వాషింగ్టన్ : ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజాగా హౌతీ మిలిటెంట్లు వాణిజ్య నౌకలపై ప్రయోగించిన డజన్ల కొద్ది డ్రోన్‌లు, మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది.
హౌతీలు ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్‌ల వల్ల నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నౌకల్లోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారని పెంటగాన్ తెలిపింది. మొత్తం 12 డ్రోన్‌లు, 3 యాంటీ షిప్ మిసైళ్లు, రెండు లాండ్ ఎటాక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఒక వాణిజ్య నౌక లక్ష్యంగా డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు జరిపినట్లు హౌతీ రెబెల్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని మిలిటరీ స్థావరాలపైనా డ్రోన్‌లతో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడులు మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment