కాబూల్ : అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ లో శనివారం భారీ పేలుడు చోటు చేసుకుంది. భారత రాయభార కార్యాలయానికి 400 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 95 మంది మృతిచెందగా, 158మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు సార్లు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఆఫీసులు, స్వీడీష్ మిషన్స్, హై పీస్ కౌన్సిల్‌లు కూడా ఆత్మాహుతి దాడి జరిగిన స్థలానికి సమీపంలో ఉన్నాయి. ఆత్మాహుతి దాడికి ఓ అంబులెన్స్‌ను వాడినట్టు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వహీద్ మజ్రూహ్ తెలిపారు. భారత రాయభార కార్యలయంలో పని చేస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత ఎంబసీ సమీపంలో భారీ పేలుడు
Published Sat, Jan 27 2018 3:46 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment