collide
-
అమెరికాలో రెండు విమానాలు ఢీ..!
-
మరో ఘటన.. అమెరికాలో రెండు విమానాలు ఢీ
ఆరిజోనా: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుండి జారి రాంప్‌పై ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఆరిజోనాలోని స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా, మరో విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గత వారం.. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. -
విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండగ వేళ వారంతా దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. పిల్లల కేరింతలతో ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి. ఒకే కుటుంబంలో నలుగులు అనంతలోకాలు చేరుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గల నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ నుంచి బహేరీ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు టైరు పగిలి, డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న డంపర్‌ను ఢీకొంది. దీంతో ఈ రెండు వాహనాల్లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బందికి కబురంపారు. వారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, వాహనాలను రోడ్డు మధ్య నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే బహేరి నివాసి సుమిత్ గుప్తాకు చెందిన ఎర్టిగా కారు బుకింగ్‌పై నడుస్తోంది. బహేరీకి చెందిన నారాయణ్ నాగ్లా నివాసి ఫుర్కాన్.. బరేలీకి కారును బుక్ చేసినట్లు సమాచారం. బహెరీలోని మొహల్లా జామ్‌లో నివాసం ఉంటున్న ఉవైస్ పెళ్లి ఊరేగింపు బరేలీలోని ఫహమ్ లాన్‌కు చేరుకుంది. ఈ పెళ్లి ఊరేగింపులో వినియోగించేందుకు ఈ కారును బుక్ చేసుకున్నారు. పెళ్లి ఊరేగింపు పూర్తయిన తర్వాత కొందరు పెళ్లివారు కారులో రాత్రి 11.45 గంటలకు బహెరీకి తిరిగి వస్తున్నారు. భోజిపురా పోలీస్ స్టేషన్‌కు 1.25 కి.మీ దూరంలోని బహెరీ దిశలో ఉన్న దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు అకస్మాత్తుగా పగిలింది. దీంతో కారు బ్యాలెన్స్ తప్పి డివైడర్‌ను దాటి అటువైపు మళ్లి, ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొంది. పెద్ద శబ్ధంతో కారులో మంటలు చెలరేగాయి. డంపర్ ఈ కారును దాదాపు 25 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. డంపర్ ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదాన్ని చూసిన డంపర్ డ్రైవర్, హెల్పర్ భయంతో వాహనం నుంచి దూకి పారిపోయారు. ఆ రోడ్డుపై ఇతర వాహనాల్లో వెళ్తున్నవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంట తరువాత అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఎస్ఎస్పీ ఘులే సుశీల్ చంద్రభాన్, సీఓ నవాబ్‌గంజ్ చమన్ సింగ్ చావ్డా, సీఎఫ్‌వో చంద్రమోహన్ శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్నవారంతా సజీవదహనమయ్యారు.ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర? -
యుగాంతం వస్తే .. భూమ్మీద నిలిచే సజీవ సాక్ష్యాలివే
-
Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే..మూడు రైళ్లు..
ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనేది సర్వత్రా.. అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆ ఘటన గురించి ప్రత్యక్షసాక్షులు, అధికారుల కథనం మేరకు..ఈ భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కోరమాండల్ షాలిమర్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడం తోపాటు గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ అనే మరోరైలు పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు. మూడవ రైలు అదే సైట్లో ఆపి ఉంచిన గూడ్స్ రైలు ప్రమాదం బారిన పడినట్లు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ పెను ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఇక కార్యాచరణ వైఫల్యంపై ప్రశ్నల నేపథ్యంలో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే క్రాష్ జరిగిన ప్రదేశంలో సీసీఫుటేజ్ విజ్యువల్స్‌లో పట్టాలపై రైలు కోచ్‌లు చిన్నాభిన్నామై పోతున్నట్లుగా మెలిపెట్టే దృశ్యాలు కనిపించాయి. (చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం) -
ఘెరం: కారు ట్రక్కు ఢీ..మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందగా, ఒక మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వారంతో కారులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు, ట్రక్కు ఘెరంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడికి తలకు తీవ్రగాయాలయ్యాయని, ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటాలాలో చోటు చేసుకుంది. వారు చాహల్ కలాన్‌లోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు. పంజాబ్‌లోని బటాలాకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు
బెంగళూరు: పాముని రక్షించేందకని బ్రేక్ వేయడంతో వరసగా ఐదు వాహనాలు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు కంటైనర్ ట్రక్కు డ్రైవర్ బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి పాము ఒక్కసారిగా రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మరోట్రక్కు టాటా ఏస్, ఒక టిప్పర్, బండరాళ్లను తరలిస్తున్న మరో మినీ టిప్పర్ ఒక్కసారిగా ఒకదాని వెనుక ఒకటి ఘోరంగా ఢీ కొన్నాయి. ఐతే ఈ ప్రమాదంలో పలువురు డ్రైవర్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఆ పాము ట్రక్కు చక్రం కిందకు వచ్చినప్పటికీ హైవే పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. (చదవండి: యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు) -
తప్పిన పెనుముప్పు.. లేదంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవో!
సాక్షి,ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఆగి ఉన్న మినీ ట్రాలీలారీని ఆర్డీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ప్లాస్టిక్ ఫైపులతో వెళ్తున్న మినీ లారీ మరమ్మతులకు గురై కింతలిమిల్లు వద్ద నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు.. లారీని గమనించక ఢీకొట్టింది. బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, అందులో ఉన్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ కుదుపులకు కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను వేరే బస్సులో కాంప్లెస్కు తరలించారు. లారీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని పైపులు చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత -
మృత్యువులోనూ వీడని బంధం
చిన్ననాటి నుంచి వారిద్దరూ మిత్రులు. ఏ పనైనా కలిసే చేసుకునేవారు. ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అనుకుంటూ సాగేవారు. వీరిని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను విషాదాంతంగా ముగించింది. బాధిత కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో దర్శనమల ఫీల్డ్ అసిస్టెంట్ తలారి నరేంద్ర(24), అతని స్నేహితుడు అంకే రామాంజనేయులు(23) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దర్శనమలకు చెందిన నరేంద్ర, రామాంజనేయులు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇటీవలే రామాంజనేయులు తన వ్యవసాయ పొలంలో బోరు వేయించాడు. చీనీ మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. పొలంలోని మట్టిని అనంతపురంలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించేందుకు శుక్రవారం మిత్రుడు నరేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగిశాక మిత్రులిద్దరూ బైక్‌పై ధర్మవరం వైపు వస్తున్నారు. గరుడంపల్లి సమీపంలోకి రాగానే ఎస్కే యూనివర్సిటీలో పనిచేస్తున్న లక్ష్మీపతి ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి ఎదురుగా వీరి వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. సంఘటనా స్థలంలోనే ముగ్గురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్ర, రామాంజనేయులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ద్విచక్ర వాహనదారుడు లక్ష్మీపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రకు భార్య ఇందు, కుమార్తె సంతానం. రామాంజనేయులుకు భార్య రమాదేవి, కుమారుడు ఉన్నారు. ధర్మవరం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దర్శనమలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ మృతుల కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. (చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. చక్రం తిప్పిన పరిటాల బంధువు) -
బెక్‌ను ఢీకొన్న బస్సు: ఇద్దరికి గాయాలు
రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామం వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బూర్జ మండలం పాలవలసకు చెందిన వి.రాజేశ్వరి మండలంలోని బూరాడ గ్రామంలో తాతగారి ఇంటివద్ద ఉంటోంది. బయోమెట్రిక్ వేసేందుకు సొంత గ్రామం పాలవలస వెళ్లేందుకు బూరాడ గ్రామానికి చెందిన సీర యేసుబాబుతో ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాజాం వైపు వస్తుండగా రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ద్విచక్ర వాహనం బస్సు కిందకు వెళ్లిపోవడంతో వారు రోడ్డుపైన పడ్డారు. దీంతో రాజేశ్వరికి గాయాలు కాగా, యేసుబాబుకు తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రులను 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యేసుబాబును శ్రీకాకుళం తరలించినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: కారుకూతలు కూస్తే ఖబడ్దార్) -
గాలిలో ప్రాణాలు
దేవగఢ్: జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో ఆదివారం కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ఒక పర్యాటకురాలు మృతి చెందగా, 12 మంది గాయాలపాలయ్యారు. హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకదాని వెంట మరొకటి వెళ్తున్న రెండు కేబుల్ కార్లలో మొదటిది కిందకు జారి వచ్చి వెనకున్న రెండో కేబుల్ కారును బలంగా ఢీకొట్టింది. దేవగఢ్ పట్టణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రక్షణ చర్యలు నిలిచే సమయానికి కేబుల్ కార్లలోనే మరో 15 మంది ఉన్నారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించి ఆదివారం రాత్రి 11 మందిని మాత్రమే కాపాడగలిగింది. మిగిలిన వారు రోప్‌వే కేబుల్ కార్లలోనే అంత ఎత్తులో రాత్రంతా ప్రాణాలరచేతపట్టుకుని గడపాల్సి వచ్చింది. వారికి అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందజేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లతో సోమవారం తిరిగి సహాయక చర్యలను కొనసాగించారు. సాయంత్రం సమయానికి కేబుల్ కార్లలో చిక్కుబడిపోయిన 32 మంది పర్యాటకులను సురక్షితంగా తీసుకురాగలిగారు. కేబుల్ కార్లు ఢీకొనడంతో ఆదివారం తీవ్రంగా గాయపడి ఒక మహిళ చనిపోగా సహాయక చర్యల సమయంలో బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ నుంచి జారి పడి మృతి చెందారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే మాలిక్ తెలిపారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. చీకటి పడటంతో సోమవారం రాత్రి సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. మరో 15 మంది ఇంకా కేబుల్ కార్లలోనే ఉన్నారని చెప్పారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంగళవారం ఉదయమే తిరిగి ప్రయత్నాలు కొనసాగిస్తామని మాలిక్ పేర్కొన్నారు. రోప్‌వే వ్యవస్థలో తలెత్తిన లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని దేవగఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా ఆ వెంటనే రోప్‌వే నిర్వాహకులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా 1,100 అడుగుల ఎత్తు, 766 మీటర్ల పొడవైన ‘త్రికూట్ రోప్‌వే’కు దేశంలోనే పొడవైందిగా పేరుంది. 2019 డిసెంబర్లో కశ్మీర్‌లోని గుల్మార్గ్లో రోప్‌వే తెగి కేబుల్ కార్లలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు ముగ్గురు టూరిస్ట్ గైడ్లు ప్రాణాలు కోల్పోయారు. #WATCH | A recce was conducted by one of the helicopters in the morning and operations are underway in coordination with the district administration and NDR to rescue people from ropeway site near Trikut in Deoghar, Jharkhand pic.twitter.com/Mum5Tq73nq — ANI (@ANI) April 11, 2022 (చదవండి: మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిలిపివేత) -
రెల్వేకు రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,445 రూటు కిలోమీటర్లను కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించారు.‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రైల్వేశాఖ ఈ కవచ్ ప్రాజెక్టును చేపట్టింది. గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో 859 కిలోమీటర్లను కవచ్ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఈ పరిధిని 1,445 కిలోమీటర్లకు విస్తరించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) ఆధ్వర్యంలో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నియంత్రించడం, ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినా బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పని చేయడం కవచ్ సాంకేతికతలోని ప్రత్యేతలు. దశలవారీగా అభివృద్ధి.. దక్షిణమధ్య రైల్వే కవచ్ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట ‘వాడి’ నుంచి వికారాబాద్ వరకు, సనత్‌నగర్– వికారాబాద్ – బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం అదనంగా 32 స్టేషన్లకు, 322 కిలోమీటర్లకు విస్తరించారు. గత ఏడాది కవచ్‌ను మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్లకు పొడిగించారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ 133 రైల్వేస్టేషన్లు, 29 ఎల్సీ గేట్లను, 74 లోకోమోటివ్లను కవర్ చేస్తూ 1,445 కిలోమీటర్లకు విస్తరించినట్లయింది. ప్రత్యేకతలివీ.. రైళ్లు, లోకోమోటివ్‌లు ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడాన్ని కవచ్ నివారిస్తుంది. సిగ్నలింగ్ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ (డీఎంఐ), లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ (ఎల్‌పీఓసీఐపీ)లో– అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్ బ్రేకింగ్ వ్యవస్థగా కవచ్ పని చేస్తుంది. రైళ్లు లెవల్ క్రాసింగ్ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజువలింగ్ వ్యవస్థగా ఇది అప్రమత్తం చేస్తుంది. నెట్వర్క్ మానిటర్ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుంది. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి
2 South Korea Air Force Planes Collide: దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణా విమానాలు శుక్రవారం గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు మరణించగా, మరోకరు గాయపడినట్లు అధికారులు తెలపారు. రెండు కేటీ-1 శిక్షణా విమానాలు ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు. మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది. (చదవండి: అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్) -
వింత జననం: ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ
Woman Gave Birth To Plastic Baby: ఇంతవరకు మనం రకరకాలుగా పుట్టిన వాళ్ల గురించి విన్నాం. అంతేందుకు అవిభక్త కవలలు గురించి విన్నాం. ఇతరత్ర సమస్యలతో పుట్టిన వాళ్ల గురించి కూడా విని ఉంటాం. కానీ ఎప్పుడైన ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం గురించి విన్నామా!. ఏంటిది కామెడీగా చెబుతున్నాను అనుకోకండి. నిజంగానే ప్లాస్టిక్ బిడ్డే పుట్టింది. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) అసలు విషయంలోకెళ్లితే... ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ మహిళ సదర్ ఆసుపత్రిలో వింత బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉందని తెలిపారు. వైద్య శాస్త్ర భాషలో, అటువంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అంటారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ...ప్రపంచంలో పుట్టిన 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారని తెలిపారు. ప్రసుత్తం ఈ బేబి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పలేం. పైగా ఎంతకాలం వరకు బతుకుతుందో కూడా చెప్పలేం అని అన్నారు. అయితే తండ్రి స్పెర్మ్‌లో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుడుతుందని ఎస్ఎన్సీయూ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ దూబే చెప్పారు. ఈ మేరకు గత ఏడేళ్లలో అటువంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. అయితే ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. అంతేకాదు ఈ చిన్నారి కూడా ఆరోగ్యవంతంగా ఉండి సాధారణ జీవితం గడపగలదనే భావిస్తున్నాం అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
కారు బీభత్సం.. టైరు పగిలి.. మూడు బైకులను ఢీకొట్టి..
సాక్షి,ధర్మారం(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టైరు పగిలిపోయి.. అదుపు తప్పి, మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం రేవెళ్లి గ్రామానికి చెందిన పల్లపు శంకరయ్య–నాగమ్మ దంపతులు శనివారం ఉదయం రాయపట్నం వద్ద గల గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది. ధర్మారం చేరగానే కారు టైరు పగిలి, అదుపుతప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో రెండు బైకులను కొట్టేసి, ఆగిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య కాలు విరిగింది. నాగమ్మ, ఇంకో బైక్‌పై ఉన్న ధర్మారం గ్రామానికి చెందిన ఒల్లెపు ఎల్లయ్య స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం శంకరయ్యను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. ఆ విషయం తెలిసి పవిత్ర నిలదీయగా.. -
రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!!
ఒక్కోసారి అనుహ్యంగా జరిగే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే, అటువంటి ఘటనల్లో ఎవ్వరికీ ఏం నష్టం జరగకపోతే పర్వాలేదు గానీ ఊహించని విధంగా ప్రాణం నష్టం సంభవిస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. తాజాగా అటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ) వీడియో ప్రకారం.. ఏమైందో తెలియదు గానీ, చెరకు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ భాగం ఒక్కసారిగా ప్రజల మీదకు దూసుకొస్తోంది. ఊహించని ఘటనతో కంగుతిన్న అక్కడున్నవారు అప్రమత్తమై తప్పుకోండి.. తప్పుకోండి అని అరవడం మొదలెట్టారు. మరికొంతమంది అలవాటులో పొరపాటుగానో.. లేక నిజంగానే అంత బలమైన, వేగంతో పరుగెడుతున్న ట్రాలీని ఆపగలమనే భ్రమతోనో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక లోడ్‌తో ఉన్న ట్రాలీ జనం మధ్యగుండా వేగంగా వెనక్కి వెళ్లి ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. విషయం ఏంటంటే.. ఓ ట్రాక్టర్ చెరకు లోడ్‌తో వచ్చింది. దానిని అన్లోడ్ చేద్దామని.. ట్రాలీని ఇంజన్ భాగం నుంచి వేరు చేశారు. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాలీని ఇంజన్ నుంచి విడదీయడంతో అది ఒక్కసారిగా వెనక్కి లగెత్తింది. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే.. అప్పటి వరకు అక్కడ చీకటి కమ్ముకోగా.. ట్రాలీ ఢీకొట్టడంతో స్తంభానికి ఉన్న లైట్ ఒక్కసారిగా వెలిగింది. "ఏవిధంగా ట్రాలీని ఆపగలమనుకుని పరుగెడుతున్నారంటూ" కొందరు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేశారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) जान माल का नुकसान तो नहीं हुआ लेकिन दूसरा बल्ब चालू हो गया 🤣🤣😁😅😀 pic.twitter.com/wIf2nhW1jM — Doctor Gulati L L B (@DRGulati80) November 12, 2021 -
త్రుటిలో తప్పిన యుద్ధనౌకల ఢీ
టోక్యో: తూర్పు చైనా సముద్రంలో అమెరికా, రష్యా యుద్ధనౌకలు శుక్రవారం ఢీకొట్టుకోబోయాయి. అయితే చివరి నిమిషంలో రెండునౌకల కెప్టెన్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై అమెరికాకు చెందిన 7వ ఫ్లీట్ స్పందిస్తూ..‘మా నౌక యూఎస్ఎస్ చాన్స్లర్విల్లే తూర్పుచైనా సముద్రంలో శుక్రవారం స్థిరంగా వెళుతోంది. ఈ క్రమంలో వెనుకే వస్తున్న రష్యన్ డెస్ట్రాయర్ యుద్ధనౌక ఒక్కసారిగా వేగం పెంచి 50 మీటర్ల సమీపానికి వచ్చేసింది. దీంతో యూఎస్ఎస్ ఛాన్స్లర్విల్లేలోని అన్ని ఇంజన్లను మండించి రెండు నౌకలు ఢీకొట్టకుండా చూడగలిగాం. రష్యా వ్యవహారశైలి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా స్పందిస్తూ..‘మా అడ్మిరల్ వినొగ్రడోవ్ డెస్ట్రాయర్ నౌక వెళుతున్న మార్గానికి అడ్డంగా అమెరికా యుద్ధనౌక అకస్మాత్తుగా వచ్చేసింది. దీంతో మా నౌకను మరోదిశకు మళ్లించి రెండు యుద్ధనౌకలు ఢీకొట్టుకోకుండా నివారించగలిగాం. ఈ విషయంలో అమెరికాకు మా నౌకాదళం నిరసనను తెలియజేసింది’ అని చెప్పింది. -
కారు–నాన్‌స్టాప్ బస్సు ఢీ
సామర్లకోట : సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డ్రైవరు వాహనంలోనే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఎం.రాజబాబు వద్ద వడ్డి అనిల్‌దాసు(35) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. రాజబాబును శనివారం కాకినాడలో దింపిన అనిల్‌దాసు రాజమహేంద్రవరం వెళ్తూ ఉండగా జ్యోతుల గొడౌన్ సమీపంలో ఎదురుగా వస్తున్న నాన్‌స్టాప్ బస్సును ఢీ కొనడంతో కారు ముందుభాగం నుజ్జయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న అనిల్‌దాసు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం చినుకుల పడడంతో కారు అదుపు తప్పి బస్సును ఢీకొంది. దాంతో నాన్‌స్టాప్ బస్సు కుడివైపు ఉన్న తుప్పల్లోకి పొయింది. వెంటనే డ్రైవరు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో బస్సులో కాకినాడకు తరలించారు. నాన్‌స్టాప్ వెనుక పెద్దాపురం మండలం తూర్పు పాకల నుంచి వస్తున్న చెరకు ట్రాక్టరు డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గమనించి బ్రేక్ వేయడంతో ఎడమ వైపు నుంచి వస్తున్న ట్రాక్టరు కుడివైపు రోడ్డు మార్జిన్లో తుప్పలో బోల్తా పడింది. ట్రాక్టరు డ్రైవరును స్థానికులు వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మార్జిన్లో కారు, రోడ్డుకు అడ్డుగా బస్సు నిలిచి పోవడంతో సామర్లకోట–పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ రామారావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, కాకినాడ జాయింట్ 1 రిజిస్ట్రార్ రాజబాబు, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కె.సుందరరావులు సంఘటన ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ ఎస్సై సతీష్ తన సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న డ్రైవరు సీటు బెల్టు పెట్టుకుని ఉంటే కొంత వరకు ప్రమాదం తప్పేదని స్థానికులు అంటున్నారు. -
కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ
వాషింగ్టన్: అమెరికా నేవికి చెందిన యుద్ధనౌక ఒకటి జపాన్ సముద్ర తీరంలో ఓ కార్గో నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది అమెరికా నేవీ సిబ్బందితోపాటు కార్గో సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వేకువ జామున 2.30 గంటల 3.00గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని యోకోసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన ఫిట్జరాల్డ్ అనే ఓ క్షిపణి విధ్వంసక నౌక, పిలిప్పీన్స్ జెండాను కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో నౌక సరిగ్గా 2.30గంటల ప్రాంతంలో అతి సమీపంగా వచ్చాయని ఆ సమాయంలోనే ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నట్లు అమెరికాకు చెందిన ఏడో నేవీ దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ద నౌకలో దాదాపు 330మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల ఓ చోట రంధ్రం ఏర్పడి నీరు లోపలికి వస్తుందని, దాన్ని తాము నియంత్రించగలమని చెప్పారు. -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బైపాస్ పై వేగంగా వస్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ఆటోలు ఢీ, 10 మందికి తీవ్రగాయాలు
చింతపల్లి : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం... కొండమల్లేపల్లి వైపు నుంచి∙ఓ ఆటో, చింతపల్లి వైపు నుంచిlవస్తున్న మరో ఆటో నసర్లపల్లి స్టేజీ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చింతపల్లికి సంతకు వెళ్లి వస్తున్న నసర్లపల్లి గ్రామానికి చెందిన పద్మ, సాలమ్మ, సంతోష, యాదయ్య, వెంకటయ్య, వెంకటేష్, సుకుమార్, కౌసల్య, లక్ష్మి, నాగమణి, యాదమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం చింతపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
రైలు ఢీకొని మంత్రి బంధువు దుర్మరణం
రాప్తాడు : మండల పరిధిలోని ప్రసన్నాయపల్లి సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు. మరొకరు గుంటూరు జిల్లా వాసి. వివరాలిలా ఉన్నాయి. మంత్రి సునీత మేనమామ గొరిదిండ్ల కృష్ణమూర్తి నాయుడు కుమారుడు గిరీష్ నాయుడు (31), గుంటూరు జిల్లాకు చెందిన అరవిందకుమార్ (30) రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. గిరీష్ నాయుడు సైట్ కోఆర్డినేటర్ (ఎస్సీవో) కాగా.. అరవిందకుమార్ ఫైబర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. 44వ జాతీయ రహదారి పక్కనున్న అయ్యవారిపల్లి సమీపంలోని రిలయన్స్ 4జీ టవర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లోని మరొక 4జీ టవర్ మధ్య ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనుసంధానం చేయాల్సి ఉంది. దీంతో వీరిద్దరూ బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రూట్ సర్వేకు వెళ్లారు. రైల్వేలైన్ మీదుగా కేబుల్ తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో అనుమతి కోసం రైల్వే శాఖకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రసన్నాయపల్లి సమీపంలోని రైల్వే ఐరన్ బ్రిడ్జిపై ఎల్సీ నంబర్లు తెలుసుకోవడానికి దానిపైకి వెళ్లారు. నంబర్లు చూస్తున్న సమయంలోనే రైలు వచ్చింది. ఎటూ తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. క్షణాల్లోనే రైలు వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారుజామున వెలుగులోకి.. రాత్రి ఏడు గంటలకే ఘటన జరిగినా గురువారం తెల్లవారుజామున రెండు గంటల దాకా వెలుగులోకి రాలేదు. తమవారు రాత్రి ఎంతసేపటికీ ఇళ్లకు రాకపోయేసరికి వారి కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్లు చేశారు. అయితే..వారి ఫోన్లు పనిచేయలేదు. దీంతో ఆఫీసు సిబ్బందితో వాకబు చేశారు. రూట్ సర్వే విషయం గురించి తెలుసుకుని అటుగా గాలింపు మొదలుపెట్టారు. చివరకు రెండు గంటల సమయంలో వారి మృతదేహాలను రైలుపట్టాలపై కనుగొన్నారు. సంఘటన స్థలాన్ని ధర్మవరం రైల్వేసీఐ జగదీష్, ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, మంత్రి సోదరులు బాలాజీ, ధర్మవరం మురళి పరిశీలించారు. బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
చెన్నైలో లారీ - బస్సు ఢీ 8 మంది మృతి
-
73 మంది సజీవదహనం
అఫ్గాన్‌లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్ ఢీ ఘజ్ని: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్-కాందహార్ జాతీయ రహదారి ఆదివారం మరుభూమిని తలపించింది. ఘజ్ని రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 73 మంది సజీవదహనమయ్యారు. వెనకెనుక వస్తోన్న రెండు బస్సుల్ని, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించింది. మహిళలు, పిల్లలు సహా పలువురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. హృదయ విదారక దృశ్యాలు చూపరుల్ని కన్నీళ్లు పెట్టించాయి. ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆఫ్గానిస్తాన్ చరిత్రలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదొకటని భావిస్తున్నారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని, ఎక్కువ మంది తీవ్రంగా కాలిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ కవూసీ తెలిపారు. మృతులు ఇంకా పెరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాయాలతో బయటపడ్డవారికి కాందహార్, ఘజ్ని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అంతర్యుద్ధంతో ఘోరంగా దెబ్బతిన్న రోడ్డు.. 125 మంది ప్రయాణికులతో రెండు బస్సులు కాబూల్ నుంచి కాందహార్‌కు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎదురుగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఒక బస్సును ఢీకొనడంతో వెనక బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. 52 మంది సంఘటనా స్థలంలో విగతజీవులవగా, 21 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ విభాగ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్యుద్ధం దెబ్బకు అఫ్గాన్‌లో రోడ్లు కూడా దారుణంగా పాడైపోయాయి. గతేడాది మేలో బడ్గిస రాష్ట్రంలో మినీ వేన్ బోల్తా పడి 18 మంది మరణించారు. 2013లో కాందహార్ దక్షిణ ప్రాంతంలో బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది మృతిచెందారు. దీంతో అఫ్గాన్‌లో రోడ్ల అభివృద్ధికి గతేడాది నవంబర్‌లో రూ. 1675 కోట్ల సాయం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..
ఇనుపాముల(కేతేపల్లి) : మండలంలోని ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 38 మంది ప్రయాణికులతో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈక్రమంలో మార్గమధ్యలో మండలంలోని ఇనుపాముల శివారులో గల బైపాస్ జంక్షన్ వద్ద హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యే లోపే బస్సు లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సు ఎడమ వైపున ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన ఆళ్లపాటి శివకుమార్, రేపల్లెకు చెందిన తుమ్మల శ్రీహరి, వంశీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ వి.బాలగోపాల్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన ట్రాక్టర్
గరిడేపల్లి: మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ట్రాక్టర్‌పై వస్తున్న లింగయ్య రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో... ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న స్తంభం కూలిపోయి హైటెన్షన్ విద్యుత్ తీగలు కిందపడ్డాయి. అదే సంమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
విమానాలు ఢీ : ఏడుగురు మృతి
బ్రటిస్లావా : స్లోవేకియాలో ఎయిర్ షో కోసం గురువారం ప్రాక్టీసు చేస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలోని పలువురు ప్రయాణీకులు ప్యారాచుట్ల ద్వారా కిందకి దూకేశారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ రెండు విమానాల్లో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపింది. విమాన శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతంలో పడి ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం మూడు హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టిందని వివరించింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా పట్టణం రాజధాని బ్రటిస్లావాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. -
చైనాలో రెండు విమానాలు ఢీ
బీజింగ్: రెండు విమానాల్లోని ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చైనాలోని గ్వాంగ్ఝో బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డాంగ్ ప్రావిన్స్‌లో మంగళవారం రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ విమానం రెక్క మాత్రం పాక్షికంగా దెబ్బతింది. చైనా సౌతర్న్, ఈస్టర్న్ ఎయిర్లైన్ప్ ఈ విమానాలను నడుపుతున్నాయి. సౌతర్న్ ఎయిర్‌లైన్స్ విమానం పాక్షికంగా దెబ్బతింది. -
ఔటర్‌రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం
-
రెండు ఇసుక లారీలు ఢీ
చెన్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ముందు వెళ్తున్న ఇసుక లారీని మరో ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో వెనక లారీలో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కెపల్లి ఇసుక క్వారీ నుంచి ఇసుక లోడ్లతో లారీలు బయల్దేరారుు. బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ బ్రేక్ వేసి వాహన వేగాన్ని తగ్గించాడు. వెనకాలే వస్తున్న మరో ఇసుక లారీ డ్రైవర్ గమనించలేదు. వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టాడు. వెనక లారీలో ఉన్న క్లీనర్ దూకడంతో అతడికి గాయూలేమికాలేదు. డ్రైవర్ కొప్పుల రవీందర్‌రెడ్డి వాహనంలో ఇరుక్కుపోయూడు. గమనించి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపేసి వాహనంలో ఇరుక్కుపోరుున రవీందర్‌రెడ్డిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. అతడిని 108లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి స్వగ్రామమైన వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖయ్యూం తెలిపారు.