ఘెరం: కారు ట్రక్కు ఢీ..మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి | Car And Truck Collide In Punjab Few Dead | Sakshi
Sakshi News home page

ఘెరం: కారు ట్రక్కు ఢీ..మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి

Published Mon, Jan 9 2023 1:38 PM | Last Updated on Mon, Jan 9 2023 2:23 PM

Car And Truck Collide In Punjab Few Dead - Sakshi

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందగా, ఒక మైనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వారంతో కారులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ‍ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు, ట్రక్కు ఘెరంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడికి తలకు తీవ్రగాయాలయ్యాయని, ఆస్పత్రిలో  ప్రాణాలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటాలాలో చోటు చేసుకుంది. వారు చాహల్‌ కలాన్‌లోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు. పంజాబ్‌లోని బటాలాకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement