Casualties
-
ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం
టెల్ అవీవ్: దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం సంభవించింది. హెజ్బొల్లాపై యుద్ధంలో తమ జవాన్లు ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు బుధవారం ప్రకటించారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపారు. తాము వెనుకడుగు వేయబోమని, హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. మరోవైపు హెజ్బొల్లా సైతం వెనక్కి తగ్గడంలేదు. ఇజ్రాయెల్ సేనలపై విరుచుకుపడుతోంది. లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదాతి దళానికి అండగా యుద్ధ ట్యాంకులు సైతం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు కొందరు గాయపడ్డారని హెజ్»ొల్లా తెలియజేసింది. 50 గ్రామాలు, పట్టణాలు ఖాళీ! దక్షిణ లెబనాన్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలు, పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించారు. దీంతో జనం సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలిపోయారు. దాదాపు 50 గ్రామాలు, పట్ణణాలు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం. హెజ్బొల్లా కబంధ హస్తాల నుంచి లెబనాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికే సైనిక చర్య ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఆగవని అంటోంది. -
ఇరాన్ దాడులు: నష్టంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్13) అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకు వచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తర్వాత కూడా బాలిక పరిస్థితి కుదటపడలేదు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
President Droupadi Murmu: వారి త్యాగాలకు దేశం రుణపడింది
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరులైన భద్రతాబలగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బుధవారం పార్లమెంట్ దాడి మృతులకు ఆమె నివాళులర్పించారు. ‘‘ ప్రజాస్వామ్య దేవాలయంపైనే దాడికి తెగబడి అత్యున్నత స్థాయి రాజకీయనేతలను అంతంచేయాలని ఉగ్రవాదులు హేయమైన కుట్రపన్నారు. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు వమ్ముచేసి ఆ క్రమంలో ప్రాణత్యాగంచేశాయి. ఆ ధైర్యశాలులకు నా నివాళులు. మాతృభూమి కోసం మీరు చేసిన ప్రాణత్యాగానికి దేశం సదా రుణపడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సిద్ధమని అందరం ప్రతినబూనుదాం’’ అని సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నాసరే దానిని సమూలంగా తుదముట్టించాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూశ్ గోయల్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమరులకు నివాళులర్పించారు. అమరుల త్యాగాన్ని భారత్ సదా స్మరించుకుంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: ప్రధాని పార్లమెంట్లో అమరులకు బుధవారం ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. ‘‘ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరోచిత భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక నివాళులు. ఆపత్కాలంలో తెగువ చూపిన వారి త్యాగాలను యావత్ దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమరులకు లోక్‌సభ నివాళులర్పించింది. లోక్‌సభ కార్యకలా పాలు బుధవారం మొదలవగానే స్పీకర్ బిర్లా మాట్లాడారు. ‘ ఉగ్రవాదులతో పోరాటంతో ప్రాణాలు కోల్పోయిన భద్రతా బలగాల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి నిల్చుని కొద్దిసేపు మౌనం పాటించారు. -
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
ప్రకృతి ప్రకోపం.. 23 మంది మృతి
తిరువనంతపురం/లక్నో: దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి 23 మంది చనిపోయారు. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మరోవైపు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. దీంతో ఇప్పటి వరకు వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ వెల్లడించారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్గాడ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈశాన్యంలో కుండపోత.. గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నలుగురు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే మరిన్ని మిలిటరీ, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో వరదల కారణంగా రాజధాని ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు శుక్రవారం వరకూ సెలవు ప్రకటించారు. -
కృష్ణ జిల్లా బస్సు ప్రమాదం క్షతగాత్రుల్లో క్రిమినల్
-
ఆ చివరి ఆశయానికి సముచిత గౌరవం
దివంగత హరీష్ పేరుతో సంక్షేమ పథకం రేపు ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పథకం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా నిలచిన హరీష్ చివరి కోరిక బెంగళూరు: రాష్ర్ట ప్రభుత్వం ఒక సాధారణ వ్యక్తి పేరుతో సంక్షేమ పథకం అమలు చేయడం మహా ఆరుదు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో ఆ వ్యక్తి అసాధారణ తాపత్రయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన నేపథ్యం ఆయన పేరుతో సంక్షేమ పథకం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కూడా తాను చనిపోయే చివరి క్షణంలో కూడా అవయవదానం చేయాలని భావించిన హరీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం ఇవ్వనుంది. ప్రభుత్వం రేపు (మంగళవారం) ఆయన పేరు మీదుగా ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఓ సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. నగరంలో ఇటీవల జరగిన రోడ్డు ప్రమాదంలో నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆయన శరీరం రెండు భాగాలైంది. ఇక తాను బతకనని భావించి దగ్గరగా వచ్చిన వారితో ‘నా శరీరంలో ఏ అవయవం పనికి వస్తే ఆ అవయవాన్ని దానం చేయండి.’ అని అర్థించారు. విషయం తెలుసుకున్న వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన కళ్లు దానం చేశారు. ఆయన స్ఫూర్తితో స్వగ్రామమైన తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకా కరెగౌడహళ్లి గ్రామ ప్రజలంతా తమ కళ్లను దానం చేయడానికి ముందుకు వ చ్చారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన ప్రజలకు సత్వర వైద్య సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సాంత్వన యోజన’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేయాలని గతంలో భావించింది. గత జనవరి నెలలో ప్రారంభం కావాల్సిన ఈ పథకం వివిధ కారణాల వాయిదా పడుతూ వస్తోంది. చివరికి రేపు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హరీష్ తన చివరి క్షణంలో కూడా అవయవదానం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఎంతోమందికి ఈ విషయంలో ప్రేరణగా నిలిచారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సాంత్వన యోజన పేరును ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పేరుతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి యూ.టీ ఖాదర్ ధ్రువీకరించారు. ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ ఇలా పనిచేస్తుంది ►రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిని వారు ఆసుపత్రిలో చేరిన మొదటి 48 గంటలు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. గరిష్టంగా రూ.25 వేల వరకూ ఖర్చు పెడుతుంది. ►బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నేరుగా ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. ► చిన్న గాయాలు మొదలుకుని మొత్తం 25 రకాల చికిత్సలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. ►ఈ విషయంపై మరింత సమాచారం కోసం 108, లేదా 104లను సంప్రదించవచ్చు. -
పోలీసుల మాట వినుంటే..
గండేపల్లి ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సోమవారం పోలీసులకు లొంగి పోయాడు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద లారీ డ్రైవర్ జోగా శ్రీను లొంగి పోయినట్లు సమాచారం. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా 35మందిని ఎక్కించుకొని మితిమీరిన వేగంతో లారీని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీని అదుపుచేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయిన విషయం తెలిసిందే. డ్రైవర్ క్లీనర్లిద్దరూ విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్తపోలవరం వాసులు. కాగా డ్రైవర్ పీఎస్ లో లొంగిపోగా, క్లీనర్ పరారీలోనే ఉన్నాడు. ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. కొద్దిరోజు క్రితం పనుల కోసం చింతలపూడి వెళ్లిన వలస కూలీలు.. రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. చింతలపూడి నుంచి ఏలూరుకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు రాత్రి 11గంటల సమయంలో ఏలూరు బైపాస్ వద్ద 35మంది కూలీలు లారీ ఎక్కారు. ప్రమాదానికి సరిగ్గా గంట ముందు... లారీని పోలీసులు ఆపారు. అధిక లోడుతో వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అయినా డ్రైవర్ వినిపించుకోలేదు. పోలీసుల మాట వినుంటే ఇంత ఘోరం జరిగుండేది కాదు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 16మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15మంది గాయపడినట్లు సమాచారం. వారందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుప్రతికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గండేపల్లి మృతుల వివరాలు
తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంంలో 16 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో.. పత్తిపాడు మండలం యూ.జె పురానికి చెందిన 1.గాజు. త్రినాథ్, 2.గాజు. దొరబాబు, 3.కడిమి. సూరి, 4.కడిమి సురేశ్, 5.దొడ్డిపట్ల. శివకృష్ణ, 6.గొల్లపల్లి. సత్యనారాయణ, 7.సత్తా రాంబాబు, 8.గాలి వెంకన్న, 9.గార్ల సూరిబాబులు ఉన్నారు. రౌతులపాడు మండలం శృంగవరం గ్రామానికి చెందిన 10.ఈగల నాగబాబు, 11.గొల్లపల్లి దొరబాబు, 12.పసుకుర్తి శివకృష్ణ, 13.కొల్లి బాబ్జిలు, 14.దార్ల తొండబాబు ఈ ఘోర దుర్ఘటనలో దుర్మరణం చెందారు. అలాగే, తొండంగి మండలం 15. సూరిబాబు, శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన 16.పురం దాసు వీరబాబులు అక్కడికక్కడే మృతి చెందారు. -
కాబూల్ లో భారీ పేలుడు..
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజదాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం గేటుదగ్గర ఈ పేలుడు జరిగినట్టు కాబూల్ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విమానాశ్రయ ఆవరణలో తనిఖీలు నిర్వహించే మొదటి గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పలువురు గాయపడ్డారని, నష్టం భారీ స్తాయిలో ఉంటుదని అధికారులు భయపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మధ్యాహం భోజనం విరామ సమయంలో బాగా హడావుడిగా ఉండే సమయంలో భారీ ఎత్తున పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాణ నష్టం, ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
నేపాల్‌లో ఉండవల్లివాసులు!
♦ కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన ♦ క్షేమంగా ఉన్నారని తెలియటంతో ఊరట తాడేపల్లి రూరల్ : నేపాల్‌లో భూకంపం సంభవించి భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్టు తెలియటంతో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శనివారం కలకలం రేగింది. నేపాల్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించటానికి ఉండవల్లి గ్రామానికి చెందిన 27 మంది వెళ్లటమే దీనికి కారణం. తమవారికేమైందోనని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా ఆందోళన చెందారు. వారి సమాచారం తెలుసుకునేందుకు అవస్థలు పడ్డారు. తొలుత ఎలాంటి సమాచారం తెలియక కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రామానికి చెందిన 22 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఈ నెల 20న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. గోరఖ్‌పూర్ వరకు రైలులో వెళ్లినవారు అక్కడ్నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నేపాల్ చేరుకున్నారు. ఖాట్మాండులోని పశుపతినాథ్, ముక్తినాథ్ క్షేత్రాలకు వెళుతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా టీవీ చానెళ్లలో భూకంపం వార్తలు రావటంతో ఆందోళన చెందారు. తమవారి ఫోన్లకు పలుమార్లు కాల్ చేశారు. చివరికి తామంతా పోక్రా అనే ప్రాంతంలో ఉన్నామని, ఖాట్మండుకు వంద కిలోమీటర్ల దూరంలో నేపాల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో క్షేమంగా ప్రయాణిస్తున్నామని వారు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ ఎం.టి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ వినోద్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని నేపాల్ యాత్రకు వెళ్లినవారి వివరాలు సేకరించారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో వారి పేర్లు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. -
ప్రాణాలు.. ‘ఆటో'ఇటో!
కర్నూలు: వరుస ఆటో ప్రమాదాలతో ఎన్నో కుటుంబాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షతగాత్రుల జీవితం దుర్భరంగా మారుతోంది. అతివేగం.. మద్యం మత్తు.. అజాగ్రత్త.. కారణం ఏదైనా ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనుభవ లేమి.. లెసైన్స్ లేని డ్రైవర్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డ్రైవింగ్ నిబంధనలపై కనీస అవగాహన లేకపోయినా కుటుంబ పోషణ నిమిత్తం డ్రైవర్లుగా మారిపోతున్న వారి వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో రోజూ ఏదో ఒక మూలన ఆటో ప్రమాదం సర్వసాధారణమవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 15 ఆటో ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఆయా ఘటనల్లో 15 మంది మృత్యువాత పడగా.. 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆటోలో వస్తున్నాడని తెలిస్తే క్షేమంగా చేరుకునే వరకు నమ్మకం లేని పరిస్థితి. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేద్దామని యేటా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రతిజ్ఞ చేయించడమే తప్పిస్తే.. చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ కనపర్చని పరిస్థితి. ప్రమాదాలు అధికంగా చోటు చేసుకునే 125 ప్రాంతాలను గుర్తించినా.. లోపాలను సరిదిద్దడం, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. గతనెల 31న కర్నూలు శివారులోని వెంకాయపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. కర్నూలు నుంచి పడిదెంపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజులు గడవక మునుపే గత శుక్రవారం అదే ప్రాంతంలో ఒకరు మృత్యువాత పడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోల్లో డ్రైవర్లు లెక్కకు మించి ఎక్కిస్తుండటం.. అతివేగంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. గత నెల 24న పత్తికొండ పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన 20 మంది ఆటోలో వెళ్తూ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించడం తెలిసిందే. ఏడుగురు ప్రయాణించాల్సిన సెవెన్ సీటర్ ఆటోలో డ్రైవర్ సహా 21 మంది ప్రయాణిస్తుండటమే ప్రమాదానికి కారణమైంది. అదే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. చలనం లేని రవాణా శాఖ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రవాణా శాఖ అధికారుల్లో చలనం కరువైంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కాలం చెల్లిన వాహనాలపై కన్నేయాల్సి ఉంది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. మద్యం తాగి ఆటోలో నడుపుతున్న డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన సివిల్ పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం గమనార్హం. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఆటో ప్రమాదాలు కొన్ని... అక్టోబర్ 4న డోన్ మండలం కొచ్చెర్వు గ్రామ సమీపంలో లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడి డ్రైవర్ చాకలి మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు. 6న ఆలూరు అగ్నిమాపక కేంద్రం వద్ద ఆటో, స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. 22న ఆలూరు శివారులోని కోళ్లఫాం మలుపు వద్ద ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో అరికెర గ్రామానికి చెందిన చిన్న ఈరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. 29న ఎమ్మిగనూరు మండలం దేవబెట్ట గ్రామాకి చెందిన సామాజిక కార్యకర్త బాలరాజు ఆదోని నుంచి మోటర్ సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఆరేకల్లు సమీపంలో ఆటో ఢీకొని గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 30న నందవరం మండలం ధర్మపురం వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
వ్యాన్ బోల్తా
20 మందికి గాయాలు - ఆసిఫాబాద్‌లో ప్రమాదం - బారసాలకు వస్తుండగా ఘటన - బాధితుల్లో మహిళలే అధికం - క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులు ఆసిఫాబాద్/మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా భారీ గ్రామానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. భారీ గ్రామానికి చెందిన 40 మంది బంధువులు ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామానికి చెందిన నాగోశ గణపతి ఇంట్లో నిర్వహించనున్న బారసాల శుభకార్యానికి ఉదయం వ్యాన్‌లో బయలు దేరారు. అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన వారు బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న శెండె తారాబాయి, ఊశన్కర్ తిరుపతి, శెండె గంగుబాయి, శెండె సుమిత్ర బాయి, పూర్ణె లక్ష్మి, శెండె అమ్మబాయి, శెండె రమలాబాయిలకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా, మొహర్లె పోతాబాయి, చోటాబాయి, విమలాబాయి, కమలాబాయి, తారాబాయి, సుకాజి, సోంబాయి, గౌరుబాయి, నాలుగేళ్ల చిన్నారి శ్వేతతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. వైద్యులు సత్యనారాయణ, తిరుపతి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శాంతాబాయి, తిరుపతి, గంగుబాయి, సుమిత్ర బాయి, లక్ష్మిలను మంచిర్యాలకు తరలించారు. ఎస్సై రాంబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, వాంకిడి జెడ్పీటీసీలు కొయ్యల హేమాజి, అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ తారాబాయి, టీఆర్ఎస్ నాయకులు గంధం శ్రీనివాస్, గాదెవేని మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్ల నారాయణ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. డ్రైవర్ సుభాష్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిన్నంటిన రోదనలు ఆసిఫాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వీరికి వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు అందజేశారు. ఇందులో గంగుబాయి, శాంతాబాయి, కమలాబాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా 13 మంది క్షతగాత్రుల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో దద్దరిల్లింది. -
అధైర్యపడకండి.. అండగా ఉంటాం
- గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులకు జగన్ భరోసా - నగరంలో మృతుల కుటుంబాలను ఊరడించిన వైఎస్సార్ సీపీ అధినేత - ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ - బాధలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన బాధితులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నిన్నటి దుర్ఘటనలో సర్వస్వం బుగ్గిపాలైంది. కళ్లెదుటే కుటుంబ సభ్యులు సజీవ దహనమైపోతుంటే..ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగెత్తడం తప్ప ఏమీ చేయలేకపోయాం. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా’ అంటూ గ్యాస్ పైపులైన్ విస్ఫోటం బాధితులు, మరొక పక్క ‘ఈ బాధ భరించలేకపోతున్నా.. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. నిజంగా ప్రత్యక్షనరకంలా ఉందన్నా’ అంటూ ఆస్పత్రుల్లో క్షతగాత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతుల కుటుంబాలను ఓదారుస్తూ..తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తూ శనివారం జిల్లాలో జగన్మోహన్రెడ్డి పర్యటనసాగింది. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పరిశీలించారు. కాలిబూడిదైన పంటపొలాలు, కొబ్బరి చెట్లను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు రాయుడు జనార్దనరావు, బొలిశెట్టి భగవాన్, బండారు కాశి, రొక్కం రత్నాకర్ జగన్‌తో మాట్లాడారు. తెల్లవారుజామున పైపులైన్ జాయింట్ నుంచి గ్యాస్ లీకై దట్టమైన పొగమంచు మాదిరిగా కమ్ముకుందని, అదే సమయంలో సమీపంలోని హోటల్లోపొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు క్షణాల్లో వ్యాపించాయని, తేరుకునే లోగానే అంతా అయిపోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేకపోయామని, తప్పించుకోలేని వారు సజీవదహనమైపోయారని, మరికొందరు కాలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస రక్షణా చర్యలు పాటించకుండా తమ ప్రాణాలతో గెయిల్, ఓఎన్జీసీలు చెలగాటమాడుతున్నాయంటూ వారు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో లభ్యమవుతున్న గ్యాస్‌లో మాకు వాటా లేదు కానీ...ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి మాత్రం మేము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’ అని వాపోయారు. ఆయిల్ కంపెనీలను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం జగన్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. మొండిగోడల మధ్యకు వెళ్లి వారిని ఓదార్చారు. ‘అసలేం జరిగింది? ఎంతమంది మృత్యువాతపడ్డారు? ఎంతమంది గాయపడ్డారు?’ అని అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి, ఏ పనిచేస్తుంటారు వంటి విషయాలను కూడా ఆరా తీశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నప్పుడు జగన్ చలించిపోయారు. కొండంత ధైర్యం వచ్చింది.. గటిగంటి శ్రీనివాసరావుతో పాటు అతడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మృత్యువాత పడగా ఒంటరిగా మిగిలిన అతడి మామ చిలువూరి వెంకట్రావును జగన్ తొలుత పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడు గటిగంటి మధుకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజయవాడ దగ్గర పెనుమలూరులో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం పొందుతున్నామని, బంధువుల ఇంటికి వచ్చి తన భర్త మృత్యువాత పడ్డాడని మధు భార్య ధనలక్ష్మి విలపించింది. ఐదేళ్ల కుమార్తె రూపిత, అత్త సత్యవతి, మామ సాంబమూర్తిలను చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని, ఆదుకోవాలని మొరపెట్టుకుంది.. తనకు కనీసం ప్రభుత్వ ఉద్యోగమైనా ఇప్పించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. మరో కుటుంబానికి చెందిన వానరాసి శ్రీరామలక్ష్మి, వానరాసి ఆదినారాయణ, నరసింహమూర్తి మృతి చెందగావారి బంధువులైన త్రిమూర్తులు, అమ్మాజీ, సుబ్బారావు, భగవాన్‌లను జగన్ పరామర్శించారు. ‘ఇళ్లన్నీ కాలిబూడిదైపోయాయి. ఇంట్లోనే కుప్పకూలి మా వారు సజీవ దహనమయ్యారు. వచ్చి చూడమని ఎంత బ్రతిమలాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు ఏకంగా మా మొండి గోడల మధ్యకు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తుంటే కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది’ అని అమ్మాజీ జగన్ చేతులు పట్టుకొని కన్నీరుమున్నీరైంది. మా తరఫున అసెంబ్లీలో పోరాటం చేయాలని త్రిమూర్తులు జగన్‌ను కోరాడు. కాలగా మిగిలిన శిథిలాలతో, మంటలను ఆర్పిన అనంతరం బురదబురదగా మారిన ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లారు. ఆ గ్రామంలో దాదాపు రెండుగంటలు ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి, చలించిపోయారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ జగన్‌ను కలిసి దుర్ఘటనకు కారకులైన గెయిల్ అధికారులపై హత్య కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని కోరారు. ఆదుకునేలా చూస్తాం అనంతరం జగన్ అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోగులను పలకరించి ‘ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటా’నంటూ వారి నుదుటిపై చేయి వేస్తూ ధైర్యం చెప్పారు. కొంతమంది క్షతగాత్రులు జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యారు. అమలాపురం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వానరాసి దుర్గ జగన్‌ను చూడగానే ‘కాలిన గాయాల బాధలు భరించలేకపోతున్నా. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నుదుటిపై జగన్ చేయివేసి ‘ధైర్యంగా ఉండమ్మా’ అని చెప్పారు. మరో క్షతగాత్రురాలు రేకపల్లి సత్యవతి జగన్ రెండు చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ‘ఏడాది కిందట నా కొడుకు ప్రమాదంలో పోయాడు. ఇప్పుడు మా కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో కాలిపోయి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మమ్మల్ని ఆదుకోవా’లంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. ప్రభుత్వపరంగా సహాయం అందేలా పోరాటం చేస్తామని, బాధితులకు అండగా ఉంటానని జగన్ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యసేవలు అందించండి.. కాకినాడ అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. క్షతగాత్రులతో పాటు వారి కుటుంబ సభ్యుల కన్నీటితో జరిగిన దుర్ఘటన ను వివరించారు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా సహాయం అందేలా పోరాడుతూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అపోలో ఏఓ రంజిత్‌రెడ్డి, ట్రస్ట్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, సూపరింటెండెంట్ వెంకట్రావులను కోరారు. మెడికల్ రికార్డులు నమోదు చేయాలని, అంగవైకల్యం పొందితే పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమల్లో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జారీ చేయాలని జగన్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, కాకినాడ, రాజమండ్రి సిటీల అధ్యక్షులు ఆర్‌వీజేఆర్ కుమార్, బొమ్మన రాజ్‌కుమార్. కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, నలమాటి లంకరాజు. పార్టీ రాష్ర్ట యూత్, మహిళా, రైతువిభాగం కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వసుంధర, జక్కంపూడితాతాజీ, జిల్లా అధికార ప్రతినిధులు పికె రావు,కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, కొవ్వూరి త్రినాధరెడ్డి, ఆర్వి సత్యనారాయణ చౌదరి, సంగిశెట్టి అశోక్, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ సీట్ల కోత
- వైద్య వర్గాల్లో ఆందోళన - కోత విధించవద్దంటూ అధికారుల లేఖ కాకినాడ క్రైం : నిత్యం వేలాది మంది రోగులు, క్షతగాత్రులకు వైద్య సేవలందించే కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పారి శుధ్య నిర్వహణ లోపం రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)కు శాపంగా పరిణమించింది. కళాశాలలోని 50 ఎంబీబీఎస్ సీట్లు కోత విధిస్తూ ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేయడంతో వైద్యవర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై తీవ్రం గా స్పందించిన ఆర్ఎంసీ పాలనాధికారులు కోత విధిం చవద్దంటూ లేఖ రాశారు. తిరిగి 50 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయనే నమ్మకం లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని డీఎం నియోనటాలజీ కోర్సు ఆర్ఎంసీలో ఉంది. ఇద్దరు విద్యార్థులు డీఎం నియోనటాల జీ కోర్సు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న వైద్య కళాశాలలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. అన్నీ పరిష్కార సమస్యలే ఎంసీఐ బృందం నివేదికలో పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించగలిగేవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌కు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం సుమారు మూడు వేల మంది రోగులు, క్షతగాత్రులు వైద్యం కోసం వస్తుంటారు. అంతేకాకుండా జీజీహెచ్ వెయ్యి పడకలకే పరిమితమైనప్పటికీ సుమారు 1500 మంది ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతుంటారు. వారికి సేవలందించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 150 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ విధానాలు, ఇతర కారణాల రీత్యా వారికి సక్రమంగా జీతాలందకపోవడంతో పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ దీనిపై స్పందించి ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కార్మికులకు జీతాలు విడుదల చేయించారు. పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగిన సమయంలో ఎంసీఐ బృందం పర్యటించడంతో ఆస్పత్రిలో అపరిశుభ్రత చోటుచేసుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. ల్యాబ్‌లో రసాయనాలు లేకపోవడం, విద్యార్థినులకు వసతి గృహం, లెక్చర్ గ్యాలరీ నిర్మాణం పూర్తి కాకపోవడం వంటి సమస్యలను మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. ఆస్పత్రిలో విద్యార్థులకు మించి రోగులుండడం, ఆధునిక వైద్య పరికరాల కారణంగా పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు ఇక్కడికి వస్తుండడం వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పారిశుధ్యాన్ని సాకుగా చూపించి ఆర్ఎంసీలో సీట్లు కోత విధించడంపై వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 700 సీట్లు కోత విధించినట్టు నిపుణులు చెబుతున్నారు. -
ఆదుకోని ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
- సీఎస్టీలో ప్రదర్శనకు ఉంచి లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రమాదస్థలికి తరలించకపోవడంపై ఆగ్రహం - అది రైల్వేది కాదని, ఓ ఎన్జీవోదన్న సీఆర్ అధికారి సాక్షి, ముంబై: ఇటీవల ప్రమాదానికి గురైన దివా-సావంత్‌వాడీ ప్యాసింజర్ రైలులోని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ అనే లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రదర్శన కోసం సీఎస్టీలో ఉంచడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన హాస్పిటల్ ఆన్ వీల్స్ ట్రైన్‌ను ఏప్రిల్‌లో నగరానికి తీసుకువచ్చారు. ఈ రైలును సందర్శించేందుకు తొమ్మిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రదర్శకులకు అనుమతివ్వనున్నారు. హాస్పిటల్ ఆన్ వీల్స్‌లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచారు.దీనిని సీఎస్టీలోని పదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీనిని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సందర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనాస్థలికి అన్ని వైద్య వసతులు కలిగిన హాస్పిటల్ ఆన్ వీల్స్ రైలును తరలించేందుకు వీలున్నా, నిరుపయోగంగా సీఎస్టీలో ఉంచడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులకు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు ఎన్నో గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కెస్.కె.సూద్ మాట్లాడుతూ.. ఈ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఎన్జీవోదని, ఇది రైల్వే ప్రమాదాల కోసం ఏర్పాటు చేసింది కాదని తెలిపారు. గ్రామీణ పేదలకు మాత్రమే శస్త్ర చికిత్సలు, ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలను అందించేందుకు రూపొందించిందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో వైద్యులను నియమించలేదని తెలిపారు. ఈ రైలు సీఈఓ రజినీష్ గౌర్హ్ మాట్లాడుతూ.. ఈ రైలు ఒక షెడ్యూల్‌ను కలిగి ఉందని, తర్వాత జార్ఖండ్‌కు బయలుదేరుతోందన్నారు. అయితే ఏదేని భారీ ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం, రైల్వే సహాయం కోసం తమను సంప్రందించొచ్చన్నారు. అప్పుడు అత్యవసర వైద్య సేవలను పరిగణనలోకి తీసుకొని ఈ రైలులో వైద్య బృందాన్ని నియమిస్తామన్నారు. ఇదిలావుండగా అత్యవసర సమయాలలో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్, అంబులెన్సులు ఉన్నాయి. అయితే రిలీఫ్ ట్రైన్ ప్రమాదం సంభవించినప్పుడు కళ్యాణ్‌లో ఉంది. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకుంది. కాగా, నిబంధన ప్రకారం ప్రతి 250 కి.మీ. దూరంలో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ వ్యాన్‌ను అందుబాటులో ఉంచాలి. ఈ రిలీఫ్ ట్రైన్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందజేస్తుంది. తర్వాత ఆస్పత్రికి తరలిస్తుంది. 15 నిమిషాల వ్యవధిలో అన్ని ఏర్పాట్లుచేసుకొని ఈ రిలీఫ్ ట్రైన్ ఘటనాస్థలికి చేరుకోవాలని సూద్ పేర్కొన్నారు. మామూలుగా వైద్యులు ప్రమాదస్థలికి చేరుకొని వైద్యం అందించారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారన్నారు.