MBBS
-
ఏ కాలేజీలోనూ సీట్లు పొందని వారితో స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీల్లో కన్వీ నర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సెలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి మూడు రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్ష న్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది.ఈ సీట్ల భర్తీ వల్ల ఖాళీ అయ్యే బీడీఎస్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద తిరిగి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పింది. కౌన్సెలింగ్‌లో విశ్వవిద్యాలయం వ్యక్తం చేసిన వాస్తవ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌కు నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతించాలంటూ 25న ఇచ్చిన ఉత్తర్వుల ను కొంత మేర సవరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి పెరిగిన సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, తరువాతి ర్యాంకుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల తాము నష్టపోతా మంటూ నలుగురు విద్యార్థినులు హైకోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నీట్లో అర్హత సాధించిన అందరినీ స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతిస్తే ఎన్ఎంసీ గడువైన డిసెంబర్ 6 లోగా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయడం చాలా కష్టమ ని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, జా యింట్ రిజిస్ట్రార్ (ప్రవేశాలు)తో పాటు యూనివర్సిటీ తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీని వాస్ ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ల తర ఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
పీజీ మెడికల్ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై విద్యార్థులు కోర్టుకు ఎక్కడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోర్టు కేసు తేలాకే ప్రవేశాలుంటాయని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతుండటంతో వివాదం నెలకొంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికులే అవుతారని వర్సిటీ పేర్కొంది. ఈ విధానం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వారు ఎక్కడా స్థానికులు కాని పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో టాప్ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. అలా జాతీయ విద్యాసంస్థల్లో చదివిన వారు రాష్ట్రంలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. ఇక కౌన్సెలింగ్ తరువాయి అనగా.. ఈ ఏడాది పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలాఖరున 2024–25 సంవత్సరానికి కనీ్వనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. నీట్ పీజీ–2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి గత నెల 31 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ‘స్థానికత’నిబంధనపై అభ్యర్థులు కోర్టుకు ఎక్కడంతో నిలిచిపోయింది. కోర్టు కేసు తేలాకే తదుపరి ప్రక్రియ జరుగుతుందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాప్యం కేవలం ప్రవేశాలు పొందే విద్యార్థులకే కాకుండా... ప్రస్తుతం మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. జూనియర్లు ప్రవేశాలు పొందితే తప్ప వారు అక్కడ్నుంచి రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 50% జాతీయ కోటాతోనూ అన్యాయం! స్థానిక కోటాతోపాటు తెలంగాణ విద్యార్థులకు నేషనల్ పూల్ కింద జాతీయ స్థాయికి వెళ్లే సీట్లలోనూ అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వాసులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో జాతీయ కోటా కిందకు దాదాపు 600 సీట్లు వెళ్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను జాతీయ కోటా నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ ఎక్కువగా అవకాశం పొందుతున్నారని వారంటున్నారు. ఎంబీబీఎస్‌లో నేషనల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో మాత్రం ఏకంగా సగం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ కోటాలో నింపే మన రాష్ట్రంలోని 600 పీజీ మెడికల్ సీట్లలో దాదాపు 300 ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ వర్గాలు సైతం చెబుతున్నాయి. -
Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి
గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్పూర్ పటాన్‌లోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు.హాస్టల్లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్‌ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్‌లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్‌ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిషేధించింది. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయిన చింతా స్నిగ్ధ
-
పీజీ వైద్య విద్య అవకాశాలకు గండి
సాక్షి, అమరావతి: తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఏపీలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదివిన వారంతా రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని, ఒకటి నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించ డం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండి పడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తోందని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళా శాలలో తెలంగాణాకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వారికి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కన సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. 646 జీవోకు ఎందుకు సవరణ చేయలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ జీవోకు సవరణ చేయా ల్సిందేనని మెడికోలు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా.. వద్దంటూ లేఖ రాసి గండికొట్టిన ప్రభుత్వం.. తాజాగా పీజీ విద్య విషయంలోనూ క్షమార్షం కాని తప్పిదం చేసిందంటున్నారు. మెడికోల వాదన ఇలా..రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పీజీ మెడికల్ ప్రవేశాల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానికులుగా పరిగణిస్తోంది. రాష్ట్ర కోటా సీట్లలో వారికి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 460కి పైగా ఆల్ ఇండియా, 600 మేర సీ కేటగిరి, బీ కేటగిరిలోనే బీ1 కింద 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సీట్లలో పెద్ద ఎత్తున అడ్మి షన్లు పొంది ఎంబీబీఎస్ చదువుతుంటారు. అలాగే కన్వీనర్ కోటా కింద గత ఏడాది వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులు 40 శాతం మంది ఎంబీబీఎస్ చదివారు. ఇలా ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారందరికీ స్థానికత కల్పించడంతో వందల సంఖ్యలో పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణా రాష్ట్రం పీజీ అడ్మిషన్ల నిబంధనలను సవరించింది. మన వాళ్లు ఎక్కడ చదివినా స్థానికత కల్పించాలిఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఎంబీబీఎస్ చది విన వారికి స్థానికత కల్పించే విధానాన్ని రద్దు చేయాలి. ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కింద ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా పీజీలో మన దగ్గరే స్థానికత కల్పించాలి.మన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు స్థానికత ఇవ్వ నప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి మనం స్థానికత ఇవ్వడం సరికాదు. ఆ మేరకు నిబంధనలు సవరించాలి. లేదంటే మన విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
కన్వినర్ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వినర్, బీ కేట గిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లను భర్తీ చేశారు. ఎని మిది మేనేజ్మెంట్ సీట్లు మినహా అన్నింటి లోనూ విద్యార్థులు చేరిపోయారు. ఎనిమిది మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఆరు బీ కేటగిరీ, రెండు ఎన్ఆర్ఐ కోటా సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల భర్తీ లిస్టును విడుదల చేసింది. మిగిలిన 8 సీట్ల కు అన్ని దశల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అందుకు అనుమతి కోరి నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాకుంటే అవి మిగిలిపోతాయని అధికారులు వెల్లడించారు. కాగా, కన్వినర్ కోటాలో గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఈసారి సీట్లు దక్కాయి. బీసీ ఏ కేటగిరీలో గరిష్టంగా 3.36 లక్షల నీట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. తుది జాబితా అనంతరం వర్సిటీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి ప్రైవేట్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.93 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ బీలో 2.29 లక్షలు, బీసీ సీలో 3.15 లక్షలు, బీసీ డీలో 2.14 లక్షలు, బీసీఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఓపెన్ కేటగిరీలో 1.98 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గరిష్టంగా 1.80 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. మేనేజ్మెంట్ కోటాలో 13.90 లక్షల ర్యాంకుకు సీటు రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ) కోటాలో గరిష్టంగా 13.90 లక్షల నీట్ ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే బీ కేటగిరీలో గరిష్టంగా 5.36 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చిందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీ, సీ కేటగిరీలో తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి జాబితాను వర్సిటీ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కన్వినర్ కోటాలో అధిక ర్యాంకర్లకు సీట్లు రాగా, మేనేజ్మెంట్ కోటా సీట్లలో మాత్రం గత ఏడాదికి అటుఇటుగా ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈసారి రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డికి చెందిన రెండు కాలేజీల సీట్లు ఈసారి డీమ్డ్ సీట్లుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లోని సీట్లు రాష్ట్రానికి తగ్గాయి. కాగా, ఈసారి ఒక కొత్త కాలేజీ వచ్చింది. ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలు పెరగడంతో 400 కన్వినర్ కోటా సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కిందకు వెళ్తాయి. అయితే వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు భర్తీ కాకపోతే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు -
నేడు స్ట్రే వేకెన్సీ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ సీట్లను ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం కేటాయించనుంది. స్ట్రే వేకెన్సీ ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. రాత్రి 9 గంటలకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన వారు నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, స్ట్రే వేకెన్సీ రౌండ్ 1కు 18 సీ కేటగిరి సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
తెల్లకోటు కలలు ఛిద్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో మన రాష్ట్రంలో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. డాక్టర్ కావాలని కలలుగని రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనేకమంది తెల్లకోటు కలలు ఛిద్రమయ్యాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఈ ఏడాది అనుమతులను అడ్డుకోవడంతో పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించినా.. ఓసీలతో పాటు బీసీ, ఎస్సీ విద్యార్థులకూ సీటు దక్కలేదు. మూడోరౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తరువాత పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో జనరల్ విభాగంలో 502 మార్కుల వరకు ప్రభుత్వ కోటా సీటు లభించింది. అదే మన రాష్ట్రంలో ఏయూ రీజియన్‌లో 513 మార్కుల (1,85,817 ర్యాంకు) వద్దే ఎస్సీ విభాగంలో సీట్ల కేటాయింపు నిలిచిపోయింది.ఇదే ఎస్సీ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో 433 మార్కుల వరకు సీట్లు దక్కాయి. అంటే మన దగ్గర కంటే 80 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీట్లతో ఎంబీబీఎస్ పూర్తిచేసే అదృష్టం లభించింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే అత్యధికంగా బీసీ–ఏ విభాగంలో మన విద్యార్థులు 146 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ప్రభుత్వ సీటు లభించలేదు. మంజూరైన సీట్లనూ వద్దన్న బాబు సర్కారు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరుల్లో ఒక్కోచోట 150 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు రాబట్టలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఒక్క పాడేరు వైద్యకళాశాలకు మాత్రం కేవలం 50 సీట్లు దక్కాయి. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరైనా మాకొద్దని ఎన్ఎంసీకి ప్రభుత్వమే లేఖరాసి రద్దుచేయించింది. ప్రభుత్వ తీరుతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఈ కారణంగా మన విద్యార్థులకు జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు పెరగకపోవడంతో 500 నుంచి 560 వరకు స్కోర్ చేసిన బీసీ, ఎస్సీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు లభించలేదు. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ.లక్షలు వెచ్చించి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నర్సింగ్, వెటర్నరీ, బీడీఎస్ వంటి ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాది రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయన్న నమ్మకంలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వమే మా తెల్లకోటు కలను ఛిద్రం చేసిందని బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడో విడత కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించింది. విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఆదేశించారు. గడువులోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయడం కోసం ఆదివారం కూడా పనిదినంగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించారు.ప్రిన్సిపల్స్ బదిలీ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం కోసం కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు, వాటి బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా నిరి్మంచిన ఐదు వైద్య కళాశాలలు ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే కొత్త కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం వీటిలో సీట్ల కేటాయింపులను అడ్డుకుంది. ఇప్పుడు ఆ బోధనాస్పత్రుల స్థాయిని తగ్గిస్తోంది. డీఎంఈ నుంచి సెకండరీ హెల్త్‌కు ఆస్పత్రులను అప్పగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ పని చేసే వైద్యులను పాత కళాశాలలు, బోధనాస్పత్రులకు సర్దుబాటు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రిన్సిపళ్లను, సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. -
ఇంకెన్ని రోజులు?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నత్తతో పోటీ పడుతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మూడో దశ సీట్ల కేటాయింపు నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీకన్నా ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో సైతం మూడో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా గత సోమవారం సీట్లను కేటాయించారు. ఆల్ ఇండియా కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయి మాప్ అప్ రౌండ్ ప్రారంభం కానుంది. అయితే.. ఏపీలో మాత్రం ఇంకా సీట్లు కేటాయించలేదు. ఒకవైపు తరగతులు ప్రారంభమయ్యాయి. మరోవైపు మూడో రౌండ్లో సీటు వస్తుందో లేదో నిర్ధారించుకుని లాంగ్‌టర్మ్ కోచింగ్ వెళ్లడం, లేదంటే ప్రత్యామ్నాయంగా వెటర్నరీ, ఆయుష్, బీడీఎస్ కోర్సులకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు.ఇప్పటికే బీడీఎస్ మొదటి విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఆయుష్ కోర్సులకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. కౌన్సెలింగ్ కూడా మొదలు కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకాక విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోయారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త కళాశాలలు ప్రారంభమై పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగడంతో కటాఫ్ గణనీయంగా తగ్గాయి. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో 150 మార్కుల మేర కటాఫ్ ఎక్కువగా ఉంటోంది. -
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ. బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. -
మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావుడా?
సాక్షి, అమరావతి: ఈ సంవత్సరం మెడికల్ పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రాకుండానే రాష్ట్రంలో హడావుడిగా రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగించేశారని,, పైగా, ఆలస్య రుసుము పేరిట భారీగా భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల చేశారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ రావాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కోటాలో ప్రవేశాలు ప్రారంభించాలి. అయితే, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు ఇంకా షెడ్యూల్ రాలేదు. మరోపక్క ఇన్‌సర్వీస్ కోటా కుదింపును సవాల్ చేస్తూ సరీ్వస్ ఎంబీబీఎస్ వైద్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా ఆరోగ్య విశ్వవిద్యాలయం గత నెల 27న రాష్ట్ర కోటాలో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారంతో ఆన్లైన్ దరఖాస్తులకు గడువు కూడా ముగిసింది. ఆలస్య రుసుముతో శనివారం నుంచి సోమవారం వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పైగా, ఆలస్య రుసుము కూడా సాధారణ ఫీజుకంటే నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తోంది. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఓసీ, బీసీ వైద్యులకు ఆన్లైన్ దరఖాస్తు రుసుము రూ.7,080 ఉంటే.. ఆలస్య రుసుము రూ. 27,080గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.5,900 సాధారణ రుసుము ఉంటే ఆలస్య రుసుము రూ.25,900 చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలోనే ఇలా ఆలస్య రుసుముల పేరిట భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ రాకపోవడంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇంకా అడ్మిషన్లు ప్రారంంభించలేదని, ఏపీలో మాత్రం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియనే ముగిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్వినర్ కోటా అడ్మిషన్లను హడావుడిగా ముగిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డిని వివరణ కోరగా.. ఏటా కొందరు అభ్యర్థులు దరఖాస్తుల గడువు ముగిశాక కోర్టులకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకుంటున్నారని, దాని ప్రభావం కౌన్సెలింగ్‌పై పడుతోందని చెప్పారు. అందువల్లే ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటామని, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ మొదలయ్యాకే రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. -
ఎంబీబీఎస్ పూర్తి చేయని వైద్యుడితో చికిత్స.. హార్ట్ పేషెంట్ మృతి
కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్‌కు తెలిసింది. 2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారుఅయితే ఆర్ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్‌ను అబూ అబ్రహం లూక్గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్‌ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్మెంట్తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్మెంట్లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు. -
పీజీ వైద్యవిద్యలో క్లినికల్ కోర్సుల్లో రిజర్వేషన్ 15 నుంచి 20% పెంపు
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపుబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. -
ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలైంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అన్ని సాక్షా్య లతో వర్సిటీ ఈ–మెయిల్ knrugadmission@gmail.comకు పంపించాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు. అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతేడాదికి సంబంధించిన కాలేజీలవారీ సీట్ల కేటాయింపు వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని.. వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్... స్థానికతకు సంబంధించిన జీవో–33ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం.. కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఈసారి కౌన్సెలింగ్ ఆలస్యమైంది. జీవోను సవాల్ చేసిన పిటిషనర్లలో అర్హత ఉన్న వాళ్లను కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని.. సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో–33 నుంచి పిటిషనర్లకు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు.. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తుది తీర్పును మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో కోర్టుకు వెళ్లిన 132 మంది పిటిషనర్లకు కూడా చోటు కల్పించింది. మరోవైపు తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న పిటిషనర్లలో మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నట్లు తేలింది. దీంతో వారిని తెలంగాణ జాబితా నుంచి తిరస్కరించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కాగా, అఖిల భారత స్థాయిలో ఎస్టీ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన గుగులోత్ వెంకట నృపేష్ కాళోజి వర్సిటీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి, మూడో స్థానంలో మహమ్మద్ ఆజాద్ సాద్, నాలుగో స్థానంలో లావుడ్య శ్రీరాం నాయక్ ఉన్నారు. -
జలపాతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవాహంలో సీహెచ్ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. -
ఈ ఒక్కసారికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూఢ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ ఏడాదికి గాను సదరు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 33ని తీసుకువచి్చంది. నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలని లేదా నివాసం ఉండాలని (జీవో 33 లోని నిబంధన 3 (ఏ)) పేర్కొంది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహం అభిరామ్‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని నివేదించారు. హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వకేట్లు మురళీధర్, నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. 4 తీర్పులు అనుకూలంగా ఉన్నాయి: సింఘ్వీ నీట్ పరీక్షలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9, 10తో పాటు ఇంటర్ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సింఘ్వీ చెప్పారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టు కు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీట్ పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు తెలంగాణలో నీట్ తీసుకుంటున్నారని, అదే తెలంగాణ విద్యార్థులకు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ జీవో సరికాదు ప్రభుత్వ వాదనలతో విభేదించిన విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్.. కేవలం రెండు, మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు. నీట్ ఫలితాలకు వారం ముందు జీవో తెచ్చారని, అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు.ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని.. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన 371 (డీ) çపదేళ్ల తర్వాత ఎక్స్పైరీ అయ్యిందని, అందుకే పదేళ్ల తర్వాత ఈ కొత్త నిబంధనను ప్రభు త్వం తెచి్చందని తెలిపారు. అయితే వన్ టైం ఎక్సె ప్షన్ (ఒక్కసారికి మినహాయింపు) కింద ఈసారి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకా శం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలోనే తొలి, అక్టోబర్ మొదటి వారంలో రెండవ కౌన్సెలింగ్ ఉన్నందున కోర్టును ఆశ్రయించిన విద్యార్థుల మేలు కోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మెరిట్స్‌లోకి వెళ్లే సమయం లేదు ఇరుపక్షాల వాదనల అనంతరం.. మెరిట్స్‌లోకి వెళ్లేంత సమయం లేదన్న సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఏమంది? ఒక విద్యార్థి తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మా సనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గద ర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని పేర్కొంది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
తెలంగాణకు 8 ఏపీకి సున్నా..
ఏపీలో కాలేజీ రెడీ.. మరి మెడికల్ సీట్లు ఎందుకు రాలేదు బాబూ?ఇక్కడ కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ. దీనిని సర్వహంగులతో గత ప్రభుత్వం సిద్ధం చేసింది. బోధనాస్పత్రి, కాలేజీ భవనాలు, స్కిల్ ల్యాబ్, హాస్టళ్లు, సిబ్బంది.. ఇలా అన్నీ సమకూర్చింది. ఈ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అను మతులు కూడా ఇచ్చి0ది. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసింది. తెలంగాణలో కాలేజీ లేదు.. శిలాఫలకమే ఉంది.. మరి సీట్లు ఎలా వచ్చాయి బాబూ?తెలంగాణలోని మహేశ్వరం ప్రాంతంలోని మెడికల్ కాలేజీ శంకుస్థాపన శిలాఫలకం. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. అయినా 50 సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు వచ్చాయి. వెంటనే ప్రైవేటు భవనాల్లో తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసేసింది. తెలంగాణలో ఈ ఏడాది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కాగా మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి వైద్య కళాశాలలకు భవనాలే లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల భవనాలను అద్దెకు తీసుకున్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం వేల కుటుంబాల్లో విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. డాక్టర్ కావాలనే ఆశయంతో నీట్లో ఉత్తమ స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీట్ దక్కక తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ‘పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి 8 కొత్త వైద్య కళాశాలలు రావడంతో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఏపీలోనూ సిద్ధంగా ఉన్న ఐదు కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా వస్తాయని ఆశపడ్డాం. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే వద్దని నిరాకరించింది. కాలేజీలకు అనుమతులు రాకుండా కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. ఈ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉండేది. ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసి ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా మరో 1,050 సీట్లు నష్టపోతున్నాం.రెండేళ్లలో మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో ఇక వైద్య విద్య కల నెరవేరే అవకాశం లేదు. లాంగ్ టర్మ్ శిక్షణ కోసం ఇప్పటికే రూ.లక్షల్లో వెచ్చించిన మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది..’ అనే చర్చ ప్రస్తుతం ప్రతి నీట్ ర్యాంకర్ల కుటుంబాల్లో సాగుతోంది. నీట్ అర్హులకు సంబంధించిన వాట్సప్ గ్రూప్‌ల్లో ఆ మెసేజ్‌లే చక్కర్లు కొడుతున్నాయి.కుట్రపూరితంగా కాలదన్ని సాకులుపులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిల్లో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ వాటికి అనుమతులు రాబట్టకుండా మోకాలడ్డింది. గత ప్రభుత్వ కృషితోపులివెందుల కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఎల్ఓపీ మంజూరు చేసినా.. కళాశాల నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాయడంతో అనుమతులు రద్దయ్యాయి. ఇక పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లకు అనుమతులు రాగా ఈ కాలేజీ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా..తెలంగాణకు 2024–25 విద్యా సంవత్సరంలో 8 కొత్త వైద్య కళాశాలలు మంజూరు కావడంతో 400 సీట్లు అదనంగా సమకూరాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇలాంటి సానుకూల పరిస్థితి ఉండగా ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటైనా, కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా విద్యార్థుల ప్రయోజనాలను కాలరాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పులివెందుల కళాశాలను నిర్వహించలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాసి అడ్డంగా దొరికిపోవడం.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో సాకులను అన్వేషిస్తోంది. గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే సీట్లొచా్చయా?కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడానికి తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి చర్యలు తీసుకోలేదని గత నెల 16న మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒప్పుకున్నారు. ఈ ఏడాది ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో వైఎస్ జగన్ సర్కారు వైద్య కళాశాలలను ప్రారంభించేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. మరి గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలకు 50 సీట్లను ఎన్ఎంసీ ఎందుకు మంజూరు చేస్తుందని వైద్య రంగ నిపుణులు, ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తెలంగాణలో అదనంగా సీట్లు సమకూరడంతో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు దక్కుతుండగా ఏపీలో మాత్రం 600 దాటినా నిరాశే మిగులుతోందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.తప్పు కప్పిపుచ్చేందుకు సతమతంవైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సతమతం అవుతున్నారు. మేం వచ్చి మూడు నెలలే అయింది... వసతులు ఎలా కల్పిస్తామని అంటున్నారు. ఈ ఏడాది కనీసం 50 సీట్లతో కళాశాలలు ప్రారంభించినా వచ్చే ఏడాది పెంచుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మార్గాలు అనేకం ఉంటాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో భవనాలు అందుబాటులోకి రాకముందే తరగతులు ప్రారంభించారు. తాత్కాలికంగా విజయవాడలో కొద్ది రోజులు తరగతులు నిర్వహించి అనంతరం అక్కడకు మార్చారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో భవనాలు అందుబాటులోకి రానందునతాత్కాలిక భవనాల్లో ప్రభుత్వం కళాశాలలు నిర్వహిస్తోంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుపై రాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయా లని భావిస్తోంది. అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ’సాక్షి’ లో ‘వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కన్ను’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు.ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వినర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, డీమ్డ్ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతోనూ మంత్రి సమీక్ష చేసినట్టు తెలిసింది. యూజీసీ తీరు బడుగు, బల హీన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం చేసే విధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్టు అధికారులు చెబుతున్నారు. ‘మల్లారెడ్డి’ బాటలో మరికొన్ని కాలేజీలు! మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ హోదాను ఇస్తూ ఇటీవలే యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటివన్నీ వర్సిటీ హోదాలో సొంతంగా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ స్థానిక కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 150 బీడీఎస్ (డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. గతేడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్లో మంచి ర్యాంక్ సాధించిన ప్రతి భ గల విద్యార్థులకు ఈ సీట్లు దక్కేవి. ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయించేవారు. కానీ ఇకపై ఈ నిబంధనలు ఏవీ పాటించాల్సిన అవసరం లేకుండా యూజీసీ ‘మల్లారెడ్డి’కి మినహాయింపులు ఇచి్చంది. ‘మల్లారెడ్డి’చూపిన బాటలో అపోలో, సీఎంఆర్ కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. కోట్లలో ఆదాయం! డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు రూ. వందల కోట్ల లబ్ధి చేకూరుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ. 60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెగ్యులేటరీ కమిటీ ఫీజులను నిర్ణయిస్తోంది. అయితే డీమ్డ్ యూనివర్సిటీలు ఈ కమిటీతో సంబంధం లేకుండా, సొంతంగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని యూజీసీ కల్పిస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు సంవత్సరానికి రూ.17.5 లక్షలుగా ఉన్నట్టు కాళోజీ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్వినర్ కోటా ఫీజు కింద 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అవే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక్క బ్యాచ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది. -
ఏ కాలేజీలో ఏ ర్యాంకు వరకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో 2023–24 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కటాఫ్ ర్యాంకు వివరాలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలుండగా... ఇందులో 8,715 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలో 15 శాతం, మిగిలిన సీట్లు కన్వినర్ కోటాలో భర్తీ చేస్తుండగా... ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లలో బీ కేటగిరీ సీట్లు పోను ఎన్ఆర్ఐ, మేనేజ్మెంట్ కేటగిరీల్లో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో మాప్‌అప్ కౌన్సెలింగ్ ముగిసే నాటికి కాలేజీల వారీగా, కేటగిరీ వారీగా సీటు దక్కించుకున్న చివరి ర్యాంకు వివరాలతో కూడిన జాబితాను కేఎన్ఆర్యూహెచ్ఎస్ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ విడుదల చేసిన చివరి ర్యాంకుల జాబితా కేవలం 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనివి మాత్రమే. రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తగా 4 వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్థానికతపై తెగని పంచాయితీ... యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ జాడలేదు. ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే తొలిరౌండ్ పూర్తి కాగా... రెండో రౌండ్ దరఖాస్తు, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సైతం ముగిసింది. నేడో, రేపో రెండోరౌండ్ సీట్ల కేటాయింపు సైతం పూర్తి కానుంది. సాధారణంగా ఆలిండియా కోటా సీట్ల భర్తీ తొలి రౌండ్ పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో మొదటి రౌండ్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేది.కానీ రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత ఖరారుపై నెలకొన్న వివాదంతో కౌన్సెలింగ్ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఎలాంటి కాలేజీలో సీటు వస్తుంది? ఎక్కడ చేరితే మేలు? అనే అంశంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ యూజీ పరీక్షకు హాజరు కాగా... 47,356 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో అత్యధికులు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఏపీకి 10 శాతం కోటా సీట్ల కేటాయింపును రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. -
కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!
ఆశలు నీరు గార్చారుప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. – పూర్ణిమ, నీట్ విద్యార్థిని, చిత్తూరు జిల్లాసాక్షి, అమరావతి: ‘‘కొత్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై అదనంగా సీట్లు వస్తే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది..’’ ఇదీ వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ రంగంలో మనకు అదనంగా మెడికల్ సీట్లు సమకూరుతుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుంటుందా? కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చుకునేందుకు మరికొంత సమయం తీసుకోవాలని కేంద్రం ఉదారంగా ఆఫర్ ఇస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్ మోజుతో అలాగే వ్యవహరిస్తున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం (పీ–4) అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యవహరించని విధంగా ఆ సీట్లు మాకొద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసి దుర్మారంగా అనుమతులను రద్దు చేయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరి తమకు తెల్ల కోటు ధరించే అవకాశం దక్కుతుందని ఆశపడ్డ వారంతా సర్కారు తీరుపై నివ్వెరపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీలిచ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా వాటికి బేరం పెట్టి తీరని ద్రోహం తల పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలనూ నిలిపివేయడంతో రాష్ట్రం మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగి తమకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందనే ఆశతో రూ.లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. ఈ నిర్వాకం ఖరీదు.. 1,750 సీట్లు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరుల్లో ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కారు నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. గతేడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఈ ఏడాదీ అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీట్ లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1,750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో నాలుగు కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు రూ.లక్షల్లో అప్పులు చేసి విజయవాడలో ఇంటర్‌తోపాటు నీట్ యూజీ కోచింగ్‌లలో చేరి్పంచారు. గతంలో చివరి కటాఫ్ ర్యాంక్ వరకూ వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బులను వెచ్చించి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు తీసుకున్నారు. ఇంత అనుకూల పరిస్థితులున్నా.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి మరీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి వంద శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి.. ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు నిరాకరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప్రైవేట్ వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెట్టే తంతుకు తెర తీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బుకాయించి.. బుక్ అయిన ప్రభుత్వంఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం కచిన వసతుల ఆధారంగా ఎన్ఎంసీ పాడేరు కాలేజీకి 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున గత్యంతరం లేక చంద్రబాబు సర్కారు మిన్నకుంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) మంజూరు చేసింది. అయితే ఎల్‌ఓపీని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చినా మేం కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. ప్రభుత్వం గుట్టుగా లేఖ రాసిన విషయాన్ని ‘సాక్షి’ బట్ట బయలు చేసింది. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతోనే ఎల్‌ఓపీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్ మోసాలు బహిర్గతమయ్యాయి.మోసం చేశారు.. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. ఈ ఏడాది 750 సీట్లు అదనంగా సమకూరి ఉంటే కాస్త ర్యాంకు తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. నా బిడ్డ నీట్ రాసింది. ఐదు కొత్త కళాశాలలు ప్రారంభమైతే సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. యాజమాన్య కోటా కింద సీట్ కొనే స్థోమత మాకు లేదు. మాలాంటి వాళ్లను మోసం చేశారు. – నెహేమియా, నెల్లూరు, నీట్ రాసిన విద్యార్థి తండ్రి తప్పుడు నిర్ణయాలతో గందరగోళం ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తర్వాత మా అబ్బాయి 541 స్కోర్ సాధించాడు. బీసీ–డీ రిజర్వేషన్ కింద గతేడాది 497 స్కోర్‌కు ప్రైవేట్‌లో చివరి సీట్ వచ్చింది. ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కళాశాలలకు అనుమతులు వస్తే మా అబ్బాయికి సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఎస్వీ రీజియన్‌లోనే మూడు కళాశాలల ఏర్పాటుతో 450 సీట్లు సమకూరేవి. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనే స్థోమత లేదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా బాబు భవిష్యత్ గందరగోళంగా మారింది. – కోడూరు పెంచలయ్య, అన్నమయ్య జిల్లా తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవద్దు నా కుమార్తె రష్యాలోని కజికిస్తాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానికంగానే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామం. అలాంటిది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధ కలిగించింది. పులివెందులకు వచ్చిన సీట్లనూ వద్దనుకుంది. ఈ చర్య ముమ్మాటికీ తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవటమే. స్థానికంగానే మెడికల్ సీట్లు లభిస్తే నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు వ్యయ ప్రయాసల కోర్చి పిల్లలను విదేశాలకు పంపే అవసరం ఉండదు. – ఎం.చెన్నయ్య, వైద్య విద్యార్థిని అమూల్య తండ్రి, ఆదోని ఉచిత వైద్యం దూరం చేసే కుట్ర మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. దాంట్లో అనుభవజు్ఞలైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. – నూర్జహాన్, వేముల, వైఎస్సార్ జిల్లా -
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రంలో ఉద్యమమే : జూపూడి
సాక్షి,అమరావతి : రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేస్తుందంటూ వైఎస్సార్సీపీ నేత జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు.17 మెడికల్ కాలేజీల ద్వారా 5వేల మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యవిద్యను అందించే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం ఎవరందిస్తారని ప్రశ్నించారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం ఉండదా చంద్రబాబు అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలని సూచించారు.5వేల మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పేదల తరుఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్ధి ఉద్యమం నడుపుతామని చంద్రబాబును హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందింగ సురేష్‌ను పరామర్శకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనానికి బుద్ధిలేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నాం. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతోంది. వైఎస్ జగన్ ఛరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడేవాళ్లు ఇక్కడెవరు లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలితీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపుడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారువందేళ్ల చరిత్రలో తొలిసారిగా..వైఎస్ జగన్ హయాంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.