PhotoCredit: AFP
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్13) అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది.
బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకు వచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తర్వాత కూడా బాలిక పరిస్థితి కుదటపడలేదు.
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది.
ఇదీ చదవండి.. ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా
Comments
Please login to add a commentAdd a comment