iran
-
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్‌కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్‌ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్‌కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్‌ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై.. అమెరికా బాంబుల వర్షం
-
ఇరాన్‌కు భారీ షాక్.. కోలుకోలేని దెబ్బకొట్టిన అమెరికా
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్‌పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్‌పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్‌లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్‌పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్‌పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
అపాచీ ఎఫెక్ట్.. ఇరాన్‌పై అమెరికా రివెంజ్ ఎటాక్స్!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
నలభై ఏళ్ల స్నేహం.. ఒకరి విజయాలను మరొకరు బహిరంగంగా కొనియాడుకునే అనుబంధం.. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్ పదేపదే అప్రమత్తం(వార్నింగ్) చేస్తున్నారన్న వార్తలు వెలువడగా.. దీనిని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ మాత్రం ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్.. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తే వాషింగ్టన్ మద్దతును కోల్పోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆప్తమిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.అయితే, యెచియెల్ లీటర్ ఈ కథనాలను తోసిపుచ్చారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు పరస్పర సహకారంతో జరిగాయని.. మీడియా.. తప్పుదోవ పట్టించేలా కథనాలను అల్లుతుందంటూ ఆరోపించారు. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు (lovers' spat) జరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని ఫాక్స్ న్యూస్‌తో లీటర్ వ్యాఖ్యానించారు.ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయించుకున్నప్పటికీ, తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ దౌత్యవేత్త పేర్కొన్నారు. చాలా వరకు మేము అమెరికా-ఇజ్రాయెల్ మధ్య చాలా సన్నిహిత, ఉమ్మడి సహకారంతో ముందుకు సాగుతున్నాము. మా మధ్య అద్భుతమైన అవగాహన ఉందన్నారు. మరోవైపు, నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇజ్రాయెల్-ఇరాన్ రెండు దేశాలూ దాడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డురాకపోతే శాంతి దిశగా తుది చర్చలు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. అవసరమైన విధంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ తాను ట్రంప్‌నకు స్పష్టం చేసినట్లు తెలిపారు. -
ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ తో వెనక్కి తగ్గిన..!
-
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా సాగుతున్న అమెరికా ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పుతాయేమోనన్న ఆందోళన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ.. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం వాషింగ్టన్‌ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ నెతన్యాహుకు పదే పదే ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "బీబీ.. చాలా జాగ్రత్తగా ఉండు. లేదంటే తొందర్లోనే నువ్వు ఒంటరివాడివైపోతావు" అని నెతన్యాహూతో జరిగిన సంభాషణలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ (Axios) కథనం వెల్లడించింది.బీబీ అనేది నెతన్యాహు చిన్నప్పటి ముద్దు పేరు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలు, అభిమానులతో పాటు పలు దేశాధినేతలు కూడా ఆయన్ని అలాగే పిలుస్తుంటారు. అందుకే ట్రంప్ ఆ పదం వాడారని తెలుస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా అమెరికాను భావిస్తారు. ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ రైట్‌వింగ్ లీడర్లుగా గుర్తింపు పొందారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇరాన్ అంశంలో ఇద్దరి మధ్య వ్యూహాత్మక విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించాలన్నది ట్రంప్ వైఖరి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన వైఖరిని అవలంబించాలని నెతన్యాహూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు చర్చలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ భావిస్తోంది. అందుకే గత కొన్ని వారాలుగా లెబనాన్, ఇరాన్ అంశాల్లో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నెతన్యాహూను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.ఇక.. నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అసలు సారాంశం.. అమెరికా మద్దతు గురించి. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి కీలక సహాయం అమెరికా నుంచే అందుతోంది. ఒకవేళ నెతన్యాహూ అమెరికా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. వాషింగ్టన్ నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగకపోవచ్చన్న సంకేతంగా విశ్లేషకులు ఈ హెచ్చరికను చూస్తున్నారు.ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా లేదు. ఇరాన్ మళ్లీ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని నెతన్యాహూ చెబుతుండగా, యుద్ధం కంటే దౌత్యమే పరిష్కారమని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన "జాగ్రత్త బీబీ" హెచ్చరిక కేవలం ఇద్దరు నేతల మధ్య సంభాషణ మాత్రమే కాకుండా.. పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ సంకేతంగా మారింది. -
భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరోసారి పరస్పర దాడులకు దిగాయి. రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. మధ్య, పశ్చిమ ఇరాన్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. రాజధాని టెహ్రాన్‌తోపాటు చుట్టుపక్కల నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికారిక టీవీ చానల్ వెల్లడించింది. రాజధానిలో ఇమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌స్పేస్‌ను ఇరాన్ మూసివేసింది. మాషహర్ సిటీలోని ఇరాన్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిర్ధారించింది. బాలిస్టిక్ మిస్సైళ్ల పరికరాలు తయారుచేస్తున్న ఈ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మిస్సైల్ లాంచర్లను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం: ఇరాన్ తొలుత లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా, ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తప్పదని ఆదివారం హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ప్రధానంగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లో దాడులు జరిగాయి. రెండు సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలకు ముమ్మాటికీ అమెరికా కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే ఆరోపించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉన్నందున దాడులు నిలిపివేస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలిపివేస్తే ఇజ్రాయెల్ సైతం వెనక్కి తగ్గుతుందని ఇరాన్‌కు అమెరికా సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అండదండలున్న నౌకలపై దాడులు చేస్తామని యెమెన్ హౌతీ మిలిటెంట్లు హెచ్చరించారు. హౌతీలకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సోమవారం సూచించింది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే ఆ రెండు దేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటే వాయిదా వేసుకోవాలని పేర్కొంది. -
ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు
-
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైళ్ల వర్షం
us israel iran war live updatesమరోసారి భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ ఎటాక్ఇరాక్పైనా గురిపెట్టిన ఇరాన్.. బాగ్ధాద్‌లో భారీ పేలుళ్లు ఇరాన్‌పై ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్‌రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లుట్రంప్ వద్దని చెబుతున్నా లెక్క చేయని ఇజ్రాయెల్‌దాడులు చేయబోమని చెబుతూనే ఇరాన్‌పై మిసైళ్ల వర్షంమరోసారి నెతన్యాహూకు ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గగన తలం మూసివేతపశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకున్న మేఘాలుప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావంతమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడిఆదివారం రాత్రి 11:00 గంటల నుండి తమ దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సిరియాఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతాయని ప్రకటన మూసివేత చర్యల్లో భాగంగానే డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేత -
ట్రంప్‌ను కాదని ఇరాన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు
టెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, దాడి చేయవద్దని గట్టిగా వారించినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ మాటలను లెక్కచేయలేదు. ఆదివారం రాత్రి ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా, సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై భీకర దాడులు ప్రారంభించింది. ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు చెలరేగడం ఇదే మొదటిసారి.ట్రంప్ హెచ్చరికలను కాదన్న నెతన్యాహుఆదివారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్‌తో తుది శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని, దౌత్య రంగానికి సమయం ఇవ్వాలని కోరారు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునేది నేనే (I call the shots). నెతన్యాహు కాదు’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్, కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది.మూడు ఇరాన్ నగరాల్లో పేలుళ్ల మోతఇజ్రాయెల్ సైన్యం పశ్చిమ మరియు మధ్య ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. ఇరాన్ స్టేట్ మీడియా నివేదికల ప్రకారం, టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫహాన్ అనే మూడు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ దళాలు ఈ దాడుల కోసం ‘ఎయిర్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లను’ ఉపయోగించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. దాడి ముప్పును ముందే ఊహించిన ఇరాన్, తన పశ్చిమ వైమానిక రంగాన్ని తాత్కాలికంగా మూసివేసింది.తీవ్రతరమవుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలుఈ తాజా దాడులతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆదివారం నాడు అమెరికా అభ్యంతరాలను సైతం పక్కనబెట్టి ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులు చేసింది. దీనికి ప్రతికారంగానే ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా, ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాయి. ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందిస్తూ, తమపై దాడులు కొనసాగితే ఈ ప్రాంతంలోని అమెరికన్, జియోనిస్ట్ లక్ష్యాలపై మరింత తీవ్రమైన రీతిలో విరుచుకుపడతామని హెచ్చరించాయి. -
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్‌పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్‌లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్‌కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్‌ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. -
ఇరాన్ ఆస్తులపై అమెరికా షాకింగ్ నిర్ణయం..?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్‌పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్‌తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథేఅయితే మరోసారి అమెరికా ఇరాన్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్‌పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్‌కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్‌గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్‌కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. -
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు! -
ఇరాన్ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా
బ్రిడ్జివాటర్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. తమ రాడార్ స్టేషన్లను అమెరికా ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా కువాయిట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. అయితే, తమ గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్ భూభాగాల్లోకి ప్రవేశించిన ఏడింటికిగాను ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చినట్లు తెలిపింది. మరో క్షిపణి దారి తప్పి, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని పేర్కొంది. వీటి కారణంగా అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. హార్మూజ్ జలసంధిపైకి ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అంతకుముందు అమెరికా ఆర్మీ కూల్చివేసింది. ఆ ప్రాంతంలో నౌకల సంచారానికి ముప్పుగా పరిణమించినందునే ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అదేవిధంగా, మరిన్ని దాడులకు పాల్పడకుండా ఇరాన్ రాడార్ కేంద్రాలను నిరీ్వర్యం చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా, తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. క్షిపణుల దాడిని ముందుగానే పసిగట్టి సైరన్ల ద్వారా తమ పౌరులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించినట్లు బహ్రెయిన్ వివరించింది. కాగా, ఖెష్మ్ దీవి, ఆ సమీపంలోని సిరిక్‌లో ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసినందుకే తాము కువైట్‌లోని అమెరికా బలగాలున్న అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్‌ను, బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, మిస్సైళ్లు ప్రయోగించినట్లు అనంతరం ఇరాన్ ఆర్మీ తెలిపింది. ఇరాన్ హార్మూజ్‌ను మూసివేయడంతో, బదులుగా ఇరాన్ నౌకాశ్రయాల్లో అమెరికా ఆర్మీ దిగ్బంధనం అమలు చేస్తుండటం తెల్సిందే. ఇలా ఉండగా, అమెరికాలోని విస్కాన్సిన్లో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్ కొందరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇరాన్‌తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం స్థాయికి దిగి వస్తాయని వారికి చెప్పారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు చాలామటుకు ధ్వంసం అయినప్పటికీ ఇంకా 22 శాతం వరకు భద్రంగానే ఉన్నట్లు సమాచారముందన్నారు. -
ఈ ఒక్క కారణంతో భయంకర ఆపరేషన్, దాడులు ఆగిపోయి..
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్‌లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్‌తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్‌తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ కీలక భేటీ
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్‌పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. -
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?!
అయోమయాన్ని సృష్టించటానికీ, అవతలి పక్షంపై పైచేయి సాధించటానికీ ఎంతకైనా తెగించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికన్ కాంగ్రెస్‌కు పెద్ద అబద్ధం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌తో శత్రుత్వాన్ని ఆపి, అక్కడున్న సేనలనువెంటనే వెనక్కి పిలిపించాలని 215–208 ఓట్ల తేడాతో బుధవారం అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించగా, ‘అసలు యుద్ధం ఎక్కడుంది? అది ఏప్రిల్ మొదటి వారంలోనే ముగిసి పోయింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అది కొనసాగుతోంది’అంటూ ట్రంప్ లేఖ రాశారు. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కై, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పటికీ ఆగలేదు. హార్మూజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. తమ షరతులకు తలొగ్గితేనే ఒప్పందం సాధ్యమంటూ ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తీర్మానానికి కొన్ని గంటలముందు కూడా అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కానీ ఈ ఘర్షణల్ని యుద్ధంగా పరిగణించరాదని ట్రంప్ భాష్యం చెబుతున్నారు. నిజానికి యుద్ధం ఆపాలని ప్రతినిధుల సభ ఆదేశించినంత మాత్రాన ట్రంప్కొచ్చే నష్టమేం లేదు. ఆ తీర్మానం చట్టపరంగా కీలకమైన చర్యే కావొచ్చు, కానీ ఆచరణలో అదే మంత పనికొచ్చేది కాదు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమాక్రాట్లతో చేయి కలపటంతో తీర్మానం ఆమోదం పొందింది. 1973లో వచ్చిన యుద్ధ అధికారాల చట్టంకిందకాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధంలోకి దిగితే, రెండు నెలల్లో దాన్నిముగించాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తే మరో 30 రోజులు పొడిగించటానికి అధ్యక్షుడికి వెసులుబాటుంది. కానీ అటు తర్వాత మాత్రం అసాధ్యం. ట్రంప్ రాసిన లేఖ ప్రకారం నిండా నెలకుమించి యుద్ధం సాగలేదు! కాల్పుల విరమణ అమల్లో ఉందంటే యుద్ధం లేనట్టేననీ, ‘అవసరమైన’సందర్భాల్లో చేస్తున్న దాడుల్ని యుద్ధంగా పరిగణించరాదనీ యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. తలా తోకా లేకుండా మాట్లాడటంలో ట్రంప్ సిద్ధహస్తుడు. ఒకపక్క కాంగ్రెస్ చేసిన తీర్మానం దేశభక్తి రాహిత్యమంటూనే, అదే నోటితో అదెప్పుడో ముగిసిందని చెబు తున్నారు. ఆయన తర్కం ప్రకారం యుద్ధం చేయటమే దేశభక్తి అయితే, దాన్ని నిలి పేసిన తనకూ దేశభక్తి లోపించినట్టే. ఈ వాదప్రతివాదాల మాటెలావున్నా ఇలాంటి అధ్యక్షుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు మున్ముందు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ నెలాఖరుతో యుద్ధం వంద రోజులకు చేరుతుంది. యుద్ధం ఆగేందుకు ఇప్పటికి నాలుగుసార్లు ప్రతినిధుల సభలో డెమాక్రాట్లు తీర్మానాలు పెట్టారు. కానీ మొదటి మూడుసార్లూ అవి వీగిపోయాయి. మూడోసారి తీర్మానమైతే 212–212తో ఎటూతేలకుండా ముగిసింది. ఈసారి అది నెగ్గినా ట్రంప్ తన తర్కంతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంవల్ల ఇరాన్లో ఇంతవరకూ 3,400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2,900 కోట్ల డాలర్లు ఖర్చయిందని పెంటగాన్ చెబుతుండగా, ఇదంతా ముగిసేసరికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ మూర్ఖత్వం ఇలాగే కొనసాగితే అమెరికా నిండా మునగటం ఖాయం. దాంతో పాటు డాలర్‌తో ముడిపడివున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా స్థితికి చేరుకుంటాయి. ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటి ఇప్పటికే ట్రంప్ రేటింగ్ నేల చూపులు చూస్తోంది. ప్రతినిధుల సభ చేసిన తీర్మానంవంటిదే రిపబ్లికన్ల ఆధిక్యతగల సెనేట్‌లో కూడా చేస్తే అమెరికా అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే యుద్ధం ఆపాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు సైతం దాన్ని ట్రంప్ వీటో చేయొచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ తీర్మా నిస్తే తప్ప ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవి కాదు. ఇప్పటికే మొత్తం ఓటర్లలో 64 శాతంమంది ట్రంప్ యుద్ధోన్మాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తటస్థ ఓటర్లలో అయితే 73 శాతంమంది యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారు. ఎవరెంతగా కోరుకున్నా ట్రంప్ మాత్రం స్వీయ వినాశనంవైపే అమెరికాను తీసుకుపోతున్నారు. -
పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్‌ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్‌పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్‌పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
కల్లలైన కుటుంబం కల
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్‌లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్‌కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్‌పోర్ట్‌లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్‌కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు. నేడు భారత్‌కు మన్జూర్ పార్థివదేహం విమానంలో కువైట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు. -
కువైట్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్ దాడి.. ప్రయాణికుల పరుగులు
-
ఇరాన్ భారీ షాక్.. కువైట్‌లో హైఅలర్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. కాగా, ఇరాన్ దాడితో కువైట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ఫైర్ తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. ఇక, ఇరాన్ దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కువైట్ తీసుకున్న చర్యలుదాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలను కువైట్ ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేసింది. ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. అనుమానాస్పద వస్తువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించింది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ప్రస్తుతం కువైట్ అంతటా హైఅలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశంపై భద్రతా సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి. వైమానిక రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.اللحظات الأولى للاعتداء الإيراني الغاشم من قبل المسيرات الذي تعرض له مبنى الركاب T1 في مطار الكويت الدولي بتاريخ 3 يونيو 2026 وتسبب بخسائر بالأرواح وإصابات بشرية بليغة وأضرار مادية جسيمةThe first moments following the brutal Iranian drone attack on Terminal 1 (T1) at Kuwait… pic.twitter.com/eTzQoVXB4K— الطيران المدني (@Kuwait_DGCA) June 3, 2026భారతీయులకు ప్రమాదమా?ప్రస్తుతం కువైట్‌లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సాధారణ ప్రజలపై ప్రత్యేక దాడులు జరిగినట్లు సమాచారం లేదు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున అధికారిక సూచనలను పాటించడం అవసరం. కొన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు.. ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.NEW: Video shows full extent of the damage to Terminal 1 at Kuwait International Airport caused by the brutal Iranian drone and missile attacks that struck the facility earlier today.One person was killed and more than 60 injured in Iranian drone strikes on the airport, local… pic.twitter.com/S8UjuZLRis— Breaking Aviation News & Videos (@aviationbrk) June 3, 2026 -
ఇరాన్ ప్రతీకారం
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్ సైన్యం అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతిచెందాడు. మరికొందరు గాయపడ్డారు. మృతుడు ఏ రాష్ట్రానికి చెందినవాడనే విషయం తెలియరాలేదు. బాధితుడి కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్‌కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తునట్లు భారత్‌లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. మాటకు కట్టుబడి దాడులు చేశాం.. బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్‌ను మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని జనానికి సూచించింది. బహ్రెయిన్ గగనతలం గుండా క్షిపణులు దూసుకెళ్తున్నాయని పేర్కొంటూ ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్టు చేసింది. ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ఐలాండ్‌పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్ మిలటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఏ విధమైన దురాక్రమణకైనా భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తాము ఇంతకుముందే హెచ్చరించినట్లు ఇరాన్ గుర్తుచేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. కువైట్, బహ్రెయిన్‌పై దాడుల్లో అమెరికాకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. అమెరికా సైన్యం స్పందించలేదు. -
‘నేను ఖమేనీని కలవాలనుకుంటున్నా..’
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలవాలని ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాను ఇరాన్ సుప్రీం లీడర్‌ను నేరుగా కలవాలనుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఖమేనీ భాగస్వామి అయ్యారని.. ఇరువురి మధ్య సంబంధాలు చాలా బాగున్నట్లు కనిపిస్తోందంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు, నాయకులకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను.. అలాగే ఏదో ఒక సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.'పాడ్ ఫోర్స్ వన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిణామాలు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి.. మేము ఏదో ఒక సమయంలో సమావేశమవుతామని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే విషయానికి అంగీకరించిందని.. అది చాలా పెద్ద విషయం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు."మేము వారిని అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వలేము. వారు అణు ఆయుధాన్ని కలిగి ఉండబోమని ఇప్పటికే అంగీకరించారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్‌తో తమ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమంటూ సానుకూల ధోరణితో మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..
-
ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?
-
ఇరాన్–అమెరికా దాడుల తీవ్రత.. ‘గల్ఫ్ విమానాల’కు అంతరాయం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. యుద్ధ స్థావరాలపై ఇరాన్-అమెరికాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులు, ప్రతిదాడుల మధ్య గల్ప్ దేశాల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు వచ్చిన వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ప్రయోగించిన అనేక క్షిపణులు లక్ష్యాలను చేరలేక మార్గమధ్యంలో కూలిపోయాయని వివరించింది.ఇదే సమయంలో ప్రతిస్పందన చర్యల్లో భాగంగా అమెరికా ఇరాన్‌లోని క్వెష్మ్ ద్వీపంలోని ఒక సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ చర్యల్లో తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేసినట్లు ప్రకటించగా, ఆ వాదనలను అమెరికా “పూర్తిగా అసత్యం”గా ఖండించింది.ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. బహ్రెయిన్ తన ఆకాశ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయగా, కువైట్, యూఏఈలలో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యమవడం, మార్గమధ్యంలో నిలిపివేయడం, మార్గాలు మార్చుకోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ మార్గాల్లో సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. ఏజియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ బాల్టిక్, ఎయిర్ కెనడా, ఎయిర్ ఫ్రాన్స్-KLM, లుఫ్తాన్సా, స్విస్ , ITA ఎయిర్వేస్ వంటి సంస్థలు దుబాయ్, టెల్ అవీవ్, బీరూట్, రియాద్ మార్గాల్లో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు తప్పవని అధికారులు అంటున్నారు.పర్షియన్ గల్ఫ్‌లో కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసరాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో చమురు, గ్యాస్ రవాణాపై కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి ప్రయత్నాలు ఈ తాజా ఘటనలతో మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. -
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనుకున్న సమయంలో పరిస్థితి మళ్లీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సాగుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. మరోవైపు.. కువైట్, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు గల్ఫ్ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో శాంతి ప్రయత్నాల భవిష్యత్తుపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయా? ముగిశాయా? అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్.. "అవి ముగిసినా నాకు పెద్దగా పట్టదు. ముగిస్తే ముగిశాయి. లేకపోతే లేదు. కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్‌గా మారాయి" అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు ట్రంప్ దౌత్యపరమైన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు. కానీ ట్రంప్ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా, ట్రంప్ ఇప్పటికే విసుగు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందానికి దాదాపు 20 నెలల చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన చర్చలు రెండు నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.మళ్లీ పరస్పర దాడులుఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కువైట్ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేలుళ్ల శబ్దాలకు భయపడవద్దని సూచించింది. అదే సమయంలో బహ్రెయిన్ కూడా సైరన్లు మోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.ఇరాన్‌కు చెందిన క్వేష్మ్ ద్వీప ప్రాంతంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ, ఇరాన్ నుంచి ప్రాంతీయ దేశాలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. అంతేకాకుండా క్వేష్మ్ ద్వీపంలో "స్వీయ రక్షణ చర్యల" కింద దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.అమెరికా ప్రకారం, ఇరాన్ కువైట్‌పై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమయ్యాయి. బహ్రెయిన్‌పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ సంయుక్త వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు మందగించడం, మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడుల ముప్పు పెరగడం నేపథ్యంలో ప్రాంతీయ శాంతి ప్రక్రియ మరోసారి అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మోజ్తాబా బతికే ఉన్నారా? అమెరికా ఏమంటోంది..?? -
మరో కీలక జలసంధి మూసివేతకు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి విషయంలో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన ఇరాన్, తాజాగా బాబ్-అల్-మందేబ్ జలసంధిని సైతం మూసివేస్తామని హెచ్చరించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులను నిరసిస్తూ, అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఇంధన ధరలను మరింత అస్థిరతలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.వ్యూహాత్మక జలమార్గంపై గండంఎర్ర సముద్రానికి దక్షిణ ద్వారంగా ఉన్న బాబ్-అల్-మందేబ్ జలసంధి, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనది. యెమెన్, ఆఫ్రికా కొమ్ము (Horn of Africa) మధ్య ఉన్న ఈ జలమార్గం కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 15 శాతం దీని ద్వారానే సాగుతుంది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా మార్కెట్లను కలిపే ఈ మార్గం ద్వారానే భారీగా ముడిచమురు రవాణా జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ రవాణా నిలిచిపోతే, ఓడలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది ఇంధన వినియోగం, షిప్పింగ్ ఖర్చులను భారీగా పెంచేస్తుంది.హైతీల పాత్ర.. ఇరాన్ హెచ్చరికఈ జలసంధిపై ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు యెమెన్‌లోని హైతీ రెబల్స్ మద్దతు లభించే అవకాశం ఉంది. గతంలోనే హైతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. గాజా, లెబనాన్ సంఘర్షణల నేపథ్యంలో, తమకు అనుకూలమైన ‘రెసిస్టెన్స్ ఫ్రంట్’ ద్వారా బాబ్-అల్-మందేబ్‌ను నియంత్రించడం ద్వారా ఇజ్రాయెల్, అమెరికాలను దెబ్బతీయాలని ఇరాన్ యోచిస్తోంది. హైతీ ప్రతినిధులు ఇప్పటికే దీనిని ఒక ‘సాధ్యమైన ఆప్షన్’ అని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్త ఇంధన మార్కెట్లలో ఇప్పటికే అలజడి మొదలైంది. 2023-2025 మధ్యకాలంలోనే ఈ మార్గంలోని అస్థిరత వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా. ప్రస్తుతం చర్చలు విఫలం కావడం, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో, ఇంధన ధరలు మరింతగా పెరిగే ముప్పు పొంచి ఉంది. దౌత్యపరమైన పరిష్కారాలు కానరాకపోవడంతో, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు -
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్‌కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.బీరూట్‌పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.యుద్ధం తాజా పరిస్థితిఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్‌పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.ఇరాన్ చర్చలకు బ్రేక్?లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్‌గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా?ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.మిడిల్ఈస్ట్ సంక్షోభం ఎటు?ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్‌పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. -
మళ్లీ బాంబుల వాన
దుబాయ్/వాషింగ్టన్: ఓవైపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపనకు దౌత్యమార్గంలో చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో బాంబులమోత మోగించాయి. గత వారం తమ అత్యాధునిక ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. డ్రోన్లను ప్రయోగించే ప్రయోగకేంద్రాలనూ అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారంతీర్చుకుంది. అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ పేర్కొంది. ‘‘అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న తమ యూఎస్ ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ జలసమాధి చేసింది. అందుకే వాళ్ల రాడార్లను మేం నాశనంచేశాం. డ్రోన్ లాంఛింగ్ సైట్లను బూడిదచేశాం. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హార్మూజ్ జలసంధి గుండా మా రక్షణలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడికి బయల్దేరినా డ్రోన్లనూ నేలకూల్చాం. ప్రతిగా ఇరాన్ మొదలెట్టిన దాడుల్లో మా బలగాలకు, మా సైనిక సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’అని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ సోమవారం ప్రకటించింది. ఆదివారం గెరూక్, ఖేష్మ్ ద్వీపం మీదా దాడులు చేశామని అమెరికా మిలటరీ పేర్కొంది. అయితే టెలికమ్యూనికేషన్ టవర్ మీద సైతం అమెరికా దాడిచేసిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. దౌత్యం జరుపుతూ దాడులు చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘మొదట్నుంచీ అమెరికా మమ్మల్ని నమ్మట్లేదు. చర్చలు సైతం అపనమ్మకంతో కొనసాగుతున్నాయి. అవిశ్వాస వాతావరణంలో దౌత్యం ఏనాటికీ కొలిక్కిరాదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ చక్క టి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా మాటిమాటికి బాంబులేయడం మానేసి ఓపికపడితే కుదురుకుంటుంది’’అని ఆయన అన్నారు. భద్రంగా హార్మూజ్‌ను దాటిన 70 నౌకలు అమెరికా బలగాల రక్షణంలో గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70 వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధి గుండా పయనించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ జలాలకు అటువైపు, ఇటువైపు ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలిగాయని అమెరికా అధికారులు వెల్లడించారని సోమవారం న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ముందుజాగ్రత్తగా నౌకలన్నీ తమ లొకేషన్‌ను చూపించే ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేశాయని వెల్లడించింది.అమెరికాతో చర్చలనునిలిపేసిన ఇరాన్! లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుండటంపై నిరసనగా అమెరికాతో దౌత్యచర్చలను నిలిపేస్తున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో నిర్ణయించుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులుచేస్తోందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘దాడులకు నిరసనగా ఇకపై మధ్యవర్తులతో తమ దౌత్య ప్రతినిధులు చర్చలు జరపబోరు. తక్షణం లెబనాన్‌పై కాల్పులు, దురాక్రమణను ఇజ్రాయెల్ నిలిపేయాలి. బీరుట్ ఆక్రమణ ప్రయత్నాలను ఇజ్రాయెల్ విరమించుకోవాలి. ఇప్పటికే ఆక్రమించుకున్న సరిహద్దు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)బలగాలు వెనుతిరగాలి. ఈ దిశగా ఇజ్రాయెల్ తీసుకునే చర్చలతో మేం సంతృప్తి చెందేదాకా మధ్యవర్తులతో చర్చలపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. అప్పటిదాకా చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదు’’అని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొందని ఇరాన్‌లోని మీడియాలో కథనాలొచ్చాయి. బీరుట్ సమీప దహియే జిల్లాపై దాడులను ముమ్మరంచేయాలని సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఆపారు. బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేయాలని, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరుపక్షాలతో మాట్లాడి తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగేలా ఒప్పందం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నేను చాలా ఫలప్రదమైన ఫోన్ సంభాషణ జరిపాను. బీరూట్‌కు ఎటువంటి సైనిక బలగాలు వెళ్లవు. హిజ్బుల్లాతో కాల్ మాట్లాడాను. అన్ని రకాల కాల్పులను నిలిపివేయడానికి వారు అంగీకరించారు — ఇజ్రాయెల్ వారిపై దాడి చేయదు, వారు ఇజ్రాయెల్‌పై దాడి చేయరు"" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌లో రాశారు.లెబనాన్ రాజధాని వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలను తన ఆదేశాలతో వెనుకకి తిరిగినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల ఆధారంగా.. హిజ్బుల్లా కూడా కాల్పులు జరపకుండా ఉండేందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే శాంతి చర్చల ఒప్పందంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకూ చర్చలు ప్రస్థావనే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.కాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్‌పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఐఆర్జీసీ రగడ.. ఇరాన్లో కీలక పరిణామం?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ దళాల తీరుపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మసూద్.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక పలు కథనాలను వెల్లడించింది.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్లో పాలనపై పలు ఊహాగానాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇరాన్‌ను ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తున్నట్టు తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ తాజాగా మసూద్ ఇవే విషయాలను వెల్లడించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఇరాన్ పాలన ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు సదరు కథనం వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాల విషయంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నట్లు ఆరోపించారు.Iran’s president has reportedly asked to resign, citing a loss of authority inside the country’s ruling system.According to reports, Masoud Pezeshkian told the Supreme Leader’s office that he and his government have been excluded from major decision-making, leaving him unable… pic.twitter.com/ronp6oNvrI— Fox News (@FoxNews) May 31, 2026కాగా, అధ్యక్షుడు పెజష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్లు వెల్లడించింది. పాలన, చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా చేస్తున్నారని పెజష్కియాన్ ఆరోపించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ కథనంపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి స్పందించారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల వేళ తప్పుడు రిపోర్టులతో మీడియా గేమ్స్ ఆడుతోందని ఆరోపించారు. తుర్కియే ప్రభుత్వ పత్రిక కూడా ఈ ఖండనను సమర్థించింది. ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఒప్పంద ప్రతిపాదనలపై స్పందిస్తూ.. ఇరాన్ హక్కులను కాపాడని ఏ డీల్‌కు తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. -
ఇరాన్ బి..గ్ ప్లాన్, ప్రపంచానికి కొత్త టెన్షన్!
శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్ నెట్‌వర్క్‌లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్ కేవలం పునరుద్ధరణ పనులే చేస్తోందా.. లేదంటే పశ్చిమాసియా యుద్ధంలో సీక్వెల్‌కు సిద్ధపడుతోందా?.. ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాలను ఈ ప్రశ్న కలవరపెడుతోంది.అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు భావించిన ఇరాన్ భూగర్భ క్షిపణి టన్నెల్లను మళ్లీ తెరిచే పనులు జోరుగా సాగుతున్నట్లు తాజా శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం నిజంగా ఎంత మేర దెబ్బతిందనే ప్రశ్న మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.గత కొంతకాలంగా ఇరాన్ క్షిపణి మౌలిక వసతులపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు, టన్నెల్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పుకున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే. టన్నెల్ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసి, లోపల నిల్వ ఉంచిన ఆయుధాలను బయటకు తీసుకురాలేని పరిస్థితి సృష్టించాలని ప్రయత్నించారు. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చెందిన 450కు పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రయోగ సదుపాయాలు దాడులకు గురైనట్లు పాశ్చాత్య అంచనాలు చెబుతున్నాయి.అయితే తాజా శాటిలైట్ చిత్రాలు పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. సీఎన్ఎన్ విశ్లేషించిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ చిత్రాల ప్రకారం.. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు, భారీ యంత్రాలతో ధ్వంసమైన ప్రవేశ మార్గాల వద్ద మట్టిని తొలగిస్తూ మళ్లీ టన్నెల్లను తెరుస్తోంది. కొన్ని స్థావరాల వద్ద భారీ బాంబుల కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తూ, లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు చిత్రాలు సూచిస్తున్నాయి.ఈ పరిణామం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక అంచనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే దాడుల అనంతరం ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90 శాతం వరకు దెబ్బతిందని పాశ్చాత్య విశ్లేషకులు పేర్కొన్నారు. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నాలుగు ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఆధారాలు చూస్తే.. క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. టన్నెల్లను మళ్లీ తెరవగలిగితే ఆ క్షిపణులను తిరిగి వినియోగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఇరాన్‌కు భూగర్భ క్షిపణి కేంద్రాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆస్తులు. పర్వతాల లోపల, వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రధాన లక్ష్యంగా ఇవే మారాయి. అయినప్పటికీ, ఇరాన్ గతంలో కూడా దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను వేగంగా పునర్నిర్మించిన చరిత్ర కలిగి ఉంది. తాజా పరిణామాలు అదే సామర్థ్యాన్ని మరోసారి సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.ఇక హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న కొన్ని క్షిపణి స్థావరాల్లో కూడా కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నట్లు పాశ్చాత్య గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ మళ్లీ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటే మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వంసమైన టన్నెల్లను తిరిగి తెరవడం, భూగర్భ స్థావరాల్లో కార్యకలాపాలను పునరుద్ధరించడం ద్వారా ఇరాన్ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని టెన్నెల్స్ తిరిగి అందుబాటులోకి రావడం, భూగర్భ నిల్వల్లో ఇంకా గణనీయమైన క్షిపణి సామర్థ్యం మిగిలి ఉండొచ్చన్న అంచనాలు పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను మరోసారి సంక్లిష్టంగా మారుస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిపోయిందని భావించడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా ఉండలేకపోతోంది. -
మేము కోరుకున్నది దక్కకపోతే..
వాషింగ్టన్: పశ్చిమాసియాలో హార్మూజ్ జలసంధి దిగ్బంధం సహా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో మంచి ఒప్పందానికి అమెరికా, ఇరాన్‌లు చాలా దగ్గరగా వచ్చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, తాము కోరుకున్నది లభించకపోతే ఆ ఒప్పందాన్ని వేరే విధంగా ముగిస్తామని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌లో తన కోడలు లారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఇరాన్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ, తొందరపడితే మంచి ఒప్పందం కుదరదని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా తాము కోరుకున్నది సాధిస్తున్నామని తేల్చిచెప్పారు. కోరుకున్నది దక్కేదాకా వేచి చూస్తామని, ఒప్పందం విషయంలో తొందరేమీ లేదని సంకేతాలిచ్చారు. చర్చల విషయంలో ఇరానీయులు మంచి నిపుణులు అని అన్నారు. కానీ, ఇరాన్ సైనికపరంగా ఇప్పటికే ఓడిపోయినందున ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోగలిగితే మంచిదేనని.. లేకపోతే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ చెప్పిందని ట్రంప్ అన్నారు. ఒకవేళ వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటి అయుధాన్ని కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికాకు గణనీయమైన పట్టు సాధించిందని తెలిపారు. అయితే, ఇరాన్ నాయకత్వంలో కొందరు మితవాదులు ఉండడంతో తాము ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేయలేదని అన్నారు. ఇరాన్‌లోని అత్యంత తీవ్రవాద శక్తులను, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 60 రోజల తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందులోని అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
జీడీపీ, ఆర్బీఐ పాలసీపై ఫోకస్
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ఓవైపు యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు ప్రభావం చూపనుండగా.. మరోపక్క ఆర్బీఐ పరపతి సమీక్ష, క్యూ4 జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియా సంక్షోభంపై రోజుకో రకంగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలకు రెక్కలురావడంతో పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా భారత్ చమురు వినియోగంలో 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడటంతో రూపాయి బలహీనపడుతోంది. దిగుమతుల బిల్లులో పసిడి, చమురు ప్రధా న పాత్ర పోషిస్తుండటం దీనికి కారణంకాగా.. వాణిజ్య లోటు పెరుగుతోంది. వెరసి పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం భారత్‌కు సానుకూల అంశమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్, ఇరాన్ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. గణాంకాల విడుదల నేడు(సోమవారం) ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. 2026 మార్చిలో ఐఐపీ 4.1 శాతం ఎగసింది. ఫిబ్రవరిలో సవరించిన 5.1 శాతం గణాంకాలతో పోలిస్తే కొంతమేర వెనకడుగు వేసింది. అంతేకాకుండా మే నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసెస్, కాంపోజిట్ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో దాదాపు నాలుగేళ్లలోనే తక్కువస్థాయి తయారీ పీఎంఐ 54.3కు మందగించింది. వీటితోపాటు మే నెలకు ఆటో రంగ(వాహన విక్రయ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 2025–26 క్యూ4, పూర్తి ఏడాది జీడీపీ గణాంకాలు జూన్ 5న విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లు యథాతథం! వారాంతాన(జూన్ 5న) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడుతుంది. క్రూడ్ సెగతో ధరలకు రెక్కలొస్తున్న విషయం విదితమే. దీంతో టోకుతోపాటు, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. దీంతో కఠిన విధానాలవైపు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం రిసు్కలున్నప్పటికీ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును మరోసారి 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండు పాలసీ సమీక్షలలో ఆర్బీఐ రెపో రేటులో స్టేటస్ కో అమలు చేసిన సంగతి తెలిసిందే. లిక్విడిటీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్బీఐ స్పందన సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ, జీడీపీ, ఐఐపీ, ఆటో రంగ గణాంకాలు సమీప భవిష్యత్‌లో మార్కెట్ల నడకను ప్రభావితం చేయన్నుట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు, ఎఫ్‌పీఐల షాక్ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మే నెలలోనూ రూ. 33,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 2.25 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తద్వారా మొత్తం 2025 ఏడాదిలో చేపట్టిన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను మించిపోవడం గమనార్హం!! ఇతర దేశ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు దీనికి కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మినహా ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లోనూ ఎఫ్‌పీఐలు విక్రయాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు తొలుత బలపడినప్పటికీ ఎగువ స్థాయిలవద్ద నిలదొక్కుకోలేకపోయాయి. వారాంతాన ఉన్నట్టుండి పెరిగిన భారీ అమ్మకాలతో బలహీనపడ్డాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 23,000 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆపై అమ్మకాలు కొనసాగితే సమీప భవిష్యత్‌లో 22,400 వరకూ పతనమయ్యే చాన్సుంది. ఈస్థాయిల వద్ద బలమైన సపోర్ట్‌కు వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులు? ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనా!
టెహ్రాన్: ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, ట్రంప్ ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని యూఎస్ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్‌కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్‌లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.ఇజ్రాయెల్ ఊరుకోదు ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్‌లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం. ట్రంప్‌నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్‌కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు? నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ్వాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. -
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికా పని ఖతం? అణు బాంబు తయారీలో కీలక ఘట్టం చేరుకున్న ఇరాన్
-
డీల్‌పై సంతకానికి ట్రంప్ నో
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులపాటు పొడిగించేందుకు, హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం పట్ల ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దీన్ని పరిశీలించిన ట్రంప్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో చర్చించానని, ఇరాన్‌తో ఒప్పందంపై అతిత్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, డీల్‌పై సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఇరాన్‌తో చేసుకొనే ఏ ఒప్పందమైనా అమెరికాకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం డీల్ విషయంలో అమెరికాతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమెరికా-ఇరాన్ శాంతిచర్చలకు బ్రేక్?.. టెహ్రాన్‌లో భారీ నిరసనలు
టెహ్రాన్: ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం శాంతిచర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాలకు పలు విషయాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒప్పందం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఇరాన్‌లోని ఓ అంతర్గత గ్రూపు ఈ చర్చలు జరగకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలికంగా సాగుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరుదేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఇరాన్ అంతర్గతంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అమెరికాతో ఎలాంటి రాజీని ఇష్టపడని ఇరాన్‌లోని ఒక బలమైన మితవాద వర్గం ఈ ఒప్పందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.పార్లమెంట్ సభ్యులు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఈ కరడుగట్టిన మితవాద బృందం దేశంలో అమెరికాతో చర్చలు జరపవద్దంటూ వీధులలోకి వచ్చి నిరసనలు తెలపడం, మీడియాల చర్చలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.గత శుక్రవారం రోజు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మితవాద శక్తులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వీధుల్లో జెండాలు పట్టుకుని, అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖమేనీని చంపిన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని నినాదాలు ఇచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీపై ఈ బృందం విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మాత్రం చర్చల బృందానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాల్సిందేనని బృందానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది -
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మరో వాణిజ్య నౌకను అమెరికా సైన్యం అడ్డుకుంది. గాంబియా దేశ జెండా కలిగిన లియాన్ స్టార్ అనే భారీ రవాణా నౌక ఇరాన్ ఓడరేవులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ రాత్రంతా అమెరికా దళాల నుండి వచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా విమానాలు ఆ నౌకను నిలిపివేశాయని, ప్రస్తుతం అది అక్కడే ఉందని పేర్కొన్నారు. అయితే, అమెరికా దళాలు ఆ నౌకలోకి చెప్పారు. ఇప్పటిదాకా దిగ్బంధనాన్ని ఛేదించుకకొని రావడానికి ప్రయత్నిస్తున్న ఆరు నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంది. వాటిలో ఒకదానిని ముందుకు వెళ్లడానికి అనుమతించారు. -
అమెరికాకు ఎదురుదెబ్బ..? మరోసారి డ్రోన్లు కూల్చిన ఇరాన్
-
ట్రంప్‌వి బిల్డప్ బాబాయ్ మాటలే..!
‘అన్నీ సెట్ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు."హర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.అలాగే ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్‌లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది. -
అమెరికా ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత
టెహ్రాన్/దుబాయ్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోతోంది. ఇరాన్ సైన్యం దాడుల్లో అత్యంత విలువైన యుద్ధ విమానాలు, డ్రోన్లు నేలమట్టమవుతున్నాయి. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌ను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవలే హార్మూజ్ జలసంధి సమీపంలో ఖేష్మ్ దీవి వద్ద ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఇందుకోసం కొత్తగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ‘అరాశ్–ఇ–కమాంగీర్’ను ఉపయోగించినట్లు పేర్కొంది. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ విలువ 30 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా తగ్గిపోలేదని చెప్పడానికి ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత ఒక ఉదాహరణ అని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇకపైనా సవాలు చేసే స్థితిలో ఇరాన్ ఉందని అంటున్నారు. ఇరాన్ సైన్యం స్థానికంగానే నూతన గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సి వస్తోందని అమెరికా చెబుతోంది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను హార్మూజ్ జలసంధి సమీపంలో కూల్చివేయడం చూస్తే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరాశ్ ద ఆర్చర్ అరాశ్–ఇ–కమాంగీర్ అనేది ఇరాన్ గగనతలం, సముద్ర సరిహద్దుల సమీపంలో ఉన్న శత్రు గూఢచార డ్రోన్లను అడ్డగించగల, కూల్చివేయగల ఒక స్టెల్త్–డిటెక్షన్ వ్యవస్థ. అరాశ్–ఇ–కమాంగిర్ అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. పర్షియన్ పురాణాల్లోని ‘అరాశ్ ద ఆర్చర్’ ఒక మహాయోధుడు. విదేశీ దండయాత్రల నుంచి ఇరాన్‌ను రక్షించినందుకు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇరాన్ జానపద కథల ప్రకారం చూస్తే.. అరాశ్ తన ప్రాణాలను పణంగా పెట్టి విసిరిన బాణం ద్వారా ఇరాన్, మధ్య ఆసియా మధ్య సరిహద్దు ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థిర రాడార్ వ్యవస్థలపై ఆధారపడకుండా.. శత్రుదేశాల డ్రోన్లు, విమానాలను లక్ష్యంగా చేసుకునేలా తక్కువ ఖర్చుతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీలో పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది. వివిధ రకాల క్షిపణుల రూపకల్పనలో ఇరాన్ చాలావరకు స్వయం సమృద్ధి సాధించింది. చౌకైన, సరళమైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇవి ఖరీదైన అమెరికా యుద్ధవిమానాలను, డ్రోన్లను సులువుగా దెబ్బతీస్తున్నాయి. ఫైటర్ జెట్‌నూ కూల్చేశాంఅమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. శుక్రవారం ఉదయం బషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ గవర్నరేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అమెరికా ఫైటర్ జెట్‌ను ఇరాన్ సేనలు నేలమట్టం చేసినట్లు స్థానిక గవర్నర్ మసూద్ టాంగెస్తానీ చెప్పారని వెల్లడించింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు. యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్ సైన్యం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అయితే, అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేశామంటూ ఇరాన్ చేసి ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని తేల్చిచెప్పింది. ‘మేము ఒక్క యుద్ధ విమానం కూడా నష్టపోలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. -
ఇరాన్ రహస్య అస్త్రం.. అసలేంటి ఆరాష్-ఎ-కమాంగిర్?
టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్‌కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్‌ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది.ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది.ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది.కింగ్స్ కాలేజ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ ఆర్థిక శాస్త్రాన్ని మార్చడంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. తక్కువ బడ్జెట్లో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.ఆరాష్-ఎ-కమాంగిర్ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఆయుధమేమీ కాకపోవచ్చని.. కానీ మొబైల్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక రక్షణను విస్తృతం చేయడంలో ఇరాన్ సాధించిన మరో అడుగు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లు రేడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి. వాటిని గుర్తించడం చాలా సులువు. కానీ వీటికి భిన్నంగా. ఈ చిన్న, చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించవచ్చు.. దాచవచ్చు.. వేగంగా ప్రయోగించవచ్చు. సులభంగా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ వ్యవస్థకు పర్షియన్ పురాణాల వీరుడి పేరు పెట్టారు. జానపద కథల ప్రకారం.. ఆరాష్-ఎ-కమాంగిర్ అనే ఓ యోధుడు పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్‌పై పడకుండా ఆయన పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్-మధ్య ఆసియా మధ్య సరిహద్దును గీయడానికి ఒక బాణాన్ని సంధించాడు. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ఆరాష్-ఎ-కమాంగిర్ అని పేరు పెట్టింది. -
మెగా డీల్: ఇరాన్‌కు అమెరికా బంపరాఫర్!
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అయితే “మెగా డీల్”లో భాగంగా ఇరాన్‌కు అమెరికా భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఆఫర్లు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం (MoU) దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ అంగీకారం అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశంగా ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.ఇక మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో.. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఈ డీల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది 300 బిలియన్ డాలర్ల విలువైన “పునర్నిర్మాణ పెట్టుబడి నిధి”. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, అమెరికా కంపెనీలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది.అయితే ఈ ఫైల్ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీదే ఉందని.. ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే, శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్న ఈ డీల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్‌సిగ్నల్ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్‌హౌస్‌పైనే నిలిచింది.అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయగా.. బందర్ అబ్బాస్ సమీపంలో ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు జరిపింది. అమెరికా దళాలు ఐదు డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించగా.. ఇరాన్ మాత్రం తమపై దాడులు పునరావృతమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఒమన్, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. “అది అంతర్జాతీయ జలమార్గం.. ఎవరూ దానిపై ఆధిపత్యం చెలాయించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటు టెహ్రాన్‌లో ఆగ్రహానికి దారితీశాయి.మరోవైపు ఇజ్రాయెల్–హెజ్బొల్లా ఘర్షణలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. లెబనాన్, బీరూట్‌లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా.. ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు ఒక్క ట్రంప్ చేతుల్లోనే ఉండటం గమనార్హం. -
పశ్చిమాసియాలో మళ్లీ సెగలు
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ సైనిక స్థావరంపై బుధవారం రక్షణాత్మక దాడికి దిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ అటాక్ డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరాన్ వన్–వే దాడి డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దళాలు క్షిపణులు వర్షం కురిపించాయి. ఐదో డ్రోన్‌ను ప్రయోగించడానికి ఇరాన్ జవాన్లు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఒప్పందం దగ్గర్లోనే ఉంది ఇరాన్ సైనిక శక్తి చాలావరకు క్షీణించిందని, అందుకే తమతో చర్చలకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి తొందరేమీ లేదని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నప్పటికీ ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదన్నారు. అయితే, అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. అలాగైతే ఒమన్‌ను పేల్చేస్తాం: ట్రంప్ హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఒమన్ సహా ఏ ఒక్క దేశాన్ని కూడా అనుమతించబోమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే కొత్త ఒప్పందంలో భాగంగా.. ఇరాన్, ఒమన్ కలిసి హార్మూజ్ గుండా జరిగే రవాణాను నియంత్రిస్తాయంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ జలసంధిని ఎవరూ కంట్రోల్ చేయలేరని అన్నారు. అవి అంతర్జాతీయ జలాలు అని గుర్తుచేశారు.ఒమన్ కూడా అందరిలాగే ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. లేకపోతే మనం ఒమన్‌ను కూడా పేల్చివేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి అమెరికాపై ఇరాన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే, వీటిని కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా సైనిక వర్గాలు గురువారం స్పష్టంచేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. తమ భూభాగంపై దాడి జరిగిందని కువైట్ ప్రకటించింది. అయితే, తమపై తొలుత దాడిచేసినందుకు ప్రతీకారంపై ఓ గల్ఫ్ దేశంలో అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తేల్చిచెప్పింది. ఒమన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒమన్, అమెరికా మిత్రదేశాలు. అమెరికా సైనిక కార్యక్రమాలకు ఒమన్ సహకరిస్తోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రాథమిక ఒప్పందం సిద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆమోదమే తరువాయి వాషింగ్టన్: కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌లు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే ప్రాథమిక ఒప్పందం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇరుపక్షాల ప్రతినిధులు ఇటీవలే 60 రోజుల అవగాహన ఒప్పందం ముసాయిదాపై అంగీకారానికి వచ్చారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే పశ్చిమాసియాలో అతిపెద్ద దౌత్యపరమైన పురోగతిగా నిలిచే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్న తరుణంలో కాల్పుల విరమణ ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చనే భయాందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇరుపక్షాలు ప్రాథమిక ఒప్పందానికి రావడం విశేషం. ఇందులో చాలా అంశాలు మంగళవారం నాటికే ఖరారయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. తమ ఉన్నతస్థాయి నాయకుల నుంచి ఆమోదం పొందామని ఇరాన్ ప్రతినిధులు సైతం పేర్కొన్నారు. దీనిపై తన నిర్ణయం ఏమిటన్నది ఇంకా డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టలేదు. ఒప్పదం ముసాయిదాలోని వివరాలను వైట్ హౌస్ ధ్రువీకరించలేదు. -
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లు కాదు.. “డ్రోన్ వార్” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న “షాహెద్” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్‌గా మారాయి. ఇప్పుడు అదే మోడల్‌ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.ఇరాన్ తయారు చేసిన షాహెద్-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్లకు చిక్కకుండా టార్గెట్‌పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఓవర్‌లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్ సమీప ప్రాంతాలు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్, అరాంకో ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్‌ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఇరాన్ షాహెద్ తరహా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్ “స్వార్మ్ డ్రోన్ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి లాంచ్ సైట్లపై సౌదీ సీక్రెట్‌గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం మొత్తం “డ్రోన్ కోల్డ్‌వార్” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్ ప్రత్యేకతగా భావించిన డ్రోన్ వార్ఫేర్.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడంరాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గందరగోళానికి గురిచేయడంఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడంతక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహంసౌదీకి అసలు భయం ఏంటి?చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుందిఅరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదంగల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుందిసౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశంఅమెరికా ఎందుకు అలర్ట్?గల్ఫ్‌లో అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్నాయిఇరాన్ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందిఅమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకే సవాల్‌గా మారుతోందిగల్ఫ్లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణల్లో తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధ వర్గాలు విడుదల చేసిన ప్రకటనల్లో.. “ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించే ప్రతి చర్యకు సమాధానం ఉంటుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. హర్ముజ్ సమీపంలోని అమెరికా బలగాలు, సముద్ర మార్గాల్లో కదులుతున్న మిలిటరీ కార్యకలాపాలపై తమ నిఘా కొనసాగుతోందని ఇరాన్ పేర్కొంది.మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్‌లోని కొన్ని సైనిక కేంద్రాలపై రాత్రికి రాత్రే కొత్త వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పలు ఇరానియన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు కూడా అమెరికా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న వేళ.. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడం పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తోంది. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ మీడియా “హర్ముజ్‌లో సంయుక్త నిర్వహణ, ఆంక్షల సడలింపు” వంటి అంశాలతో ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “హర్ముజ్ తెరిచే ఉంటుంది.. నియంత్రణ అమెరికా మిత్రదేశాల భద్రతకే ప్రాధాన్యం” అని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కలవరపడుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ చిన్న ఉద్రిక్తత జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.రష్యా, చైనా వంటి దేశాలు ఇరు పక్షాలు అదుపు పాటించాలని పిలుపునిస్తుండగా.. ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా చూస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో “ఇది నిజంగా శాంతి ప్రయత్నమా? లేక యుద్ధానికి ముందు వ్యూహాత్మక ఒత్తిడా?” అన్న చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా హర్ముజ్‌పైనే నిలిచింది. ఎందుకంటే అక్కడి ప్రతి కదలిక ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. -
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్ డ్రామాను తలపిస్తోంది.ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్‌ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ ప్రచారం చేసింది.అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్‌లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్‌హౌస్.. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్‌హౌస్ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్‌పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. -
పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్ విషయంలో ఒమన్ గనుక ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్‌పై విరుచుకపడ్డారుఅమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్ "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్‌ని అన్నారా? లేక ఇరాన్‌కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్హౌస్నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది. -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్‌హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ తన అధికారిక వైట్‌హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్‌ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్‌లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్‌లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. -
నాటోకు అమెరికా భారీ ఝలక్..
ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ భయానక యుద్ధ పరిస్థితులు.. -
యుద్ధం: విషాదంతో పాటు విషం..
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలు..టెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి. నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం. సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్‌లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్‌లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది.మరింత నీటి సంక్షోభంయుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది. పేలుళ్లు, అగి్నప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుíÙతం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్‌లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.అంతరించనున్న అడవులుసంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ. గల్ఫ్ యుద్ధంలోనూఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్‌కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.ఉక్రెయిన్లోనూమరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. -
ఇరాన్‌పై అమెరికా నిప్పుల వర్షం
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సోమవారం దక్షిణ ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టేన్ టిమ్ హాకిన్స్ సోమవారం ప్రకటించారు.ఇవి కేవలం తమ ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని వివరణ ఇచ్చారు. ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను కాపాడుకోవడానికి దాడులకు చేయక తప్పలేదన్నారు. అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు.పడవలపై అమెరికా దాడులు చేయడంతో నలుగురు ఇరాన్ జవాన్లు మరణించినట్లు ‘తబ్నాక్’అనే వార్తా సంస్థ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న, సైనిక ఓడరేవుతోపాటు విమానాశ్రయం కలిగిన బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. తాజా దాడులు కాల్పుల విరమణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి యత్నాలకు భంగం కలిగించొద్దు: ఇరాన్ అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికి సంకేతంగా అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం ఖతార్‌లో చర్చల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టంచేశారు. అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్‌ను కూల్చాం: ఐఆర్జీసీ అమెరికాకు బుద్ధి చెప్పామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్లను, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటపెట్టలేదు. ఆ యురేనియంను నాశనం చేయాల్సిందే: ట్రంప్ ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం(అణు ధూళి)ను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి, నాశనం చేయవచ్చని చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాల్లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ వద్దనున్న యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతు విధించిన విషయం విదితమే. కానీ, తాజాగా ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
రంగంలోకి రష్యా.. యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధమా
-
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. -
తెరపైకి అబ్రహం ఒప్పందం... డీల్ పై తెగేసి చెప్పిన ట్రంప్..
-
మేము అలా అనలేదు ఇరాన్ బిగ్ ట్విస్ట్
-
సీజ్ఫైర్ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్‌లో సీమైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్‌తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్‌సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు లెబనాన్‌లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది. -
సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారు. ఆ ఒప్పందాలపై ఇరాన్ కూడా సంతకం చేయడం గౌరవంగా ఉంటుందని వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన చిక్కుముడిని విడదీయడానికి అమెరికా కృషి చేస్తోందన్నారు. చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలని ఆకాంక్షించారు. ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చని తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల్లో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. అయితే, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు అబ్రహం ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు చేశాయి. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఖమేనీ నుంచి ప్రతిస్పందన ఆలస్యం ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన గుర్తు తెలియని ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఆయనను కలుసుకోవడం ఇరాన్‌లోని అత్యంత ముఖ్యులకు తప్ప ఇతరులకు సాధ్యపడదు. శాంతి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీకి చేరవేయడం, ఆయన నుంచి ప్రతిస్పందన రావడానికి చాలా సమయం పడుతోందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అందుకే శాంతి ఒప్పందం ఖరారు కావడం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఒప్పందం ముసాయిదాను ఖమేనీ దాదాపు అంగీకరించారని సీనియర్ పరిపాలనా అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. చాలామంది ఇరాన్ నాయకులు పగటి వెలుగు చూడకుండా, వారాల తరబడి అత్యంత పటిష్టమైన బంకర్లలో గడుపుతూ, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అమెరికా మీడియా వెల్లడించింది. చర్చల్లో గణనీయమైన పురోగతి: రూబియో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం చెప్పారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తున్నారని, చెడ్డ ఒప్పందాన్ని ఆయన అంగీకరించబోరని తేల్చిచెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం అత్యవసరమేమీ కాదు: ఇరాన్ అమెరికాతో ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యవసరమేమీ కాదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పష్టంచేశారు. చర్చలో ఉన్న చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చామని చెప్పడం సరైనదే అవుతుందన్నారు. అయితే, దీని అర్థం ఒప్పందంపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయని చెప్పడం కాదని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్‌లు ఇప్పటికే ఈ అవగాహనా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 60 రోజులపాటు కాల్పుల విరమణ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళిక వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. -
ఇరాన్ కీలక నిర్ణయం.. ఆ సేవలు పునరుద్ధరణ
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు నెలలు (87 రోజులు) పాటు కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ బ్లాకౌట్ (సేవల నిలిపివేత)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.గత ఐదు నెలలుగా ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఫిబ్రవరి 28 న అమెరికా దాడుల ప్రారంభకానికి ముందు సైతం ఆ దేశంలో తీవ్రంగా అంతర్గత సంక్షోభం తలెత్తింది. ఖమేనీ పాలనకు నిరసనగా ఆ దేశ యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జనవరి 8న ఇరాన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేసింది. మధ్యలొ కొద్దిగా వెసులుబాటు ఇచ్చినప్పటికీ దాదాపుగా నాలుగు నెలల అనంతరం తొలిసారిగా ఆ సేవలనను పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.ఇరాన్ సైబర్ స్పేస్ స్టీరింగ్ అండ్ ఆర్గనైజింగ్ హెడ్‌క్వార్టర్స్ ఉన్నత స్థాయి సమావేశంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణకు అనుకూలంగా 9 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. అనంతరం ఈ వివరాలను ఇరాన్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలియజేశారు.ఇంటర్నెట్ బ్లాకౌట్ కారణాలుదేశంలో ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా జనవరి 8న తొలిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు. అనంతరం జనవరి 23న ఈ ఆంక్షలను కొద్దిగా సడలించినప్పటికీ, ఫిబ్రవరి 28న అమెరికా ,జ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ 'నెట్‌బ్లాక్స్' ప్రకారం.. సాధారణంగా 90% నుండి 100% ఉండే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ బ్లాకౌట్ సమయంలో కేవలం 1% నుండి 2% శాతానికి పడిపోయింది. ఆధునిక ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన, తీవ్రమైన బ్లాకౌట్ అని నెట్‌బ్లాక్స్ పేర్కొంది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సైనిక ఉద్రిక్తతల సమయంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్వతంత్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా కోల్పోయారు.నిరుద్యోగంయుద్ధం, నిరసనలు మరియు ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా దేశంలో దాదాపు 10 లక్షల (1 మిలియన్) మందికి పైగా ఉపాధి కోల్పోయినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. సోషల్ మీడియా ప్రకటనలపై ఆధారపడిన చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, టెక్ స్టార్టప్‌లు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్ల ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొంది. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్‌కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్‌ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్‌ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్ పునఃప్రారంభం..?
ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్‌లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.హర్ముజ్‌లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇటీవల ఇరాన్ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నిర్మలా సీతారామన్ హెచ్చరిక!
అమెరికా-ఇరాన్ యుద్ధం.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ, దేశంలో ఖర్చులను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు ఎఫ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మూడు ఎఫ్‌లు - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు).పెరిగిన ధరలు - ప్రజలపై భారం!ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎరువుల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతోంది. కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.7.38 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. భారత్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.మోదీ పిలుపుప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. కాబట్టి, కొంతకాలం పాటు అవసరం లేని దిగుమతులను తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటి సూచనలు ప్రజలకు, పరిశ్రమలకు ప్రధాని ఇచ్చారని సీతారామన్ గుర్తుచేశారు.ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మాత్రమే సమస్య కాదు. ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను సృష్టిస్తున్నాయని ఆమె వివరించారు.అనేక సమస్యలు ఒకేసారి!అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైన అంశం కాదు, ఇది సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ హెచ్చరించారు. ఇంధన ధరలు పెరగడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు ఒకేసారి ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వచ్చినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) చెల్లింపుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు బకాయిలను చెల్లించాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం! -
అమెరికా డాలర్‌కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్‌కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్‌తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
మిడిల్ ఈస్ట్‌పై ట్రంప్ బిగ్ ప్లాన్.. పాక్, గల్ప్ దేశాల బ్రేక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.అబ్రహాం ఒప్పందం లక్ష్యందౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్‌తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.ఒప్పందంలోని దేశాలు..యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్‌ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.ఇజ్రాయెల్‌కు లాభాలుఅరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్‌కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.ఇజ్రాయెల్‌కు నష్టాలుపాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.అమెరికాకు లాభాలుప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్‌ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.పాలస్తీనా సమస్యలో మార్పులుఅరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇరాన్ అంశంఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్‌ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.పాకిస్తాన్ ఇలా..పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్‌ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్‌కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. -
అమెరికాతో డీల్ ఓకే ఇరాన్ పై గెలిచిన ట్రంప్
-
ఇరాన్ డీల్‌పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్‌పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్‌సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్‌ను బలహీన స్థితిలో చర్చల టేబుల్‌పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. -
ఒప్పందానికి చేరువలో..
వాషింగ్టన్/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలిఇరాన్తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్‌తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్‌ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలన్నారు. మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.ఒప్పందంలో ఏముంది? → ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. → అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. → ఇరాన్ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. → యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది. → హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. → ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు. -
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ్మినిస్ట్రేటివ్‌లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.ఇరాన్ అణ్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. -
ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.భారత్‌లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి. -
బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?
-
ఇరాన్ సరెండర్.. యురేనియంపై ట్రంప్ విజయం!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరాన్ యురేనియం నిల్వల నిర్మూలన పద్దతిపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన దాదాపు 400 కిలోల యురేనియం ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, దాదాపు ఆయుధ స్థాయి యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.🇺🇸🇮🇷 NYT: U.S. officials said Iran has reportedly agreed to give up its stockpile of highly enriched uranium as part of the proposed agreement announced by U.S. President Donald Trump. Officials said details on how the uranium would be removed or downgraded would be discussed… pic.twitter.com/BoNOksRsG4— Global Surveillance (@Globalsurv) May 24, 2026అయితే, ఈ దశలో ఈ అవగాహన ఇంకా విస్తృతంగానే ఉందని, యురేనియంను ఇవ్వడంపై కచ్చితమైన విధానంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆ అధికారులు తెలిపారు. విస్తృత ఒప్పందం అధికారికంగా కుదిరిన తర్వాత, తదుపరి అణు చర్చల దశలో ఇరాన్ ఈ పదార్థాన్ని ఎలా బదిలీ చేస్తుంది, పలుచన చేస్తుంది లేదా ఇతరత్రా తటస్థీకరిస్తుంది అనే దానిపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యురేనియం నిల్వలను దేశం నుండి బయటకు పంపవద్దని ఆదేశించారని ఇరాన్ వర్గాలు ఇటీవల పేర్కొన్న తర్వాత ఈ పరిణామం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేయబడిన దాదాపు 400 కిలోగ్రాముల యురేనియంను కలిగి ఉంది, ఇది ఆయుధ-స్థాయికి దగ్గరగా ఉంది. ఈ నిల్వలను మరింత శుద్ధి చేసి బహుళ అణు బాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు పదేపదే వాదిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, మధ్యప్రాచ్యంలో చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు స్థిరపడే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యుద్దం కారణంగా ఇరాన్‌పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యురేనియం నిల్వను వదులుకోవడానికి అంగీకరించిన ప్రతిఫలంగా, అమెరికా ఈ ఆస్తులను విడదీయడానికి సిద్ధమవుతోంది.ప్రభావం: ఆర్థికంగా ఇరాన్‌కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది.ప్రాంతీయ స్థిరత్వం: ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇరాన్ చర్చల్లో మరింత సహకరించే అవకాశం ఉంది.JUST IN: 🇵🇰🇮🇷 Pakistan official says Iran has agreed to hand over enriched uranium under the Trump-announced deal. pic.twitter.com/OK78Aus5qj— Whale Insider (@WhaleInsider) May 24, 2026ఇదిలా ఉండగా.. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అమెరికా మరోసారి సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మళ్లీ దాడులు జరిగితే ప్రారంభ దశ కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. -
శాశ్వత శాంతి విరమణ ఒప్పందం.. హర్మూజ్ జలసంధి ఓపెన్..!
-
ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఏకంగా ఇరాన్‌ను అమెరికా జెండా రంగులతో కప్పేశారు ట్రంప్. ఇరాన్ దేశ చిత్ర పటాన్ని అమెరికా జెండా రంగులతో ఎడిట్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా దానికి "మధ్యప్రాచ్యపు యునైటెడ్ స్టేట్స్?" అనే క్యాప్షన్ జతచేశారు. దీంతో, ట్రంప్ చర్య.. పెను దుమారానికి దారి తీసింది.అయితే.. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై సాధ్యమయ్యే సైనిక చర్యపై అమెరికా ప్రభుత్వంలో చర్చలు మళ్లీ మొదలైన తరుణంలో ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక, కొన్ని రోజుల క్రితం ఇరాన్ పడవలపై క్షిపణి దాడులు, అంతరిక్ష యుద్ధం, ఇరాన్‌పై ఎగురుతున్న అమెరికా జెండాను చిత్రీకరిస్తూ ఏఐ (AI) రూపొందించిన చిత్రాలను కూడా ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, యాక్సియోస్ నివేదికలో ఉటంకించిన అమెరికా అధికారుల ప్రకారం.. చివరి నిమిషంలో చేసే దౌత్య ప్రయత్నాలు పురోగతిని సాధించడంలో విఫలమైతే, ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.While Rubio speaks of progress in negotiations with Iran and promises to reveal more details in the near future, Trump, meanwhile, continues his media game on social networks. He posts a map of Iran colored in the hues of the American flag, captioning it: “The United States of… pic.twitter.com/sM7GxiqXgv— Military Summary (@MilitarySummary) May 23, 2026ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేదానిపై ఆదివారం ఆయనొక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్లో కొత్తగా దాడులకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని వార్తాసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ నేతలతో మునీర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్‌ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
వైట్‌హౌస్ వద్ద మళ్లీ కాల్పులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ వద్ద మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం ఓ ఆగంతకుడు సీక్రెట్ సర్వీసు సెక్యూరిటీ చెక్‌పాయింట్‌కు వద్దకు దూసుకొచ్చి భద్రతా సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని యూఎస్ సీక్రెట్ సర్వీసు విభాగం వెల్లడించింది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరగడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ట్రంప్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. నేనే ఏసుక్రీస్తుని.. రాజధాని వాష్టింగన్లో వైట్‌హౌస్ కాంప్లెక్స్‌కు ఆనుకొని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగుడు తన బ్యాగ్ నుంచి హఠాత్తుగా ఆయుధాన్ని బయటకు తీసి కాల్పులు ప్రారంభించాడని సీక్రెట్ సర్వీసు అధికారులు తెలిపారు. తాము వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించామని అన్నారు. దుండగుడితోపాటు అతడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. దుండగుడిని నాసిర్ బెస్ట్(21)గా గుర్తించినట్లు చెప్పారు. నాసిర్ బెస్ట్‌కు నేరచరిత్ర ఉంది. డి్రస్టిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టు రికార్డుల ప్రకారం.. 2025 జూలైలో అరెస్టయ్యాడు. అప్పట్లో అనుమతి లేకుండా వైట్‌హౌస్ మరో చెక్‌పాయింట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆగాలంటూ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. తానే ఏసుక్రీస్తునని చెప్పుకున్నాడు. తాను అరెస్టు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అప్పట్లో అతడిపై ప్రాథమిక విచారణ జరిగింది. కానీ, తదుపరి విచారణకు హాజరు కాలేదు. నిందితుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలియజేశారు. టార్గెట్ ట్రంప్? అధ్యక్షుడు ట్రంప్‌ను ఎవరైనా టార్గెట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 25న వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో ఓ హోటల్లో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు అదే హోటల్లో కాల్పులకు తెగబడ్డాడు. మే 4న వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో కాల్పులు జరిగాయి. ట్రంప్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో ట్రంప్ ఉండగానే, బయట సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద యువకుడు కాల్పులు జరిపాడు. వైట్‌హౌస్‌లో ఉన్న ట్రంప్‌పై ఈ కాల్పుల ప్రభావం పడలేదని సీక్రెట్ సర్వీస్ స్పష్టంచేసింది. వాస్తవానికి ట్రంప్ వారాంతాన్ని తన న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్లో గడపాల్సి ఉండగా, దానికి బదులుగా వైట్‌హౌస్‌లోనే ఉండాలని తన ప్రణాళికను మార్చుకున్నారు. కాల్పుల ఘటనపై శనివారం సాయంత్రం వైట్‌హౌస్‌లో ఉన్న జర్నలిస్టులు స్పందించారు. బయట నుంచి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. జర్నలిస్టులు బయటకు రాకుండా సీక్రెట్ సర్వీసు సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, కాల్పులు జరగ్గానే సీక్రెట్ సర్వీసు సిబ్బంది వైట్‌హౌస్ ప్రాంగణం చుట్టూ లాక్డౌన్ విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పరిస్థితి సద్దుమణిగినట్లు గుర్తించి, 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. -
యుద్ధమా? ఒప్పందమా?
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరదించడానికి ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్‌పై బాంబు దాడులు పునఃప్రారంభించాలా? లేదా? అనే దానిపై తన ఆలోచనలు ఫిఫ్టీ.. పిఫ్లీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. ఇరాన్‌తో తాను చక్కటి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని లేదా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్‌లు సైనిక చర్యను నిలిపివేయాలి. ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడమే లక్ష్యంగా 30 రోజుల పాటు విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాలి. చివరి నిమిషంలో జరిగే చర్చలు శాంతి ఒప్పందానికి దారితీయకపోతే, ఇరాన్‌పై కొత్తగా దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఇరాన్ నేతలతో అసిమ్ మునిర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్‌ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
"మీరు నిజాయితీగా.. ట్రంప్‌కు వ్యతిరేకంగా"
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్‌ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్‌కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. -
ఇరాన్ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది?
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతూనే మరోసారి సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై తాజా దాడుల అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు జరిగే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్‌పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.JUST IN: IRAN AIRSPACE COMPLETELY EMPTY!!As per CBS, the US is prepping for possible strikes on Iran.📹FlightRadar24 pic.twitter.com/pDZ6AObtRL— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 23, 2026సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, ఇరాన్‌పై సంభావ్య దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా తన ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్‌కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. చర్చలు చివరి నిమిషంలో ఫలించకపోతే ఇరాన్‌పై కొత్త దాడులకు ట్రంప్ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. "ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వాళ్లు అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ అనుమతించం. అందుకే మేము కఠిన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ అన్నారు.ఇదే సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నారు. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే చర్చలు చాలా క్లిష్టంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రాఫ్ట్‌లు మారుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదని పేర్కొంటున్నారు. -
టెన్షన్ పడుతున్న ట్రంప్.. ఇవాంక హత్యకు మాస్టర్ ప్లాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇరాన్ ఐఆర్‌జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే, అతడు తన ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయినట్టు తెలిసింది. దీంతో, ఇవాంక ట్రంప్‌నకు పెను ప్రమాదం తప్పందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే, ఐఆర్‌జీసీతో సంబంధాలున్న మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ(32) కొంతకాలం క్రితం తుర్కియేలో అరెస్టు అయ్యాడు. అరెస్టు అనంతరం, అతడిని అమెరికాకు తరలించారు. ఈ క్రమంలో అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంక కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ ప్లాన్ చేసినట్టు సదరు కథనంలో పేర్కొన్నారు. కానీ, అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలియజేసింది. అతడు అరెస్ట్ కాకపోయి ఉంటే ప్రమాదం జరిగేదనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్‌కు కమాండర్‌గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్‌వర్క్‌లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.#BREAKING: An IRGC-linked suspect accused of plotting to assassinate Ivanka Trump has been captured.Reports claim the suspect possessed a blueprint of her Florida home and had allegedly vowed to target the former First Daughter. pic.twitter.com/ONINXJwDVL— upuknews (@upuknews1) May 23, 2026 -
ఇరాన్‌పై మెరుపు దాడులకు ట్రంప్ కసరత్తు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్‌పై మరో విడత దాడులకు దిగాలని ఆయన ఆలోచిస్తున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కీలక పరిణామంపై చర్చించేందుకు ట్రంప్ ఇప్పటికే తన ఉన్నత స్థాయి భద్రతా బృందంతో అత్యవసరంగా సమావేశమయ్యారు.చర్చల విఫలం.. పెరుగుతున్న ఒత్తిడిశాంతి చర్చల కోసం ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ‘యాతనాభరితంగా’ సాగుతున్నాయని, ప్రతిరోజూ ముసాయిదాలు మారుతున్నా, ఒప్పందం కుదిరే సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండటం అమెరికాకు ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు ఒకే ఒక్క ‘నిర్ణయాత్మక’ భారీ సైనిక ఆపరేషన్ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.పాకిస్థాన్ మధ్యవర్తిత్వ యత్నాలుమరోవైపు, యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ సైనిక ప్రధానాధికారి అసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన టెహ్రాన్‌లో పర్యటిస్తూ, ఇరాన్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ శాంతి ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలు ఇంకా సడలిపోతేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ ఒక అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ మేరకు ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.వాషింగ్టన్లోనే ట్రంప్.. మారుతున్న వ్యూహాలుపరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ తన వ్యక్తిగత పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు. కుమారుడి వివాహం వంటి కీలక వ్యక్తిగత కార్యక్రమాలను పక్కన పెట్టి, తాను వైట్ హౌస్‌లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని ఆయన ప్రకటించారు. మంగళవారం నాటి వరకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలనే ధోరణిలో ఉన్న ట్రంప్, గురువారం రాత్రి నాటికి దాడుల వైపు మొగ్గు చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రాబోయే గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం -
ఇరాన్‌ను ఒప్పించడానికి పాక్ యత్నాలు ముమ్మరం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందం దిశగా ఇరాన్‌ను ఒప్పించడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఆయన కొనగిస్తున్నారని తెలిపాయి. టెహ్రాన్ ఎయిర్‌పోర్టులో అసిమ్ మునిర్కు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమెనీ స్వాగతం పలికారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారమే ఇరాన్‌కు చేరుకున్నారు. అసిమ్ మునిర్ ఇరాన్ ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు. అబ్బాస్ అరాగ్చీతో నఖ్వీ భేటీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ శుక్రవారం సమావేశమయ్యారు. వారిద్దరూ భేటీ కావడం గత 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసిన ప్రతిపాదనలను వారు సమీక్షించారు. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య విభేదాలను తొలగిండమే ధ్యేయంగా నఖ్వీ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు. -
ఇరాన్ దాడులకు చెక్.. యూఏఈ సరికొత్త వ్యూహాం
ఇరాన్ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ చమురు నిల్వ కేంద్రాలను రక్షించుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త రక్షణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యూఈఏ ప్రభుత్వం చమురు నిల్వ కేంద్రాల చుట్టూ డ్రోన్ నిరోధక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరలవుతున్నాయి. భారీ డ్రోన్లు దాడి చేసినా, అవి నేరుగా చమురు ట్యాంకులను తాకకుండా అడ్డుకోవడమే ఈ 'యాంటీ-డ్రోన్' వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో నడుస్తున్న యుద్దం వాతావారణంలో ఇరాన్.. వ్యూహాత్మకంగా యూఏఈను టార్గెట్ చేస్తూ తమ హెచ్చరికల తీవ్రతను పెంచింది. చమురు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, చివరికి ఒక అణు రియాక్టర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో మరోసారి దాడి చేస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే తమ చమురు నిల్వ కేంద్రాలను కాపాడుకునేందుకు యూఏఈ పటిష్ట చర్యలను మొదలు పెట్టింది.మరోవైపు తమపై నిఘా పెట్టేందుకు, ఉమ్మడి వ్యూహాలు రచించేందుకు యూఏఈ తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా, ఇశ్రాయేల్ రక్షణ సంస్థలతో పంచుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్‌తో కలిసి ఒక భారీ నిధిని ఏర్పాటు చేస్తున్నాయి.ఈ రెండు దేశాలు కలిసి అత్యాధునిక యాంటీ-డ్రోన్ ఆయుధాలను తయారు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఏఈని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగినట్లు తెస్తోంది.చదవండి: స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ! -
అమెరికాకు కొత్త టెన్షన్.. ఇరాన్‌పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. యుద్ధం కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న బాంబు, క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించారు. దీంతో, ఇరువైపులా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షీణించిన తన సైనిక సామర్థ్యాలను అంచనా వేసిన దాని కంటే చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది.అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దాని కంటే వేగంగా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50 శాతం ఇంకా మిగిలి ఉన్నాయి. యుద్ధ సమయంలో కోల్పోయిన ఆయుధాలను ఇరాన్ చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. నెల రోజుల క్రితం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించింది. అయితే, అమెరికాతో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో డ్రోన్లే ఇరాన్ యొక్క ప్రధాన ఆయుధం.యుద్ధం సంఘర్షణలో దెబ్బతిన్న క్షిపణి స్థానాలు, ప్రయోగ పరికరాలు, మరియు కీలక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి శ్రేణులను మరమ్మత్తు చేయడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఇరాన్ ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కోల్పోయిన సైనిక బలాన్ని పునరుద్ధరించుకుంటోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం, ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలకు మరోసారి ముప్పుగా మారగలదు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ల దాడి పరిధిలోనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తీవ్రంగా క్షీణించడంతో, టెహ్రాన్ ప్రత్యామ్నాయంగా డ్రోన్ యుద్ధం వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. ఈ ముప్పును ప్రాంతీయ మిత్రదేశాలు ప్రత్యేక ఆందోళనతో చూస్తున్నాయి.గతేడాది ఇజ్రాయెల్‌తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది. తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై వేలాది బాంబులను వేశాయి.ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది. క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం..ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్ వరకు చేరుకోగలవు.డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..షహాబ్ 1... 300 కిలోమీటర్లుఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లుషహాబ్ 2... 500 కిలోమీటర్లుజుల్ఫిఖార్... 700 కిలోమీటర్లుఖియామ్ 1... 750 కిలోమీటర్లుషహాబ్ 3... 2000 కిలోమీటర్లుమరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు దీర్ఘకాలంలో ఇరాన్ సైన్యాన్ని ఎంతగా దెబ్బతీశాయనే విషయాన్ని కూడా అమెరికా నిఘా వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. క్షిపణుల తయారీకి ఉపయోగించే విడిభాగాలను చైనా ఇరాన్‌కు సహాయం చేస్తోంది. అయితే అమెరికా దిగ్బంధనం కారణంగా ఆ సహాయం పరిమితం చేయబడింది. అలాగే, రష్యా నుంచి కూడా ఇరాన్ సాయం అందుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదిలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్‌పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి.అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్‌లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. మొత్తం మీద ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అమెరికాకు కొత్త టెన్షన్‌ను తెచ్చిపెట్టింది. -
"తీసుకుంటాం, తుడిచేస్తాం"
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద భారీగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు.ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభించడానికి ప్రధాన కారణం టెహ్రాన్ అణుబాంబు తయారు చేస్తోందనే ఆరోపణ. ఆ దేశానికి గనుక అణ్వాయుధాలు అందితే అది అత్యంత ప్రమాదమని అమెరికా దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన అణ్వాయుధ తయారీ కేంద్రాలపై అమెరికా పలుమార్లు దాడులు చేసింది. కాగా ట్రంప్ తాజాగా మరోసారి అణుబాంబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లో అమెరికా స్వాధీనం చేసుకొని తీరుతుందని ప్రకటించారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మాకు అది అవసరం లేదు. కానీ మేము అది పొందుతాం. మాకు అది కావాలి. దానిని మేము పొందిన తర్వాత పూర్తిగా వినాశనం చేస్తాం. కానీ ప్రస్తుతం అది మాకు కావాలి" అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌లోని యురేనియం నిల్వలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ వద్ద దాదాపు 900 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా గతేడాది జరిపిన దాడుల్లో ఆ నిల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వాదిస్తున్నారు.మోజ్తాబా కీలక ప్రకటనఅయితే ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్‌లోని యురేనియం నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ విషయంలో ఏం చేద్దాం?
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధం విషయంలో ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ తలపట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని ముగించాలా? లేక కొనసాగించాలా? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇరాన్ లొంగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఇరాన్ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై వారు విస్తృతంగా చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. దాడులు పునఃప్రారంభించే ఆలోచన లేదని సంకేతాలిస్తోంది. కానీ, మళ్లీ దాడులు చేయాల్సిందేనని నెతన్యాహు పట్టుబడుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి, కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆ దేశ పాలనా వ్యవస్థను దెబ్బకొట్టడానికి దాడులు పునఃప్రారంభించాలని అంటున్నారు. ఇరాన్‌పై తలపెట్టిన దాడులను ఖతార్, యూఏఈ సహా అరబ్ దేశాల అభ్యర్థన మేరకు వాయిదా చేసినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం పాకిస్తాన్, ఖతార్‌లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య అంతరాలను పూడ్చే ప్రయత్నంలో భాగంగా సవరించిన శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని భావిస్తున్నాననిజ.. కానీ, అలా జరగకపోతే యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొంటున్నారు. అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ మంత్రి భేటీ టెహ్రాన్: పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ నఖ్వీ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో సమావేశమయ్యారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై వారిద్దరూ చర్చించుకున్నారు. తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. -
అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక డిమాండ్‌ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్‌కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన్నారు” అని తెలిపారు.అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.అమెరికా దాడులు చేయనుందా? ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు. -
పెట్రోల్ ఇక దొరకదు! సంక్షోభం రాకముందే జాగ్రత్త..
-
హార్మూజ్‌పై పట్టుకు ఇరాన్ ప్లాన్.. అథారిటీ ఏర్పాటు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్ చేసింది.ఇదే ఉదాహరణ.. కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్‌తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.ప్రభావంప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్‌పై చర్చిస్తున్నాయి. -
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్‌తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని బాంబు పేల్చారు. ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్, అమెరికా మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మాకు సరైన సమాధానాలు రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా చేయిదాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ నుంచి మాకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారు. ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉంది. ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది’ అని అన్నారు.ఇదే సమయంలో ఇరాన్‌కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుందా? లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందా? అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు.ఒప్పందం కుదరకపోతే భారీ దాడి..అంతకుముందు.. ఇరాన్‌పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్‌తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. -
42 యుద్ధవిమానాలను కోల్పోయిన అమెరికా
వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ వాయుసేన ను చావుదెబ్బ తీశామని గొప్పలు చెప్పకునే అమెరికా సైతం రణరంగంలో భారీస్థాయిలో ఆయుధాలు, యుద్దవిమా నాలను కోల్పోయిందని అమెరికా చట్టసభలు వెలువర్చిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికా చట్టసభల లైబ్రెరీలో భాగమైన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్స్)లోని విదేశాంగ, యుద్ధ, వాణిజ్యవిభాగంలోని విషయనిపుణులు, పరిశోధకులు, న్యాయవాదులు సంయుక్తంగా పారదర్శకంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారంఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఇరాన్ యుద్ధంలో మొత్తంగా 42 యుద్ధవిమా నాలను ట్రంప్ బలగాలు కోల్పోయాయి. ఇందులో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు, ఎఫ్–35ఏ లైట్నింగ్–2 యుద్ధవిమానం, ఏ–10 థండర్‌బోల్ట్–2 భూతలదాడుల యుద్ధ విమానం, కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానం, ఈ–3 సెంట్రీ అవాక్స్ నిఘా, పర్యవేక్షణ కమాండ్ విమానం, ఎంసీ–130జే కమాండో–2 ప్రత్యేక ఆపరేషన్ల విమానం, హెచ్‌హెచ్–60 డబ్ల్యూ జోలీ గ్రీన్2 హెలికాప్టర్, 24 ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు, ఎంక్యూ–4సీ ట్రైటన్ డ్రోన్లు ఉన్నాయి. యుద్ధవిమా నాలు, వాహనాలు, మందుగుండు, సాయుధ ఉపకరణాలు మొత్తంగా కలిపి ఇప్పటిదాకా రూ.2.81 లక్షల కోట్ల విలువైన రక్షణరంగ ఆస్తులను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. -
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. -
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి. -
ఇరాన్‌తో యుద్దం.. అమెరికాకు భారీ షాక్!?
ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్ఎస్ సిద్దం చేసింది.ఇరాన్‌తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్‌బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్‌సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్‌పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్‌కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్‌లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్‌ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్‌లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్‌కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్‌ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్‌ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్‌లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీవైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అహ్మదీనెజాద్ ఎందుకు ?వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్‌ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
ట్రంప్, నెతన్యాహును చంపిన వారికి భారీ బహుమతి?
-
మరో గంటలో దాడి చేద్దామనుకున్నా
వాషింగ్టన్: శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొండికేస్తున్న ఇరాన్‌ను ఎలాగైనా దారికి తెచ్చేందుకు ఆ దేశంపై దాడి చేద్దామని నిర్ణయించుకున్నామని, అయితే చివరినిమిషంలో ఆ ప్రణాళికను పక్కనపెట్టేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మంగళవారం దాడిచేయాలని భావించామని సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన ట్రంప్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచి్చందో వివరించారు. మంగళవారం శ్వేతసౌధం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘జనం ఆశ్చర్యపోయినా, ఆశ్చర్యపడకపోయినా నాకు అనవసరం. శత్రుదేశం అణ్వాయుధాలను చేజిక్కించుకుని నా కళ్లముందే ప్రపంచం బద్ధలుకాకముందే తేరుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇరాన్‌పై దాడిచేయాలని ప్రణాళిక సిద్ధంచేశా. గంటలో దాడి చేద్దామనుకునేలోపే గల్ఫ్ దేశాల నుంచి నాకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఖతర్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తోపాటు కువైట్, బహ్రెయిన్ నుంచీ నాకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దాడి నిర్ణయాన్ని విరమించుకోవాలని వాళ్లు సూచించారు. ఇరాన్‌తో చర్చలు సీరియస్‌గా జరుగుతున్న ఈ సమయంలో దాడులు సముచితం కాదు అని వాళ్లు అభిప్రాయపడ్డారు. దీంతో దాడి చేయలేదు. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకూడదనే షరతుతోనే శాంతి ఒప్పందం కుదరాలి. అలా జరగని పక్షంలో తక్షణం దాడి చేయాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేనియల్ కేన్, సైన్యం, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు సూచించా’’అని చెప్పారు. -
ట్రంప్ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. “రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే, కొత్త దాడులు తప్పవు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థనతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశానని.. ఇరాన్ దిగి రాకుంటే వారాంతంలో దాడులు తప్పవని సంకేతాలిచ్చారాయన. ఈ అల్టిమేటంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పందించారు. అదే జరిగితే తామేంటో చూపిస్తామని అంటున్నారాయన. ‘‘మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బ తీయం. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు హెచ్చరికలు జారీ చేశారాయన. అలాగే.. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్‌ను కూల్చివేసిందని చెప్పిన అరగ్చి.. అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలోనే జరిగిన నష్టాలు బయటపడ్డాయని గుర్తుచేశారు.అరగ్చి చెప్పిన “మరిన్ని సర్ప్రైజ్లు” అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు, దాడుల స్వభావం చూసుకుంటే మాత్రం.. అధునాతన డ్రోన్ దాడులు: ఇరాన్ ఇప్పటికే అమెరికా MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసింది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, స్వార్మ్ (గుంపులుగా వచ్చే) డ్రోన్ దాడులు జరిగే చాన్స్ లేకపోలేదు.మిసైల్ దాడులు: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసి KC-135 ట్యాంకర్లు, E-3 AWACSను దెబ్బతీసింది. ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి దాడులే మళ్లీ జరగవచ్చు.సైబర్ దాడులు: ఇరాన్ గతంలో అమెరికా నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కొత్త యుద్ధంలో సైబర్ రంగంలో పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చు.సముద్ర మార్గాల అడ్డంకులు: హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలవుతుంది.అనూహ్యమైన ఆయుధ వినియోగం: అరగ్చి చెప్పిన “సర్ప్రైజ్”లో కొత్త రకం యుద్ధ సాంకేతికత, లేదంటే ఇప్పటివరకు బయటపడని ఆయుధాలు ఉండే అవకాశం ఉంది.కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక A-10 థండర్‌బోల్ట్, రెండు MC-130J ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక KC-135 ట్యాంకర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా.. F-35A జెట్, E-3 సెంట్రీ AWACS, HH-60W హెలికాప్టర్ వంటి విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ విభాగం పెంటగాన్ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చింది.ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్‌కు దిగింది. అయితే.. ఏప్రిల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ, ఆపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు అడుగులు పడడంతో యుద్ధం ముగియవచ్చని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, అరఘ్చి హెచ్చరికలతో యుద్ధం మరోసారి మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఘర్షణలు ఏ సంక్షోభానికి దారి తీస్తాయోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
షిడ్వార్ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు
దుబాయ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు మొదలెట్టాక హార్మూజ్ జలసంధి సమీపంలోని షిడావ్ర్ ద్వీపాన్ని చమురుతెట్టు చుట్టేసింది. ఇప్పుడు చమురుతెట్టు అక్కడి జీవావరణంపై గొడ్డలిపెట్టుగా తయారైంది. షిడ్వార్ ద్వీపంలోని సముద్రతీరాలను పెద్దమొత్తంలో ముడిచమురుతో జిగటగా తయారైన అలలు పోటెత్తుతున్నాయి. ద్వీపం తీరం మొత్తాన్నీ దాదాపు చమురుతెట్టు ఆక్రమించేసింది. ఈ జీవావరణ విధ్వంసం తాలూకు వివరాలు సంబంధిత ఉపగ్రహ చిత్రాలు, ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల తర్వాత పెద్దమొత్తంలో ముడిచమురు సముద్రజలాల్లోకి చేరింది. ఇది పల్చని పొరలా సముద్రఉపరితల జలాలపై పేరుకుని అలలరూపంలో సమీప ద్వీపాల తీరాలకు చేరుతోంది. వీటితోపాటు ఇరాన్‌కు చెందిన ఎహ్సాన్ జలాలీ అనే వ్యక్తితీసిన స్మార్ట్‌ఫోన్ వీడియో ఫుటేజీ సైతం షిడ్వార్ ద్వీపంలో జరిగిన జీవావరణ విధ్వంసాన్ని కళ్లకుకడుతోంది. తాబేళ్లు, పక్షులు, స్క్వాడ్చేపలు, డాలి్ఫన్లు ఇలా పలురకాల జీవులు చమురుతెట్టులో చిక్కుకుని చనిపోతున్నాయి. 30 సెంటీమీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీసే ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ప్లీడస్ నియో ఆప్టికల్ శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోలనూ తాజాగా విడుదలచేశారు. ఏప్రిల్ పదో తేదీన ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడి తర్వాత రెండ్రోజులైనా అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. షిడ్వార్ ఐలాండ్‌ను స్థానికంగా మరో ద్వీపం అని కూడా పిలుస్తారు. చిత్తడి నేలలకు ఈ ద్వీపం ప్రసిద్ధి. ఇరాన్లో కని్పంచే బుల్లి ‘టెర్న్’పక్షు లు, సముద్రపక్షులకు ఈ ద్వీపం ఆలవాలంగా ఉంది. చిత్తడినేలలను భూమి సహజ ఊ పిరితిత్తులుగా పేర్కొంటారు. మురుగునీరు విస్తరించకుండాచేసి, భూగర్భజలాలను శుద్ధిచేసే నేలలుగా చిత్తడినేలలుప్రసిద్ధిచెందాయి. ఇప్పుడివి నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. -
ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇరాన్ పార్లమెంట్‌కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో తిరస్కరణల పరంపర కొనసాగుతుండడంతో మరోసారి మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి."ఇరాన్‌తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు. కాగా ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులను కలిగి ఉన్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. -
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది. -
పశ్చిమాసియా, క్రూడ్‌పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్‌ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్‌లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్‌లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్‌తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్‌గేర్‌లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్‌ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్‌కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్‌చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది. -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్‌తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య సీజ్ఫైర్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.చైనా రాగం పాడిన ట్రంప్చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. -
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
ఇరాన్ సమాంతర శక్తి కేంద్రం
దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వం, అధ్యక్షుడు, సైన్యం, పార్లమెంట్ వంటి వ్యవస్థలే ప్రధాన అధికార కేంద్రాలుగా కనిపిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అక్కడ బాహ్యప్రపంచానికి కనిపించే ప్రభుత్వ వ్యవస్థలతో పాటు, మరొక సమాంతర శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. అదే ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ). పర్షియన్ భాషలో దీనిని ‘సెపాహ్–ఎ పాస్దారాన్–ఎ ఎంగెలాబ్–ఎ ఇస్లామీ’ అని పిలుస్తారు. దీని అర్థం ఇస్లామిక్ విప్లవ పరిరక్షక దళం. పేరుకు ఇది భద్రతా సంస్థ మాత్రమే. కాలక్రమేణా ఇరాన్ రాజకీయ ముఖచిత్రం, విదే శాంగ వ్యూహం, సామాజిక నియంత్రణ, ప్రాంతీయ వ్యూహాత్మక కార్యకలాపాలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేసే కేంద్రంగా పరిణమించింది. అందుకే పశ్చిమ దేశాల విశ్లేషణల్లో ఐఆర్జీసీని ‘దేశంలో మరో దేశం’గా అభివర్ణిస్తుంటారు.1979 విప్లవంతో మొదలు...ఈ సంస్థ ఆవిర్భావాన్ని ఆకళింపు చేసుకోవాలంటే 1979 ఇరాన్ విప్లవాన్ని పరిశీలించాలి. అప్పటివరకు ఇరాన్లో పాలన సాగించిన షా మహమ్మద్ రేజా పహ్లవి – పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా–బ్రిటన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గణనీయ స్థాయి సహజ వనరులు కలిగిన ఇరాన్‌పై పాశ్చాత్య ప్రభావం పెరుగుతుండటం దేశంలో అసంతృప్తికి దారితీసింది. ఇస్లామిక్ వర్గాలు, జాతీయవాద శక్తులు, విద్యార్థులు, వామపక్షాలు ఐక్యంగా షా పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అప్పుడు మత పెద్దగా ఉన్న అయతుల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన విప్లవం షా పాలనకు చరమగీతం పాడింది. దాంతో, ఇస్లామిక్ రిపబ్లిక్కు అంకురార్పణ జరిగింది.కొత్త ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి: విప్లవం ద్వారా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థను దీర్ఘకాలం ఎలా కాపాడాలి? పాత శక్తులు తిరిగి పుంజుకోకుండా ఎలా నిరోధించాలి? చమురు సంపదపై దృష్టి పెట్టిన పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఎలా ఎదు ర్కోవాలి? ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాలనను అంత ర్గతంగా, బాహ్యంగా సవాలు చేసే శక్తులను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా, అప్పటి ప్రథమ సుప్రీం లీడర్ ఖొమేనీ నాయకత్వంలో ఐఆర్జీసీ పురుడు పోసుకుంది.ఇక్కడే ఇరాన్ సంప్రదాయ సైన్యం ‘ఆర్టేష్’ అంటే అగ్ని, ఐఆర్జీసీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇతర దేశాల సైన్యాల లాగానే ఆర్టేష్ విధులు దేశ సరిహద్దులను రక్షించడం, సాంప్రదాయ యుద్ధాలలో దేశాన్ని కాపాడటం. కానీ ఐఆర్జీసీ లక్ష్యం కేవలం భూభాగ పరిరక్షణ మాత్రమే కాదు, ఇస్లామిక్ విప్లవాన్నీ, దాని భావజాలాన్నీ కాపాడటం కూడా దీని ప్రధాన బాధ్యతగా నిర్దేశించ బడింది. అందువల్ల, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత రాజ కీయ అస్థిరత, సామాజిక నిరసనల వంటి అంశాలను కూడా ఇది భద్రతా సమస్యలుగా పరిగణిస్తుంది. ఈ విస్తృత పాత్రే కాలక్రమేణా ఐఆర్‌జీసీకి ఎనలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.ప్రభుత్వం వర్సెస్ ఐఆర్జీసీఇరాన్ అధికార వ్యవస్థలో అత్యున్నత స్థానం ‘సుప్రీం లీడర్’ది. ఇది కేవలం రాజకీయ పదవి మాత్రమే కాదు; తొమ్మిది కోట్ల మంది ఇరానీయులను ఏకీకృతం చేయగల మతపరమైన అత్యున్నత అధి కార హోదా కూడా. ఖొమేనీ తర్వాత దశాబ్దాల పాటు అలీ ఖమేనీ ఆ పదవిలో తిరుగులేని అధికారం చలాయించారు. ప్రస్తుత ఉద్రి క్తతల నడుమ, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ బాధ్యత చేపట్టారు. ఐఆర్జీసీ నేరుగా సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్, మంత్రివర్గం వంటి వ్యవస్థలకు ఇది పూర్తిగా లోబడి ఉండదు. ఫలితంగా, ఒకవైపు ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీం లీడర్‌కు నేరుగా అనుసంధానమైన ఐఆర్జీసీ కూడా సమాంతరంగా పని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు వ్యవస్థల బాధ్యతల మధ్య స్పష్టమైన విభజన రేఖ లేకపోవడం బాహ్యప్రపంచాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. ఈ ద్వంద్వ నిర్మాణమే ఇరాన్‌ను పశ్చిమాసియాలో ఇతర దేశాలకంటే భిన్నంగా నిలబెట్టింది.కాలక్రమేణా ఐఆర్జీసీ ఒక విస్తృత భద్రతా వ్యవస్థగా ఎదిగింది. దీనిలో భూసేన, నౌకాదళం, వైమానిక విభాగం, క్షిపణి వ్యవస్థలు, గూఢచార యంత్రాంగం, సైబర్ సామర్థ్యాలు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ‘ఖతమ్ అల్–అన్బియా’ వంటి కేంద్ర కమాండ్ వ్యవస్థలు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇందులో సుమారు 1–2 లక్షల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చమురు, నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా దీని అనుబంధ సంస్థల ప్రభావం గణనీయంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక మాజీ ఐఆర్జీసీ పదాధికారులు ఉత్తరోత్తరా ప్రభుత్వ వ్యవస్థలో కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్, మంత్రివర్గం, ప్రాంతీయ పరి పాలన, వ్యూహాత్మక సంస్థలు వంటి అనేక రంగాల్లో వీరి ప్రభావం విస్తరించింది.ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో ‘బసీజ్’ అనే అనుబంధ బలగం కీలక పాత్ర పోషిస్తుంది. ‘బసీజ్’ అంటే సమీకరణ అని అర్థం. ఇది సంప్రదాయ సైన్యం, పోలీసు, పారామిలిటరీ బలగాల వంటి వ్యవస్థీకృత విభాగం కాదు. విద్యార్థులు, కార్మికులు, ప్రభు త్వోద్యోగులు, వ్యాపారులు వంటి అనేక సామాజిక వర్గాలవారుఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరమైనప్పుడు, ఐఆర్జీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా సేవలందిస్తారు. ఇటీవలి సంవత్స రాల్లో ఇరాన్లో జరిగిన నిరసనల సమయంలో, బసీజ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతలను ఆపగలిగేది ఎవరు?ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న అంతర్జాతీయ వివాదాల్లో కూడా ఐఆర్జీసీ పేరు తరచూ వినిపిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అణు కేంద్రాల తనిఖీ లకు అనుమతించడంలో నియంత్రణలు, అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనా అనే అనుమానాలు– ఈ అన్ని చర్చల్లో ఐఆర్జీసీ కీలకంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక వైపు కొనసాగుతుండగా; భద్రతా–భావజాల వ్యవస్థగా ఐఆర్జీసీ సమాంతరంగా ప్రభావాన్ని, ప్రాభవాన్ని కొనసాగిస్తోంది. అధికారిక నిర్ణయాలు ప్రభుత్వం పేరుతో వెలువడినా; వాటి నేపథ్యాన్ని, దిశను ప్రభావితం చేయడంలో దీని పాత్ర స్పష్టం.ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమసిపోని ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలను మరో మలుపు తిప్పగల సామర్థ్యం ఇరాన్ వ్యవస్థల్లో దేనికైనా ఉందంటే, అది ఐఆర్జీసీకేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్‌కు ప్రతి నిధిత్వం వహించిన భారీ బృందంలో ఐఆర్జీసీ సభ్యుల పాత్రే కీల కంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. హార్మూజ్ జలసంధి, దాని గుండా భారత్‌కు ప్రవహించే చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపగల వ్యూహాత్మక స్థాయిలో ఐఆర్జీసీ నిలిచింది.వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు, పశ్చిమాసియాలో పనిచేశారు. -
బ్రిక్స్: హర్ముజ్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి దిగ్భందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన వేళ బ్రిక్స్ సదస్సు వేదికగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి , ఎర్ర సముద్రం వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడం వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు.నిన్న మే15 (గురువారం) జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం చేశారు."శాంతి ఎవరికో ఒకరికే పరిమితం కాదు స్థిరత్వం అనేది కొందరికే పరిమితం కాకూడదు,శాంతి అనేది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు" అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి, చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి " అని అన్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగకుండా చూడాలని, అలాగే ఏకపక్ష ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బ్రిక్స్ దేశాలు "ఆచరణాత్మక మార్గాలను" వెతకాలని భారత విదేశాంగ మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో పరోక్షంగా ఇరాన్‌కు సూచనలు చేస్తూ జైశంకర్ ప్రసంగించారు. అయితే ఈ సదస్సులో ఇరాన్ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.ఇరాన్ - UAE మధ్య వివాదంకాగా ఈసమావేశంలో ఇరాన్ , యూఏఈ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాలుఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేకపోతున్నాయి.బ్రిక్స్ కూటమి2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా.. 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్‌లో చేరింది. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ జనాభాలో సుమారు 49.5% కి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్‌పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్‌పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్‌ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్‌లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
భారత్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. పర్యటన ఫలిస్తుందా..?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.సమావేశ ప్రధాన లక్ష్యాలు"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్‌తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc— ANI (@ANI) May 13, 2026 -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్‌కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్‌కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
చైనా పర్యటనకు ట్రంప్.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్‌నే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్‌పింగ్‌తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.నాటోపై ట్రంప్ అసంతృప్తిఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.President Donald J. Trump departs Washington D.C. for a historic visit to China! pic.twitter.com/8Qok0Xcqcd— The White House (@WhiteHouse) May 12, 2026చైనా పర్యటనలో ట్రంప్‌తో మస్క్, టిమ్ కుక్.. బీజింగ్‌తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్‌తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.తైవాన్, అమెరికా సంబంధాలపై.. ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్‌కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. -
పాక్ వైమానిక స్థావరంలో ఇరాన్ యుద్ధ విమానాలు
వాషింగ్టన్: పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య మధ్యవర్తిగా పాకిస్తాన్ ప్రదర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఇరాన్ సైనిక విమానాలను నిలిపి ఉంచడానికి పాకిస్తాన్ తన కీలక వైమానిక స్థావరాల్లో ఒకదానిలో అనుమతించిందని ఓ నివేదిక వెల్లడించింది. రావల్పిండికి కొద్ది దూరంలో ఉన్న నూర్ ఖాన్‌లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరానికి ఇరాన్ అనేక కీలక రక్షణ ఆస్తులను తరలించిందని పేర్కొంది. అధికారికంగా కాల్పుల విరమణ ప్రయత్నాలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్ తన సైనిక, విమానయాన ఆస్తులను రక్షించుకోవడానికి ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక స్థావరం ఆశ్రయాన్ని కల్పించింది.ఈ సైనిక పరికరాలలో, లాక్‌హీడ్ సంస్థ తయారు చేసిన సి–130 హెర్క్యులస్ వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన నిఘా, గూఢచార సేకరణ వేరియంట్ అయిన ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సి–130 కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్–అమెరికా సంక్షోభ సమయంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, ఇరాన్‌కు గానీ, దాని మిత్రదేశం, పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనాను గానీ దూరం చేసుకునే చర్యలకు పాక్ దూరంగా ఉండటాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న వైమానిక, సైనిక ఆస్తులను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ తరలింపునకు కారణమై ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. నివేదికపై తీవ్ర వ్యతిరేకత.. ఈ నివేదిక అమెరికాలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాక్ తటస్థతను అమెరికా చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహిత మిత్రుడు, సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ఎక్స్‌లో స్పందించారు. ఈ సంక్షోభంలో పాకిస్తాన్ దౌత్య పాత్రను పునఃసమీక్షించాలని పిలుపునిచ్చారు.‘ఈ నివేదిక కచ్చితమైనదైతే, ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్‌పై పాకిస్తాన్ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను గమనిస్తే, ఇది నిజమైనా నేను ఆశ్చర్యపోను’అని గ్రాహం పేర్కొన్నారు. అయితే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు సంబంధించిన ఆరోపణలను పాకిస్తాన్ సీనియర్ అధికారి ఖండించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఆ బేస్ ఉన్నందున అటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు. కాబూల్‌లోనూ.. అంతేకాదు, ఇరాన్ పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ విమాన ప్రయాణాల్లో సైనిక విమానాలు ఉన్నాయో, లేదో స్పష్టంగా తెలియదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఘర్షణలు ప్రారంభం కావడానికి కొద్ది ముందే మహాన్ ఎయిర్ విమానం ఒకటి కాబూల్‌లో దిగిందని, ఇరాన్ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని ఆఫ్ఘన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల తర్వాత కాబూల్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు పెరగడంతో, ఆ విమానాన్ని ఇరాన్ సరిహద్దు సమీపంలోని హెరాత్ విమానాశ్రయానికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిడ్ తోసిపుచ్చారు. -
ఇరాన్‌కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
పర్షియన్ గల్ఫ్ లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ కు ట్రంప్.. నెతన్యాహు వార్నింగ్స్
-
రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.లావన్ ఐలాండ్ టార్గెట్‌గా దాడిగత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీయూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్‌బేస్ నూర్ ఖాన్‌ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్‌కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్‌కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్‌కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్‌కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్‌లో నిలిచిందని.. తర్వాత హెరాత్‌కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్‌తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్‌తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్‌లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్‌ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు 'డిజిటల్' ఉరి!
టెహ్రాన్: యుద్ధం మిగిల్చిన గాయం ఒకవైపు.. డిజిటల్ దిగ్బంధనం చేస్తున్న విధ్వంసం మరోవైపు! ఇరాన్లో గత 73 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి నెట్టివేస్తోంది. క్షిపణుల మోత కంటే భయంకరంగా ఈ 'డిజిటల్ సీజ్' సామాన్యుల ఉపాధిని బలితీసుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ప్రైవేట్ రంగాన్ని ఈ సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం శ్మశానవాటికగా మారుస్తోంది.నిశ్శబ్ద భూకంపంఅంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్డాగ్ 'నెట్ బ్లాక్స్' (NetBlocks) తాజా నివేదిక ప్రకారం, ఆధునిక సమాజంలో ఇంత సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ. 21,000 కోట్లకు పైగా) ఆర్థిక నష్టం వాటిల్లింది. నేరుగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిరోజూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 80 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఛానెళ్లు 90% వరకు మూతపడ్డాయి.కుప్పకూలిన డిజిటల్ సామ్రాజ్యంఒకప్పుడు ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 'డిజిటల్ ఎకానమీ' ఇప్పుడు ఆవిరవుతోంది. ఇరాన్ అమెజాన్‌గా పిలిచే 'డిజికాలా' వందలాది మందిని తొలగించగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'కామ్వా' తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "రెండు యుద్ధాలు, నెలల తరబడి ఇంటర్నెట్ బంద్ తర్వాత మేము నిలబడలేకపోతున్నాం" అని సంస్థ వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.పారిశ్రామిక రంగానికి పక్షవాతంసాంకేతిక రంగమే కాకుండా, పెట్రోకెమికల్, ఉక్కు, వస్త్ర పరిశ్రమలు సైతం కుదేలయ్యాయి. సరఫరా గొలుసు (Supply Chain) విచ్ఛిన్నం కావడంతో ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోయింది. ఒక్క పశ్చిమ ఇరాన్ ఫ్యాక్టరీలోనే 700 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. దాదాపు 35 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని పారిశ్రామిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తప్పని తిప్పలు.. తెగనమ్ముకుంటున్న ఆస్తులుమధ్యతరగతి ఇరానియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగాలు ఊడిపోవడంతో కనీస అవసరాల కోసం కార్లు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. టెహ్రాన్‌కు చెందిన బాబాక్ అనే ప్రొడక్ట్ డిజైనర్ మాటల్లో చెప్పాలంటే.. "జీవితాంతం కష్టపడి నేర్చుకుని ఎదిగాను, కానీ ఇప్పుడు నా కళ్లముందే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది."రాజకీయ చదరంగం.. ఆర్థిక బలిఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం కావాలని అమెరికా భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లొంగే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. కానీ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. విదేశీ ప్లాట్‌ఫారమ్‌లు బంద్ కావడంతో ప్రజలను బలవంతంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే దేశీయ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఇరాన్లో క్షిపణి దాడుల కన్నా 'డిజిటల్ ముట్టడి' వల్ల కలిగే నష్టం దీర్ఘకాలికంగా ఆ దేశ వెన్నుముకను విరిచేలా కనిపిస్తోంది. -
భారత్‌కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే?
న్యూఢిల్లీ: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఆయన పర్యటన జరుగుతుంది. బ్రిక్స్ వేదికలో భారత్-ఇరాన్ మధ్య పెరుగుతున్న అనుబంధానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.ఇరాన్ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి బ్రిక్స్‌లో చేరింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ కూడా ఈ వారం జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ గతంలో కథనాలు వచ్చాయి. భారత్ ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలు భారత్ తీసుకుంది. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్‌కు నాలుగోసారి అధ్యక్షత వహిస్తోంది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారని రష్యా విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న తెలిపింది. మే 14-15 తేదీల్లో లావ్రోవ్ భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ఎక్స్‌లో వెల్లడించింది. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేతం వంటి అవకాశాలపై చర్చలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు.“మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే పూర్తి స్థాయి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరవుతారు” అని ఆమె చెప్పారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం, ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేత అవకాశాలపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని టాస్, జఖరోవాను ఉటంకిస్తూ తెలిపింది.ముఖ్యంగా ప్రపంచ మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. “ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు సన్నాహకాలలో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది” అని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, బ్రిక్స్ మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ఉప విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 23-24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్‌లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు, రాజకీయ-ఆర్థిక పాలన అంశాలపై సంప్రదింపులు, సహకారానికి ఇది కీలక వేదికగా ఉంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ “బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశాన్ని మార్గదర్శకంగా తీసుకుంది. 2025లో రియో డీ జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రస్తావించిన ప్రజాకేంద్ర, మానవతా ప్రథమ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.భారత్‌కు ఇది ఎందుకు కీలకం?ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఉన్న భారత్.. సభ్య దేశాల భిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. సున్నితమైన భౌగోళిక-రాజకీయ అంశాలపై విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా అంశాలపై సభ్య దేశాల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు ఉన్నాయి. ఇరాన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించడం దౌత్యపరంగా సున్నిత అంశంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో అరాఘ్చీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరాన్, భారత్ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌తో కూడా ఇరాన్ పలుమార్లు చర్చలు జరిపింది. గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఏ సైనిక కూటమికీ మద్దతుగా నిలవకుండా భారత్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రతపై భారత్ ప్రధాన దృష్టి పెట్టింది. -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్‌పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్‌కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్‌పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్‌తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
చమురును సముద్రంలో పారబోస్తున్న ఇరాన్.. కారణం ఏంటంటే..?
-
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్‌కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్‌కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్‌ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్‌దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
శత్రువు గుండెల్లో నిద్ర పోవడం అంటే ఇదేనేమో..!
-
తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరంశత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అసలు ఇరాన్‌ను శాసిస్తున్నది ఎవరు?ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! -
కాల్పుల విరమణపై సందేహాలు!
దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ శనివారం ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం. మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్‌కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్‌లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది. -
హర్ముజ్ లో టెన్షన్ టెన్షన్.. నిలిచిపోయిన 1500 ఓడలు..
-
గల్ఫ్ లో మళ్లీ యుద్ధం.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి
-
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. 15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్ పోస్ట్’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది. గల్ఫ్‌లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్‌లోని మూడు స్థావరాలైన అలీ అల్–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్ అరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్‌లోని అల్–ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. ఫ్రెండ్లీ ఫైర్‌లోనూ భారీ నష్టం.. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్క్యూ–4సీ ట్రైటాన్ ఉన్నాయి. నాలుగు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఏ–10 వార్హాగ్ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్‌లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్‌లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. జిమ్‌లు, ఫుడ్ హాల్లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్’తెలిపారు. చవకైన షాహెద్ డ్రోన్లతో పోరాడటానికి విలువైన ఇంటర్సెప్టర్లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు. 50 బిలియన్ డాలర్ల ఖర్చు.. ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్‌కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.


