strikes
-
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్ దాడులు..26 మంది మృతి
గాజా:ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. -
ఇరాన్‌పై దాడులు.. నెతన్యాహు సంచలన ప్రకటన
టెల్అవీవ్:ఇరాన్ మీద ఇటీవల జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.ఇరాన్ అణు స్థావరాలపై తాము అక్టోబర్‌లోనే దాడి చేసినట్లు నెతన్యాహు తాజాగా అంగీకరించారు.ఈవిషయాన్ని ఆయన దేశ పార్లమెంట్లో వెల్లడించారు.తాము వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం మాత్రం ఆగలేదని ఆయన పేర్కొన్నారు.ఇక ఇదే ఏడాది ఏప్రిల్‌లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద ఉండగా అక్టోబర్‌లో చేసిన దాడిలో అవి కూడా ధ్వంసం అయ్యాయన్నారు. అదే సమయంలో ఇరాన్ తన క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామని వెల్లడించారు.ఒకవేళ వీటికి ఇరాన్ ప్రతి దాడులు చేస్తే వాటికి కూడా ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహూ తెలపడం గమనార్హం.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.అయితే దాడుల సమయంలో అణుస్థావరాల విషయం ప్రస్తావనకు రాలేదు. -
హెజ్బొల్లాకు మళ్లీ ఎదురుదెబ్బ.. మరో కీలక నేత హతం
బీరుట్:మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారం(నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించింది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. -
‘ఇరాన్లో అడ్డగోలుగా అణుస్థావరాలు.. దాడులు చేయాల్సిందే!’
ఇరాన్లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024 ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్‌ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది.బీరుట్‌పైనే కాకుండా తీర నగరం టైర్‌పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన శనివారం జరిపిన దాడుల గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో మొత్తం 3136 మంది మరణించారని, 13వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. కాగా, పాలస్తీనాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హెజ్బొల్లా ఇరాన్‌కు మద్దతుగా పనిచేస్తోందన్న కారణంగా ఇటీవల ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై విరుచుకుపడుతోంది.ఇదీ చదవండి: డీఏపీకి ‘గాజా’ దెబ్బ -
ఇజ్రాయెల్‌కు పవర్ చూపించాలి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ పవర్‌ను ఇజ్రాయెల్‌కు చూపించాలన్నారు. దీని కోసం ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులను మరీ తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని ఖమేనీ చెప్పినట్లు తెలిపింది. కాగా,శనివారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా 100 యుద్ధ విమానాలు,డ్రోన్లతో అక్కడి క్షిపణి,డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇదీ చదవండి: ఇరాన్‌పై నిప్పుల వర్షం -
హెజ్బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌లోని బీరుట్లో హెజ్బొల్లా గ్రూప్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులు చేస్తోంది.Israel has launched targeted airstrikes on branches of the Hezbollah-linked Al-Qard Al-Hassan financial association in Beirut and the Beqaa Valley. These strikes, some near Beirut's airport, follow warnings from the IDF accusing the quasi-bank of financing Hezbollah's operations. pic.twitter.com/wi9sjbUYhF— TBN Israel (@TbnIsrael) October 21, 2024 బీరుట్‌లోని ఆ ప్రాంతాల్లో లెబనాన్ పౌరులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. దిక్కు తోచక బీరుట్ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లితున్నారు.హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు చోట్ల పేలుళ్లు జరిపింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.⚡️This moment, #Israel airstrikes targeted multiple areas in the suburbs of #Beirut, Lebanon. The Israel has announced plans to target businesses it claims are connected to #Hezbollah, singling out the Al Qard Al Hassan Institution.Al Qard Al Hassan operates throughout Lebanon,… pic.twitter.com/VTmnyXK2eF— Shah Faisal AfRidi (@Sfaisalafridi) October 20, 2024 అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 73 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైనిక ముట్టడి కారణంగా ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారింది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం వంటి అవసరమైన సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్బొల్లా డ్రోన్ ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది.చదవండి: మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి -
సిరియాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
డమాస్కస్:సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా 11 మంది దాకా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పిల్లలు,మహిళలు ఉన్నట్లు సిరియా మీడియా వెల్లడించింది. దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది.ఇజ్రాయెల్‌లోని గోలాన్ హైట్స్ నుంచి మూడు మిసైల్స్ అపార్ట్‌మెంట్‌పైకి దూసుకువచ్చి ఈ దాడులు జరిపాయి. ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అక్టోబర్7 హమాస్ తమపై జరిపిన మెరుపు దాడుల తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా చితికిపోయింది: అమెరికా -
గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది మృతి
గాజా:ఓ పక్క లెబనాన్‌లో హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు మరోపక్క పాలస్తీనాలోని గాజాలోనూ దాడులు కొనసాగిస్తున్నాయి.ఆదివారం(అక్టోబర్6)సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24మంది మరణించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు.డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదులో నిరాశ్రయులైన ప్రజలుంటున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 24మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో దాదాపు 42వేల మంది మరణించారు.ఇదీ చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
హెజ్బొల్లాకు రెస్ట్ తీసుకునే సమయం కూడా ఇవ్వం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ వరుస వైమానిక,భూతల దాడులతో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే లెబనాన్ దేశ రాజధాని బీరూట్ చిగురుటాకులా వణికిపోతుంది.తాజాగా ఇజ్రాయెల్ శనివారం సాయంత్రం నుంచి బీరూట్‌లోని హెబ్బొల్లా కమాండ్ సెంటర్లు, అణ్వాయుదాలు నిల్వ ఉంచే స్థావరాలు, టెన్నెల్స్,మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పేలుళ్ల దాటికి దక్షిణ బీరుట్, దాని పరిసర ప్రాంతాలు రెండుగంటలకు పైగా బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. దీంతో బీరూట్‌లో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి ఒకటిగా నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. మేము హెజ్బొల్లాపై మరింత ఒత్తిడి తేవాలి. ఉపశమనం లేకుండా హెజ్బొల్లాకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి. విశ్రాంతి ఇవ్వకుండా శాస్వత నష్టం కలిగించేలా చేయాలని అన్నారు. -
లెబనాన్‌పై దాడులు ఆపాలి: రష్యా
మాస్కో: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ త్వరలో పర్యటిస్తారని తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడితో మిఖాయిల్ సమావేశం కానున్నారని వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని కోరింది. ఇదీ చదవండి: లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సోమవారం(సెప్టెంబర్30) తెల్లవారుజామున బీరుట్ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.బీరుట్‌లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: లెబనాన్ నిరాశ్రయులు..10 లక్షలు -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడంలేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ స్కూల్లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగా అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. -
టెల్అవీవ్లో కత్తిపోట్లు.. ఇద్దరి మృతి
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్ కేంద్రంగా ఇరాన్ మద్దతుతో పనిచేసే హిబ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌పై మరోసారి బాంబుల వర్షం కురిపించింది.ఆదివారం(ఆగస్టు4) తెల్లవారుజామున ఉత్తరగాజాలోని టెంట్ క్యాంప్‌పై జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ శివార్లలో పాలస్తీనా మిలిటెంట్ ఒకరు జరిపిన కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై హిజ్బుల్లా ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని సమాచారం. -
ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడులు: ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలున్నాయని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌లోని సామాన్య సైనిక స్థావరాలతో పాటు సామాన్య పౌరులు కూడా లక్ష్యంగా దాడులు చేసే అవకాశాలున్నాయి. తమ సీనియర్ కమాండ్‌ర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందడంతో హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు ఇరాన్ పరోక్ష మద్దతుందన్న ప్రచారం ఉంది. ఒక పక్క హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య, మరోపక్క హెజ్బొల్లా సీనియర్ కమాండర్ మృతితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు జరిగినా మద్దతిచ్చేందుకు అమెరికా ఇప్పటికే ఫైటర్జెట్లను పశ్చిమాసియాకు పంపుతుండటం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. -
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 31 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే స్కూల్లోని ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిసింది. ఇది కాక మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాడుల ప్రభావంతో ఖాన్ యూనిస్ నగరం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా అప్పటి నుంచి హమాస్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం -
ఇరాన్ దాడులు: నష్టంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్13) అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకు వచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తర్వాత కూడా బాలిక పరిస్థితి కుదటపడలేదు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా -
ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే..!
కీవ్: ఉక్రెయిన్‌పై ఆదివారం(మార్చ్ 24)రష్యా తాజాగా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్‌తో పాటు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్పై రష్యా దాడులు చేసింది. కీవ్‌లో రష్యా దాడుల కారణంగా పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్ చీఫ్ మిలిటరీ ఆఫీసర్ చెప్పారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. రష్యా తాజా దాడులతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ అలర్ట్ అయింది. తమ ఆకాశంలోకి ఇతర దేశాల యుద్ధ విమానాలు ప్రవేశించకుండా నిఘా పెట్టింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు -
హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్‌లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్‌లో వీగిన అమెరికా తీర్మానం