గడిచిన కొన్ని దశాబ్దాలుగా చైనా తన రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం అది భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ తెలిపింది. చైనా ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోవడం అమెరికా భద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారికంగా చూసినా గత సంవత్సరపు చైనా రక్షణ బడ్జెట్ రూ. 8,683 లక్షల కోట్లు కాగా, భారత రక్షణ బడ్జెట్ మాత్రం రూ. 2,434 లక్షల కోట్లేనని పెంటగాన్ తన వార్షిక నివేదికలో తెలిపింది. రక్షణ బడ్జెట్ పెంచుకోవడమే కాదు.. ఆయుధాల ఎగుమతిలో కూడా చైనా ముందే ఉంది. ఆ దేశం నుంచి అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్థాన్ ముందుంది. సంప్రదాయ ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్ ప్రధానంగా చైనామీదే ఆధారపడుతోందని పెంటగాన్ చెప్పింది. రాబోయే ఏళ్లలో చైనా ఆయుధ ఎగుమతులు మరింత పెరుగుతాయని, అక్కడి స్వదేశీ రక్షణ పరిశ్రమ రోజురోజుకూ ఎదుగుతోందని చెబుతున్నారు.
భారత్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడురెట్లు ఎక్కువ
Published Sat, May 9 2015 8:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement