
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్‌లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈసీ బ్రేక్ వేసింది.రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆన్‌లైన్‌లో ఇటీవలే పౌరసరఫరాల శాఖ ఒక ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసింది.రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ శనివారం(ఫిబ్రవరి 8) ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈసీ ఆదేశాలతో రేషన్ కార్డుల ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేసింది.కాగా, తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.కొత్తగా రేషన్‌కార్డుకు అర్హత పొందిన వారి జాబితాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
కాగా, తెలంగాణలో ప్రస్తుతం టీచర్లతో పాటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వం ఎలాంటి కొత్త స్కీమ్‌లను అమలు చేయరాదన్న నిబంధనలున్నాయి. దీనిలో భాగంగానే రేషన్‌కార్డుల పోర్టల్‌ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment