
ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ: మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసీ)కి చెందిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలోని ఉమెన్స్ హాస్టల్‌లో యువతి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దివ్య యాదవ్‌గా గుర్తించారు. డిసెంబర్ 29 సాయంత్రం విడుదలైన మెడికల్ విద్య పరీక్ష ఫలితాల్లో రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యింది.
అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్లు దివ్య రూమ్‌మేట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 64వ నంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తండ్రికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment