![Deadly Suicide Blast Outside Afghan Kabul Foreign Ministry - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/12/Kabul_Embassy_Blast.jpg.webp?itok=5X-GPrMb)
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో విదేశాంగ శాఖ కార్యాలయం సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద పేలుడు. ఈ ఘటనలో 20 మందికిపైగా జనం మృతి చెందారు.
అయితే, పేలుడుకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. కానీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధ సంఘమైన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రావిన్స్’ 2021 ఆగస్టులో తాలిబాన్ పాలన మొదలయ్యాక అఫ్గాన్‌లో వరుసగా దాడులకు పాల్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment