సాక్షి, భోపాల్: ఢిల్లీ మహిళను కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహ మరోక ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని షాదోల్ నివాసి రూబీ థాకూర్. ఆమె జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీస్ చదువుతోంది.
ఆమె తన క్లాస్‌మేట్ సౌరవ్ ఓజా అనే అబ్బాయితో కలసి జబల్‌పూర్‌కి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న భేదాఘాట్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఒక పెద్ద ట్రక్కు వారిని దారుణంగా ఢీ కొట్టింది. ఐతే బాధితురాలు రూబీ వెనుక కూర్చొని (పిలియన్ రైడర్)వెనుక కూర్చొని ఉండగా, బైక్‌ని అతని క్లాస్‌మేట్ సౌరవ్ డ్రైవ్ చేశాడు. ఈ ఘటనలో సౌరవ్ 20 మీటర్ల దూరంలో పడిపోగా, రూబీ శరీరం ట్రక్‌లో చిక్కుకుపోవడంతో.. సుమారు 100 మీటర్లు ఈడ్చకుని పోయింది. దీంతో శరీరం నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గాయపడిని సౌరవ్‌ని ప్రభుత్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కానీ అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే దర్యాప్తులో హెవీలోడ్ ట్రక్కు వారి బైక్‌ని వెనుక నుంచి ఢీ కొట్టినట్లు తేలిందని, ఆ ట్రక్కుని కూడా గుర్తించమని వెల్లడించారు. తాము నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!)
Comments
Please login to add a commentAdd a comment