గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది.
గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్‌పెరిమెంట్స్
యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్‌వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది.
శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్‌గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment