పాముని కాపాడేందుకు బ్రేక్‌ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు | Five Vehicle Pile Up In Karnataka Trying To Save Snake | Sakshi
Sakshi News home page

పాముని కాపాడేందుకు బ్రేక్‌ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు

Published Thu, Dec 8 2022 3:41 PM | Last Updated on Thu, Dec 8 2022 4:49 PM

Five Vehicle Pile Up In Karnataka Trying To Save Snake - Sakshi

బెంగళూరు: పాముని రక్షించేందకని బ్రేక్‌ వేయడంతో వరసగా ఐదు వాహనాలు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు కంటైనర్‌ ట్రక్కు డ్రైవర్‌ బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి పాము ఒక్కసారిగా రావడంతో అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు.

దీంతో వెనుక ఉన్న మరోట్రక్కు టాటా ఏస్‌, ఒక టిప్పర్‌, బండరాళ్లను తరలిస్తున్న మరో మినీ టిప్పర్‌ ఒక్కసారిగా ఒకదాని వెనుక ఒకటి ఘోరంగా ఢీ కొన్నాయి. ఐతే ఈ ప్రమాదంలో పలువురు డ్రైవర్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఆ పాము ట్రక్కు చక్రం కిందకు వచ్చినప్పటికీ హైవే పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. 

(చదవండి: యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement