= పాలకులకు సమైక్యవాదుల హితవు
= కొనసాగుతున్న సమైక్య పోరు
తిరుపతి, న్యూస్‌లైన్: ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజాభీష్టాన్ని మన్నించని పాలకులకు పుట్టగతులు ఉండవు. మా సహనాన్ని పరీక్షించవద్దు’ అంటూ జిల్లాలో సమైక్యవాదులు హెచ్చరించా రు. సమైక్య రాష్ట్రం కోసం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో కే ంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూసివేయించారు.
కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, లాఠీలకు పనిచెప్పారు. అందోళనకారులు పోలీసు భద్రతను ఛేదించుకుని మెయిన్‌గేట్ దాటి వెళ్లి కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ధర్నాకు దిగారు. జేఏసీల తరఫున కొందరు ప్రతినిధులు లోనికెళ్లి సిబ్బంది తో చర్చలు జరిపి కార్యాలయాన్ని మూసివేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక మనోహర్ అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఎస్వీయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పద్మావతి మహిళా యూ నివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపించారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకులు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి తాళం వేశారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు.
మహిళా ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ట్రాన్స్ కో ఉద్యోగులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. న్యాయవాదులు కోర్టు నుంచి ర్యాలీగా వచ్చి ఎన్జీవోల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. చిత్తూరులో జేఏసీ నాయకులు గాంధీ విగ్రహం వద్ద పేపర్ విష్ణు చక్రాలను తిప్పుడూ నిరసన తెలిపారు. వీధుల్లో భిక్షాటన చేశారు. ఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.
పీలేరులో సమైక్యవాదులు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్ధం చేశారు. పుంగనూరులో ఉపాధ్యాయులు చీరలు కట్టుకుని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీ ల మాస్క్‌లు తగిలించుకున్నారు. న్యాయవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో పండ్లు అమ్మి నిరసన తెలిపారు. కుప్పంలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలను శుభ్రం చేశారు. పుత్తూరులో మాజీ కౌన్సిలర్ రాజశేఖర్‌వర్మ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు.
ప్రజాస్వామ్యానికి పాతర వేయొద్దు
Published Thu, Oct 10 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement