న్యూయార్క్: ఇరాన్, ఆ దేశానికి చెందిన అనుబంధ మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌కు దాడుల ముప్పు పొంచి ఉందని అమెరికా వెల్లడించింది. ఆదివారం తమ సీనియర్ కమాండర్‌ను హత్య చేసినందుకు ప్రతీకారంగా లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ వందల రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్‌కు మరోసారి దాడుల ముప్పు పొంచిఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ పాట్రిక్ రైడర్ అన్నారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి మరోసారి దాడి పొంచి ఉందని మేము అంచనా వేస్తూనే ఉన్నాం. ఇరాన్ నేతలు, ఇతరులు చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలే మా అంచనాకు నిదర్శనం’ అని అన్నారు.
అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ దూకుడు చర్యలు గతంలో ఎప్పుడు లేనంతగా ఉన్నాయని అన్నారు. ఇరాన్ దూకుడు చర్యలను ఆమెరికాతో కలిసి ఎదుర్కొవడానికి సిద్ధగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆదివారం నాడు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లాను గ్రూప్ లక్ష్యంగా దాదాపు 100 మిసైల్స్ ప్రయోగించింది. తమపై దాడిని అడ్డుకునే ముందస్తు చర్యలల్లో భాగంగా ఈ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ పెర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment