brake
-
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
Viral Video: బ్రేక్ టెస్టింగ్ చేసిన బస్సు
-
పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు
బెంగళూరు: పాముని రక్షించేందకని బ్రేక్ వేయడంతో వరసగా ఐదు వాహనాలు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు కంటైనర్ ట్రక్కు డ్రైవర్ బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి పాము ఒక్కసారిగా రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మరోట్రక్కు టాటా ఏస్, ఒక టిప్పర్, బండరాళ్లను తరలిస్తున్న మరో మినీ టిప్పర్ ఒక్కసారిగా ఒకదాని వెనుక ఒకటి ఘోరంగా ఢీ కొన్నాయి. ఐతే ఈ ప్రమాదంలో పలువురు డ్రైవర్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఆ పాము ట్రక్కు చక్రం కిందకు వచ్చినప్పటికీ హైవే పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. (చదవండి: యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు) -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్‌పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్‌పై ఆలూరు నుంచి గేట్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది. -
కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎక్కడా వీటిని నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కోడి పందేల పేరుతో జూద క్రీడలు, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్, యాని మల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వీటిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వు లిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఆదేశాలు ఏమేరకు అమలవుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కొన్నేళ్లుగా సంప్రదాయం పేరుతో ప్రజాప్రతినిధులే ముందుండి కోడిపందేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా భీమవరంలో ప్రకృతి ఆశ్రమం, వెంప, లోసరి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, కాళ్ల మండలం సీసలి, ఉండి మండలం మహదేవపట్నం తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం, లింగపాలెం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో భోగి రోజు నుంచి కనుమ వరకు రాత్రీపగలు తేడా లేకుండా.. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ‘ఉత్త’ర్వులేనంటూ.. గత ఏడాది కూడా హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను తోసిరాజని ప్రజాప్రతి నిధులు స్వయంగా కోడిపందేలు వేశారు. కత్తులు కట్టకుండా డింకీ పందేలు ఆడిస్తున్నామంటూ.. ఎడాపెడా పందేలు వేయించారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా జిల్లావ్యాప్తంగా భోగి రోజు మొదలు కోడి పందేలు ఆడించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 50కి పైగా బరులను ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం. హైకోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈసారి మాత్రం కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని ఏలూరు రేంజి డీఐజీ పీవీ రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 325 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామని వివరించారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితో పాటు పందేలను ప్రోత్సహించే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. గేమింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువార్డ్స్ యానిమల్స్.. సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల నేపథ్యంలోనే జిల్లాలో సీఐల బదిలీలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే. బదిలీ రేసులో ఉన్న ప్రతి సీఐలు తమకు కావాల్సిన ప్రాంతం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు అధికార పార్టీ నేతలను కాదని కోడి పందేలను ఏ మాత్రం అడ్డుకుంటారో తేలాల్సి ఉంది. మూడు రోజులపాటు సాగే పందేలు, జూదాల్లో సుమారు రూ.200 కోట్లు చేతులు మారతాయని అంచనా. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతికి మూడు వారాల ముందే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో పందేలరాయుళ్లలో కలకలం మొదలైంది. స్వైపింగ్ యంత్రాలు సిద్ధం! పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కష్టాలు తలెత్తడంతో పందేల్లోనూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్వైపింగ్ మెషిన్లు సమకూర్చుకున్నట్టు భోగట్టా. నగదు సమకూరని పరిస్థితుల్లో వీటిని వినియోగించాలన్నది నిర్వాహకుల ఉద్దేశం. ఇదిలావుంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని బ్యాంకుల నుంచి కొందరు నెల రోజులుగా రూ.2 వేల నోట్ల సేకరణలో నిమగ్నమయ్యారు. రూ.100 నోట్లనూ అందుబాటులో ఉంచుకుంటున్నారు. కోడిపందేల సమయానికి రూ.500 కొత్త నోట్లు ఎలాగూ అందుబాటులోకి వస్తాయని, తద్వారా పందేల జోరు మరింత ఎక్కువగా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. చిన్న పందేల్లో కూడా రూ.2 వేలకు తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. జూద క్రీడలకు వేలం పాటలు కోడిపందేల బరుల ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇప్పటికే గుండాట, కోతాట వంటి జూద క్రీడల కోసం స్థలాలు కేటాయించి వేలం నిర్వహిస్తున్నారు. గతేడాది పూలపల్లి, యలమంచిలి, భీమవరం, ఉండి, వెంప తదితర ప్రాంతాల్లో ఒక్కో బరి వద్ద జూదక్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బరులు సమకూర్చిన వారికి రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించారు. అదే విధానం కొనసాగిస్తూ ఇప్పుడు కూడా వేలం మొదలైంది. -
నిండా మునించిన నిర్లక్ష్యం
మానాల వద్ద కాకతీయ కాల్వకు భారీ గండి 1500 ఎకరాల్లో నీట మునిగిన పంటలు మ్యాడంపల్లి ఎస్సీ కాలనీ జలమయం 300 కుటుంబాలు శిబిరానికి తరలింపు మూడేళ్ల క్రితం ఇదే డి–65 వద్ద గండి ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న వైనం నిధులివ్వని సర్కారు.. పూర్తికాని కాల్వ లైనింగ్ పునర్మించడానికి 20–30 రోజులు పట్టే అవకాశం జగిత్యాల అగ్రికల్చర్/మల్యాల : గతకొద్ది రోజులుగా ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీకి నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మానాల సమీపంలోని డీ–65 డిస్ట్రిబ్యూటరీకి వద్ద కాల్వకు గండి పడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మల్యాల మండలం మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు తక్కళ్లపల్లి శివారులో సహాయ శిబిరం ఏర్పాటు చేసి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక సహా ఎస్సారెస్పీ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. కాల్వలో వస్తున్న నీటిని ఎస్కేప్ రెగ్యులేటర్ల ద్వారా ఎగువ ప్రాంతంలోని చెరువులకు మళ్లిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వకు మల్యాల మండలం మానాల వద్ద భారీ గండి పడి, సాగు, తాగునీరు వృథా కావడమే కాకుండా నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీనికంతటికి ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం కారణంగా కనపడుతోంది. మానాల గుట్టల కింద నుంచి సొరంగ మార్గం ద్వారా కాకతీయ కాల్వ వెళ్తోంది. గుట్టలు దాటిన తర్వాత లోతట్టు ప్రాంతం ఉండగా, దాని పక్కనే దమ్మక్క చెరువుంది. దీంతో ఇక్కడ కాకతీయ కాల్వ నిర్మించే సమయంలో కాల్వకు రెండు పక్కల మట్టి పోశారు. ఇక్కడే చెరువు నింపేందుకు, పొలాలకు సాగునీరు అందించేందుకు డి–65 డిస్ట్రిబ్యూటరీ నిర్మించారు. ప్రస్తుతం ఈ డిస్ట్రిబ్యూటరీ దగ్గరే గండి పడింది. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా డిస్ట్రిబ్యూటరీ వద్ద లీకేజీ ఏర్పడుతోంది. నీరు విడుదల చేసినప్పుడల్లా ఏర్పడే చిన్న చిన్న లీకేజీలను ఎస్సారెస్పీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇసుక బస్తాలతో మరమ్మతు ప్రస్తుతం కాలువకు గండిపడ్డ ప్రదేశంలో గతంలో పలుమార్లు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇలా జరిగినప్పుడల్లా తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయడం, చిన్నపాటి మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటైంది. సకాలంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం కావడంతో ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో మరమ్మతు పనుల కోసం దాదాపు రూ.25 లక్షలతో అంచనావేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, నిధులు మంజూరు కాలేదని సమాచారం. తాజాగా ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీకి తరలించేందుకు కాల్వ సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేశారు. దీనికితోడు కాలువకు ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటరీ తూములను మూసివేశారు. కొంపల్లె చెరువు వద్ద ఉన్న సైఫన్ వద్ద ఉన్న మూడు గేట్లకు బదులుగా అధికారులు రెండు గేట్లు మాత్రమే తెరవడంతో నీటి కాల్వలో నీటిమట్టం పెరిగింది. దీంతో గతంలో గండిపడిన డీ–65 తూము వద్ద మరోసారి గండి పడింది. మూడేళ్ల క్రితం డీ–65 తూము వద్ద గండిపడగా, తాత్కాలిక చర్యల్లో భాగంగా ఇసుక సంచులతో గండిపూడ్చారు. శాశ్వత పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో టెండర్ రద్దు చేశారు. మరోవైపు కాకతీయ కాల్వ లైనింగ్‌పై పెరిగిన చెట్లతోపాటు పలుచోట్ల లైనింగ్ పగుళ్లు ఉన్నచోట్ల పెరిగిన చెట్లను కొట్టివేసి కాల్వలోనే పడేస్తుండటం కూడా ఒక కారణంగా కనపడుతోంది. నెలరోజుల క్రితం కొంపల్లె చెరువు సమీపంలోని సైఫన్ వద్ద కాలువలో కొట్టిపడేసిన చెట్లు వచ్చి గేట్లకు అడ్డుగా ఆగడంతో కాలువ మునిగేందుకు ఆరమీటర్ మాత్రమే మిగిలింది. స్థానికుల సమాచారం మేరకు జేసీబీ సాయంతో వాటిని తొలగించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఇక్కడ అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులను అటు ప్రభుత్వం, ఇటు ఎస్సారెస్పీ యంత్రాంగం విస్మరించింది. పూర్తి కాని లైనింగ్ ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ వరంగల్ జిల్లా వరకు 284 కిలోమీటర్లు పొడవుంది. కాల్వ ప్రారంభం నుంచి జగిత్యాల మండలం మోరపల్లి వద్దగల డి–53 (68 కి.మీ) వరకు సిమెంట్ లైనింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. వేసవిలో 68–84 కి.మీ. వరకు లైనింగ్ చేపట్టారు. ప్రస్తుతం 84–146 కి.మీ.(కరీంనగర్ వరకు) లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మధ్యలోనే డి–65 (దాదాపు 90 కి.మీ) వద్ద మానాల వద్ద గండి పడింది. గత రెండేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో కాల్వ వెంబడి పిచ్చిమొక్కలు పెరిగాయి. వీటిని గమనించకుండా మామూలు లీకేజిగానే భావించడంతోనే భారీగా గండి పడింది. కాలువ పరిస్థితి అంతంతే.. కాకతీయ కాల్వ గరిష్ట సామర్థ్యం 9750 క్యూసెక్కులు. కాల్వ వెడల్పు 37.796 మీటర్లుంది. కాల్వ బలహీనంగా మారడంతో 4–6 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుంటారు. గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని వదిలితే కాల్వకు పలుచోట్ల మానాల మాదిరిగా గండ్లు పడే అవకాశం ఉంది. కాల్వ వెంబడి నిర్మించిన సైఫన్లు, అక్విడేట్లు, యూటీలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా యూటీలలో (కింది నుంచి వర్షం నీరు పోవడం, పై నుంచి కాలువ పోవడం) ఇసుక మేటలు వేసి వర్షం వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. కాకతీయ కాల్వ వెంబడి దాదాపు 20 వరకు యూటీలు ఉన్నప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు. మరమ్మతులు పూర్తయితేనే పంటలకు నీళ్లు మానాల వద్ద కాల్వ గండి పూడ్చివేత పనులు పూర్తయితేనే తిరిగి పంటలకు సాగునీరు అందించే అవకాశముంది. ప్రస్తుతం గండి పడిన చోట మరమ్మతులు పూర్తి కావాలంటే కనీసం 20–30 రోజులు పట్టే అవకాశం ఉంది. గండి పడినచోట భూమి లెవల్లో కాల్వ ఉండదు కాబట్టి కొత్తగా సిమెంట్‌తో నిర్మించాల్సి ఉంటుంది. -
పోస్టు మాస్టర్ల భర్తీకి బ్రేక్?
50 వేల దరఖాస్తులు బుట్టదాఖలు రూ.10 లక్షలు ఖర్చు చేసిన నిరుద్యోగులు నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటం ఆన్లైన్ విధానం ద్వారా భర్తీ చేసే యోచనలో పోస్టల్ శాఖ ఖమ్మం గాంధీచౌక్: గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచి పోస్టు మాస్టర్ల ఖాళీల భర్తీ వ్యవహారం అడ్డం తిరిగింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 51 బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోస్టల్ శాఖ ఉన్నతాధికారుల అనుమతితో జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 27 నుంచి జూన్ 25 వ తేదీ లోగా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ పోస్టుల్లో రిజర్వేషన్లను కూడా కల్పించారు. దీంతో 10వ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన నిరుద్యోగులు, బీటెక్ చదివిన నిరుద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 51 పోస్టులు కావటంతో ఒక్కో నిరుద్యోగి తన రిజర్వేషన్‌కు అర్హత ఉన్న ప్రతి చోట దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టుల్లో మాత్రమే పంపాలని పేర్కొనటంతో అభ్యర్థులకు మరింత ఖర్చయింది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 ల వరకు ఖర్చు కాగా, పట్టణాలకు వచ్చి స్పీడ్ పోస్టు, రిజిష్టర్ పోస్టు చేయడానికి మరో రవాణా ఖర్చులు మరో రూ.50 అయ్యాయి. జిల్లాలో ఉన్న 51 పోస్టులకు మొత్తం 50 వేల దరఖాస్తులు అందాయి. దరఖాస్తులు బుట్టదాఖలు నిరుద్యోగులు కోటి ఆశలతో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచి పోస్టు మాస్టర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలు కానున్నాయి. దరఖాస్తుల గడువు ముగిశాక దాదాపు నెల రోజుల కాలంలో పోస్టులు భర్తీ జరుగుతాయని ప్రచారం జరిగింది. ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పోస్టు భర్తీకి నెల రోజుల గడువు పడుతుందని భావించారు. అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణయించిన విధంగా భద్రపరిచారు. గతంలో ఖమ్మం పోస్టల్ డివిజన్ విజయవాడ సర్కిల్లో ఉండేది. రాష్ట్రం విడిపోవడంతో ఇటీవల ఖమ్మం డివిజన్‌ను హైదరాబాద్ సర్కిల్‌కు మార్చారు. దీంతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో సర్కిల్ ఉన్నతాధికారులు బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల భర్తీని కూడా నిలిపివేయాలని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో జిల్లా పోస్టల్ శాఖ అధికారులు పోస్టుల భర్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టారు. ఆన్లైన్ విధానం వైపు చర్యలు.. బ్రాంచి పోస్టు మాస్టర్ భర్తీలో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సేకరించే విధానాన్ని అనుసరించాలని పోస్టల్ శాఖ భావిస్తుంది. పారదర్శకతను పాటించటం కోసం, ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండటం కోసం ఆన్లైన్ విధానాన్ని అనుసరించి చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు జిల్లా స్థాయి పోస్టల్ అధికారులకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కూడా సూచనలు చేశారు. రూ.10 లక్షల ఖర్చు ... బ్రాంచి పోస్టు మాస్టర్ ఎక్కడో ఓ చోట వస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆశపడి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 50 వేల దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవటానికి నిరుద్యోగులు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారని పోస్టల్ శాఖ అధికారులు, ఉద్యోగులే లెక్కలేశారు. ఖర్చులు మొత్తంగా దరఖాస్తుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటం నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటమాడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. దరఖాస్తులు చేసి 50 రోజులు గడిచినప్పటికీ ఇంత వరకు పోస్టుల భర్తీ విషయంలో ఆ శాఖ ఎటువంటి ప్రకటనలు చేయటం లేదు. దీంతో దరఖాస్తు చేసి పోస్టులు వస్తాయని ఆశగా ఉన్న అభ్యర్థులు జిల్లా ప్రధాన పోస్టాఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం : ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ మల్లికార్జున శర్మ బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల ప్రక్రియపై ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం. పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించటం లేదు. అధికారుల నుంచి జారీ అయ్యే విధానాలతో పోస్టుల భర్తీ జరుగుతుంది. శాఖాపరమైన నిర్ణయాలను పాటిస్తాం. -
మాజీ ప్రియుడు కంటపడితే...!
గాసిప్ లవ్ చేసుకోవడం, బ్రేకప్ అనుకోవడం ఈ రోజుల్లో కామన్. ప్రేమబంధం నుంచి ఎంత తెగతెంపులు చేసుకున్నా, కొన్నాళ్ల తర్వాత తన ప్రియుడు లేదా ప్రియురాలు వేరొకరితో కనిపిస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని చూడటానికి కూడా ఇష్టపడరు. కాలం ఎంత ఫాస్ట్ అయినా ఈ ఒక్క విషయంలో మాత్రం మార్పు రాలేదు. కానీ కత్రినా కైఫ్‌కు మాత్రం ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కైఫ్ బాలీవుడ్లో అడుగుపెట్టింది సల్లూ భాయ్ ఆశీస్సులతోనే. ఆ తర్వాత వీరిద్దరూ ఫ్రెండ్స్ నుంచి లవర్స్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ, హఠాత్తుగా ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్నాళ్లకు రణ్‌బీర్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది కత్రినాకైఫ్. ఇప్పుడు వీరిద్దరి ప్రేమ పెళ్లిదాకా వెళుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కూడా. అయితే ఇంతలో ఏమైందంటే... హీరోయిన్ సోనమ్‌కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి సల్మాన్‌ఖాన్ హాజరయ్యారు. అంతవరకూ ఓకే. సడన్‌గా ఆ పార్టీకి రణ్‌బీర్-కత్రినా కైఫ్‌లు కూడా రావడంతో అసలు ఏం జరుగుతుందా? అని అక్కడున్న వాళ్లు ఎదురుచూశారు. సల్మాన్‌ను చూసి ఈ జంట షాక్ తిని, ఆ పార్టీలోనే వేరే చోటికి వెళ్లిపోయారు. కానీ సల్మాన్ మాత్రం వెతుక్కుంటూ వెళ్లి మరీ, కత్రినా కైఫ్‌ను పలకరించారట. విచిత్రం ఏమిటంటే పక్కనున్న రణ్‌బీర్‌తో ఒక్కమాట కూడా మాట్లాడలేదట. ఈ వార్త మాత్రం బాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. -
8.9 లక్షల ఫియట్ వాహనాలు రీకాల్
డెట్రాయిట్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'ఫియట్' పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలిచింది. ఫియట్ క్రిస్లర్కు చెందిన వాహనాల యాంటీ లాక్ బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్‌లలో సమస్యలు తలెత్తడంతో ఫియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలలో జీప్, డోగ్జే, ఫియట్ ఎస్యూవీ రకానికి చెందినవి ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థలో తేమ చేరే అవకాశాలు ఉన్నందున, సమస్యను పరిష్కరించడానికి వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు ఫియట్ తెలిపింది. ఈ నిర్ణయంతో 2012 నుండి 2015 మధ్య కాలంలో తయారైన 5.5 లక్షల డోగ్జే వాహనాలలో సమస్యలను పరిష్కరించనున్నారు. -
బదిలీలకు బ్రేక్
ఎన్నికలు ముగిసినా తప్పని ఎదురుచూపులు 24లోపు జరగాల్సిన బదిలీలు నిలుపుదల కొత్త ప్రభుత్వం వచ్చాకే నిర్వహణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.. అయినా ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తాత్కాలిక బదిలీలకు మోక్షం కలగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఈ తతంగం చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ నెల 24లోపు జరగాల్సిన బదిలీల తంతుకు బ్రేక్ పడింది. జిల్లా నుంచి తాత్కాలికంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసులు పూర్వ స్థానాలకు వచ్చేందుకు మరో 15రోజులు పడిగాపులు తప్పేట్టు లేదు. సాక్షి, మచిలీపట్నం : వరుస ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లిన జిల్లా అధికారులను మళ్లీ వెనక్కి పంపే ప్రక్రియలో జాప్యం జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో స్థానిక (సొంత జిల్లా) అధికారులు ఎవరూ ఉండకూడదన్న నిబంధనతో బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు చెందిన ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసులను ఇతర జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ చేశారు. 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు, కొందరు పోలీసు అధికారులు ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో పనిచేసే స్థానిక ఎంపీడీవోలు 47 మంది, 43 తహశీల్దార్లు, పోలీసులను కూడా కృష్ణాజిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఎవరి స్థానాల్లోకి వారిని పంపేందుకు ఈ నెల 24వ తేదీలోగా కసరత్తు పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు గతంలో ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున ఈ ప్రక్రియ విధివిధానాలపై ప్రధాన మంత్రి ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంతలోనే ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల బదిలీలకు సాంకేతిక అభ్యంతరం వచ్చింది. దీనికితోడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పదవీ విరమణ చేయడం, కొత్త సీఎస్‌ను నియమించకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. దీంతో ఈ నెల 24వ తేదీలోగా చేయాల్సిన బదిలీలు ఆగిపోయాయి. జూన్ రెండో తేదీ తరువాత కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాల ఆమోదం తీసుకుని ఈ బదిలీలు చేసేందుకు ఉన్నత స్థాయి అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. కలెక్టర్‌కు బదిలీ ఉంటుందా? రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు బదిలీ ఉంటుందా అనేది అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌లకు బదిలీలు లేకపోయినా కన్ఫమ్డ్ ఐఏఎస్‌గా ఉన్న రఘునందన్‌రావుకు బదిలీ తప్పదని పలువురు చెబుతున్నారు. అయితే ఆప్షన్లు ఉన్నందున ఆయన జిల్లాలోనే ఉండేలా కోరుకుంటారా, సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారా అనేది ఆసక్తిగా మారింది. 2013 అక్టోబర్ 13న జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ఆయన అనతికాలంలోనే తనదైన ముద్ర వేశారు. అటు అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను మంచి అధికారిగా మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఆయన సమర్థవంతంగా పనిచేసి ఎటువంటి సమస్యలూ లేకుండా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఆయన బదిలీ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.