కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ‍్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
అఫ్గానిస్తాన్‌ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9
— BILAL SARWARY (@bsarwary) September 30, 2022
Comments
Please login to add a commentAdd a comment