Pentagon
-
అమెరికా యుద్ధనౌకపై హూతీల దాడి: పెంటగాన్
న్యూయార్క్: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే.. హైతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోనన్లు, క్షిపణులను యుద్ధనౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పి కొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక.. ఈ ఘటనలో యుద్ధనౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.‘‘అమెరికా యుద్ధనౌకలపై ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబల్స్ దాడికి పాల్పడ్డారు. అయితే.. వాటిని యుద్ధనౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధనౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు.. అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై కూడా దాడి చేశామని హుతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా.. హుతీ తిరుగుబాటుదారుల దాడి జరగలేదు’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.నవంబర్ 2023లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో హుతీ రెబల్స్ పలు నౌకలపై దాడి చేయడం మొదలుపెట్టారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు త్యరేకంగా హౌతీ తిరుగుబాటుదాడులు ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలపై నౌకలపై దాడులకు దిగుతున్న విషయం తెలిసింది. ఇక.. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా.. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో ఇరాన్ మద్దతుగల గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయి. -
ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కు దాడుల ముప్పు: అమెరికా
న్యూయార్క్: ఇరాన్, ఆ దేశానికి చెందిన అనుబంధ మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌కు దాడుల ముప్పు పొంచి ఉందని అమెరికా వెల్లడించింది. ఆదివారం తమ సీనియర్ కమాండర్‌ను హత్య చేసినందుకు ప్రతీకారంగా లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ వందల రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్‌కు మరోసారి దాడుల ముప్పు పొంచిఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ పాట్రిక్ రైడర్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి మరోసారి దాడి పొంచి ఉందని మేము అంచనా వేస్తూనే ఉన్నాం. ఇరాన్ నేతలు, ఇతరులు చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలే మా అంచనాకు నిదర్శనం’ అని అన్నారు.అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ దూకుడు చర్యలు గతంలో ఎప్పుడు లేనంతగా ఉన్నాయని అన్నారు. ఇరాన్ దూకుడు చర్యలను ఆమెరికాతో కలిసి ఎదుర్కొవడానికి సిద్ధగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆదివారం నాడు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లాను గ్రూప్ లక్ష్యంగా దాదాపు 100 మిసైల్స్ ప్రయోగించింది. తమపై దాడిని అడ్డుకునే ముందస్తు చర్యలల్లో భాగంగా ఈ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ పెర్కొంది. -
Pentagon: హౌతీ రెబెల్స్‌పై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్ : ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజాగా హౌతీ మిలిటెంట్లు వాణిజ్య నౌకలపై ప్రయోగించిన డజన్ల కొద్ది డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. హౌతీలు ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్ల వల్ల నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నౌకల్లోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారని పెంటగాన్ తెలిపింది. మొత్తం 12 డ్రోన్లు, 3 యాంటీ షిప్ మిసైళ్లు, రెండు లాండ్ ఎటాక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక వాణిజ్య నౌక లక్ష్యంగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపినట్లు హౌతీ రెబెల్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని మిలిటరీ స్థావరాలపైనా డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడులు మొదలు పెట్టారు. ఇదీచదవండి..పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ -
Drone Attack: అమెరికా సంచలన ప్రకటన
వాషింగ్టన్: గుజరాత్‌లోని పోర్బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ నౌక కెమ్ ప్లూటో మంగళూరు వెళుతోంది. ఈ నౌకపై భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్‌ను ఇరాన్ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం 2021 నుంచి ఇది ఏడోసారి’అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్ ఇంత వరకు స్పందించలేదు. ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హతీ రెబెల్స్ దాడి చేస్తుండగా భారత సమీపంలో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్ దాడి తామే చేశామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడికి గురైన కెమ్ప్లూటోకు భారత కోస్ట్‌గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోంది. ఇదీచదవండి..హిందూ ఆలయంపై విద్వేష రాతలు -
‘హిరోషిమా’ కంటే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీ: అమెరికా
వాషింగ్టన్: అటు ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా–ఉక్రెయిన్ యుద్ధం. ఇటు తాజాగా పాలస్తీనా–హమాస్ పోరు. ఇంకోవైపు భయపెడుతున్న చైనా–తైవాన్ తదితర ఉద్రిక్తతలు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్ అణు బాంబును తయారు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అది రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తిమంతంగా ఉండనుందని వెల్లడించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు లెక్కలేనంత జన నష్టానికి దారితీయడం తెలిసిందే. ఆ విధ్వంసాన్ని తలచుకుని జపాన్ ఇప్పటికీ వణికిపోతుంటుంది. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. బి61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ బాంబును బి61–13గా పిలుస్తున్నారు. దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది. అంతేగాక తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను 2030 కల్లా 1,000కి పెంచనున్నట్టు కూడా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..?
ప్యోంగ్ యాంగ్: అమెరికాకు చెందిన సైనికుడు అక్రమంగా నార్త్ కొరియాలోకి చొరబడ్డాడన్న కారణంతో అతడిని బంధించింది అక్కడి సైన్యం. దీంతో నార్త్ కొరియా చెర నుండి అమెరికా సైనికుడు అసలు బయటపడతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అమెరికాకు చెందినవారు 18 మంది నార్త్ కొరియాలో బందీలుగా ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు నెలల్లోనే విడుదలయ్యారు. ఎవరీ ట్రావిస్ కింగ్? అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్(23) విస్కాన్సిన్లో అమెరికా దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 2021 జనవరిలో యూఎస్ ఆర్మీలో చేరిన కింగ్ కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాలో కూడా ఇలాగే అక్రమంగా చొరబడ్డాడు. రెండు నెలల పాటు అక్కడ జైలు జీవితం గడిపిన తర్వాత అతడిని టెక్సాస్ తిరిగి పంపించేయాలని నిర్ణయించాయి దక్షిణకొరియా వర్గాలు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పటికే అమెరికా సైన్యం నుండి బహిష్కరించబడిన ట్రావిస్ కింగ్ వారి నుండి ఎలాగో తప్పించుకుని ఉభయ కొరియాలకు మధ్యలో పన్ముంజోన్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి ఉత్తర కొరియా చేరుకొని అక్కడ కోమ్ జోంగ్ బలగాలకు పట్టుబడ్డాడు. అతడు ఎందుకిలా దేశాటన చేస్తున్నాడన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. తిరిగొచ్చేనా? పెంటగాన్ వర్గాలు అసలు ట్రావిస్ నార్త్ కొరియా ఎందుకు వెళ్లాడన్న కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. మరో పక్క ప్యోంగ్ యాంగ్, పెంటగాన్ వర్గాల నుంచి చర్చలకు పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది. అసలే అమెరికా ఉత్తర కొరియ మధ్య పచ్చగాడి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనికుడిని వారు విడిచి పెడతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ట్రావిస్ కింగ్ తల్లి కూడా తన కుమారుడు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని, వాడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా అమెరికా నుండి 18 మంది నార్త్ కొరియాలోకి అక్రమంగా చొరబడగా వారిలో చార్లెస్ రాబర్ట్ జెన్కిన్స్ మినహాయిస్తే మిగతా వారందరిని రెండు నెలలలోపే తిరిగి పంపించేసింది. చార్లెస్ జెన్కిన్స్ ను మాత్రం 1965 లో అదుపులోకి తీసుకుని 2004లో విడుదల చేసింది. ఇది కూడా చదవండి: తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక -
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలో ఎత్తైన భవనాలు, లగ్జరీ మాన్షన్స్ అనగానే మనకి దుబాయ్ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్ నిర్మాణం ఆసక్తికరంగా మారింది. పాపులర్ పెంటగాన్, బుర్జ్ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్ కేంద్రంగా. డైమండ్స్ అనగానే జెమ్ క్యాపిటల్, గుజరాత్‌లోని సూరత్ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేకింగ్ బిల్డింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో రానున్న భవనం పెంటగాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. (యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు ) Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv — Narendra Modi (@narendramodi) July 19, 2023 బెల్జియన్ నగరమైన ఆంట్వెర్ప్ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ నగరం ఇపుడు యుఎస్‌లోని ఆర్లింగ్టన్లోని పెంటగాన్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్‌లో నిలిచింది. ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ప్రపంచంలో టాప్‌లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్ నిర్మించడానికి నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్‌తో అద్భుతమైన ఈ భవనంలో ఈ సంవత్సరం 65వేల ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది నవంబర్‌లో అఫీషియల్‌గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్ సీఈవో మహేష్ గాధవి మాటల్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా
These wouldn't affect of Russia's special military operation in Ukraine: అఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం తాలబన్లు అఫ్గాన్‌ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్గాన్ దేశంలో ఉండలేమంటూ చాలామంది అప్గనిస్తాన్ సైనిక, వైమానిక దళ సిబ్బంది ఉజ్బెకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలకు పారిపోయారు. దీంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల హస్తగతమైంది. ఇలా అమెరికాకు పారిపోయిన అఫ్గాన్ పైలెట్లకు పెంటగాన్(యూఎస్ డిపార్ట్మెంట్ ఆప్ డిఫెన్స్) సైనిక శిక్షణ ఇస్తుందని రష్యా చెబుతోంది. ఆ సైనిక శిక్షణలో అఫ్గాన్‌కి చెందిన మాజీ పైలెట్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. వీరంతా శిక్షణ పొందిన తదనంతరం పోలాండ్ గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తారని, యుద్ధంలో పాల్గొనేలా వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుంటుందని రష్యా సైనిక దౌత్యవేత్తలు పేర్కొన్నట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ఐతే రష్యా మాత్రం తాము ఉక్రెయిన్‌లో జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యను ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పింది. రష్యాను నియంత్రించడం అసాధ్యం అని ధీమాగా చెబుతోంది. ఐతే యూఎస్ నుంచి ఈ విషయమై ఎలాంటి ప్రతిస్పందన లేదు. అలాగే పలు నివేదికల ప్రకారం... అఫ్గాన్‌లో స్పెషల్ వింగ్‌కు చెందిన పలువురు పైలెట్లు తమ విమానాలను ఇతర దేశాల సరిహద్దుల గుండా నడిపినట్లు పేర్కొంది. పైగా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పారిపోయిన అనేకమంది పైలెట్లును తజికిస్తాన్ అధికారులు మూడు నెలలకు పైగా నిర్బంధించారని కూడా తెలిపింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం కూడా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 100 మంది అఫ్గాన్ సైనిక సిబ్బంది మరణించారని, చాల సైనిక కుటుంబాలు దేశం విడిచి పారిపోయినట్లు యూఎన్ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో డజన్ల కొద్ది అఫ్గాన్ భద్రతాదళాల సభ్యులను ఉరితీసినట్లు పేర్కొంది. అంతేకాదు అఫ్గాన్ మాజీ భద్రతా దళ సభ్యుల కుటుంబాలను సైతం తాలిబన్లు వదలలేదని తెలిపింది. (చదవండి: పారిపోండి.. చస్తారు! రష్యా బలగాలకు జెలెన్స్కీ సాలిడ్ వార్నింగ్.. ఖేర్సన్లో మిస్సైళ్ల వాన) -
అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్
వాషింగ్టన్: ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు. అసలు ఎవరు ఈ రాధా అయ్యంగార్ ? ఎకనామిక్స్‌లో ఎంఎస్, పిహెచ్డి పూర్తి చేసిన ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేశారు. రాధా అయ్యంగార్ ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. చీఫ్స్టాఫ్గా నియమకానికి ముందు.. ఆమె ప్రముఖ సంస్థ అయిన గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. -
ఎవరీ రాధా అయ్యంగార్? ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు??
అమెరికాలో ఒక్కసారిగా వార్తల్లో నానుతున్న వక్తిగా రాధా అయ్యంగార్ నిలిచారు. ఈ ఇండో అమెరికన్ మహిళను కీలక పదవిలోకి తీసుకోవాలనే భావనలో వైట్‌హౌజ్ ఉండటంతో ఒక్కసారిగా ఈమె పేరు తెరమీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవికి ఆమె పేరును జూన్ 15న నామినేట్ చేశారు. అమెరికా రక్షణ వ్యవహరాలను పర్యవేక్షించే పెంటగాన్‌లో కీలక స్థానాలకు ఐదుగురి పేర్లను అమెరికన్ ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రతిపాదించారు. దానిలో సెక్యూరిటీ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాధ అయ్యంగార్ ప్లంబ్ కూడా ఉన్నారు. ఆమెను డిప్యూటీ అండర్ సెక్రటరీ ఫర్ డిఫెన్స్ పోస్టుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాధా అయ్యంగార్ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోదాలో పని చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లక ముందు గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలో రాధ పని చేశారు. గూగుల్‌లో రీసెర్చ్ విభాగంలో ఆమె పని చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు కొత్త అర్థం చెప్పిన ఫేస్బుక్లో పాలసీ అనాలిసిస్ గ్లోబల్ హెడ్ కొనసాగారు. అంతకు ముందు ఆమె ఎకనామిస్ట్‌గా కూడా అనుభవం గడించారు. హర్వార్డ్, ప్రిన్స్టన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆమె చదువుకున్నారు. చదవండి: Sopen Shah: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
అనుమానాస్పదంగా తిరుగుతోందని కస్టడీలోకి కోడి.. ఎక్కడో తెలుసా?
వాషింగ్టన్: సాధారణంగా ఎవరైనా వ్యక్తులు అనుమానితులుగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తారు. వారికి నేరంతో ఏ సంబంధం లేదని తేల్చాక విడిచిపెడతారు. ఈ ప్రక్రియ దాదాపు అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెంటగాన్ సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి అనుమానితంగా తిరుగుతోందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక జంతు సంక్షేమ సంస్థ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో కోడి తిరుగుతూ కనిపించిందని వర్జీనియాలోని ఆర్లింగ్టన్కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో తెలిపింది. చదవండి: Viral Video: మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి భద్రతా తనిఖీ కేంద్ర వద్ద కోడి అనుమానంగా తిరుగుతుండటంతో, దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని జంతు సంరక్షణ సంఘంలోని ఓ ఉద్యోగి తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. గోధుమ రంగు ఈకలు కలిగిన ఈ కోడి పేరు హెన్నీ పెన్నీ. ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది, పెంటగాన్‌కి ఎలా వచ్చిందనే విషయాలను సంబంధిత అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ కోడిని పశ్చిమ వర్జీనియాలో చిన్న పొలం ఉండి కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. Our officers have chosen the name Henny Penny for our #pentagonchicken, and she will be going to live at a local animal sanctuary very soon! https://t.co/qQ7kfYkocM pic.twitter.com/31gugYE4tR — AWLArlington, VA (@AWLAArlington) February 1, 2022 -
అఫ్గన్‌కు సెలవు; గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్ల సంబరాలు
Last US Troops Leave Afghanistan: సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ వాషింగ్టన్ టైమ్‌తో మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది’’ అని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చింది: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆగష్టు 31లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిందన్నారు. ఇక తాలిబన్ అధికారి అనాస్ హక్కాని.. ‘‘చారిత్రాత్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా చేసిన 20 ఏళ్ల యుద్ధం ముగిసింది. 73 విమానాలు ధ్వంసం అమెరికా బలగాలు కాబూల్ నుంచి స్వదేశానికి వెళుతూ వెళుతూ విమానాశ్రయంలోని హ్యాంగర్‌లో ఉన్న 73 యుద్ధ విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ డిఫెన్స్ సిస్టమ్‌ని ధ్వంసం చేశాయి. అక్కడి 73 విమానాలను ముందు జాగ్రత్త పడుతూ ఎందుకూ పనికి రాకుండా చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెడ్ మెక్కెంజీ చెప్పారు. 70 ఎంఆర్ఏపీ ఆయుధాలు కలిగిన వాహనాలు వదిలి వెళ్లారు. ఆ ఒక్కొక్క వాహనం ఖరీదు 10 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. చివరి విమానం బయల్దేరగానే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకువచ్చారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్‌లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
మైక్రోసాప్ట్కు షాక్; టాప్‌లోకి దూసుకొచ్చిన జెఫ్ బెజోస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ సంపద మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. పెంటగాన్ కీలక ప్రకటనతో ఆయన ఆస్తులు కనీవినీ ఎరగని రీతిలో ఆకాశమే హద్దుగా దూసుకు పోయాయి. తద్వారా బెజోస్ నికరసంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ప్రధానంగా అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరగడంతో ఆయన నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) చేరడం విశేషం. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సంస్థతో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించడంతో అమెజాన్ షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. 2019 లో మైక్రోసాఫ్ట్ సంస్థతో 10 బిలియన్ డాలర్ల క్లౌడ్-కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ మంగళవారం తెలిపింది. దీంతో షేర్లు అమాంతం పుంజుకున్నాయి. మంగళవారం అమెజాన్ షేర్ విలువ 8.4 బిలియన్ డాలర్ల మే లాభపడింది. ఈ ర్యాలీతో జెఫ్ బెజోస్ సంపదన 8.4 బిలియన్ డాలర్లు పుంజుకుంది. ఫలితంగా ఆయన నికర విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది. మాకెంజీ స్కాట్ : ఇచ్చిందంతా తిరిగొచ్చింది తాజా పరిణామంతో అటు బెజోస్ మాజీ భార్య ,ప్రపంచంలోని 15 వ రిచెస్ట్ పర్సన్ మాకెంజీ స్కాట్ సంపద ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాదు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆమె దానం చేసిన 2.7 బిలియన్ల డార్లను మించిపోవడంమరో విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో 210 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ టాప్ ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును జెఫ్ బెజోస్ బద్దలుకొట్టి అపరకుబేరుడి రికార్డును మరోసారి చేజిక్కించుకున్నారు. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల సుదీర్ఘ కరియర్ తరువాత ఇటీవల అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
‘ఆ మర్మాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేము’
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి. వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది. శత్రుదేశాల పనికాదు! వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం. కొత్తగా ఏముందంటే.. శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది. -
పాకిస్తాన్‌కు రక్షణ సాయం ఇకపైనా ఉండదు: అమెరికా
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు రక్షణ సహాయం (సెక్యూరిటీ అసిస్టెన్స్) విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాన్నే కొనసాగించాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. అయితే, భవిష్యత్తులోనూ రక్షణ సాయం రద్దును ఇలాగే కొనసాగిస్తారా? లేక ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. రక్షణ పేరిట పాకిస్తాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 2018 జనవరిలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో పాకిస్తాన్ పాత్ర, సహకారం పట్ల సంతృప్తి కలగడం లేదని, అందుకే రక్షణ సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఏలియన్స్ నిజంగానే ఉన్నారా?
ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత అధునాతన టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఇప్పడు ఈ టెక్నాలజీ నుంచి ఏలియన్స్ కూడా తప్పించుకోలేకపోయాయి. ఏలియన్స్ సంబందించి ఒక లీకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి. ఈ వీడియోను గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్న వారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దీనిపై స్పందించింది. లీకైన ఫొటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బందే తీశారని చెప్పింది. ఐతే వాటిలో ఉన్నది యూఎఫ్ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్ఎ టుడే ప్రకారం యుఎస్ ప్రభుత్వం యుఎఫ్ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by JEREMY KENYON LOCKYER CORBELL (@jeremycorbell) ఈ వీడియోలు, ఫొటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి లీక్ అయ్యాయి. గత రెండేళ్లుగా పెంటగాన్ అధికారులు ఏలియన్స్ ఉన్నాయి అనేలా ప్రకటనలు చేస్తున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ సడెన్‌గా మాయమవుతున్న ఆ విచిత్ర వస్తువులు ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
చట్టాలకు లోబడే నేవీ ఆపరేషన్స్: పెంటగాన్
వాషింగ్టన్: భారత్‌లోని లక్షద్వీప్ సమీపంలో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ని చేపట్టడాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ఎఫ్‌ఓఎన్‌ఓపీలో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత్ పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ తీవ్ర అభ్యంతరం తెలపడంపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ‘మాల్దీవులకు సమీపంలో ఆ దేశ ఈఈజెడ్ పరిధి లోపల ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సాధారణ ఆపరేషన్స్ చేపట్టడం ద్వారా నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్ఛను, హక్కులను నిర్ధారించాం’ అని తెలిపారు. (చదవండి: భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య) -
యూఎస్ డిఫెన్స్: కశ్యప్ పటేల్‌కు కీలక పదవి
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్ పటేల్‌ను) అమెరికా రక్షణ కార్యదర్శి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించారు. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ రక్షణ కార్యదర్శిగా మార్క్ ఎస్పర్‌ను ట్రంప్ తొలిగించిన ఒకరోజు తర్వాత ఈ నియాయకం జరిగింది. ‘మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ స్థానంలో క్రిస్ మిల్లర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెన్ స్టీవర్ట్ స్థానంలో ఇండో-అమెరికాన్ కశ్యప్ పటేల్‌ను నియమించారు. గతంలో వైట్‌హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో జాతీయ ఉగ్రవాద నిరోధక సీనియర్ న్యాయవాదిగా పటేల్ పనిచేశారు. 2019 జూన్‌లో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) సీనియర్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. (రక్షణ శాఖా మంత్రి మార్క్ ఎస్పర్ తొలగింపు! ) న్యూయార్క్‌లో జన్మించిన కశ్యప్ పటేల్‌కు భారత్‌లోని గుజరాత్ మూలాలున్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. 1970లో కెనడా నుంచి వచ్చి అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. స్కూలింగ్ అనంతరం ఫ్లోరిడాలో పై చదువులు అభ్యసించిన కశ్యప్ పటేల్ వాషింగ్టన్ డీసీకి ప్రాసిక్యూరట్గా పనిచేశారు. ఆ తర్వాత తూర్పు ఆఫ్రికా, కెన్యా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్ కమాండో సభ్యునిగా యూఎస్ ప్రభుత్వం నియమించింది. (అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ) -
ట్రంప్‌పై విరుచుకుపడ్డ డిఫెన్స్ మాజీ చీఫ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ డిఫెన్స్ మాజీ చీఫ్ జిమ్ మాటిస్ విరుచుకుపడ్డారు. అమెరికన్లను విభజించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, నిరసనలతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో పరిణితికలిగిన నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అమెరికన్లను సమైక్యపరిచేందుకు ప్రయత్నించని తొలి అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అని అగ్రరాజ్య అధ్యక్షుడి తీరుపై మండిపడ్డారు. పౌరులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించకపోగా ట్రంప్ తమను విడదీస్తున్నారని మాటిస్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పరిణితి కలిగిన నాయకత్వం కొరవడిన పరిణామాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సాగుతున్న వర్ణవివక్ష ర్యాలీలకు మద్దతు ప్రకటించిన పెంటగాన్ మాజీ చీఫ్ మాటిస్ సిరియాలో అమెరికన్ దళాల ఉపసంహరణపై ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018 డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: జార్జ్ ఫ్లాయిడ్ నిరసనలు.. ట్రంప్‌కు షాక్ -
‘తెల్లగా, సూట్‌కేస్ సైజ్‌లో ఉంది’
వాషింగ్టన్: యూఎఫ్ఓ (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)ల గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో గత నెలలో అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గుర్తు తెలియని వస్తువులకు సంబంధించిన మూడు వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ యూఎఫ్‌వోల గురించి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చలు ఇలా కొనసాగుతుండగానే ది డ్రైవ్ అనే మిలిటరీ వెబ్సైట్ ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని నివేదికలను ప్రచురించింది. వీటిలో ఏడు నివేదికలు 2013, 2014 మధ్య కాలం నాటికి సంబంధించినవి కాగా, ఎనిమిదవ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించింది. వీటిలో అమెరికా నావీ అధికారుల తమకు ఎదురైన అనుభవాలను తెలియజేశారు. జూన్ 27, 2013 నాటి మొదటి నివేదికలో ఇలా ఉంది ...స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 11 ఒక విమానాన్ని గుర్తించింది. అది తెలుపు రంగులో ఉండి డ్రోన్ లేదా మిస్సైల్ పరిమాణంలో ఉంది’ మార్చి 26, 2014 నాటి నివేదికలో ఇలా ఉంది "చిన్నగా సూట్‌కేస్ పరిమాణంలో, వెండి రంగులో విమానం ఆకారంలో ఉన్న ఓ చిన్న గుర్తు తెలియని విమానాన్ని గుర్తించాం. పైలట్ దానికి 1,000 అడుగుల సమీపం వరకు వెళ్లగలిగాడు.. కానీ దాన్ని గుర్తించలేకపోయాడు అని వెల్లడించింది. తాజాగా 2019, ఫిబ్రవరి 13న వెల్లడించిన రిపోర్టులో ఓ యుద్ధ విమాన సిబ్బంది 27 వేల అడుగుల ఎత్తున ఓ ఎర్రనివాతావరణ బెలూన్ లాంటి ఆకారాన్ని చూసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అమెరికన్ నావీ విడుదల చేసిన ఈ నివేదికలు ప్రస్తుతం యూఎఫ్ఓలకు సంబంధించిన చర్చను మరోసారి తెరమీదకు తెచ్చాయి. (చదవండి: ఆకాశంలో అంతు చిక్కని వస్తువు! ) -
ఆకాశంలో అంతు చిక్కని వస్తువు!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్స్ (గ్రహాంతర వాసులు వీటిని నడుపుతారని ఊహాగానం) గురించి ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. ప్రజలకూ వాటి గురించి తెలుసుకోవాలని అమితాసక్తి. తాజాగా దీనికి సంబంధించి మూడు వీడియోలను అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ విడుదల చేసింది. వీటిని "ఆకాశంలో గుర్తించడానికి వీలులేని దృశ్యాలు" అని వ్యాఖ్యానించింది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికే వీటిని రిలీజ్ చేశామని వెల్లడించింది. అయితే ఈ వీడియోలు అంతరిక్ష పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలిగించవని స్పష్టం చేసింది. ఒక వీడియోలో వస్తువు లాంటిది ఆకాశంలో తిరుగుతోంది. (ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్) దీన్ని విమానం నడుపుతున్న ఇద్దరు నేవీ పైలట్లు 2004లో కెమెరాల్లో బంధించారు. మరో రెండు వీడియోల్లో గాలిలో ఏదో వస్తువులాంటిది కదలడం కనిపిస్తుంది. వీటిని 2015లో చిత్రీకరించారు. అయితే ఈ వీడియోలు 2007, 2017లో సోషల్ మీడియాలో లీకవగా ఇన్నేళ్ల తర్వాత అమెరికా రక్షణ సంస్థ వీటిని ధృవీకరించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్‌గా నిలిచిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఏలియన్స్ వస్తున్నాయేమో.." అంటూ కొందరు అనుమానం వెలిబుచ్చగా, "అదేమై ఉంటుందో క్లారిటీ ఇస్తే బాగుండేద"ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?) -
ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్
వాషింగ్టన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీని హతమార్చినట్టు ఆ దేశ రక్షణ విభాగం(పెంటగాన్) వెల్లడించింది. ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్ ఆరోపించింది. వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి సులేమానీ బాధ్యుడని తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సులేమానీ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అలాగే ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది. వైట్ హౌస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ఇరాక్‌కు ప్రత్యేక బలగాలు పంపించారు. సులేమానీని మట్టుబెట్టడంతో అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, సులేమానీ సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రెండు ప్రత్యేక కాన్వాయ్‌లు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నాయి. అయితే సులేమానీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ దాడులు జరిగాయి. అమెరికా జెండాను పోస్ట్ చేసిన ట్రంప్.. బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడిలో సులేమానీ మృతి చెందిన కొద్దిసేపటికే డోనాల్డ్ ట్రంప్ ట్విటర్లో అమెరికా జాతీయ జెండాను పోస్ట్ చేశాడు. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సులేమానీని మట్టుపెట్టడం ద్వారా అమెరికా విజయం సాధించిందని చెప్పడానికే ఆయన ఈ విధమైన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, అమెరికా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఖాసీం సులేమానీ, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి