
సాక్షి, అమరావతి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ సీట్లను ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం కేటాయించనుంది. స్ట్రే వేకెన్సీ ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది.
అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. రాత్రి 9 గంటలకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన వారు నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, స్ట్రే వేకెన్సీ రౌండ్ 1కు 18 సీ కేటగిరి సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment