Suicide Attack
-
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని.. ఆత్మహత్య!
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లోని క్యాంటిన్‌కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బీచ్‌లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్‌కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు. మొగదీషులోని బీచ్‌లోని ఓ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
రైలు కిందపడి తండ్రి, కుమార్తెల విషాదం!
మహబూబ్‌నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్‌కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుండేవారు.వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
కనో: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడు చోటుచేకున్నాయి. మూడుచోట్ల జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించింది. ఈ ఘటనలు శనివారం చోటు చేసుకున్నట్లు ఎమెర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.ఈశాన్య నైజీరియాలోని గ్వోజా పట్టణంలో ఓ వివాహ వేడుకలో గుర్తు తెలియని మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అదే పట్టణంలో మరో మహిళ ఓ ఆస్పత్రిలో ఆత్మాహుతి దాడి చేసింది. వివాహ వేడుకలో మృతిచెందిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో మరో దాడి చోటుచేసుకుంది. ఈ మూడు ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా.. 42 మంది గాయపడినట్లు బోర్నో రాష్ట్ర ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మృతి చెందిన 18 మందిలో చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు అధికారులు తెలపారు.2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలో ఉన్న గ్వోజా పట్టణాన్ని బోకో హరామ్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుంది. కెనడీయన్ ఆర్మీ సాయంతో నైజీరియన్ సైన్యం.. ఆ పట్టణాన్ని తిరిగి 2015లో స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి పట్టణానికి సమీపంలోని కొండల నుంచి హరామ్ మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నాయి. -
పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్‌కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్‌కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
తండ్రితో తాగుడు మాన్పించలేక.. యువకుడి విషాదం!
పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు విష్ణువర్దన్(19) ఉన్నారు. బేల్దారి పనులతో పాటు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్దన్ అనంతపురంలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.చాలా కాలంగా రాజేష్‌కు మద్యం సేవించడం అలవాటుగా ఉండేది. ఇటీవల అది శ్రుతిమించి మోతాదుకు మించి మద్యం తాగి మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు రాజేష్ ఆచూకీ తెలపడంతో కుటుంబసభ్యులు వెళ్లి ఇంటికి పిలుచుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలిసిన వారు పలుమార్లు రాజేష్‌తో మద్యం అలవాటు మాన్పించాలని కుటుంబసభ్యులకు చెబుతూ వచ్చారు. అయితే తమ మాట తండ్రి వినకపోవడం... తరచూ చుట్టుపక్కల వారు హితబోధనలు చేయడం వంటి చర్యలతో సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితికి చేరుకున్నామని కుటుంబసభ్యులు లోలోన మదనపడేవారు.ఆదివారం సాయంత్రం అమగొండపాళ్యం రోడ్డు పక్కన మద్యం మత్తులో రాజేష్ పడి ఉన్నాడని తెలుసుకున్న విష్ణువర్దన్ అక్కడకు చేరుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు తాగుడు ఎందుకు అంటూ కుమారుడు నిలదీశాడు. కుమారుడి వాదనలతో తండ్రి ఏకీభవించకుండా తనదైన శైలిలోనే సమాధానమిస్తూ వచ్చాడు. దీంతో ఇక తండ్రిలో మార్పు రాదని గ్రహించిన విష్ణువర్దన్... ఆదివారం రాత్రి ఇటీవల నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పాత ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విష్ణు అవ్వ పాలు పితకడానికి పాత ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న మనవడిని చూసి గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబాన్ని నిలబెడతాడనుకున్న కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. -
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
పుట్టింటికి ఎందుకొచ్చావని తల్లి మందలించిందని.. కూతురి విషాదం!
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి.. -
ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్
ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది. సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ. ఇదే నా చివరి వీడియో ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by The Whistle (@thewhistletv) -
జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఇవి చదవండి: వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి -
కొడుకుకు ఉద్యోగం లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: కుమారుడికి సరైన ఉద్యోగం లేదనే బెంగతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఏఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని తెర్లుమద్దికి చెందిన పల్లె రమణ(40) ఈనెల 10న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమణను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. రమణ కుమారుడు నిఖిల్‌కు సరైన ఉద్యోగం లేదని తరచూ బాధపడుతుండేది. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని మదనపడేది. ఈక్రమంలోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుమారుడు నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇవి చదవండి: వేములవాడలో యువకుడి దారుణహత్య -
ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!
అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్ తెలిపాడు. ఇందుకు అభిషేక్ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇవి చదవండి: ‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు -
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్‌ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్‌డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
విషయం తండ్రికి చెబుతామన్నందుకు విద్యార్థిని..
తూర్పుగోదావరి: రామచంద్రపురం మండలంలోని ఏరుపల్లి శివారు రామారావుపేటకు చెందిన 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సింగం దీవెన గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక తమ ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుంది. ఇది చూసిన ఆమె తమ్ముడు, అక్కలు విషయం తండ్రికి చెబుతామని తెలపడంతో ఆమె భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. ఇవి చదవండి: అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..
కరీంనగర్: అదనపు కట్నం తేవాలనే అత్తామామల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా మన్మంతునిపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధన(25) సోమవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన రెండేళ్లకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తొమ్మిది నెలల కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధనను రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు చెందిన తీగల రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.7లక్షల నగదు, పల్సర్‌బైక్ కట్నంగా ఇచ్చినట్లు మౌనిక తల్లి గోగుల సమ్మక్క తెలిపారు. ఆ తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ తమ కూతురును భర్త రాజ్‌కుమార్, అత్త, మామ యశోద, పోచాలు వేధించేవారని కన్నీటి పర్యంతమైంది. తరచూ కొంత మొత్తాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ రూ.2లక్షలు తేవాలంటూ వేధించడంతో మౌనిక ఈనెల13న పుట్టింటికి వచ్చిందన్నారు. ఇటీవలే భర్తతో మాట్లాడించి మళ్లీ అత్తింటికి పంపించామని అన్నారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున మౌనిక ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజ్‌కుమార్, అత్త, మామలు యశోద, పోచాలుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మహేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విషయంలో..?? -
పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్దని తల్లి బెదిరించడంతో.. యువతి
నిర్మల్: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది. గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్‌లోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం! కానీ భర్త?
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్‌కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి. అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి? -
మనస్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణయం!
కర్నూలు: నగరంలోని కొత్తపేటలోని రామాలయం దగ్గర నివాసముంటున్న బోయ మహాలక్ష్మి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామానికి చెందిన ఈమె.. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయిబాబా సంజీవ నగర్లో ఉంటున్న అవ్వ భవానమ్మ వద్ద పెరిగింది. కొత్తపేటకు చెందిన అబ్దుల్ గనిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 8 నెలల కూతురు ఉంది. భర్త చికెన్ పకోడి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా వీరు నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో మహాలక్ష్మి మనస్తాపం చెందింది. బుధవారం తెల్లవారుజామున పాపను తీసుకెళ్లి పాలు తీసుకురమ్మని పంపి తిరిగి వచ్చేలోగా ఇంట్లో కొక్కికి చీరతో ఉరి వేసుకుంది. భర్త వచ్చి గమనించి ఉరి నుంచి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. అవ్వ భవానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం!
అనంతపురం: పొలానికి వెళ్లేందుకు దాయాదులు దారి విడువక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన ఆదినారాయణ, సావిత్రమ్మ దంపతుల రెండోకుమారుడు కాయల రామచంద్ర (26)కు సమీప బంధువులతో పొలం రస్తా విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుత్తి మండలం కొత్తపేట సమీపంలో తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను తొలగించి దిగుబడిని ఇంటికి తరలించేందుకు రామచంద్ర సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న దాయాదులు రస్తాకు అడ్డు వేయడంతో మూడు రోజులుగా ఎద్దులబండి అక్కడే ఆగిపోయింది. ఆదివారం మరోసారి దాయాదులతో రామచంద్ర మాట్లాడాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రామచంద్ర నేరుగా ఇంటికెళ్లి పురుగుల మందు డబ్బా తీసుకుని పొలం వద్దకు చేరుకుని తాగాడు. అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య -
ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం!
మహబూబ్‌నగర్: మండలంలోని దారారం చెందిన ఆవుల శ్రీనివాసులు(43) ఆత్యహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుల శ్రీనివాసులు శుక్రవారం కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చగట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి: వివాహేతర సంబంధమే కారణమా..?