ration cards
-
కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!
మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవాన ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మురిపించారని, తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న జిల్లాలోని 31 గ్రామాల్లో 1066 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అప్పటికే కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 81,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన 80వేల మందికి పైగా దరఖాస్తుదారులు తమకు కార్డు ఎప్పుడొస్తుందనే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తకార్డుల పంపిణీకి బ్రేక్‌పడిందని కొన్నాళ్లపాటు చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం కార్డులు అందజేసేందుకు ఏం అడ్డంకి ఉందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికై నా ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో నూతన కార్డులు జారీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.మార్పులు, చేర్పులపై కనిపించని స్పందనరేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం గత ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు పౌర సరఫరాలశాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లను స్థానికంగా కార్డుల్లో చేర్చాల్సి ఉంది. అలాగే పిల్లల పేర్లనూ చే ర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చే సుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదుకాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త కార్డుల జారీ లో జాప్యం, మార్పులు చేర్పుల అంశంపై ‘సాక్షి’ పౌర సరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.హామీని నిలబెట్టుకోవాలికొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రజలకు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు ఒక లా ఆ తరువాత మరోలా కార్డుల జారీపై మాట మా ర్చడం సరికాదు. నూతన కార్డులు జారీ చేయడంతో పాటు మార్పులు, చేర్పులు చే యాలి.– తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్నిర్లక్ష్యం తగదుకొత్త కార్డుల జారీని ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎంతో మంది కార్డులు వస్తాయని ఆశతో ఉన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కార్డులు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూడా అదే విధా నం కొనసాగించడం సరికాదు. – పెద్దరాజారెడ్డి, మాజీ సర్పంచ్, గుమ్మిర్యాల్ -
ఏపీఎల్‌కు గ్రీన్ రేషన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారితోపాటు దారిద్యరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్నవారికి కూడా రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీఎల్ వారికి ఇచ్చే రేషన్‌కార్డులపై సబ్సిడీతో కూడిన ఎలాంటి సరుకుల సరఫరా ఉండదు. వారికి సన్నబియ్యాన్ని ఇవ్వాలని భావిస్తున్నా.. బియ్యం సేకరణ ధర, నిర్వహణ చార్జీలను కలిపి రేషన్ షాపుల్లో విక్రయించాలని యోచిస్తోంది. ఈ అంశాన్ని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డులను మూడు రంగుల్లో జారీచేయాలని, గులాబీ కార్డులను గ్రీన్‌కార్డులుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీఎల్‌కు ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపుకార్డులుగా మాత్రమే ఉపయోగపడతా యని అన్నారు. ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్డులపై ఎవరెవరి ఫొటోలు ఉండాలన్నది ప్రస్తుతానికి బయటపెట్టలేమని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు చిప్‌తో కూడిన స్మార్ట్ రేషన్‌కార్డుల కోసం టెండ ర్లు ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కార్డుల డిజైన్ కూడా పూర్తయిందని తెలిపారు. వచ్చేనెలలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీకి ఇంకా పూర్తిస్థాయిలో సమాయత్తం కాలేదని.. మే నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే.. రబీ సీజన్లో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా సన్నబియ్యం ధరలు పడిపోయాయని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో సన్నబియ్యం కిలో రూ.60 – 65 వరకు ఉంది కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అవి మరీ ఖరీదైన బియ్యం అయి ఉండవచ్చని పేర్కొన్నారు. నాణ్యత లేకుంటే నేషనల్ వేస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న బియ్యం తినే స్థితిలో లేకపోతే.. అదంతా జాతీయ వ్యర్థంగా (నేషనల్ వేస్ట్) మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసినప్పుడు చెప్పామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యానికి ఇస్తున్న సబ్సిడీతోపాటు సన్నబియ్యానికి అదనంగా అయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పంపాలని కోరినట్లు వెల్లడించారు. దొడ్డు బియ్యానికి కిలో దాదాపు రూ.33 పైగా వ్యయం అవుతుంటే, సన్నబియ్యానికి కిలో రూ.47 వరకు అవ్వొచ్చని పేర్కొన్నారు. -
TG: రేషన్‌కార్డుల పోర్టల్‌కు బ్రేక్.. కారణమిదే
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈసీ బ్రేక్ వేసింది.రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆన్లైన్లో ఇటీవలే పౌరసరఫరాల శాఖ ఒక ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసింది.రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ శనివారం(ఫిబ్రవరి 8) ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈసీ ఆదేశాలతో రేషన్ కార్డుల ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేసింది.కాగా, తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.కొత్తగా రేషన్‌కార్డుకు అర్హత పొందిన వారి జాబితాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.కాగా, తెలంగాణలో ప్రస్తుతం టీచర్లతో పాటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వం ఎలాంటి కొత్త స్కీమ్‌లను అమలు చేయరాదన్న నిబంధనలున్నాయి. దీనిలో భాగంగానే రేషన్‌కార్డుల పోర్టల్‌ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. -
Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త. మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆన్లైన్ ఎఫ్ఎస్సీ లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ అదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ లాగిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా మీ సేవ ద్వారా దరఖాస్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆఫ్‌లైన్‌లో 5.73 లక్షల దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గ్రేటర్లో ప్రజాపాలన ద్వారా సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. వీటిని పక్కన పెట్టగా..విమర్శలు రావడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరణకు రంగం సిద్ధమైంది. కాగా గ్రేటర్లో రేషన్‌కా ర్డులు లేని పేద కుంటుంబాలు పది లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
నాలుగు పథకాలు.. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది
సాక్షి, హైదరాబాద్: నాలుగు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజునే 6,15,677 మందికి లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థికశాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి ఈ నిధులు జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన 563 రెవెన్యూ గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కొత్తగా ఆహారభద్రత కార్డులను జారీ చేసింది. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు పత్రాలను అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబసభ్యుల నమో దు ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పింది. రైతుభరోసా 9.48 లక్షల ఎకరాలకు.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్లు విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలివిడతగా రూ.6 వేల చొప్పు న పెట్టుబడి సాయం అందింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 18,180 కుటుంబాలకు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తొలి రోజున 18,180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. పాత రేషన్‌కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చాలంటూ వేలాది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 1,03,674 మంది పేర్లను పాత రేషన్‌కార్డుల్లో చేర్చారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి రోజునే అర్హులైన 72 వేల మందికి ఇళ్ల పత్రాలను ప్రభుత్వం అందజేసింది.చరిత్రలో ప్రప్రథమం.. దేశానికే ఆదర్శం : మంత్రి సీతక్క ఏ ఆస్తి లేని కూలీలకు భరోసాగా తెలంగాణ సర్కార్ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. చరిత్రలోనే ప్రప్రథమంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి : తుమ్మల రైతుభరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో రెవెన్యూ గ్రామం చొప్పున విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అవి సోమవారం రైతుల అకౌంట్లలో జమ అయ్యాయన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు -
అర్హుల జాబితాలపై అభ్యంతరాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన గ్రామసభల్లో బుధ వారం రెండోరోజు కూడా పలు చోట్ల గందరగోళం తలెత్తింది. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు సభల్లో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సభకు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామసభల్లో పాల్గొన్నారు. ముంపు నుంచి తేల్చండి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరిగిన గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమా ర్ రెడ్డి ప్రసంగాన్ని మహిళలు అడ్డుకున్నారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లిని నారాయణపూర్ ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రకటించి, నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. మహిళలు పట్టు వీడకపోవటంతో 3 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలుపటంతో గందరగోళం ఏర్పడింది. సుడా మాజీ చైర్మన్‌కు ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41 డివిజన్లో జరిగిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి పేరు ఉండటంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. విశాలిని రెడ్డి మాజీ కార్పొరేటర్ కాగా, ఆమె భర్త శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) మాజీ చైర్మన్. వారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారని ప్రజలు నిలదీశారు. మోర్తాడ్ మండలం ఓడ్యాడ్ గ్రామంలో అర్హుల జాబితాపై గ్రామస్తులు అభ్యంతరం తెలపటంతో అధికారులు సభను అర్ధాంతరంగా ముగించారు.ఖమ్మంలో రసాభాస ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామసభలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. కూసుమంచి గ్రామసభలో అనర్హులను జాబితాలో చేర్చారని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ని జల్లేపల్లి గ్రామంలో అర్హులకు పథకాలు అంద డం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మరికొన్ని జిల్లాల్లో.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం ఉజ్జెలి గ్రామంలో ఆత్మీయ భరోసా అర్హుల జాబితాపై గ్రామస్తులు నిరసన తెలిపారు. భూమి లేని కూలీలు 95 మంది ఉంటే, 12 మందినే ఎంపిక చేస్తారా? అని అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా భీమారం, తలమడగు మండలం రుయ్యడిలో అర్హుల పేర్లు జాబితాలో లేవని గ్రామస్తులు గొడవకు దిగారు. తమ గ్రామంలో ఉన్న డంప్‌యార్డును తొలగించాలని సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని కూరెళ్లలో గ్రామసభలో గందరగోళం ఏర్పడింది. గ్రామంలో 520 మంది ఇళ్లకోసం దర ఖాస్తు చేయగా, 25 మందికే మంజూరు కావడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌లో గ్రామసభ జరుగుతుండగా జాబితాలో పేరు లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఆ జాబితా ప్రతులను ఎత్తుకుపోయాడు. విజయవంతంగా గ్రామసభలు: ప్రభుత్వంనాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపికచేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు విజయవంతంగా కొనసాగుతున్నా యని ప్రభుత్వం ప్రకటించింది. 9,844 గ్రామాలు, వార్డులలో సభలు జరిగాయని, 60 శాతం సభలను విజయవంతంగా నిర్వహించినట్లు బుధవారం తెలిపింది. గ్రామసభల్లో నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 10,09,131 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. రెండో రోజు బుధవారం 3,608 గ్రామ సభలు, 1,055 వార్డు సభలు కలపి మొత్తం 4,663 సభలను నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 12,914 గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో 3,484 వార్డు సభలు కలిపి 16,398 సభలు నిర్వహించాల్సి ఉంది. -
సారూ.. మా పేర్లు ఎందుకు లేవు?
సాక్షి నెట్వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా : అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా : ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఈ పథకాలకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ సభలు, వాటిలో నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల స్పందన తదితర అంశాలపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 4 పథకాలకు రూ.40 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల వ్యయం అవుతుందని మంత్రులు వెల్లడించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితాను గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హుల జాబితాను ప్రకటించలేదని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులను ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తుల్లో పేరు, ఆధార్ కార్డు నంబర్, చిరునామా తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు విజయవంతంగా జరిగాయంటూ జిల్లా కలెక్టర్లను మంత్రులు అభినందించారు. రాష్ట్రంలో 4,098 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. -
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
New Ration Cards: సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల ఆహార భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుల ద్వారా రాయితీపై బియ్యం, ఇతర వస్తువులు అందిస్తున్నాయి. గత ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీపై దృష్టి సారించకపోవడంతో దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆరేళ్లుగా కార్డుల జారీ నిలిపివేత నగర శివార్లలో ఆరేళ్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. కార్డుల్లో మార్పు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. 2018లో కేవలం ఒకసారి మాత్రమే కొన్ని కార్డులను జారీచేసి పలు కారణాలతో నిలిపివేశారు. పదేళ్లుగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేయాల్సిన వారంతా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల్లో అయోమయంరేషన్ కార్డుల జారీ కాకపోవడంతో రేషన్‌కార్డుతో పాటు వచ్చే ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులను ముడిపెట్టడంతో కార్డులు లేని వారిలో అయోమయం నెలకొంది. ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో హర్షం కొత్తగా వివాహాలు చేసుకున్న వారికి అర్హత ఉన్నా.. రేషన్‌కార్డులు లేకపోవడంతో ఆహార భద్రతా పథకంతో పాటు పలు పథకాలకు దూరమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ⇒ మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 10,82,348 రేషన్ కార్డులు ఉండగా, 35,40,883 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 5,32,938 రేషన్‌కార్డులు ఉండగా.. 17,18,351 మంది లబి్ధదారులు ఉన్నారు. ఏళ్లుగా రేషన్ కార్డులు అందకపోవడంతో కొంతమంది అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాపాలనలో.. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. నగర శివారు 3.89 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాలశాఖ అధికారులకు చేరాయి. తాజాగా సంక్రాంతి నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మరోసారి స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మార్గదర్శకాలు జనవరి మొదటి వారానికి కొలిక్కి రానున్నాయి. ఆదేశాలు రాగానే.... ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్తరేషన్ కార్డుల జారీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డులు ప్రామాణికం ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసి, ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వాటి కోసం.. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పలుసూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడంపై చర్చించారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్‌కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.సోమవారం(సెప్టెంబర్16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.‘పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్‌కార్డులిస్తాం’అని తెలిపారు. ఇదీ చదవండి.. నిమజ్జనానికి అంతా రెడీ.. జీహెచ్ఎంసీ మేయర్ -
అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వార్షికాదాయం ఆధారంగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షికాదాయం రూ. లక్షన్నర లేదా మాగాణి (తరి) 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చినట్లు కొత్త రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయ పరిమితి రూ. 2 లక్షలుగా ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.ఎస్. చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకుంటాం: ఉత్తమ్ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విషయంలో సలహాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివి«ధానాల రూపకల్పనలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిషనర్‌గా, సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీలో అధికారుల బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీలో అవలంబిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఒకేచోట కార్డు ఉండేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉపసంఘం చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. -
తెలంగాణలో ఇకపై స్వైపింగ్ కార్డులు.. తెల్ల రేషన్ కార్డు వీరికి మాత్రమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీపై నేడు కేబినెట్ సబ్ సమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, తర్వాత జరగబోయే మీటింగ్‌లో దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. కాగా, రాబోయే రేషన్ కార్డులు స్వైపింగ్ కార్డ్స్ మోడల్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయాలు ఇవే..అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులుగ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలుపట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుపట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా మంజూరువిధి, విధినాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంలోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలివారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయండిసక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలనదేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు పరిశీలనఅంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత ఇదిలా ఉండగా.. తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
Congress Guarantees: 10.80 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (రేషన్) కార్డుతో మెలిక పెట్టడంతో గ్రేటర్లో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అర్హతలున్నా..కేవలం రేషన్ కార్డులు లేని కారణంగా దాదాపు 18 లక్షల కుటుంబాలు ఈ పథకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై లబి్ధదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహానగరంలో దారి్రద్యరేఖకు దిగువనగల దాదాపు 38 శాతం పైగా కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, జీరో విద్యుత్ బిల్లు లబ్ధి చేకూరనుంది. మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీ పధకాల్లో భాగంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పధకాలు ప్రారంభించారు. ప్రభు త్వం రెండు పథకాల వర్తింపునకు రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలను మాతమే అర్హులుగా గుర్తించింది. అయితే..నగర పరిధిలో సగానికి పైగా నిరుపేద కుటుంబాలకు రేష¯న్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడగా, మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు మొక్కుబడికి పరిమితమైంది. దీంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. బీపీఎల్ కుటుంబాలు 28 లక్షలపైనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 48 లక్షలకుపైగా కుటుంబాలు ఉండగా..అందులో దారిద్య్రరేఖకు దిగవన గల కుటంబాలు 28 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర జిల్లాల తెల్ల రేష¯Œన్ కార్డులు కలిగిన కుటుంబాలు మరో ఐదు లక్షలకు పైగా ఇక్కడే నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో ఆరు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. అందులో ఇటీవల జరిగిన ప్రజా పాలనలో సుమారు 5.73 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవంగా గత పదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నగర పరిధిలో కేవలం 1.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేసింది. పెళ్లిళ్లయి కొత్తగా ఏర్పాటైన చాలా కుటుంబాలకు రేష¯Œన్ కార్డులు లేవు. అలాంటి కుటుంబాలు సుమారు 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అందులో సగం కుటుంబాల వరకు కొత్త రేషన్న్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. 10.80 లక్షల కనెక్షన్లకే వర్తింపు మహానగర పరిధిలో సుమారు 10.80 లక్షల గ్యాస్, విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే పథకాలు వర్తించనున్నాయి. అధికారికంగా గహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన కుటుంబాలు సుమారు 30 లక్షల వరకు ఉండగా, మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. అదేవిధంగా గృహోపయోగ విద్యుత్ కనెక్షన్లు సుమారు 48.03 లక్షలకు పైగా ఉండగా, అందులో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు సుమా రు 30 లక్షలకుపైగా ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రజాపాలన సందర్భంగా దాదాపు 19.80 లక్షల వరకు కుటుంబాలు సబ్సిడీ వంటగ్యాస్, ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటికి రేషన్‌న్‌కార్డు, ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడంతో అందులో సుమారు 10.80 లక్షల కుటుంబాలు మాత్ర మే అర్హత సాధించాయి. దీంతో మిగతా కు టుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. -
రికార్డు బ్రేక్.. మన టార్గెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన స్ఫూర్తితో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీని భారీ మెజారీ్టతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మన పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. వారందరికీ రెండు లక్షలకుపైగా మెజార్టీ ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ సులభంగానే గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు మరింత కష్టపడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేమని నిరాశ చెందవద్దు. పక్క పారీ్టవాళ్ల ప్రలోభాలకు లొంగవద్దు. రాజీలేని పోరాటంతో విజయం సాధిస్తాం. మళ్లీ గెలుపు మనదే. అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ గెలిచేలా తయారు కావాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో అయ్యేదేమీ లేదని, మళ్లీ పోరాట పటిమతో మన సత్తా చాటాలన్నారు. ప్రజలు పోరాడేలా చేయండి కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అమలు చేయకపోతే తిరగబడేలా చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పెన్షన్‌కు అర్హులుంటే ఎంతమందికి వర్తింపజేస్తారో పరిశీలించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెబుతున్నప్పటికీ, రేషన్‌కార్డులు లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వాటితోపాటు ప్రజల నుంచి అందిన ఇతర ఫిర్యాదులనూ ఆన్లైన్లో నమోదు చేయలేదని, ఈ ప్రక్రియలన్నీ ముగిసి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతూ వీటన్నింటినీ ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి వారు పోరాడేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని, భద్రాచలం నుంచి వచి్చన నేతలు సమావేశం ఆసాంతం ఉండగా.. నగర నాయకులు మాత్రం మాట్లాడి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆన్‌లైన్‌లోకి ఎక్కించేశారు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీ ‘అభయహస్తం’ కింద ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను జీహెచ్ఎంసీ కంప్యూటరీకరించింది. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు మంగళవారం రాత్రి వరకే ఈ పని పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 635 కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుల్లో పాతబస్తీ నుంచే అత్యధికంగా అందగా, అక్కడి ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట సర్కిళ్ల నుంచి అత్యధిక కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రామచంద్రాపురం–పటాన్చెరు సర్కిల్ చిన్న సర్కిల్ కావడంతో అక్కడి నుంచి కూడా తక్కువ దరఖాస్తులందాయి. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కింద ‘అభయహస్తం’ దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డులు, ఇతరత్రా అవసరాలకు సంబంధించిన దరఖాస్తుల్ని సైతం అధికారులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన ఈ నెల 6వ తేదీ వరకు సదరు అర్జీలు 5,73,069 అందినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అభయహస్తం కింద అప్పటి వరకు 19,01,256 దరఖాస్తులు అందినట్లు ప్రకటించినప్పటికీ.. ఆన్లైన్ ప్రక్రియ ముగిసేటప్పటికి వాటిని 19,06,137గా తేల్చారు. స్వీకరణ చివరి రోజున ఆలస్యంగా అందిన అర్జీలు అప్పడు లెక్కలోకి రాకపోవడమో.. ఆ తర్వాత ఆయా కార్యాలయాల్లో స్వీకరించిన వినతులు కూడా ఆన్లైన్లో నమోదు చేయడం వల్లనో ఈ సంఖ్య పెరిగి ఉంటుందని చెబుతున్నారు. గాలిలో దరఖాస్తులతో ఆందోళన గ్యారంటీల దరఖాస్తుల్ని బయటి వ్యక్తులతో తరలిస్తుండగా అవి గాల్లోకి ఎగిరి పోవడంతో ఎవరి దరఖాస్తులైనా పోయాయేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారులు మాత్రం ఏ ఒక్క దరఖాస్తూ పోలేదని ప్రకటించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఆ తర్వాత తగిన శ్రద్ధ చూపారు. ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఐదువేల మందికి పైగా ఆపరేటర్లతో కంప్యూటరీకరణ పూర్తి చేయించారు. రేషన్‌కార్డులు, ఇతరత్రా ఫిర్యాదులకు సంబంధించిన దరఖాస్తులు సర్కిల్, జోన్ల వారీగా అధికారులు వెల్లడించలేదు. వీటిలో రేషన్ కార్డులవే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్యాస్, పెన్షన్ల కోసం అభయహస్తం కింద ఐదు పథకాలకు దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ల కోసం ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏ స్కీమ్‌కు ఎందరు దరఖాస్తుచేసుకున్నారనేది వెల్లడయ్యేందుకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున ఆయన తిరిగి వచ్చాక ఈ దరఖాస్తులకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై స్పష్టత రానుందని జీహెచ్ఎంసీ అధికారులు అధికారులు చెబుతున్నారు. జోన్ల వారీగా.. ఆన్లైన్ నమోదు పూర్తయిన దరఖాస్తులు జోన్ల వారీగా ఇలా ఉన్నాయి. జోన్ ఆన్లైన్ ఎల్బీనగర్ 242579 చార్మినార్ 508772 ఖైరతాబాద్ 325641 శేరిలింగంపల్లి 170811 కూకట్పల్లి 314685 సికింద్రాబాద్ 300051 కంటోన్మెంట్ 43598 మొత్తం 1906137 -
2024 ప్రాధాన్యం రైతు, మహిళ, యువత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు, మహిళ, యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం సీఎం ప్రజలకు విడుదల చేసిన సందేశం ఆయన మాటల్లోనే.. ఆ హామీలు నిలబెట్టుకున్నాం.. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యార్యంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. యవత భవితే ప్రాధాన్యం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. సాగునీటి రంగంలో అవినీతిపై త్వరలో శ్వేతపత్రం ‘గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటిరంగంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అసత్య ప్రచారాలతో గందరగోళం వద్దు.. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురుచూశారు. త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అధికారం కోల్పోయిన కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గతపాలన కాదు, జనపాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
Prajapalana Centers Public Rush Pics: ప్రజాపాలనకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
TS: ‘ప్రజాపాలన’ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లతో పాటు వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పోటెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్థానికులకు అభయహస్తం దరఖాస్తులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాజేంద్రనగర్‌లో, పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందోల్, సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. చాలాచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు దరఖాస్తుల పంపిణీ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలు యూనిట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని, నోడల్ అధికారులుగా నియమితులైన సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరికొందరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ వెళ్లడంతో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరుకాలేదు. జిరాక్స్, ఆధార్ సెంటర్లు కిటకిట ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూతతో పాటు రేషన్‌కార్డులకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తారనే ప్రచారంతో తొలిరోజు ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ సభలు, మునిసిపాలిటీల్లోని వార్డు సభలకు వివిధ శాఖల ఉద్యోగులు హాజరై దరఖాస్తులు పంపిణీ చేశారు. అయితే చాలాచోట్ల ప్రజలకు దరఖాస్తులు అందలేదు. ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగి ఒక్కో దరఖాస్తుకు రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. చాలామంది జిరాక్స్ దరఖాస్తులలో వివరాలు నింపి ఇస్తే తొలుత వాటిని అంగీకరించలేదు. కానీ తర్వాత స్వీకరించారు. దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల జిరాక్స్‌లను కూడా అటాచ్ చేయాల్సి ఉండడంతో ప్రజలు జిరాక్స్, ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరారు. గురువారం సాయంత్రం వరకు ఈ కేంద్రాలు రద్దీగా కన్పించాయి. మీ సేవా కేంద్రం నిర్వాహకుడిపై కేసు ► ప్రజాపాలన దరఖాస్తులను రూ.20కి విక్రయిస్తున్న పటాన్‌చెరులోని గణేష్ మీ సేవా కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు నవీందర్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాదిలో దరఖాస్తుదారులకు అవసరమైన అప్లికేషన్లు లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లలో రూ.20 నుంచి రూ.30కి ఒకటి చొప్పున దరఖాస్తులను విక్రయించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో దరఖాస్తుల కోసం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అధికారుల పరిశీలన ► నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ హరిత ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తండా, డిచ్పల్లి మండలం వెస్లీనగర్ తండా, మాధవనగర్ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగర శివారులోని మాధవనగర్, మోపాల్ మండలం తాడెం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభలను సందర్శించారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్ ఒక్కరే ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలిపి తొలిరోజు 210 వార్డు, గ్రామ సభలు జరిగాయి. కాగా రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 2,358 వార్డులలో ప్రజాపాలన కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎస్ ► తొలిరోజు ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, సందీప్ సుల్తానియాలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించినట్లు సీఎస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711, జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల నుండి 4,57,703 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో సరిపడా అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీటి వసతి కల్పించాలని, క్యూ లైన్లు పాటించేలా చూడాలని సూచించారు. ప్రతి వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని ఆదేశించారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్‌్కలను ఏర్పాటు చేయాలన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యంపై స్పందించని మహిళలు వట్పల్లి (అందోల్): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందుతున్న మహిళలు..దానిపై సరైన విధంగా స్పందించక పోవడంపై రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని సంగుపేటలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు. ‘మీరు బస్సుల్లో తిరుగుతున్నారా? అని ప్రశ్నించగా.. వారు స్పందించలేదు. దీంతో అధికారులు మీరు బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు కదా.. అన్నప్పటికీ కొందరు మహిళలు మాత్రమే చేతులు పైకి లేపారు. దీంతో ఎంత అన్యాయం.. పథకం లబ్దిపొందుతూ స్పందించరా? అని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా బస్సులు మహిళలతోనే నిండిపోతున్నాయని, మగవారికి సీట్లు దొరకడం లేదని కొందరు అనడంతో సభలో నవ్వులు విరిశాయి. సెల్‌ఫోన్ వెలుగులో దరఖాస్తుల స్వీకరణ జ్యోతినగర్ (రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లో దరఖాస్తులు అధికంగా రావడంతో రాత్రి వేళ కూడా స్వీకరించాల్సి వచ్చింది. స్థానిక అంబేడ్కర్ భవన్లో విద్యుత్ దీపాలు లేకపోవడంతో సెల్‌ఫోన్ వెలుగులో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. -
TS: రేషన్‌కార్డులిస్తూనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ‘తెల్ల రేషన్‌కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రేషన్‌కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల చెంతకు పాలన ‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్‌లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్‌కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం. వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్ ఇచ్చి డిజిటలైజ్ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు ‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుబందు సీలింగ్‌పై అసెంబ్లీ చర్చ రైతుబంధుపై సీలింగ్ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్ తెలిపారు. తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్‌లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం ‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్మార్ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు త్వరలో అందిస్తామన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన, గ్రామసభల నిర్వహణపై జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఉమ్మడి జిల్లా అధికారులందరూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని తెలతిపారు. ప్రజా పాలన, ఆరు గ్యారంటీల విషయంలో అధికారులు ఏమైనా సందేహం ఉంటే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన తమ ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మెడిగడ్డ అన్నారం వైఫల్యాలపై 29వ తేదీన పరిశీలన కోసం వెళ్తున్నామని, పరిశీలన అనంతరం విచారణ చేయిస్తామన్నారు. జిల్లాలో రైస్ మాఫియా నడుస్తుందని, వారిని వెంటనే అపాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ వెళ్ళాలి అన్నదే మా ప్రభుత్వ ద్వేయమని తెలిపారు. చదవండి: ఆరు గ్యారంటీలకు ‘రేషన్ కార్డు’ మస్ట్: సీఎం రేవంత్ -
రేషన్ కార్డులేని కుటుంబాల పరిస్థితి అధోగతేనా?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం (ఆరు గ్యారంటీ) పథకాల అర్హతకు తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డు ప్రామాణికం కానుంది. దారిద్య్ర రేఖకు దిగవనున్న (బీపీఎల్) కుటుంబం గుర్తింపు కార్డుగా రేషన్ కార్డు పని చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం అమలు తలపెట్టనున్న ఆరు గ్యారంటీ పఽథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాల్లో మహా నగారానికి రైతు భరోసా మినహా మిగతా ఐదు పథకాలు వర్తించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రజా పాలనలో భాగంగా వార్డుల వారీగా ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబ పూర్తి వివరాలను తీసుకోనున్నారు. కుటుంబానికి సంబంధించి ఇళ్లు, ఆదాయం, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, రేషన్ కార్డు, ఉద్యోగం ఇతరత్రా అన్ని వివరాలను దరఖాస్తులో స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తుల వెంట తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది. రెండింటిలో ఏది లేకున్నా ఆదిలోనే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. దీంతో పదేళ్ల పాటు కేవలం బియ్యం కార్డుగా పని చేసిన రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా మారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వడపోసి.. ఏరివేసి.. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం మొత్తం రేషన్ కార్డులు 17,21,994 ఉన్నాయి. ఇందులో గత పదేళ్లలో కొత్తగా మంజూరైన కార్డులు 1.21 లక్షలు మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తెల్లరేషన్ కార్డులను ఆహార భద్రత కార్డులుగా మార్పు చేయడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బడిముబ్బడిగా కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత కాలానికి అనర్హుల పేరిట కొన్ని కార్డులను ఏరి వేసి 15,99,639కి పరిమితం చేసింది. దీంతో తిరిగి కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున సుమారు 3.40 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకోగా మూడేళ్ల క్రితం 360 డిగ్రీల స్థాయిలో వడపోసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి కొత్త కార్డులు మంజూరు మంజూరు చేసింది. వైఎస్ హయంలోనే 16.98 లక్షల కార్డులు తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున నిరు పేదలందరికి తెల్లరేషన్ కార్డుల భాగ్యం కలిగింది. అప్పట్లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం మీద తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 16,98,982లకు చేరింది. అప్పట్లో చౌకధరల దుకాణాల ద్వారా అమ్మహస్తం పథకం కింద రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు రూ.1 కిలో బియ్యంతోపాటు కందిపప్పు, చింతపండు, గోధుమలు, గోధుమ పిండి, కారంపొడి, నూనె తదితర సరుకులు పంపిణీ జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డు ఆహార భద్రత కార్డుగా మారి కేవలం బియ్యానికే పరిమితమైంది. ఎదురుచూపుల్లో 10 లక్షల కుటుంబాలు.. మహానగరంలో మరో 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన నగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలు 27.21 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 17.21 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రకటించడంతో తెల్ల రేషన్ కార్డుకు మరింత డిమాండ్ పెరిగింది. కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్యారంటీ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నడంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్యారంటీ పథకాలివే కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కోసం వార్డుల వారీగా ఈ నెల 28 నుంచి ధరఖాస్తులు స్వీకరించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ వర్తించనుంది. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గ. స్థలం అందిస్తారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు నిరుపేదలకు సామాజిక పెన్షన్ నెలకు రూ.4,000 చొప్పున అందిస్తారు. వారికి రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తించనుంది. గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల పరిస్ధితి ఇలా.... జిల్లా పదేళ్ల క్రితం ప్రస్తుతం హైదరాబాద్ 6,91,618 6,39,609 ఉమ్మడి రంగారెడ్డి 10,07,354 10,82,382 -
28 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూ స్తున్న కొత్త ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డులు) జారీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల నమూనా లను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. మీ–సేవ కార్యాలయాల ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, బస్తీ సభలను నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి విధివిధానాలు ఆదివారం జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం తరువాత వెలువడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన రేషన్‌కార్డుల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత మొదలైన తెలుపు, గులాబీ కార్డుల జారీ ప్రక్రియ భారీ ఎత్తున సాగింది. ఈ లెక్కన రాష్ట్రంలో తెలుపు, గులాబీ కార్డు లు తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే 83 లక్షలకు పైగా జారీ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జాతీయ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల తెలుపు, గులాబీ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పదేళ్లలో కొత్తగా 6.50 లక్షల కార్డులు మంజూరు చేసింది. ఇవి కాకుండా 11 లక్షలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి కావడంతో... రేషన్ బియ్యం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా మారింది. ఆరోగ్యశ్రీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదల గృహ నిర్మాణం వంటి అనేక పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు రేషన్‌కార్డుల అవసరం తప్పనిసరైంది. గతంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే 2021లో చివరిసారిగా 3 లక్షల కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్‌కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు మార్పులు , చేర్పులు చేయడం వంటి ప్రక్రియ కూడా కొన్నేళ్లుగా నిలిపివేయడంతో ఈసారి డిమాండ్ పెరిగింది. కొత్త కార్డుల ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు వస్తే అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తుదారులు ఆధార్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు గ్యాస్ కనెక్షన్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారికి కార్డులు జారీ చేయకుండా నిబంధనలు విధించనున్నారు. అదే సమయంలో ఇప్పటికే కార్డులు పొందిన వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఓ పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కార్డుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న కార్డుల సంఖ్య : 90,14,263 ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్) కింద జారీ చేసిన కార్డులు : 54,48,170 రాష్ట్ర ఆహారభద్రత కార్డులు : 35,66,093 ఈ కార్డుల లబ్ధిదారులు : 2,83,39,478 -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
కొత్త రేషన్ కార్డులొచ్చాయ్
సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. గతంలో రేషన్‌కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ప్రతి ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. వలంటీర్ల ద్వారా అర్హులతో దరఖాస్తు చేయించి కార్డులు మంజూరు చేయడంతో పాటు నేరుగా ఇంటికే తీసుకవచ్చి కొత్త కార్డు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా తాజాగా జిల్లాలోని 20 మండలాల్లో అర్హులైన పేదలకు 9,372 బియ్యం కార్డుల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. కొత్తగా పెళ్లయినా దంపతులకు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టినా తక్షణం కొత్త రేషన్‌కార్డు మంజూరు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. జిల్లాలోని 20 మండలాల్లో ప్రస్తుతం 5,62,395 రేషన్‌కార్డుల ద్వారా ప్రతి నెలా 8,641 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే తక్కువ ధరకు పంచదార, కందిపప్పును ఇంటి వద్దే రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్నారు. గతనెలలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 9,372 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా వీటి పంపిణీ ప్రారంభమైంది. భీమవరం రెవెన్యూ డివిజన్లో 10 మండలాలకు 4,627, నరసాపురం డివిజన్లో 10 మండలాలకు 4,745 కార్డులు మంజూరయ్యాయి. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందిస్తారు. గతంలో ఎదురుచూపులు గతంలో రేషన్ కార్డు కావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే రేషన్ కార్డు అందజేశారు. సత్వరమే కొత్త కార్డు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. –కటికితల వసంతకుమార్,ఏలూరుపాడు, కాళ్ల మండలం వచ్చేనెల నుంచి రేషన్ పంపిణీ జిల్లాలో నూతనంగా మంజూరైన 9,372 బియ్యం కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చేనెల నుంచి ఉచితంగా బియ్యంతోపాటు తక్కువ ధరకు పంచదార, కందిపప్పు అందిస్తాం. ఇప్పటికే జిల్లాలో సుమారు 5.62 లక్షల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు దాదాపు 8,641 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. –ఎన్.సరోజ, జిల్లా పౌరసరఫరాల అధికారి, భీమవరం -
కొత్తగా 1.63 లక్షల రైస్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బియ్యం కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్లో అర్హులకు కొత్త కార్డులు అందజేస్తోంది. ఇప్పటివరకు 1,63,333 కొత్త రైస్ కార్డులకు ఆమోదం లభించగా తహసీల్దార్ల డిజిటల్ సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే కార్డులను ముద్రించి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. జగనన్న సురక్షలో బియ్యం కార్డుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఈ దఫాలోనే కార్డులు అందించనున్నారు. దీనికి ఈ నెల 31వతేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 3,81,061 మందికి లబ్ధి రాష్ట్రంలో ఇప్పటివరకు 1.46 కోట్ల కార్డులకుగాను 4.25 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్త కార్డుల మంజూరు ద్వారా అదనంగా 3,81,061 మందికి ప్రతి నెలా పీడీఎస్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాణ్యమైన (సార్టెక్స్)బియ్యాన్ని ఇంటివద్దకే అందించడంతో ప్రతి నెలా రేషన్ తీసుకువారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువగా ఉండేవారు. పేదలకు ఇచ్చే బియ్యం ముక్కిపోవటం, పురుగులు పట్టడం, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజ రంగు మారిపోయేది. బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం పేదల ఆకలి తీరుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే ఎంతో మంది పేదలను ఆదుకుంది. బియ్యం సార్టెక్స్ కోసం కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. పీడీఎస్ వ్యవస్థ బలోపేతం.. టీడీపీ హయాంలో రేషన్ సబ్సిడీపై రూ.13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చూపినా పేదలకు ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు నాలుగేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. 100.13 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం, 2.99 లక్షల టన్నుల కందిపప్పు, 2.34 లక్షల టన్నుల పంచదారను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు సుమారు రూ.23,680 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. పంచదార, కందిపప్పుపై గతంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. వీటికి తోడు 18 జిల్లాల్లో నాణ్యమైన బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్) అందిస్తోంది. ఏప్రిల్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగి, జొన్నలు, అన్ని మున్సిపాల్టీల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే రేషన్ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు సైతం రేషన్ సరఫరా చేస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఉచితంగా కిలో రూ.40 విలువైన బియ్యం ఒకవేళ రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందనే ఆందోళనతో కొందరు ప్రతి నెలా సరుకులు తీసుకుని దళారులకు విక్రయిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది కార్డుదారుల వాట్సాప్ నంబర్లకు వీడియో సందేశాలను చేరవేసింది. ఎండీయూ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తూ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత ఖరీదైన బియ్యాన్ని వృథా చేయకుండా ప్రజలు భోజనంగానే కాకుండా దోశలు, ఇడ్లీలు, మురుకులు, స్వీట్లు లాంటి చిరుతిళ్ల తయారీకి కూడా వినియోగించవచ్చని సూచిస్తోంది. కార్డు రద్దు చేయడం లేదు.. రేషన్ తీసుకోకుంటే ఎక్కడా కార్డును రద్దు చేయడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార రేషన్‌ను ప్రజలు తక్కువగా చూడొద్దు. కొన్ని చోట్ల మధ్యవర్తులకు తక్కువ రేటుకు రేషన్ బియ్యన్ని విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. రేషన్ బియ్యం విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిగా అరికడతాం. కొత్త కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్లో అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నాం. తాజాగా జగనన్న సురక్ష దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా కార్డులు ఇస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
పేదలందరికీ అన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి నూతన బియ్యం కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. తొలి అర్ధ సంవత్సరం జూన్‌లో, చివరి అర్ధ సంవత్సరం డిసెంబర్లో.. అప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను అందిస్తోంది. తాజాగా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70,807 రైస్ కార్డులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వీటిని పంపిణీ చేయనుంది. ఈ మేరకు కార్డుల ముద్రణను దాదాపు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.39 కోట్ల కార్డులు మాత్రమే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కార్డుల సంఖ్యను 1,45,43,996కు పెంచింది. వీటి కింద 4.24 కోట్ల మందికి 2.31 టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాటితో కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1,46,14,803 అవుతుంది. అదనంగా 1.66 లక్షల మందికి ప్రతి నెలా 8.30 లక్షల టన్నుల రేషన్‌ను పంపిణీ చేయనుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై నెలకు రూ.3.40 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన(సార్టెక్స్) బియ్యం ఇస్తోంది. అందువల్ల ప్రతి నెలా 90 శాతానికి పైగా ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. ఆరు దశల ధ్రువీకరణ ముఖ్యం రాష్ట్రంలో బియ్యం కార్డుల మంజూరులో ప్రభుత్వం ఆరు దశల ధ్రువీకరణ(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో అర్హులైతేనే కొత్త కార్డులిస్తోంది. ఈ క్రమంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెసులుబాటు కల్పించాం. వీటిపై వచ్చే దరఖాస్తులను సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన జరిపి అర్హులని తేలితే.. ఆ మేరకు సరిచేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!
తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్‌లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం. 10 లక్షల కార్డులు కట్! ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది. వీళ్లంతా అనర్హులే ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్‌ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలన.. ఇళ్ల వద్దకు అధికారులు
2016లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనర్హుల పేరుతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వందలాది తెల్లకార్డులను తొలగించింది. లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కార్డులను రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ... గతేడాది ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరి పలు సూచనలు చేసింది. రద్దు చేసిన తెల్ల రేషన్‌కార్డులపై పునఃపరిశీలన జరిపి వారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీంతో నేటి నుంచి తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలణను జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభించింది. సాక్షి, మేడ్చల్ జిల్లా: చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయిన వారు, నిబంధనలకు మించి భూములు కలిగి ఉన్న వారు... తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి ఫలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వస్తోంది. వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్ కార్డుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం నుంచి తనిఖీల నిమిత్తం సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారణ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశీలన అనంతరం అర్హులకు కార్డులు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 95,040 తెల్లరేషన్ కార్డులు తొలగించారు. రద్దయిన ఈ కార్డులను పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి పరిశీలన అనంతరం అర్హులైన వారికి తిరిగి తెల్ల రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లకు అధికారులు రద్దు చేసిన తెల్లరేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకొని నోటీసులు జారీ చేసే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రద్దయిన కార్డుల జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో ఉంచింది. వాటిని ఆయా మండలాల తహసీల్దారులు డౌన్లోడ్ చేసుకొని విచారణ సాగిస్తున్నారు. రద్దయిన కార్డుదారులను కలిసి నోటీసులు జారీ చేసి వివరాలను సేకరిస్తున్నారు. విచారణలో అర్హులుగా తేలిన వారికి కార్డులను పునరుద్ధరిస్తారు. మేడ్చల్ జిల్లాలో రద్దయిన తెల్లరేషన్ కార్డులు: 95,040 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తంగా 95,040 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. మండలాలు, జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్ల వారీగా రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల ఈ విధంగా ఉన్నాయి. బాచుపల్లి మండలంలో 2,378 తెల్లరేషన్ కార్డులు రద్దు కాగా, ఘట్కేసర్లో 2,273, కాప్రాలో 2,263, కీసరలో 3,388, మేడ్చల్‌లో 2,306, మేడిపల్లిలో 4,165, శామీర్‌పేట్‌లో 893, మూడు చింతలపల్లి మండలంలో 328 రేషన్‌కార్డులు రద్దయ్యాయి. ► అలాగే, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. రద్దయిన కార్డుదారులు అందుబాటులో ఉండాలి గతంలో రద్దయిన రేషన్ కార్డుదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి. విచారణకు నియమించబడిన అధికారులు తనిఖీల నిమిత్తం మీ ఇంటి వద్దకు వస్తారు. జిల్లాలో మొత్త గా 95,040 తెల్లరేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇంటి చిరునామా, ఫోన్ తదితర విషయాలలో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే సంబంధిత తహసీల్/సహాయ, పౌర సరఫరాల కార్యాలయంలో సంప్రదించాలి. – ఏనుగు నర్సింహారెడి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
‘రేషన్’ రద్దయిన వారికి మళ్లీ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు. రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ మంగళవారమే మొదలైందని.. ఈ నెల 20 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో.. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 21.94 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో గత ఏప్రిల్ 27న విచారణ జరిపింది. లబ్ధిదారులకు కనీస సమాచారం లేకుండా 21.94 లక్షల రేషన్‌కార్డులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. 2016 నాటి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 17 అంశాల్లో పరిశీలన జరిపి, నోటీసులిచ్చి కార్డులు తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. కొందరు రేషన్ డీలర్ల దగ్గర 200 నుంచి 300 కార్డులున్నట్టు తేలడంతో తొలగించినట్టు పేర్కొంది. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, కార్డుదారులు తమ అర్హత నిరూపించుకునే అవకాశమివ్వకుండా.. 21 లక్షలకుపైగా రేషన్ కార్డులను తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి, æఅర్హులను గుర్తించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. రీవెరిఫికేషన్ మార్గదర్శకాలివే.. ►రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం కోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరించాలి. ►ఆ జాబితాలను అన్ని రేషన్‌షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. ►రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్ట్ చేయాలి, ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలి. ►రీవెరిఫికేషన్పై స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయాలి. ►ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలితే.. వెంటనే ఆ వివరాలను నమోదు చేయాలి. ►రద్దు చేయబడిన కార్డుకు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేయాలి. -
ఇంటింటికీ రేషన్ అద్భుతం.. కేంద్ర బృందాల కితాబు
కాకినాడ సిటీ/కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని జైపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ స్టడీస్ (సీడీఈసీఎస్) బృందాలు ప్రశంసించాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం–2013 అమలు తీరు సమగ్ర పరిశీలన, మదింపునకు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ జైపూర్‌లోని సీడీఈసీఎస్ను థర్డ్‌పార్టీ మానిటరింగ్ సంస్థగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ బృందాలు తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమయ్యారు. కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈ బృందం సభ్యులు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్ కన్సల్టెంట్ కె.గిరిజాశంకర్, సీడీఈసీఎస్ టీమ్ లీడర్ రవిపారీక్ తదితరులు ఇన్చార్జి కలెక్టర్ జి లక్ష్మీశ, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో సమావేశమయ్యారు. ఆది, సోమవారాల్లో కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు అర్బన్ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్లు, చౌకధరల దుకాణాలను పరిశీలించినట్లు తెలిపారు. రేషన్‌కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును తెలుసుకున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తకార్డుల జారీ, పేర్ల చేర్పు, తొలగింపు తదితర సేవలు 21 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్యోజన (పీఎంజీకేవై), రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందిస్తుండటం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. రాష్ట్ర పీడీఎస్ కార్డుదారులకు సార్టెక్స్ బియ్యం అందిస్తుండడంపై కార్డుదారులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పటిష్ట, ప్రణాళికాయుత వ్యవస్థ ద్వారా జిల్లాలో 16.50 లక్షల రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు అందుతున్నాయని, ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుత పనితీరుకు గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వడం ప్రశంసనీయమని సీడీఈసీఎస్ నోడల్ అధికారి డాక్టర్ ఉపేంద్ర కె.సింగ్ పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఆయన జేసీ (రెవెన్యూ) ఎస్.రామసుందర్‌రెడ్డి, డీఎస్వో మోహన్‌బాబుతో సమావేశమయ్యారు. ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, నంద్యాల మండలాల్లో స్వయంగా రేషన్ షాపులను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడినట్లు చెప్పారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను ఇస్తున్నట్లు వినియోగదారులు చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించే విధానం బాగుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 760 మినీ ట్రక్కులను ఏర్పాటు చేసినట్లు జేసీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో సీడీఈసీఎస్ అధికారులు అలీబాషా, రామారావు పాల్గొన్నారు. -
ఒక్కరోజులోనే 3.09 లక్షల కార్డులు
భూపాలపల్లి: ఇది సరికొత్త రేషన్ రికార్డు.. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం 3,09,083 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులు పంపిణీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.88 కోట్లమంది లబ్ధిదారులకు రూ.2,766 కోట్ల విలువైన ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. 2014కు ముందు అర్హులు సైతం రేషన్‌కార్డు కోసం పైరవీకారులను ఆశ్రయించేవారని, తాను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అడుక్కున్నా అప్పటి ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పైరవీలకు తావివ్వకుండా, పారదర్శకంగా అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉప్పూపప్పు కోసం అసెంబ్లీలో మాట్లాడతా
ముదిగొండ (మధిర): దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.కార్డులు లేనివారిందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. రేషన్ కార్డులు ఈ దఫాలో రానివారికి కూడా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్ ఉందనో, పిల్లలకు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు ఉన్నాయనో, లేకపోతే రాబడి పొలం ఉందనే కారణంతోనే దరఖాస్తులు తిరస్కరించడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. కూలీకి వెళ్లే కుటుంబం ఫైనాన్స్ నుంచి సెకెండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కుని, బతుకుదెరువు కోసం ప్రయివేట్ కంపెనీలకు ఉద్యోగాలకు పోయిన బిడ్డలున్న కుటుంబాలకు మానవతా హృదయంతో కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధిక నిధులు ఉన్న మన రాష్ట్రంలో గతంలో చేసిన దానికంటే కాస్త ఎక్కువగా ప్రజలకు చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి ‘అమ్మహస్తం’ పేరుతో ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు సరకులు ఎత్తేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. బియ్యంతో పాటు గతంలో ఇచ్చిన సరుకులు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తాను గతంలో అసెంబ్లీలో మాట్లాడాను.. మళ్లీ మాట్లాడతాను అని స్పష్టం చేశారు. పప్పులు, ఉప్పులు, నూనెలు, చింతపండు కూడా కొనలేని పరిస్థితులు ఉండడంతో పేదలకు రేషన్‌లో ఆ వస్తువులు ఇవ్వాలని కోరారు. -
రేషన్ లబ్దిదారులకు 9 రకాల వస్తువులు అందించాలి
ఎర్రుపాలెం(మధిర) : ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ హస్తం పేరుతో బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను రేషన్ కార్డు లబ్దిదారులకు అందించామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలోని దూబకుంట్ల ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మిగులు బడ్జెట్, అధిక రాబడి ఉన్న రాష్ట్రంలో అప్పుడిచ్చిన 9 రకాల వస్తువులను రేషన్ నుంచి తొలగించి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ధనిక రాష్ట్రంలో అంతకుముందు ఇచ్చిన 9 వస్తువులకు అదనంగా మరోరెండో, మూడో వస్తువులు కలిపి ఇవ్వాలి కానీ.. ఉన్నవి తొలంగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో.. పేదల పక్షాన ప్రతిపక్షనాయకుడిగా ప్రభుత్వానికి డిమిండ్ చేస్తున్నా.. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను తిరిగి అందించాలని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న మిగిలిన రేషన్ కార్డులను మంజూరు చేయాలని మల్లు డిమాండ్ చేశారు. -
వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెల్ల రేషన్ కార్డుల జారీపై మంత్రి మాట్లాడారు. ఈ మేరకు ఆహార భద్రతా కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. 23 లక్షల 46 వేలకు మాత్రమే అర్హులని కేంద్రం చెప్పిందన్నారు. 1 కోటి 91 లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో 1 కోటి 73 లక్షల లబ్దిదారులు ఉన్నారని, తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2019లో 3 లక్షల 59 వేల కాత్త కార్డులు ఇచ్చామన్నారు. మెదక్‌లో 7 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, కరోనా వల్ల గత ఏడాది రేషన్ కార్డుల పంపిణి ఆలస్యం అయ్యిందన్నారు. సిద్దిపేటలో 10 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా 7వేల కార్డుల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. నిజమైన ఆర్హులకు అవి ఇస్తామన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 44 వేల కొత్త కార్డులు ఇచ్చామన్నారు. ఇంకా 97 వేల కొత్త కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కరోనా వల్ల కొత్త కార్డులు ఇవ్వలేకపోయామని, పెండింగ్ దరఖాస్తులు అన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఆయన చెప్పారు. అంతేగాక మూడు నెలలు వరుసగా బియ్యం తీసుకొకపోతే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగులా స్పష్టం చేశారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: చెల్లని పట్టభద్రులు..! కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్‌చుప్! -
గంటలో 44 రేషన్ కార్డులు మంజూరు
సాక్షి, తిరుపతి రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తూ రికార్డు సృష్టిస్తోంది. రేషన్ కార్డుల నెలల కోసం తరబడి అందరి చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చేసింది. దరఖాస్తుదారులకు అర్హత ఉంటే నిమిషాల్లోనే కార్డు మంజూరవుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండల తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది సోమవారం గంట వ్యవధిలో 44 రేషన్ కార్డులు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 51 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వీఆర్వో, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ స్థాయిల్లో మొత్తం ఆరు దశల్లో వీటిని పరిశీలించి 44 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. దీంతో కార్డులు మంజూరు చేశారు. దుర్గసముద్రం పంచాయతీలో దరఖాస్తు చేసుకున్న సంధ్యకు 20 నిమిషాల్లో, తుమ్మలగుంటలో అపర్ణకు 21 నిమిషాల్లో.. ఇలా 20 నిమిషాల నుంచి గంటలోపు మొత్తం 44 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా దరఖాస్తు చేసుకున్న గంటలోనే 44 రేషన్ కార్డులను మంజూరు చేసిన తహసీల్దారును, సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. (చదవండి: అరగంటలోనే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు) -
కొత్తగా 1,04,796 బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,04,796 బియ్యం కార్డులను మంజూరు చేశారు. దేశంలోనే తొలిసారి నిర్ధిష్ట కాల పరిమితిలో అర్హులైన వారికి ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. దరఖాస్తు చేసిన పది పని దినాల్లో అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్డుల కోసం గ్రామ సచివాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోగా 18,576 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన 86,220 కార్డులను వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. తిరస్కరిస్తున్న దరఖాస్తులకు కారణాలు కూడా వెల్లడిస్తున్నారు. -
రేషన్ కార్డు లేకుంటే..?
