Kabul
-
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..
కాబూల్: ఆగస్టు 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం బాలికలు హైస్కూళ్ళు, విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవలే అక్కడ మహిళలు బ్యూటీ పార్లర్లు నడపడంపై నిషేధాన్ని విధించింది. దీంతో బ్యూటీ పార్లర్ నడుపుకునే మహిళలు అఫ్గాన్ ప్రభుత్వంతో తమ గోడును చెప్పుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేతులు మారి తాలిబాన్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కాలేజీల్లోనూ, హై స్కూళ్లలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ విద్యార్థినులకు ప్రవేశాన్ని నిషేధించింది. పార్కులకు, ఆటవిడుపు ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జిమ్ వంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలని హుకుం జారీ చేసింది. వీటికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం. నిరవధికంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలు తమ గోడు వినకపోవడం దారుణమని.. ఇంతవరకు ఎవ్వరూ తమతో చర్చలు నిర్వహించే ప్రయత్నమైనా చేయలేదని నిరసనకారులు వాపోతున్నారు. ఉన్నట్టుండి మా పొట్ట కొట్టడం సరికాదని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ తమ జీవనభృతిని కాపాడాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా బ్యూటీ పార్లర్ల సంప్రదాయం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, చాలామంది అందాన్ని పెంచుకుని ఆకాశానికి నిచ్చెన వేసే క్రమంలో నిరుపేదలుగా మారుతున్నారని, సెలూన్ లో కొన్ని ట్రీట్మెంట్లు అయితే మన సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉందన్నది ప్రభుత్వం అభిప్రాయం. ఇది కూడా చదవండి: అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
బలపడుతున్న భారత్–నాటో బంధం?
భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, మన సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ధోరణి అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అన్యోన్యతను కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దొంగతనాల (పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం స్పష్టంగా ఉంది. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు భారత అధికారులు నాటో అధికారులతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) వార్షిక శిఖరాగ్ర సమావేశం లిథువేనియా రాజధాని విల్నియస్‌లో జరుగుతోంది (జూలై 11–12). ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల పరస్పర రక్షణ కూటమిగా 1949 నుండి ఉంటూ వస్తున్న నాటోను ఇటీవలి వరకు చాలామంది ప్రచ్ఛన్న యుద్ధ అవశేషంగానే భావించారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ అయితే 2019లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాటో బ్రెయిన్ డెత్ గురించి ప్రముఖంగా ప్రకటించారు కూడా.) కానీ ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం నాటో కూటమిలో సరికొత్త ప్రయోజనాత్మక లక్ష్యాన్ని నింపింది. గత సంవత్సరంలో ఫిన్లాండ్ను నాటోలో చేర్చుకున్నారు. సభ్యులందరి ఆమోదానికి లోబడి స్వీడన్ కూడా కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. దీంతో నాటో సభ్యత్వం 32 దేశాలకు పెరగనుంది. పైగా, మంగోలియా, పాకిస్తాన్ వంటి విభిన్న దేశాలతో సహా 39 దేశాలతో నాటో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వాటిలో మూడు (రష్యా, బెలారస్, అఫ్గానిస్తాన్) దేశాల సభ్యత్వాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. ఇవి పార్లమెంటరీ వ్యవహారాల నుండి సాంకేతిక సహకారం వరకు వివిధ స్థాయుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని నాటో భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... రష్యాకు వ్యతిరేకంగా సమన్వయం విషయంలో మరింత సన్నిహితంగా ఉన్నాయి. నాటో 2022 వ్యూహాత్మక భావన అనేది రష్యాపై దృష్టిని తిరిగి కేంద్రీకరించడం, కూటమి సభ్యత్వ విస్తరణను చేపట్టడంతో సహా చైనా ప్రజా రిపబ్లిక్కు (పీఆర్సీ) కొంత ప్రాధాన్యమిచ్చింది. బీజింగ్ ‘ప్రకటిత ఆశయాలు, దాని బలవంతపు విధానాలు, మన ఆసక్తులను, భద్రతను, విలువలను సవాలు చేస్తున్నాయి’ అని ప్రకటించింది. ‘యూరో–అట్లాంటిక్ భద్రతకు పీఆర్సీ ద్వారా ఎదురయ్యే దైహిక సవాళ్లను పరిష్కరిస్తా’మని ఈ డాక్యుమెంట్ ప్రతినబూనింది. నాటో ఆందోళన చెందుతున్న అంశాల్లో చైనాను కూడా చేర్చడం వల్ల భారత్‌తో ఈ కూటమి చర్చలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండో–పసిఫిక్ దేశాలతో నిమగ్నమవ్వడానికి జపాన్‌లో నాటో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా దాని వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఉంటున్నాయి. భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, భారతదేశ సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ మౌనం కొంతవరకు అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అధికారిక అన్యోన్యతను కలిగి ఉంది. భారత్, నాటో మధ్య ప్రారంభ వ్యవహారాలు... ఆయుధాల నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక సమస్యలతో నడిచాయి. వాటి మొదటి అధికారిక ఒడంబడిక 2005లో జరిగింది. తరువాతి రెండేళ్లలో, అంటే 2006, 2007లో ఇండియా తరఫున ప్రణబ్ ముఖర్జీ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇరు హోదాల్లో నాటో సెక్రటరీ జనరల్‌తో సమావేశమయ్యారు. నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ 2007లో భారత్‌ను సందర్శించారు. 2019లో నాటో–భారత్ మధ్య జరిగిన రాజకీయ చర్చల్లో చైనా, తీవ్రవాదం, పాకిస్తాన్ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల తరువాత, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ న్యూఢిల్లీలో యేటా జరిగే ‘రైజీనా డైలాగ్’ని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ మహాసముద్రంలో దొంగతనాల(పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం చాలా స్పష్టంగా ఉంది. 2009, 2011 మధ్య, బీజింగ్‌లో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆతిథ్య భేటీలోనూ, బ్రస్సెల్స్‌లో నాటో నిర్వహించిన సమావేశంలోనూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో పైరసీ వ్యతిరేక ప్రయత్నాలను సమన్వయం చేయడంలో భారత్, నాటో అధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళం వాలెన్సియాలోని నాటో ర్యాపిడ్ డిప్లాయబుల్ కోర్తో కూడా పరిచయాలను ఏర్పరచుకుంది. ఈ దశలు కొన్ని కచ్చితమైన ఫలితాలను అందించాయి. ఉదాహరణకు, 2011 మే నెలలో, అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడిని అడ్డుకోవడానికి భారత నౌకాదళం నాటో పెట్రోలింగ్ నౌకలతో సమన్వయం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నాటో నౌకాదళ వాహనాలు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో 14 మంది భారతీయ నావికులను రక్షించడంలో సహాయపడ్డాయి. నాటో, భారత్ మధ్య కాలానుగుణమైన అధికారిక వ్యవహారాలు అఫ్గానిస్తాన్, సైనిక విద్య, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైబర్ భద్రత వంటి ఇతర రంగాలకు విస్తరించాయి. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు, భారత అధికారులు అక్కడి అంతర్జాతీయ భద్రతా సహాయ దళం (ఐఎస్ఏఎఫ్)లో పాల్గొన్న నాటో అధికారులతోనూ, సైనిక కమాండర్లతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. తర్వాత 2008లో ఉత్తర సముద్రంలో నాటో కసరత్తులకు భారత అధికారులను పరిశీలకులుగా ఆహ్వానించారు. ఇటీవల, కమాండెంట్ నేతృత్వంలోని భారత జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం, నాటో మారిటైమ్ ఇంటర్‌డిక్షన్ ఆపరేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించింది. బ్రస్సెల్స్ సదస్సు దృక్పథం నుండి అఫ్గానిస్తాన్ ఇప్పుడు వెనక్కిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది న్యూఢిల్లీకి అధిక ప్రాధాన్యంకలిగిన అంశమే. ఏదేమైనా, అతి వ్యాప్తి చెందుతున్న వారి ఎజెండాల స్వరూపాలు నేడు మరింత సులభంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఇండో–పసిఫిక్‌లో రాజకీయ పరిణామాలు, వృత్తిపరమైన సైనిక విద్య, వాతావరణ మార్పులు, బహుశా ఆయుధాల నియంత్రణతోపాటు అణు ఎస్కలేటరీ డైనమిక్స్ ఇందులో ఉన్నాయి. సహజంగానే, వేర్వేరు ప్రయోజనాలు, ఆసక్తులు, తరచుగా భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా... భారత్, నాటోలు రష్యాతో పరస్పర చర్చలకు భిన్నమైన విధానాలను కొనసాగిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్మేనియా, కజకిస్తాన్, సెర్బియా వంటి రష్యాతో సన్నిహితంగా ఉన్న అనేక భాగస్వామ్యదేశాలతో నాటో తలపడుతోంది. అంతే కాకుండా, ఇటీవలి వరకు అది న్యూఢిల్లీతో కంటే బీజింగ్, మాస్కోలతో మరింత విస్తృతమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు నాటోతో విద్యా శిక్షణా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2021 వరకు, మాస్కోలో నాటో తన కార్యాలయం కూడా కలిగి ఉంది. వాటి మధ్య విభిన్న అనుకూలతలు ఉన్నప్పటికీ... ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని నాటో అంగీకరించడం అనేది భారతదేశంతో విస్తృతమైన, లోతైన సంభాషణకు తలుపులు తెరుస్తుంది. – ధ్రువ జైశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా; అమ్మార్ నైనార్, జూనియర్ ఫెలో, ఓఆర్ఎఫ్ అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అఫ్గనిస్తాన్: ఫారిన్ మినిస్ట్రీ వద్ద భారీ పేలుడు.. 20 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో విదేశాంగ శాఖ కార్యాలయం సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద పేలుడు. ఈ ఘటనలో 20 మందికిపైగా జనం మృతి చెందారు. అయితే, పేలుడుకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. కానీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధ సంఘమైన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రావిన్స్’ 2021 ఆగస్టులో తాలిబాన్ పాలన మొదలయ్యాక అఫ్గాన్‌లో వరుసగా దాడులకు పాల్పడుతోంది. -
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్‌కే పరిమితం చేసి, హైస్కూల్‌కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం..
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఘోర ప్రమాదం సంభించింది. ఓ టన్నెల్ నుంచి వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ నిప్పంటుకుని పేలిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంకర్‌కు నిప్పెలా అంటుకుందనే విషయం తెలియరాలేదు. కాబుల్‌కు ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఈ టన్నెల్ ఉంది. 1960 నుంచి 1964 వరకు దీన్ని నిర్మించారు. ఉత్తర, దక్షిణానికి మధ్య వారధిగా ఉంటోంది. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
Taliban: ఎట్టకేలకు ఆ సమాధి వెలుగులోకి!
ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్‌లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్‌లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో.. జబుల్ ప్రావిన్స్‌లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు. కాందహార్‌లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది. -
'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్‌రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది. కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్‌లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్‌తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్‌బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు. Kabul Suicide Attack: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc — Rashid Khan (@rashidkhan_19) September 30, 2022 💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv — Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022 -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. అఫ్గానిస్తాన్‌ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9 — BILAL SARWARY (@bsarwary) September 30, 2022 చదవండి: టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క -
అల్‌ఖైదా అగ్రనేత జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: అల్‌ఖైదా అగ్రనాయకుడు అమాన్ అల్-జవహరీ మృతిపై తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా అల్‌ఖైదా అధినేత అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అప్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్ 11న (9/11 హైజాక్) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్ల పరస్పర విభిన్న ప్రకటనలతో అల్‌ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది కూడా చదవండి: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మకాం మార్చినట్లు తెలిసి అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్‌లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అనంతరం జులై1న బైడెన్‌తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్‌కు బైడెన్‌కు వివరించారు. అల్‌ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు. ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు. క్షిపణులతో భీకర దాడి జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్‌లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్‌దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్‌లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు. చదవండి: అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా -
అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. 2001లో అమెరికా ట్విన్ టవర్లపై ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్‌తో పాటు అల్ జవహరి కూడా ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టు బెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు. చదవండి: షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్! -
అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం: ఇంకా శవాల దిబ్బలుగానే..
అఫ్గనిస్తాన్ భూకంపం.. సుమారు వెయ్యి మందికిపైనే పొట్టన పెట్టుకుంది. రాళ్లు, బురదతో కట్టుకున్న ఇళ్లు నేల మట్టం కావడంతో.. శిథిలాల కింద ఎంత మంది కూరుకుపోయారన్నది తెలియరావడం లేదు. తూర్పు ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా.. మరణాల సంఖ్య భారీగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి.. ప్రభుత్వానికి ప్రకృతి విలయం పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతింది. అలాగే పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మలా, జిరుక్, నాకా, గియాన్ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లే దెబ్బతినగా.. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం సైతం అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభించింది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో.. ఫజ్యాబాద్‌కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు అందాల్సి ఉంది. ప్లీజ్.. సాయం చేయండి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వం.. భూకంప నష్టం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. వర్షం కారణంగా శిథిలాల తొలగింపు కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తరపున షెల్టర్, ఆహార సదుపాయాలు నిరాశ్రయులకు అందడం మొదలైంది. నేపాల్లోనూ భూకంపం గురువారం ఉదయం నేపాల్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1, 4.9 తీవ్రతతో మధ్య నేపాల్ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కస్కీ జిల్లాలో ప్రజలు భయంతో రాత్రిపూట బయటకు పరుగులు తీశారు. -
అఫ్గాన్‌లో భారీ భూకంపం
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తీవ్ర భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడ్డ ఈ ఉత్పాతంలో ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు అప్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్‌కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్‌ల్లోనూ భూ ప్రకం పనలు సంభవించాయని యూరోపియన్ సిస్మలాజికల్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలాహుద్దీన్ అయూబీ చెప్పారు. మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్లి సహాయం అందించడానికి మరింత సమయం పడుతుందన్నారు. సవాలుగా సహాయ కార్యక్రమాలు అఫ్గానిస్తాన్‌లో 10 నెలల కింద ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వ పనితీరుకి ఈ భూకంపం సవాలుగా మారింది. అధికార యంత్రాంగం హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించింది. కొండ ప్రాంతాల్లో బాధితుల సహాయానికి హెలికాఫ్టర్లు పంపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. హెలికాప్టర్ల కొరత, కొండ ప్రాంతాలకు వెళ్లడం దుర్లభం కావడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. అంతర్జాతీయ సాయం కోరిన తాలిబన్లు అఫ్గాన్ ప్రజలు తీవ్రమైన విషాదంలో ఉన్నారని ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయపడాలని తాలిబన్ సుప్రీం నాయకుడు హైబతుల్లా అఖూన్‌జాదా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మహమ్మద్ హసన్ అఖుండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. 1998లో అఫ్గాన్‌ను కుదిపేసిన భారీ భూకంపంలో 4,500 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత అతి పెద్ద భూకంపం ఇదేనని భక్తర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాసిరకం నిర్మాణాలతో భారీగా ప్రాణనష్టం మారుమూల కొండల్లో ఉన్న గ్రామాల్లో నాసి రకం నిర్మాణాలు కావడం, , కొండ చరియ లు విరిగిపడే ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో భూకంప ధాటికి అపారమైన నష్టం జరిగింది. రాళ్లు, మట్టితో నిర్మిం చిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న వారి బతుకులు శిథిలాల కింద పడి తెల్లారిపోయాయి. ఫక్తూన్ క్వా ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించినట్టు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ భక్తర్ వెల్లడించింది. అక్కడ మీడియాలో వస్తున్న భూకంప విధ్వంస దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. రాళ్ల మధ్య నలిగిపోయిన మృతదేహాలు, ప్రాణాలతో ఉన్న వారు శిథిలాల నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు హృదయవిదారకంగా మారాయి. JUST IN 🚨 Afghanistan state-run news agency reports more than 150 people killed in #earthquake in country's eastern province. pic.twitter.com/QIQFGtQanf — Insider Paper (@TheInsiderPaper) June 22, 2022 -
అఫ్గాన్ గురుద్వారాలో పేలుళ్లు
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని కర్తే పర్వాన్ గురుద్వారా వద్ద శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, మరొకరు భద్రతా సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో గురుద్వారా గేటుపైకి దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక అఫ్గాన్ సిక్కుతోపాటు భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారు. అనంతరం దుండుగులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గురుద్వారా వైపు వస్తుండగా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దాడి ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, అఫ్గాన్‌లోని మైనారిటీలపై తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. అఫ్గాన్‌లోని గురుద్వారాపై దాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. Kabul Update: Sikh Sangat (approx 10-15 in number) stuck in Gurdwara Karte Parwan in Kabul which was attacked by terrorists today morning. One person has been reported dead in this attack.#GurdwaraKarteParwan #Kabul @ANI @PTI_News @TimesNow @punjabkesari @republic pic.twitter.com/XLjSikVPYs — Manjinder Singh Sirsa (@mssirsa) June 18, 2022 ఇది కూడా చదవండి: రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్! -
కాబుల్‌లో బాంబు పేలుడు.. ఆరుగురి మృతి
కాబుల్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. పశ్చిమ కాబూల్‌లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు వెల్లడించారు. మరణించిన, గాయపడినవారు షియా హజారా కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరు తరచు ఇస్లామిక్ స్టేట్, సున్నీ తీవ్రవాద గ్రూపులచే టార్గెట్ అవుతున్నారు. పేలుడు మూడు చోట్ల జరిగిందని, షియా ప్రజలు కొంత మంది ప్రాణాలు కోల్పోయారని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
హిజాబ్ కాకున్నా చద్దర్‌తో అయినా కప్పుకోండి!
భారత్‌లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
ఐరాస సిబ్బందిని నిర్బంధించి వదిలేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులతో పాటు పలువురు ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) సిబ్బందిని రాజధాని కాబూల్‌లో తాలిబన్లు కొద్ది గంటల పాటు నిర్బంధించారు. తర్వాత వారిని సురక్షితంగా వదిలేశారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సాంస్కృతిక, సమాచార శాఖ ఉప మంత్రి జబియుల్లా ముజాహిద్ చెప్పారు. నిర్బంధించిన వారిలో అఫ్గాన్‌లో చిరకాలంగా పని చేస్తున్న బీబీసీ మాజీ జర్నలిస్టు ఆండ్రూ నార్త్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూఎన్‌హెచ్‌సీఆర్ కోసం పని చేస్తున్నారు. -
నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో.. పలు హృదయవిదారక దృశ్యాల్ని ప్రపంచం వీక్షించింది. అఫ్ఘన్ నుంచి పారిపోవడానికి విమానాల రెక్కలు, టైర్ల మధ్య కూర్చోవటం.. గగనతలం నుంచి కిందపడి పౌరులు ప్రాణాలు పోగొట్టుకోవడం, తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల వంటి ఘటనలు కలిచివేశాయి. ఈ పరిస్థితుల్లో కాబుల్‌లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో.. ఓ పసికందును ఫెన్సింగ్ దాటించిన ఫొటో గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సైనికుడు బాబును తిరిగి తమవద్దకు చేరుస్తారని భావించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలు అయ్యాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు నెలలో జరగగా.. నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఆ బాబు మళ్లీ తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. కానీ, పెంచిన తండ్రి కన్నీళ్ల నడుమ.. ఆ చేరిక భావోద్వేగానికి పంచుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. అతని తండ్రి మీర్జా అలీ అహ్మదీ. అతను యూఎస్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు(మాజీ). తన భార్య సురయా నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా తరలిపోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ముందుగా బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోకి చేరవేయాలని.. ఫెన్సింగ్ దాటించాడు. ఆపై ఆ తర్వాత బాబు కనిపించకుండా పోయాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. ట్యాక్సీ డ్రైవర్ హమీద్ సఫీ గుర్తించాడు. గందరగోళ పరిస్థితుల్లో బాబును ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. పైగా పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు సఫీ. చిన్నారి సోహైల్‌ను తాతకు కన్నీళ్లతో అప్పగిస్తున్న సఫీ ఈ ఘటన తర్వాత మూడు నెలలపాటు మీర్జా అలీ అహ్మదీ.. కాబూల్‌లోనే ఉండిపోయి కొడుకు కోసం వెతుకుతూనే ఉంది. బిడ్డపై ఆశలు పోతున్న క్రమంలో చివరికి పునరావాసం కింద అమెరికాకు వెళ్లింది ఆ కుటుంబం. అయితే బిడ్డను వెతికే పని ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావి(మీర్జా అలీ మామ)కి అప్పగించాడు. చివరికి రెడ్‌క్రాస్ సాయంతో ఆ చిన్నారి టాక్సీ డ్రైవర్ సఫీ వద్ద బాబు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాసేమ్ రజావి.. సఫీ వద్దకు పంపి బాబును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సఫీ ముందు ససేమీరా అన్నాడు. పోలీసులు కిడ్నాప్ కేసు పెడతామని హెచ్చరించారు. అయినా సఫీ బెదరలేదు. చివరికి కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్‌ను తాత రజావి చేతికి అందించాడు. ‘సోహైల్‌ను తల్లిదండ్రుల చెంతకు చేర్చటం తన బాధ్యత’ అని తాత ఖాసేమ్ రజావి మీడియాకు తెలిపాడు. -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Afghanistan: ఇంకా లభించని అమెరికా సైన్యానికి అప్పగించిన చిన్నారి ఆచూకీ
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో భయాందోళను గురైన అక్కడి ప్రజలు తాలిబన్ల పాలనలో జీవించలేమని ఇతర దేశాలకు పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విమానం రెక్కలపై కూడా ఎక్కి ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఘటనలన్నీ ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. శరణార్ధుల తరలింపు సందర్భంగా అమెరికా సైనికులకు అప్పగించిన ఓ రెండు నెలల వయసున్న చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇప్పటికీ ఆ పాప తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చదవండి: Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..! కాగా అప్ఘనిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పదేళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మిర్జా అలీ (35), తన భార్య సూరయా (32), అతడి ఐదుగురు పిల్లలతో దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతూ తమ పరిస్థితి ఎలా ఉన్నా.. తమ రెండు నెలల కొడుకు బాగుండాలని చిన్నారి(సోహెల్)ని ఆ సైనికుడి చేతికి అందించాడు. ఆ తర్వాత అరగంటకు మీర్జా అలీ తన కుటుంబంతో సహా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. అనంతరం తన కొడుకు కోసం వెతుకులాట ప్రారంభించారు. చదవండి: నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. అక్కడే ఉన్న సైనికులను అడిగి చూశాడు. ఎయిర్‌ర్టులో చిన్న పిల్లలకు ప్రమాదమని, వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఉంటారని వాళ్లు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అయితే సైనికులు చెప్పిన ప్రదేశంలో పిల్లలెవరూ లేరు . గంటల తరబడి వెతికినా ఫలితం లేకపోవడంతో బరువెక్కిన హృదయంతోనే.. కుటుంబ సభ్యులతో కలిసి రెస్క్యూ విమానంలో ఖతర్ అక్కడి నుంచి జర్మనీ వెళ్లి, అక్కడ నుంచి శరణార్థిగా అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం టెక్సాస్‌లోని శరణార్థుల కేంద్రంలో ఉంటున్న మీర్జా అలీ దంపతులు.. సోహెల్ జాడ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. -
కాబుల్‌లో బాంబు దాడి, 19 మంది మృతి
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతం మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదలు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. చదవండి: Guinness World Records: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం -
కాబూల్‌లో బాంబ్ పేలుడు.. 14 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్‌లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు. -
‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళలు వినూత్నంగా..
కాబుల్: పరిపాలన పేరుతో తాలిబన్లు అఫ్గన్ ప్రజలపై పాల్పడుతున్న ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బాలకల విద్య పై కఠిన ఆంక్షలు విధిస్తూ వారిని పాఠశాలలోకి అనుమతించని సంగతి తెలిసిందే. తాజాగా కాబుల్‌లో కొందరు మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేందుకు తాలిబన్లు తమదైన శైలిలో హింసాత్మక ధోరణిని ప్రదర్శించారు. స్థానికి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 6-12 తరగతుల బాలికలను తిరిగి పాఠశాలలకు అనుమతించాలని ‘స్పాంటేనియస్ మూవ్మెంట్ ఆఫ్ అఫ్గాన్ వుమెన్ యాక్టివిస్ట్స్’ బృందానికి చెందిన కొందరు మహిళలు ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. అందులో.. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దని.. రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇంతలో అక్కడికి వచ్చని తాలిబన్లు వారిని వెనక్కి నెట్టి, ఆ బ్యానర్లు లాగేసుకున్నారు. నిరసన ఆపకపోయేసరికి వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపారు. ఇదంతా రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్ట్‌ను నిలువరించడమేగాక రైఫిల్‌తో అతన్ని కొట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన బృందానికి నాయకుడైన మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వెల్లడిస్తూ, ఇతర దేశాల మాదిరిగానే తమ దేశంలో కూడా నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిని తెలియజేశారు. అఫ్గాన్‌లో 6-12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. చదవండి: Pakistan: ట్రోలింగ్: అధికారుల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే.. -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ అయిదేళ్ల క్రితం భారత్ అప్పగించినవాడేనని ఇస్లామిక్ స్టేట్‌తో లింకులున్న ఒక మ్యాగజైన్ వెల్లడించింది. ఆ ఆత్మాహుతి బాంబర్‌ని అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిగా గుర్తించింది. గత నెల 26న కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని భారత ప్రభుత్వం అయిదేళ్ల క్రితం అఫ్గానిస్తాన్‌కు అప్పగించిందని ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్–అల్–హింద్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం కశ్మీర్‌పై భారత్ వైఖరికి ప్రతీకారంగా హిందువులపై ఆత్మాహుతి దాడుల్ని జరపడానికి అయిదేళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లిన అల్–లోగ్రిని ఢిల్లీలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంప్రదింపులు జరపగా భారత ప్రభుత్వం లోగ్రిని అఫ్గాన్‌కు అప్పగించింది. ఇప్పుడు కాబూల్ ఆత్మాహుతి దాడి అతనే జరిపాడంటూ ఆ మ్యాగజైన్ అల్–లోగ్రిని కీర్తించింది. ‘‘మన సహోదరుడు భారత్ జైల్లో మగ్గిపోయాడు. ఆ తర్వాత అఫ్గాన్‌కు అప్పగించారు. అయినా అతను తన ఇంటికి వెళ్లలేదు. తన ఆపరేషన్ని కాబూల్‌లో నిర్వహించాడు. అఫ్గాన్ అధికారులు, వారి కుటుంబసభ్యులు శత్రువులతో చేతులు కలిపి దేశం విడిచి పారిపోతున్నందుకే లోగ్రి ఈ దాడి చేశాడు’’అని స్వాత్–అల్–హింద్ పేర్కొంది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్లో నివాసం ఉంటున్న ఒక అఫ్గాన్ జాతీయుడిని 2017లో నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడంతో అఫ్గాన్‌కు అప్పగించాయి. -
కాబుల్‌లో భారత సంతతి వ్యాపారి అపహరణ!
-
"ఇది మా తప్పిదమే": యూఎస్
వాషిగ్టంన్: కాబూల్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగే సమయంలో జరిపిన డ్రోన్ దాడిలో చిన్న పిల్లలతో సహా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడిని అర్థం లేని దారుణమైన చర్యగా కమాండర్ జనరల్ కెనత్ మెకెంజీ అభివర్ణించారు. ఇది ఒక విషాదకరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు యూఎస్ రకణ శాఖ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు. తెల్లని టయోట కారు... ఈ సందర్భంగా మెకెంజీ మాట్లాడుతూ..." ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆగస్టు 29న కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో ఆ ఐఎస్ఐ ఉగ్రవాద బృందం తెల్లని టయోట కారుని వాడుతున్నట్లు తెలిసి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాం. కానీ విషాదమేమిటంటే ఆ దాడిలో చనిపోయిన వాళ్లెవ్వరికీ ఐఎస్ఐఎస్తో సంబంధం లేదు" అని అన్నారు. ఆగస్టు 26న తాలిబన్లు చేసిన ఆత్మహుతి బాంబు దాడిలో యూఎస్ సర్వీస్ సభ్యులతో సహా సుమారు 13 మంది చనిపోయిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ దాడులను నిర్వహించామంటూ. .కెనెత్ మెకెంజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
కాబూల్‌లో భారతీయుని అపహరణ !
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారతీయుని అపహరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాబూల్‌లో భారతీయ పౌరుడు బాన్‌శ్రీ లాల్ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ‘కాబూల్‌లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. లాల్ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు. -
Afghan: అఫ్గన్ కేంద్రంగా దాడులు జరగనివ్వం
కాబూల్: అఫ్గాన్‌ను ఉగ్రశిబిరాలకు అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్ నేతృత్వంలోని నూతన అఫ్గాన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పష్టంచేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమిర్ ఖాన్ తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తమ తాత్కాలిక తాలిబన్ ప్రభుత్వం ఎంతకాలం మనుగడలో ఉండనుందో, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారో లేదో తదితర అంశాలపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చదవండి: క్వారంటైన్లోకి పుతిన్ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. అల్–ఖాయిదా తదితర ఉగ్రసంస్థలతో ఇకపై సంబంధాలను తెంచుకుంటా మని గత ఏడాది అమెరికాతో చర్చల సందర్భంగా తాలిబన్లు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ మేరకు, అఫ్గాన్ గడ్డపై ఉగ్రసంస్థల కార్యకలాపాలను జరగనివ్వబోమని ఆమిర్ ఖాన్ స్పష్టంచేశారు. ఉగ్రసంస్థల పట్ల నూతన ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపై ఇలా ఒక కేబినెట్ మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి. -
Afghanistan: తాలిబన్ల పంట పండింది
ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్‌కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అమ్రుల్లా సలేహ్.. అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. د امر الله صالې په کور کې شپږنیم میلیونه ډالر د سرو زرو له اتلس خښتو سره يوځای د اسلامي امارت د ځواکونو لاسته ولوېدل. pic.twitter.com/E5YinxvTe0 — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 13, 2021 ఇక సలేహ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌ను తాలిబనిస్తాన్‌గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్‌షీర్‌కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్‌తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్ సోదరుడు రుల్లాహ్‌ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు. చదవండి: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు ఇక సెప్టెంబర్ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్.. సెప్టెంబర్ 6న పంజ్‌షీర్ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. చదవండి: తాలిబన్ ఎఫెక్ట్.. భారత్‌లో అలర్ట్ -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్‌కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్‌లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్‌వర్క్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్‌కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్‌గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్‌తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్‌లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్‌లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్‌వర్క్‌కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
పాక్ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్ వాసులు పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు) కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి! Kabul Protest started from Pakistani embassy and continued till the presidential palace. The Taliban was seen shooting after that to disperse the crowd. pic.twitter.com/yJuwYWT9vl — Sidhant Sibal (@sidhant) September 7, 2021 -
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్‌షీర్ కైవసం
అఫ్గనిస్తాన్‌లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్‌షీర్ మరోవైపు పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్‌షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
Afghanistan: తాలిబన్లకు పెరుగుతున్న మద్దతు!
అఫ్గానిస్తాన్‌లోని నాయకులు బతుకు జీవుడా అంటూ విదేశాలకు పారిపోతున్నారు. అక్కడి సామాన్య ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటుతున్నారు. ఎక్కడ చూసినా కల్లోలమే.. ఏ దేవుడైనా కాపాడకపోతాడా అని ఎదురు చూపులే. ఇది తాలిబన్ల రాకతో అఫ్గాన్‌లోని పరిస్థితులు. ఈ క్రమంలో తాలిబన్లకు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ కాబుల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లకు తొలిసారిగా చైనా మద్దతు ప్రకటించింది. ‘‘తాలిబన్ల పాలనను స్వాగతిస్తున్నాం. అఫ్గాన్ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించునే హక్కును చైనా గౌరవిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో స్నేహపూర్వక, సహకారం సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. తాలిబన్లు కూడా చైనాతో సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నారు. అఫ్గాన్ పునర్నిర్మాణం, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం కోసం తాలిబన్లు ఎదురు చూస్తున్నారు’’ అని ఇటీవల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నాగరికతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రపంచ సమాజం కాబుల్‌తో మంచి దౌత్య సంబంధాలను కొనసాగించే విధంగా తాలిబన్లు ప్రవర్తించడాన్ని చూడాలనుకుంటున్నానని పుతిన్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ విచ్ఛిన్నంపై రష్యాకు ఆసక్తి లేదని, ఒకవేళ అదే జరిగితే.. మాట్లాడటానికి ఎవరూ ఉండరని పుతిన్ అన్నారు. అంతే కాకుండా అమెరికన్లు చాలా ఆచరణాత్మక వ్యక్తులు అనే ప్రచారానికి కొన్ని సంవత్సరాలుగా 1.5 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేశారని, కానీ ఫలితం ఏంటి? సున్నా అని తెలిపారు. ఇక 1989 సోవియట్ దళాల ఉపసంహరణతో అఫ్గాన్‌లో 10 సంవత్సరాల సుదీర్ఘ యుఎస్ఎస్ఆర్ యుద్ధం నుంచి పుతిన్ ఓ పాఠాన్ని నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్‌కు సంబంధించి రష్యా తన దౌత్య ప్రయత్నాలన్నింటినీ చేసింది. ఇప్పటికీ తాలిబన్ గ్రూప్‌ను మాస్కోలో 'తీవ్రవాద సంస్థ'గా ముద్ర ఉంది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ పతనం తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్‌ను సందర్శించారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్‌ను ఆహ్వానించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనార్టీల హక్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. ముఖ్యమైన విషయాలు, సమస్యలపై తాలిబన్ల సారథ్యంలోని కొత్త అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చిస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. 'మానవతా సంక్షోభం' అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తాలిబన్ల పట్ల తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులచే హింసకు గురవుతోన్న స్థానికులను కాపాడటం గురించి ఆందోళన చెందుతోంది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలు తాలిబన్లతో సంబంధాలకు తెల్ల జెండాలను రెపరెపలాడిస్తున్నాయి. కానీ అఫ్గాన్‌లో జరిగే సంఘటనల గురించి ప్రపంచం బాధాతప్త హృదయంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ‘‘ఒక్కటిగా’’ నిలువాలి" అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ అన్నారు. చదవండి: పోలీస్ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా -
తాలిబన్లకు ఊహించని ఝలక్
ఇరవై ఏళ్ల స్వేచ్ఛకు కళ్లెం వేయాలనే ప్రయత్నానికి అఫ్గన్ మహిళ ఎదురు తిరిగింది. తాలిబన్ల దురాక్రమణ జరిగిన మరుక్షణం నుంచి అఫ్గన్ నేలపై మహిళా భద్రత గురించి ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అణచివేత పరిణామాలు ఉండబోవని ఓవైపు చెబుతూనే.. మరోవైపు కట్టడికి తాలిబన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ తరుణంలో హక్కుల కోసం అఫ్గన్ మహిళలు గళం లేవనెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వేల మంది అఫ్గన్ మహిళలు ర్యాలీలు చేపడుతున్నారు. ‘‘మేం అసహనంలో ఉన్నాం’’.. ఈ ఫ్లకార్డులతో ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘తాలిబన్ల ఆక్రమణ పరిణామాల తర్వాత యావత్ అఫ్గన్ మహిళా లోకం నాలుగు గోడల నడుమే బంధి అయిపోయింది. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు పని చేస్తేనే గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు దిగజారకముందే తమను పనులకు అనుమతించాల’’ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ప్రభుత్వమేదైనా.. ప్రజాస్వామ్యయుతంగా అఫ్గన్‌ను చూడాలనుకుంటన్నట్లు వాళ్లు కోరుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరోపక్క ఆడవాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాబోవని, వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉందని తాలిబన్లు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మహిళా నిరసనకారులు. ‘‘తాలిబన్లవి అబద్దపు ప్రచారాలు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదు. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఆడ పిల్లలను స్కూల్స్, కాలేజీల్లోకి అనుమతించలేదు. ఇదేనా వాళ్లిచ్చే స్వేచ్ఛ’’ అంటూ తాలిబన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ! విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే తాలిబన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. క్యాబినెట్లోనూ మహిళలకు చోటు దక్కకపోవచ్చనే సంకేతాలిస్తుండడంపై అఫ్గన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల్ని రక్షించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం అని ప్రకటించుకుంటున్నారు వాళ్లు. మరోవైపు కుటుంబాలతో సహా ఆడవాళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘‘బుర్ఖాలకు మేం సిద్ధం. ప్రతిగా తమ ఆడబిడ్డలను చదువు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కొందరు తల్లులు, తాలిబన్లను డిమాండ్ చేస్తున్నారు. కాబూల్‌లో కిందటి నెలలో ఇలాంటి ర్యాలీ ఒకటి జరిగింది. అయితే తాలిబన్లు సమర్థవంతంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలైన క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం తాలిబన్లకు మింగుడు పడడం లేదు. చదవండి: తాలిబన్ చీఫ్ అఖుంద్జాదా గురించి ఆసక్తికర విషయాలు -
రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్ డాలర్ల పరికరాలు
కాబూల్: అమెరికా భద్రతా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి అడుగు బయట పెట్టగానే.. తాలిబన్లు రెచ్చిపోయారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ మీదుగా వెళ్తున్న యూఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌కు ఓ మృతదేహాన్ని తాడుతో వేలాదీసి కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరవై ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31 తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం అఫ్గాన్ నుంచి బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Afghanistan Crisis: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే! అయితే తాజాగా ‘‘కాందహార్ ప్రావిన్స్‌లో పెట్రోలింగ్ చేయడానికి తాలిబన్లు తీసుకున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్‌కు తాలిబన్లు ఓ వ్యక్తిని చంపి అతడిని వేలాడతీశారు’’ అంటూ పలువురు జర్నలిస్టులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై సెనేటర్ టెడ్ క్రజ్ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండి పడ్డారు. ఈ విపత్తును తీవ్రమైన విషాదంగా.. ఊహించలేనిదిగా వర్ణించారు. అయితే ఆ మృతదేహం అమెరికాకు చెందిన ఓ వ్యాఖ్యాతది అంటూ ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గానిస్తాన్‌లో బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను యూఎస్ దళాలు అక్కడే వదిలేశాయి. ఇప్పుడు వాటిని తాలిబన్లు ఉపయోగించనున్నారు. కాబూల్ విమానాశ్రయంలో 73 విమానాలు, 27 హై-మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్ (హమ్వీ) కూడా అక్కడే వదిలేశారు. వాటితో పాటు కౌంటర్ రాకెట్, ఆర్టీలరీ, మోర్టార్ (సి-ర్యామ్) క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ గాగుల్స్ కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు Another landmark picture taking the world in a new era of terror. Taliban hang a person, presumed to be an American interpreter, from a U.S. Blackhawk helicopter. The left over US helicopters will now be used in #Afganistan like this. pic.twitter.com/8q6C5bo4IB — Sudhir Chaudhary (@sudhirchaudhary) August 31, 2021 #UPDATES The Taliban joyously fire guns into the air and offer words of reconciliation, as they celebrate defeating the US and returning to power in a victory that is a "lesson for other invaders" https://t.co/zenNKV5CFK pic.twitter.com/IHU2rFkFfg — AFP News Agency (@AFP) August 31, 2021 -
కాబూల్ మిషన్: చిట్టచివరి సైనికుడు ఈయనే.. ఫొటో వైరల్!
The last American soldier to leave Afghanistan: దాదాపు ఇరవై ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా బలగాలు మంగళవారంతో పూర్తిగా వెనక్కి మళ్లాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం బయల్దేరడంతో సేనల ఉపసంహరణ పూర్తైంది. కాగా న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించిన సెప్టెంబరు 11, 2001 నాటి ఉగ్రదాడి(ఆల్‌ఖైదా) తర్వాత అమెరికా సేనలు.. అఫ్గనిస్తాన్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అగ్రరాజ్యం పూర్తి ఆధిపత్యం సాధించింది. అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తాలిబన్ల అరాచకాలకు చెక్ పెట్టే విధంగా ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఖర్చు పెట్టింది. అయితే, 2020లో తాలిబన్లతో కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం నేపథ్యంలో తమ సేనలను ఉపసంహరించుకునేందుకు నాటి ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో వేగంగా పుంజుకున్న తాలిబన్లు.. అఫ్గన్ సైన్యాన్ని ఓడించి ప్రధాన పట్టణాలు సహా రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుని అఫ్గన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న అశ్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయి తలదాచుకుంటున్నారు. మరోవైపు తాలిబన్ల గత పాలనలోని అరాచకాలు తెలిసిన అఫ్గన్ ప్రజలు, విదేశీయులు సైతం దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపు ప్రక్రియ ద్వారా ఇప్పటికే వేలాది మంది అఫ్గన్‌ను వీడారు. ఈ క్రమంలో అమెరికా అమెరికా సేనలు ఆగష్టు 31 నాటికి ఖాళీ చేయాలని తాలిబన్లు బైడెన్ సర్కారుకు డెడ్‌లైన్ విధించగా నేటితో అది పూర్తైంది. ఈ నేపథ్యంలో.. 20 ఏళ్ల యుద్ధంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకొట్టున్న అమెరికా ఎట్టకేలకు నేటితో అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకుంది. చదవండి: అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు చిట్ట చివరి సైనికుడు ఈయనే! ఈ విషయాన్ని ధ్రువీకరించిన అమెరికా రక్షణ శాఖ అఫ్గన్‌ను వీడిన చివరి సైనికుడి పేరిట ఓ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘82వ ఎయిర్‌బోర్న్ డివిజన్, 18 ఎయిర్‌బోర్న్ కార్‌్ప్స కమాండర్, మేజర్ జనరల్ క్రిస్ డోనా.. ఆగష్టు 30, 2021న అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్‌లో యూఎస్ మిషన్ ముగిసింది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అమెరికా పెత్తనం ఇక ముగిసిందని పేర్కొంటుండగా.. మరికొందరు.. తాలిబన్ల అరాచకాలు మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌లో మిగిలిపోయిన యుద్ధ విమానాలను అమెరికా సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇకపై అవి ఎగురలేవని, వాటిని ఎవరూ ఆపరేట్ చేయలేరని యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ పేర్కొన్నారు. -వెబ్‌డెస్క్ చదవండి: ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు -
అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ(ఎయిర్‌లిఫ్టు) అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా- అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు... ‘‘20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటితో తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్ తెలిపారు. తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలి ‘‘అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అఫ్గన్, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు తీర్మానం జరుగనుంది’’ అని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బైడెన్ గుర్తుచేశారు. అంతర్జాతీయ పౌరుల ప్రయాణాలపై తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరని అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నారు. ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్ పేర్కొన్నారు. కాగా ఆగష్టు 15న తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి(ఆగష్టు 31)తో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు డెడ్‌లైన్ విధించారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
అఫ్గన్‌కు సెలవు; గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్ల సంబరాలు
-
అఫ్గన్‌కు సెలవు; గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్ల సంబరాలు
Last US Troops Leave Afghanistan: సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ వాషింగ్టన్ టైమ్‌తో మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది’’ అని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చింది: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆగష్టు 31లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిందన్నారు. ఇక తాలిబన్ అధికారి అనాస్ హక్కాని.. ‘‘చారిత్రాత్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా చేసిన 20 ఏళ్ల యుద్ధం ముగిసింది. 73 విమానాలు ధ్వంసం అమెరికా బలగాలు కాబూల్ నుంచి స్వదేశానికి వెళుతూ వెళుతూ విమానాశ్రయంలోని హ్యాంగర్‌లో ఉన్న 73 యుద్ధ విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ డిఫెన్స్ సిస్టమ్‌ని ధ్వంసం చేశాయి. అక్కడి 73 విమానాలను ముందు జాగ్రత్త పడుతూ ఎందుకూ పనికి రాకుండా చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెడ్ మెక్కెంజీ చెప్పారు. 70 ఎంఆర్ఏపీ ఆయుధాలు కలిగిన వాహనాలు వదిలి వెళ్లారు. ఆ ఒక్కొక్క వాహనం ఖరీదు 10 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. చివరి విమానం బయల్దేరగానే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకువచ్చారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తొలిసారిగా తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు బెహెస్తా అర్ఘాండ్ దేశం విడిచి పారిపోయారు. జర్నలిస్టులు, సాధారణ పౌరుల పట్ల తాలిబన్ల అరాచకాలకు భయపడి అఫ్గన్‌ను వీడారు. తాను కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉంటానని, దేశంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని పేర్కొన్నారు. కాగా స్థానిక వార్తా చానెల్ టోలో న్యూస్ తరఫున తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్‌ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బెహెస్తా వార్తల్లో నిలిచారు. మహిళల పట్ల వివక్ష చూపమంటూ తాలిబన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ మేరకు వీడియోలు ప్రసారమయ్యాయి. కాగా స్త్రీల హక్కులను కాలరాసే విధంగా.. మహిళా గవర్నర్ బంధించడం, కో- ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై కాందహార్‌లో నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ చేయడం వంటి చర్యలతో ఇప్పటికే తాలిబన్లు తమ వైఖరిని స్పష్టం చేశారు. అంతేకాక తమకు వ్యతిరేకంగా పనిచేసిన జర్నలిస్టుల పట్ల కూడా ఉక్కుపాదం మోపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బెహెస్తా అఫ్గనిస్తాన్‌ను వీడటం గమనార్హం. నాకూ భయాలు ఉన్నాయి.. ఈ విషయం గురించి ఆమె సీఎన్ఎన్తో మాట్లాడుతూ...‘‘తాలిబన్ల పాలన గురించి లక్షలాది మంది ప్రజలు భయపడుతున్నట్లుగానే నాక్కూడా భయాలు ఉన్నాయి. అందుకే దేశం వీడాను. ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. ఒకవేళ తాలిబన్లు తాము ప్రకటించిన విధంగా మహిళ పట్ల వివక్ష చూపకుండా ఉంటే, అక్కడి పరిస్థితులు మెరుగపడితే కచ్చితంగా అఫ్గనిస్తాన్‌కు తిరిగి వెళ్తాను. నా దేశానికి, నా ప్రజలకు సేవ చేస్తాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేయడం గురించి చెబుతూ.. ‘‘ఆరోజు చాలా కఠినమైనది. అఫ్గన్ మహిళల కోసమే నేను ఆ సాహసం చేశాను’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఒకవేళ ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే.. మహిళలకు ఏమీ చేతకాదని అంటారు. కాబట్టి... మేం ఆఫీసులకు వెళ్తాం. పని చేస్తాం. అది మా హక్కు. సమాజ నిర్మాణంలో మాకూ భాగం కావాలి’’ అని 24 ఏళ్ల ఈ యువ జర్నలిస్టు పేర్కొన్నారు. అఫ్గన్ పరిస్థితులకు అద్దం పడుతోంది బెహెస్తా పనిచేసిన టోలో న్యూస్ యజమాని సాద్ మొహెసెనీ స్పందిస్తూ.. ‘‘ప్రముఖ రిపోర్టర్లు, జర్నలిస్టులంతా ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. వాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అందరూ భయపడిపోతున్నారు. చానల్ నడపటం ఒక సవాల్‌గా మారింది’’ అని చెప్పుకొచ్చారు. బెహెస్తా దేశం వీడటం తాలిబన్ పాలనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. చదవండి: Afghanistan Crisis: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’ -
కాబుల్‌లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా హెచ్చరిక
-
ఐసిస్ కె అంటే ఏంటి..?
-
కాబూల్ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది. -
ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
-
కాబుల్ పేలుళ్లకు తామే కారణమని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
-
మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు
ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలన చేపట్టినప్పటి నుంచి కాబూల్ పౌరులు తమ బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి నిత్యావసరాల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ప్రధానమైన ఆహార గోధుమ ధరలు రెట్టింపు అయ్యాయి. తనను తాను 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుచుకునే తాలిబన్లు గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగ దేశ కేంద్ర బ్యాంకు తాత్కాలిక గవర్నర్ నియామకం కూడా ఉంది. గత అఫ్గన్ ప్రభుత్వంలో గవర్నర్ గా పనిచేసిన అజ్మల్ అహ్మదీ తిరుగుబాటు తర్వాత అకస్మాత్తుగా కాబూల్ నుంచి పారిపోయాడు. "ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రజల ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వం హాజీ మొహమ్మద్ ఇద్రీస్ డా అనే వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ గా నియమించారు" అని ఆగస్టు 23న 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. అసలు ఇద్రీస్ కు ఉన్న అర్హతల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇంతకముందు తాలిబన్ ఆర్థిక కమిషన్ అధిపతి, జావ్జ్జాన్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేశారు. ఇక గుల్ ఆఘా అనే వ్యక్తిని ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. కానీ, ఇద్రీస్ వలె ఇతని గురించి కూడా పెద్దగా వివరాలేమీ తెలియదు. మునిగిపోతున్న నావను నడుపుతున్నారు అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి ఆదాయ వనరులు దేశాన్ని నడపడానికి సరిపోవని 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ఒక వ్యాసంలో అహ్మదీ చెప్పారు. "అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి లేదా వాణిజ్య మార్గాల ద్వారా ఆదాయాలు పెద్దవిగా ఉన్నట్లు కనిపించడం వల్ల కొందరు అవి ఆర్థిక సమస్యను తగ్గిస్తాయని భావిస్తున్నారు. అలాగే, చైనా లేదా రష్యా పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నారు. కానీ, అది ఒక ఆశ మాత్రమే. నిజం చెప్పాలంటే తాలిబన్లు మునిగిపోతున్న నావను నడుపుతున్నారు. తిరుగుబాటు చేసేటప్పుడు అటువంటి తాలిబన్ ఆదాయ వనరులు సాపేక్షంగా పెద్దవిగా కనిపిస్తాయి. ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడపడానికి అవి పూర్తిగా సరిపోవు" అని అజ్మల్ అహ్మదీ అన్నారు.(చదవండి: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు) అంతర్జాతీయ ఆంక్షలు, ప్రధాన దాతల నుంచి సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "ప్రియమైన దేశవాసులారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డాలర్లు, పురాతన వస్తువులను వాయు, భూ మార్గం ద్వారా బదిలీ చేయకూడదు అని మేము మీకు తెలియజేస్తున్నాము. మేము పేర్కొన్న వాటిని మీరు బదిలీ చేసేటప్పుడు గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి, బదిలీదారులతో చట్టబద్ధంగా వ్యవహరిస్తాము" అని ముజాహిద్ ట్వీట్ చేశారు. సహాయం నిలిపివేత అమెరికా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర బ్యాంకులకు చెందిన 9.4 బిలియన్ డాలర్ల నిల్వలను ఫ్రీజ్ చేయగా, ప్రధాన దాతలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. ప్రధాన ఆదాయాలు అన్నీ తాలిబన్లు కోల్పోతున్నారని అహ్మదీ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దేశంలోని 38 మిలియన్ల ప్రజలకు మరింత బాధ కలుగుతుంది. "తాలిబన్ల రాజ్యంలో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. దాతలు ఆర్థిక సహాయం నిలిపివేయడం వల్ల ప్రభుత్వ సేవలను తగ్గించాల్సి ఉంటుంది. చాలా మ౦ది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతారు, మిగిలి వారికి జీతాలు చాలా తక్కువగా ఉ౦టాయి" అన్నారు.(చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్) పోషకాహార లోపం అనుభవలేమి గల తాలిబన్ల ఆర్థిక బృందం చేసే పొరపాట్లు, ఆంక్షలు వల్ల సాధారణ అఫ్గన్ ప్రజలు బాధలు పెరుగుతాయి. మే 2021లో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదికలో ముగ్గురు ఆఫ్ఘన్లలో ఒకరు తీవ్రంగా ఆహార కోసం అలమటిస్తున్నారని తెలిపింది. "రాబోయే అనిశ్చితికి ముందే మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి, ప్రజల ఇళ్లకు ఆహారాన్ని దగ్గర చేయాలి, తల్లులు, పిల్లల్లో కోలుకోలేని పోషకాహార లోపాన్ని తగ్గించాలి. వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి మేము వేచి చూడలేము" అని ఆఫ్ఘనిస్తాన్ లోని డబ్ల్యుఎఫ్‌పీ ప్రతినిధి మేరీ-ఎల్లెన్ మెక్ గ్రోర్టీ తిరుగుబాటుకు మూడు నెలల ముందు చెప్పారు. మరి ప్రస్తుత కఠిన పరిస్థితులను చక్కదిద్ది అఫ్గన్‌ను తాలిబన్లు ఎలా పాలిస్తారో మనం వేచి చూడాలిక!. -
Panjshir Valley: తాలిబన్లతో మాటలా? తూటాలా?
తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్‌షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. మేజర్ అమీర్ అక్మల్.. పంజ్‌షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్‌పోస్ట్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్. పటిష్టమైన పద్మవ్యూహం హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్ లోయ ఉంది. పంజ్‌షిర్(పంజ్‌షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్‌షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది. లొంగుబాటు కథనాలు పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు. నిజంగా ఆక్రమించారా? మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్‌కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్‌షిర్‌లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది. చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో? -
‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’
న్యూఢిల్లీ: తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్ మహిళ ముస్కాన్ అన్నారు. శవాలపై కూడా తాలిబన్లు అత్యాచారాలకు పాల్పడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. న్యూస్18తో ముస్కాన్ మాట్లాడుతూ.. ‘‘ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్ ఫైటర్లు కోరతారు. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారు. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారు. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదు. అక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడినట్లే. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్ కూడా ఉండదు. అంతం చేయడమే’’ అంటూ తాలిబన్ల అరాచకాల గురించి చెప్పుకొచ్చారు. కాగా తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు. చదవండి: Afghanistan Crisis: కాబూల్ ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్! -
కాబూల్ ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్!
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ వలీ మహ్మద్ అహ్మద్‌జై దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రవేశం కొరకు మిగతా ప్రయాణికులతో కలిసి ఆయన వరుసలో నిల్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు కూడా పారిపోతే ఎలా? దేశంలోనే ఉంటూ పంజ్‌షీర్ వంటి రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు అండగా నిలవవచ్చు కదా!’’ అని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి వాళ్ల అసమర్థ నాయకత్వం వల్లే తాలిబన్లు.. దేశాన్ని ఆక్రమించుకోగలిగారు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అఫ్గన్ తాలిబన్ల స్వాధీనం అయిన నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వలీ సైతం అదే బాటలో నడవడం గమనార్హం. కాగా తాలిబన్ల విజృంభణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ.. గత నెలలో వలీని సైన్యాధిపతిగా తొలగించి, ఆయన స్థానంలో హిబాతుల్లా అలీజైని నియమించారు. అయితే, క్రమేణా ఆఫ్గన్ సైన్యంపై పైచేయి సాధించిన తాలిబన్లు ఆగష్టు 15న రాజధాని కాబూల్‌లో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అశ్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయి ఆశ్రయం పొందుతుండగా.. పలువురు ఇతర నేతలు సైతం దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అఫ్గనిస్తాన్‌లో నివాసం ఉంటున్న విదేశీయులు సహా అఫ్గన్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. చదవండి: Afghanistan Crisis: పాకిస్తాన్ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్.. Former Afghan Army Chief Wali Muhammad Ahmadzai is standing in line at Airport to leave the country. pic.twitter.com/SBaQ3QYmTZ — Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2021 -
వద్దన్నా నా సోదరి వినలేదు.. అఫ్గన్‌కు వెళ్లి తాలిబన్ల చేతిలో..
కోల్‌కతా: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి అక్కడి మహిళల పరిస్థితిని తలచుకుని అంతర్జాతీయ సమాజం ఆందోళనకు గురవుతోంది. గత పాలనలో స్త్రీల హక్కులను తీవ్రంగా భంగపరిచిన తాలిబన్లు ఈసారి.. వారికి ఎలాంటి హాని తలపెడతారోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఎలాంటి వివక్షకు తావులేకుండా మహిళలకు అన్ని రంగాల్లో ప్రవేశం కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. ఆ మాటలు నీటి మీద రాతలేనని ఇప్పటికే నిరూపితమైంది. తమను ఎదిరించిన మహిళా గవర్నర్‌ను బంధించడం సహా.. కో ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఫత్వా వారు అవలంబించబోయే వైఖరికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల చేతిలో హత్యకు గురైన తన సోదరి సుస్మితను గుర్తు చేసుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపాల్ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గనిస్తాన్‌లో ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో తెలియదంటూ ఉద్వేగానికి గురయ్యారు. భర్తతో కలిసి అఫ్గనిస్తాన్‌కు.. బెంగాల్‌కు చెందిన సుస్మితకు 1986లో జాన్బాజ్ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ అఫ్గనిస్తాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్ పేరిట సుస్మిత ఓ పుస్తకాన్ని రచించారు. అఫ్గనిస్తాన్‌లో తన అనుభవాలను రంగరించిన ఆ బుక్‌ను 1997లో పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్ అనే సినిమా కూడా తీశారు. కాగా 1994లోనే భర్తతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చిన సుస్మితా.. తన రెండో పుస్తక రచన పూర్తి చేసేందుకు 2013, మేలో మళ్లీ అఫ్గనిస్తాన్‌కు వెళ్లారు. అయితే అప్పటికి అమెరికా సేనలు అఫ్గన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరించినా.. జూలైలో పుట్టింటికి వచ్చిన సుస్మిత.. తన బుక్ గురించి సోదరుడు గోపాల్ బెనర్జీకి చెప్పింది. కానీ, ఎందుకో అతడి మనసు ఈసారి కీడు శంకించింది. ఈ పుస్తకం తాలిబన్లను ఆగ్రహానికి గురిచేస్తుందని, ఎప్పటికైనా అఫ్గనిస్తాన్‌కు వెళ్లడం ప్రమాదమేనని హెచ్చరించారు. అయితే, సుస్మిత మాత్రం పట్టుదల వీడలేదు. మహిళల పట్ల తాలిబన్ల వైఖరి మారిందని, భావ ప్రకటన స్వేచ్ఛను వారు గౌరవించడం నేర్చుకున్నారని సోదరుడికి సర్దిచెప్పింది. కానీ, ఆమె అభిప్రాయం తప్పని అదే ఏడాది నిరూపితమైంది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే దారుణంగా.. సెప్టెంబరు 4న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాలిబన్లు సుస్మితను ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చారు. జుట్టుపట్టుకుని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఈ విషయాల గురించి గోపాల్ బెనర్జీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అక్కడ మహిళలు చదువుకోవడం నిషేధం. వస్త్రధారణ విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అయితే, అమెరికా సేనల మోహరింపుతో అఫ్గన్‌లో పరిస్థితులు మారిపోయానని నా సోదరి అనుకుంది. అందుకే మరో పుస్తకం రాసేందుకు 2013లో అక్కడికి వెళ్లింది. ఆరోజు జాన్‌బాజ్‌తో జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. తనతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండగానే తాలిబన్లు వచ్చి వాళ్లను బెదిరించి.. సుస్మితను లాక్కెళ్లి కాల్చి చంపారు’’ అని చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. భయంగా ఉంది.. ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ‘‘నా సోదరి చెప్పిన విషయాలను బట్టి.. ఇప్పటి కంటే గతంలో తాలిబన్లు మరింత క్రూరంగా ప్రవర్తించేవారు. అసలు వాళ్లు ఒక దేశాన్ని పాలించగలరా? ప్రపంచ దేశాలు గళం విప్పాలి. ఎంతో మంది అమాయకులు చచ్చిపోతున్నారు. కొన్ని దృశ్యాలు చూసి నేను షాకయ్యాను. అక్కడ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో వారికే తెలియని దుస్థితి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’ -
Afghanistan: తాలిబన్ల రాజ్యం.. రంగంలోకి అమెరికా, జర్మనీ దళాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్ఘాన్ భద్రతా సిబ్బందిపై తాలిబన్లు కాల్పులకు తెగపడ్డారు. కాల్పుల్లో అఫ్ఘాన్ భద్రతా అధికారి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అఫ్గాన్‌లో పరిస్థితులను అదుపులోకి తేవడానికి అమెరికా, జర్మనీ మిలటరీ దళాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. చదవండి: Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే కాగా అమెరికా దళాల ఉపసంహరణను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. తాలిబన్లు దాడులకు తెగబడకుండా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. తాలిబన్ల వ్యవహారశైలి ఆధారంగా నిధులు మంజూరు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎవరినీ నమ్మేలా లేవని జో బైడెన్ అన్నారు. చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ? -
Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!) అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్‌షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1 — Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021 -
Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే
ఇల్లు అలకగానే పండుగ కాదు అంటుంటారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లది ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితే. 20 ఏళ్ల తర్వాత దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలపై తమ పాలన రుద్దడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్నారు. తాలిబన్ కమాండర్లే ఇక గవర్నర్లు, మేయర్లుగా అవతారం ఎత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కల్లోలిత అఫ్గాన్ పాలన అనుకున్నంత సులభం కాదని, తాలిబన్ల కోసం ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం జనామోదం సాధ్యమా? అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య వంటి కనీస సదుపాయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు అంతంతే. అవినీతి పెచ్చరిల్లింది. జనం మార్పును కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం తాలిబన్లను స్వాగతిస్తున్నారని కాదు. ఘనీ అసమర్థ, అవినీతి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజల మనసులను గెలుచుకోవడం తాలిబన్లకు కత్తి మీద సామేనని చెప్పొచ్చు. షరియా చట్టం పేరిట గతంలో సాగించిన నిరంకుశ పాలనకు ఈసారి స్వస్తి చెప్పి, సంస్కరణలకు బాటలు పరిచి, జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడితే తాలిబన్లకు కొంత జనామోదం లభించే అవకాశం ఉంది. బలగాలు సరిపోతాయా? అఫ్గానిస్తాన్ ప్రస్తుత జనాభా 3.80 కోట్ల పైమాటే. తాలిబన్ల సంఖ్య కేవలం లక్ష లోపే. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా వారి నియంత్రణలోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లో వార్లార్డ్స్(స్థానిక భూస్వాములు) పెత్తనం సాగిస్తున్నారు. సొంతంగా ప్రైవేట్ సైన్యాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని అణచివేసి, దేశం మొత్తాన్ని తమ పరిధిలోకి తీసుకురావాలంటే తాలిబన్లు తమ బలం, బలగాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. పాలనపై పట్టు చిక్కేనా? తుపాకులు పట్టి శత్రువులపై పోరాడడం తప్ప ప్రజలకు సుపరిపాలన అందించడం తాలిబన్లకు పెద్దగా అలవాటు లేదు. చెప్పుకోదగ్గ ఆధునిక సదుపాయాలు లేని అఫ్గాన్‌ను పాలించడం కష్టమైన పనేనని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి తగిన యంత్రాంగం కూడా అఫ్గాన్‌లో లేదు. పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందే. 1996– 2001 వరకూ దేశాన్ని పాలించినప్పుడు తాలిబన్లు అరాచకానికి మారుపేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా తీరు మార్చుకోకపోతే జనం తిరగబడడానికి ఎక్కువ సమయం పట్టదు. సొంత బలగాలను అదుపు చేసేదెలా? విదేశీ శక్తులపై పోరాటం అనే భావన తాలిబన్లను ఇన్నాళ్లూ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని తాలూకు అవలక్షణాలన్నీ ఒంటబట్టడం ఖాయం. కొందరు అధికార భోగాలు అనుభవిస్తుండడం, మరికొందరు సాధారణ సైనికులుగా మిగిలిపోవడం వంటివి వారిలో విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేయడాన్ని కొట్టిపారేయలేం. తాలిబన్ పాలకులు తమ సొంత బలగాలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. మైనార్టీలను మచ్చిక చేసుకొనేదెలా? మహిళలు, మైనార్టీల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరిస్తారన్న చెడ్డపేరుంది. వారి నిర్వాకం వల్ల అఫ్గానిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా మారింది. దేశంలో పెద్ద సంఖ్యలో గిరిజన తెగలున్నాయి. వీటిలో చాలా తెగలకు తాలిబన్లతో శత్రుత్వం కొనసాగుతోంది. వారిని మచ్చిక చేసుకొని, మిత్రులుగా మార్చుకోవడం సులభంగా సాధ్యమయ్యే పని కాదని స్థానికులు అంటున్నారు. మానవ హక్కులను, మైనార్టీల హక్కులను కాపాడడం, పౌర చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం వంటివి తాలిబన్ల ముందున్న పెద్ద సవాళ్లు. ఆర్థిక పరిస్థితి ఆగమాగం ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అఫ్గానిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అఫ్గాన్‌కు లభించే ఆదాయంలో 20 శాతానికి పైగా విదేశాల ఆర్థిక సాయం నుంచే అందుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ఆ సాయం మొత్తం ఇక నిలిచిపోయినట్లే. మరోవైపు అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. అంతేకాదు అఫ్గాన్‌కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. అఫ్గాన్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్టులో చేర్చింది. దీంతో విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. అఫ్గాన్‌లో ఖనిజ సంపద ఉన్నప్పటికీ దాన్ని తవ్వితీయాలంటే విదేశీ పెట్టుబడులు అవసరం. తాలిబన్ పెద్దలు ఇక రష్యా, చైనా, పాకిస్తాన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి చదవండి: తాలిబన్ల దమనకాండ -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట
-
కాబూల్ నుంచి 168 మంది తో ఢిల్లీ బయల్దేరిన ప్రత్యేక విమానం
-
కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఆ వీడియో భయానకం కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 169 మంది అమెరికన్ల ఎయిర్‌లిఫ్ట్ అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బారన్ హోటల్లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్ చేసి మరీ తీసుకువెళ్లారు. విమానాశ్రయం దగ్గరకు రావొద్దు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. Now - Another morning, another gunshot with struggle for escape. Kabul international airport. pic.twitter.com/eScU7ERM5V — Muslim Shirzad (@MuslimShirzad) August 19, 2021 -
రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి గత ఆదివారం బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సీ–17 విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ, వాస్తవానికి ఆ రోజు ఆ విమానంలో 183 మంది చిన్నారులు సహా మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ–17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. గత ఆదివారం కాబూల్‌లోకి తాలిబన్లు అడుగు పెట్టడంతో భీతిల్లిన విదేశీయులు, స్థానికులు అమెరికా వైమానిక దళానికి చెందిన విమానంలో చోటు సంపాదించేందుకు ప్రాణాలకు తెగించారు. ఎలాగైనా సరే, దేశం నుంచి బయటపడాలనే ఆత్రుతలో కొందరు విమానం పైన కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!
Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్‌షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్‌షిర్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబూల్: అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్‌షిర్ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అహ్మద్ షా మసూద్ ఎవరు? హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ కూడా. 2001లో యూరప్‌ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గాన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ.. 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితం
కాబూల్: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితంగా బయట పడ్డారు. తాలిబన్లు ట్రావెల్ డాక్యుమెంట్లు తనిఖీ చేసి భారతీయులను ప్రశ్నించారు. అంతే కాకుండా వారు ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. కాగా భారతీయుల తరలింపునకు అడుగడుగునా తాలిబన్లు ఆటంకాలు సృష్టించారు. ఆటంకాల మధ్య ఉదయం 87 మందిని భారత్ అక్కడి నుంచి తరలించింది. తాలిబన్లు విడిచిపెట్టిన వారిని త్వరలోనే భారత్‌కు తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!) -
తాలిబన్ల దుశ్చర్య.. 150 మంది భారతీయుల కిడ్నాప్
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్ ఎయిర్పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: ఆరుకోట్లకు అమ్ముడుపోయిన ఆటోగ్రాఫ్, ఎవరిదంటే..) భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్ ఒకరు ట్వీట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్ చానెల్ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ-130జే విమానం కాబూల్ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?) -
తాలిబన్ల మిత్రులకు అసలు పరీక్ష?
తాలిబన్లు మళ్లీ అఫ్గాన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ దేశ భవిష్యత్తు ప్రత్యేకించి అక్కడి మైనారిటీలు, మహిళలు, బాలికల భవిష్యత్తు.. తాలిబన్లలో ఎవరు ఆధిపత్యం నిరూపించుకుంటారు అనే అంశంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాలతో కూడిన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికీ, క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకూ మధ్య బోలెడన్ని తేడాలున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి, వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. కాబూల్‌ని తాలిబన్లు కైవసం చేసుకోవడం, అఫ్గాన్ ప్రభుత్వం కుప్పగూలడం జరిగిన తర్వాత కాలం గుర్తించదగినంత ప్రశాంతంగా సాగుతోంది. దుకాణాలు, వ్యాపారాలను చాలా వరకు మూసివేశారు. సాధారణ పౌరులు తమ ఇళ్లలో దాక్కున్నారు. తాలిబన్లు పోలీసు ఫోర్స్‌గా వ్యవహరిస్తూ నగరాన్ని పరిరక్షిస్తున్నారు. కానీ, ఈ సాపేక్ష ప్రశాంతతలో అఫ్గాన్లు అసాధారణమైన వాస్తవికతను ఎదుర్కొంటున్నారు. వారు ఇప్పుడు పూర్తిగా కొత్త దేశంలో నివసిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకుంటూ, అమెరికన్ అధికారులు ఊహించిన దానికంటే వేగంగా పరిణామాలు జరిగిపోయాయని అంగీకరించారు. బైడెన్ అభిప్రాయం ప్రకారం, అఫ్గానిస్తాన్ రాజకీయ నేతలు చివరకు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతోపాటు చేతులెత్తేసి దేశం వదిలి పారిపోయినందుకే ఇలా జరిగింది. పైగా అఫ్గాన్ సైన్యం కుప్పకూలిపోయిందని, కొన్ని సందర్భాల్లో పోరాటం చేయకుండానే సైన్యం కూడా చేతులెత్తేసిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అఫ్గానిస్తాన్ క్రియాశీల రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మహమ్మది తన సైన్యం వైఖరిని సమర్థించుకుంటూ ట్వీట్ చేశారు. ‘వారు మా చేతుల్ని వెనక్కి విరిచి కట్టేసి, దేశాన్ని అమ్మేశారు. ఘనీ, అతడి ముఠానే దీనంతటికీ కారణం’ అని వ్యాఖ్యానించారు. గతవారం కాబూల్ వీధుల్లో జరిగిన పరిణామాలు ఏవైనా కానివ్వండి.. ఇప్పుడు మాత్రం తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న. తాలిబన్లు అంటే ఎవరు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం 2 లక్షల కోట్ల డాలర్లకంటే ఎక్కువగా వెచ్చించి తాలిబన్లను ఓడించటానికి ప్రయత్నించింది. కానీ ఆ తాలిబన్లే ఇప్పుడు అధికారంలోకి రావడంతో అఫ్గాన్లు, వారి ఇరుగుపొరుగు దేశాల పౌరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంది? తాలిబన్లు ఒక ఏకీకృత శక్తి కాదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాల మొరటైన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికి, క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకు మధ్య గణనీయంగా వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. ఇక్కడ మనకు ఒక శుభవార్త. అత్యంత తాజా సమాచారం ప్రకారం, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ అధినేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ అఫ్గానిస్తాన్ నూతన నాయకుడు కావచ్చని తెలుస్తోంది. తనకు తానుగా వాస్తవికవాదిగా, అనుభవశీలిగా, ఆలోచనాత్మకమైన నాయకుడిగా బరాదర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పైగా తన చుట్టూ ఉన్న తాలిబన్ గ్రూపులన్నింటిని ఐక్యంగా ఉంచే శక్తి ఈయనకుంది. పైగా అంతర్జాతీయ శక్తులతో సమర్థంగా చర్చించే సామర్థ్యమూ ఈయనకుంది. ఆగస్టు 17న బరాదర్ చాలా ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టారు. పైగా, సమీకృత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని రూపొందించాలని తాలిబన్ నేతలు ప్రతిజ్ఞ చేశారు కూడా. తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తాజా ప్రకటన ప్రకారం, అలాంటి ప్రభుత్వం తాలిబనేతర అఫ్గాన్లను కూడా తీసుకుంటుందని, వీరిలో అందరికీ సుపరిచితులు కూడా ఉండవచ్చు. అఫ్గాన్ మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఈ ప్రముఖులలో ఒకరు కావచ్చు. శాంతియుతంగా అధికార మార్పిడికి ఈయన ఒక సమన్వయ మండలిని కూడా ఏర్పర్చారు. ప్రస్తుతం దోహాలో ఉన్న ఈ కౌన్సిల్ అఫ్గానిస్తాన్ జాతీయ పునర్వ్యవస్థీకరణపై అత్యున్నత మండలి చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్మత్యార్తోపాటు తాలిబన్ నాయకత్వంతో భేటీ కానుంది.అయితే వాస్తవానికి తాలిబనేతర ప్రముఖులు కూడా భాగమై ఉండే ఈ తరహా ప్రభుత్వంలో చాలామంది తాలిబన్ రాడికల్ శక్తులకు తావు ఉండకపోవచ్చు. అంటే ఇలా అధికారంలో భాగం కాని ఈ తీవ్రవాద శక్తులు అల్ ఖయిదా లేదా ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ జతకట్టే ప్రమాదం కూడా ఉంది. అంతకుమించిన ప్రమాదం ఏమిటంటే, అఫ్గానిస్తాన్ ఏకజాతి (పస్తూన్) ప్రాబల్య దేశంగా మారిపోవచ్చు కూడా. ఇది మళ్లీ దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి తీరుతుంది. పైగా, సమీకృత ప్రభుత్వాన్ని స్థాపించాలంటే తాలిబన్లు సైన్యా న్ని, పోలీసు బలగాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అంతకుమించి తక్కిన ప్రపంచంతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాల్సి ఉంది. రష్యా, చైనా దేశాలకే ప్రస్తుతం తాలిబన్లతో సత్వర సంబంధాలు నెలకొల్పుకునే అవకాశమున్నట్లు కనబడుతోంది. తాలిబన్లతో రష్యా అధికార పీఠం సత్సంబంధాలను నిర్వహిస్తోందని అఫ్గానిస్తాన్‌కి రష్యా అధ్యక్షుడి తరపున రాయబారి జమీర్ కుబులోవ్ చెబుతున్నారు. కాబట్టి అఫ్గాన్‌లో జరిగిన పరిణామాలు చూసి రష్యా కలవరపడటంలేదు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్ లవ్రోవ్తో ఫోన్లో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌లో తమ రెండు దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సి ఉందని చెప్పడం బహిర్గతమైంది. అక్కడి పరిస్థితిని బట్టి తమ రెండు దేశాలు పరస్పరం బలపర్చుకోవలసి ఉంటుందని కూడా వీరు అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్తాన్ పొరుగున ఉన్న సెంట్రల్ ఆసియన్ దేశాలను కూడా తాలిబన్లు భాగస్వాములుగా చేసుకోవచ్చు. విస్తృతార్థంలో చూస్తే, మధ్య ఆసియా దేశాలు తాలిబన్ల నేతృత్వంలోని అప్గానిస్తాన్‌తో సహకారానికి అవకాశముందని ఆశాభావంతో చూస్తున్నాయి. పైగా అఫ్గానిస్తాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కొత్త ప్రమాదాలు జరిగే అవకాశాన్ని అనుమతించబోమని బరాదర్ ప్రతిజ్ఞ చేశారు. పైగా మజర్ షరీఫ్, కాబూల్ గుండా ఉబ్జెకిస్తాన్ లోని టర్మిజ్ నుంచి పాకిస్తాన్‌లోని పెషావర్ వరకు కాబూల్ కారిడార్ నిర్మించాలంటూ ఉజ్బెకిస్తాన్ చేసిన ప్రతిపాదనను బరాదర్ స్వాగతించారు. అమెరికా వైదొలిగాక, అఫ్గాన్‌తో సహా మధ్యాసియా దేశాల మధ్య వాణిజ్య, మౌలిక వసతుల కల్పన మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. అలాగే అమెరికా, దాని మిత్ర దేశాల విధానం పైన కూడా అఫ్గాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అఫ్గాన్‌లో అమెరికా ఘోర ‡వైఫల్యం, సైనిక బలగాల ఉపసంహరణ అంతర్జాతీయ స్థాయిలోనే అమెరికాను ఘోరంగా అవమానపర్చింది. అఫ్గానిస్తాన్ విధ్వంసంలో అది నిర్వహించిన పాత్ర రీత్యా, అఫ్గాన్ ప్రజల శ్రేయస్సుకు అమెరికా ఏమేరకు బాధ్యత వహిస్తుందన్నది కూడా ప్రశ్నే. సమీకృత∙పాలన, ఉగ్రవాద నిరోధంవైపుగా తాలిబన్లు ఏమేరకు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించగలరని తాము వేచి చూస్తున్నామని జో బైడెన్ చెబుతున్నారు. అమెరికా, దాని మిత్రదేశాలు సాధారణ అఫ్గాన్ పౌరులకు చేయవలసిన సహాయం ఎంతగానో ఉంది. అలాగే అఫ్గాన్ పొరుగుదేశాలు, రష్యా కూడా అఫ్గాన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవలసి ఉంది. చైనా, రష్యా, మధ్యాసియా దేశాలు ఇలా ఆసక్తి కలిగిన అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి అఫ్గాన్‌పై ప్రత్యేక అంతర్జాతీయ సదస్సును ఏర్పర్చాలి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సహాయ మందించే దేశాలు కూడా ఒక్కటవ్వాలి. అలాగే ఐరాస, వివిధ అభివృద్ధి బ్యాంకులు కలిసి అఫ్గాన్ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక నిధిని ఏర్పర్చాలి. మధ్యాసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగల రష్యా, అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదు. రష్యాతో సంబంధ బాంధవ్యాలతో పాశ్చాత్య ప్రపంచం కూడా ఈ మొత్తం ప్రక్రియను మెరుగుపర్చవచ్చు. – జూమార్ట్ ఒటోర్బెవ్, కిర్గిజ్స్తాన్ మాజీ ప్రధాని (ప్రాజెక్ట్ సిండికేట్ సౌజన్యంతో) -
తాలిబన్ల ఇంటర్వ్యూ తర్వాత ఓ అఫ్గాన్ మహిళా జర్నలిస్టు స్పందన
తాలిబన్ల అరాచకాలు అంతా ఇంతా కాదు.. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటి అరాచకాలు కోకొల్లలు. అయితే మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు అంటూ ఓ మహిళా జర్నలిస్టుకు తాలిబన్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి వాస్తవ పరిస్థితులపై షబ్నమ్ దావ్రాన్ అనే అఫ్గాన్ జర్నలిస్టు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రశ్న: మహిళలు తమ హక్కులన్నీ కలిగి ఉంటారని తాలిబన్లు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి? జవాబు: నేను స్టేట్ రన్ అనే వార్తా సంస్థ (ఆర్టీఏ) పాష్టోలో పని చేస్తున్నారు. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు ఉదయం నేను పనిచేసే కార్యాలయాని వెళ్లాను. వారు నన్ను ఇక నుంచి పనికి రావొద్దని చెప్పారు. కారణం ఏంటని అడిగాను. అయితే ఇప్పుడు నియమాలు మారాయని, మహిళలు ఇకపై ఆర్టీఏలో పని చేయడానికి అనుమతి లేదన్నారు. అయితే మహిళలు చదువుకోవడానికి, పనికి వెళ్లడానికి అనుమతి ఉంటుందని తాలిబన్లు ప్రకటించినప్పుడు నేను ఆనంద పడ్డాను. అయితే నా ఆఫీసులో మహిళలు పని చేయడానికి అనుమతించమని నన్ను రానివ్వలేదు. నేను వారికి నా గుర్తింపు కార్డులను చూపించాను. అయినప్పటికీ నన్ను ఇంటికి వెళ్లమన్నారు. ప్రశ్న: ఇతర ఛానెల్‌ల మహిళా యాంకర్లకు కూడా ఇదే విధమైన ఆదేశాన్ని ఇచ్చారా? జవాబు: లేదు.. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళలను మాత్రమే పనికి రానివ్వమని తెలిపారు. టోలో న్యూస్ ఓ ప్రైవేట్ ఛానెల్ అందువల్ల అక్కడి మహిళల కోసం ఇలాంటి ఆదేశాన్ని జారీ చేయలేదు. ప్రశ్న: ఓ మహిళగా మీకు ఏదైనా ప్రత్యేక ప్రమాదం వాటిల్లిందా? జవాబు: నీవు ఓ మహిళవు. ఇప్పుడే ఇంటికి వెళ్లన్నారు. అయితే నా సహోద్యోగిని మాత్రం పనికి వెళ్లడానికి అనుమతించారు. మహిళలు ఇకపై ఆర్టీఏలో పనిచేయడానికి వీలులేదని వారు స్పష్టంగా తెలియజేశారు. ప్రశ్న: తాలిబన్లతో ఓ మహిళా ఇంటర్వ్యూ చూసినపుడు చాలా మంది సంతోషించారు. కానీ మీ కథను చూసిన తర్వాత, అది కేవలం ఓ పార్శ్వంగా మాత్రమే అనిపిస్తుంది. జవాబు: అవును, అది టోలో న్యూస్‌లో ఉంది. నా స్నేహితులలో ఒకరు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏం జరుగుతుందనే ఆలోచన అందరికీ ఉంది. కానీ తాలిబన్లతో ఇంటర్వ్యూ తర్వాత, పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు అనుకున్నాం. కానీ తాలిబన్లు ప్రభుత్వానికి సంబంధించిన మీడియాతో అలా చేయడం మంచిది కాదు. ప్రశ్న: మీరు ఇతర మహిళా జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతారు? మీలాగ పని చేసే మహిళలకు భవిష్యత్‌లో ఏదీ ఉండదని మీరు అనుకుంటున్నారా? జవాబు: ప్రస్తుతానికి నాకు ఏం అర్థం కావడం లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రశ్న: మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? జవాబు: నేను ఇకపై ఇక్కడ పని చేయలేను. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో జీవించడం చాలా కష్టం. నాకు ఏదైనా మద్దతు లభిస్తే, నేను వెళ్ళిపోతాను. ప్రశ్న: మీ కుటుంబం గురించి ఆలోచిస్తే మీరు భయపడుతున్నారా? జవాబు: అవును, నా జీవితం కంటే, నేను వారి కోసమే ఎక్కువ భయపడుతున్నాను. -
తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ స్త్రీల పరిస్థితి ఇదే!
తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను 1996 నుంచి 2001 వరకు పరిపాలించారు. షరియా చట్టం ప్రకారం.. చిన్న వయసు నుంచే బాలికలను పాఠశాలలకు వెళ్ళనివ్వరు. మహిళలు ఉద్యమాలు చేయరాదు. తమ శరీరం కనిపించకుండా తల నుంచి కాళ్ల వరకూ మహిళలు నిండుగా బుర్ఖా ధరించాలి. అయితే తాలిబన్ల పాలనకు పూర్వం అఫ్గాన్‌లో స్త్రీలు ఏ విధమైన జీవనాన్ని గడిపేవారో ఓ సారి తెలుసుకుందాం. కాబూల్: అశ్వకన్, అస్సాకన్ అనే పేరు నుంచి అఫ్గాన్ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమ క్రమంగా అఫ్గానిస్తాన్‌గా పేరు మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష. ఉదార, పాశ్చాత్య జీవనశైలి శతాబ్దాలుగా అంతర్గత సంఘర్షణ, విదేశీ జోక్యంతో విచ్ఛిన్నమైన ఆఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో అఫ్గాన్ అనేక తాత్కాలిక చర్యలు తీసుకుంది. 1950,1960లలో సాంప్రదాయ వర్గాల పట్ల గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఆ సమయంలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానానికి అడుగులు పడ్డాయి. విద్య, ఓటు వేసే స్వేచ్ఛ ఆఫ్ఘన్ ప్రభుత్వం బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. కొత్త విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చి, ఓ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. అది ప్రజాస్వామ్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆఫ్గన్ మహిళలకు ఓటు హక్కును కల్పించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మహిళలు కళాశాలకు వెళ్లేందుకు మార్గం పడింది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా నిర్వహించారు. మరి కొంతమంది మహిళలు రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో కాబూల్ కాస్మోపాలిటన్ అయింది. సంపన్న సమాజం అఫ్గనిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యూఎస్, సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వకంగా మెలిగింది. సోవియట్ యంత్రాలు, ఆయుధాలను.. యూఎస్ నుంచి ఆర్థిక సహాయాన్ని అంగీకరించింది. ఆ కాలంలో అఫ్గన్‌కు చాలా ప్రశాంతమైన యుగం. పాత సాంప్రదాయ మట్టి నిర్మాణాలతో పాటు.. కాబూల్‌లో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. కొంతకాలం పాటు బుర్ఖాలు ధరించడం అనేది ఓ ఆప్షన్‌గా మారింది. దేశం సంపన్న సమాజం వైపు ఓ మార్గంలో వెలుతున్నట్లు కనిపించింది. అకస్మాత్తుగా అంతా తలకిందులు దేశంలో తాలిబన్లు పురుడు పోసుకోవడంతో అంతా తలకిందులైనది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి పీచమణిచింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. కాగా ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్లు, ఇటు ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం -
విమానం నుంచి పడిపోయిన ఘటన: అన్నదమ్ముల విషాద గాథ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట. దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్‌లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ప్రజలు, అఫ్గాన్ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్‌కు ఇక భారీ దెబ్బే!
తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. అఫ్గన్ నుంచి భారత్‌కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇవేం తక్షణ పరిణామాలు కావని, నెలన్నర నుంచే ముందు నుంచే నడుస్తున్నా ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ట్రక్కులు నిలిచిపోవడంతో.. ఇంక వేచిచూడడమే మార్గంగా భావిస్తున్నారు. ‘వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయని తాలిబన్లు హామీ ఇస్తున్నారు. కానీ, అంతకు ముందు పూర్తి ఆర్థిక వ్యవస్థను సమీక్షించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి, వర్తక వ్యాపారాల క్లియరెన్స్‌కు ఎంత సమయం పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, భారత్ నుంచి వెళ్లే గూడ్స్ నార్త్-సౌత్ ట్రేడ్ కారిడార్ మార్గంలో లేదంటే దుబాయ్ నుంచి అక్కడికి చేరుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. చాబహర్ పోర్ట్ నుంచి ముంబైకి రవాణా కొనసాగే ఛాన్స్ ఉంది. కానీ, అన్నింటి కంటే ముందు తాలిబన్ల అనుమతులు అవసరం పడొచ్చు’ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ సీఈవో, డైరెక్టర్ జనరల్ అజయ్ షా హాట్ న్యూస్: అఫ్గన్ పరిణామాలు.. తాలిబన్లు తెచ్చిన తంటాలు దిగుమతులు ఇవే పాక్(48 శాతం) తర్వాత అఫ్గన్ నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశంగా భారత్(19) ఉంది. ఆ తర్వాతి ప్లేసులో రష్యా, ఇరాన్, ఇరాక్, టర్కీలు ఉన్నాయి. 2020-2021కిగానూ భారత్-అఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక్ష వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది(2019-20తో పోలిస్తే తక్కువే). ఇందులో భారత్ దిగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్నట్, ఆల్మండ్, అంజీర్, పైన్, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్, చెర్రీ, వాటర్ మిలన్, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి. ఎగుమతుల మీదా.. దిగుమతుల మీదే కాదు.. అఫ్గన్‌కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వర్తకం మీదా ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్ నుంచి సుమారు 509 మిలియన్ డాలర్ల విలువ చేసే వర్తకంపై తీవ్ర ప్రభావం పడింది. టీ, కాఫీ, మిరియాలు, కాటన్, బొమ్మలు, చెప్పులు, ఇతరతత్రా ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారుల్లో నెలకొన్న ఆర్థిక భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అఫ్గన్ జీడీపీపై ప్రభావం వ్యవసాయం, పశు పోషణ అఫ్గన్ల జీవనాధారంగా. తొలినాళ్లలో వ్యక్తిగత సాగు, వలస పశు పోషణ మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తూ.. విదేశాలకు ఎగుమతిపైనా తక్కువగా దృష్టిపెట్టేవాళ్లు. అయితే తర్వాతి కాలంలో ఎగుమతుల మీద ఆసక్తి మొదలుపెట్టారు. డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, కార్పెట్స్, ఉన్ని ఎగుమతులు సాగాయి. ఇక విదేశాల నుంచి వాహనాలను, పెట్రోలియం ప్రొడక్టులను, చక్కెర, దుస్తులు, ప్రాసెస్ట్ యానిమల్-వెజిటెబుల్ ఆయిల్, టీను దిగుమతి చేసుకుంటాయి. ఇక ఎగుమతులే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థలో 20 శాతం జీడీపీని శాసిస్తున్నాయి. -
20 ఏళ్ల తర్వాత అఫ్గన్‌కు: కాబోయే అధ్యక్షుడు.. ఎవరీ అబ్దుల్ ఘనీ?!
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అఫ్గన్ ప్రజల నిరసన జ్వాలలు కొనసాగుతున్నప్పటికీ లెక్కచేయక అధికారం చేపట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాలిబన్లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గనిస్తాన్‌కు కాబోయే తదుపరి అధ్యక్షుడు అనే వార్తలు వెలువడుతున్నాయి. 2001లో తాలిబన్ నాయకత్వం నుంచి తొలగించబడి, దేశం విడిచి వెళ్లిపోయిన అబ్దుల్ మళ్లీ మంగళవారం కాందహార్‌లో అడుగుపెట్టారు. ఒకప్పుడు తాలిబన్ లీడర్‌గా ఓ వెలుగు వెలిగిన అబ్దుల్ ఎందుకు అఫ్గన్‌ను వీడాల్సి వచ్చింది? పాకిస్తాన్లో అరెస్టై, సుమారు 8 ఏళ్ల పాటు నిర్బంధ జీవితం గడిపిన ఆయన ఎవరి చొరవతో బయటపడ్డారు? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం.. ►అఫ్గనిస్తాన్‌లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లో 1968లో అబ్దుల్ ఘనీ బరాదర్ జన్మించారు. 1980లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా అఫ్గన్ ముజాహిదీన్ తరఫున పోరాడారు. ►1989లో సోవియట్ సేనలు దేశాన్ని వీడిన తర్వాత మహ్మద్ ఒమర్‌తో కలిసి కాందహార్‌లో మదర్సాను స్థాపించిన అబ్దుల్ ఘనీ.. 1994లో తాలిబన్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో 1996లో తాలిబన్ అధికారం చేపట్టింది. కాగా తాలిబన్ ఉద్యమ సహచరులుగా ఉన్న అబ్దుల్- ఒమర్ ఆ తర్వాత బంధువులుగా మారారు. ఒమర్ సోదరిని అబ్దుల్ పెళ్లి చేసుకున్నారు. ►తాలిబన్ పాలనలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అబ్దుల్.. న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత అఫ్గన్ పరిస్థితులపై అమెరికా జోక్యంతో దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని కేవలం పాకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ మాత్రమే గుర్తించిన విషయం తెలిసిందే. ►అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2010లో పాకిస్తాన్‌లోని కరాచీలో అబ్దుల్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను దోహా(ఖతార్)కు తరలించారు. ►ఖతార్‌లో ఉన్న సమయంలో అబ్దుల్ అమెరికా, అఫ్గన్ శాంతిదూతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆ సమావేశాలకు హాజరైన జల్మే ఖలిజాద్ అబ్దుల్ నమ్మదగ్గ వ్యక్తి అని, అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో నిర్బంధ జీవితం నుంచి అబ్దుల్‌కు విముక్తి లభించింది. ►ఈ క్రమంలో 2020లో అమెరికాతో తాలిబన్లకు కుదిరిన చారిత్రాత్మక దోహా ఒప్పందంపై అబ్దుల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై అబ్దుల్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ►అదే విధంగా.. తాలిబన్లను అఫ్గన్ సైన్యంగా, రాజకీయ శక్తిగా గుర్తించిన చైనా ఆహ్వానం మేరకు తొమ్మిది మంది తాలిబన్ నేతల బృందంతో కలిసి అబ్దుల్ 2021లో డ్రాగన్ దేశంతో చర్చలు జరిపారు. ►ఇక అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తాలిబన్లు ఆదివారం అఫ్గన్‌ను ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో అబ్దుల్ వారిని ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘‘తాలిబన్ ఫైటర్లూ.. మున్ముందు అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాధించాల్సి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. ►అంతేగాక, ఆదివారమే ఖతార్ నుంచి అఫ్గన్ చేరుకున్న అబ్దుల్.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాలిబన్ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఆ సమయంలో అబ్దుల్ ఖతార్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు. -వెబ్‌డెస్క్ చదవండి: Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ! -
ప్రభుత్వ ఏర్పాటు: మాజీ అధ్యక్షుడితో తాలిబన్ల భేటీ
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాలిబన్ కమాండర్, హక్కాని నెట్వర్క్ గ్రూపు సీనియర్ నేత అనాస్ హక్కాని, అఫ్గన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయిని కలిశారు. బుధవారం జరిగిన ఈ భేటీలో కర్జాయితో సహా గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమావేశం జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్ కథనం ప్రచురించింది. కాగా తాలిబన్ వ్యవస్థలో హక్కాని నెట్వర్క్ ఒక ముఖ్యశాఖ. అఫ్గన్‌ను తాలిబన్లు గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. కాబూల్‌ను స్వాధీనం చేసుకుని సైన్యంపై పైచేయి సాధించింది. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకున్న హక్కాని నెట్వర్క్... అఫ్గనిస్తాన్‌లో అనేకమార్లు ఉగ్రదాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని, ఎవరిపై ప్రతీకార చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు! Afghanistan: తాలిబన్ల రాజ్యం.. బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు -
అఫ్గన్ తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు!
కాబూల్: అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై పైచేయి సాధించి ఎట్టకేలకు బంధించినట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్‌లోని బల్ఖ్ ప్రావిన్స్‌లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి పోరాడారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు. కాగా తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Karnataka: అఫ్గాన్లలో కలవరం.. మా వాళ్లకు అక్కడ నరకమే! తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...! -
Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు
మోర్తాడ్ (బాల్కొండ): అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్‌కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్‌లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్‌ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్‌లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతలోనే అంతా అయిపోయింది.. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. కాబుల్‌లో చిక్కుకుపోయాను నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్ పట్టణం కసబ్ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్ఫోన్లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు. - బొమ్మన రాజన్న( మంచి ర్యాల) ఎటుపోవాలో తెలియడం లేదు నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్‌కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. - బొమ్మెన మహేందర్ (మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా) అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు) అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్ వస్తోంది. అఫ్గాన్ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి. -
Afghanistan Crisis: తాలిబన్లు సంచలన ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నా, అఫ్గాన్ ప్రజ మాత్రం ఉలిక్కిపడుతూనే ఉంది. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా సమాంగని టీవీలో చెప్పారు. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్ కమిషన్‌లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదు. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పౌర ప్రభుత్వాలతో, విదేశీ సేనలతో కలిసి పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను తాలిబన్లు తయారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. స్త్రీలే ప్రధాన బాధితులు గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్‌లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. అయితే ‘ఇస్లామిక్ చట్టం’ అంటే ఏంటనేది ఆయన వివరించలేదు. ప్రజలకు ఈ చట్టం నిబంధనలు తెలుసన్నట్లు మాట్లాడారు. ప్రజల్లో అన్ని పక్షాలు ప్రభుత్వంలో చేరాలన్నారు. స్త్రీలపై తమ వైఖరి మారిందనేందుకు సాక్ష్యం కోసం తాలిబన్ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు ప్రజా జీవనం నుంచి స్త్రీలను దూరం చేయవద్దంటూ కాబూల్‌లో పలువురు మహిళలు హిజాబ్ ధరించి ప్రదర్శన చేశారు. తాలిబన్లు తాము చేసే వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వీరి గత వైఖరి గమనిస్తే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయని ఐరాస ప్రతినిధి రూపర్ట్ అన్నారు. రెండు దశాబ్దాల్లో అఫ్గాన్ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ జరిగిందని, వీటిని కాపాడాలని సూచించారు. ఆగిన ఆర్థిక సాయం 2021లో అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్‌కు అందించే సాయాన్ని తగ్గిస్తామని స్వీడన్ మంత్రి పర్ ఆల్సన్ ఫ్రిడ్ చెప్పారు. సైనికుల తరలింపు కోసం అఫ్గాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరలా తెరిచారు. అఫ్గాన్‌లో ఉన్న అమెరికన్లు స్వదేశం వచ్చేందుకు ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని యూఎస్ ఎంబసీ సూచించింది. దేశమంతా వేలాదిమంది గాయాల పాలైనట్లు రెడ్‌క్రాస్ తెలిపింది. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సురక్షితంగా ఉంచుతాం.. ఇస్లామిక్ చట్టం ప్రకారం స్త్రీలకు హక్కులు అఫ్గానిస్తాన్‌ను సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్ భవితవ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాలిబన్ ప్రకటన వెలువడింది. ఈ మేరకు తొలిసారి విలేకరులతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా జబిహుల్లా బయటకు కనిపించలేదు. రహస్యంగా ఉంటూ తాలిబన్ల తరఫున ప్రకటనలు జారీ చేసేవారు. తాజాగా అందరినీ క్షమించామని, స్థానికులపై ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోమని తన ఇంటర్వ్యూలో జబిహుల్లా చెప్పారు. ‘‘ఎవరి ఇంటి తలుపు తట్టి ఎందుకు పాశ్చాత్యులకు సాయం చేశావు అని ఎవరూ అడగరు’’ అని తెలిపారు. తాలిబన్ల మాటపై దేశ ప్రజల్లో నమ్మకం చేకూరడం లేదు. మహిళా హక్కులను ఇస్లామ్ చట్టానికి లోబడి పరిరక్షిస్తామని జబిహుల్లా చెప్పారు. ప్రైవేట్ మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలని, జాతీయ విలువలకు వ్యతిరేకంగా పనిచేయకూడదని కోరారు. ఇతర దేశాలతో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని, అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి శత్రువులను కోరుకోవడం లేదని తెలిపారు. ఆఫ్గాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని జబిహుల్లా ప్రకటించారు. ‘ఆఫ్గానిస్తాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని ప్రపంచదేశాలకు మేము వాగ్ధానం చేస్తున్నాం’ అని అన్నారు. అందరి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు కోరుకుంటున్నారని తెలిపారు. విమానం.. ఓవర్ లోడ్ కిక్కిరిసిపోయిన జనాలతో బస్సులు, రైళ్లు, పడవల్ని ఇన్నాళ్లూ చూశాం. తాలిబన్ల పుణ్యమాని ఇప్పుడు విమానాలను కూడా అలా చూసే రోజు వచ్చింది. విమానం టేకాఫ్‌కి కాస్త ముందు ప్రాణభయంతో పరుగు పరుగున, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయాణికులు ఎక్కే రోజు ఒకటి వస్తుందని మనం కలలో కూడా ఊహించి ఉండం. ఇప్పుడు అలాంటి దృశ్యాలే కాబూల్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. అమెరికా తమ దౌత్య సిబ్బందిని తీసుకురావడానికి పంపిన సి–17 రవాణా విమానంలోకి అఫ్గాన్ పౌరులు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎక్కారు. పిల్లా పాపలతో విమానం లోపల కిందనే కూలబడ్డారు. కనీసం సామాన్లు కూడా వెంట తెచ్చుకోలేదు. ఎలాగైనా కాబూల్‌ని విడిచిపెడితే ప్రాణాలు దక్కుతాయన్న ఆందోళన తప్ప వారిలో మరేం కనిపించడం లేదు. 150 మంది సైనికుల్ని తీసుకువెళ్లే ఆ విమానంలో ఏకంగా 640 ఎక్కేశారు. విమానం టేకాఫ్‌కి కాస్త ముందు సగం తెరిచిన ర్యాంప్ మీదుగా ఒక్క ఉదుటున.. పోటెత్తిన వరదలా లోపలికి వచ్చేశారు. విమానం సిబ్బంది కూడా వారిని తీసుకునే ప్రయాణించడానికి నిర్ణయించారు. ఈ ఫొటోని అమెరికా ఎయిర్ఫొర్స్కి చెందిన సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. వారినందరినీ ఖతర్ విమానాశ్రయంలో దింపినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు పరుగులు తీసుకుంటూ విమానంలోకి ఎక్కిన వీడియోలు కూడా వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఎటు చూసినా గందరగోళమే అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. అయితే కాబూల్ విమానాశ్రయానికి విపరీతంగా జనం వచ్చి పడిపోతూ ఉండడంతో అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ వారిని చెదరగొడుతున్నాయి. రన్‌వేలపై ఉన్న విమానాలను అదేదో బస్సుల మాదిరిగా కదులుతుంటే కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. -
తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక ప్రకటన
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ‘‘20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం’’ అని పేర్కొన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి మీదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడించారు. అదే విధంగా... ‘‘అఫ్గన్‌లో ఇతర దేశీయులకు హాని తలపెట్టబోము. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవారు వెనక్కి రావాలి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. అలాగే మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం’’ అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్‌తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం వెల్లడించారు. అలాగే అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని ముజాహిద్ తెలిపారు. అయితే మీడియాకు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదని సూచించారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషిచేస్తాం’’ అని చెప్పారు. చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’ అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది! The security of embassies in Kabul is of crucial importance to us. We would like to assure all foreign countries that our forces are there to ensure the security of all embassies, missions, international organizations, and aid agencies: Taliban spokesperson Zabihullah Mujahid pic.twitter.com/tmMKJifZc9 — ANI (@ANI) August 17, 2021 -
అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది!
కాబూల్: గత రెండు రోజులుగా భయంతో అల్లాడిపోతున్న అఫ్గనిస్తాన్‌లో త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినప్పటికీ.. కాబూల్‌లో కొంతమంది భయం భయంగానే బయటికు వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులతో బుర్ఖా ధరించి బయటకు వస్తున్నట్లు సమాచారం. అఫ్గన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామంటూ తాలిబన్లు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొన్నిచోట్ల వ్యాపారులు ధైర్యం చేసి మార్కెట్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. అఫ్ఘన్ టీవీ ఛానళ్లలో తాలిబన్ బోధనలు ప్రారంభమయ్యాయి. మహిళా యాంకర్లు, మహిళా రిపోర్టర్లు తెరమీదకు వస్తున్నారు. ఈ క్రమంలో.. అఫ్ఘన్ టాప్ ఛానల్ టోలో న్యూస్ చానెల్‌కు తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్ మహిళా యాంకర్ బెహెస్తాకు ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను టోలో న్యూస్ ట్విటర్లో షేర్ చేసింది. అయితే, ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘తాము మారిపోయామని నమ్మించడానికే తాలిబన్లు ఇలా చేస్తున్నారు’’ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.. ‘‘కనీసం మహిళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా ఒప్పుకొన్నారు. అయినా ఎందుకో కాస్త అనుమానంగానే ఉంది’’ అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు మాత్రమే ఆ శక్తి ఉంది... ఇదిలా ఉండగా... అఫ్ఘాన్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ అక్కడి యువత ఫైర్ అవుతోంది. ‘‘తాలిబన్లపై మాకు నమ్మకం లేదు. తాలిబన్లు వైరస్, క్యాన్సర్ లాంటివాళ్లు. తాలిబన్లు మారారు అనుకోవడం అవివేకం. అఫ్ఘాన్ అభివృద్ధికి భారత్ చాలా సహాయం చేసింది. తాలిబన్లు, పాకిస్తాన్, చైనా ముగ్గురూ భారత్‌కు శత్రువులే. తాలిబన్లను తరిమికొట్టే శక్తి భారత్‌కు ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’ Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు.. NIMA WORAZ: #Kabul Situation Discussed [Pashto] In this program, host Beheshta Arghand interviews Mawlawi Abdulhaq Hemad, a close member of the Taliban’s media team, about Kabul’s situation and house-to-house searches in the city. https://t.co/P11zbvxGQC pic.twitter.com/Pk95F54xGr — TOLOnews (@TOLOnews) August 17, 2021 -
Afghanistan: భారత రాయబార కార్యాలయం మూసివేయలేదు!
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని మంగళవారం వివరణ ఇచ్చింది. భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని, దాదాపు 1650 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని ప్రకటించింది. మరోవైపు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది తమ సేవలను కొనసాగిస్తున్నారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. మిగిలిన సిబ్బందికి రక్షణగా అక్కడే ఉండనున్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఐటీబీపీ కమాండింగ్ ఆఫీసర్ రవి కాంత్ గౌతమ్ అన్నారు. అయినా ప్రజలను విజయవంతంగా తరలించగలిగాము, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తమ దళాలు 3-4 రోజులు నిద్రపోలేదనీ, ఈ రాత్రి హాయిగా నిద్రపోతామంటూ సంతోషం ప్రకటించారు. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) కాగా తాలిబన్ల ఆక్రమణ, అఫ్గన్ పరిస్థితుల నేపథ్యంలో వేలాదిమంది పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీశారు. మరోవైపు అఫ్గన్లకు అండగా నిలుస్తామని ప్రభుత్వం సోమవారం తెలిపింది. కాబూల్ నుండి వాణిజ్య విమానాలు ప్రారంభం తర్వాత హిందువులు, సిక్కులను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రాధాన్యతనిస్తామని, భారత పౌరుల భద్రతకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!) ITBP personnel who were securing the Indian embassy in Kabul get back home. At the Hindan airforce station pic.twitter.com/ceoE8sxSvk — Abhishek Bhalla (@AbhishekBhalla7) August 17, 2021 The situation is bad in #Afghanistan but we managed to successfully evacuate our people, which is a matter of pride for all of us. Our troops have not slept for 3-4 days. We will sleep comfortably tonight: Ravi Kant Gautam, Commanding Officer of ITBP troops in Afghanistan pic.twitter.com/eiWmeP4Wev — ANI (@ANI) August 17, 2021 -
‘వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నా.. వచ్చి నన్ను చంపేస్తారు’
Taliban Control Over Afghanistan: ‘‘నేను ఇక్కడే.. నా ఇంట్లో కూర్చుని వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ సహాయం చేసేందుకు ఎవరూ లేరు. అయినా, సరే.. నేను నా భర్తతో కలిసి ఇక్కడే కూర్చున్నా. నాలాంటి వాళ్లను చంపడం వారికి ఇష్టం కదా. వాళ్లు ఇక్కడికి తప్పకుండా వస్తారు. నన్ను చంపేస్తారు’’... అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైందన్న ప్రకటన వెలువడగానే.. ఆ దేశంలో అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా మేయర్ జరీఫా ఘఫారీ స్పందన ఇది. తాలిబన్ల బలం ముందు నిలవలేక సైన్యం చేతులెత్తేసిన వేళ.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన బృందం దేశం విడిచి పారిపోయిన తరుణంలో 27 ఏళ్ల జరీఫా మొండి ధైర్యం ప్రదర్శించారు. చచ్చినా, బతికినా ఇక్కడే.. ‘‘నా దేశం విడిచి నేను ఎక్కడికి వెళ్లాలి.. అసలెందుకు వెళ్లాలి.. బతికినా, చచ్చినా ఇక్కడే ’’ అంటూ మహిళా శక్తిని చాటారు. మూడేళ్ల క్రితం మైదాన్ వర్దక్ ప్రావిన్స్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జరీఫా గుర్తింపు పొందారు. ఒక స్త్రీ ఈ విధంగా రాజకీయ చైతన్యం పొందడం సహజంగానే తాలిబన్లకు కంటగింపుగా మారింది. చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. మూడుసార్లు హత్యాయత్నం చేశారు కూడా. కానీ విఫలమయ్యారు. దీంతో.. ఎలాగైనా జరీఫా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో.. గతేడాది నవంబరులో ఆమె తండ్రి, జనరల్ అబ్దుల్ వసీ ఘఫారీని కాల్చి చంపేశారు. అయినా.. సరే ఆమె వెనకడుగు వేయలేదు. తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్న వేళ గాయపడ్డ సైనికులు, సాధారణ పౌరులను కాపాడే ప్రయత్నం చేశారు. త్వరలోనే అఫ్గాన్లకు తాలిబన్ల నుంచి విముక్తి లభిస్తుందని, దేశానికి, ఆడపిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని గట్టిగా విశ్వసించారు. కానీ.. అలా జరగలేదు. తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారన్న వార్త వినగానే ఆమె కలలు కల్లలయ్యాయి. అందుకే.. రాజకీయ నాయకురాలినై, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను కచ్చితంగా చంపేస్తారని జరీఫా వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు! తాలిబన్ రాజ్యం వస్తే మహిళలకు ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గతంలో స్త్రీల పట్ల తాలిబన్లు వ్యవహరించిన తీరు.. ‘‘పదిహేనేళ్లు దాటిన ఆడపిల్లలు, 45 ఏళ్ల లోపు వయస్సు గల వితంతువుల జాబితా ఇవ్వండి. వారిని తాలిబన్ యోధులకు ఇచ్చి పెళ్లి చేస్తాం’’.. అఫ్గనిస్తాన్‌లోని ఇమామ్‌లు, ముల్లాలకు తాలిబన్ గ్రూపు సాంస్కృతిక కమిషన్ పేరిట ఇటీవల వచ్చిన నోట్ ఈ భయాందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల క్రితం అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరీఫా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అఫ్గన్ మహిళ ఆవేదన హక్కుల కోసం పోరాడతారు.. ‘‘దేశ పరిస్థితులు, చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి నవతరానికి అవగాహన ఉంది. సోషల్ మీడియాలో వారు తమ అభిప్రాయాలు పంచుకోగలుగుతున్నారు. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. అభ్యుదయ భావజాలంతో తమ హక్కుల కోసం వారు కచ్చితంగా పోరాడతారనే నమ్మకం నాకు ఉంది. నా దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విశ్వసిస్తున్నా’’ అని జరీఫా పేర్కొన్నారు. అయితే, నెల కూడా తిరక్కుండానే కాబూల్ తాలిబన్ల హస్తగతం కావడంతో.. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన ఆమెను వెంటాడుతోంది. నిజంగా తాలిబన్లు మాట నిలబెట్టుకుంటారా?! దేశం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత.. ప్రజలు ఆందోళనతో విదేశాలకు పారిపోతున్న వేళ.. ‘‘ప్రజలపై మేం ప్రతీకార చర్యలకు దిగబోము’’ అని తాలిబన్లు ప్రకటించారు. అంతేకాదు.. మహిళలను బానిసలుగా మార్చాలనుకోవడం లేదని, వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మలాలా యూసఫ్‌జాయ్ అయితే, జరీఫాతో పాటు గతంలో ఆమె వలె బెదిరింపులు ఎదుర్కొన్న చాలా మంది మహిళలు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడం లేదు. స్త్రీ విద్యను వ్యతిరేకించి, మలాలా వంటి అనేక మంది ఆడపిల్లలను ఇబ్బంది పెట్టిన తాలిబన్ల పాలనలో తమకు స్వేచ్ఛ దొరకడం కష్టమేనంటూ సామాజిక మాధ్యమాల్లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌డెస్క్. చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు.. మళ్లీ నరకంలోకా?.. మా వల్ల కాదు -
Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన
Taliban Announces "General Amnesty": అఫ్గనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు. అఫ్గన్‌లో తాలిబన్ల రాజ్యస్థాపన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ శాంతి మంత్రం పఠించారు. దేశంలోని ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా.. మహిళలను తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరారు. ఈ మేరకు తాలిబన్ సాంస్కృతిక కమిషన్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనాముల్లా సమంగానీ మాట్లాడుతూ... ‘‘మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు. అయితే, ఇంతవరకు మేం ప్రభుత్వ విధివిధానాలను ఖరారు చేయలేదు. కానీ, ఇస్లామిక్ నాయకత్వంలో అన్ని వర్గాలకు ప్రవేశం ఉంటుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: ఏ క్షణాన ఏ వార్త వినాల్సివస్తుందో.. రషీద్‌ఖాన్ భారత్‌కు ముప్పేమీ లేదు: ఒమర్ అబ్దుల్లా -
ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే
కాబూల్: తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సాధారణ ప్రజలే ఇలా ఉంటే జైళ్లల్లో ఉన్న ఖైదీలు భయాందోళన చెందుతున్నారు. ఆ జైళ్లల్లో మగ్గుతున్న వారిలో పలువురు భారతీయులు ఉన్నారు. వారిలో కేరళకు చెందిన నయని అలియాస్ ఫాతిమా కథ వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు. ప్రేమించిన యువకుడిని పెద్దలను వివాహం చేసుకుని అఫ్గానిస్తాన్ వెళ్లింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఉగ్రవాదిగా మారింది. భర్త చనిపోగా ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం.. ఇంటింటికెళ్లి నగదు లూటీ కేరళకు చెందిన బిందు, సంపత్‌ల కుమార్తె నిమిష దంత వైద్యురాలు. ఆమె ఒకరిని ప్రేమించింది. పెద్దలు వారిస్తున్నా వినకుండా మతం మార్చుకుని వివాహం చేసుకుంది. నిమిష తన పేరు ఫాతిమాగా మార్చుకుంది. అయితే 2016లో భర్తతో కలిసి నిమిష అఫ్గనిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ భర్తతో పాటు ఆమె కూడా ఉగ్రవాదిగా మారింది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కాల్పుల్లో భర్త మరణించాడు. తన పాపతో కలిసి అక్కడే జీవిస్తున్న ఫాతిమాకు ప్రాణభయం ఏర్పడింది. తమను హతమారుస్తాయనే భయంతో 2019లో అఫ్గాన్ ప్రభుత్వానికి ఫాతిమా లొంగిపోయింది. అప్పటి నుంచి ఫాతిమా జైల్లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు ఆందోళనలో ఉన్నారు. బందీగా ఉన్న తన కుమార్తెను విడిపించుకురావాలని బిందు కేంద్ర ప్రభుత్వానికి 1,882 సార్లు విజ్ఞప్తి చేసింది. తన బిడ్డ ఉగ్రవాది కాదని, ఆమె రాకతో దేశానికి వచ్చిన ముప్పేం లేదని స్పష్టం చేసింది. కాబూల్ జైల్లో ఉంటున్న తన కుమార్తె విడుదలకు సహకరించాలని ఆమె కనిపించిన మంత్రి, ఎమ్మెల్యేలందరినీ కోరుతోంది. అయితే ఫాతిమాతో పాటు మరో 20 మంది యువతులు అఫ్గాన్ వెళ్లారని తెలిసింది. వారిలో ఫాతిమా మాదిరి ముగ్గురు మహిళలు మారారని, వారు జైళ్లో ఉంటున్నారని వారిని విడుదల చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాబూల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి -
ఏ క్షణాన ఏ వార్త వినాల్సివస్తుందో.. రషీద్‌ఖాన్
Rashid Khan అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అరాచక పాలనతో రాజ్యమేలుతున్న వేళ ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం కుటుంబానికి అందుబాటులో లేకుండా పోయిన రషీద్ ఖాన్.. తన కుటుంబం ఏమౌతుందోననే భయాందోళనలో మునిగిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఆవేదన చెందాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రషీద్ యూకేలో ఉండిపోవడం.. తన కుటుంబసభ్యులు మాత్రం అఫ్గన్‌లో ఉండడంతో వారికేమైనా జరుగుతుందేమోనని కలవరపడుతున్నాడు.తాలిబన్ల అరాచక పాలన తట్టుకోలేక ఆ దేశ ప్రజలు ప్రాణ భయంతో వేరే చోటికి తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇదే విషయమై రషీద్ పీటర్సన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ''అఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రషీద్‌తో చర్చించా. ఈ విషయమై అతను చాలా బాధపడుతున్నాడు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. రషీద్‌కు కుటుంబం అంటే ప్రాణమని.. వారిని విడిచి ఉండలేడని.. అందుకే తన వాళ్లకు ఏం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాబుల్ విమానాశ్రయానికి విమానాలు నిలిచిపోయాయి. దీంతో తన కుటుంబాన్ని అఫ్గన్ నుంచి తరలించిలేక కుమిలిపోతున్నాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని రషీద్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమని.. వారు మద్దతిస్తారని.. మా కార్యకలపాలకు అడ్డుపడరని అఫ్గన్ క్రికెట్ సీఈవో హమీద్ షీన్వారీ మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. -
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
-
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
కాబూల్: అఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్ని తలుచుకుని రోదిస్తున్నారు. ఓ వైపు తాలిబన్ల రాక్షసపాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనాలు ఇబ్బడిముబ్బడిగా విమానాశ్రాయాలు, రోడ్ల మీదకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబూల్‌ని ఆక్రమించిన తర్వాత తాలిబన్ల గుంపు తీరిగ్గా అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆ వివరాలు.. కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను అలానే పెట్టుకుని ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు తాలిబన్లు. వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట. ఇలా ఉండగా కాబూల్‌లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్‌లో మాజీ అఫ్గన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ
కాబూల్: ఆఫ్గానిస్తాన్‌లో ఊహించిన పరిణామాలే జరుగుతున్నాయి. ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎలాంటి దాడులు చేయమని అఫ్గాన్‌ను చేజిక్కుంటున్న సమయంలో చేసిన హామీని తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాబూల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నాడు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా పూర్తిగా మూసివేసింది. అఫ్గాన్ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే చొరవ తీసుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
'మౌనంగా ఉండకండి.. ముక్కలైపోయిన హృదయంతో రాస్తున్నా'
అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. తాలిబన్లు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ అఫ్గనిస్తాన్ వదిలి పారిపోయారు. ఇక ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు అష్టకష్టలు పడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ దర్శకురాలు సహ్ర కరిమి తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై బహిరంగ లేఖను రాసింది. 'గత కొన్నివారాలుగా తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌లోని పలు బలగాలను తమ వశం చేసుకున్నారు. చాలామంది ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి పెద్ద వయసున్న వారికిచ్చి పెళ్లి చేశారు. ఓ కమెడియన్‌ను విపరీతంగా హింసించి చంపేశారు. మరో మహిళ కళ్లు పీకేశారు. ఇవే కాకుండా కొంతమంది రచయిలు, మీడియా, ప్రభుత్వ పెద్దలను చంపేశారు. తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గనిస్తాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశ అభ్యుదయం కోసం ఎంతో కష్టపడి సాధించుకున్నవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. తాలిబన్లు పాలిస్తే అన్ని కళలను నిషేధిస్తారు. మహిళల హక్కులను కాలరాస్తారు. భావ వ్యక్తీకరణను అడ్డుకుంటారు. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య సున్నా. కానీ ఇప్పుడు 9 మిలియన్లకు పైగా అఫ్గన్ బాలికలు స్కూల్‌కు వెళ్తున్నారు. తాలిబన్ల నుంచి మా ప్రజలను కాపాడటంతో మీరు నాతోచేతులు కలపండి. ముక్కలైపోయిన హృదయంతో, ఎంతో ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి దీన్ని అందరూ షేర్ చేయండి. మౌనంగా ఉండకండి' అంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సహా పలువురు రీట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) pic.twitter.com/q92voLc7Gi — Prithviraj Sukumaran (@PrithviOfficial) August 16, 2021 -
అఫ్గానిస్తాన్: ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి
-
మళ్లీ నరకంలోకా?.. మా వల్ల కాదు
అఫ్గనిస్తాన్ వశమైందని తాలిబన్లు సంబురాల్లో మునిగిపోతుంటే.. అంతర్జాతీయ సమాజంతో పాటు అఫ్గన్‌లోని పౌరులు సైతం ఆందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా అఫ్గన్ ఆడవాళ్లు తమ బతుకులు మళ్లీ చీకటి పాలవుతాయని భయపడుతున్నారు. #AfganWomen హ్యాష్‌ట్యాగ్ ద్వారా తమ ఆందోళనను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందన్న వార్త బయటకు రాగానే.. 33 ఏళ్ల ఖటేరా సోషల్ మీడియా సాక్షిగా తమను కాపాడడంటూ కన్నీళ్లతో వేడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘజ్ని ప్రావిన్స్‌కు చెందిన ఖటేరా.. అక్కడ పోలీసాధికారి. కిందటి ఏడాది తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. ఆపై ఆమె కనుగుడ్లను పెకిలించి.. నరకం చూపించారు. అదృష్టవశాత్తూ ఆమె బతికింది. భారత్‌లోనే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించగా.. కిందటి ఏడాది నవంబర్ నుంచి ఆమె ఢిల్లీలోనే నివసిస్తోంది. దారుణం ఏంటంటే.. ఆమెపై దాడి చేసిన తాలిబన్ ముఠాకు ఆమె తండ్రే నాయకుడు కావడం. ఇది చదవండి: ఆఫ్ఘనిస్తాన్.. ఓ అందమైన నరకం తాలిబన్ల హింస ఎంత ఘోరంగా ఉంటుందో నేను ఉదాహరణ. అదృష్టవశాత్తూ నా ఆర్థిక స్థితి వల్ల బతికాను. అందరి పరిస్థితులు అలా లేవక్కడ. తాలిబన్ల క్రూరత్వం వర్ణించలేనంతగా ఉంటుంది. అత్యాచారాలు చేస్తారు. బుల్లెట్లను ఒంట్లోకి దింపుతారు. చంపేసి కుక్కలకు ఆ మాంసం వేస్తారు. అలాంటిది ఇప్పుడు ఆక్కడ ఆడవాళ్ల పరిస్థితిని తల్చుకుంటే భయం వేస్తోంది. పిల్లలను కూడా వదలరు వాళ్లు అంటూ చెప్పుకొచ్చింది ఖటేరా. There’s enormous danger for #AfghanWomen and girls —especially educated women with powerful voice — in #Kabul #Afganistan now. “Please don’t forget Afganistan, all our great women and their voices. Just present us in a very good way.”@IkaFerrerGotic speaks to Fatimah Hosseini♥️ pic.twitter.com/GdwmFyOsmi — AIDA (@Aidazzles) August 15, 2021 చదవండి: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు అఫ్గన్‌లో పరిస్థితులపై అగ్రదేశాల నుంచి నిస్పహాయత వ్యక్తం అవుతున్న తరుణంలో.. ఆడవాళ్ల భద్రత గురించే ఎక్కువ చర్చ మొదలైంది. ఆడవాళ్లను చూస్తే తాలిబన్లకు బుర్ర పని చేయదు. వాళ్ల దృష్టిలో ఆడవాళ్లంటే సెక్స్ బానిసలు. ద్వేషం వెల్లగక్కుతుంటారు. కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూస్తారు. ఆచారాల పేరుతో చదువుకోనివ్వరు. నచ్చిన బట్టలు వేసుకోనివ్వరు. పని చేయనివ్వరు. రాళ్లతో, కొరడాలతో కొట్టి చంపేస్తారు. చికిత్స కోసం మగ డాక్టర్ల దగ్గరకు సైతం వెళ్లనివ్వరు. చెప్పింది వినకుంటే.. ప్రాణాలు తీయడమే వాళ్లకు తెలుసు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎన్నో కలలు నిర్మించుకున్నారు వాళ్లు. చదువుకున్నారు. చక్కటి కెరీర్‌ను మల్చుకున్నారు. తాలిబన్ల రాకతో అవన్నీ ఇప్పుడు కూలిపోవాల్సిందే అని శోకంలో మునిగిపోతున్నారు అక్కడి వాళ్లు. జులై మొదటి వారంలో బాడాక్షన్, తక్‌హర్ ప్రావిన్స్‌లో ఆడవాళ్ల జాబితాను తయారు చేయించి.. తమ బృందంలోని వాళ్లను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మళ్లీ పాతతంతు మొదలుపెట్టారనే విమర్శ మొదలైంది. అయితే మహిళల విషయంలో ఇంతకు ముందులా హింసకు పాల్పడబోమని, కానీ, కఠిన ఆంక్షల్లో చాలామట్టుకు కొనసాగిస్తామని ప్రకటించుకుంది. Reports of young girls being raped and enslaved in Afghanistan by the Taliban is horrifying to hear. What was the use of ISAF's two-decade-long presence if they couldn't protect the most vulnerable? Our prayers for the safety of Afghan people. #AfghanWomen — Pranitha Subhash (@pranitasubhash) August 16, 2021 -
అఫ్గానిస్తాన్‌లో ఆ ఆరుగురు కీలకం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ముఠా వ్యవస్థాపకుడైన ముల్లా మొహమ్మద్ ఒమర్ అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2013లో మరణించాడు. ఈ విషయం రెండేళ్ల తర్వాత అతడి కుమారుడు స్వయంగా ప్రకటించడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. ఒమర్ మరణం తర్వాత తాలిబన్లలో ఆరుగురు వ్యక్తులు కీలక నాయకులుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ ఆరుగురే తాలిబన్లకు మార్దనిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారు ఎవరంటే.. హైబతుల్లా అఖుంజాదా దాదాపు 60 ఏళ్ల వయసున్న హైబతుల్లా అఖుంజాదా మతం పట్ల నిష్ట కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. తాలిబన్ రాజకీయ, మత, సైనిక వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించాడు. ఇస్లామిక్ న్యాయ నిపుణుడైన హైబతుల్లాను తాలిబన్ సుప్రీం లీడర్‌గా పరిగణిస్తుంటారు. 2016లో అఫ్గాన్–పాకిస్తాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన అఖ్తర్ మన్సూర్ నుంచి అతడు ఈ బాధ్యతలు స్వీకరించాడు. అంతకు ముందు పాకిస్తాలోని కుచ్లాక్‌లో ఓ మసీదులో మత గురువుగా పనిచేశాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తాలిబన్లకు తప్ప ఎవరికీ తెలియదు. ముల్లా మొహమ్మద్ యాకూబ్ తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడే ఈ యాకూబ్. తాలిబన్ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంటాడు. ప్రస్తుతం అఫ్గాన్‌లోనే ఉన్నాడు. 2016లో తాలిబన్లకు సుప్రీం లీడర్ కావాల్సిన యాకూబ్ తాను ఇంకా కుర్రాడినేని, తగిన అనుభవం లేదన్న కారణంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం అతడికి దాదాపు 30 ఏళ్ల వయసుంటుందని సమాచారం. సిరాజుద్దీన్ హక్కానీ ముజాహిదీన్ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ. అఫ్గాన్‌లో హక్కానీ నెట్‌వర్క్‌కు లీడర్‌గా చెలామణి అవుతున్నాడు. పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నాడు. తాలిబన్ ఆర్థిక, సైనిక వ్యవహారాలు, నిధుల సేకరణ, పంపిణీ వంటివి ఇతడి కనుసన్నల్లోనే సాగుతుంటాయి. ఆత్మాహుతి దాడులు చేయడంలో హక్కానీలు దిట్టలు. సిరాజుద్దీన్ వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం అతడి జాడ తెలియదు. ముల్లా అబ్దుల్ గనీ బరాదర్, షేర్ మహమ్మద్ అబ్బాస్, అబ్దుల్ హకీం హక్కానీ సైతం తాలిబన్ బృందంలో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందారు. -
అందమైన నరకం ఆఫ్ఘనిస్తాన్
‘తాలిబ్’ అంటే పష్తో భాషలో విద్యార్థి అని అర్థం. పాక్ మదర్సాల్లో చదువుకునే స్టూడెంట్ మిలీషియా తాలిబన్లుగా రూపాంతరం చెందింది. తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టం అమలు చేయడం, తమ భూభాగాలపై పాశ్చాత్య బలగాలను తరిమికొట్టడం వీరి ప్రాథమిక లక్ష్యాలు. ఏవి తల్లీ? నిరుడు కురిసిన హిమ సమూహములు? అన్న మహాకవి శ్రీశ్రీ భావంలోని బాధ అఫ్గానిస్తాన్‌కు సరిగ్గా సరిపోతుంది. సింధునాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుపొంది, రుగ్వేద కాలంలో సువాసనల భూమిగా ప్రాముఖ్యత వహించి, మహాభారత యుద్ధం నాటికి మహాసామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పటి సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగం వచ్చేసరికి అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. స్థిరమైన పాలన లోపించడంతో మతఛాందస మూకలకు నిలయమైంది. పౌరహక్కుల హననం, నిత్య యుద్ధాలతో అఫ్గాన్ అలసిపోయింది. (చదవండి: అఫ్గానిస్తాన్‌లో ఆ ఆరుగురు కీలకం) ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు ఘనీ అధికారాన్ని తాలిబన్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్లు, ఇటు ఇతర దేశాలు అనుభవించిన ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అఫ్గాన్ రక్త చరిత్రకు కారణాలేంటి? ప్రపంచ భవితవ్యానికి, ఈ ప్రాంతానికి లింకేంటి? చూద్దాం! అశ్వకన్, అస్సాకన్ అనే పేరు నుంచి అఫ్గాన్ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ ఎక్కువగా అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమంగా అఫ్గానిస్తాన్‌గా మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష. భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంవారిని అవగాన అని తన బృహత్సంహితలో ప్రస్తావించాడు. 1919 లో దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అధికారికంగా ’అఫ్గానిస్తాన్’ అనే పదాన్ని ప్రామాణికం చేసి 1923లో రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు. 1919 మూడో ఆంగ్లో అఫ్గాన్ యుద్ధానంతరం ఈ ప్రాంతం స్వాతంత్య్రం పొందింది. పిమ్మట చాలాకాలం అమానుల్లాఖాన్ తదితరుల నేతృత్వంలో రాజరికం నడిచింది. అఫ్గానిస్తాన్ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో ప్రబలిందనేందుకు షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గాంధార రాజ్య పతనానంతరం జొరాష్ట్రియన్ మతం ఇక్కడ ప్రబలింది. ఆ కాలంలో దీన్ని అరియానా అని పిలిచేవారు. తర్వాత కాలంలో మౌర్యులు, కుషాణులు, మంగోలులు, అరబ్బులు, బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. అరబ్బుల దండయాత్రల అనంతరం ఇతర మతాలు దాదాపు క్షీణించి ముస్లింల ప్రాబల్యం పెరిగింది. ఆధునికయుగంలో 1747లో అహ్మద్ షా దురానీ తొలిసారి కాందహార్ రాజధానిగా అఫ్గాన్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. 1776లో రాజధాని కాబూల్‌కు మారింది. తొలి ఆంగ్లో అఫ్గాన్ యుద్ధానంతరం ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటీష్ పాలనలో ఉంది. 1973లో జహీర్‌షాపై జరిగిన తిరుగుబాటు అనంతరం రిపబ్లిక్‌గా మారింది. 1978 తిరుగుబాటు తర్వాత సోషలిస్టు రాజ్యం రూపాంతరం చెందింది. కానీ తిరుగుబాట్లు అధికం కావడం, రష్యాతో ముజాహిద్దీన్ల యుద్ధంతో అస్థిరత నెలకొంది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి ఊచకోత కోసింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన హమీద్ కర్జాయ్ అధ్యక్షుడయ్యారు. 2014లో అష్రాఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఎన్నికై ఆదివారం దాకా పాలించారు. ఇరవైఏళ్ల తర్వాత అమెరికా బలగాల ఉపసంహరణ చేపట్టడం అఫ్గాన్‌కు అశనిపాతంగా మారింది. అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రాజధాని కాబూల్‌లోకి వచ్చేశారు. -
కాబూల్ నుంచి భారతీయులు వెనక్కి!
న్యూఢిల్లీ/కాబూల్/వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్ అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే సిబ్బందితోపాటు భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశాయి. ఒకవేళ వారిని అత్యవసరంగా వెనక్కి తీసుకొని రావా ల్సి వస్తే అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అఫ్గాన్‌లోని తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సి–17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. అలాగే కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 129 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం(ఏఐ–244) ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. రాత్రి 7.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. మిగిలింది విమాన మార్గమే కాబూల్ సరిహద్దులన్నీ మూసుకుపోయాయి. కాబూల్ సమీపంలోని జలాలాబా ద్‌ను సైతం తాలిబన్లు ఆక్రమించడంతో నగరం మొత్తం దిగ్భంధనంలో చిక్కుకున్నట్లయ్యింది. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే మిగిలింది. స్వదేశానికి తిరిగి వెళ్లేవారితో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోతోంది. చాలామంది తమ సామానుతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ను బాహ్య ప్రపంచంతో అనుసంధానించడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగేలా సహకారం అందిస్తున్నట్లు ‘నాటో’ ప్రకటించింది. -
Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్ రాజ్యం
కాబూల్: అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు. అమ్మో... తాలిబన్ పాలన కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు అఫ్గానిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది. కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్లో గుల్బుదీన్ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్ సైనికులకు హామీద్ కర్జాయ్ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తేల్చిచెప్పారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అఫ్గానిస్తాన్ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు! కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. ‘కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్ విల్సన్ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు సహకరించేందుకు వీరిని కువైట్ నుంచి తరలించినట్లు తెలిపింది. అధ్యక్ష భవనం స్వాధీనం అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది. -
తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘన్ ప్రభుత్వం? ఘనీ రాజీనామా!
కాబూల్ : ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయినట్లు.. దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్ బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో శాంతయుత చర్యల్లో భాగంగా ఘనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ప్రజలకు హాని తలపెట్టమని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్లు దురాక్రమణకు పాల్పడుతున్నారు. దేశంలో తాలిబన్ బలగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాత్రి జలాలాబాద్ నగరాన్ని ఆక్రమించాయి. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల దురాక్రమణపై ఐరాస సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని చెప్పారు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ నుంచి అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తోంది. కార్యాలయ సిబ్బందితో పాటే ఆఫ్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ కూడా అమెరికా వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని స్వదేశానికి తిరిగి రావాలని ఇప్పటికే విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
తాలిబన్ల పైచేయి: ఇక మిగిలింది రెండే ఆప్షన్లు!
సైన్యం నుంచి పోరు, ప్రతిఘటనలు లేకుండానే అఫ్ఘనిస్తాన్.. పూర్తిగా తాలిబన్ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు ప్రధాన పట్టణాలన్నీ ఆదివారం ఉదయం నాటికల్లా తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఏ క్షణమైనా తమ ఆధిపత్యాన్ని తాలిబన్లు ప్రకటించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క కాబూల్ మినహా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోకి తాలిబన్ దళాలు చొచ్చుకెళ్లాయి. శనివారం మజర్–ఏ–షరీఫ్‌ను చుట్టుముట్టి బైకులు, వాహనాలపై పరేడ్ నిర్వహిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు తాలిబన్లు. మజర్‌ను ఆక్రమించిన కొద్ది గంటలకే.. తూర్పు నగరం జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి రాగా.. ఆదివారం ఉదయం కల్లా మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు. ‘తెల్లారి చూసేసరికి తాలిబన్లు తెల్ల జెండాలను పాతారు. ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొకుండానే వాళ్లు ఊళ్లోకి ప్రవేశించారు’ అని జలాలాబాద్‌కు చెందిన ఓ స్థానికుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. శనివారం జాతిని ఉద్దేశించి ‘అఫ్గాన్ల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోం. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించం’ అంటూ గంభీర ప్రకటనలు చేసిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. సైన్యంలో ధైర్యం నింపడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు. 48 గంటల్లోగా రాజకీయ మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అష్రాఫ్ ప్రకటించడం, ఆపై కొన్ని గంటలకే మజర్–ఏ–షరీఫ్, జలాలాబాద్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం విశేషం. దీంతో తాలిబన్ల ఆక్రమణ దాదాపు పూర్తి అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక లొంగిపోవడమో లేదంటే హోరాహోరీగా పోరాడడమో అనే ఆప్షన్లు మాత్రమే అఫ్ఘన్ ప్రభుత్వం ముందు మిగిలాయని అంచనా వేస్తున్నారు. ఇది చదవండి: సైన్యం-తాలిబన్ల ఘర్షణ, ఎలా మొదలైందంటే.. అమెరికా బలగాల పని ఇదిలా ఉంటే తాలిబన్ దాడుల నేపథ్యంలో కాబూల్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరుల తరలింపు కోసం సైన్యాన్ని రంగంలోకి దించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. ఈ మేరకు ఇదివరకే భారీగా సైన్యం చేరుకోగా, మరికొంత మంది ఆదివారం రాత్రికల్లా చేరుకునే అకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు కూడా. మరోవైపు ఎటుచూసినా తాలిబన్లను ఎదుర్కొకుండా ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి స్వచ్ఛందంగా లొంగిపోతోంది అఫ్గన్ సైన్యం. 1994లో అఫ్గన్ అంతర్యుద్ధంలో బలమైన విభాగంగా ఎదిగిన తాలిబన్లు.. 1996 నుంచి 2001 వరకు మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ప్రకటించుకున్న తాలిబన్లు, అఫ్ఘనిస్థాన్‌లో అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా దళాలు తాలిబన్లను అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న పరిణామాల తర్వాత 75వేల సభ్యులతో తాలిబన్ తిరిగి అఫ్ఘన్ ఆక్రమణకు తిరిగి ప్రయత్నించి.. లక్క్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. విష ప్రచారం యువతులను బలవంతంగా తాలిబన్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారనే కథనాలను తాలిబన్ సంస్థ కొట్టిపడేసింది. ఇదంతా ఆఫ్ఘన్ ప్రభుత్వం చేస్తున్న విషపూరిత ప్రచారంగా పేర్కొంది. తాలిబన్ ప్రతినిధి సుహాలీ షాహీన్ ఈ మేరకు వరుస ట్వీట్లలో ఆ ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనాలతో కుట్రను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మరోవైపు అమెరికా, భారత్ సహా ఏ దేశం అయినా సరే అఫ్గన్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించలేదని తాలిబన్లు హెచ్చరించారు కూడా. 1/2 Recently the Kabul Adm has launched baseless and vicious propaganda, sometimes claiming, the Islamic Emirate forces people to marry their daughters, or to marry them to the Mujahidin. Sometimes they say that the Mujahidin are killing people, killing prisoners and captives, — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) August 14, 2021 -
కాబూల్ శివార్లలో తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశమయ్యే సమయం దగ్గర పడుతోంది. కాబూల్ శివార్ల దాకా తాలిబన్లు చొచ్చుకొని వచ్చి సరిగ్గా 11 కి.మీ. దూరంలో తిష్టవేసుకొని కూర్చున్నారు. దేశ రాజధాని కాబూల్‌ని ముట్టడించే పని ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైతే మరోసారి దేశం అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది చెప్పారు. అఫ్గాన్ నుంచి అమెరికా ఈ నెల 31న చివరి విడత బలగాలను ఉపసంహరించాల్సి ఉండగా, దానికి రెండు వారాల ముందే తాలిబన్లు కాబూల్‌లో తమ జెండాని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో ఐదు ప్రావిన్స్‌లను ఆక్రమించుకున్నారు. లోగర్ ప్రావిన్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. అయినప్పటికీ తాలిబన్ల ధాటికి అఫ్గాన్ దళాలు నిలవలేకపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న పక్తికా ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు ఆ ప్రావిన్స్ ప్రజాప్రతినిధి ఖలీద్ అసాద్ వెల్లడించారు. ఆ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన సహరానా తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలోని దాదాపుగా ముప్పావు వంతు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కీలక నగరాలైన హెరాత్, కాందహార్లు (దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలు) ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్ల జెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్న తాలిబన్లు మజార్ ఏ షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని)ను ఆక్రమించుకోవడానికి ముప్పేట దాడి చేశారు. భీకరపోరు తర్వాత శనివారం రాత్రి మజార్ ఏ షరీఫ్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఫర్యాబ్, కునార్ ప్రావిన్స్‌లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి. ఉలిక్కిపడిన అమెరికా, కాబూల్‌కు 3 వేల బలగాలు తాలిబన్లు చెలరేగిపోతూ వాయువేగంతో ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉండడంతో అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి 3 వేల మంది భద్రతా బలగాలను పంపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం కావడంతో ఆగస్టు 31 నాటికి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోగలదా లేదా అన్న సందేహాలైతే ఉన్నాయి. మూడువేల బలగాల్లో కొంతమంది శుక్రవారం కాబూల్‌కు చేరుకోగా... మిగతా వారు ఆదివారం నాటికి రానున్నారు. ఈ బలగాలు కాబూల్ చేరుకొని దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకువస్తాయి. తాలిబన్లు కాబూల్ చేరే లోపు అమెరికా చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికాకి చెందిన సైనికులు వెయ్యి మంది మాత్రమే ఉండడంతో తమ సిబ్బందిని తరలించడం కష్టమవుతుందనే అంచనాతోఅప్పటికప్పుడు 3 వేల మంది సైనికుల్ని పంపింది. క్షణక్షణం బతుకు భయం అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండడంతో ప్రజల్లో రోజు రోజుకీ ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇక ముందు తమ బతుకులు ఎలా ఉంటాయోనని తలచుకుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. మజర్–ఏ–షరీఫ్ చుట్టూ తాలిబన్లు మోహరించి ఉండడంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని నగరవాసి మొహిబుల్లా ఖాన్ చెప్పారు. సుస్థిరతకే కృషి: అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌లో సుస్థిరత ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలను తిరిగి సమాయత్తపరచడానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కాబూల్ శివార్లకి చేరుకున్న నేపథ్యంలో ఘనీ రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోతారని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అంతర్జాతీయ మీడియా ఇక ఘనీ పని అయిపోయినట్టుగా కథనాలు రాసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. అఫ్గాన్లపై యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన రాజీనామా విషయంపై వస్తున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, యుద్ధ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పాటు చేయడానికి రాజకీయ పక్ష నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పారు. శాంతి, సుస్థిర స్థాపనకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఘనీ స్పష్టం చేశారు. ► 22: అఫ్గాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లలో 22 ఇప్పటికే తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయాయి ► 5: శనివారం తాలిబన్ల వశమైన ప్రావిన్స్‌లు ► 3000: కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించేందుకు అమెరికా అత్యవసరంగా 3వేల మంది సైనికులను పంపుతోంది -
కాబుల్ వైపు దూసుకొస్తున్న తాలిబన్ సైన్యం.. 15 కిలో మీటర్ల దూరంలో
కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో పలు ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోని తెచ్చుకుంటున్నాయి. అందులో భాగంగా తాలిబన్ సైన్యం దేశ రాజధాని కాబుల్ వైపు దూసుకువెళ్తోంది. కాబుల్‌కు దక్షిణాన ఉన్న నగరాన్ని తాలిబన్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆమెరికా బలగాలు రాయబార కార్యాలయాన్ని, ఇతర పౌరులను ఖాళీ చేయటంలో సహాయ పడుతున్నాయి. కాబుల్‌కు సమీపంలోని మైదాన్ వార్దక్ ప్రావిన్స్ రాజధాని మైదాన్ షార్ పట్టనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో రాజధాని వైపు దూసుకోస్తున్నారు. ప్రస్తుతం కాబుల్‌కు 15 కీలో మీటర్ల దూరంలో తాలిబన్ బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారంముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్ఘనిస్తాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు పేర్కొన్నారు. #Taliban are less than 15 kilometers away from #Kabul after they captured the town of Maidan Shar, capital of Maidan Wardak Province,#Afganistan pic.twitter.com/KZyLn02lAQ — Muhammad Waqas Khan (@AllahuAkbarr313) August 14, 2021 -
బిగుతు దుస్తులు ధరించిందని యువతిని కాల్చేశారు..!
కాబూల్: అఫ్గానిస్తాన్ భూభాగంపై తాలిబాన్ ఆధిపత్యం రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో బిగుతు దుస్తులు ధరించిన ఓ యువతిని తాలిబన్లు కాల్చి చంపారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం... అఫ్గాన్ ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్‌లో ఓ యువతి బిగుతు దుస్తులు ధరించడమే కాకుండా మగ తోడులేకుండా వచ్చిందన్న కారణంతో తాలిబన్లు హత్య చేశారు. ఈ ఘటన తాలిబన్ నియంత్రణలో ఉన్న సమర్ ఖండ్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. యువతి తన ఇంటి నుంచి మజార్-ఇ-షరీఫ్ వెళ్లడానికి వాహనం ఎక్కుతుండగా ఆమెపై దాడి జరిగింది. బాధితురాలిని నజానిన్(21) గా గుర్తించారు. అయితే ఆమెపై దాడి జరిగినప్పుడు తను బుర్ఖా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తాలిబన్ నియంత్రణలో నివసిస్తున్న అఫ్గాన్ మహిళలు బిగుతు దుస్తులు ధరించి బయట పని చేయవద్దని వారు హుకుం జారీ చేశారు. ఇక అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో.. తాలిబన్లు క్రమంగా అక్కడి భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ రాజధానిలోని కొన్ని భాగాలను ఆదివారం తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. -
అఫ్గానిస్తాన్‌లో సైన్యం, తాలిబన్ల ఘర్షణలపై ఐరాస ఆందోళన
ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్‌లో సైన్యం, తాలిబన్ల ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్త చేసింది. అఫ్గానిస్థాన్‌లో 24 గంటల్లో 40 మంది పౌరులు మృతి ఐరాస తెలిపింది. ఘర్షణల్లో మరో వందమందికి పైగా పౌరులకు గాయాలైనట్లు ఐరాస పేర్కొంది. ఏం జరిగింది..! అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 2001 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించాయి. బగ్రామ్ ఎయిర్ బేస్‌ను 10 వేలమంది సైనికులతో తమ స్థావరంగా మార్చుకున్నాయి. అయితే ఇరవై ఏళ్ల పాటు సాగిన యుద్ధం తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంది. అమెరికా, దాని మిత్ర దేశాలకు బగ్రామ్ వైమానిక స్థావరం కీలకమైన ప్రాంతంగా ఉండేది. విదేశీ సేనలు ఇప్పుడు ఆ స్థావరాన్ని ఖాళీ చేశాయి. ఏం జరుగుతోంది..! విదేశీ సైన్యాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు మళ్లీ విస్తరించే పనిని ప్రారంభించారు. అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల అరాచకాలు పెరగడంతో ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకొని భయం భయంగా బతుకుతున్నారు. తాజాగా కాందహార్‌లో తాలిబన్లు మరోసారి పేట్రేగిపోయారు. కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. మూడు రాకెట్లతో దాడి చేయగా.. ఎయిర్ పోర్టు రన్ వేను తాకి తీవ్రంగా దెబ్బ తిన్నది. దీంతో కాందహార్ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలను నిలిపివేసి రన్ వే మరమ్మతులు చేస్తున్నారు. -
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల స్థావరాలపై దాడి.. వందల మంది మృతి
కాబూల్: కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది తిరుగుబాటుదారులు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా తాబిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ఆక్రమించుకున్న గ్రామీణ భూభాగంలో ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కీలక సరిహద్దు క్రాసింగ్లను స్వాధీనం చేసున్నారు. ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్ రాజధానులను ముట్టడించారు. ఇక శనివారం రాత్రి తాలిబన్లు కంధర్‌లోని విమానాశ్రయంపై మూడు రాకెట్లను ప్రయోగించారు. దీంతో రన్‌వే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయంపై దాడి, లాజిస్టికల్, ఎయిర్ హెల్ప్ కోసం చాలా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని తాలిబన్ల బారి నుంచి కాపాడుకోవాలనుకున్నారు. ప్రస్తుతం హెల్మాండ్ ప్రావిన్స్‌లోని లష్కర్ గాహ్ దగ్గరగా రెండు వేర్వేరు ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అఫ్గానిస్థాన్ అధికారులు వేసవి కాలంలో తాలిబన్ల ఉనికిని పదేపదే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. #Taliban terrorists hideouts were targeted by #AAF in Zherai district of #Kandahar province yesterday. Tens of #terrorists were killed and wounded as result of the #airstrike. pic.twitter.com/mM1uVyeXMu — Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021 11 #Taliban terrorists were killed and another was wounded in operations conducted by #ANDSF with support from #AAF in Panjwae district & at the outskirts of #Kandahar provincial center, yesterday. Also, 7 weapons and some amount of their weapons & amos were destroyed. pic.twitter.com/nsDbdUyiBo — Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021 -
అఫ్గాన్‌లో స్కూల్ వద్ద భారీ పేలుడు, 55 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ పశ్చిమ ప్రాంతంలో శనివారం తీవ్ర బాంబు పేలుడు సంభవించింది. అఫ్గాన్‌లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలోని ఓ బాలికల స్కూల్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 150మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11-15 ఏళ్ల మధ్య విద్యార్థినులే అని అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తాము కాదం టూ తాలిబాన్ ప్రకటించింది. మరే ఇతర ఉగ్రసంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించుకోలేదు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారికి రక్తదానం చేసేందుకు భారీ స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల వద్దకు చేరారు. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్‌లో మైనారిటీ షియాలపై ఉగ్రసంస్థ ఐసిస్ విరుచుకుపడుతోంది. ఇటీవలే ఓ బాంబు పేలుడు జరిపి పలువురు ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ స్పందిస్తూ, ఇలాంటి హీనమైన పేలుళ్లకు పాల్పడేది ఐసిస్ మాత్రమే అని పేర్కొంది. అఫ్గాన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ సైతం ఐసిస్‌కు సాయపడుతోందని ఆరోపించింది. (చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్ నుంచి బలగాలు వెనక్కి) -
సైనికులపై విరుచుకుపడ్డ తాలిబన్లు: 16 మంది మృతి
కాబూల్: సైనికులపై తాలిబన్లు మూకుమ్మడి దాడి చేశారు. కనిపించిన వారిని కాల్చి పడేశారు. దీంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖాన్ అబాద్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలపై ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్లు తపాయి అక్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగపడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో కాల్పులు జరపడంతో దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు దాడికి పాల్పడ్డ వారిని కనిపెట్టే పనిలో పడ్డాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. తాలిబన్ల ఆచూకీ కోసం బలగాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. రెండు రోజుల కిందట తాలిబన్లపై భద్రతా బలగాలు దాడి చేసి 15 మందిని ఎన్కౌంటర్ చేయగా దానికి ప్రతిచర్యగా తాలిబన్లు ఈ దాడికి తెగపడ్డారు. దీంతో 16మందిని బలి తీసుకున్నారు. -
15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు
కాబూల్ : అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో 15 మంది బాలలు మృత్యుఒడికి చేరగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. తాలిబన్ అదీనంలో ఉన్న ఘజ్ని ప్రావిన్స్ గిలాన్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరు వ్యాపారి ఒకరు రిక్షాలో రకరకాల వస్తువులను తీసుకుని ఓ గ్రామానికి వెళ్లగా పిల్లలంతా అతడి చుట్టూ మూగారు. ఇంతలోనే, రిక్షాకు అమర్చిన బాంబు పేలి 15 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించుకోలేదు. -
వరుస రాకెట్ దాడులతో వణికిన కాబూల్
కాబూల్: ఆప్గానిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం ఉదయం వరుస రాకెట్ లాంఛర్ దాడులతో వణికిపోయింది. వరుసగా 23 రాకెట్లు దూసుకొచ్చాయని ఆప్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియాన్ ధృవీకరించారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు, 31 మంది గాయపడ్డట్లు తారిఖ్ ప్రకటించారు. ఈ దాడికి తాలిబన్లు కారణం అని ఆయన ఆరోపించారు. కాబూల్ లోని సెంట్రల్,ఉత్తర ప్రాంతాలలో దాడి జరిగింది. ఈ ప్రదేశం అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం ఈ దాడి చేసింది తాలిబన్లు అని ప్రకటించగా, తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముబాహిద్ ఖండించాడు. గత కొంతకాలంగా కాబూల్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని వారాల క్రితం రెండు యూనివర్శిటీపై దాడి జరిగింది. అటు తరువాత జరిగిన మరో దాడిలో దాదాపుగా 50 మంది ప్రజలను కాల్చి చంపారు. ప్రతిసారి దాడులు చేసింది తాలిబన్లు లేదా వారు పోషిస్తున్నజిహద్ శక్తులేనని ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తాలిబన్లు మాత్రం దాడులు చేస్తోందని మా సంస్థలు కాదని, ఇలా చేసే వారు మా పేరును వాడుకుంటున్నారని చెప్తుతున్నారు. మేము ప్రజలపై దాడులు చేయమని అంటున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ జరుగుతుందని,దానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసామని, దానికే కట్టుబడి ఉన్నామని తాలిబన్లు వాదిస్తున్నారు. కాగా, ఇటీవల విద్యాసంస్థలపై దాడులు చేసింది భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అని తనకు తానే ప్రకటించుకుంది. ఈ రోజు(శనివారం) దాడి చేసింది పాకిస్థాన్ ప్రేరిత ఉగ్ర సంస్థ హక్కానీ నెట్వర్క్ అని తాలిబన్ ప్రకటించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లోఉగ్రవాదుల చేసిన మారణహోమం తాలుకూ వివరాలను ప్రకటించారు. తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1,250 పేలుళ్లు జరిపారని అందులో 1,210 మంది పౌరులు మరణించగా, 2,500 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ప్రకటించారు. మరోవైపు శనివారం ఉదయం రెండు చిన్న "స్టిక్కీ బాంబు" పేలుళ్లు సంభవించాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిలో ఒకటి పోలీసు కారును ఢీకొట్టింది ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
కాబూల్ వర్సిటీలో కాల్పులు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది మృతి చెందడంగానీ, గాయపడటంగానీ జరిగిందని అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, ఎంతమంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 20 మంది మరణించి ఉంటారని అంచనా. యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా తుపాకులతో కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి ఈ పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వర్సిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వర్సిటీకి దారితీసే రోడ్లను మూసివేశారు. ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల ఎదురుదాడిలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కాబూల్ విశ్వవిద్యాలయంలో కాల్పులు తామే జరిపామంటూ ఇప్పటిదాకా ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన జారీ చేయలేదు. సాయుధులైన ఉగ్రవాదులు కాబూల్ యూనివర్సిటీపై జరిపిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. -
వర్సిటీపై దాడి: 19 మంది విద్యార్థులు మృతి
ఆప్ఘనిస్తాన్: కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో నిర్వహించబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. -
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి
కాబూల్ : అఫ్గానిస్తాన్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీసు కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌లో ఉగ్రవాది కరు బాంబర్‌తో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో పోలీసు కమాండర్‌తో సహా నలుగురు అధికారులు మృతి చెందినట్లు స్థానిక అధికారి పేర్కొన్నారు. మరోవైపు అఫ్గాన్ దక్షిణ భాగంలో ఉన్న ఖేవా జిల్లాలోని ఒక మార్కెట్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరో ముగ్గురు అధికారులు మరణించగా, 11 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టాహుల్లా ఖోగ్యాని తెలిపారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారిక సమాచారం లేదు. గత కొన్ని రోజులుగా తాలిబన్ , ఇస్లామిక్ స్టేట్ గ్రూఫ్ ఆఫ్ఘన్లో వరుస దాడులకు పాల్పడుతున్నాయి. -
కాబూల్ కేంద్రంగా మరో కుట్రకు జైషే స్కెచ్
కాబూల్ : భారత్‌లో భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ యూనిట్లలో 400 మంది జైషే ఉగ్రవాదులను మోహరించింది. వారిని భారత్‌లో ఉగ్ర దాడులతో హోరెత్తించేందుకు కశ్మీర్ లోయకు పంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 12న చేపట్టిన ఆపరేషన్‌లో ఆప్ఘన్ దళాలు ఓ ఉగ్ర శిబిరంలో ఈ తరహా కార్యకలాపాలను గుర్తించారని సమాచారం. ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన ఉగ్రవాదులను విచారించడంతో ఆప్ఘన్లో దాదాపు ఈ తరహా క్యాంపులు ఆరు వరకూ ఉండవచ్చని భారత భద్రతా, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ శిబిరాల్లో జైషే మహ్మద్ 400 మంది ఉగ్రమూకను సంసిద్ధంగా ఉంచిందని ఢిల్లీ, కాబూల్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక మిషన్ అధికారులు పేర్కొన్నారు. ఖోస్థ నుంచి జలాలాబాద్ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు కాందహార్ ప్రావిన్స్‌లోని పాక్ సరిహద్దుల్లోని తాలిబాన్ యూనిట్లలో జైషే క్యాడర్‌ను మోహరించారని కాబూల్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన అధికారి వెల్లడించారు. మరోవైపు ఐఎస్ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే ఉగ్రవాదులను కూడా ఈ శిబిరాల్లోకి పంపారని అధికారులు చెబుతున్నారు. చదవండి : పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్ -
తొలి విదేశీ కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురుద్వారాపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇది ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న మొట్ట మొదటి విదేశీ కేసు కావడం విశేషం. ఎన్ఐఏ చట్టంలో సవరణ చేయడంతో విదేశాల్లో కేసులను దర్యాప్తు చేసే అధికారం దక్కింది. దీని ప్రకారం భారత్ వెలుపల భారతీయులపై ఎటువంటి ఉగ్రవాద దాడులు జరిగినా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంతేకాదు భారత్ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా జరిగే ఘటనలపైనా ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తుంది. కాగా, మార్చి 25న గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడితో పాటు 27 మంది మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఐపీసీ, తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసీస్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) ప్రకటించుకుంది. (కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!) -
11 మంది మృతి: ‘మాకు సంబంధం లేదు’
కాబూల్ : అఫ్గనిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. దేశ రాజధానిలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌లోని షోర్ బజార్ ప్రాంతంలోని గురుద్వార లక్ష్యంగా ఉదయం ఏడున్నర గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ 11 మందిని పొట్టనబెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం గురించి అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ ఏరియన్ మాట్లాడుతూ... షోర్ బజార్‌లోని ధరమ్‌శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు తెగబడ్డాయని వెల్లడించారు. అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. గురుద్వార లోపల చిక్కుకుపోయిన సిక్కులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా... తమకు ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించింది. కాగా అఫ్గాన్‌లో సిక్కులపై దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. ‘‘గురుద్వారపై ఆత్మాహుతి దాడి ఖండించదగినది. వివిధ దేశాల్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన దాడులకు ఇది నిదర్శనం. మత స్వాతంత్ర్యం, స్వేచ్చను కాపాడాల్సిన సమయం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా... తమకు ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించగా... ఇది తమ పనే అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన విడుదల చేసింది. -
ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌లో భారీ బాంబు పేలుళ్లు
-
కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి
కాబూల్ : అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం కాబూల్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 10 మంది మృతిచెందగా, 42 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు. అఫ్గాన్ ప్రభుత్వ కార్యాలయాలు, యూఎస్ ఎంబసీ సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద ఈ దాడి జరిగింది. కాబూల్‌లో అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఈ దాడి జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రత బలగాలు ఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. విదేశీ బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యాలు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు, తాలిబన్లకు, యూఎస్ బలగాలకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు అఫ్గాన్‌లో ఇటువంటి దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ వారంలో తాలిబన్లు జరిపిన రెండో దాడి ఇది. సోమవారం జరిగిన ఆత్మహుతి దాడిలో 16 మంది మృతి చెందగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. -
పెళ్లిలో పేలిన మానవబాంబు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ ఆత్మాహుతి దాడి సంభవించింది. పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన పేలుడులో 63 మంది ప్రాణాలు కోల్పోగా 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. శనివారం సాయంత్రం కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని దుబాయ్ సిటీ వెడ్డింగ్ హాల్లో మిర్వాయిజ్ అనే యువకుడి పెళ్లి వేడుక జరుగుతోంది. సుమారు 1,200 మంది ఆ వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం మహిళలు, పిల్లలు ఒక వైపు, పురుషులకు మరోవైపు వేరుగా వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. పురుషులంతా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 63 మంది చనిపోగా 182 మంది గాయపడ్డారు. ఆ హాలంతా మృతదేహాలు, రక్తం, శరీరభాగాలతో భయానకంగా మారింది. పేలుడు తీవ్రతకు ఆ హాలు పైకప్పు బీటలు వారింది. ఆ హాలు దాదాపు 20 నిమిషాల సేపు పొగ, ధూళితో నిండిపోయింది. అందులోని పురుషుల్లో ప్రతి ఒక్కరూ గాయపడటమో ప్రాణాలు కోల్పోవడమో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ‘ఈ విషాదం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా సోదరుడు, స్నేహితులు, బంధువులు చనిపోయారు. నా కుటుంబ సభ్యులు షాక్‌తో ఉన్నారు. నవ వధువు స్పృహ కోల్పోయింది’ అని పెళ్లి కొడుకు మిర్వాయిజ్ గద్గద స్వరంతో మీడియాతో అన్నాడు. కాగా, అఫ్గాన్‌లో షియాల పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటాయి. పండుగ వాతావరణంలో గంటలకొద్దీ కొనసాగే ఈ వేడుకలకు వందలు, ఒక్కోసారి వేలల్లోనే బంధువులు, పరిచయస్తులు హాజరవుతుంటారు. మామూలుగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోని, ఎక్కువ సంఖ్యలో గుమికూడే షియా వివాహ వేడుకలే లక్ష్యంగా ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనను అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తమ సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మరికొందరు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలను పేల్చివేశారని టెలిగ్రామ్ యాప్ ద్వారా వెల్లడించింది. సున్నీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న అఫ్గాన్‌లో షియాలపై ఐఎస్ తరచూ దాడులకు పాల్పడుతోంది. అఫ్గానిస్తాన్‌లో మోహరించిన తమ బలగాల ఉపసంహరణ, శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధికారులు ఉగ్రసంస్థ తాలిబన్‌తో ఒక వైపు చర్చలు సాగిస్తుండగానే ఈ ఘోరం సంభవించింది. ఇలా ఉండగా, బల్ఖ్ ప్రావిన్సులో రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలి కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. -
నా జీవితంలో ఇంకెప్పుడూ సంతోషంగా ఉండలేను
కాబూల్ : ‘‘బంధువుల సందడి, అతిధుల పలకరింపులు ఇవన్నీ గుర్తుచేసుకుంటుంటే ఎంతో బాధగా ఉంది. ఈ సంఘటన నన్ను సంతోషం నుంచి దూరం చేసి విషాదంలోకి నెట్టివేసింది. నా కుటుంబం, పెళ్లి కూతరు అందరూ షాక్‌లో ఉన్నారు. పెళ్లి కూతురైతే ఇప్పటికీ వణికిపోతోంది. నా తమ్ముడ్ని, స్నేహితులను, బంధువులను కోల్పోయాను. నా జీవితంలో ఇకపై నేనెప్పుడూ సంతోషంగా ఉండలేను. గాయపడిన వారిలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నారు. దాడి జరగటానికి ముందు పెళ్లికి వచ్చిన అతిధులు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. క్షణాల్లో అంతా నాశనమైపోయింది. అందరూ కేకలు వేస్తూ తమ వాళ్లకోసం ఏడుస్తూ వెతుకుతూ ఉన్నారు. దాడి జరిగిన తర్వాత మేము స్పృహలో లేము! మమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చారో కూడా తెలియదు.’’ అంటూ తన పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న తీరని విషాదంపై పెళ్లికుమారుడు మిర్వేస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి ముందు చోటుచేసుకున్న మధురమైన సంఘటనలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం రాత్రి పెళ్లి వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడి పెను విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. పేలుడు దాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడటం అందరినీ కలిచివేసింది. చదవండి : పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి -
పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి
కాబూల్: ఓ పెళ్లి వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాల్లో సాగిపోతున్న ఆ కార్యక్రమంలో భారీ బాంబు విస్పోటనం సంభవించింది. ఈ ఘటన అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో సుమారు 1200 మంది పాల్గొన్నట్టు సమాచారం. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఫంక్షన్ హాల్ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపిస్తోంది. ఓ పెండ్లి వేడుకలో ఈ ఘటన జరిగిందని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి వెల్లడించారు. ఇది ఆత్మహుతి దాడి కావొచ్చునని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రతినిధి సెడిడ్ సిద్దిఖీ ట్విటర్లో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. పశ్చిమ కాబూల్‌లోని ‘దుబాయ్ సిటీ’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో షియా హజారా జాతికి చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. షియా హజారా ప్రజలపై కావాలనే ఎవరైనా కక్ష పూరితంగా వ్యవహరించారా తెలియాల్సి ఉంది. -
కారు బాంబు దాడి; 34 మంది మృతి
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లింది. అమెరికా ఎంబసీకి దగ్గర్లో కారు బాంబుతో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించారు.ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా, 65 మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చడం గమనార్హం. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : నలుగురు మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. -
కిడ్నాప్.. అంతలోనే విముక్తి
కాబూల్ : బక్రీద్ పర్వదినానికి ముందు అఫ్గాన్‌లో అలజడి సృష్టించాలన్న తాలిబన్ల ప్రయత్నానికి ఆ దేశ భద్రతా దళాలు దీటైన జవాబిచ్చాయి. సోమవారం టాఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ వెళ్తున్న 3 బస్సులపై ఖాన్ అబాడ్ జిల్లాలో మెరుపుదాడికి దిగిన తాలిబన్లు సుమారు 170 మంది ప్రయాణికులను నిర్భందించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు కొద్ది గంటల్లోనే కిడ్నాప్‌కు గురైన వారిలో సుమారు 149 మంది ప్రయాణికులను తాలిబన్ల చెర నుంచి కాపాడాయి. మరో 21 మంది ప్రయాణికులను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భద్రతా బలగాల దాడిలో ఇప్పటివరకు ఏడుగురు తాలిబన్లు హతమయ్యారు. బక్రీద్ పండుగకు ఇళ్లకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా తాలిబన్లు ఈ దాడికి తెగబడి ఉండవచ్చని ప్రావిన్స్ కౌన్సిల్ ఉన్నతాధికారి మహ్మద్ యూసఫ్ వెల్లడించారు. ప్రస్తుత ఘటన చోటుచేసుకున్న ప్రాంతం తాలిబన్ల అధీనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇటీవల మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని తాలిబన్లను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించని తాలిబన్లు బక్రీద్‌కు రెండ్రోజుల ముందు ఏకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. -
కిడ్నాప్ కలకలం : మృతుల్లో భారతీయుడు
కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్‌లకు తెగబడుతున్నారు. -
ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉత్తర భారతంపైనా ప్రభావం చూపించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. ఆ రాష్ట్రాల ప్రజలు భీతిల్లారు. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లోని హిందుకుష్ పర్వతశ్రేణిలో ఉంది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావం ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలపై పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో కొద్దిసేపు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
కాబూల్‌పై విరుచుకుపడ్డ ఉగ్రమూకలు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై ఉగ్రమూకలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి చెందగా, 49 మంది గాయపడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఆరుగురు జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు. తొలుత ఉదయం 8 గంటల ప్రాంతంలో అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రధాన కార్యలయం సమీపంలో మోటర్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో వారిలో ఒకరిగా కలిసిపోయిన మరో తీవ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి దాడి జరిగిన కొద్ది సేపటికే రెండో దాడి చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ రెండు ఘటనల్లో పలువురు జర్నలిస్టులతో సహా 25 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీకి చెందిన ప్రముఖ ఫొటోగాఫర్ షా మారై కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల క్రితం ఓటరు నమోదు కేంద్రం లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 30 మంది పౌరులు మరణించారు. -
ఆత్మాహుతి దాడిలో 31మంది మృతి
కాబూల్ : ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాబూల్‌లోని ఓటరు నమోదు కేంద్రం ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. తాలిబన్ ఉగ్ర సంస్థ మాత్రం దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అక్టోబర్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటరు నమోదు కేంద్రం వద్ద ఉన్న జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చివరిసారిగా కాబూల్‌లో ఈ ఏడాది మార్చి 21న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. -
63మంది ఉగ్రవాదులు హతం
కాబూల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టిసారించాయి. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో 63 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐసిస్‌కు చెందిన 14 మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా విభాగం భావిస్తోంది. ఫరా, కాందహర్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్హర్ ప్రావిన్సులలో తమ భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను మట్టుపెట్టిన తమ సిబ్బంది వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధులలో ఒకరైన మహ్మద్ రద్మానిష్ వెల్లడించారు. భద్రతా బలగాల ఆపరేషన్‌పై ఏ ఉగ్రసంస్థ కూడా స్పందించలేదని ఆయన వివరించారు. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 29 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. షియా ముస్లింలు పర్షియన్ నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా.. జరిగిన ఆత్మాహతి దాడిలో కనీసం 29 వరకు మృతి చెందారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మరో 52 మంది వరకు గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘కాబూల్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఈ దాడి జరిగింది. పోలీసు తనిఖీలకు చిక్కకుండా వెళ్లిన ఉగ్రవాది.. అక్కడ తనను తాను పేల్చేసుకున్నాడు’ అని వెల్లడించింది. -
కాబుల్‌లో భీకర పేలుళ్లు..
కాబుల్: దక్షిణాసియా దేశం ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని కాబుల్ నగరంలో బుధవారం జరిగిన వేర్వేరు పేలుళ్లలో సుమారు 25 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్ నగరంలోని కాబుల్ యూనివర్సిటీ, అలీ అబాబ్ ఆస్పత్రుల వద్ద ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారని, ప్రస్తుతం సహాయబృందాలు రంగంలోకి దిగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
గాడిదలను చూస్తేనే వణుకుపుడుతోంది
కాబూల్ : మానవ బాంబులు, ట్రక్కు బాంబులు... ఇంత కాలం ఇలాంటి ఆత్మాహుతి దాడుల గురించి విని, చదివి ఉన్నాం. కానీ, ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌లో కొత్త తరహా దాడులతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. గాడిదలతో బాంబు దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు భద్రతా సిబ్బందికి వణుకు పుట్టిస్తున్నారు. గాడిదలకు బాంబులను అమర్చి భద్రతా క్యాంపులపై వాటిని వదులుతారు. నిర్దేశిత లక్ష్యం చేరాక వాటిని రిమోట్ కంట్రోల్‌తో పేలుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. నెల వ్యవధిలో ఇలాంటి దాడులు 5 చోటు చేసుకోగా.. సుమారు 9 మంది(ఐదుగురు సాధారణ పౌరులు) ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెక్‌పోస్టులను దాటేందుకు ఉగ్రవాదులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాడిదలు కనిపిస్తేనే చాలూ అధికారులు వాటిని కాల్చి చంపుతున్నారు. తాజాగా సోమవారం కున్వార్ ప్రొవిన్స్‌లో గాడిద బాంబు దాడి చోటు చేసుకోగా.. ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీటిని క్రూరమైన చర్యలుగా జంతు ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీస్తూ వస్తున్న ఉగ్రవాదులు.. తమ లక్ష్యాల కోసం ఇప్పుడు మూగ జీవాలను బలి పెట్టడం దారుణమని పేర్కొంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2014లో కున్వార్ ప్రొవిన్స్‌లోనే ఉగ్రవాదులు ఇలాంటి తరహా దాడులకు పాల్పడిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. -
మిలిటరీ అకాడమీపై బాంబు దాడి.. కాల్పులు
కాబూల్ : ఉగ్రదాడితో అప్ఘనిస్థాన్ మరోసారి వణికిపోయింది. కాబూల్‌లోని మిలిటరీ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో అకాడమీ దద్దరిల్లి పోయింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మార్షల్ ఫాహిమ్ నేషనల్ ఢిపెన్స్ యూనివర్సిటీ అకాడమీపై ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, పది రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కాబూల్ నగరంపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంటర్కాంటినెంటల్ హోటల్‌పై జరిపిన దాడిలో 22 మంది ప్రాణాలు బలితీసుకున్న తాలిబన్లు.. రెండు రోజుల క్రితం అంబులెన్స్‌తో భారీ ఎత్తున్న బాంబు దాడి నిర్వహించి 100 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. అఫ్ఘన్ మిలిటరీ అకాడమీలే లక్ష్యంగా ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు దాడులకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్షల్ ఫాహిమ్ వద్దే బాంబు దాడి చోటు చేసుకోగా.. 11 మంది సైనికులను మృతి చెందారు. -
అంబులెన్స్‌తో ఆత్మాహుతి దాడి : 95 మంది మృతి
కాబూల్ : అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ లో శనివారం భారీ పేలుడు చోటు చేసుకుంది. భారత రాయభార కార్యాలయానికి 400 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 95 మంది మృతిచెందగా, 158మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు సార్లు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఆఫీసులు, స్వీడీష్ మిషన్స్, హై పీస్ కౌన్సిల్లు కూడా ఆత్మాహుతి దాడి జరిగిన స్థలానికి సమీపంలో ఉన్నాయి. ఆత్మాహుతి దాడికి ఓ అంబులెన్స్‌ను వాడినట్టు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వహీద్ మజ్రూహ్ తెలిపారు. భారత రాయభార కార్యలయంలో పని చేస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
హోటల్‌పై ఉగ్ర దాడి.. భారీగా ప్రాణ నష్టం
-
హోటల్‌పై ఉగ్ర దాడి.. భారీగా ప్రాణ నష్టం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు నగరంలోని ఓ స్టార్ హోటల్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు సమాచారం. కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఇంటర్ కాంటినెంటల్ ఒకటి. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆపై గ్రేనేడ్ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్ హరిస్ నయబ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్ గ్రేనేడ్లతో హోటల్లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ప్రకటించిన భద్రతా దళాలు.. ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు చెబుతూ ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చనే సంకేతాలు అందిస్తోంది. మరోపక్క హోటల్‌కు సమీపంలో ఉన్న పాక్ ఎంబసీ కార్యాలయంలో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాబూల్ హోటళ్లపై దాడులకు అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించిన కొద్దిరోజులకే ఈ దాడి చోటు చేసుకోవటం గమనార్హం. గతంలో(2011) ఇదే హోటల్ పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 24 మందిని పొట్టనబెట్టుకున్నారు. -
భారతీయ ఎంబసీపై పడిన రాకెట్
కాబుల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో గల భారతీయ ఎంబసీపై క్షిపణి పడింది. ఈ ఘటనలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంబసీలోని ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఐటీబీపీ భద్రతా బలగాలు ఉండే మూడు బరాక్‌లకు చేరువలో రాకెట్ పడినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. అయితే, భారతీయ ఎంబసీ టార్గెట్‌గానే రాకెట్ ప్రయోగం జరిగిందా? అన్న విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. -
అఫ్గాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి
-
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. షియా ముస్లింలు లక్ష్యంగా గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆఫ్గానిస్తాన్‌పై సోవియెట్ దాడిచేసి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాబూల్‌లోని తయాబాన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో భవనంలో సుమారు 100 మంది ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో స్థానిక ఆసుపత్రులు ప్రతిధ్వనించాయి. తయాబాన్ కేంద్రం ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ అనే మీడియా సంస్థ ఇంతకుముందే హెచ్చరించింది. ఈ దాడి తమ పనేనని ఉగ్ర సంస్థ ఐఎస్ ప్రకటించింది. దుండగుడు ఆత్మాహుతికి పాల్పడిన తరువాత ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న సమయంలో మరో రెండు తక్కువ తీవ్రత ఉన్న బాంబులు పేలిపోవడంతో 40 మంది చనిపోయారు. మృతులు, క్షతగాత్రులను తరలించిన స్థానిక ఇస్తిక్లాల్ ఆసుపత్రిలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్ర గందరగోళం మధ్య తమ వారి కోసం వెతుకుతూ బాధితుల బంధువులు బోరున విలపించారు. -
కాబూల్‌లో ఆత్మాహతి దాడి..ఏడుగురి మృతి
కాబూల్ : షాష్ దారక్ ప్రాంతంలోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ సబ్ ఆఫీసు వద్ద పేలుడు సంభవించింది. ఛాతీకి పేలుడు పదార్ధాలు అమర్చుకుని వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో ఉగ్రవాదితో పాటు మరో ఏడుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7.20 గంటలకు జరిగింది. ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనకు తాము బాధ్యులుగా ప్రకటించుకోలేదు. -
కాబూల్‌లో పేలుడు..ఏడుగురి మృతి
ఆఫ్ఘనిస్తాన్ : కాబూల్ నగరంలోని సర్-ఇ- కారెజ్ మార్కెట్లో శుక్రవారం మధ్యాహ్నాం జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఎవరిని లక్ష్యంగా దాడి చేశారో ఇంత వరకూ తెలియరాలేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఘటనలో మూడు వాహనాలు, చాలా దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత నెల నవంబర్ 16న భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది పోలీసులతో కలిపి 15 మంది చనిపోయారు. -
అఫ్గానిస్తాన్‌లో టీవీ చానెల్‌పై ఉగ్ర దాడి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని శంషాద్ టీవీ చానెల్ కార్యాలయం లోకి పోలీసు దుస్తుల్లో ప్రవేశించిన దుండగులు తుపాకీతో విచక్షణార హితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు మరణిం చగా.. 24 మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అఫ్గాన్ ప్రత్యేక దళ పోలీసులు కార్యాలయ భవనం గోడకు ఓవైపు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని హతమార్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. -
టీవీ చానెల్‌పై సాయుధుల దాడి.. కాల్పుల బీభత్సం.. భీతావహం!
కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గుర్తుతెలియని సాయుధులు మంగళవారం కాబూల్‌లోని ఓ టీవీ చానెల్లోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రముఖ టీవీ చానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా బలగాలు టీవీ చానెల్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి. చానెల్లో కాల్పులతో విరుచుకుపడుతున్న సాయుధులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక సాయుధుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాబూల్ పోలీసులు ప్రకటించారు. మిగతా సాయుధులను కూడా ఏరివేసి.. చానెల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. త్రుటిలో తప్పించుకున్నాను: రిపోర్టర్ భారీ ఆయుధాలతో వచ్చిన సాయుధులు గ్రనేడ్లు విసురుతూ.. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ.. చానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలోని చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాయలంలో చొరబడిన సాయుధులు కాల్పులు కొనసాగిస్తుండటంతో అందులోని ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారు. సాయుధుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు చానెల్ రిపోర్టర్ ఒకరు మీడియాకు తెలిపాడు. చానెల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొందని, కాసేపటికోసారి కాల్పుల శబ్దం, ఉద్యోగాల హాహాకారాలు వినిపిస్తున్నాయని ఆయన వివరించారు. వందమందికిపైగా ఉద్యోగులు కార్యాలయ భవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాబూల్‌లో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కాబూల్‌లో మరో ఆత్మాహుతి దాడి
కాబూల్ : అఫ్ఘానిస్తాన్ రాజధాని మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. మంగళవారం సాయంత్రం కాబూల్‌లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాలుండే ప్రాంతంలో ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోయారని, 15మంది వరకు గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు. మోటారు సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడిని మొదటి చెక్‌పోస్టును దాటి రెండో పోస్టు వద్దకు రాగానే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దాడికి కారణమెవరనేది తెలియాల్సి ఉంది. -
అఫ్గాన్‌లో మారణకాండ
-
అఫ్గాన్‌లో మారణకాండ
కాందహార్: అఫ్గానిస్తాన్‌లో శుక్రవారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. రాజధాని కాబూల్‌తో పాటు, మరో చోట మసీదుల్లో జరిపిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 47 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాలుగురోజుల క్రితం 80 మందిని, గురువారం కాందహార్ ప్రావిన్స్‌లో 43 మంది సైనికుల్ని పొట్టనపెట్టుకున్న ఘటనలు మరువక ముందే ఉగ్రవాదులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. కాబూల్‌లోని షియా మసీదులో ప్రజలు సాయంత్రపు ప్రార్థనల కోసం గుమిగూడిన సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఉగ్రదాడిలో 32 మంది మరణించగా, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ నగర శివార్లలోని దాస్తే బర్చీలో ఈ ఆత్మహుతి దాడి జరిగిందని కాబూల్ పోలీసు ప్రతినిధి అబ్దుల్ బసీర్ తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. ఇక మరో ఘటనలో ఘోర్ ప్రావిన్స్‌లోని సున్నీ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య 30 వరకూ ఉండొచ్చని స్థానిక అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీ శిబిరంపై దాడిలో 43 మంది మృతి గురువారం కాందహార్ ప్రావిన్స్‌లోని మైవాండ్ జిల్లా చస్మోలో ఆర్మీ శిబిరంపై ఉగ్ర దాడిలో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ రక్షణ శాఖ ఒక తెలిపింది. శిబిరంలో మొత్తం 60 మంది సైనికులకు గాను ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. 9 మంది గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. -
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ల దాడి
సాక్షి : అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ బుధవారం ఉదయం రాకెట్ల పేలుళ్లతో దద్దరిల్లింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ దాడి చోటు చేసుకున్నట్లు సమాచారం. ఉదయం 11.15 గంటలకు మొదలైన ఈ దాడి సుమారు గంటన్నర పాటు కొనసాగినట్లు చెబుతున్నారు. 20 నుంచి 30 రాకెట్లు విమానాశ్రయంపై వచ్చి పడ్డాయని స్థానిక మీడియా టోలో న్యూస్ వెల్లడించింది. అయితే దాడి చేసిన వారి లక్ష్యం ఎయిర్ పోర్ట్ అయి ఉండదని.. నాటో దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అమెరికా రక్షణ కార్యదర్వి జేమ్స్ మాటిస్ కాబూల్ పర్యటన నేపథ్యంలోనే ఈ దాడి చోటుచేసుకోవటం గమనార్హం. దాడిలో ఎవరైనా మరణించారా, ఎంత మంది గాయపడ్డారన్న వివరాలు వెంటనే వెల్లడికాలేదు. దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. భారత పర్యటనలో భాగంగా జేమ్స్ మాటిస్ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అటునుంచి అటు అఫ్ఘాన్ పర్యటనకు వెళ్లిన మాటిస్ నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్‌తోపాటు అధ్యక్షుడు అష్రఫ్ గనితో కూడా సమావేశం అయ్యారు. -
క్రికెట్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి
సాక్షి, కాబుల్ : ఓ వైపు టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మరో పక్క స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది మృతిచెందారు. అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ చెక్‌పాయింట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబారి నివాసంలో రాకెట్ పేలడం కలకలం రేపింది. కాబూల్‌లోని భారత ఎంబసీ కాంపౌండ్‌లోని అతిథి గృహంలో రాకెట్ లాంచర్ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత అతిథి గృహం కాంపౌండ్‌లో ఉన్న వాలీబాల్ మైదానంలో ఉదయం 11.45 గంటలకు రాకెట్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో భారత దౌత్యవేత్త మన్‌ప్రీత్ వోహ్రాతోపాటు ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది కూడా ఇంట్లోనే ఉన్నారు. గతవారం కాబూల్‌లోని దౌత్య ప్రాంతంలో భారీ ఉగ్రపేలుళ్లు చోటుచేసుకొని 150మందికిపైగా మృతిచెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారత దౌత్యవేత్త నివాసంలో రాకెట్ లాంచర్ పేలుడం ఆందోళన రేపుతోంది. -
కాబూల్ పేలుడు చెప్పిన నిజం
అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత (9/11) జరిగిన ఒక దశాబ్దానికి, అంటే సెప్టెంబర్ 11, 2011న అఫ్ఘానిస్తాన్‌లో మరో ఘటన జరిగి, అందరి దృష్టిని ఆకర్షించింది. తూర్పు అఫ్ఘానిస్తాన్‌లోని వార్దాక్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరం దగ్గరకి ఒక ట్రక్కును తీసుకువచ్చారు. మరుక్షణంలోనే భీకరమైన విస్ఫోటనం సంభవించింది. ఆ ట్రక్కు ఒక అగ్నిగోళంలా మారిపోయింది. పేలుడు పదార్థాలను నింపిన ఆ ట్రక్కు తునాతునకలైంది. అమెరికా సైనిక స్థావరం గోడ మొత్తం పగుళ్లు వారింది. ఒక డజను మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సంయుక్త రక్షణ దళ విభాగాల అధిపతులకు అధ్యక్షులుగా నాడు అడ్మిరల్ మైఖేల్ ‘మైక్’ములెన్ పనిచేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా అమెరికా రక్షణ బలగాలలో వివిధ హోదాలలో పనిచేసిన ములెన్ ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఆయనే వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ సభ్యుల బృందం ముందు కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడే ఆయన చాలా నిష్కర్షగా ఈ విషయం చెప్పారు. ‘పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలి జెన్స్ (ఐఎస్ఐ) చేతిలో హఖానీ నెట్వర్క్ సంస్థ పలు రకాలుగా ఉపయోగపడే ఆయుధంగా మారిపోయింది’ అని ఆయన వెల్లడించారు. దాడితో చెప్పదలుచుకున్న సంగతి ఇటీవల కాబూల్‌లో అదే తరహాలో ట్రక్కు బాంబు పేలిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు ఉండే కూడలిలో ఈ ఘోర విస్ఫోటనం జరిగింది. ఈ పేలుడులో దాదాపు 90 మంది చనిపోయారు. కొన్ని వందలమంది గాయపడ్డారు. దీని వెనుక హఖానీ నెట్వర్క్ ఉందని సహజంగానే అంతా అనుమానించారు. నిజానికి ఈ పేలుడుకు బాధ్యత హఖానీ నెట్వర్క్దేనని అఫ్ఘానిస్తాన్ నిఘా సంస్థ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్డీఎస్) బాహాటంగానే ఆరోపించింది. పవిత్ర రంజాన్ మాసం మొదలుకావడానికి కొద్ది ముందే ఈ దుర్ఘటన జరిగింది. రంజాన్ మాసం సంగతితో పాటు, విస్ఫోటనం చేయడానికి బాధ్యులు ఎంచుకున్న సమయం, ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనవి. కాబూల్‌లో విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి కొన్ని గజాల దూరంలోనే జర్మనీ వారి దౌత్య కార్యాలయం ఉంది. ఆ దాడిలో ఈ దౌత్య కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులు కూడా గాయపడ్డారు. కార్యాలయం గేటు దగ్గర ఉండే కాపలాదారు మరణించాడు. అక్కడ పనిచేసే ఏకైక కాబూల్ వాసి అతడొక్కడే. ఇక విస్ఫోటనం జరిగిన సమయం గురించి–మన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెల్ మెర్కెల్‌తో కలసి తీవ్ర పదజాలంతో సంయుక్త ప్రకటన చేస్తున్న సమయంలో ఆ దుర్ఘటన జరిగింది. ‘‘ఆర్థిక ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారి పట్ల, ప్రోత్సహిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’’ అని ప్రతిన తీసుకుంటున్న సమయంలో ఆ పేలుడు సంభవించింది. భవిష్యత్ తరాలు ఎదుర్కొనే ఏకైక తీవ్ర సమస్య ఉగ్రవాదమని మోదీ పేర్కొన్నారు. ‘ఈ సమస్యను మన రెండు దేశాలు కలసికట్టుగా ఎదుర్కొంటాయి, అందుకు సైబర్ రక్షణ, నిఘా వ్యవహారాలలో పరస్పర సహకారం అవసరమ’ని మోదీ స్పష్టం చేశారు. పేలుడు యాదృచ్ఛికం కాదు గడచిన కొన్నేళ్ల కాలంలో పారిస్ నుంచి మాంచెస్టర్ వరకు, ఐరోపా అంతటా ఉగ్రవాదులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అల్‌కాయిదా, తాలి బన్ల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ‘నాటో’సైన్యాలతో కలసి ఐరోపా దేశాలు కూడా పనిచేస్తున్నాయి. జర్మనీకి చెందిన 1,000 మంది సైనికులు కూడా అక్కడ వివిధ స్థాయిలలో రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబూల్‌లో జర్మనీ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన తాజా విస్ఫోటనం కేవలం యాదృచ్ఛిక ఘటనగా చెప్పే వీలులేదు. గత కొన్నేళ్లుగా జరిగిన విస్ఫోటనాలలో కాబూల్ తాజా పేలుడు ఘటన తీవ్రమైనది. అలాగే ఈ పేలుడు ఆఖరిదని చెప్పలేం. తాజా పేలుడు సంభవించిన తరువాత యథావి«ధిగా పాకిస్తాన్ ఈ చర్యను ఖండించింది. అధ్యక్షుడు మామ్నూన్ హస్సేన్ పార్లమెంట్లో ఘాటు పదజాలంతో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌లో శాంతిని నెలకొలపడానికి తీసుకునే అన్ని చర్యలకు పాక్ ప్రజలు, ప్రభుత్వ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని పేలుడు జరిగిన రోజునే ఆయన అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్న హఖానీ నెట్వర్క్ రాజ పోషకురాలు పాకిస్తాన్ అన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. హఖానీ నెట్వర్క్ ప్రస్థానం చూస్తే అసలు ఆ సంస్థ ఎవరి సార థ్యంలో నడుస్తున్నదో కూడా అర్థంకానంత గోప్యత ఉంటుంది. ఆ సంస్థ నాయకుడు ఎవరో వాస్తవంగా ఎవరికీ తెలియదు. పేరు ఎవరిదైనా నడిపేది పాక్ హఖానీ నెట్వర్క్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? దీనిని పుష్తూన్ యుద్ధ ప్రభువు జలాలుద్దీన్ హఖానీ స్థాపించాడు. అఫ్ఘానిస్తాన్ మీద సోవియెట్ రష్యా దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సంస్థ ఎదుగుదల, ఇంకా చెప్పాలంటే పుట్టుకలో కూడా సీఐఏ హస్తం ఉందని చెబుతారు. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ రష్యా సేనలు వైదొలగిన తరువాత హఖానీ ఒక వైపు తాలిబన్లకు, మరోవైపు ఐఎస్ఐకు నాయకునిగా అవతరించాడు. ఉత్తర వజీరిస్తాన్ చేరుకుని, అటు పాక్, ఇటు అఫ్ఘాన్ సరిహద్దులలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడే మీరాన్షా దగ్గర తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పాడు. అయితే 2015లో బీబీసీ ప్రసారం చేసిన ఒక నివేదికలో హఖానీ సంవత్సరం క్రితమే (2014) మరణించాడని వెల్లడించింది. కొన్ని ఆధారాలను బట్టే బీబీసీ ఈ వార్తను వెల్లడించింది. ఇప్పుడు సిరాజుద్దీన్ హఖానీ ఆ సంస్థను నడుపుతున్నాడని చెబుతారు. ఇతడు కరుడుగట్టిన తాలిబన్ కమాండర్ స్థాయి కార్యకర్త. పేరుకు ఇతడు నాయకుడైనా వెనక ఉండి హఖానీ నెట్‌వర్క్‌ను ముందుకు నడిపిస్తున్నది మాత్రం ఐఎస్ఐ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. హఖానీ నెట్వర్క్ ముగుసులో ఐఎస్ఐ అలాగే, హఖానీ నెట్వర్క్ వెనుక ఉన్నది పాకిస్తానేనంటూ మైక్ ములెన్ ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటన ఇచ్చారంటే అందుకు ఆయన వద్ద ఉన్న కొన్ని ఆధారాలే కారణం. అందుకు ఉపయోగపడిన ఆధారాలలో అఫ్ఘానిస్తాన్‌లో పనిచేస్తున్న మరో అమెరికా సైనిక కమాండర్ జనరల్ జాన్ అలెన్ ఇచ్చిన ఆధారం కూడా ఒకటి. పాకిస్తాన్–అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో అనుమానాస్పదంగా ట్రక్కు లు సంచరిస్తున్న విషయాన్ని పసిగట్టిన అమెరికా సైన్యం ఆ విషయాన్ని అప్పటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ దృష్టికి తీసుకుని వెళ్లింది. ఎలాంటి ఉత్పాతం జరగకుండా నివారించడానికి ఫోన్ చేసి చెబుతాను అని కయానీ హామీ ఇవ్వడంతో అలెన్ నిర్ఘాంతపోయారు. అంటే పాకిస్తాన్ సైన్యానికి ఫోన్లో కూడా అందుబాటులో ఉన్న సంస్థ హఖానీ నెట్వర్క్. ఈ విషయం అలెన్‌కు అర్థమైంది. అమెరికా గూఢచార సంస్థలు 2008 ప్రాంతంలో ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా విన్నాయి. అందులోనే హఖానీ నెట్వర్క్ ఒక ‘వ్యూహాత్మక సంపద’ అని సాక్షాత్తు కయానీ చెప్పడం అమెరికా గూఢచారులు విన్నారు. నిజం చెప్పాలంటే అఫ్ఘానిస్తాన్‌లో అడ్డూ ఆపూ లేకుండా జరుగుతున్న రక్తపాతానికి మూలం, ఒకే ఒక్క కారణం ఐఎస్ఐ. ఇది తన కార్యకలాపాలను హఖానీ నెట్వర్క్ వంటి సంస్థలతో పరోక్షంగా నిర్వహిస్తున్నది. దీనికి అంతం లేదా? దీనికి అంతం ఎప్పుడు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అదే ప్రాంతానికి చెందిన మరో యుద్ధ ప్రభువు గురించి ముందు తెలుసుకోవాలి. ‘అతడు నిజమైన పుష్తూ జాతీయునిగా జీవించాడు, మరణించాడు’ అన్న అక్షరాలు ఒక మట్టి సమాధి మీద కనిపిస్తాయి. ఆ మసీదు దక్షిణ వజిరిస్తాన్‌లోని షాకెయ్లో కనిపిస్తుంది. ఆ మట్టి సమాధి కింద శాశ్వతంగా నిద్రపోతున్న వ్యక్తి పేరు నేక్ మహ్మద్. ఇతడు కూడా అఫ్ఘాన్‌లో తాలిబన్ల నాయకుడే. పాకిస్తాన్‌లోని వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో తాలిబన్ కార్యకలాపాలకు తిరుగులేని నాయకుడుగా ఎదిగినవాడు. ఇతడు ఎంతగా ఎదిగాడంటే, ఎంత రక్తపాతం సృష్టించాడంటే పర్వేష్ ముషార్రఫ్ కూడా ఇతడితో సంధి చేసుకోవలసి వచ్చింది. అయితే ఆ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. తరువాత ఒక దశలో ఐఎస్ఐ, సీఐఏ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రిడేటర్ డ్రోన్లకు కొంత సమాచారాన్ని అందించడానికి ఐఎస్ఐ ఆమోదించింది. చివరికి 2004 జూన్ మధ్యలో నేక్ మహ్మద్ ఉంటున్న నివాసం మీద గురి తప్పకుండా ఒక ప్రిడేటర్ దాడి జరిపింది. అక్కడికక్కడే అతడు మరణించాడు కూడా. హఖానీ నెట్వర్క్ విషయంలో కూడా పాకిస్తాన్ అదే విధంగా వ్యవహరిస్తుందా? లేకుంటే ఆ సంస్థను వ్యూహాత్మక సంపదగానే భావిస్తుందా? ఇదే ఇప్పుడు అందరి మది లోను కదులుతున్న ప్రశ్న. వ్యాసకర్త బీజేపీ జాతీయ కార్యదర్శి ఇండియా ఫౌండేషన్ సంచాలకులు : రామ్‌మాధవ్ -
శ్మశానంలో పేలుళ్లు.. 18 మంది మృతి
కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఓ శ్మశానంలో అంత్యక్రియలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకొని జరిపిన బాంబు దాడుల్లో సుమారు 18 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సలీమ్ ఇజాద్యార్ అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుళ్లు జరిపారు. శ్మశానంలో వరుసగా మూడు పేలుళ్లు జరిగాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. బుధవారం కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో 90 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని శుక్రవారం కాబూల్‌లో ప్రజలు ఆందోళన చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో సీనియర్ పొలిటికల్ లీడర్ కుమారుడు సలీమ్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. -
భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!
-
భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే సంభవించిన ఈ పేలుడు ఈ ప్రాంతమంతా నెత్తుటి చారికలతో, క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారింది. ఈ పేలుడు ఘటనతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. జర్మన్ గేటు వద్ద పేలుడు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్న ఈ ప్రదేశానికి జర్మన్ గేటు ముఖద్వారంగా ఉంటుంది. దీనికి సమీపంలోనే జర్మనీ రాయబార కార్యాలయం నెలకొని ఉంది. అయితే, దేవుని దయవల్ల ఈ పేలుడులో భారత ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని, వారు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. -
అమెరికాకు షాకిచ్చిన ఐసిస్
- యూఎస్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతిదాడి - ఎనిమిది మంది మృతి, ముగ్గురు జవాన్లకు గాయలు - అఫ్ఘాన్ రాజధాని కాబుల్ లో సంఘటన కాబుల్: ముప్పేటదాడితో కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఐసిస్ మళ్లీ పంజా విసిరింది. ఈ సారి ఏకంగా అమెరికన్ ఆర్మీనే టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లో గల అమెరికన్ ఎంబసీ ఎదుట బుధవారం ఐసిస్ జరిపిన దాడిలో ఎనిమిదిమంది మరణించగా, ముగ్గురు యూఎస్ జవాన్లు తీవ్రంగా గాపడ్డారు. అఫ్ఘాన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ దానిశ్ చెప్పిన వివరాల ప్రకారం.. కాబుల్ లోని యూఎస్ ఎంబసీ ఎదుట ఆర్మీ కాన్వాయ్ పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడి చేశారు. ఉగ్రవాదులు వినియోగించినవి శక్తిమంతమైన బాంబులు కావడంతో పేలుడు ధాటికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు ప్రతినిధులు తెలిపారు. పేలుడు ధాటికి యూఎస్ ఆర్మీకి చెందిన రష్ అవర్ వాహనంతోపాటు పౌరులకు చెందిన మరో 25 వాహనాలు ధ్వంసం అయ్యాయి. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అమెరికా, రష్యా, సిరియా, ఇరాన్ జాతీయ బలగాల ముప్పేటదాడితో చావుదెబ్బతిన్న ఐసిస్.. ఇటీవల ఇరాక్, సిరియాలకంటే అఫ్ఘానిస్థాన్ లోనే తన ప్రభావాన్ని చాటుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం తర్వాత కూడా సుదీర్ఘకాలం పనిచేసిన అమెరికా, నాటో సైన్యాలు 2014 నుంచి తిరుగుముఖం పట్టడం, అదే సమయంలో ఉగ్రసంస్థలు మళ్లీ పుంజుకుంటుండటం తెలిసిందే. -
కాబుల్‌లో సన్‌రైజర్స్‌కు వెర్రెత్తే క్రేజ్
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లంటే ఆప్ఘనిస్తాన్ వాసుల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడింది. ఎంతలా అంటే సొంత పనులన్నింటిని పక్కన బెట్టేసి మ్యాచ్ సమయానికి టీవీలకు అతుక్కుపోతున్నారు. ఓ వైపు ఉగ్రవాద దాడులు, అమెరికా దళాల ప్రతిదాడులతో తమ ప్రాంతాలు దద్దరిల్లుతున్నా అదరక బెదరక సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇందుకు కారణం ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఆడుతున్న తొలి ఆప్ఘాన్ క్రికెటర్ రషీదే. ఆఫ్ఘాన్కే చెందిన మహ్మద్ నబీని కూడా హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకూ నబీని బరిలోకి దించలేదు. రషీద్ గురించి ఢిల్లీలో ఉంటున్న ఓ ఆప్ఘానీని ప్రశ్నించగా.. ఆప్ఘనిస్తాన్ మొత్తం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రేమిస్తోందని చెప్పారు. అందుకు కారణం ఆ జట్టు రషీద్‌ను వేలంలో తీసుకోవడమేనని తెలిపారు. తన కుటుంబీకులకు ఫోన్ చేస్తే సన్‌రైజర్స్ మ్యాచ్ చూస్తున్నామని తర్వాత మాట్లాడతామని పెట్టేశారని చెప్పారు. తన కుటుంబంలో అసలు ఎవరూ క్రికెట్ చూడరని.. అయితే, రషీద్‌ఖాన్‌ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన తర్వాత క్రికెట్ చూస్తున్నామని వాళ్లందరూ చెప్పడం ఆనందం కలిగించిందని తెలిపారు. రషీద్ జన్మస్ధలమైన నాన్గర్హర్ ప్రావిన్సులోనే గురువారం అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్‌ను ఉపయోగించి ఉగ్రవాదులపై దాడి చేసింది.