united state
-
అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు
న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు. తాజాగా అమెరికా నావికాదళం, వాణిజ్య నౌకలకు సమీప దూరంలో డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. హౌతీలు సాయుధ మానవ రహిత ఉపరితల నౌక(USV)ను ప్రయోగించారని అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవరహిత ఉపరితల నౌకను ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా నేవీ ఆపరేషన్స్ హెడ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. యూఎస్‌వీలు హౌతీల సముద్ర యుద్ధాల్లో కీలకమైన భాగమని క్షిపణి నిపుణుడు ఫాబియన్ హింజ్ తెలిపారు. సౌదీ సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన యుద్ధాల్లో వాటిని ఉపయోగించారని చెప్పారు. తరచుగా సూసైడ్ డ్రోన్ పడవలను ఎక్కువగా ఉపయోగింస్తారని వెల్లడించారు. ఇరాన్లో తయారైన కంప్యూటరైజ్డ్ గైడెన్స్ సిస్టమ్స్‌లతో అమర్చబడి ఉంటాయని తెలిపారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల వెనక ఇరాన్ ఉందని యుఎస్ డిప్యూటీ రాయబారి క్రిస్టోఫర్ లూ అన్నారు. హౌతీలకు బాలిస్టిక్ క్షిపణులతో సహా అధునాతన ఆయుధ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌తో అమెరికా ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హౌతీల దాడులు నిలిపివేయకపోతే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా మిత్ర దేశాలు గురువారం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాతే హౌతీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు IBM వార్నింగ్...
-
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
Viruses Alert: ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ!
వాషింగ్టన్: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఒకే వ్యక్తిలో కరోనా వైరస్, మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. అమెరికాకు చెందిన వ్యక్తిలో రెండు వైరస్‌లను శనివారం గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తిలో రెండు వైరస్లు గుర్తించటం తొలిసారిగా అగ్రరాజ్యం అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్‌లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా అది మంకీపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ‘నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.’ అని ఓ ఛానల్‌కు తెలిపారు మిట్కో థాంప్సన్. ఇన్‌ఫ్లూయెంజా కేసుగా మారిందని, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవటం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి. -
ఇండియన్ స్టూడెంట్‌కి వేధింపులు
-
అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి
వాషింగ్టన్: ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చైనా జెట్ విమానాలు కొన్న పాక్) -
PM Modi Visit To US: కమలతో కీలక భేటీ
-
ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు
ఆల్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ఆఫ్ అండ్ లాండింగ్(ఇవీటీఓఎల్) ఎయిర్‌క్రాఫ్ట్.. పేరు వినగానే ఏదో భారీ యుద్ధ విమానం అనుకుంటున్నారా! అదేం కాదు. టేకాఫ్ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్ అంటారు. తాజాగా అమెరికాకు చెందిన నాసా ఈ వాహనాలపై జోబీ ఏవియేషన్‌తో కలిసి ప్రయోగాలు ఆరంభించింది. ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్‌టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్ ఎయిర్ మొబిలిటీ) నేషనల్ కాంపైన్లో భాగంగా ఈ వాహనాలపై నాసా5 ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్‌బేస్ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది. డేటా పరిశీలనతో వచ్చే ఏడాది పలు పరీక్షలు నిర్వహిస్తారు. రాబోయే సంవత్సరాల్లో అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ మొబిలిటీ ప్రయోగాలు జరగనున్నాయని నాసా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రయోగాల్లో భాగంగా ఎయిర్టాక్సీకి 50కి పైగా మైక్రోఫోన్లు అమరుస్తారు. అనంతరం విమానం ఎగురుతున్నప్పటి దశల్లో జరిగే మార్పులను రికార్డు చేస్తారు. నాసా చేపట్టిన కార్యక్రమం భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ వాహనాలకు కీలకమని జోబీ ఏవియేషన్ సీఈఓ జోబెన్ చెప్పారు. నాసాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. చదవండి: స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
ముగ్గురు యువతులతో ప్రియుడి డేటింగ్.. ట్విస్ట్ ఏంటంటే..
వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో తరచుగా అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్న సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు, ముగ్గురు యువతులతో డేటింగ్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువతులు తామేమి తీసిపోనట్టు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, యూఎస్‌కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ సంఘటన బోయిస్లో జరిగింది. కాగా, బోయిస్ కు చెందిన మోర్గాన్ అనే యువకుడు.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, టాబోర్ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం ఇతగాడి మోసం బాగానే సాగింది. అయితే, కొన్ని రోజుల తర్వాత టాబోర్ అనే యువతి, తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ బండారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. టాబోర్ ఒక రోజు ఫేస్బుక్లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది. దీంతో ఆమె అనుమానంతో తన ప్రియుడి అకౌంట్‌ను తెరిచి చూసింది. ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే, జీవితం పంచుకోవాలనుకుందో.. అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు, ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్‌ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్లో బెకాసింగ్, రాబర్ట్స్అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే, టాబోర్ వీరిని రహస్యంగా కలుసుకుంది. తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది. దీంతో అతని బండారం కాస్త బయటపడింది. ఒకరోజు మోర్గాన్, టాబోర్ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్‌కు గురయ్యాడు. అయితే, అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా, మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, మోర్గాన్ టాబోర్లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్‌లోని సరస్సులు, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్, బెకాసింగ్ తెలిపారు. అతనికి ప్రేమను పొందే హక్కులేదు. ఇప్పుడు తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్ తెలియజేసింది. -
సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు
వాషింగ్టన్: అమెరికాలో సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం బయటపడింది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల కారణంగా పసికందు ముఖంపై గాయమైంది. దాంతో శిశువు ముఖంపై ఏకంగా 13 కుట్లు పడ్డాయి. వివరాలలోకి వెళ్తే.. జూన్ 15 న కొలరాడోలోని డెన్వర్ హెల్త్ హాస్పిటల్లో డమార్కస్ విలియమ్స్ భార్య రిజానా డేవిస్ పడంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ డెలివరీ సమయంలో తమ బిడ్డ క్యాని విలియమ్స్‌కు కలిగిన గాయం చూశాక అల్లాడిపోయారు. ‘మొదట మేము నార్మల్ డెలివరీకే యత్నించాం. కానీ, ప్రసవ సమయంలో వైద్యులు పాప హృదయ స్పందన ఖచ్చితం కనుగొనలేకపోవడంతో వెంటనే రిజానాను సి-సెక్షన్లోకి తీసుకువెళ్లారు. సిజేరియన్ తరువాత తల్లీ బిడ్డ క్షేమం అని చెప్పారు. అయితే, మా బిడ్డ ఎడమ చెంపపైన 13 కుట్లు ఉన్నాయి. ఇదేంటని డాక్టర్లను ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు’ అని డమార్కస్ విలియమ్స్ చెప్పారు. ఇక ఈ విషయం గురించి శిశువు తాతయ్య మాట్లాడుతూ.. ‘చిన్నారి క్యాని రాక మా అందరికీ ఆనందం కలిగించింది కాని అంతే భయం, బాధ కలిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిని నియమించుకుని ఆస్పత్రిపై దావా వేస్తామని తెలిపారు. చదవండి:విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
అమెరికాలో తీవ్ర మంచు తుపాను
-
అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి
-
కొత్త మలాలా
వాతావరణంలోని పెనుమార్పులకు, ఆ మార్పులు వల్ల సంభవించబోయే విపత్తులకు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే కారణమని పదహారేళ్ల స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ చేసిన ప్రకటన ఐక్యరాజ్యసమితి దృష్టి వరకు వెళ్లింది. గ్రెటా తాజాగా ‘వేకప్’ (మేల్కొండి) అంటూ యు.ఎస్.పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. గత ఏడాది తరగతి గది నుండి బయటికి వచ్చి తక్కిన పిల్లలతో పాటు స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ‘వాతావరణాన్ని కాపాడండి’ అని నినాదాలు చేయడంతో గ్రేటా గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది. -
ఫార్మా కంపెనీలకు అమెరికా FDA సమస్య లేదు
-
ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్ పరిశ్రమ చాలా ప్రత్యేకమైది. ఈ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉందని వారికి చెప్పాం. అయితే, చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.’ అని మీడియాతో చెప్పారాయన. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించటం తెలిసిందే. ఆర్సెలర్ మిట్టల్‌ను వేగం పెంచమన్న సెయిల్‌జేవీ అంశంపై లక్ష్మీ ఎన్ మిట్టల్‌కు లేఖ హై–ఎండ్ ఆటోమోటివ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన జాయింట్ వెంచర్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆర్సెలర్ మిట్టల్‌ను కోరింది. ఇరు సంస్థలు ఏర్పాటుచేయనున్న ఈ వెంచర్‌కు గతేడాదిలోనే సెయిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. పలు ఆర్థిక అంశాలపై ఇప్పటికీ తుది ఒప్పంద సంతకాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జేవీ ఏర్పాటు వేగవంతం కావాలని, ఒప్పంద సంతకాలను పూర్తి చేయాలని ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ ఎన్ మిట్టల్‌కు గురువారం ఒక లేఖ రాసినట్లు సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి వెల్లడించారు. ‘మిట్టల్ సంస్థ జేవీ ఏర్పాటుకు సుముఖంగానే ఉంది. మావైపు నుంచి మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. నిజానికి ఈ నెలలోనే డీల్ పూర్తిచేయాలనుకున్నాం. అయితే, మిట్టల్ సంస్థ వేగంగా లేనందున వచ్చే నెలలో జేవీ ఒప్పంద తుది సంతకాలను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం.’ అని తెలిపారు. -
ట్రంప్‌ను పట్టించుకోని ఫెడ్
వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్లపెంపుపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడ్ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఎకానమీ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపు కాదని తెలిపారు. ప్రభావం చూపని ట్రంప్ ట్వీట్ ఫెడ్ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్‌ను ఉద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్ సభ్యులు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ చదవాలని కూడా ట్వీట్లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. ఇంత చెప్పినా ఫెడ్ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై ట్రంప్ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది రెండు సార్లకే పరిమితం ‘‘2019లో మరో 3 మార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే సంవత్సరం మరో 2 దఫాలు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని పావెల్ వివరించారు. -
సమైక్య రాష్ట్రంలో వీసీల ఇష్టారాజ్యం
♦ స్వయంప్రతిపత్తి పేరిట అధికార దుర్వినియోగం: సీఎం ♦ రిటైర్మెంట్ రోజునా వందలాది మంది నియామకం ♦ ప్రభుత్వ నియంత్రణ కొరవడే ఈ దుస్థితి ♦ అందుకే అంబేద్కర్, రాజీవ్‌గాంధీ వర్సిటీల చట్ట సవరణ బిల్లు ♦ వీసీల నియామక కమిటీలో ప్రతిపక్షానికీ చోటు కల్పిస్తాం ♦ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది ఎకరాల భూములు ఎలా మాయమయ్యాయి. దానికి ఉండాల్సిన భూమి ఎంత, ఇప్పుడెంత మిగిలింది. స్వయంప్రతిపత్తిని వీలైనంత దుర్వినియోగం చేసి వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగదీశ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్ని యూనివర్సిటీలను సమీక్షిస్తే ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి. వీసీలపై విచారణ చేయాల్సిన దుస్థితి వచ్చింది. సాయంత్రం పదవీవిరమణ చేయాల్సి ఉంటే ఉదయం పూట వందల మందిని ఉద్యోగాల్లో నియమించారు. ఓ దగ్గర 370 మంది, మరో దగ్గర 300 మందిని నియమించారు. ప్రభుత్వ నియంత్రణ కొరవడటం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఇలాంటి ఇష్టారాజ్యాన్ని సవరించే అక్కర ఉందా లేదా అన్నది అంతా ఆలోచించాలి. అందుకే చట్టసవరణను ప్రతిపాదించాం. ఇదేమీ ఆషామాషీ నిర్ణయం కాదు. దీని వెనక మరే రాజకీయ దురుద్దేశాలు లేవు’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శాసనసభలో స్పష్టం చేశారు. అంబేడ్కర్ సార్వత్రిక, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై విపక్షాలు అభ్యంతరం తెలపడంపై కేసీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సవరణలు అవసరమని భావించామని, దీని వెనక రాజకీయ ఉద్దేశాలు లేవని పేర్కొన్నారు. గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండొద్దని బిల్లుల్లో లేదని, ప్రభుత్వం కూడా చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఒక్కరే చాన్స్‌లర్‌గా ఉంటే పని ఒత్తిడిలో ఆయన ప్రతి యూనివర్సిటీపై దృష్టి సారించలేరని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఈ బిల్లులను తెస్తున్నామన్నారు. యూనివర్సిటీల్లో కొనసాగతున్న విచ్చలవిడితనాన్ని తాను స్వయంగా గవర్నర్‌ను దృష్టికి తీసుకెళ్లి వివరించానని, ఆయనతో చర్చించి ఆమోదం తీసుకున్నాకే సవరణకు నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అనటానికి లేదు. గవర్నర్ ఉండాల్సిన చోట వారు ఉంటారు. ఎన్నింటిలో ఉంటారనే విషయంపై వారిని అడుగుతాం. కొన్ని యూనివర్సిటీలకు న్యాయమూర్తులను కూడా వీసీలుగా నియమించాలనుకుంటున్నాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి న్యాయమూర్తులను కేటాయించాలని కోరాను’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఊరికొకటి పల్లెకొకటి చొప్పున స్థాపిస్తే యూనివర్సిటీల గౌరవం పోతుందని, తాము హుందాగా ఓ ప్రతిపాదన తెచ్చామని, వీసీలను ఎంపిక చేసే కీలక కమిటీలో ప్రతిపక్ష సభ్యుడికీ అవకాశం ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి యూనివర్సిటీకి విడివిడి చట్టం ఉండాలా, అన్నీ కలిసి ప్రభుత్వ అధీనంలో ఒకే చట్టం పరిధిలో పనిచేయాలా అనే విషయంపై విద్యా వ్యవస్థపై జరిగే స్వల్పకాలిక చర్చలో చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. -
మళ్లీ క్లీన్‌సిటీ..
- నడుం బిగించిన మహానగరపాలక సంస్థ - వరంగల్ పూర్వవైభవానికి సన్నాహాలు - నేడు సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి రాక - అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం - పటిష్ట కార్యాచరణతో ముందుకు.. 2012 అక్టోబర్ 10 నుంచి 17.. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్.. దేశంలోనే ప్రప్రథమంగా వరంగల్ నగరంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆరు నెలల్లోనే సీన్ రివర్స్ అరుంది. ఈ క్రమంలో క్లీన్సిటీని మళ్లీ గాడిన పెట్టేందుకు మహా నగర పాలక సంస్థ నడుం బిగించింది. మసకబారిన ఓరుగల్లు క్లీన్‌సిటీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, బల్దియా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బల్దియూ సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి ఆదివారం వరంగల్‌కు రానున్నారు. వరంగల్ అర్బన్ : క్లీన్సిటీపై వరంగల్ మహానగరపాలక సంస్థ మళ్లీ దృష్టి కేంద్రీకరించింది. సమైక్య రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని వరంగల్ నగరంలో 2012లో చేపట్టారు. 1.19 లక్షల ఇళ్లు, షాపుల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. జిల్లా అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ ప్రాంతంలోని మునిసిపాలిటీల నుంచి 150 బృందాలు 450 మంది ఉద్యోగులు విచ్చేసి కార్యక్రమంలో వారం రోజులపాటు పాల్గొన్నారు. అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించగా... అవార్డుల మీద అవార్డులు వచ్చారు. దేశంలోని పలు నగరాలకు వరంగల్ రోల్‌మోడల్‌గా మారింది. కానీ.. పలు కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోరుంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం.. రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్సిటీపై సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టి కేంద్రీకరించారు. 2012లో... ట్రైసిటీ పరిధి చెత్తను సేకరించేందుకు 600 రూట్లను ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు తోపుడు బండి, ఒక మగ, మరో ఆడ కార్మికులను కేటాయించారు. ఇద్దరు కార్మికులు రోజు వారీగా 250 నుంచి 300 ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను సేకరించడం ప్రారంభించారు. చెత్త కుండీల రహిత నగరంగా మార్చేశారు. కార్మికులు సేకరించి తడి,పొడి చెత్తను తూకం వేయడం, పనితీరును పర్యవేక్షించడం కొనసాగింది. డ్రై వేస్ట్ సెంటర్‌కు పొడి చెత్తను తరలించడం, వేరు చేసి పలు సంస్థలకు విక్రయించారు. తడి చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలించడం... అక్కడ ప్రత్యేక యంత్రం ద్వారా శుద్ధి చేశారు. కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో విధులు నిర్వర్తించారు. కార్మికులకు ప్రోత్సాహం, కాలనీ ప్రజలను బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆరు నెలల పాటు క్లిన్‌సిటీ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. దీంతో కార్పొరేషన్‌కు ప్రశంస పత్రాలు, దేశ వ్యాప్త అవార్డులు వరించాయి. కొంత కాలం తర్వాత ప్రధాన రహదారుల్లో వ్యాపార,వాణిజ్య సంస్థల నుంచి పొడి చెత్తను సేకరించడంలో సిబ్బంది వెనుకబడిపోయారు. ఇంటింటా ఉదయం 6 గంటల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగింది. దుకాణాలు ఉదయం 10 నుంచి 11 గంటలకు తెరవడం వల్ల సకాలంలో షాపుల నుంచి చెత్తను సేకరించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనిమిచ్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ 150 చెత్త కుండీలను తెప్పించి, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయించారు. అనంతరం కమిషనర్ వివేక్‌యాదవ్ బదిలీ బాట పట్టారు. తదుపరి కమిషనర్ సువర్ణపండాదాస్ బాధ్యతలు స్వీకరించారు. తడి, పొడి చెత్త సేకరణపై అప్పటి కమిషనర్ దృష్టి కేంద్రకరించకపోవడంతోపాటు మొత్తం చెత్తను డంప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు.విద్యుత్ తయారీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పారిశుద్ద్య కార్మికులు తడి,పొడి చెత్తను కలిపి ఇంటింటా సేకరించడం తోపుడుబండ్ల ద్వారా వాహనాలకు చేర్చడం, అక్కడి నుంచి డంపింగ్ యార్డులోకి చేరడం ప్రారంభమైంది. దీంతో యార్డులో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోరుుంది. దీంతో క్లీన్‌సిటీ కార్యక్రమం పూర్తిస్థారుులో అటకెక్కింది. గత తప్పిదాలు, లోటుపాట్ల నేపథ్యంలో క్లీన్సిటీలో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు... రూట్ల విభజన 2012లో 600 రూట్లలో ఇంటింటా తడి,పొడి చెత్త సేకరించారు. ప్రస్తుతం విస్తరించిన నగరంలో మరి న్ని రూట్లు విభజించి సిబ్బందికి కేటారుుంచాలి. క్షేత్రస్థారుులో పర్యవేక్షణకు అధికారులను నియమించాలి. తడి, పొడి చెత్త.. ఇంట్లో వెలువడిన వ్యర్థాలను తడి, పొడి చెత్త రూపంలో వేర్వేరుగా వేసేలా నగర ప్రజల్లో పూర్తిస్థారుులో అవగాహన కల్పించాలి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని, ఈ మేరకు సహకరించేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. పొడి చెత్తను ఏ రోజుకు ఆ రోజు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ల నుంచి వెలువడిన వ్యర్థాలను బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఎప్పటికప్పుడు తరలించేలా పటిష్ట ఏర్పాటు చేయూలి. సేకరణ, నిర్వహణ కీలకం... పారిశుద్ధ్యం విషయంలో చెత్త సేకరణ, నిర్వహణ కీలకాంశాలు. ఇందుకోసం మహా నగర పాలక సంస్థ ఏటా కోట్లాది రూపాయాలు వెచ్చిస్తున్నప్పటికీ... పరిస్థితిలో ఆశించిన మార్పులు రావడం లేదు. నగర పరిధిలోని ప్రతి ప్రాంతానికి.. నిర్ధిష్ట సమయంలో తోపుడు బండ్లు, ట్రాలీలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. సమన్వయం.. ప్రోత్సాహకం.. పర్యవేక్షణ కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో పనిచేయూలి. కార్మికులకు ప్రోత్సాహకాలు అందించి వారిలో ఉత్తేజం నింపాలి. అదేవిధంగా అధికారులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. వాహనాలపై నిఘా పెట్టాలి.. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి రోజూ చెత్తను తరలించడానికి సరిపడా వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్లు, ఆటోలు, క్యాంపాక్టర్లులు మొత్తంగా 70 వరకు ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో నడిపించే వారు లేరు. వాహనాల పని తీరుపై నిఘా లేదు. ఇంటర్నెట్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటలేరు. కాంట్రాక్టు డ్రైవర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ మేరకు గాడినపెట్టాలి. వాహనాలపై నిఘా ఉంచాలి. ఖాళీపోస్టులు భర్తీ చేయాలి.. క్లీన్‌సిటీ సక్రమ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ఉండాలంటే ఉద్యోగులు, అధికారుల కొరత లేకుండా చూడాలి. ప్రస్తుతం మహా వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదోన్నతులపై ఏఈలు, టీపీఎస్‌లు, టీపీబీఓలు బదిలీపై వెళ్తున్నారు. వీరి స్థానంలో కొత్త వారు రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. రోజురోజుకూ విస్తరిస్తున్న కొత్త కాలనీలతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జీఓ ఎంఎస్ నెంబర్ 151 ప్రకారం కార్పొరేషన్‌కు 103 పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగేళ్లలో జరగాలి. కానీ.. కేవలం పది నుంచి పదిహేను మంది అధికారులు, ఉద్యోగుల పోస్టుల మంజూరయ్యాయి. అంత్యంత కీలకమైన సీటి ప్లానర్, ఎంహెచ్ఓ, ఆరోగ్యశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయూలి. ప్రజలను భాగస్వాములను చేయాలి.. బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇళ్లల్లో వెలువడిన తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోజు చెత్త అందించే బాధ్యతను కట్టబెట్టాలి. లేనిపక్షంలో జరిమానాలు విధించాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోజు గడపగడపనూ తట్టాలి. కాలనీ వారీగా క్లీన్‌సిటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. వారికే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలి. అప్పడే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టిసారించాలి... సేంద్రియ ఎరువు తయారీకి మడికొండ డంప్‌యార్డులో సూమారు రూ.40లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లను నిర్మించారు. తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులో ప్రత్యేక మిషన్ ద్వారా జల్లెడ పట్టినప్పటికీ సేంద్రియ ఎరువు తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ మేరకు వీటిపై దృష్టిసారించాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువును విరివిగా తయారు చేసి సరసమైన ధరకు విక్రరుుంచాలి. బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి... చెత్త ప్రక్షాళన నిబంధనావళిలో భాగంగా హన్మకొండలో చిల్డ్రన్ పార్కులో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వ్యర్థాలు తీసుకెళ్లి, ఎర్రల సహాయంతో సేంద్రియ ఎరువు తయారు చేసి బయోగ్యాస్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం అవరణలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా.. అందుబాటులోకి రాలేదు. దీన్ని అందుబాటులోకి తెస్తే కొంతమేరనైనా విద్యుత్ సమస్య తీరుతుంది. -
చదువుల తోట..
సీతారాంనాయక్.. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ. దేశఅత్యున్నత చట్టసభలో సభ్యుడు. మొన్నటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యూనివర్సిటీ నుంచి లోక్‌సభకు వెళ్లిన సీతారాంనాయక్.. మళ్లీ ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం.. యూనివర్సిటీలో పరిస్థితులపై విద్యార్థి నాయకులతో, అధ్యాపకులతో ‘సాక్షి’ ప్రతినిధిగా ముచ్చటించారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ : తెలంగాణ సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. తెలంగాణలో విశ్వవిద్యాల యాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఎలా ఉండాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? బి.వీరేందర్(పార్ట్ టైం లెక్చరర్) : సమైక్య రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు పీజీలు, పీహెచ్డీ పట్టాలు తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి చదువుల తోటఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలోని చట్టాలే ఇప్పుడు ఉన్నారుు. అప్పటి ఉమ్మడి విధానమే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మోహన్‌రాజ్(టీఎఫ్ఏడీ అధ్యక్షుడు) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంతో ఆ ఫలాలు అందుతాయని విద్యార్థులు త్యాగం చేసిండ్లు. కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను, కొఠారి కమిషన్ ప్రకారం కామన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలి. విద్యార్థులకు ఎన్నికలు జరగాలి. దీనివల్ల రాజకీయంగా చైతన్యమవుతారు. సీతారాంనాయక్ : కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు చేస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చల్లా శ్రీనివాస్(కుర్సా అధ్యక్షుడు) : భారతీయ విద్యా విధానం ఇప్పటివరకు శాస్త్రీయంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మన విద్యా విధానంలోకి వస్తే మన విద్య కుంటుబడుతుంది. మన విద్యార్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు. గ్రామీణ విద్యార్థి ఒకేసారి పెట్టుబడిదారీ విధానానికి అలవాటుపడలేదు. మన ఆచార, సంస్కృతి కూడా భ్రష్టుపడుతుంది. సీతారాంనాయక్ : అటానమస్పై మీ అభిప్రాయం ఏమిటి? డిగ్రీ కాలేజీలకు విశ్వవిద్యాలయంతో సంబంధం ఉండదు? ప్రైవేటు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అంటున్నారు? కొంగర జగన్(కుర్సా వర్కింగ్ ప్రెసిడెంట్) : ప్రైవేటు కాలేజీలకు అటానమస్ ఇస్తే విద్య ప్రైవేటు పరమవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ, విద్యా విధానం ప్రైవేటు పరమైపోతాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పీజీ సెంటర్లకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇస్తే బాగుంటుంది. అకడమిక్ విద్య దెబ్బతినదు. ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. విద్య అనేది ప్రభుత్వమే నిర్వహించాలి. సీతారాంనాయక్ : కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న కొన్ని పేరున్న సంస్థలు.. అప్‌గ్రేడ్ చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా చేయాలని కోరుతున్నారుు? దీనిపై మీ అభిప్రాయం? ఎం.చిరంజీవి(పీడీఎస్‌యూ) : ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటం చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రూ.వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వొద్దనేది మా అభిప్రాయం. సీతారాంనాయక్ : పీహెచ్డీ పూర్తి చేసిన వారు ప్రైవేటు కాలేజీల్లో నామమాత్రపు జీతాలకు పని చేస్తున్నారు. విద్యార్థులకు క్యాలిబర్‌ను బట్టి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కోర్సులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఓడపెల్లి మురళి(టీబీఎస్ఎఫ్) : అన్ని ప్రభుత్వాలు సైన్స్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసివేయాలని ప్రయత్నించారు. అప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఆర్ట్స్ గ్రూపులు అలాగే ఉన్నారుు. ఆర్ట్స్ గ్రూపులతో ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాసుదేవరెడ్డి(టీఆర్ఎస్వీ): బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే విద్యా విధానంలో మార్పులు చేయాలి. సమైక్య రాష్ట్రంలో భారీగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. నాణ్యత కొరవడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యంకాదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు రావాలి. హైదరాబాద్‌లో ఇప్పటికే సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమలకు పనికి వచ్చే నిపుణత కలిగే కోర్సులను తీసుకురావాలి. ఎంబీబీఎస్లాగే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు కాలేజీలకు, పరిశ్రమలకు అనుబంధం ఉండాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా, ఉపాధి పరంగా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు? వలీ ఉల్లాఖాద్రీ(ఏఐఎస్ఎఫ్) : సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ విషయంలో ప్రతిసారి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను పట్టించుకోలేదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, కేయూలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలి. ఉపాధి, జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు ఉండాలి. సీతారాంనాయక్ : కాంట్రాక్టు ఉద్యోగ విధానం ఎందుకొచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటీ? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి? దుర్గం సారయ్య(పీడీఎస్‌యూ) : చంద్రబాబు హయూంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక.. కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్న వారు.. కుటుంబానికి తిండిపెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. విద్యా, ఉపాధి విషయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీఎం కొడుకు, పేద పిల్లవాడు ఒకేచోట చదివేలా కామన్ విద్యా విధానం ఉండాలి. సీతారాంనాయక్ : ప్రాథమిక విద్యా ఎలా ఉండాలి? కులాల పేర్లతో హాస్టళ్లు ఉన్నాయి. ఇలా ఉంటే విద్యార్థుల్లో న్యూనత భావం ఏర్పడుతుంది. దీనిని ఎలా చేస్తే బాగుంటుంది? సుత్రపు అనిల్(పీడీఎస్‌యూ) : ప్రాథమిక విద్య అనేది కుల, మత బేధం లేకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రీప్రైమరీ, ఆశ్రమ, గురుకుల, సాంఘిక సంక్షేమం, ఐటీడీఏ స్కూళ్లు ప్రాథమిక విద్యలో 12 రకాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లో హాస్టల్స్‌పై మీ అభిప్రాయం ఏమిటీ? హాస్టళ్ల ప్రైవేటీకరణ ఉండాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎలా ఉంటే బాగుంటుంది? మాతంగి మురళి(టీఎన్ఎస్ఎఫ్) : తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదుకునేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. కాంట్రాక్టు, ప్రైవేటు మెస్ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది. రంజిత్(టీఆర్ఎస్వీ) : వర్సిటీల్లో గ్రామీణ, పేద విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతో మెస్ కమిటీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అపాయింట్మెంట్లు జరగడం లేదు. వీసీలుగా వచ్చిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. నాట్ టీచింగ్ రిక్రూట్మెంట్ విషయంలో ఎలా వ్యవహించాలి? పి.కొండల్‌రెడ్డి(ఉద్యోగుల జేఏసీ చైర్మన్) : ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌లో అర్హత, నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రావాలి. కేయూలో ఏడాదిగా నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగలేదు. వైస్ చాన్సలర్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఉండాలి. దీని వల్ల అక్రమాలను నివారించవచ్చు. సీతారాంనాయక్ : వర్సిటీలో వీసీలను ఘెరావ్ చేయడం లేదా రిజిస్ట్రార్లను బయటపెట్టడం తరచుగా చూస్తున్నాం. ఇలాంటి గొడవలకు కారణమేమిటీ? కె.శంకర్(ఎన్జీవోస్, కేయూ, అధ్యక్షుడు) : వ్యవస్థ అన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటరు. యూనివర్సిటీలోనూ స్వార్థపరులు ఎక్కువైనప్పుడు పరిపాలన సరిగా ఉండదు. ఉన్నతాధికారులు పరిపాలన విషయంలో నిక్కచ్చిగా ఉంటే ఏమీ జరగదు. కేయూలో నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడంలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయం పరిరక్షణ విషయంలో అకుట్ ఏ రకమైన బాధ్యత నిర్వర్తిస్తోంది? డాక్టర్ వెంకయ్య(అకుట్) : ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో అకుట్ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే మేం స్పందించి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు లేఖలు రాశాం. సీతారాంనాయక్ : కేయూలో ఉత్తరాలు రాయడం మొదటి నుంచి ఉంది. ఉత్తరాలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కేయూ భూమి 554 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 500 ఎకరాలు కూడా లేదు. భూ ఆక్రమణల విషయంలో మీరు ముందుండడం లేదు? డాక్టర్ వెంకట్ : గతంలో పరిపాలన పరంగా తప్పులు దొర్లారుు. యూనివర్సిటీ వైపు నుంచి సరైన చర్యలు తీసుకోలేదు. వీసీ, రిజిస్ట్రార్ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సీతారాంనాయక్ : వాళ్లు చేయలేదు సరే. మీరేం చేశారు? అకుట్గా మీరు చేయాల్సి ఉండె కదా? డాక్టర్ వెంకట్ : జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఐదు నెలలుగా వీసీ లేరు. దీనిపై మా వంతుగా చర్యలు చేపడుతాం. సీతారాంనాయక్ : దూరవిద్య అనేది యూనివర్సిటీ నిధుల పరంగా ఉత్పత్తి కేంద్రం. ఎస్డీఎల్సీఈలో అక్రమాలు జరుగుతున్నాయని చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం. ఇలాంటివి జరుగుతాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వల్లాల తిరుపతి(ఉద్యోగి) : యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఎస్డీఎల్సీఈని నడుపుతోంది. కొందరు అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారుబాతులాగే చూస్తున్నారు. రెవెన్యూ తీసుకుంటున్నారుగానీ, అక్కడ ప్రక్షాళన జరగడం లేదు. సీతారాంనాయక్ : మీకూ అధికారాలు ఉన్నారుు కదా? డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ అందరు ఉన్నారు కదా? అలాంటివి ఎందుకు జరుగుతాయి. అపనిందలు ఎందుకు వస్తాయి? వల్లాల తిరుపతి : వీరికి నామమాత్రపు అధికారాలే ఇచ్చారు. ఏదీ చేయాలన్నా మళ్లీ వీసీ, రిజిస్ట్రారు అనుమతి తీసుకోవాల్సిందే. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లోని పరిశోధనల విషయంలో నానారకమైన భావనలు వ్యక్తమవుతున్నాయి. సూపర్వైజర్ల లోపం ఏమైనా ఉందా? ఇటీవల కొత్త నామ్స్ వచ్చాయి. గైడ్‌గా నియమించిన వారి వద్దే విద్యార్థి పరిశోధన పూర్తి చేయాలని ఉంది. ఇది మంచిదా? పాత విధానమే మంచిదా? డాక్టర్ ముస్తఫా(అసిస్టెంట్ ప్రొఫెసర్) : పరిశోధనకు సంబంధించిన విద్యార్థులకు మెరిట్ కంటే ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. ఎవరికీ బిగినింల్లో ఏమీ రాదు. నేర్చుకుంటే అనుభవపరంగా ఎంతో వస్తుంది. ఆసక్తి ఉన్న వారికే అవకాశం కల్పించాలి. ప్రొఫెసర్ తెలిసిన విద్యార్థులకు గైడ్లుగా ఉంటే మంచిది. కొత్త వారితో అయితే కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వసతులు సరిపోవు. ఉన్నత ప్రమాణాలతో ఉండాలి. దీని కోసం ప్రయత్నించాలి. -
రాజధాని లేదు.. నిధులు లేవు...
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు కదిలిరావాలి ఏపీ ఉభయసభల సమావేశంలో గవర్నర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యాంధ్రప్రదేశ్ విభజన తీరు తీవ్ర అసంతృప్తిని, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అధిక భాగం ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, ఆశలు నెరవేరలేదు. అశాస్త్రీయ విభజన తీరు తెలుగు ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ గాయాలు మానడానికి కొంత సమయం పడుతుంది’’ అని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. విభజనానంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని గానీ, రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు గానీ లేవన్నారు. జపాన్, సింగపూర్ ప్రేరణతో మహోద్యమంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కదిలిరావాలని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం అందరి లక్ష్యం కావాలన్నారు. గవర్నర్ శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు.. ఉదయం 8:50 గంటలకు సభలోకి ప్రవేశించిన గవర్నర్‌కు సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. నరసింహన్ కుడి ఎడమల శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు ఆశీనులయ్యారు. జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ఇంగ్లిష్‌లో కొనసాగించారు. చివర్లో తిరిగి తెలుగులో మాట్లాడి తన 26 పేజీల ప్రసంగాన్ని ముగించారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను గత 58 ఏళ్లలో దాదాపు 13.20 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే దానికి తగ్గట్టుగా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పరిహారం రాలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఏడు కీలక రంగాలకు చెందిన స్థితిగతులపై శ్వేతపత్రాలను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోందని, తమ ముందున్న పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. -
ఇప్పుడున్న రాష్ట్రంలోనే ఎన్నికలు
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారమే.. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎన్.సంపత్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లోను ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లోను మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తాము రాజ్యంగం, చట్టం ప్రకారమే వెళ్తామని.. అంటే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే ఎన్నికల నాటికి, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని సంపత్ చెప్పారు. పైగా తాము ఎక్కడికక్కడ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక్కడ నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 9. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక సీమాంధ్రలో ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. -
ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు
ప్రస్తుతానికి మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా ఉందని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున రిజర్వేషన్ల కోటా కూడా మారే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ ఇంకా రెండు రాష్ట్రాలుగా విడిపోలేదని, ఇప్పటికి గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, అపాయింటెడ్ డేను ఇంకా ప్రకటించలేదని.. ఆ రోజు తర్వాత మాత్రమే రాష్ట్రం విడిపోయినట్లు అవుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని వ్యాఖ్యానించింది. -
రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి ఇంకా కలిసే ఉందని, ఇంకా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు చెప్పే సందర్భంలో ఏయే రాష్ట్రంలో ఎంతమందికి వివిధ పథకాల కింద లబ్ధి చేకూరుతుందని వివరిస్తున్నప్పుడు ఆయనీ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 19వేల మందికి లబ్ధి కలుగుతుందని జైరాం రమేష్ చెబుతున్నప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులు తెలంగాణకా.. సీమాంధ్రకా అని అడిగినప్పుడు జైరాం రమేష్ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రం ఇంకా సమైక్యంగానే ఉందని, విభజనకు సమయం ఉందని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. -
సమైక్య స్టార్ జగన్
పార్టీ మారడంలో నాది స్వార్థం కాదు.. ఆవేదనే: మాజీ మంత్రి ధర్మాన శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనే నిజమైన సమైక్య స్టార్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తర్వాత అంతటి నాయకత్వం లేదని, ప్రస్తుత రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు, తండ్రి ధీరత్వం, రాజసం జగన్‌లో ఉన్నాయన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్ నాయకత్వంలో వస్తుందన్న ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. సమైక్య నినాదాన్ని 2010లోనే పార్లమెంట్లో విన్పించిన నాయకుడు జగన్ ఒక్కడేనని చెప్పారు. ‘‘సమైక్య చాంపియన్లు అని ఎవరికి వారు అనుకుంటే సరిపోదు. ప్రజలంతా జగన్నే సమైక్య స్టార్‌గా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో నూరు శాతం సీట్లను గెలిపించుకుని వైఎస్సార్సీపీని అధికారంలో తేవడమే మా లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు. తాను పార్టీ మారడంలో ఎలాంటి స్వార్థం లేదని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న ఆవేదనతో, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర విభజనలో అధికార పార్టీని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమయ్యారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం 2 ప్రసార సాధనాలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆకలి, కన్నీరును రాజకీయం చేస్తున్న, చేసిన ఘనత బాబుకే దక్కుతుందని, అదే సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీటిని తుడిచేలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. సోనియాకు రాజీనామా లేఖ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కొంటూ సోనియాగాంధీకి ఆదివారం ఉదయం ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.