న్యూయార్క్: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే.. హైతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోనన్లు, క్షిపణులను యుద్ధనౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పి కొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక.. ఈ ఘటనలో యుద్ధనౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.
‘‘అమెరికా యుద్ధనౌకలపై ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబల్స్ దాడికి పాల్పడ్డారు. అయితే.. వాటిని యుద్ధనౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధనౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు.. అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై కూడా దాడి చేశామని హుతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా.. హుతీ తిరుగుబాటుదారుల దాడి జరగలేదు’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.
నవంబర్ 2023లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో హుతీ రెబల్స్ పలు నౌకలపై దాడి చేయడం మొదలుపెట్టారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు త్యరేకంగా హౌతీ తిరుగుబాటుదాడులు ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలపై నౌకలపై దాడులకు దిగుతున్న విషయం తెలిసింది. ఇక.. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా.. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్‌లలో ఇరాన్ మద్దతుగల గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment