువాడ నియోజకవర్గానికి గ్రామజ్యోతి కింద రూ.240 కోట్లు కేటాయించాం. వీటితో అభివృద్ధి పనులు చేపడతాం.’’ - మంత్రి పోచారం అభివృద్ధికి చర్యలు చేపట్టాం ‘‘దత్తత గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తా. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేశాను.’’ - మంత్రి లక్ష్మారెడ్డి గ్రామాల అభివృద్ధే లక్ష్యం ‘‘నా దత్తత గ్రామం ఎగ్లాస్పూర్తో పాటు ఇతర గ్రామాల సమగ్రాభివృద్ధే నా ధ్యేయం. అభివృద్ధి పనులకు రూ.75 లక్షలు మంజూరు చేయించా.’’ - సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్ ఐదు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ‘‘వేములవాడ నియోజకవర్గంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. వాటిలో ప్రగతి పనులు వేగవంతం చేసేందుకు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా..’’ - ఎమ్మెల్యే రమేశ్‌బాబు ‘శ్రీమంత’ పల్లెలు * సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో * రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రా మాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్న ఆయన.. కోట్ల రూపాయలను కేటాయించారు. రెండు పల్లెల్లో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.28.62 కోట్లతో ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. రెండు గ్రామాల్లోని 42 మంది నిరుద్యోగులకు రూ.3.62 కోట్లతో వంద శాతం సబ్సిడీతో 42 ట్రాక్టర్లను అందజేశారు. రూ.1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, రూ.1.20 కోట్లతో గోదాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.2కోట్లతో ఇంటింటికీ సోలార్ విద్యుత్ సిస్టమ్ అమర్చుతున్నారు. కూడవెల్లి వాగు పునరుద్ధరణకు రూ.28.80 కోట్లు మంజూరయ్యాయి. రూ.8 కోట్లతో పాండురంగ రిజర్వాయర్ పనులు, రూ.16.90 కోట్లతో వివిధ కుంటల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2,800 ఎకరాల్లో బిందు సేద్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
పార్టీలోకి ఆహ్వానించిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సమక్షంలో గురువారం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న జలగం క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సింగభూపాలెం సర్పంచ్ భూక్యా జ్యోతి, కారుకొండ పంచాయతీ సర్పంచ్ మాళోతు భారతి, అనిశెట్టిపల్లి సర్పంచ్ ఈసం రామారావు, పెనుబల్లి సర్పంచ్ హాలావత్ రుక్మిణి, రుద్రంపూర్ సర్పంచ్ గొగ్గెల లక్ష్మి, సీతంపేట సర్పంచ్ లావుడ్య మంగమ్మ, వెంకటేష్‌ఖని సర్పంచ్ తాటి సావిత్రి, గౌతంపూర్ ఎంపీటీసీ-3 భూక్యా రుక్మిణి, రుద్రంపూర్-1 ఎంపీటీసీ అజీజ్‌ఖాన్, లక్ష్మీదేవిపల్లి ఎంపీటీసీ తేజావత్ భద్రమ్మ, చుంచుపల్లితండా ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ మాళోతు ఈరి, కొత్తగూడెం మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ బండి నర్సింహారావు, 33వ వార్డు కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచే పెరిగిన గౌరవ వేతనాలు
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపుపై ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ జీవో జారీ చేశారు. పెరిగిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి కరువు
- ఫార్మా-డి డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లబ్బీపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉపాధి మార్గం లేక ఫార్మా-డి కోర్సు చేసినవారు బజారున పడాల్సిన దుస్థితి నెలకొందని అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మశీ, ఫార్మా-డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫార్మా-డి కోర్సు పూర్తిచేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బం దులు పడుతున్నామంటూ విద్యార్థులు శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పుష్పా హోటల్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు చర్యలు లేకుండా ఎంతో ఆర్భాటంగా కోర్సు ప్రవేశపెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలను అయోమయంలోకి నెట్టిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి 50 పడకల ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మశిస్టును నియమించాలని, ప్రతి జిల్లాకు 3, 4 డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని, వైద్యులకు, రోగులకు వారు వినియోగించే మందులపై అవగాహన తెచ్చేందుకు ఇవి దోహదపడతామని వారు ప్రభుత్వానికి సూచించారు. ప్రతి ఆస్పత్రిలో పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్లు, ప్రతి జిల్లాకు ఒక ఫార్మకో విజిలెన్స్ సెం టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో 200 మందికిపైగా ఫార్మా డాక్టర్లు, నగర వైద్యులు జగదీష్, ప్రశాంత్, కృష్ణవేణి, హర్షవర్ధన్, ప్రవీణ్, చంద్రశేఖర్, సత్యసునీల్, నరేష్, రామలక్ష్మి, విజయ్, కృపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలకు పెద్దపీట
- 12 అంశాలతో టీడీపీ జిల్లా మినీ మహానాడులో అజెండా - 5 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం - ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా మినీమహానాడులో ప్రజా సమస్యలపై చర్చించి,ఈ నెలాఖరు లో జరిగే రాష్ట్ర మహానాడుకు పంపేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కంచికచర్ల మండలం దొనబండలోని ఉమా హాలిడే ఇన్ ప్రాంగణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన గురువారం ఉదయం మినీమహానాడు జరగనుంది. అన్ని జిల్లాల్లోనూ గురువారం జిల్లాల మినీ మహానాడులు జరుగుతున్నందున పార్టీ అధినేత చంద్రబాబు 12 అంశాలతో కూడిన అజెండా పంపారు. ఆ అంశాలతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా మినీమహానాడులో నాయకులు చర్చించనున్నారు. రాజధాని, రైతు, డ్వాక్వా రుణాల మాఫీపై చర్చ నూతన రాజధాని ఏర్పాటులో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తీరు తెన్నులపై జిల్లా మినీమహానాడులో కీల కంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం, కొత్తపరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తే అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించి పార్టీ, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం, వారికి ఉద్యోగాలు కల్పించడానికి సలహాలు సూచనలు, మానవ వనరుల అభివృద్ధిపై కులంకుషంగా చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెల కొన్న ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ప్రతిపాదిస్తారు. 16 నియోజకవర్గాల్లోని ఉమ్మడి సమస్యలపై జిల్లా మినీమహానాడులో చర్చించి, మహానాడుకు పంపుతారు. 4 వేల మందికి ఆహ్వానాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సర్పం చులు, ఇన్చార్జిల వరకూ సుమారు 4వేల మందికి జిల్లా మినీ మహానాడుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జిల్లా మినీ మహానాడుకు సుమారు 5వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. -
‘మిషన్’లో మాయ
► ‘ఉపాధి’ చెరువులకు మిషన్ కింద నిధులు ► కాంట్రాక్టర్లు-అధికారుల కుమ్మక్కు ► గతేడాది చెరువులకే మళ్లీ టెండర్లు వరంగల్ : మిషన్ కాకతీయ పనుల మర్మం అర్థం కావడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం పథకం పెట్టారో తెలియకుండా ఉంది. చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆయకట్టు లేని చెరువులకు నిధులు కేటారుుంచడం, అనుకూలమైన వారికి టెండర్లు దక్కకపోతే మళ్లీ టెండర్లు నిర్వహించడం, గతంలో నాబార్డ్, ఎన్ఆర్ఈజీఎస్, ట్రిబుల్ఆర్, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన చెరువులను మళ్లీ మిషన్ కాకతీయ కింద ఎంపిక చేయడం చూస్తే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విషయం అర్థం అవుతోంది. అప్పడు చేసిన పనులకు మళ్లీ బిల్లులు చేసేందుకు పక్కా ప్రణాళికలు అధికారులు, కాంట్రాక్టర్లు కలసి రూపొందించుకున్నారు. ముందుగా అధికారులతో అవగాహనకు వచ్చి కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి గతంలో చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ బిల్లులు పొందేందుకు అధికార నేతలు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా, ఏజెన్సీలోని చెరువుల్లో పూడికతీతలు మొక్కుబడిగా ప్రతిపాదించారు. మైదాన ప్రాంతాల్లో మంజూరైన నిధుల్లో సగానికి పైగా పూడికతీతలకు కేటాయించగా ఏజెన్సీలోని చెరువులకు కేటాయించిన నిధుల్లో 20 శాతం మించిన దాఖలాలు లేవు. కేవలం గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అవే పనులను మిషన్ కాకతీయలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా జరుగుతుందో అధికారులు చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం. ఏ చెరువులు చేపట్టారో గోప్యంగా ఉంచుతున్నారు. ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామ సమీపంలోని పైడి చెరువును గతేడాది ఉపాధి హామీ పథకంలో రూ.3.75 లక్షలతో అభివృద్ధి చేశారు. మళ్లీ ఇదే చెరువును మిషన్ కాకతీయలో చేర్చి రూ.57 లక్షలు కేటాయించారు. ఈ చెరువుకు ఇటీవల రూ.46.32 లక్షలతో టెండర్లు పిలిచి ఖరారు చేశారు. ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి పెద్ద చెరువుకు గతేడాది ఎన్ఆర్ఈజీ ఎస్ పథకంలో రూ9.70 లక్ష లు కేటాయించారు. మత్తడి మరమ్మతులకు నిధులు కేటాయించగా రింగ్‌బండ్ పేరిట నిధు లు స్వాహా చేశారు. మళ్లీ మిషన్‌లో రూ.2.75కోట్లు ప్రతిపాదించగా అనుమతి ల భించింది. కేవలం అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్ర ణాళికబద్ధంగా ఈ చెరువులకు మళ్లీ ని ధులు కేటాయించే విధంగా ప్రయత్నా లు చేసి సాధించుకున్నట్లు తెలిసింది. ఏటూరునాగారం మండలం అల్లంవారి ఘనపూర్ గ్రామ సమీపంలోని బోయే చెరువు ను ఏపీసీబీటీఎంపీ పథకంలో రూ.47 లక్షలు కే టాయించారు. ఈ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అయినా అధికార పార్టీ నేతల సిఫారసుల మేరకు ఈ చెరువుకు మిషన్‌లో నిధులు ప్రతిపాదించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ, తహసీల్దార్ కార్యాలయా ల ఎదుటు ఉన్న రాళ్లకుం ట చెరువు అక్రమణలకు గురయ్యింది. దీనికి ఎన్ఆర్ఈజీఎస్లో గతేడాది రూ.7.50లక్షలు మంజూ రయ్యాయి. తట్టెడు మట్టి తీయకుండానే నిధులు డ్రా చేసుకున్నారు. మళ్లీ మిషన్ కాకతీయలో సిల్ట్ తీసేం దుకు రూ.9 లక్షలు కేటాయిస్తూ ప్రతిపాదించారు. దీనికి ఆయక ట్టు లేకున్నా నిధులు ఎందుకు కేటాయిస్తున్నారోఅధికారులకే తెలియాలి. -
ధనికుడికో న్యాయం..పేదవాడికో న్యాయం
-
మేళ్లకుంటలో రియల్టర్ల మేత!
కరీంనగర్ రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ కుంట శిఖం ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ,కోట్ల విలువైన శిఖం స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని రహదారులను నిర్మించారు. దాదాపు రూ.8కోట్ల విలువైన రెండెకరాల భూమిని బై నెంబర్లతో రియల్టర్లు పలువురికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ భూముల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లోని సర్వే నెంబరు-71లోని మేళ్లకుంట ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతుంది. నగర విస్తరణతో కుంట చుట్టూ ఉన్న స్థలానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం గుంట ధర రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంది. 13 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటశిఖంలో గత కొన్ని నెలల నుంచి అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. రియల్టర్లతో స్థానిక ప్రజాప్రతినిధి కుమ్మక్కు రూ.కోట్ల విలువైన కుంటశిఖం స్థలంపై కొందరు రియల్టర్లు కన్నేశారు. గ్రామానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధిని వాటా పేరుతో మచ్చిక చేసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కుంట శిఖం స్థలంలో దాదాపు ఇరవై అడుగుల వెడల్పుతో స్థానిక ప్రజాప్రతినిధి సాయంతో ఎల్ ఆకారంలో రహదారి నిర్మించారు. దీంతో సమీపంలోని నివాసగృహాలు, పట్టాదారులకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు సైతం ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు కుంట శిఖం స్థలాన్ని రియల్టర్లు బై నెంబర్లతో మాయ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులతో కుమ్మక్కైన రియల్టర్లు దర్జాగా రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు. మేళ్లకుంట సర్వేనెంబరు-71 కాగా రియల్టర్లు సర్వేనెంబరు-71/1,2,3, పేరిట దాదాపు ఇరవై మందికిపైగా ఒక్కొక్కరికి రెండు గుంటలు, మూడు గుంటల చొప్పున ఎకరంన్నర స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పహణీలో సర్వేనెంబరు-71కి బై నెంబర్లు లేకపోయినప్పటికీ అధికారులకు మామూళ్లు అందుతుండటంతో కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ తతంగాన్ని ముగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు కరువు కుంట శిఖం స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు గృహనిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుంట స్థలానికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్లు-51,52, 66లోని భూములకు సంబంధించిన పట్టాదారులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి పట్టాభూమిలో గృహనిర్మాణం కోసం అనుమతి తీసుకుని శిఖం స్థలంలో కడుతున్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఒక వ్యక్తి కుంట శిఖంలో గృహ నిర్మాణం చేపట్టాడని రెవెన్యూ అధికారులు అడ్డుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వ్యవహారం ముగియక ముందే సదరు వ్యక్తి గృహనిర్మాణం పూర్తికావడంతోపాటు మరికొందరు వ్యక్తులు ప్రహరీ, గృహ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
రైలై ళ్లిపోతుంది.. కదలండహో!
ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు డిసెంబర్ నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలోని రైల్వే డిమాండ్ల కోసం ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులకు రైల్వే శాఖ లేఖలు రాసింది. ఏటా తీరా బడ్జెట్ ప్రకటించిన తర్వాత జిల్లాకు న్యాయం చేయలేదని ప్రకటనలు ఇవ్వడం మినహా, ముందు నుంచే జాగ్రత్తపడి డిమాండ్లను సాధించుకోవడంలో ప్రజాప్రతినిధులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా కేటాయింపులు ఆశాజనకంగా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టాలి. లేదంటే మనకు మళ్లీ మొండి చేయి తప్పదు. సాక్షిప్రతినిధి, అనంతపురం: ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలెట్టింది. మీ ప్రాంతంలో రైల్వే డిమాండ్ల వివరాలు ఇవ్వాలంటూ జిల్లాలోని ఇద్దరు ఎంపీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు దక్షిణమద్య రైల్వే అధికారులు లేఖలు రాశారు. బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు ఏటా అన్యాయమే జరుగుతోంది. అధిక ఆదాయం తెస్తున్న డివిజన్లలో గుంతకల్లు డివిజన్ ఒకటి. ఈ డివిజన్లో అనంతపురం జిల్లా కీలకమైనది. అయితే ఆదాయం మేరకు కేటాయింపులు ఉండటం లేదు. కొత్త రైళ్లు, మార్గాలు, సర్వేలు, ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. చాలా వరకూ ప్రతిపాదనల్లోనే ఉండిపోవడం మినహా పనులు పట్టా లెక్కడం లేదు. అభివృద్ధి పనుల ఊసే లేదు అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి గతంలో రైల్వే శాఖకు విన్నవించారు. ఇప్పటి వరకూ అది ఆచరణకు నోచుకోలేదు. గుంతకల్లు, ధర్మవరం గేట్ రోడ్డు, బళ్లారిగేట్ రోడ్డు, కసాపురం రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తున్నా ఉపయోగం లేదు. నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం లో 126 కి.మీలకు 843.45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల-నొస్సం వరకు రైలుమార్గం పూర్తయింది. ఈ మార్గ నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.753.44 కోట్లు ఖర్చు చేశారు. 2012-13 బడ్జెట్లో నొస్సం వరకూ ప్యాసింజరు రైలు నడుపుతామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మునీరాబాద్-మహబూబ్‌నగర్ (వయా రాయచూర్ మీదుగా) కొత్త రైలు మార్గానికి 1290 కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు ఈ రైలు మార్గంలో రూ. 244 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 2014-15 రైల్వేబడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి రూ.120 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ బడ్జెట్లోనైనా భారీగా నిధులు విడుదల చే స్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయి. కడప-బెంగుళూరు మధ్య రైలు మార్గంలో రూ.1343.46 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇప్పటి దాకా రూ.185 కోట్లు కేటారుుంచారు. గత బడ్జెట్లో 30 కోట్లు విడుదలయ్యాయి. ఈ బడ్జెట్లోనైనా భారీగా నిధులు విడుదల చేసేందుకు ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. రాయచూర్-గుంతకల్లు మధ్య 81.1 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు రూ.345 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటిదాక రూ.7.39 కోట్లు మాత్రమే విడుతల చేశారు. రూ. 55.14 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2012-13, 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కేటాయించకపోవడంతో రైల్వే శాఖ కూడా నిధులు కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కేటాయించే అవకాశమే లేదని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చిక్‌బళాపూర్-పుట్టపర్తి, పుట్టపర్తి-కదిరి రైల్వే మార్గాలదీ అదే పరిస్థితి. పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళాపూర్ రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వేశాఖ పక్కన పెట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించతలపెట్టిన రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి 2011లో శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2014కు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2012-13, 13-14 బడ్జెట్లో ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. ఆపై కూడా మొక్కుబడిగా చిల్లర విదిల్చారు. ఈ బడ్జెట్లో ఆశాజనకంగా నిధులు కేటాయించేలా ఎంపీలు ఒత్తిడి తేవాలి. పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళాపూర్ రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వేశాఖ పక్కన పెట్టేసింది. కేంద్రంలో కొలువుదీరిని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, ఎంపీ నిమ్మలకిష్టప్ప జిల్లాకు అవసరమైన రైల్వే ప్రాజెక్టులను సాధించుకోవడంలో ఏమేరకు ప్రయత్నిస్తారో, రప్పిస్తారో వేచిచూడాలి. పాజెక్టు పేరు అవసరమైననిధులు విడుదలైన నిధులు గుంతకల్లు విద్యుత్తు లోకోషెడ్డు రూ.140 కోట్లు రూ. 12.37 కోట్లు (వంద విద్యుత్ లోకోఇంజన్ల సామర్ధ్యం) పామిడి పెన్నానదిపై వంతెన రూ.25 కోట్లు రూ.19.00 కోట్లు గుంతకల్లు మోడల్ స్టేషన్ బిల్డింగ్ రూ.6 కోట్లు రూ.3 కోట్లు -
బదిలీలపై అసమ్మతి సెగలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో అధికారుల బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులపై ఆ పార్టీ నేతలే ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సహజంగా బది‘లీలల’పై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తాయి. ముడుపులు తీసుకుని నచ్చినవారికి పోస్టింగ్లిచ్చారని మండిపడతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు అధికార పక్షమే విపక్షంగా తయారైంది. వారి మధ్య నెలకొన్న అంతర్గత పోరు బదిలీల వ్యవహారంతో తారస్థాయికి చేరింది. తనను వ్యతిరేకిస్తున్న నేతలు సిఫారసు చేసిన అధికారులకు పోస్టింగ్లిస్తే భవిష్యత్‌లో ముప్పు వస్తుందనే ఉద్దేశంతో మంత్రి తన పవర్‌ను ఉపయోగించి వాటిని నిలిపివేశారు. అయితే తాము సూచించిన వారి పేర్లను కనీసం పరిశీలించలేదన్న ఆవేదనతో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి మృణాళిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియలో చేతులు మారిన ముడుపులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ బయట పెడుతున్నారు. కొందరైతే ఏకంగా మంత్రిని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కుమ్మకై అప్పట్లో హవా సాగించిన అధికారులను తీసుకొచ్చి పరోక్షంగా సహకరించారన్న వాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. మరికొందరైతే సత్తిబాబు టీమ్‌ను తెచ్చారని బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మధ్య జెడ్పీ గెస్ట్ హౌస్‌లో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఇప్పుడేకంగా బహిరంగ పోరుకు సన్నద్ధమని సవాల్ విసురుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి వాదులంతా ఒక్కటవుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకొచ్చిన అధికారులెవరు? గతంలో వారి పనితీరు? వారిపై ఉన్న ఆరోపణలు? ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు ? తదితర వివరాలను సేకరించి తొలుత అశోక్ గజపతిరాజు వద్ద పెడతామని, ఆ తర్వాత సీఎం వద్ద పంచాయతీ (పంచాయితీ) పెడతామని చెబుతున్నారు. ఇంక వేచి చూడలేమని, ఏదోకటి తేల్చుకుంటామని అంటున్నారు. ఇదెంతవరకు వెళ్తుందో? లేదంటే మేకపోతూ గాంభీర్యంగా మిగిలిపోతుందో వేచి చూడాలి. -
మేయర్‌ను కలిసిన ఐఐపీఏ ప్రతినిధులు
సాక్షి, సిటీబ్యూరో: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ, న్యూఢిల్లీ) ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ సుజిత్‌కుమార్ ప్రుసేథ్ నేతృత్వంలోని 9 మంది ప్రతినిధుల బృందం బుధవారం మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్‌లను కలిసింది. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న రూ. 5కే భోజనం, పేదబస్తీ ప్రజలకు శుద్ధజ లం, ఆస్తిపన్ను, డిజిట ల్ బర్త్ సర్టిఫికెట్లు, జీవవైవిధ్య విభాగం పనులు తదితర అంశాల గురించి వీరు మేయర్, డిప్యూటీ మేయర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలందజేయాలని , తాము కూడా ఆయా ప్రాంతాల్లో వీటిని అమలు చేస్తామని ప్రతినిధులు కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాథమ్యాల కనుగుణంగా పనులను పూర్తిచేయవచ్చునని ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఇక్కడి పనితీరు చాలా బాగుందని కితాబిచ్చింది. -
ఇటు ఆషాఢం.. అటు మూఢం
ప్రమాణ స్వీకారాలకు సరైన ముహూర్తమేది? తెగ మదనపడిపోతున్న ‘స్థానిక’ ప్రతినిధులు కొద్ది రోజుల్లో వెలువడనున్న మార్గదర్శకాలు విశాఖ రూరల్ : ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు ఆషాడం, అనంతరం మూఢం బెంగ పట్టుకుంది. అధికార ఎడబాటుకు వచ్చే నెల మొదటి వారంలో తెరపడనున్నప్పటికీ.. నెలాఖరు నుంచి ప్రవేశిస్తున్న ఆషాడమాసం అందరినీ కలవరపెడుతోంది. ఆ తర్వాత మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. స్థానిక సమరంలో విజయం సాధించి మూడు నెలలుగా అధికార పీఠం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ.. ఇప్పుడు మరో మూడు నెలలు అధికారానికి దూరంగా ఉండాలో...ఆషాడంలో పగ్గాలు చేపట్టాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. తప్పనిసరయి ఆషాడంలో బాధ్యతలు చేపట్టాల్సి వస్తే శాంతులు ఏమైనా ఉన్నాయంటూ పూజార్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా.. జూలై మొదటి వారంలో మునిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 28 నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. అనంతరం మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ముహూర్తాలు ఉండవు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని తెగ బెంగపడిపోతున్నారు. జూలైలో ముహూర్తం జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరగాయి. మే12న ఫలితాలు వచ్చాయి. అలాగే 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు 13న వెల్లడయ్యాయి. అప్పటి నుంచి గెలిచిన అభ్యర్థులు అధికారపీఠం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఈ పరోక్ష ఎన్నికలకు అడ్డంకిగా మారాయి. రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం వీటి చైర్మన్,వైస్‌చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఈ ఎన్నికలు జరగవచ్చని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలు ఉండగా టీడీపీ 24, వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. విప్ ధిక్కరిస్తే వేటే చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశముంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీచేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియ చేతుల ఎత్తే పద్ధతిలో ఉంటుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటు చెల్లుబాటైనప్పటికీ.. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. సభ్యుని పదవి రద్దు విషయపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం సదరు సభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే ఎన్నిక వాయిదా పడుతుంది. తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. -
హెల్త్‌కేర్ సమ్మిట్ అదిరింది
తాజ్‌కృష్ణాలో ప్రారంభమైన సదస్సు 20 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు మరో రెండు రోజులపాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్ సాక్షి, సిటీబ్యూరో: ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా పలు పరికరాలు, ఉత్పత్తులను ఎగ్జిబిట్లో ప్రదర్శనకు ఉంచారు. ఫ్యాఫ్సీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫార్మాసూటికల్స్ అసోసియేషన్, ఇండస్ ఫౌండేషన్, ఓమిక్స్ సంయుక్తాధ్వర్యంలో హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి టి.తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి సుమారు రెండు వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 60 మంది నిపుణులు, 200పైగా అంశాలపై చర్చించనున్నారు. వివిధ ఫార్మాసూటికల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు, వైద్య పరికరాలను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఇండస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సీడీ అర్హ, ఓమిక్స్ గ్రూప్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనిబాబు గేదెల, ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ అనుమోలు, ఫ్యాఫ్సీ అధ్యక్షుడు రూంగ్టా తదితరులు పాల్గొన్నారు. జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం.. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యులకు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ వీఎం కతోచ్, నిమ్స్ మాజీ డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ టీవీ కృష్ణారావు, ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఎన్.అప్పారావు, అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మాజీ డీన్ డాక్టర్ ఎం.హబీబ్, క్లినికల్ ల్యాబోరేటీస్ డెరైక్టర్ డాక్టర్ అనిల్కౌల్, డాక్టర్ ఇందిరాశర్మ, డాక్టర్ సంజయ్ పి.సింగ్, డాక్టర్ ముజఫర్ అహ్మద్, ప్రొఫెసర్ వి.విక్రమ్కుమార్లను మంత్రి కేటీఆర్ సత్కరించారు. -
పోర్టు కల నెరవేరేనా?
నీళ్లొదిలిన కిరణ్ సర్కారు పట్టించుకోని ప్రజాప్రతినిధులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల మచిలీపట్నంలో నిర్మితం కావాల్సిన పోర్టుపనులు ఎక్కడ వేసినగొంగలి అక్కడే అన్న చందంగా మారాయని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికారపక్ష నాయకులు పోర్టు అంశంపై ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోవడంతోనే ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని జిల్లాలో బందరు పోర్టు నిర్మాణంతో పలు పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉందని, అయినా ఈ విషయాన్ని ఐదేళ్లుగా మన జిల్లాకు చెందిన పాలకులు పట్టించుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 11 సంవత్సరాలుగా ఉద్యమాలు... బందరు పోర్టు నిర్మాణం చేయాలని 2003 నుంచి ఉద్యమాలు ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పోర్టుకు అనుబంధంగా 27 రకాల పరిశ్రమలు జిల్లాలో స్థాపించేందుకు అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. జీవో నంబరు 11 అమలయ్యేనా... బందరు పోర్టును నిర్మించాలని 2003నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2004లో 100 రోజులపాటు రిలే దీక్షలు, 10 రోజులపాటు ఆమరణ దీక్షలు చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బందరు పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2008 ఏప్రిల్ 23 వ తేదీన బందరు పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల నేపథ్యంలో పోర్టు పనులకు బ్రేక్‌పడింది. 2009 సెప్టెంబరు 2వ తేదీన వైఎస్.మరణంతో పోర్టు అంశాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేటాస్ కంపెనీనుంచి నవయుగ సంస్థకు పనులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 మే 2వ తేదీన మచిలీపట్నంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. పోర్టుకు కావాల్సిన భూసేకరణ కోసం జీవో నంబరు 11ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థాయిలో జీవో నంబరు 11ను జారీ చేసి 21 నెలలు గడచినా బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణ జరగనేలేదు. ఇంతవరకు పోర్టు ఫైల్ సీఎం పేషీ దాటి బయటకు రాలేదు. రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి ప్రయత్నంగానైనా జిల్లాకు చెందిన అధికార పక్షానికి చెందిన నాయకులు బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలక్ష్యం వల్లే పోర్టు కం షిప్ యార్డు తరలిపోయిందా... రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మిస్తామని కేంద్రస్థాయి నేతలు ప్రకటించారు. దీనికి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. దీంతో దుగరాజపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మింపజేసేందుకు ఆ జిల్లాకు చెందిన అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు. వాస్తవానికి పోర్టు కం షిప్‌యార్డును మచిలీపట్నంలో నిర్మించేందుకు తొలుత ప్రయత్నాలు జరిగాయి. మచిలీపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మించేందుకు అనుకూలత ఉందని సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. అయితే మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో దాదాపు రూ.1500 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే పోర్టు కం షిప్‌యార్డు దుగరాజపట్నంకు తరలిపోయిందనే వాదన పలువురి నుంచి వ్యక్తమవుతుంది. -
ఉపాధి కూలీలకు బీమా
ఉప్పునుంతల/బల్మూరు, న్యూస్‌లైన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపా రు. ఈజీఎస్ సమాఖ్యలను మరింత పటిష్టం చేయాలని, ఇక్కడ మంచిఫలితం వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ఉపాధి కూలీలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని భరోసాఇచ్చా రు. ఆదివారం ఉప్పునుంతల, మామిళపల్లిలో శ్ర మశక్తి సమాఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామస్థాయి లో కూలీలను సంఘాలుగా ఏర్పాటు చేసి శ్రమశక్తి సమాఖ్యలకు హక్కులు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3500ఎకరాల చెంచుల భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు. కూలీలు ఈజీఎస్ ను ఉపయోగించుకోవడంతోపాటు వచ్చిన డబ్బుతో తమ పిల్లలను చక్కగా చదివించుకోవాలని సూచించారు. అందులోనే కొంత డబ్బులను పొదుపు చేసుకుంటే ఇతర అవసరాలను తీర్చుకునే వీలుంటుందన్నారు. ఇకముందు ఏయే మార్పులు వస్తే మరింత బాగుంటుందనే అంశాలను కూలీలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో పథకం లేని రోజుల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లమని ఈజీఎస్ వచ్చిన తర్వాత ఉళ్లోనే పనులు చేసుకొని ఉపాధి పొందుతున్నామని సమాఖ్యల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం కుటుంబానికి కల్పిస్తున్న వందరోజులు సరిపోవడంలేదని మరో వంద రోజులు పనిదినాలు పెంచడంతోపాటు ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేటును రూ.250కి పెంచాలని ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. పనిదినాలు పెంచండి: ఎమ్మెల్యేలు రాములు, జాపల్లి ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీలతో పాటు రైతులు లబ్ధిపొందుతారని అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రికి వివరించారు. కూలీలకు అదనంగా వందరోజులు కల్పించడంతోపాటు రూ.250 వేతనం ఇవ్వాలన్నారు. సమాఖ్యల సమావేశాలు నిర్వహించుకోవడానికి గ్రామ స్థాయిలో ఓ భవనం కట్టించాలని జూపల్లి మంత్రికి విన్నవించారు. అచ్చంపేటలో ఈజీఎస్ సిబ్బందికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేయడంతోపాటు భూమిలేని నిరుపేద కూలీలకు కనీసం రెండెకరాల భూమి ఇచ్చేవిధంగా కృషిచేయాలని ఎమ్మెల్యే రాములు మంత్రిని కోరారు. చెంచులు వ్యవసాయ రంగంలో రాణించాలి చెంచులు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాం క్షించారు. బల్మూరు మండలం బాణాలలో ఐటీడీఏ ద్వారా ఇందిర జలప్రభ పథకంలో పదెకరాల చెంచుల భూముల్లో రూ.5.60లక్షల వ్యయంతో వేసిన బోరును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెం చుల వలసల నివారణకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామన్నారు. అంతే కాకుండా ఐటీడీఏ పరి ధిలో 3500 ఎకరాల చెంచుల భూముల్లో బోర్లు వేయాడానికి ప్రణాళిక సిద్ధంచేసినట్లు తెలిపారు. -
ప్రజాస్వామ్యానికి పాతర వేయొద్దు
= పాలకులకు సమైక్యవాదుల హితవు = కొనసాగుతున్న సమైక్య పోరు తిరుపతి, న్యూస్‌లైన్: ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజాభీష్టాన్ని మన్నించని పాలకులకు పుట్టగతులు ఉండవు. మా సహనాన్ని పరీక్షించవద్దు’ అంటూ జిల్లాలో సమైక్యవాదులు హెచ్చరించా రు. సమైక్య రాష్ట్రం కోసం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో కే ంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూసివేయించారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, లాఠీలకు పనిచెప్పారు. అందోళనకారులు పోలీసు భద్రతను ఛేదించుకుని మెయిన్‌గేట్ దాటి వెళ్లి కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ధర్నాకు దిగారు. జేఏసీల తరఫున కొందరు ప్రతినిధులు లోనికెళ్లి సిబ్బంది తో చర్చలు జరిపి కార్యాలయాన్ని మూసివేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక మనోహర్ అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఎస్వీయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పద్మావతి మహిళా యూ నివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపించారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తాళం వేశారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. మహిళా ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ట్రాన్స్ కో ఉద్యోగులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. న్యాయవాదులు కోర్టు నుంచి ర్యాలీగా వచ్చి ఎన్జీవోల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. చిత్తూరులో జేఏసీ నాయకులు గాంధీ విగ్రహం వద్ద పేపర్ విష్ణు చక్రాలను తిప్పుడూ నిరసన తెలిపారు. వీధుల్లో భిక్షాటన చేశారు. ఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. పీలేరులో సమైక్యవాదులు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్ధం చేశారు. పుంగనూరులో ఉపాధ్యాయులు చీరలు కట్టుకుని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీ ల మాస్క్‌లు తగిలించుకున్నారు. న్యాయవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో పండ్లు అమ్మి నిరసన తెలిపారు. కుప్పంలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలను శుభ్రం చేశారు. పుత్తూరులో మాజీ కౌన్సిలర్ రాజశేఖర్‌వర్మ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. -
జనసంద్రంగా ఎంజే మార్కెట్
అబిడ్స్/సుల్తాన్‌బజార్/కలెక్టరేట్/దత్తాత్రేయనగర్, న్యూస్‌లైన్: గణేశ్ నిమజ్జనోత్సవం లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన నిమజ్జన యాత్రకు అశేష భక్తజనవాహిని తరలివచ్చింది. చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, చార్మినార్, కాచిగూడ, కోఠి, ధూల్‌పేట్, జియాగూడ, కార్వాన్, గోషామహాల్, బేగంబజార్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణేష విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ జనసంద్రంగా మారింది. పలు అసోసియేషన్ల నిర్వాహకులు వివిధ వాహనాలపై వినూత్నంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు భక్తులు వాహనాలపై భారీ జాతీయ పతాకాలను, కాషాయ జెండాలను చేబూని యాత్రలో పాల్గొన్నారు. ముచ్చటగొలిపే వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను భక్తులు దర్శించి తరించారు. జైగణేష్ మహరాజ్‌కీ జై... గణపతి బప్పా మోరియా...అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఊరేగింపు ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వాగత వేదికల నుంచి పలువురు ప్రముఖులు చేసిన ప్రసంగాలు ఊరేగింపులో పాల్గొన్న జనాల్లో ఉత్సాహాన్ని నింపాయి. ట్యాంక్‌బండ్‌కు తరలివెళ్లే భక్తులకు నిర్వాహకులు ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు. మధ్యాహ్నం నుంచి పెరిగిన జోరు ఉదయం నుంచే ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం మధ్యాహ్నంతో మరింత జోరందుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ నుంచి ఘన స్వాగతాల మద్య వినాయకసాగర్‌కు తరలివెళ్లాయి. బ్యాండ్ మేళాల హోరులో భక్తులు మైమరిచి నృత్యాలు చేస్తూ గణనాథుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. కాగా, సామూహిక నిమజ్జనానికి తరలివచ్చిన అశేషజనవాహినిలో పలువురు చిన్నారులు తప్పిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్వాగత వేదికల నుంచి తమ చిన్నారుల కోసం విజ్ఞప్తి చేశారు. వర్షంలోనూ సాగిన యాత్ర వినాయక నిమజ్జన శోభాయాత్ర జోరు వర్షంలో సైతం కొనసాగింది. సాయంత్రం ప్రారంభమైన వర్షంలో భక్తులు తడుస్తూ రెట్టింపు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సైతం తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. ప్రజలు వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడినా వివిధ వినాయక ప్రతిమలను తిలకించేందుకు ఆసక్తి కనబరిచారు. పోలీసుల అత్యుత్సాహం బేగంబజార్, సిద్ధిఅంబర్‌బజార్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాలలో మైక్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై భక్తులు మండిపడ్డారు. ప్రసాదాలు పంపిణీ చేసే వద్ద ఉంచిన బాక్స్‌లనూ పోలీసులు సీజ్ చేశారు.