Hezbollah
-
టాప్ హెజ్బొల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ హతం
బీరూట్ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్ లిస్ట్‌లో ఉన్న హెజ్బొల్లా సీనియర్ కమాండర్ (Hezbollah commander) షేక్ ముహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) దారుణ హత్యకు గురయ్యాడు. లెబనాన్‌లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. అయితే గత కొంత కాలంగా అలీ హమాదీ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. వాటి కారణంగానే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హమాదీపై ఆరుసార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే,ఆయన మరణం వెనుక రాజకీయ కోణం, లేదంటే ప్రత్యర్థులు ఉన్నారనే అంశంపై మీడియా కథనాలు ఖండించాయి. సంవత్సరాల తరబడి హమ్మదీని కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని, వాటి కారణంగా చంపినట్లు పేర్కొన్నాయి. -
Sakshi Cartoon: ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ
ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ -
అమల్లోకి కాల్పుల విరమణ
జెరూసలేం: అనూహ్యంగా కుదిరిన ఇజ్రాయె ల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ 60 రోజులపాటు అమల్లో ఉంటుంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యం ఈ కాలంలో అక్కడి నుంచి వెనక్కి మళ్లుతుంది. ఆయా ప్రాంతాలను లెబనాన్ సైతం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఒప్పందం ప్రకారం.. ఆక్ర మణకాలంలో ఆయా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన హెజ్బొల్లా స్థావరా లను తిరిగి నిర్మించకూడదు. 14 నెలలకాలంగా సరిహద్దు వెంట యుద్ధం కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల స్థానికులు మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చి ధ్వంసమైన తమ ఇళ్లు, దుకాణాలను నిర్మించుకోవచ్చు. ‘‘ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీలతో మాట్లాడా. తా త్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండిపోవాలని ఆశిస్తున్నా’’ అని శ్వేతసౌధం నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యా నించారు. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు హెజ్ బొల్లా నుంచి లభిస్తున్న ఆయుధ, నైతిక మద్ద తును అడ్డుకునేందుకే ఇజ్రాయెల్ ఈ కా ల్పుల విరమణకు అంగీకారం తెలిపిందని అంతర్జాతీయ మీడియా లో వార్తలొచ్చాయి. అయితే హెజ్బొల్లాతో పోరులో నిండుకున్న ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకునేందుకు ఈ కాల్పుల విరమణ కాలాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటోందని తెలుస్తోంది. -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
బీరూట్: లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఆర్మీ సెంటర్‌పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది. -
హెజ్బొల్లాకు మళ్లీ ఎదురుదెబ్బ.. మరో కీలక నేత హతం
బీరుట్:మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారం(నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించింది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. -
ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి.. సంచలన వీడియో
జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్ చేశారు. Two Flares were fired earlier tonight at a Guard Shack outside the Home of Israeli Prime Minister Benjamin Netanyahu, in the Northern Town of Caesarea, the same Home that a Hezbollah Drone struck in October. Both Israeli Police and Shin Bet are Investigating. pic.twitter.com/0BfYEaN4Bq— OSINTdefender (@sentdefender) November 16, 2024 -
హెజ్బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.‘‘దక్షిణ లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes. These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024 ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్‌లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.💔 pic.twitter.com/FGY2iDlvaA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024 సెప్టెంబరు 23 నుంచి లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. 33 మంది మృతి
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా గ్రూప్ టార్గెట్‌గా చేసిన ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దేశవ్యాప్తంగా 33 మంది మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుగల గ్రూప్ హెజ్బొల్లాకు బలమైన ప్రాంతాలు ఉన్న బీరుట్‌లోని దక్షిణ శివారును లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరుట్కు దక్షిణంగా ఉన్న చౌఫ్ ప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చౌఫ్ జిల్లాలో జోన్‌పై ఇజ్రాయెల్ దాడిలో.. ఎనిమిది మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించారని పేర్కొంది. ఈ దాడిలో మరో 12 మంది గాయపడ్డారని తెలిపింది.అదే విధంగా బీరుట్కు తూర్పున ఉన్న పర్వతం అలే ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందిన ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అధికారులు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్‌పైకి వందలాది రాకెట్లు
బీరూట్: కొద్దిపాటి విరామం తర్వాత లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై సోమవారం వందలాది రాకెట్లతో దాడికి దిగింది. సెప్టెంబర్‌లో లెబనాన్‌వ్యాప్తంగా వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను గాయపరచడమే గాక వందల మంది మరణానికి కారణమైన పేజర్ దాడులు తమ పనేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. తమ దేశ ఉత్తర ప్రాంతంపై నిమిషాల వ్యవధిలోనే 165కు పైగా రాకెట్లు వచ్చిపడ్డట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా పత్రిక పేర్కొంది. వాటిలో 50కి పైగా కార్మియెల్ ప్రాంతం, పరిసర పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించింది. మరోవైపు రేవు పట్టణం హైఫాపైకి రెండు విడతల్లో 90కి పైగా రాకెట్లు దూసుకెళ్లాయి. గలిలీ, కార్మియెల్ ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలపై తాము చేసిన వ్యూహాత్మక దాడులు విజయవంతమైనట్టు హెజ్బొల్లా ప్రకటించింది. అనంతరం రాకెట్ దాడుల దృశ్యాలతో కూడిన వీడియోలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మతిలేని దూకుడు బారినుంచి ఉత్తర ప్రాంతంలోని తమ పౌరులను పూర్తిస్థాయిలో కాపాడుకుంటామని పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లను చాలావరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుని సురక్షితంగా కూల్చేసింది. అయినా పలు రాకెట్లు పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్టు సమాచారం. దాడుల్లో బినా పట్టణంలో ఏడాది వయసున్న ఓ చిన్నారితో పాటు ఏడుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 8న కూడా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భారీగా రాకెట్ దాడులకు దిగడం తెలిసిందే. లెబనాన్‌తో కాల్పుల విరమణ దిశగా చర్చల్లో పురోగతి కని్పస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గైడెన్ సార్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
సమాధుల కింద హెజ్బొల్లా టన్నెల్.. ఐడీఎఫ్ వీడియో విడుదల
లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించే పలు భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. ఆ సొరంగాలు స్మశానవాటిక కింద ఉండటం గమనార్హం. సుమారు కిలోమీటరు పొడవున్న సొరంగంలో.. కమాండ్, కంట్రోల్ రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, గన్స్, రాకెట్లు, ఇతర సైనిక సామగ్రిని చూపించే వీడియోను ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.‘హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అని ఐడీఎఫ్ పేర్కొంది.ఈ సొరంగంలోకి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పంపింగ్ చేసి సీల్ చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా గ్రూప్ లెబనీస్ సరిహద్దులో దాడులు చేసుకుంటున్నాయి. సెప్టెంబరులో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్ పలు సొరంగాలను కనుగొంది. అందులో ఒకటి 25 మీటర్ల పొడవుతో ఇజ్రాయెల్ వైపు ఉండటం గమనార్హం.⭕️ Operational update from Lebanon: Multiple underground terrorist tunnels have been dismantled by our troops, including a tunnel that was strategically located under a cemetery. Hezbollah doesn’t value human life—dead or alive. pic.twitter.com/77Ry4bQk0V— Israel Defense Forces (@IDF) November 10, 2024గత నెలలో లెబనీస్ పౌరుడికి ఇంటి క్రింద హెజ్బొల్లా సభ్యులు వాడినట్లు ఆరోపింస్తూ.. ఇజ్రాయెల్ ఆర్మీ ఓ సొరంగం వీడియోను విడుదల చేసింది. అయితే.. ఆ సోరంగం గాజాలో హమాస్ సభ్యులు నిర్మించినటువంటిది కాదని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని ఆ సొరగంలో ఇనుప తలుపులు, వర్కింగ్ రూంలు, ఏకే-47 రైఫిల్స్, ఒక పడకగది, ఒక బాత్రూం, జనరేటర్ల నిల్వ గది, నీటి ట్యాంకుల దృష్యాలు వీడియోలో కనిపించాయి.చదవండి: సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం -
సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం
సిరియాలోని డమాస్కస్‌కు దక్షిణంగా ఇరాన్ అనుకూల గ్రూపు హెజ్బొల్లాకు చెందిన అపార్ట్‌మెంట్‌పై ఇజ్రయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ఓ కమాండర్‌తో సహా తొమ్మిది మంది మరణించారని ఓ వార్ మానిటర్ వెల్లడించారు. లెబనీస్ పౌరసత్వం కలిగిన ఆ హెజొబొల్లా కమాండర్.. సిరియాలో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హిజ్బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. లెబనీస్ కుటుంబాలు, హెజ్బొల్లా సభ్యులు నివసించే అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన కమాండర్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు (ఒక మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు), హిజ్బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్ పేరు తెలియరాలేదు’’అని బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు. మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. సిరియాలో వందలాది దాడులకు పాల్పడింది. హెజ్బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్ తన ఉనికిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తూ వస్తోంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది.బీరుట్‌పైనే కాకుండా తీర నగరం టైర్‌పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన శనివారం జరిపిన దాడుల గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో మొత్తం 3136 మంది మరణించారని, 13వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. కాగా, పాలస్తీనాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హెజ్బొల్లా ఇరాన్‌కు మద్దతుగా పనిచేస్తోందన్న కారణంగా ఇటీవల ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై విరుచుకుపడుతోంది.ఇదీ చదవండి: డీఏపీకి ‘గాజా’ దెబ్బ -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ నెతన్యాహు సంచలన నిర్ణయం
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో గాలంట్ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్ గాలంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం. -
మరో హెజ్బొల్లా టాప్ కమాండర్ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్
జెరూసలేం: మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హెజ్బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.‘దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్. 2023 నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు జరిగిన దాడుల్లో జాఫర్ ఖాదర్ ఫార్ కీలక పాత్రపోషించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్‌లోని గోలాన్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో 12మందికి పైగా మరణించారు. 30మంది గాయపడ్డారు. గత బుధవారం హెజ్బొల్లా మెటుల్లాపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు సూత్రదారి జాఫర్ ఖాదర్ ఫార్’ అని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ పేర్కొంది. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్బొల్లా ఆపరేటివ్ ఎవరనేది వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు. -
లెబనాన్‌లో 52కు చేరిన మృతులు
బీరుట్: లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 52కు చేరింది. మరో 72 మంది గాయపడ్డారు. బాల్బెక్ నగరం సహా కనీసం 25 పట్టణాలు, గ్రామా ల్లోని లక్ష్యాలపై దాడులు జరిగాయి. భవనా లు శిథిలాల దిబ్బలుగా మారాయని, ఇంకా చాలా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని స హాయక సిబ్బంది అంటున్నారు. పర్వత శ్రే ణుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని కుగ్రా మాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తి. ఆలివ్, ద్రాక్ష తోటలు, మద్యం తయారీ యూనిట్లకు ప్రసిద్ధి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఈ ప్రాంతం జోలికి వెళ్లలేదు. ఒక్కసారిగా జరిగిన భీకర వైమానిక దాడులతో భీతిల్లిన జనం ఇళ్లు విడిచి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. Smoke seen rising from several high-rise buildings in the Al-Hosh area of Tyre, Lebanon, following Israeli airstrikes. Footage captured the aftermath, with planes still circling overhead pic.twitter.com/saPah5YiZG— RT (@RT_com) November 2, 202424 గంటల్లో 84 మంది గాజా ఉత్తరప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 50 మంది చిన్నారులు సహా 84 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది వరకు గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఖాన్‌యూనిస్‌లో జరిపిన దాడిలో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్– దిన్ కస్సబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. దీనిపై హమాస్ స్పందించలేదు. -
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం! తాజాగా..
జెరుసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై భూతల దాడులకు దిగాక హెజ్బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్‌లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్‌పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు. ఐరాస కార్యాలయం ధ్వంసం వెస్ట్‌బ్యాంక్‌లోని నూర్షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. లెబనాన్‌లో 24 మంది మృతి లెబనాన్‌లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా -
హెజ్బొల్లా కొత్త చీఫ్ తొలి ప్రసంగం.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్
షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ కొత్త చీఫ్ నయీమ్ ఖాస్సేమ్ అన్నారు. ఆయన నిన్న (మంగళవారం) హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలి ప్రసంగాన్ని చేశారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హస్సెన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ నా యుద్ధ వ్యూహాం.. మా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపు. లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది. ... గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హెబ్బొల్లా గ్రూప్ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్బొల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు’’ అని అన్నారు. -
హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్
లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు. నయీమ్ ఖాస్సేమ్‌ను కొత్త చీఫ్‌గా నియమించినట్లు హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది. హెజ్బొల్లా చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లా ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల తర్వాత హెజ్బొల్లా తమ తదుపరి చీఫ్‌ను ప్రకటించింది.ఇక.. నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హత్య చేసినప్పటి నుంచీ నయీమ్ ఖాస్సేమ్ హెజ్బొల్లా గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉంటున్నారు. నస్రల్లాకు దీర్ఘకాలంగా డిప్యూటీగా ఉన్న నయీమ్ ఖాస్సేమ్.. నస్రల్లా మరణం అనంతరం మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నస్రల్లా స్థానంలో చీఫ్‌గా ఆయన నియామకాన్ని మంగళవారం హెజ్బొల్లా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.They used to say that the one who stays to the last is the traitor!Why wasn't Naim Qassem with all the leaders who were killed during the meetings? Now he is the head of the pyramid.#Hezbollah has appointed #naimkassem as the party's secretary general. #حزب_الله #نعيم_قاسم pic.twitter.com/KceS03tsRg— Ramez Homsi (@Ramez7m) October 29, 2024నయీమ్ ఖాస్సేమ్ ఎవరు?నయీమ్ ఖాస్సేమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలా పట్టణంలో జన్మించారు. కెమిస్ట్రీ టీచర్‌గా చాలా సంవత్సరాలు పని చేశారు. దానికంటే ముందు లెబనీస్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించిన అనంతరం.. ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్బొల్లాలో ఆయన చేరారు. 1991 నుంచి ఆయన హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌గా పనిచేశారు. -
భయానక వీడియో.. ఇజ్రాయెల్ భీకర దాడులు
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉన్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. It's mind-boggling how obsessed the Zionists are with destruction and death. Israel's Channel 12 publishes the massive explosion in south Lebanon that triggered an earthquake alert in the north yesterday morning pic.twitter.com/zmOfZcx2Ec— Abier (@abierkhatib) October 27, 2024 -
ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్బొల్లా మిసైల్స్ దాడి
ఇజ్రాయెల్, లెబనాన్ హెజ్బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్బొల్లా క్షిపణులతో విరుచుకుపడింది.తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకొన్నాయి. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్బొల్లా ఓ ప్రకటన విడుదల చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. మరో రెండు నివాసస్థలాలు లేని ప్రాంతాల్లో పడిపోయాయని పేర్కొంది. ఈ మిసైల్స్ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.#BRAKING Hezbollah claims to have launched rockets at the suburbs of Tel Aviv.The Glilot military industry company in the suburbs of Tel Aviv was hit by a high-quality rocket salvo, which hit the target precisely, Hezbollah announced, as reported by Al Jazeera.The opposing… pic.twitter.com/IqH4WYR8pB— Sujon Ahmed (@SAexploring) October 23, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయిందని ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు దెబ్బతిందని పేర్కొంది.ఇక.. సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లాను అంతం చేయటమే టార్గెట్‌గా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. అక్టోబరు నెల ప్రారంభంలో.. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించింది. హెజ్బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది.చదవండి: ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు -
నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్
జెరూసలేం: జజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ మృతి చెందాడు. మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ సబర్బ్‌లో ఇటీవల మృతిచెందిన హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ తమ దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ధృవీకరించింది.‘‘సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి హషీమ్ సఫీద్దీన్ , హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజిమా, ఇతర హిజ్బొల్లా కమాండర్లు మరణించినట్లు ధృవీకరించాం’’ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ మరణాలకు సంబంధించి హెజ్బొల్లా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం గమనార్హం.#hashemsafieddine, Hezbollah's newly appointed leader, was killed in Israeli airstrikes on October 4 by #IDFThe body of Hashem #safieddine, #Hezbollah's new leader and successor to #Nasrallah, has been discovered#Israel #Beirut #Lebanon #Israel #IsraeliAirstrike #TelAviv pic.twitter.com/GjLlcQAvX2— know the Unknown (@imurpartha) October 22, 2024మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ శివారు దహియేహ్‌లో ఉన్న హెజ్బొల్లా ప్రధాన ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఆలస్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. దాడి చేసిన సమయంలో 25 మందికి పైగా హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రధాన కార్యాలయంలో ఉన్నారని, అందులో ఏరియల్ ఇంటెలిజెన్స్ సేకరణకు బాధ్యత వహించే బిలాల్ సైబ్ ఐష్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.అక్టోబరు 8న, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. పేరు తెలపకుండా సఫీద్దీన్ మృతి చెందినట్లు ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు (హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా ), నస్రల్లా స్థానంలో నియమించిన మరోనేతతో సహా వేలాది మంది ఉగ్రవాదులను అంతం చేశాం’ అని అన్నారు.చదవండి: హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు -
నస్రల్లా బంకర్లో భారీ సంపద
జెరూసలేం: బీరుట్‌లోని ఓ ఆస్పత్రి కింద హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా గడిపిన రహస్య బంకర్లో 50 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బంగారం, నగదు లభ్యమైనట్టు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌తో పాటు హెజ్బొల్లా కూడా ఇలా ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను ఆయుధాల నిల్వకు, మిలిటెంట్లకు ఆశ్రయానికి వాడుతోందని ఆరోపించింది. బంకర్ నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్ ఫొటో, అనుకరణ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ఆదివారం విడుదల చేశారు.ఆస్పత్రికి కింద ఉన్నందుననీ బంకర్‌ను కూల్చే ఆలోచన లేదని వెల్లడించారు. హెజ్బొల్లాపై చర్యలు తీసుకోవాలని లెబనాన్ అధికారులకు హగరి విజ్ఞప్తి చేశారు. హెజ్బొల్లా డబ్బును ఉగ్రవాదానికి, ఇజ్రాయెల్‌పై దాడికి వాడేందుకు అనుమతించొద్దని లెబనాన్ ప్రభుత్వాన్ని, అధికారులను, అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఇందులో హెజ్బొల్లా ఆర్థిక విభాగమైన అల్–ఖర్ద్ అల్– హసన్ పాత్ర ఉందన్నారు. హెజ్బొల్లా కార్యకలాపాలకు నిధులు సమకూ రుస్తున్న తీరును కూడా హగరి వివరించారు.లెబనాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం హెజ్బొల్లాకు ప్రధాన ఆదాయ వనరులన్నారు. లెబనాన్, సిరియా, యెమెన్, టర్కీల్లో హెజ్బొల్లా నడిపే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇజ్రాయెల్ పోరాటం లెబనాన్ పౌరులపై కాదు. కానీ వారిని హెజ్బొల్లా ఇలా కవచాలుగా వాడుకుంటోంది’’ అని ఆరోపించారు. లెబనాన్‌లో మరో బంకర్లో కూడా కోట్లాది డాలర్ల విలువైన బంగారం, నగదును సోమవారం గుర్తించినట్టు హగరి తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి..13 మంది మృతిబీరుట్/టెల్అవీవ్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది చనిపోగా 57 మంది గాయపడ్డారు. బీరుట్ దక్షిణ శివారుల్లో జరిపిన దాడిలో రఫిక్ హరారీ యూనివర్సిటీ ఆస్పత్రికి సమీపంలోని భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికా రులు తెలిపారు. అయితే, తాము హెజ్బొల్లా లక్ష్యంగా దాడి చేశామని, ఆస్పత్రిపై కాదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. ఆస్పత్రి ప్రవేశ ద్వారానికి సమీపంలో జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నాయి. ఇలా ఉండగా, సెంట్రల్ ఇజ్రాయె ల్పైకి మంగళవారం హెజ్బొల్లా పలు రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు తమ గగన తల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఒక రాకెట్ బహిరంగ ప్రదేశంలో పడిందని పేర్కొంది. -
టెల్ అవీవ్‌పై హెజ్బొల్లా దాడి.. విమాన సర్వీసుల నిలిపివేత
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ శివారులోని నిరిట్ ప్రాంతంలో మిసైల్స్‌తో దాడి చేశామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది. హెజ్బొల్లా మిసైల్స్‌తో దాడులకు తెగపడిన సమయంలో టెల్ అవీవ్‌లో వైమానిక దాడి సైరన్లు మోగాయి. అయితే ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం గురించి పూర్తి సమాచారం తెలియరాలేదు.మరోవైపు.. హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో దాడి చేసిన సమయంలో చెలరేగిన పొగ.. లెబనాన్ మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ (MEA) విమానానికి కమ్ముకుంది. ఈ విమానం బీరుట్-రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొంత సమయానికి ఆ విమానానికి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ వైపు హెజ్బొల్లా క్షిపణులను ప్రయోగించటంతో బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలును అధికారులు నిలిపివేశారు. 🚨#BREAKING Hezbollah Strikes Tel Aviv: IOF Targets Its Own as Mossad HQ HitHezbollah has launched a direct strike on #TelAviv, hitting the Glilot Mossad base with ballistic missiles. In a failed interception, an Iron Dome missile fell on a civilian home, once again exposing… pic.twitter.com/lD6A4B7bYT— Al Fait Accompli (@AlFaitAccompli) October 22, 2024ఇజ్రాయెల్ 24 గంటల్లో లెబనాన్‌లోని 300 హెజ్బొల్లా లక్ష్యాలను ఢీకొట్టిన మరుసటి రోజే హెజ్బొల్లా దాడి చేసింది. మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం మధ్యప్రాచ్య పర్యటనను ఇజ్రాయెల్‌లో ప్రారంభించనున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దక్షిణ శివారులోని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో సోమవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్, హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన ఇజ్రాయెల్.. ఈసారి హెజ్బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లా రహస్య బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు గుర్తించింది. . ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వీడియో విడుదల చేసింది.“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ— Israel Defense Forces (@IDF) October 21, 2024ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదని, ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నామని హగారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు. అయితే బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. -
హెజ్బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌లోని బీరుట్లో హెజ్బొల్లా గ్రూప్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులు చేస్తోంది.Israel has launched targeted airstrikes on branches of the Hezbollah-linked Al-Qard Al-Hassan financial association in Beirut and the Beqaa Valley. These strikes, some near Beirut's airport, follow warnings from the IDF accusing the quasi-bank of financing Hezbollah's operations. pic.twitter.com/wi9sjbUYhF— TBN Israel (@TbnIsrael) October 21, 2024 బీరుట్‌లోని ఆ ప్రాంతాల్లో లెబనాన్ పౌరులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. దిక్కు తోచక బీరుట్ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లితున్నారు.హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు చోట్ల పేలుళ్లు జరిపింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.⚡️This moment, #Israel airstrikes targeted multiple areas in the suburbs of #Beirut, Lebanon. The Israel has announced plans to target businesses it claims are connected to #Hezbollah, singling out the Al Qard Al Hassan Institution.Al Qard Al Hassan operates throughout Lebanon,… pic.twitter.com/VTmnyXK2eF— Shah Faisal AfRidi (@Sfaisalafridi) October 20, 2024 అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 73 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైనిక ముట్టడి కారణంగా ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారింది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం వంటి అవసరమైన సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్బొల్లా డ్రోన్ ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది.చదవండి: మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే -
హెజ్బొల్లా పెద్ద తప్పు చేసింది: ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: హెజ్బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.నెతన్యాహు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. Israel PM Benjamin Netanyahu tweets, "The attempt by Iran’s proxy Hezbollah to assassinate me and my wife today was a grave mistake. This will not deter me or the State of Israel from continuing our just war against our enemies in order to secure our future. I say to Iran and its… pic.twitter.com/uX2MJvPcJe— ANI (@ANI) October 19, 2024హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే? -
ఇజ్రాయెల్‌కు కొత్త టెన్షన్!.. హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు
జెరూసలేం: ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు దాడులతో చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లా వద్ద రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, హెజ్బొల్లాకు రష్యా సహకరిస్తోందన్న అనుమానాలను నెతన్యాహు వ్యక్తం చేశారు.హెజ్బొల్లాపై యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు వారి సొరంగాలను కనుగొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో సొరంగాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా ఆయుధాలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట్లాడుతూ..‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటాని నదికి దక్షిణాన లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానించింది. అయినప్పటికీ హెజ్బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకుంది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయి. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్బొల్లాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు ఉన్నాయని నిరూపితమైంది. 🔴 Netanyahu has said that the Israeli military found "state-of-the-art" Russian weapons during a search of Hezbollah bases in Lebanon.- The Times of Israel pic.twitter.com/ohuvH48zLr— war observer (@drmubashir599) October 17, 2024 -
హెజ్బొల్లా టన్నెల్ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్బొల్లా టన్నెల్‌కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో హెజ్బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC— Israel Defense Forces (@IDF) October 15, 2024 ‘‘దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్బొల్లా గ్రూప్ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్ తరహా దాడికి హెజ్బొల్లా టన్నెల్‌ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. -
ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి
జెరూసలేం: లెబనాన్ సరిహద్దులో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై భారీగా రాకెట్ల దాడి చేసింది. బుధవారం ఉదయం ఉత్తర లెబనాన్ వైపు నుంచి సుమారు 50 రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకోచ్చాయనా ఐడీఎఫ్ తెలిపింది.🚨#BREAKING: IDF say Hezbollah launched at least 50 rockets in the latest attack on the Upper Galilee in Northern Israel mostly aimed at the city of Safed. pic.twitter.com/ExAiBgKhHl— World Source News 24/7 (@Worldsource24) October 15, 2024 క్రెడిట్స్: World Source News 24/7 వెంటనే అప్రత్తమైన ఇజ్రాయెల్ ఆర్మీ.. 50 ప్రొజెక్టైల్స్‌ను మధ్యలోనే అడ్డుకొని నేల కూల్చామని వెల్లడించింది. ఇక.. వాటి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐడీఎఫ్ ప్రకటించింది. సఫెడ్ పట్టణంపైకి భారీ క్షిపణులను తామే ప్రయోగించామని హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది.చదవండి: కెనడా అడ్డగోలు ఆరోపణలు -
హెజ్బొల్లాను అంతమే మా లక్ష్యం: నెతన్యాహు
లెబనాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందిని టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సైనికుల సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా విధులు ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు.‘‘హెజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ(UNIFIL) సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం కృషి చేస్తోంది. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ పదేపదే కోరుతోంది. హెజ్బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌లోకి దాడులో ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని యూఎన్‌ఎఫ్‌ఐఎల్ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను... మా పోరాటం యూఎన్‌ఎఫ్‌ఐఎల్, లెబనాన్ ప్రజలతో కాదు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది. మా హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం’’ అని అన్నారు.చదవండి: కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే.. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడి.. నలుగురి సైనికులు మృతి
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైఫాకు దక్షిణంగా ఉన్న బిన్యామినా పట్టణానికి సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. లెబనీస్ హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని డ్రోన్లతో టార్గెట్ చేసినట్ల తెలిపింది.అయితే ఈ దాడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్లు వినిపించకపోవటం గమనార్హం.Hezbollah UAV strike on Israeli army base kills 4 IDF soldiersRead @ANI Story | https://t.co/k9xhKHZCmS#Israel #UAVstrike #Hezbollah #IDF pic.twitter.com/witCwWBOTD— ANI Digital (@ani_digital) October 13, 2024 నిన్న(ఆదివారం) హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన యూఏఈ ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడిన వ్యక్తుల పేర్లను వ్యాప్తి చేయటం. పుకార్లు సృష్టించటం మానుకొని సైనికులు కుటుంబాలను గౌరవించాలని కోరుతున్నాం’అని ఇజ్రాయెల్ ఆర్మీ ‘ఎక్స్’లో పేర్కొంది.హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ త్స్నోబార్ లాజిస్టిక్స్ స్థావరాన్ని కూడా క్షిపణలుతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక.. హెజ్బొల్లా డ్రోన్ దాడుల నుంచి రక్షణను బలోపేతం చేయటంలో సహాయపడటానికి ఇజ్రాయెల్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు అమెరికా ప్రకటించిన ఈ డ్రోన్ దాడులు జరగటం గమనార్హం.చదవండి: ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్ -
ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి
ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు గత హెజ్బొల్లా గ్రూప్ వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది.#Hezbollah says it launched a drone attack on a military base in north Israel’s Haifa, hours after claiming an attack on another base south of the city.https://t.co/i0Ibz2rdFV— Al Arabiya English (@AlArabiya_Eng) October 12, 2024క్రెడిట్స్: Al Arabiya English‘‘శనివారం ఉదయం 8 గంటల సమయంలో హైఫాలోని ఎయిర్ డిఫెన్స్ బేస్‌పై పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లతో వైమానిక దాడి చేశాం’’ అని హెజ్బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. -
బీరుట్‌పై దాడులు.. 22కు చేరిన మృతులు
బీరుట్/న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరుట్‌పై గురువారం రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజా ఘటనలో 117 మంది క్షతగాత్రులుగా మారారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెంట్రల్ బీరుట్‌లోని రస్ అల్–నబా, బుర్జ్ అబి హైదర్లపై ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో ఒక చోట ఎనిమిదంతస్తుల భవనం నేలమట్టం కాగా, మరో చోట ఓ భవన సముదాయంలోని దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి. తమ ముఖ్య అధికారి వఫిక్ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని హెజ్బొల్లాకు చెందిన అల్ మనార్ టీవీ అనంతరం పేర్కొంది. దాడులు జరిగిన సమయంలో వఫిక్ ఆ రెండు భవనాల్లోనూ లేరని స్పష్టం చేసింది. తాజా దాడి, 2006 తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత తీవ్రమైందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన భీకర దాడుల్లో హెజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా సహా పలువురు కమాండర్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. హెజ్బొల్లా గురు వారం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మరో వైపు, భూతల, వైమానిక, క్షిపణి దాడులతో హెజ్బొల్లా లక్ష్యాలపై ఇప్పటికే విరుచు కుపడు తున్న ఇజ్రాయెల్ సముద్రంపై నుంచి కూడా దాడులకు పాల్పడుతుందని సమాచారం. ఇద్దరు లెబనాన్ సైనికులు మృతిలెబనాన్లోని బింట్ జబెయిల్ ప్రావిన్స్ కఫ్రాలోని ఆర్మీ చెక్ పాయింట్‌లోని భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. ఐరాస బలగాలపై మళ్లీ కాల్పులులెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళాల (యూఎన్ఐఎఫ్ఐఎల్)పై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డాయి. నఖౌరా పట్టణంలోని యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం అబ్జర్వేషన్ పోస్ట్‌పై జరిగిన కాల్పుల్లో ఇద్దరు సభ్యులు గాయపడ్డారు. ఒకరు టైర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐరాస తెలిపింది. అదేవిధంగా, దక్షిణ లెబనాన్‌లో ఐరాస గుర్తించిన 120 కిలోమీటర్ల బ్లూలైన్‌ను దాటి ఇజ్రాయెల్ ఆర్మీ బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయని ఐరాస శుక్రవారం తెలిపింది. -
ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతం
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తాము చేసిన దాడుల్లో మరో ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. హూలా ఫ్రంట్ కమాండర్, వందలాది క్షిపణి దాడులకు కారణమైన అహ్మద్ ముస్తఫా అల్ హజ్ అలీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని మీస్ ఎల్ జబాల్ ప్రాంతంలో హెజ్బొల్లా యాంటీ-ట్యాంక్ యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరించిన మహ్మద్ అలీ హమ్దాన్లు తమ దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తమ దేశా పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే హెజ్బొల్లా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేవరకు తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.🔴2 Hezbollah terrorists were eliminated in precise strikes:1. Ahmad Moustafa al-Haj Ali, commander of the Houla Front. Responsible for hundreds of missile and anti-tank missile attacks toward the Kiryat Shmona area. 2. Mohammad Ali Hamdan, commander of Hezbollah’s anti-tank… pic.twitter.com/0RX2mxgmbV— Israel Defense Forces (@IDF) October 10, 2024 గతేడాది అక్టోబర్ 7 తేదీన హామాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం.. ఇజ్రాయెల్ హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే.. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా
వాషింగ్టన్: కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించడం హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు వెనుకంజను తెలియజేస్తోందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మంగళవారం(అక్టోబర్8) వాషింగ్టన్లో ఆయన మీడియాతో మట్లాడారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చితికిపోయిందన్నారు.‘సంవత్సరం నుంచి హెజ్బొల్లాను ప్రపంచం మొత్తం కాల్పుల విరమణ చేయాలని అడుగుతోంది. దీనిని హెజ్బొల్లా తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడేమో హెజ్బొల్లానే కాల్పుల విరమణ అడుగుతోంది. ఈ యుద్ధానికి దౌత్య పరమైన పరిష్కారమే అంతిమంగా మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు. కాగా, హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ కాసిమ్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ తమపై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ధీటైన జవాబిస్తున్నామని కాసిమ్ తెలిపారు.ఇదీ చదవండి: వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు -
వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు: హెజ్బొల్లా
ఇజ్రాయెల్ పౌరులు మరింత మంది నిరాశ్రయులవుతారని హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నైమ్ ఖాసీం అన్నారు. ఇజ్రాయెల్‌లో తమ రాకెట్ దాడులను మరింత విస్తరించినట్లు తెలిపారు. ఆయన మంగళవారం టెలివిజన్ ప్రసంగంలో మాట్లారు. అక్టోబరు 7 దాడుల మొదటి సంవత్సరం వార్షికోత్సవం తర్వాత తొలిరోజు చేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.‘‘ఇజ్రాయెల్పలో మా రాకెట్ దాడులు విస్తరించాం. మేము చేసే దాడుల్లో మరింత మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు. హెజ్బొల్లా సామర్థ్యాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇటీవలి దాడుల్లో మృతిచెందిన కమాండర్ల స్థానాలను కొత్తవారితో భర్తీ చేశాం.Hizbullah Genel Sekreter Yardımcısı Naim Kasım şu anda canlı yayında bir açıklama yapıyor. Lübnan başkanlık sarayındaki basın mensupları pür dikkat dinliyor. pic.twitter.com/bNV64IwsH9— Faruk Hanedar (@farukhanedar) October 8, 2024 ప్రతిఘటన కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశాం. వందలాది రాకెట్లు, డజన్ల కొద్ది డ్రోన్లను పేల్చుతున్నాం. ఇజ్రాయెల్ నుంచి నిరాశ్రయులుగా వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకువస్తామని చెబుతోంది. కానీ మేము వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను నిరాశ్రయులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మనల్ని బలహీనపరుస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. కానీ, ప్రతిఘటించడం, పట్టుదలతో ఉండటమే మా వద్ద ఉన్న ఏకైక పరిష్కారం’’ అని అన్నారు. -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు
గాజా యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతున్న వేళ.. ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుంది. ప్రతీకారంతో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్‌లోని కమతియే పట్టణంపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహామొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రతీకారంగా, హెజ్బొల్లా సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఫలితంగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. హెజ్బొల్లా హైఫా నగరంలో దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1 మిసైల్స్‌తో బీభత్సం సృష్టించింది.మిసైల్ దాడులతో స్థానికంగా ఉన్న భవనాలు, ఇతర సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. గాయపడ్డ క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
హెజ్బొల్లాకు రెస్ట్ తీసుకునే సమయం కూడా ఇవ్వం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ వరుస వైమానిక,భూతల దాడులతో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే లెబనాన్ దేశ రాజధాని బీరూట్ చిగురుటాకులా వణికిపోతుంది.తాజాగా ఇజ్రాయెల్ శనివారం సాయంత్రం నుంచి బీరూట్‌లోని హెబ్బొల్లా కమాండ్ సెంటర్లు, అణ్వాయుదాలు నిల్వ ఉంచే స్థావరాలు, టెన్నెల్స్,మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పేలుళ్ల దాటికి దక్షిణ బీరుట్, దాని పరిసర ప్రాంతాలు రెండుగంటలకు పైగా బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. దీంతో బీరూట్‌లో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి ఒకటిగా నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. మేము హెజ్బొల్లాపై మరింత ఒత్తిడి తేవాలి. ఉపశమనం లేకుండా హెజ్బొల్లాకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి. విశ్రాంతి ఇవ్వకుండా శాస్వత నష్టం కలిగించేలా చేయాలని అన్నారు. -
నస్రల్లా వారసుడూ మృతి?
జెరుసలేం/బీరూట్/టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇటీవలే సారథి హసన్ నస్రల్లాతో పాటు పలువురు అగ్ర నేతలను కోల్పోయిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నస్రల్లా స్థానంలో సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు హషీం షఫియుద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు బలైనట్టు చెబుతున్నారు. దీన్ని అటు హెజ్బొల్లా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ ధ్రువీకరించడం లేదు.అయితే శుక్రవారం బీరుట్ శివార్లలోని దాహియేపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన లక్షిత దాడుల అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్కడి బంకర్లలో హెజ్బొల్లా అగ్ర నేతలతో హషీం సమావేశమై ఉండగా పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ భారీగా బాంబుల వర్షం కురిపించిందని తెలిపాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న దాడుల వల్ల సహాయక బృందాలేవీ ఆ ప్రాంతానికి చేరలేకపోతున్నట్టు వివరించాయి. ఈ దాడుల్లో హషీం తీవ్రంగా గాయపడ్డట్టు హెజ్బొల్లా వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. మరోవైపు లెబనాన్‌పై దాడులను శనివారం ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేసింది.దక్షిణం వైపునుంచి మొదలుపెట్టిన భూతల దాడులను కొనసాగిస్తూనే ఉత్తరాది నగరం ట్రిపోలీని కూడా వైమానిక దాడులకు లక్ష్యంగా చేసుకుంది. ట్రిపోలీలోని బెడ్డావీ పాలస్తీనా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో హమాస్ సాయుధ విభాగమైన అల్ ఖసాం బ్రిగేడ్స్ చీఫ్ సయీద్ అతల్లాతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా మరణించారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో చనిపోయిన 18 మందిలో తమ కమాండర్ తుల్కరెమ్ కూడా ఉన్నట్టు పేర్కొంది. దక్షిణాన ఒడైసే నగరాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందని హెజ్బొల్లా ఆరోపించింది. ఇప్ప టిదాకా 2,000 మందికి పైగా సామాన్యులు దాడులకు బలయ్యారని పేర్కొంది.లెబనాన్–సిరియా సరిహద్దుపై బాంబుల వర్షంలెబనాన్, సిరియాలను కలిపే కీలకమైన మస్నా బార్డర్ క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడి నేలమట్టం చేశాయి. దారి పొడవునా ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. దాంతో రెండు దేశాల మధ్య రవాణా, రాకపోకలతో పాటు సర్వం స్తంభించిపోయింది. దాంతో దాడుల నుంచి తప్పించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని సిరియాకు వెళ్తున్న లక్షలాది మంది లెబనీస్ పౌరులు సరిహద్దుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రాసింగ్ గుండా గత 10 రోజుల్లో కనీసం మూడున్నర లక్షల మంది సిరియాకు తరలినట్టు సమాచారం. ఇక్కడి రెండు మైళ్ల పొడవైన సొరంగం గుండా ఇరాన్ నుంచి హెజ్బొల్లాకు భారీగా ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దాడులు చేసినట్టు వివరించింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు? తనపై వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎలా దాడి చేయనుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై మాత్రం దాడులను సమర్థించబోమని ఆయన స్పష్టం చేయడం తెలిసిందే. కానీ వాటినే లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేగాక ఇరాన్ చమురు క్షేత్రాలపైనా బాంబుల వర్షం కురిపించే అంశాన్ని ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే పశి్చమాసియాలోని దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయని, యుద్ధం ఊహాతీతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్బొల్లా నేత మృతి
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆపటం లేదు. బీరూట్‌లో ఉన్న హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గురువారం వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బొల్లా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు వెల్లడించింది.ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. హెజ్బొల్లా రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేపట్టింది. ఇక.. తమ దాడుల్లో మృతి చెందిన మహ్మద్ రషీద్ సకాఫీ.. 2000 సంవత్సరంలో హెజ్బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్‌గా నియమితులయ్యారు.🔴Mohammad Rashid Sakafi, the Commander of Hezbollah’s Communications Unit, during a precise, intelligence-based strike in Beirut yesterday. Sakafi was a senior Hezbollah terrorist, who was responsible for the communications unit since 2000. Sakafi invested significant efforts… pic.twitter.com/PH65nh5FLI— Israel Defense Forces (@IDF) October 4, 2024 ఆయన హెజ్బొల్లాలో సీనియర్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఐడీఎఫ్ పేర్కొంది. అన్ని కార్యక్రమాలకు కమ్మూనికేషన్ వ్యవస్థలను నిర్వహించటంలో సకాఫీ.. హిజ్బొల్లాకు కీలకంగా వ్యవహరించేవారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.చదవండి: మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్ -
బీరుట్‌పై భీకర దాడి
బీరుట్/జెరూసలేం: హెజ్బొల్లా చీఫ్‌ను అంతం చేసి దాడులను ఉధృతంచేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా లెబనాన్ దేశ రాజధాని నడిబొడ్డున దాడికి తెగబడింది. బీరుట్ నగరంలో దేశ పార్లమెంట్, ప్రధాన మంత్రి కార్యాలయం, ఐక్యరాజ్యసమితి లెబనాన్ ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున సెంట్రల్ బీరుట్‌లోని బషౌరా జిల్లాలోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో 9 మంది మృతిచెందారు.దీంతో భవంతిలోని హెజ్బొల్లా హెల్త్‌సెంటర్ దెబ్బతింది. చనిపోయిన వారిలో హెజ్బొల్లా ఆరోగ్యకేంద్రంలో పనిచేసే ఏడుగురు సభ్యులున్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. మవాద్ ప్రాంతంలోని హెజ్బొల్లా మీడియా సంబంధాల భవనం మీదా దాడులు జరిగాయి. బింట్ జిబేయిల్ పట్టణంలోని ఆర్మీ పోస్ట్‌పై జరిగిన శతఘ్ని దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. రెడ్‌క్రాస్ సిబ్బంది దుర్మరణం దక్షిణ లెబనాన్‌లో గాయపడిన పౌరులను తరలిస్తున్న రెడ్‌క్రాస్ సిబ్బంది వాహనంపై దాడి జరిగింది. తయ్యబే గ్రామ సమీపంలో జరిగిన ఈ దాడిలో నలుగురు పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ‘‘ ఐరాస శాంతిపరిరక్షక దళాల సమన్వయంతో ముందస్తు సమాచారంతోనే వైద్యసిబ్బంది వెళ్తున్నారు. అయినాసరే వారిపై దాడి జరిగింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను ఉల్లంఘించడమే. వాళ్ల వద్ద ఆయుధాలు ఉన్నాయని ఎలా ఓ నిర్ణయానికొస్తారు? సొంత నిర్ణయాలు తీసుకుని దాడులు చేసే అధికారం ఇజ్రాయెల్‌కు ఎవరిచ్చారు?’’ అని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు దక్షిణ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలెట్టింది. ఆక్రమణను ప్రతిఘటిస్తూ లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది మంది సైనికులు చనిపోయారు. తరలిపోతున్న విదేశీయులు సంక్షోభం నేపథ్యంలో తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు స్పెయిన్ రంగంలోకి దిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌కు రెండు విమానాలను హుటాహుటిన పంపించింది. ఐరాస శాంతి కార్యక్రమాల్లో భాగంగా బీరుట్లో ఉన్న 676 మంది తమ సైనికులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అక్కడే ఉంటారని స్పెయిన్ పేర్కొంది. ట్రిపోలీ నౌకాశ్రయం నుంచి 300కుపైగా తుర్కియే దేశస్తులు స్వదేశం పయనమయ్యారు. బ్రిటన్, ఆ్రస్టేలియా, జపాన్, ఇటలీ దేశస్తులు సైతం లెబనాన్ వీడుతున్నారు. గత 24 గంటల్లో 28 మంది హెల్త్‌వర్కర్లు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఇరాన్, లెబనాన్‌లపై ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అసహనం వ్యక్తంచేశారు. హమాస్ నేతను చంపేశాం ఇజ్రాయెల్ ప్రకటనమూడు నెలల క్రితమే గాజా స్ట్రిప్‌లో హమాస్ సీనియర్ నేత రావీ ముష్తాహాను చంపేశామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. కమాండర్లు సమీ సిరాజ్, సమీ ఔదేహ్లనూ చంపేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే వీరి మరణవార్తపై హమాస్ స్పందించలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్ చేసిన దాడి వెనుక సూత్రధారి, హమాస్ టాప్ కమాండర్ యాహ్యా సిన్వర్‌కు ముష్తాహా అత్యంత సన్నిహిత నేత. సిన్వర్ ఇంకా గాజాలోనే రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. సిరియాలో ఆయుధాగారంపై దాడులు తమకు ముప్పుగా పరిణమించొచ్చు అని అనుమానించిన ప్రతి లక్ష్యంపై ఇజ్రాయెల్ గురిపెడుతోంది. ఇందులోభాగంగా గురువారం సిరియా పశి్చమతీరంలోని లటాకియా ప్రావిన్స్‌లోని రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఖమేమిన్ ఆయుధాగారంపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. హెజ్బొల్లాకు అధునాతన ఆయుధాలు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయని, వీటిని ధ్వంసంచేసి హెజ్బొల్లాకు ఆయుధాల కొరత సృష్టించడమే ఈ దాడుల అసలు లక్ష్యమని తెలుస్తోంది. గత షెడ్యూల్ ప్రకారం ఖాసిమ్ ఫార్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ద్వారా ఇక్కడి ఆయుధాలను ఇరాన్‌కు చేరవేయాల్సిఉంది. ఈలోపే ఇజ్రాయెల్ దాడి చేసింది. 100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా పట్ల ఇరాక్ ప్రజలు తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. నస్రల్లా మరణం ఇరాక్‌లో మరీ ముఖ్యంగా మెజారిటీ షియా జనాభాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనకు నివాళిగా దేశంలోని సుమారు 100 మంది నవజాత శిశువులకు ‘నస్రల్లా’ పేరు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మంది శిశువులు ఆ పేరుతో నమోదు అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది షియా సమాజం ఆయనను ఎంతగా ఆరాధిస్తోందో ఇట్టే అర్థమవుతోంది. షియాలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ప్రతిఘటనకు చిహ్నంగా నస్రల్లాను చూస్తారు. షియా వర్గాల్లో నస్రల్లాకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. నస్రల్లాను ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ అమరుడిగా అభివర్ణించారు. ఇరాక్‌తో నస్రల్లాకు మతపరంగానేకాకుండా రాజకీయ భావజాలపరంగా లోతైన అనుబంధం ఉంది. 2003 ఇరాక్‌ను అమెరికా ఆక్రమించడాన్ని నస్రల్లా బహిరంగంగానే విమర్శించి అక్కడి షియాలకు ఆరాధ్యుడయ్యాడు. -
టాప్ లీడర్లను కోల్పోయిన హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ సంబరాలు
లెబనాన్‌లో అత్యంత బలంగా ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. వారం రోజుల్లోనే ఏడుగురు అగ్రనాయకులను కోల్పోయింది. లెబనాన్ చేష్టలుడిగిపోయింది. మరోవైపు కచ్చితత్వంలో లక్ష్యాలను చేధించిన ఇజ్రాయెల్ అధికారులు తమ నిఘా వ్యవస్థ పనితీరును, సైనిక పాటవాన్ని చూసి సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. లెబనాన్‌లో బలీయ మిలటరీ, రాజకీయ శక్తిగా ఉన్న హెజ్బొల్లా శరాఘాతాల నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధినేత హసన్ నస్రల్లా సహా హెజ్బొల్లాను స్థాపించిన 1980 నుంచి కీలక సభ్యులుగా ఉన్న పలువురిని వారం రోజుల్లో కోల్పోయింది. నస్రల్లా మినహా మిగతావారు బయటి ప్రపంచానికి అంతగా పరిచయం లేని వ్యక్తులే అయినప్పటికీ.. హెజ్బొల్లాలో వారి పాత్ర కీలకం. వీరిలో ఎవరేమిటో చూద్దాం.. – సాక్షి, నేషనల్ డెస్క్నబిల్ కౌక్ కౌక్ శనివారం వైమానిక క్షిపణి దాడిలో మరణించారు. హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ ఉప నాయకుడు. హెజ్బొల్లాను స్థాపించిన తొలినాళ్లలో 1980లలో దాంట్లో చేరారు. 1995–2010 మధ్య హెజ్బొల్లా దక్షిణ లెబనాన్ మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాతో తరచూ మాట్లాడేవారు. మద్దతుదారులను ఉద్దేశించి ఉపన్యసించే వారు. హెజ్బొల్లా మిలిటెంట్ల అంత్యక్రియల సందర్భంగా భావోద్వేగ ప్రసంగాలు చేసేవారు. నస్రల్లాకు వారుసుల్లో ఒకరిగా కౌక్‌ను పరిగణించేవారు. ఇబ్రహీం అకీల్ హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్. మెరికల్లాంటి రాడ్వాన్ ఫోర్సెస్‌కు నాయకుడు. రాడ్వాన్ ఫోర్సెస్‌ను తమ సరిహద్దుల్లోంచి వెనక్కినెట్టాలని ఇజ్రాయెల్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అత్యున్నత సైనిక మండలి ‘జిహాద్ కౌన్సిల్’లో అకీల్ సభ్యుడు. ఏన్నో ఏళ్లుగా అమెరికా వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పేలుళ్లలో అకీల్ పాత్ర ఉందని అమెరికా హోంశాఖ పేర్కొంది. అమెరికన్లు, జర్మన్లను బందీలుగా పట్టుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడని తెలిపింది.హసన్ నస్రల్లా 1992 నుంచి హెజ్బొల్లా నాయకుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో పలు యుద్ధాల్లో హెజ్బొల్లాకు సారథ్యం వహించారు. లెబనాన్‌లో హెజ్బొల్లాను ప్రబల రాజకీయ, సైనికశక్తి తీర్చిదిద్దారు. పశ్చిమాసియాలో పలు ప్రాంతీయ సంఘర్షణల్లో పాలుపంచుకుంటూనే రాజకీయ శక్తి ఎదిగింది. పారామిలటరీ దళంగా రూపుదిద్దుకుంది. 2011లో సిరియా తిరుగుబాటు కాస్తా అంతర్యుద్ధంగా మారింది. సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్‌ను అధికారంలో ఉంచడంలో హెజ్బొల్లా కీలకపాత్ర పోషించింది. ఇరాక్, యెమెన్లలోనూ (ఇరాన్ అండదండలున్న) సాయుధ తిరుగుబాటు గ్రూపులు తమ శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి నస్రల్లా సారథ్యంలోని హెజ్బొల్లా సాయపడింది. లెబానాన్‌లో నస్రల్లాను ఆరాధించేవారు, విరోధించేవారు సమపాళ్లలో ఉంటారు. 2000 సంవత్సరంలో దక్షిణ లెబానాన్‌కు ఇజ్రాయెల్ నుంచి విముక్తి కల్పించిన హీరోగా మద్దతుదారులు నస్రల్లాను కీర్తిస్తారు. గుట్టలుగా ఆయుధాలను పోగేసుకొని.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శకులు అంటారు. టెహరాన్ ఎజెండాకు అనుగుణంగా హెజ్బొల్లా పనిచేస్తోందని వారి ఆరోపణ. అలీ కరాకీ దక్షిణాది వ్యవహారాలకు బాధ్యుడు. హమాస్‌కు మద్దతు, ఇజ్రాయెల్‌పై పోరులో దక్షిణాది దళాలకు నాయకత్వం వహించాడు. హెజ్బొల్లా నాయకత్వంలో ముఖ్యుడుని అమెరికా అలీ కరాకీని అభివర్ణించింది. ఇతని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో నస్రల్లాతో పాటు చనిపోయాడు. ఇబ్రహీం కొబైసీ హెజ్బొల్లా క్షిపణి యూనిట్‌కు నాయకుడు. 2000 సంవత్సరంలో ఉత్తర సరిహద్దుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేసి హతమార్చడం కొబైసీ పథకరచనే అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత యుద్ధఖైదీల మారి్పడి కిందట ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలను హెజ్బొల్లా ఇజ్రాయెల్‌కు అప్పగించింది. మొహమ్మద్ సురౌర్ హెజ్బొల్లా డ్రోన్ విభాగం చీఫ్. ఇజ్రాయెల్‌తో గాజాపై విరుచుకుపడ్డాక.. ప్రస్తుత యుద్ధంలో తొలిసారిగా హెజ్బొల్లా దాడులకు డ్రోన్లకు వాడింది. సురౌర్ నేతృత్వంలో ఇజ్రాయెల్ లోపలి భూభాగాల్లోకి వెళ్లి.. పేలిపోయే విధంగా డ్రోన్లను వాడారు. అలాగే గూడచర్యానికి కూడా హెజ్బొల్లా డ్రోన్లను వినియోగించింది. ఇజ్రాయెల్ ప్రధానంగా హెజ్బొల్లా ప్రయోగించే రాకెట్లు, క్షిపణులపై దృష్టి పెట్టగా.. డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను చేధించి హెజ్బొల్లా దాడులు చేసింది. అహ్మద్ వెహ్బే రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్. రెండు దశాబ్దాల కింద ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని ఉన్నతశ్రేణి దళంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. బీరుట్ దక్షిణ శివారులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అకీల్‌తో పాటు వెహ్బే కూడా మరణించాడు. వీరు తలదాచుకున్న భవనం పూర్తిగా నేలమట్టమైంది. మిగిలింది వీరే.. అగ్రనాయకత్వంలో అతికొద్ది మంది మిగిలి ఉన్నారు. నస్రల్లా తర్వాతి స్థానంలో ఉన్నది నయీం కస్సెమ్. అత్యంత సీనియర్. 1991 నుంచి హెజ్బొల్లాకు డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. హషీం సైఫిద్దీన్ హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ అధిపతి. నస్రల్లాకు సోదరుడైన హషీం హెజ్బొల్లా సారథ్య బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. బతికి ఉన్న అగ్రనేతల్లో మరో ఇద్దరు.. తలాల్ హమీహే, అబూ అలీ రెదాలు. వీరిందరిపై ఇజ్రాయెల్ ఇప్పుడు గురిపెట్టింది. -
‘విరమణకు నస్రల్లా అంగీకారం’
బీరూట్: బీరూట్‌పై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు ముందు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ అన్నారు. హత్యకు ముందే ఇజ్రాయెల్‌తో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం గురించి నస్రల్లా అమెరికా, ఫ్రెంచ్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ బీరూట్‌పై వైమానిక దాడుల చేసినట్లు సమయంలో నస్రల్లా దక్షిణ శివారు ప్రాంతం దహియేలోని ఒక బంకర్లో ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు లెబనాన్ నుంచి పారిపోవాలని నస్రల్లాను హెచ్చరించినట్లు బుధవారం రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ వార్నింగ్ వేళ.. ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్ -
ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం
టెల్ అవీవ్: దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం సంభవించింది. హెజ్బొల్లాపై యుద్ధంలో తమ జవాన్లు ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు బుధవారం ప్రకటించారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపారు. తాము వెనుకడుగు వేయబోమని, హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. మరోవైపు హెజ్బొల్లా సైతం వెనక్కి తగ్గడంలేదు. ఇజ్రాయెల్ సేనలపై విరుచుకుపడుతోంది. లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదాతి దళానికి అండగా యుద్ధ ట్యాంకులు సైతం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు కొందరు గాయపడ్డారని హెజ్»ొల్లా తెలియజేసింది. 50 గ్రామాలు, పట్టణాలు ఖాళీ! దక్షిణ లెబనాన్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలు, పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించారు. దీంతో జనం సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలిపోయారు. దాదాపు 50 గ్రామాలు, పట్ణణాలు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం. హెజ్బొల్లా కబంధ హస్తాల నుంచి లెబనాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికే సైనిక చర్య ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఆగవని అంటోంది. -
ప్రమాదంలో ప్రపంచం
వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్‌అవీవ్‌లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్‌ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం. శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్‌పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది. నిజానికి ఇరాన్‌ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది. మొన్న ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు. ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె. ఇజ్రాయెల్‌కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్‌కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది. ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి. -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్
ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్, హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటోంది. శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్- ఇజ్రాయెల్‌ల యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాల మధ్య సాగుతోన్న భీకర దాడులు ఇద్దరు చిన్నపిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరన్ జరిపిన రాకెట్ దాడి వంటి ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలపై అమెరికా మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.‘ఇది నిజంగా చెడు విషయం. కానీ, వారు ఆ యుద్ధ ప్రక్రియను పూర్తిచేయాలి. పాఠశాల ప్రాంగణంలోఇద్దరు చిన్నారులు కొట్లాడుకుంటున్నట్లు ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వదిలేయాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్ దళాలు 200 రాకెట్లను కూల్చేశారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ జీవించాలి. కాబట్టి ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్అయితే ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లపై విమర్శలు గుప్పించారు. వారు ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని పేర్కొన్నరు. తాను చాలాకాలంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నానని, తన అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ఈసందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదన్నారు.కాగా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 200 క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిలో చాలావాటిని అమెరికా మిలటరీ సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. -
మీకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ పీఎం హెచ్చరిక
Iran Attacks Israel Live Updatesజెరూసలెం: పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకు పడుతుంది. టెల్ అవీవ్,జెరుసలేంతో పాటు ఇతర నగరాల్లో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. తొలిసారిగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై హైపర్సోనిక్ ఫట్టా క్షిపణులను ఉపయోగించాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తాము చేసిన దాడులు 90 శాతం ఫలితాల్ని ఇచ్చినట్లు ఇరాన్ ఆర్మీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపిందిఈ తరుణంలో తమ దేశంపై వైమానిక దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇరాన్,హెజ్బొల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. దాడులు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు. ‘ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇరాన్ పెద్ద ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ’ హెచ్చరించారు. కమ్ముకున్న యుద్ధ మేఘాలుఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్పొరుషన్ను హతమార్చినందుకు ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది.400 మిసైళ్లతో దాడిజెరూసలెం, టెల్ అవీవ్ నగరాలపై ఏకకాలంలో 400 మిసైళ్లతో దాడులు చేసింది. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా సైతం బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది.ఓవైపు ఇజ్రాయెల్‌పై వైమానికి దాడులకు పాల్పడుతూనే టెల్అవీవ్లో ఇరాన్.. ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది. టెల్‌అవీవ్‌లోని ఓ మెట్రో స్టేషన్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది.ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్అవీవ్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.విమానాల రాకపోకలపై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ ప్రభావం పడింది. ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మీదిగా విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి. 👉ఇదీ చదవండి : టపాసుల్లా పేలిన హెజ్బొల్లా ఉగ్రవాదుల పేజర్లు -
ఇజ్రాయెల్‌కు షాక్ ఇవ్వనున్న హెజ్బొల్లా!
హెజ్బొల్లాను నిర్వీర్యం చేసే లక్ష్యంతో లెబనాన్‌లో ఆ గ్రూప్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేపట్టేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అయితే మరోవైపు.. మంగళవారం ఇజ్రాయెల్ టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థావరం, మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడి చేసినట్లు లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200కు చెందిన గ్లిలాట్ బేస్, టెల్ అవీవ్ శివార్లలో ఉన్న మొసాద్ ప్రధాన కార్యాలయం వద్ద ఫాడి 4 రాకెట్లను ప్రయోగించినట్లు పేర్కొంది.శుక్రవారం బీరుట్ శివార్లలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో తమ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజజ్రాయెల్ అంతం చేసిన తర్వాత ‘‘ మీ సేవలో నస్రల్లా’’ అనే పేరుతో ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాన మిలిటరీ ఇంటెలిజెన్స్ గ్లిలోట్ బేస్ లక్ష్యంగా తమ బృందం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేసిందని ఆగస్టు చివరిలో నస్రల్లా పేర్కొన్నారు. అయితే.. ఆ సమయంలో తమ స్థావరాలపై దాడి చేయడంలో హెజ్బొల్లా విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక.. హెజ్బొల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం. -
Israel Hezbollah War: పోరు ఆపం
బీరుట్: ఇజ్రాయెల్‌తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్‌లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్‌తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు. -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
Israel Hezbollah War: హెజ్బొల్లా అగ్రనేత హతం
జెరూసలేం: లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం వెల్లడించింది. కౌక్ మృతిని హెజ్బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది! హెచ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం ఇజ్రాయెల్ భీకర బాంబు దాడిలో మృతిచెందడం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌక్ 1980ల నుంచి హెజ్బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.జోర్డాన్‌పై మిస్సైల్ దాడి! మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్‌పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్ నుంచి దూసుకొచి్చనట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...! లెబనాన్ రాజధాని బీరుట్లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఇరాన్ గూఢచారి ఇచి్చన కచి్చతమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్ పత్రిక లీ పారిసీన్ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్బొల్లా సీనియర్ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది. నస్రల్లా మృతిపై ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సిరియాపై అమెరికా దాడులు... 37 మంది మిలిటెంట్లు హతం బీరుట్: సిరియాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడులకు దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ మిలిటెంట్‌తో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయవ్య సిరియాపై దాడి చేసినట్లు అమెరికా æ తెలిపింది. సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం పేర్కొంది. 2014లో ఇరాక్, సిరియాలను చుట్టుముట్టి, పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్ గ్రూపు తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులున్న వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలోనే ఉన్నాయి. దాడుల్లో 69 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పుల్‌స్టాప్ పడటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఆదివారం చేసిన దాడులతో 69 మంది చనిపోగా 76 మంది గాయపడినట్లు లెబనాన్ తెలిపింది. ఒక్క బెకా లోయపై దాడుల్లో 21 మంది మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని, అయిన్ అల్ డెల్బ్ గ్రామంపై జరిగిన దాడిలో 24 మంది చనిపోయారు. -
హెజ్బొల్లా చీఫ్ ఎలా చనిపోయాడు..?
బీరుట్:ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహం లభ్యమైంది.దక్షిణ బీరుట్ నుంచి తమ నేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బొల్లా ఆదివారం(సెప్టెంబర్29) వెల్లడించింది.అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి ప్రత్యక్ష గాయాలు లేవని సమాచారం.బాంబు దాడి కారణంగా షాక్‌కు గురై నస్రల్లా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.కాగా,తాము లెబనాన్‌పై ఆదివారం తాజా దాడుల్లో హెజ్బొల్లా మరో కీలక నేత నబిల్కౌక్కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.ఇదీచదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్య నేత హతం
జెరూసలెం:లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది.ఇజ్రాయెల్ ఆదివారం(సెప్టెంబర్29) జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా మరో ముఖ్యనేత నబిల్కౌక్ మరణించాడు.తమ రాకెట్ దాడుల్లో హెజ్బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై హెజ్బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (64) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది.నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు.నబిల్పై 2020లో అమెరికా ఆంక్షలు విధించింది. ఇదీచదవండి: బంకర్బాంబు దాడిలో నస్రల్లా మృతి -
నస్రల్లా మృతిపై బైడెన్ సంచలన కామెంట్స్
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులు, నస్రల్లా మృతిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్‌ను కోరింది. దీంతో, భదత్రా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. హిజ్బులా చీఫ్ హనస్ నస్రల్లా హత్యపై తాజాగా అమెరికా స్పందించింది. నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..‘గతేడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ రెడీ అయ్యింది. హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుంది. నస్రల్లా కారణంగా హిజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతిచెందారు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో బీరుట్లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే, బీరుట్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. దీంతో, బీరుట్‌లోని అమెరికన్లు కొందరు స్వదేశం బాటపట్టినట్టు సమాచారం.మరోవైపు.. రాబోయే రోజుల్లో తమ శత్రువులపై దాడులు మరింత పెరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా 33 మంది మరణించారు. అలాగే, 195 మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ కారణంగా గత రెండు వారాల్లో దాదాపు 1000 మంది మరణించగా.. 6000 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు -
హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్లోనూ సభ్యుడుగా ఉన్నాడు.మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో -
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా మృతి.. ధ్రువీకరించిన హెజ్బొల్లా
లెబనాన్ రాధాని బీరుట్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ అధిపతి హసన్ నస్రల్లా హతమైనట్లు తాజాగా హెబ్బొల్లా ధృవీకరించింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరుతో జరిపిన విధ్వంసకర పోరులో 64 ఏళ్ల నస్రల్లా మరణించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.‘ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మా నాయకుడు నస్రల్లా మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున నస్రల్లా మృతదేహాన్ని గుర్తించాంి. నస్రల్లాతోపాటు మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహం కూడా లభించింది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తాం’ అని’’ అని హెజ్బొల్లా బృందం ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ శుక్రవారం లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. దీంతో ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ మిషన్ అటు ఇజ్రాయెల్ వార్ రూమ్వెల్లడించింది. -
ఇరాన్ హై అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి సుప్రీమ్ లీడర్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మా యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదు: ఇజ్రాయెల్
జెరూసలెం: లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దాని చుట్టుపక్కలప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) హెచ్చరించింది.ఈమేరకు ఐడీఎఫ్ ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియోని పోస్టు చేసింది.తమ యుద్ధం హెజ్బొల్లాతోనే కానీ లెబనాన్ ప్రజలతో కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులు లక్ష్యంగా హెజ్బొల్లా దాదాపు లక్షా 50వేల రాకెట్లు లెబనాన్‌లో ఉంచిందని తెలిపింది.వాటిల్లో కొన్నింటిని వ్యూహాత్మకంగా పౌరులు నివసించే ప్రాంతాల్లో ఉంచిందని, వాటిని తాము నిర్వీర్యం చేయనున్నామని వెల్లడించింది. ఇందులో భాగంగా దాడులు జరిగే అవకాశమున్నందున ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలని ఐడీఎఫ్ కోరింది.ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులను హెజ్బొల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ చీఫ్ తెలిపారు.లెబనాన్ నుంచి వచ్చిన రాకెట్‌తో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లా నుంచి తమ దేశ ప్రజలతో పాటు వనరులను రక్షించుకుంటామని చెప్పారు. ఇదీచదవండి: హూ ఈజ్ నస్రల్లా..ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతడే -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది. -
హెజ్బొల్లాపై యుద్ధం ఆగదు
ఐక్యరాజ్యసమితి: ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవి్వంపు దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై తమ వైమానిక దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సాక్షిగా సమరి్థంచుకున్నారు. హెజ్బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని, విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. న్యూయార్క్ నగరంలో ఐరాస సర్వ సభ్య సమావేశాల సందర్భంగా శుక్రవారం నెతన్యాహూ ప్రసంగించారు. హెజ్బొల్లాపై దాడులు ఆపబోమని చెప్పి అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పులవిరమణ ప్రతిపాదనలకు నెతన్యాహూ పురిట్లోనే సంధికొట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని.. రోజూ రాకెట్ దాడులను సహించం ‘‘పొంచిఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్‌పై ఉంది. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్ పాసో, శాండిగోలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది?. మేం కూడా అంతే. దాదాపు ఏడాదికాలంగా హెజ్బొల్లా దాడులను భరిస్తున్నాం. మాలో సహనం నశించింది. ఇక చాలు. సొంతిళ్లను వదిలి వెళ్లిన 60,000 మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలను సొంతిళ్లకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దు వెంట ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. మా లక్ష్యం నెరవేరేదాకా హెజ్బొల్లాపై దాడులను ఆపేది లేదు’’ అని నెతన్యాçహూ అన్నారు. అందుకే వచ్చా ‘‘నిజానికి ఈ ఏడాది ఐరాసలో మాట్లాడేందుకు రావొద్దనుకున్నా. అస్థిత్వం కోసం గాజా్రస్టిప్‌పై సైనిక చర్య మొదలయ్యాక నా దేశం యుద్ధంలో మునిగిపోయింది. అయితే ఐరాస పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు, వదంతులకు చరమగీతం పాడేందుకే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటుంది. ఒక్కటి స్పష్టంగా చెబుతున్నా. మాపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై దాడి చేస్తాం. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణం’’ అని అన్నారు. 90% హమాస్ రాకెట్లు ధ్వంసంచేశాం‘‘గాజాలో యుద్ధం తుది దశకు వచి్చంది. ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉంది. ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలి. లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధంచేస్తాం. సంపూర్ణ విజయమే మా లక్ష్యం. దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధబాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక మాకు కూడా ఇంకో మార్గం లేకుండాపోయింది. 90 % హమాస్ రాకెట్లను ధ్వంసంచేశాం. 40వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమో లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగింది అని అన్నారు.ఓవైపు ఆశీస్సులు... మరోవైపు శాపంఆశీస్సులు, శాపం అనే పేర్లు పెట్టి రెండు భిన్న ప్రాంతాల భౌగోళిక పటాలను నెతన్యాహూ పట్టుకొచ్చి వివరించారు. ‘‘ ఆశీస్సులు కావాలో, శాపం కావాలో ప్రపంచదేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్.. ఆసి యా, యూరప్‌ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోంది. ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయింది. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరాసముద్రం దాకా పరుచుకున్న ఉగ్రనీడ ఇది. ఇది ప్రపంచదేశాలకు శాపం. ఇరాన్లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమీ లేదు’’ అంటూ తప్పనిపరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్‌పైనా దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యాహూ తెచి్చన మ్యాప్‌లో గాజా్రస్టిప్ మొత్తాన్నీ ఇజ్రాయెల్‌లో భాగంగానే చూపారు. హమాస్, హెజ్బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహూ చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టంలేని చాలా మంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు. -
Israel-Hezbollah war: బంకర్ బస్టర్ బాంబు వినియోగం
బీరుట్: హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్ బస్టర్’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది. జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. -
టార్గెట్ నస్రల్లా.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
బీరుట్: హెజ్బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీరుట్లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం. పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది. ఇరాన్ ఆరా.. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది. -
దాడులు కొనసాగించండి!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శత్రువుల భరతం పట్టాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆయన తాజాగా అమెరికాకు పయనమయ్యారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగిస్తారు. హెజ్బొల్లా్లతో చర్చల ప్రతిపాదన వచి్చన మాట వాస్తమేనని, అయితే దానిపై తాము ఇంకా స్పందించలేదని చెప్పారు. మరోవైపు హెజ్బొల్లా్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు ఇజ్రాయెల్‌లో వినిపిస్తున్నాయి. చర్చలు అవసరం లేదని నెతన్యాహూ మద్దతుదారులు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయ రక్తసిక్తంగా మారుతోంది. హెజ్బొల్లా ఆయుధ నిల్వలతోపాటు పలు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం అర్ధరాత్రి తర్వాత నిప్పుల వర్షం కురిపించింది. భారీగా క్షిపణులు ప్రయోగించింది. 75 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడుల చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. 23 మంది సిరియన్లు మృతి లెబనాన్‌లోని యూనైన్ పట్టణంలో మూడంతస్థుల భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 23 మంది సిరియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిసింది. లెబనాన్‌లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియన్లు తలదాచుకుంటున్నారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరంతా ప్రాణరక్షణ కోసం లెబనాన్‌కు చేరుకున్నారు. హెజ్బొల్లా విషయంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ గురువారం స్పష్టంచేశారు. హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మృతి?హెజ్బొల్లా డ్రోన్ విభాగం కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గురువారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరుట్‌పై మళ్లీ దాడులకు దిగింది. దహియెలోని అపార్టుమెంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయ పడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరౌర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించుకోగా హెజ్బొల్లా స్పందించలేదు.లెబనాన్ నుంచి వెంటనే వెళ్లిపోండిజెరూసలేం: యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లెబనాన్‌కు భారత పౌరులెవరూ రావొద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. లెబనాన్‌లో ఉండే భారతీయులు సాధ్యమైనంత త్వరగా దేశాన్ని వీడాలని, ఉండాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో అడ్వైజరీ జారీ చేసింది. -
హిజ్బుల్లాపై దాడుల్ని ఆపలేం.. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
జెరూసలేం: ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నేతన్యాహు పరోక్షంగా 21 రోజుల కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదనే సంకేతాలిచ్చినట్లయ్యింది.హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడుతుండడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఈ తరుణంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా కాల్పులు విరమించాలని అమెరికా,ఫ్రాన్స్‌తో పాటు యురోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం అధికారింగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనానలు చెబుతున్ననాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నేతన్యాహు అంగీకరించడం లేదు. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు విస్తృతం చేయాలని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.భూతల దాడులకు సిద్దమైన ఇజ్రాయెల్బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి సైనికులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో అగ్రరాజ్యం అమెరికా తోపాటు, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చాయి. ఆ ప్రతిపాదనని ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
బైడెన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలు!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అనూహ్య దాడులతో హిజ్బుల్లా సైనిక బలం సగానికి తగ్గింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆల్ అవుట్ వార్(అంతటా యుద్ధం సాధ్యమే) అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి బైడెన్ కామెంట్స్ చేయడంతో.. కవ్వింపు చర్యలకు దిగిన నెతన్యాహు మరిన్ని దాడులకు సన్నద్ధమవుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం హిజ్బుల్లా పరిస్థితి గాజాలోని హమాస్ మాదిరిగానే తయారైంది. కేవలం నాలుగు రోజుల ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్.. హిజ్బుల్లా 90 శాతం నాయకత్వాన్ని హతమార్చింది. హిజ్బుల్లా సైనిక బలాన్ని సగం నాశనం చేసింది. ఆపరేషన్ నార్తర్న్ యారో కారణంగా.. హిజ్బుల్లా సైనిక మౌలిక సదుపాయాలలో సగం ధ్వంసమైందని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి. ఐడీఎఫ్ తన నివేదికలో హిజ్బుల్లా అగ్ర నాయకత్వంలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారని చెబుతోంది. వీరు చీఫ్ హసన్ నస్రల్లా, హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, బదర్ యూనిట్ హెడ్ అబూ అలీ. వీరికి కూడా త్వరలోని అంతం చేస్తామని తెలిపింది.ఆర్మీ చీఫ్ సూచన..మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హిజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు.⚡🚨Breaking; Last night on Hezbollah in the attacks of the Israeli Air Forcewas difficult The mistake of the organization was the thought ⚡that he could use the citizens' homes as a human shield to prevent Israel from defending itself. pic.twitter.com/FFmPFJFGfj— tzachi dado צחי דדו 🎗️ (@UsBnnxVURfS4lPJ) September 26, 2024ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు విరమణ పాటించాలని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొన్ని ఇతర భాగస్వామ్య దేశాలు ఇజ్రాయెల్ తక్షణమే 21 రోజుల కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇక, హిజ్బుల్లాకు ప్రధాన మద్దతు దేశమైన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. వెంటనే కాల్పులను ఆపివేయాలని డిమాండ్ చేసింది. 51 మంది మృతిఇదిలా ఉండగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. ఈ ఘనటలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 223 మందికి తీవ్రంగా గాయాలైనట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.భారత్ అలర్ట్..ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్‌లో ఉంటున్న తమ పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లెబనాన్‌కు ఇపుడు ఎవరూ రాకూడదని స్పష్టంచేసింది. Embassy of India in Beirut tweets, "As a reiteration of the Advisory issued on 1 August 2024 and in view of the recent developments and escalations in the region, Indian nationals are strongly advised against travelling to Lebanon till further notice. All Indian nationals already… pic.twitter.com/kpvhiuGN3N— ANI (@ANI) September 25, 2024 ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
42 ఏళ్ల రక్తచరిత్ర
హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఏకంగా ఆరు వందల మంది దాకా మరణించారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ ఇంతటి తీవ్ర దాడులకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కొత్తేమీ కాదు. ఇది నాలుగు దశాబ్దాల రక్తచరిత్ర... 1982: ఇజ్రాయిల్ ఆక్రమణ–హెజ్జ్బొల్లా్ల పుట్టుక హెజ్జ్బొల్లా, ఇజ్రాయెల్ సంఘర్షణకు 1982లో బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుట్ నడిజ్బొడ్డులో పీఎల్‌ఓను ముట్టడించింది. ఈ మారణకాండలో 2,000 మంది పాలస్తీనా శరణార్థులు, 3,500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచి్చందే హెజ్బొల్లా. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, బెకా లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తుండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది.1983–1985: రక్తపాతం–ప్రతిఘటన హెజ్జ్బొల్లా, దాని గ్రూపులు లెబనాన్‌లోని విదేశీ దళాలపై 1982–1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్‌లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడిలో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనేనని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించినా, దాడి వెనుక హెజ్జ్బొల్లా హస్తముందని ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బొల్లా బలపడింది. 1992–1996: రాజకీయ ఎదుగుదల 1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్జ్బొల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాల్లో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటననూ కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ అకౌంటబిలిటీ’లో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్జ్బొల్లాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్’తో హింస పరాకాష్టకు చేరింది. 2000–2006: ఇజ్రాయెల్ వెనుకంజ–జూలై యుద్ధం రెండు దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 మేలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. హెజ్జ్బొల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్‌లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్జ్బొల్లా బందించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ ‘జూలై’ఘర్షణలో 1,200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయెలీలు మరణించారు. 2009–2024: ప్రాంతీయ సంఘర్షణ 2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్‌లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచి్చనట్టు కని్పంచింది. 2012లో అసద్ ప్రభుత్వం తరఫున హెజ్జ్బొల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచి్చంది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్జ్బొల్లాకు కొత్త శక్తినిచి్చంది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్జ్బొల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా?
లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారని లెబనాన్ ఆరోపిస్తోంది. అయితే.. ప్రస్తుతకాలంలో ప్రపంచంలోని మరేయితర దేశం ఎదుర్కొనంత యుద్ధ సంక్షోభం తాము ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. ఒకవైపు హమాస్.. మరోవైపు హెజ్బొల్లా దాడులతో క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఉన్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ప్రత్యర్థులపై చేస్తున్న జరుగుతున్న ‘మిస్టరీ దాడుల్ని’ తోసిపుచ్చకపోవడం గమనార్హం!!. అయితే.. భారత్‌లో ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియా ఛానెల్ డిబేట్లో పాల్గొన్నారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇది ఇజ్రాయెల్, దాని నిఘా సంస్థల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అని యాంకర్ అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘గతంలో సైన్యాల మీదనో, ఉగ్రవాదం మీదనో దాడులు జరిగేవి. ప్రస్తుతం యుద్ధం అనేది సంప్రదాయ పద్ధతుల నుంచి హైబ్రీడ్ పద్ధతికి మారిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయెల్ ఎదుర్కొన్నంత దాడులు మరేయితర దేశం ఎదుర్కొలేదు. రాకెట్లు, మిస్సైల్స్ మాత్రమే కాదు.. మా దేశంపై సైబర్ దాడులు కూడా జరిగాయి. నింగి, నేల, జల మార్గం ఆఖరికి టన్నెల్స్ ద్వారా కూడా మాపై దాడులు జరిగాయి... ఇలాంటి పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్ కేవలం తనను తాను రక్షించుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేయడం లేదు. అదే టైంలో తన దాడులతో శత్రు దేశాలకు ‘సర్ప్రైజ్’ చేయాలనుకుంటోంది కూడా. ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ తరహా దాడులు చేస్తుందో.. అనే అంశం లోతుల్లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ, ప్రత్యర్థులు దొడ్డిదారిన దాడులకు తెగబడినప్పుడు వాళ్లకు అదే రీతిలో బదులివ్వడం తప్పేం కాదు కదా’’ అని రూవెన్ వ్యాఖ్యానించారు.ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. తాజా యుద్ధ పరిణామాలతో పాటు అమెరికా, భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు దక్కిన మద్ధతు, తాజా అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌తో భేటీ కావడం లాంటి అంశాలపైనా స్పందించారు. లెబనాన్‌లో సెప్టెంబర్ 17-18 తేదీల మధ్య పేజర్లు, ఆ మరుసటి రోజే వాకీటాకీలు.. ఇతర శాటిలైట్ డివైజ్‌లు పేలిపోయి 37 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇవి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్.. దాని నిఘా సంస్థ మోస్సాద్ జరిపిన దాడులేనని లెబనాన్ ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మెరుపు దాడి.. హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ -
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్‌లో జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి -
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
హిజ్బుల్లాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు