బీరుట్:మిలిటెంట్ గ్రూపు హెజ్‌బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారం(నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్‌బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్‌బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించింది.
ఇదిలా ఉండగా హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment