ఆప్ఘనిస్తాన్: కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో నిర్వహించబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment