
జెరూసలెం: ఇజ్రాయెల్‌పై తాజాగా పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. మౌంట్ హెర్మాన్‌పై ఉన్న ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బేస్‌పై పదుల సంఖ్యలో డ్రోన్‌లతో దాడి చేసినట్లు తెలిపింది. ఈ డ్రోన్‌లన్నీ పేలుడు పదార్థాలతో నిండి ఉన్నట్లు వెల్లడించింది.
అయితే డ్రోన్‌లు మౌంట్ హెర్మాన్ మీద ఉన్నఖాళీ ప్రదేశంలో పేలిపోయాయని, ఈపేలుడులో ఎవరికీ గాయాలవలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసిన తర్వాత హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఇప్పటికీ దాడులు చేస్తోంది.
ఈ పోరులో హమాస్‌కు మద్దతుగా లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్‌లతో దాడులకు దిగుతోంది. కొన్ని వారాలుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment