
వాతావరణంలోని పెనుమార్పులకు, ఆ మార్పులు వల్ల సంభవించబోయే విపత్తులకు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే కారణమని పదహారేళ్ల స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ చేసిన ప్రకటన ఐక్యరాజ్యసమితి దృష్టి వరకు వెళ్లింది. గ్రెటా తాజాగా ‘వేకప్’ (మేల్కొండి) అంటూ యు.ఎస్.పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. గత ఏడాది తరగతి గది నుండి బయటికి వచ్చి తక్కిన పిల్లలతో పాటు స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ‘వాతావరణాన్ని కాపాడండి’ అని నినాదాలు చేయడంతో గ్రేటా గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది.