
కాబూల్ లో భారీ పేలుడు..
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజదాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం గేటుదగ్గర ఈ పేలుడు జరిగినట్టు కాబూల్ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విమానాశ్రయ ఆవరణలో తనిఖీలు నిర్వహించే మొదటి గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పలువురు గాయపడ్డారని, నష్టం భారీ స్తాయిలో ఉంటుదని అధికారులు భయపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మధ్యాహం భోజనం విరామ సమయంలో బాగా హడావుడిగా ఉండే సమయంలో భారీ ఎత్తున పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాణ నష్టం, ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.