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్లో చిక్కుకున్న వారికి రేషన్ కార్డులు లేకపోయినా ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల రేష న్ కార్డులు జారీ అయినా వాటిలో మూడొంతులు తిరస్కరణకు గురయ్యాయని, రేషన్ కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెప్పడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలిపింది. హైదరాబాద్‌లో 20.6 లక్షల తెల్ల రేషన్ కార్డులు జారీ అయినా వాటిలో 17.6 లక్షల కార్డులను అధికారులు తిరస్కరించారని, దీంతో రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు అందట్లేదంటూ సా మాజిక కార్యకర్త ఎస్క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు ప్ర జాహిత వ్యాజ్యం (పిల్)గా పరి గణించింది. ప్రభుత్వ వివరణ కోసం విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల ప్రభుత్వ నివేదికలో హైదరాబాద్‌లోనే భారీ స్థాయిలో కార్డులు తిరస్కరించారని, లాక్డౌన్ వేళ వలస కార్మికులు, ఇతరులు రేషన్ కార్డులు ఎలా చూపించగలరని ప్రశ్నించింది. ని త్యావసరాలు ఇవ్వాలంటే రేషన్ కార్డు చూపాలని అధికారులు ఒత్తిడి చేయడం తగదంది. లాక్డౌన్ వేళ అంద రినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన ని స్పష్టం చేసింది. వలస కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. -
నేటి నుంచి ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేయగా బుధవారం నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకులను అందించనుంది. ఈసారి మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేశారు. ఈసారి కూడా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి. ► రెండో విడత సరుకుల పంపిణీ వరకు రాష్ట్రంలో 1,47,24,016 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ► బియ్యం కార్డుల కోసం ‘స్పందన’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ► వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందులో 81,862 మందిని అర్హులుగా తేల్చారు. ► ప్రస్తుతం మూడో విడత సరుకులు తీసుకునేందుకు మొత్తం 1,48,05,878 మందిని అర్హులుగా తేల్చినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ► ఈ దఫా ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారుల చొప్పున టైమ్‌స్లాట్ విధానంలో టోకెన్లు పంపిణీ చేశారు. ► అన్ని రేషన్ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు. ► రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న రేషన్ షాపులకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ► పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే సరుకులు తీసుకునేందుకు వీలు కల్పించారు. ► రేషన్ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ► 28,354 రేషన్ షాపులు, 15,331 అదనపు కౌంటర్లు కలిపి 43,685 చోట్ల లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేయనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: మూడో విడత కింద ఉచిత రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, కందిపప్పును పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా కార్డుల కోసం 95 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కూడా రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా వీఆర్వోల ద్వారా రేషన్ సరుకులు ఇవ్వాలన్నారు. -
రేషన్ కార్డులేని వారికి పోస్టల్ ద్వారా రూ.1,500
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎవరికైతే బ్యాంకు అకౌంటుకు ఆధార్ కార్డు అనుసంధానం లేదో వారికి ఇప్పటికే తపాలా కార్యాలయాల ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని, మొత్తంగా 5.21 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,500 నగదు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇందులో ఇప్పటికే 52 వేల మంది లబ్ధిదారులకు నగదు చెల్లించామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా జిల్లాల లబ్ధిదారులు నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి నగదు తీసుకోవచ్చని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన లబ్ధిదారులైనా ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న రూ.1,500 సాయాన్ని తీసుకోవచ్చని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని తపాలా కార్యాలయాలు చెల్లింపులు తీసుకునేందుకు ఎంపిక చేశామని, వాటిలో జీపీఓ, జూబ్లీ హెడ్ ఆఫీస్, ఫలక్నామా, కేశవగిరి, బహదూర్‌పుర, సైదాబాద్, అంబర్‌పేట, ఉప్పల్, కాచిగూడ, రామకృష్ణాపూర్, యాకుత్‌పుర, ఖైరతాబాద్, హుమాయూన్ నగర్, హిమాయత్‌నగర్, మోతీనగర్, ఎస్సార్ నగర్, లింగంపల్లి, శ్రీనగర్ కాలనీ, కొత్తగూడ, మణికొండ, కార్వాన్, సికింద్రాబాద్, తిరుమలగిరి ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అకౌంటు లేని లబ్ధిదారుల జాబితా సంబంధిత రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంటుందని గంగుల తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో గల వ్యక్తిమాత్రమే నగదు పొందేందుకు అర్హుడని, ఆధార్, రేషన్ కార్డు నంబర్ నగదు ఉపసంహరణకు అవసరమని మంత్రి పేర్కొన్నారు. -
69.78 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరుకులను గత నాలుగు రోజుల్లో 69.78 లక్షల కుటుంబాలు తీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలను ఆకలి బాధల నుంచి తప్పించేందుకు నెలలోగా మూడుసార్లు ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. దీని వల్ల నెల రోజుల్లోనే రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 3 కిలోల కందిపప్పు అందుతాయి. ఇందులో భాగంగా మొదటి విడత కింద మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 వరకు, రెండో విడత కింద ఏప్రిల్ 15 నుంచి 28 వరకు, మూడో విడత కింద ఏప్రిల్ 29 నుంచి ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. మరో మూడు నాలుగు రోజుల్లో లబ్ధిదారులందరికీ సరుకుల పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది. – ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ 90.28 లక్షల కార్డుదారులకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది. – దీంతో మిగిలిన 56.95 లక్షల కుటుంబాలకు (1.52 కోట్ల కుటుంబ సభ్యులకు) పంపిణీ చేస్తున్న సరుకులకు అయ్యే భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. – కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రేషన్ షాపుల వద్ద ప్రతి ఒక్కరూ కనీసం ఒకటి రెండు మీటర్ల భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. –అవసరం ఉన్న రేషన్ షాపుల వద్ద బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి షాపుల్లోకి ఒక్కొక్కరినే అనుమతించారు. -
సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి షాక్ ఇచ్చే రీతిలో శుక్రవారం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార వార్‌లో తన పంతాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ నెగ్గించుకున్నారు. పుదుచ్చేరిలో ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడానికి తగ్గట్టు కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సైతం కిరణ్ అడ్డుకట్ట వేశారు. ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయాలని ఉత్తర్వుల్ని ఆమె జారీ చేశారు. ఆమె ఉత్తర్వులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఆమోద ముద్ర వేయడంతో, దీనిని అమలు చేయాల్సిన అవశ్యం నారాయణ సర్కారుకు ఏర్పడింది. ఉచిత బియ్యం పథకానికి తమ ప్రభుత్వ నిధుల్ని కేటాయించడం జరుగుతోందని, ఇందులో కేంద్రం జోక్యం తగదని ఇప్పటికే నారాయణ స్వామి స్పష్టం చేసి ఉన్నారు. అలాగే, కిరణ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సైతం సాగాయి. చివరకు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రీన్ సిగ్నల్.. ఈ ఉత్తర్వుల వ్యవహారం కోర్టుకు చేరడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏడాదిన్నర కాలంగా ఉచిత బియ్యం పంపిణీ అన్నది ఆగిపోయింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం తుది విచారణ న్యాయమూర్తి కార్తికేయన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అని, కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం సైతం లభించి ఉందని వాదించారు. నారాయణస్వామి ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఉచిత బియ్యం పంపిణీకి పట్టుబడుతూ వాదన వినిపించారు. రాష్ట్ర నిధుల్ని వెచ్చిస్తున్నప్పుడు, కేంద్రం జోక్యం ఏమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం నారాయణస్వామి సర్కారుకు షాక్ ఇచ్చే రీతిలో న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
కొత్త బియ్యం కార్డులు సిద్ధం
సాక్షి, అమరావతి : ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. గతంలో ఉన్న 1.47 కోట్ల రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులివ్వనుంది. జాతీయ ఆహార భద్రత చట్టం–2013 పేరిట బియ్యం కార్డులను ముద్రించారు. కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్ ఫొటోకు బదులు కార్డు ఎవరి పేరున మంజూరైందో వారి ఫొటోనే ఉంటుంది. కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరుగా ఐడీ నంబర్లు ఇచ్చారు. కార్డు ఏ రేషన్ డీలర్ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులో సభ్యుల వయస్సు మాత్రమే ఉండేది. కొత్త కార్డుల్లో పుట్టిన తేదీతో సహా ముద్రించారు. కార్డుల్లో పేర్లు, ఇతర సమాచారం తప్పుల్లేకుండా ఉండేందుకు గ్రామ, వార్డు వలంటీర్ ద్వారా మరోమారు క్షేత్ర స్థాయిలో విచారించి వివరాలు సరైనవేనని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులను తయారు చేశారు. కార్డులో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ వివరాలున్నాయి. సరుకులు అందకుంటే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ 1902 / 1967 / 18004250082 నంబర్లను కూడా కొత్త కార్డులో ముద్రించారు. -
రేషన్ కార్డులపై టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులపై ఉద్దేశపూర్వకంగా క్రీస్తు బొమ్మను ముద్రించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకుడి వ్యవహారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరులో వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన పౌర సరఫరాల శాఖాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వడ్లమూరుకు చెందిన మంగాదేవి రేషన్‌డీలర్ కాగా, ఆమె భర్త టీడీపీ నాయకుడు. రేషన్ కార్డులపై ఆయన కావాలనే క్రీస్తు బొమ్మను ముద్రించి వాటిని వినియోగదారులకిచ్చి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇలా చేయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాడని అధికారులు గుర్తించారు. 2016లో ఇతనే రేషన్ కార్డులపై సాయిబాబా బొమ్మను, 2017లో వేంకటేశ్వరస్వామి బొమ్మను ముద్రించాడు. వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకే పార్టీ పెద్దల సూచనల మేరకు తాజాగా క్రీస్తు ఫొటోను ముద్రించినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అన్యమత ప్రచారం పేరుతో టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా కొద్దిరోజులుగా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రామస్థాయిలో తమకు కుదిరిన ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. -
జన ‘స్పందన’ భేష్
లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు,రేషన్‌కార్డులు, పెన్షన్లు ఫలానా తేదీ నుంచి ఇస్తామని లేఖ ఇవ్వండి. దీనివల్ల ప్రజలకు ఎప్పటి నుంచి అవి అందుతాయన్న దానిపై అవగాహన ఉంటుంది. అప్పుడే అవినీతి, పక్షపాతం లేకుండా పథకాలు అందరికీ అందుతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘స్పందన’పై వస్తున్న నివేదిక ప్రకారం కార్యక్రమం బాగా సాగుతోందని, ఎక్కువ శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో అధిక భాగం ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్ అంశాలే ఎక్కువగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టామని, దీనిపై అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందనలో వచ్చే వినతులను నాణ్యతతో పరిష్కరించగలిగినప్పుడే కలెక్టర్లు, ఎస్పీలకు మంచిపేరు వస్తుందని, తన కళ్లు, చెవులు.. కలెక్టర్లు, ఎస్పీలేనని, మీ పనితీరు బాగుంటేనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని సీఎం స్పష్టం చేశారు. ‘వినతుల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా సీఎం కార్యాలయం నుంచి కార్యదర్శి సాల్మన్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది జిల్లాలకు వెళ్తారు. పోలీసు అధికారులు కూడా ఈ బృందంలో ఉంటారు. ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర స్థాయిలో అధికారులను కలుస్తారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా వినతులను ఎలా పరిష్కరించాలన్నదానిపై వారికి వివరిస్తారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్‌పై వీరు పని చేస్తారు. నవంబర్ 5 నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది’ అని సీఎం వివరించారు. ఇళ్లపట్టాల పంపిణీపై ప్రత్యేక దృష్టి ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 22,79,670 లబ్ధిదారులను గుర్తించామని, దేశం మొత్తం ఈ పథకం వైపు చూస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. కాల్వగట్ల మీద, నదీ తీర ప్రాంతాల్లో ఉంటున్న వారికి మొదటి విడతలోనే సుమారు 6 లక్షల మేర ఇళ్లు కట్టించి, వారిని అక్కడికి తరలించాలని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పామన్నారు. 2 సెంట్ల నుంచి 6 సెంట్ల వరకు నిర్దేశిత విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించడంపై ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నామన్నారు. అభ్యంతరం ఉన్న, అభ్యంతరం లేని వర్గీకరణ స్పష్టంగా ఉండాలన్నారు. 2 నుంచి రెండవ విడత కంటి వెలుగు కంటి వెలుగుకు సంబంధించి రెండో విడత కార్యక్రమం నవంబర్ 2 నుంచి ప్రారంభం అవుతుందని సీఎం తెలిపారు. తొలి విడత కార్యక్రమంలో 69.36 లక్షల మంది పిల్లలకుగాను 65.03 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశారని, ఇందులో 4.30 లక్షల మంది పిల్లలకు కంటికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. ప్రభుత్వ స్కూలు సముదాయాల్లోనే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తారని, మొత్తంగా 500 బృందాలు ఇందులో పాలుపంచుకుంటాయన్నారు. నవంబర్ 20 నుంచి కంటి అద్దాల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని ఆసుపత్రుల్లో రోగులకు సూపర్ స్పెషాలిటీ వెద్య సేవలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు పేమెంట్లు నవంబర్ 7వ తేదీ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని సీఎం చెప్పారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు సుమారు రూ.264 కోట్లు అందించడానికి వీలుగా కలెక్టర్లు నవంబర్ 2లోగా బిల్లులు సమర్పించాలని సీఎం సూచించారు. సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్నవారికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే.. వారికి పథకం వర్తించేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ 14న పాఠశాలల్లో ‘నాడు – నేడు’ కార్యక్రమం ప్రారంభం అవుతుందని సీఎం పేర్కొన్నారు. తొలివిడతలో 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై, వచ్చే ఏడాది మార్చి 30 నాటికి పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఏడాది నుంచి 9వ తరగతి, ఆ మరుసటి ఏడాది పదిలో ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తారని చెప్పారు. 21న వైఎస్సార్ మత్స్యకార నేస్తం నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ మత్స్యకార నేస్తం కార్యక్రమం ప్రారంభం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. మత్స్యకారులకు లీటరు డీజిల్ మీద రూ.6.03 ఉన్న సబ్సిడీని రూ.9కి పెంచామని, దీనికి సంబంధించి 81 పెట్రోలు బంకులను గుర్తించామని చెప్పారు. డీజిల్ పట్టించుకున్నప్పడే సబ్సిడీ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఉండే సహాయాన్ని రూ.10 వేలకు పెంచామన్నారు. 21న ఈ డబ్బు ఇస్తామని తెలిపారు. గతంలో మెకనైజ్డ్, మోటారైజ్డ్ బోట్లకు మాత్రమే ఇచ్చే వారని, ఇప్పుడు సముద్రంలో తెప్పలపై వేటకు వెళ్లే వారికీ దీన్ని వర్తింప చేస్తున్నామని సీఎం వివరించారు. 1,32,332 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని గుర్తించామని చెప్పారు. ముమ్మిడివరంలో ఈ పథకం ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని సీఎం తెలిపారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు. గ్రామ వలంటీర్ పోస్టుల భర్తీ పట్టణ ప్రాంతాల్లో 19 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 9 వేల గ్రామ వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. రైతు భరోసా మీద కలెక్టర్లు వచ్చే వారం దృష్టి సారించాలని సూచించారు. నవంబర్ 15 రైతు భరోసాకు ఆఖరు తేదీగా నిర్ధారించామని, ఆధార్ సీడింగ్‌లో పొరపాట్లు, ఇతరత్రా సమస్యలను నివారించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. 1.87 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లు క్లోజ్ అయిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు. వాటిని తెరిపించి రైతు భరోసా లబ్ధి అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 4.89 లక్షల మంది రైతులకు ఆధార్ తప్పుగా నమోదైందని, వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాలు బాగా కురిశాయని, ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 500 రకాల మందులు లభిస్తాయి. నవంబర్ 20 నుంచి ఆస్పత్రులకు మందుల పంపిణీ ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి కలెక్టర్లు ఆస్పత్రులను తనిఖీ చేయాలి. ఎక్కడైనా మందుల కొరత ఉందని గుర్తిస్తే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలి. నవంబర్ 30 నాటికి అన్ని ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇళ్ల స్థలాలపై ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, దీనివల్ల సోషల్ ఆడిట్ జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అర్హత ఉండీ ఎవరిపేరైనా జాబితాలో లేకపోతే.. వారు ఎవరికి, ఎలా, దరఖాస్తు చేయాలి? అనే వివరాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి గ్రామ సచివాలయాలు పని చేయడం ప్రారంభించాలని, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్, లామినేషన్ యంత్రం.. తదితర సామగ్రి అంతా సచివాలయాల్లో ఉండాలన్నారు. లోటుపాట్లు సరిదిద్దుకుని జవనరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం పక్కన ప్రభుత్వానికి సంబంధించిన భవనాన్ని గుర్తించి.. అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని చెప్పారు. రైతులకు ఉత్తమ వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చేలా ఉండాలని సీఎం సూచించారు. -
కుటుంబాలు తక్కువ.. కార్డులు ఎక్కువ..!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): పేదలకు దక్కాల్సిన పథకాలు పెద్దల పాలవుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అనర్హులకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తుండడంతో పేదల కార్డులపై పెద్దల కన్ను పడింది. తెల్ల రేషన్ కార్డుంటే లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చనే ఉద్దేశంతో బహుళ అంతస్తుల భవనాలు, ఇంటి ముందు కార్లు ఉన్న చాలా మంది శ్రీమంతులు కూడా అక్రమంగా ఆహార భద్రతా కార్డులు పొందుతున్నారు. ఇందుకు జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లెక్కలను చూస్తే జిల్లాలో వేలాది కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో కుటుంబాలు - 3,69,031 ఆహార భద్రత కార్డులు - 3,91,749 భద్రత కోసమే.. జిల్లాల పునర్విభజన తరువాత నిజామాబాద్ జిల్లా మొత్తం జనాభా 15,71,022 ఉండగా, 3,69,031 కుటుంబాలు ఉన్నాయి. కానీ జిల్లాలోని 27 మండలాల పరిధిలో 3,91,749 రేషన్ కార్డులున్నాయి. ఈ లెక్కన కుటుంబాల కంటే రేషన్ కార్డులు 22,718 అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీరిలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, బడా కాంట్రాక్టర్లు, ఉన్నత వర్గాల వారున్నారు. వీరు నెలనెలా రేషన్ దుకాణాలకు వెళ్లి రాయితీపై బియ్యం తీసుకుని బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రూపాయికి కిలో బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పొంది, మార్కెట్లో రూ. 10 నుంచి రూ.15 వరకు కిలోకు విక్రయిస్తున్నారు. తెలిసి కూడా కార్డులు జారీ.. మండల స్థాయిలో మీ సేవ కేంద్రాల ద్వా రా తహసీల్దార్ కార్యాలయానికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా రు. అయితే, ఆహార భద్రతా కార్డులతో కలిగే లాభాలను చూసి శ్రీమంతులు కూడా కార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నా రు. దరఖాస్తులు చేసుకున్న వారు శ్రీమంతులు అని తెలిసీ కూడా మండలాధికారు లు కార్డులు మంజూరు చేస్తున్నారు. కం ప్యూటర్ ఆపరేటర్లు, రేషన్ డీలర్లు కూడా అందిన కాడికి దండుకుంటున్నారు. వాస్తవానికి ఉత్తర్వు నెం.17 ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే ఆహార భద్రతా కార్డులు కేవలం రేషన్ కార్డులు తీసుకోవడానికి వినియోగించాలి. కానీ పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కార్డులను కచ్చితం చేసింది ప్రభుత్వం. ఆసరా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్లు పొందటానికి రేషన్‌కార్డు తప్పనిసరిగా మారింది. పెరుగుతోన్న కార్డుల సంఖ్య.. జిల్లాలో కొత్తగా ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. జూలై 31 నాటికి జిల్లాలో 3,91,749 కార్డు లుండగా, ఇంకా 20 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే 36,616 దరఖాస్తులు అనర్హతగా గుర్తించి రిజెక్టు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయి 45 రోజులవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచే రేషన్ కార్డుల మం జూరుకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. కుటుం బాల సంఖ్య కంటే ఎక్కువ మొత్తంలో రేషన్ కార్డులుండడంతోనే కొత్త కార్డుల మంజూరు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అనర్హుల కార్డులు తొలగించే వరకు కొత్తవి ఇవ్వకపోవచ్చని సమాచారం. -
అనుసంధానం.. అనివార్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత పారదర్శంగా అసలైన అర్హులకు అందివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా తెల్ల రేషన్ కార్డు దారులంతా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. అంటే కుటుంబంలోని సభ్యులంతా తమ ఆధార్‌ను రేషన్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. సాక్షి, విజయవాడ: తెల్ల రేషన్ కార్డుదారులంతా తప్పని సరిగా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ–కేవైసీ).. అంటే కార్డుదారులు తమ ఆధార్ కార్డును తెల్లకార్డుతో అనుసంధానం చేయడం. అయితే కేవలం కు టుంబంలో ఒక్కరు కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది వెళ్లి తమ వేలిముద్రలు వేసి ఆధార్ నంబర్‌ను తెల్లకార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 12.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల కార్డులకు చెందిన వారు ఈ–కేవైసీనీ చేయించుకున్నారు. అయితే మరో మూడు లక్షల కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీని కోసం ముందుగా ప్రజాసాధికారిక సర్వే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9వ తేదితో ఈ–కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు నిర్ణయించింది. దీనికితోడు రేషన్ దుకాణదారుడే తమ వద్దకు వచ్చే కార్డుదారులకు ఈ–కేవైసీ చేయాలని నిబంధన పౌరసరఫరాల అధికారులు విధించారు. దీంతో డీలర్లు జోరుగా ఈ–కేవైసీలు చేయిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి ఇలా.. ప్రస్తుతం తెల్లకార్డు ఉంటేనే రాష్ట్రంలో పేదలుగా గుర్తింపు పొందుతారు. ప్రభుత్వ పథకాలు వల్ల ఏదైనా లబ్ధిపొందాలంటే తప్పని సరిగా తెల్లకార్డు అవసరం. అయితే ఈ–కేవైసీ చేయించుకోని కార్డులను నాలుగైదు నెలలు వరకు గడువు ఇచ్చి ఆ కార్డుదారులు ఎక్కడ ఉన్నారా? అని అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అందువల్ల తెల్లకార్డుదారులంతా త్వరగా ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అమ్మఒడి, సన్నబియ్యం, ఉచిత గృహాలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వల్ల లబ్ధిచేకూరాలంటే ఈ–కేవైసీ తప్పని సరిగా ఉండాలి. అనర్హులు, బోగస్‌కార్డుల ఏరివేత ఈ–కేవైసీ ప్రక్రియ ద్వారా అనర్హులు, బోగస్ కార్డులు బయటపడే అవకాశం ఉంది. అనేక మందికి రెండు చోట్ల తెల్లకార్డులు ఉన్నాయి. అలాగే ప్రభుత్యోద్యోగులకు తెల్లకార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది చనిపోయినా వారి పేరుతో కుటుంబ సభ్యులు రేషన్ పొందుతున్నారు. ఇక లబ్ధిదారులు స్థానికంగా ఉండకపోయినా ఉన్నట్లు చూపించుకుని ఫలాలు పొందుతున్నారు. ఇటువంటి వారంతా ఈ–కేవైసీ అనుసంధానం ద్వారా బయటపడతారని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాల అందుతాయని అంటున్నారు. -
నా రూటే.. సపరేటు !
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. అయితే పుట్టపర్తి తహసీల్దారు గోపాలకృష్ణ రూటే సపరేటు... అందరు తహసీల్దార్లకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరణ అన్ని చోట్ల జరుగుతుంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్య గమనిక అంటూ ‘‘ప్రస్తుతం రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరించబడవు మీ సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి’’ అని ఏకంగా నోటీసు బోర్డులో ఉంచారు. దరఖాస్తులు కచ్చితంగా తీసుకోవాలి కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని కచ్చితంగా స్వీకరించాలే తప్ప తిరస్కరించకూడదు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అంతే కాకుండా వాటిని పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తిస్తారు. ఇది ప్రక్రియ. అయితే పుట్టపర్తి తహసీల్దారు మాత్రం ఇందుకు భిన్నంగా దరఖాస్తుల స్వీకరించబోమని నోటీసు ఉంచడం చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో అతికించిన నోటీసు మీ–సేవలో దరఖాస్తు విధానం లేదు కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో లేదు. కార్డు కోసం మీ సేవలో దరఖాస్తులను స్వీకరించరు. అందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లేదు. అయితే పుట్టపర్తి తహసీల్దార్ ఇందుకు భిన్నంగా... మీ– సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. దరఖాస్తులు స్వీకరించాలి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరించాలి. అంతే తప్ప వాటిని తిరస్కరించకూడదు. వచ్చిన దరఖాస్తులను పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తాం. పుట్టపర్తి తహసీల్దార్ అలా ఎలా నోటీసు ఉంచారో తెలీదు. ఆయనతో నేనే స్వయంగా మాట్లాడాతాను. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి, పౌర సరఫరాల శాఖ -
అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులు లేని పేదల నుంచి గ్రామ సచివాలయాల్లో అర్జీలు తీసుకొని విచారణ చేసి అర్హులైన వారికి మూడు రోజుల్లోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా బియ్యాన్ని ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని కోరారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్లు బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్య కుమారి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరయ్యారు. -
ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకం అమలుకు కేంద్రం కసరత్తు
-
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు(వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్ రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ‘2020, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కోసం ఆధార్ చూపాల్సిందే.. ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్ సరుకుల కోసం ఆధార్‌కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్‌షాపుల్లో అయితే కేవలం రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్‌కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్‌తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 100 శాతం పీవోఎస్ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యోగులందరూ ఆ దిశగా పనిచేయాలని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులను జారీచేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన జూన్ 1 నుంచి రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని ఆదేశించారు. చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్ఓ) పరిధిలో రేషన్ కార్డుల జారీ, 6ఏ కేసుల పరిష్కారం, రేషన్ డీలర్ల నుంచి గోనె సంచుల సేకరణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బుధవారం సీఆర్ఓ కార్యాలయంలో కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల జారీని వేగం చేయడానికి శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధికారులతో 2 కమిటీలను వేసి అవి చేసిన సిఫారసులు అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను త్వరితగతిన ఎలా పరిష్కరించాలనే దానిపై హెచ్ఎండీఏ పరిధికి సంబంధించి ఇద్దరు, గ్రామీణ ప్రాంతాలకు చెంది మరో ఇద్దరు ఉన్నతాధికారులతో 2 కమిటీలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులను డీసీఎస్ఓలు, ఏసీఎస్‌ఓల లాగిన్‌కు వచ్చిన 7 రోజుల్లో కార్డుల జారీ పూర్తి చేయాలి’ అని అన్నారు. -
కొత్త కార్డు కావాలా నాయనా..
సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం) : రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సామాన్యులు రేషన్‌కార్డు పొందాలంటే గగనమైపోతుంది. కార్డు కోసం ముప్పతిప్పలు పెడుతున్నారు. జన్మభూమి సభల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా చివరకు మొండి చేయే చూపుతున్నారు. తాజాగా కొత్త రేషన్‌కార్డు కావాలంటే 1100కు ఫోన్ చేయాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. తరువాత ఒక ప్రైవేటు సంస్థ రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) సంస్థ ద్వారా వివరాలను సేకరిస్తుంది. అవగాహన లేమి... రేషన్ కార్డు మంజూరులో ప్రజలకు అవగాహన కల్పించకుండా కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. గతంలో మాదిరిగా తహసీల్దార్ కార్యాలయంలోను, వివిధ సభల్లోను దరఖాస్తులు చేయనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ 1100 ద్వారా రేషన్‌కార్డును పొందే అవకాశం కల్పించారు. ఈ నెంబరు రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పరిధిలో ఉంటుంది. కార్డు కావాల్సిన వారు తమ ఫోన్ నుంచి 1100లకు ఫోన్ చేయాలి. అటునుంచి అడిగిన మేరకు పేరు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు తెలియజేయాలి. ఆ తరువాత సదరు వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారులు దర్యాప్తు చేసి కార్డుకు సిఫార్సు చేస్తారు. అయితే మారుతున్న టెక్నాలజీ తెలియని ప్రజలు మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు తిరుగుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఇలా... కొత్తగా తెలుపు రేషన్ కార్డు కావాలంటే ఆర్టీజీఎస్లో నమోదు కావల్సి వుంది. వారు పూర్తిగా ప్రజా సా«ధికార సర్వే వివరాలపై ఆధార్ పడి ఈ కార్డు మంజూరు చేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా ప్రజాసాధికార సర్వేలో వివరాలు లేకపోతే కార్డు మంజూరు కాదు. సర్వే ఆధారంగా వారి ఆస్తులు, ఇళ్లు, వాహనాలు, ఇతర వివరాలు ఆర్టీజీఎస్లో బహిర్గతమవుతాయి. దరఖాస్తు దారునికి 500 గజాలు మించి ఇళ్లు, ఐదు ఎకరాల పొలం, నాలుగు చక్రాల వాహనం వంటివి నమోదై ఉంటే తెలుపు రేషన్ కార్డు మంజూరు కాదు. ఏ కార్డులో పేరు నమోదై ఉండకూడదు రేషన్ కార్డు కోసం చేసుకొన్న దరఖాస్తుదారు ఏ ఒక్క కార్డులో నమోదై ఉండకూడదు. ఏ కార్డులో కూడా నమోదు కానివారు కొత్త కార్డు కోసం 1100 ద్వారా చేయాలి. అలాగే ప్రజాసాధికార సర్వేలో వారి తల్లిదండ్రులతో కలిసి నమోదై ఉండకూడదు. ఒక వేళ ఉంటే, వారు సంబంధిత తహసీల్దార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా సా«ధికార సర్వేలో స్పిల్టింగ్ (వేరుగా ఉన్నట్లు) చేసుకోవాలి. అప్పుడే కొత్త కార్డు పొందేందుకు అర్హులవుతారు. అవగాహన కల్పిస్తున్నాం... కొత్తగా రేషన్‌కార్డు కావాలనే వారికి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాం. వీఆర్ఓల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కార్డు కావాలనే వారు తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వే చేయించుకోవాలి. ఏ కార్డులో నమోదు కాని వారు మాత్రమే 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోను చేయాలి. – పి.సోమేశ్వరరావు, తహసీల్దార్, గరుగుబిల్లి -
ఉన్నది పోయే.. కొత్తది రాదాయె..
యర్రగొండపాలెం, యర్రగొండపాలెం టౌన్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలపై గ్రామసభల్లో ఇచ్చిన అర్జీలకు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అనేక మంది కోల్పోతున్నారు. ప్రతినెలా రేషన్‌కార్డుల ద్వారా చౌకధరల దుకాణాల్లో రాయితీపై అందించే బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు 9,41,285 ఉండగా అందులో దాదాపు 22 వేల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నాయి. కొత్తగా వివాహాలు చేసుకున్నవారు. కొత్త రేషన్‌కార్డు కావాలంటే ముందుగా పేరెంట్స్ కార్డుల నుంచి పేర్లు తొలగించుకోవాలని అధికారులు ఇచ్చిన సూచనల మేరకు అనేక మంది ఆ కార్డుల నుంచి తమ పేర్లు తొలగించుకున్నారు. తమ పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించుకొని కొత్తకార్డుల కోసం అర్జీలు దాఖలుచేసి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు, మూడు సంవత్సరాలనుంచి కార్డుల కోసం ఎదురు చేస్తున్నామని వారు తెలిపారు. ఒక్క గ్రామంలోనే 17మంది పేర్లుతొలగించుకున్నారు 2017 లో జరిగిన జన్మభూమి గ్రామసభలో యర్రగొండపాలెం మండలంలోని పాతగోళ్లవిడిపి గ్రామంలో 17 మంది పేరెంట్స్ కారŠుడ్స నుంచి పేర్లు తొలగించుకుని, కొత్త రేషన్‌కార్డుల కోసం ధరఖాస్తులు చేశారు. ఏడాదిగా ఎదురుచూస్తున్న వీరికి 6వ విడత జన్మభూమి కార్యక్రమంలోనూ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే కాల్‌సెంటర్ 1100లకు ఫోన్ చేయమని బదులు ఇస్తున్నారని, ఉన్న కార్డులనుంచి పేర్లు తొలగించుకొని కొత్త కార్డులు మంజూరుకాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనిప్రభుత్వం జిల్లాలో కొత్తకార్డుల కోసం గత సంవత్సరం జన్మభూమి, గ్రీవెన్సెల్, మీ కోసం వంటి కార్యక్రమాల్లో దాదాపు 37 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో గత సంవత్సరం జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంతో పాటు, జూన్ నెలలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వం 15 వేల మందికి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మిగతా 22 వేల మంది దరఖాస్తుల వివరాలను వెబ్సైట్లో పెట్టారు. అధికారులతో విచారణ చేయించి, అర్హుల వివరాలను సేకరించి, అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్డీటీలు విచారణ పూర్తి చేసి, అర్హుల వివరాలను అప్లోడ్ చేసినప్పటికీ, ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసినవారిలో కొందరు ప్రజాసాధికారిక సర్వేలో లేరని తేలింది. ఇంకా కొందరు వేరే కుటుంబంగా కాకుండా తల్లిదండ్రులతోనే కలిసి ఉన్నట్లు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కావడం వంటి కారణాలు చూపిస్తు కొత్తకార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. రేషన్‌కార్డులేక ఇబ్బందులు కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పాత కార్డుల నుంచి వైదొలిగినవారు జిల్లాలో సుమారు 22 వేల మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ కార్డుల్లో పేర్లు ఉండటం వలన కనీసం బియ్యం, కందిపప్పు వంటి సరుకులు వచ్చేవి. ఇంకా> విద్యా, వైద్యం, పక్కా గృహాలు తదితర అవసరాల కోసం రేషన్‌కార్డులులేక ఆ పథకాలను చేజార్జుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి, ప్రభుత్వం కార్డులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రేషన్‌కార్డులేక ఇబ్బందులు కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పాత కార్డుల నుంచి వైదొలిగినవారు జిల్లాలో సుమారు 22 వేల మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ కార్డుల్లో పేర్లు ఉండటం వలన కనీసం బియ్యం, కందిపప్పు వంటి సరుకులు వచ్చేవి. ఇంకా> విద్యా, వైద్యం, పక్కా గృహాలు తదితర అవసరాల కోసం రేషన్‌కార్డులులేక ఆ పథకాలను చేజార్జుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి, ప్రభుత్వం కార్డులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఉన్న రేషన్‌కార్డు తొలగించారు తనకు ముగ్గురు కుమార్తెలకు, కుమారుడు వెంకటేశ్వరరెడ్డికి వివాహాలు అయ్యాయి. వెంకటేశ్వరరెడ్డి గతంలో రేషన్‌కార్డు కోసం పేరెంట్స్ కార్డు నుంచి పేరు తొలగించుకున్నాడు. తన కుమారుడికి కొత్త రేషన్‌కార్డు వచ్చింది. మాకున్న కార్డు తొలగించారు. తమ కార్డు ఎందుకు తొలగించారో అర్థంకావడంలేదు. గత 5 విడతలుగా గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినప్పటికీ రేషన్‌కార్డు మంజూరు చేయడంలేదు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. పింఛన్‌కు పెట్టుకోవాలంటే రేషన్‌కార్డు అడుగుతున్నారు.– వెన్నా పెద్ద యోగయ్య, వీరభద్రాపురం, వైపాలెం మండలం -
మాయగాడు పథకం..పారింది
అధికార పార్టీ నేతల ఆగడాలు అన్నీఇన్నీ కావు. కాసులకోసం కొందరు అక్రమ రవాణాను ఎంచుకుంటే...మరికొందరు అభివృద్ధి పనుల పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారు. ఇదంతా ఎందుకనుకున్న ఓ టీడీపీ చోటా లీడర్...సంక్షేమ పథకాల స్వాహాతో కాసులు కురిపించుకున్నాడు. తన పరపతి ఉపయోగించి...అధికారులకు తాయిళాలు అందజేసి రుణమాఫీ, ఎన్టీఆర్ ఇల్లు, పండ్ల మొక్కల పెంపకం..భూ పంపిణీ ఇలా ప్రతి పథకాన్నీ ఉపయోగించుకున్నాడు. ఇందుకోసం ఇతరుల కార్డుల్లో పేర్లు మార్చేశాడు. అర్హులకు అన్యాయం చేసి దర్జాగా పథకాలన్నీ పొందాడు. ఇది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇల్లు. గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లి గ్రామానికి చెందిన గంజికుంట శ్యాంప్రసాద్ తల్లి ప్రభావతమ్మ (రేషన్‌కార్డు నంబర్ : ఖఅ్క120503 100766) పేరుతో అధికారులు ఇల్లు మంజూరు చేశారు. ఆ మేరకు బిల్లులు కూడా మంజూరు చేశారు. కానీ ఇదే ఇంటికి మరో రెండు కార్డు నంబర్లపై రెండు బిల్లులు మంజూరు చేశారు. జియోట్యాగింగ్ ఉన్నా... అధికార పార్టీకి చెందిన శ్యాంప్రసాద్ తన పరపతి ఉపయోగించి ఇలా ఒకే ఇంటికి మూడు బిల్లులు పొందాడు. ఇందుకోసం రేషన్‌కార్డుల్లో పేర్లను సైతం మార్చేశాడు. అనంతపురం , గుంతకల్లు రూరల్ : అన్ని అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందక సామాన్యులు రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే...గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లి గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు మాత్రం ఒకటి, రెండు కాదు...ప్రభుత్వం ప్రవేశపెటిన పథకాలన్నింటిలోనూ లబ్ధి పొందాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేని అమాయకులరేషన్కార్డులను, బతుకు తెరువు కోసం వెళ్లిన వారి రేషన్ కార్డును గుర్తించి ఆ కార్డుల్లో అక్రమంగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి సంక్షేమ పథకాలను మంజూరు చేయించుకోవడం...పని పూర్తికాగానే రేషన్‌కార్డుల్లో పేర్లు మార్చేయడం పనిగా పెట్టుకున్నాడు. అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను దిగమింగుతూ అక్రమ సంపాదనతో జేబులు నింపుకుంటున్నాడు. అవసరమైతే పేర్లు మార్చేస్తాడు చింతలాంపల్లి గ్రామానికి చెందిన గంజికుంట శ్యాంప్రసాద్‌కు తల్లి ప్రభావతమ్మ, భార్య సుధారాణి , అన్న రాంప్రసాద్, వదిన ప్రతిభా భారతి ఉన్నారు. శ్యాంప్రసాద్ అన్న రాం ప్రసాద్, వదిన ప్రతిభాభారతి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శ్యాం ప్రసాద్ తల్లి ప్రభావతమ్మ పేరున మంజూరు అయిన రేషన్‌కార్డు నంబర్ ( ఖఅ్క120503100766)లో కుటుంబ సభ్యులందరి పేర్లూ ఉన్నాయి. కానీ శ్యాంప్రసాద్ తన అధికార పలుకుబడిని ఉపయోగించి తన కుటుంబ సభ్యుల పేర్లను అవసరమైన ప్రతిసారీ వేర్వేరు రేషన్ కార్డుల్లో చేర్చి ఎన్టీఆర్ గృహనిర్మాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలలో లెక్కకు మించి అక్రమాలకు పాల్పడ్డాడు. ఒకే ఇంటికే మూడు బిల్లులు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద శ్యాం ప్రసాద్ తల్లి ప్రభావతమ్మ పేరున ఇల్లు మంజూరు కాగా... తన స్వగ్రామమైన చింతలాంపల్లిలో నాలుగు సెంట్ల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం పనులను చేపట్టాడు. అయితే మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన కమ్మర ఓబులేసు అనే వ్యక్తి కుటుంబం గ్రామంలో లేదన్న విషయాన్ని తెలుసుకున్న శ్యాంప్రసాద్... ఓబులేసు భార్య కమ్మర పుల్లమ్మ పేరుతో ఉన్న రేషన్ కార్డులో ( గిఅ్క120503100069) పుల్లమ్మ పేరును తొలగించి ఆమె స్థానం లో తన పేరును నమోదు చేయించుకుని తన తల్లి పేరున నిర్మిస్తున్న ఇంటికి రెండో బిల్లు చేయించుకున్నాడు. ఆ తర్వాత తన భార్య సుధారాణి పేరును పిన్నమ్మ అయిన గంజికుంట యశోదమ్మ రేషన్‌కార్డు ( గిఅ్క120503 100062)లో చేర్చి అదే ఇంటిపై మూడో బిల్లు కూడా చేసుకున్నాడు. రుణమాఫీకీ ఇదే దారి మండలంలోని వివిధ గ్రామాల్లో మైగ్రేషన్‌లో ఉన్నవారి వివరాలను సేకరించి వారి రేషన్‌కార్డులను ఉపయోగించి లబ్ధిపొందుతున్న శ్యాం ప్రసాద్...రుణమాఫీ విషయం లోనూ భారీగా లబ్ధిపొందాడు. తల్లి ప్రభావతమ్మ పేరున ఉన్న సొంత రేషన్‌కార్డు ద్వారా శ్యాంప్రసాద్ రుణమాఫీ పొందాడు. అంతేకాకుండా తన పేరును అక్రమంగా ఎక్కించుకున్న నెలగొండ కమ్మర పుల్లమ్మ రేషన్ కార్డు ద్వారా రుణమాఫీ నిధులు ఖాతాకు మళ్లించుకున్నాడు. పిన్నమ్మ అయిన గంజికుంట యశోదమ్మ రేషన్‌కార్డులో భార్య పేరును చేర్చి ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద బిల్లు చేసుకున్న శ్యాం ప్రసాద్ ఆ తరువాత తన భార్య సుధారాణి పేరును అదే చింతలాంపల్లి గ్రామానికే చెందిన రామాంజనేయులు (రేషన్‌కార్డు నంబర్: గిఅ్క120503100182 ) కార్డులో చేర్చి రుణమాఫీ పొందాడు. అంతేకాకుండా అన్న రాంప్రసాద్ పేరును, వదిన ప్రతిభా భారతి పేర్లను కూడా ఇతర రేషన్ కార్డుల్లో ఎక్కించి రుణమాఫీ పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అత్త పేరుతో 8 ఎకరాల పొలం... శ్యాంప్రసాద్ పామిడి మండలం, కత్రిమల గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్త కలవకూరి రామలక్ష్మమ్మ పేరుతో ఏకంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని సంపాధించాడు. శ్యాంప్రసాద్ పొలానికి అత్యంత సమీపంలో సర్వే నంబర్ 904 ఎ,బీ,సీ లో 4.62 ఎకరాల భూమితోపాటు, సర్వే నంబర్ 978 సీ లోనూ మరో 4 ఎకరాలకు డి.పట్టా సంపాదించాడు. ఈ విషయంపై రెవిన్యూ అధికారుల వద్ద కూడా ఎటువంటి సమాధానం లేదు. పండ్ల మొక్కల పేరుతో రూ.2 లక్షలు స్వాహా శ్యాంప్రసాద్ ఉద్యాన పథకాల్లోనూ భారీగా లబ్ధి పొందాడు. సపోట మొక్కలు నాటక పోయినా ‘వెలుగు’ రికార్డుల్లో చూపించి రూ.2 లక్షల బొక్కేశాడు. ఈ ఏడాది జనవరి వరకూ అతడు మొక్కల పెంపకానికి బిల్లులు డ్రా చేసినట్లుగా వెలుగు రికార్డుల్లో నమోదైంది. దీనిపై వెలుగు సిబ్బందిని ప్రశ్నిస్తే... మొక్కలు పెంచిన మాట వాస్తవమేనని, అవి చనిపోవడంతో బిల్లులు నిలిపేశామన్నారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే పేరుతో లక్షలాది రూపాయలను దోచేసిన శ్యాంప్రసాద్ ఎక్కడా ఒక్క చెట్టు నాటిన ఆనవాలు కూడా కనిపించడం లేదు. రుణాల మంజూరుకు కమీషన్లు సబ్సిడీ రుణాల మంజూరులోనూ శ్యాంప్రసాద్ కమీషన్ల పర్వానికి తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై నోరెత్తితే రుణం మంజూరు కాదేమోనన్న భయంతో లబ్ధిదారులు మిన్నకుండిపోతున్నారు. ఐదేళ్ల అధికార పార్టీ పాలనలో శ్యాంప్రసాద్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందనీ, ఇప్పటి కైనా ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్డులో పేర్ల మార్పు ఇలా... ముందుగా శ్యాంప్రసాద్ వలస వెళ్లిన కుటుంబాలు...ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాల వివరాలు సేకరిస్తాడు. వారి కార్డులు సంపాదిస్తాడు. సివిల్ సప్లయ్ కార్యాలయంలో తన పరపతి ఉపయోగించి ఆ కార్డుల్లో తన పేరు లేదా తన కుటుంబీకుల పేర్లు నమోదు చేసుకుంటాడు. ఆ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుంటాడు. పథకం మంజూరై నిధులు మొత్తం వచ్చాక ఆ కార్డులో తన పేరు తొలగిస్తాడు. కార్డుదారులకూ నష్టమే ఒక కార్డుపై ఒక ఇల్లు మాత్రమే మంజూరవుతుంది. శ్యాంప్రసాద్ లాంటి వారు ఆ కార్డు నంబర్‌తో ఇల్లు మంజూరు చేయించుకుని లబ్ధి పొందిన తర్వాత...అసలైన కార్డు దారుడు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా..మంజూరు కాదు. అధికారులు ఏమన్నారంటే... శ్యాంప్రసాద్ ఒకే ఇంటికి మూడు బిల్లులు చేసిన విషయంపై హౌసింగ్ ఏఈ చిన్నారెడ్డిని వివరణ కోరగా... మూడు ఇళ్లుగా పార్టీషన్లు చేసుకోవడం వల్ల బిల్లు చేసినట్లు తెలిపారు. ఇదే విషయంపై హౌసింగ్ డీఈ మధుసూదన్‌రెడ్డిని వివరణ కోరగా... శ్యాంప్రసాద్ కట్టిన ఇంటికి మూడు బిల్లులు మంజూరు చేయడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇక రేషన్‌కార్డులో ఉన్న పేర్లు తొలగించి ఇతరుల పేర్లు చేర్చిన వైనంపై పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు, ఇతర సిబ్బందిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా...వారెవరూ అందుబాటులోకి రాలేదు. శ్యాంప్రసాద్ లీలలెన్నో... ♦ పండ్ల మొక్కలు పెంపకం పథకం కిందసపోటా మొక్కలు నాటినట్లు రికార్డుల్లో చూపి రూ.2 లక్షల నిధులు డ్రా చేసుకున్నాడు ♦ ఒకే ఇంటికి వేర్వేరు రేషన్ కార్డుల నంబర్లు ఉపయోగించి మూడు బిల్లులు చేసుకున్నాడు ♦ ఇతరుల కార్డుల్లో పేరు చేర్చుకుని రుణమాఫీ నిధులు దక్కించుకున్నాడు ♦ భూ పంపిణీ కింద తన అత్త పేరుమీద 8 ఎకరాలకు డి.పట్టా పొందాడు -
సర్కారీ నివేదికల డేంజర్ బెల్స్!!
-
సర్కారీ నివేదికల డేంజర్ బెల్స్!!
సాక్షి, అమరావతి: ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నా నిజానికి పెరుగుతోంది అసంతృప్తేనని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లలో ఆరుసార్లు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసిన టీడీపీ సర్కారు ప్రజల సమస్యలను తీర్చడంలో దారుణంగా విఫలమైనట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇళ్లు, ఇళ్ల జాగాలు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి పదేపదే పెద్ద ఎత్తున విజ్ఞాపనలు అందినా దాదాపు సగం దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించినట్లు వెల్లడైంది. అర్హులందరికీ మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ బూటకమేనని ఈ నివేదికను పరిశీలిస్తే వెల్లడవుతోంది. పేదల ఇళ్ల నిర్మాణంపై నాలుగున్నరేళ్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం ప్రచారార్భాటంతో కాలక్షేపం చేసిన చంద్రబాబు సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇళ్ల నిర్మాణంతోపాటు రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో వెల్లడైంది. పలు అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తేలటం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో చర్చనీయాంశమైంది. అర్హులుగా తేలినా ఇవ్వకుండా పెండింగ్‌లో... రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణమాఫీ కోసం 87.37 లక్షల మందికిపైగా పడిగాపులు కాస్తున్నట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. పది అంశాలకు సంబంధించి 87.37 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా ఏకంగా 37,49,043 దరఖాస్తులను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది. అర్హులుగా తేల్చినప్పటికీ మంజూరు చేయకుండా 49,16,423 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. ఇళ్ల మంజూరు కోసం 28,44,510 మంది పేదలు దరఖాస్తు చేసుకోగా 12,66,817 అర్జీలను అర్హత లేదంటూ తిరస్కరించారు. మరో 2,283 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులుగా తేల్చినా మంజూరు చేయకుండా 15,75,410 దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచారని ఆర్టీజీఎస్ నివేదిక పేర్కొంది. ఇక ఇంటి జాగాల కోసం దరఖాస్తు చేసుకున్న 21,10,626 మంది పేదలు ప్రభుత్వం ఎప్పుడు కనికరిస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగా ఏకంగా 13,50,727 లక్షల దరఖాస్తులను అర్హత లేదంటూ తిరస్కరించడం గమనార్హం. రేషన్‌కార్డులు, మంచినీటి సరఫరా, రుణమాఫీ, రహదారులతోపాటు రుణాలు కావాలంటూ ఎస్సీ కార్పొరేషన్‌కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల వసూళ్లు... పేదలకు ఇళ్ల మంజూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు భారీగా లంచాలు వసూలు చేస్తున్నారని సర్కారు ఆర్టీజీఎస్ సర్వేలో వెల్లడైంది. ఇంతవరకు బేస్మెంట్ బిల్లులు అందలేదని 63.98 శాతం మంది పేదలు తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఏకంగా 83.33 శాతం మంది బేస్మెంట్ బిల్లులు అందలేదని పేర్కొన్నారు. విశాఖపట్టణం జిల్లాలో 78.13 శాతం మంది, కృష్ణా జిల్లాలో 86.67 శాతం, గుంటూరు జిల్లాలో 80 శాతం, ప్రకాశం జిల్లాలో 66.67 శాతం మంది బేస్మెంట్ బిల్లులు అందలేదని చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని 32.90 శాతం మంది చెప్పగా ప్రజాప్రతినిధులు 19.08 శాతం మంది అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు 20 శాతం నుంచి 43 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు కొన్ని జిల్లాల్లో 19 శాతం నుంచి 50 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని 40 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బేస్మెంట్ స్థాయితో పాటు రూఫ్ లెవల్ బిల్లులు, ఇటుకలకు సంబంధించి రూ.650 కోట్ల మేర బిల్లులు పేదలకు అందలేదని తేలింది. లంచం ఇవ్వనిదే పని కావట్లేదు! మీ–సేవ ద్వారా అన్నీ అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లు రియల్‌టైమ్ గవర్నెన్స్ నివేదికలో వెల్లడైంది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా రెవెన్యూ సిబ్బంది భూములను సర్వే చేయడం లేదని తెలిపారు. ధృవీకరణ పత్రం మంజూరుకు రెవెన్యూ సిబ్బంది తీవ్ర జాప్యం చేయడంతో పాటు లంచాలు తీసుకుంటున్నారని 54 శాతం మంది చెప్పారు. ఈబీసీ సర్టిఫికెట్ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 67 శాతం మంది పేర్కొనగా, లంచాలు తీసుకుంటునా3్నరని 34 శాతం మంది స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుని సర్టిఫికెట్ ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని 60 శాతం మంది పేర్కొనగా 40 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదాయ సర్టిఫికెట్ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 70 శాతం మంది పేర్కొనగా 30 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని తెలిపారు. ల్యాండ్ మార్పిడి, ఓబీసీ సర్టిఫికెట్, పొజిషన్ సర్టిఫికెట్, ఎటువంటి ఆదాయం లేదని సరిఫికెట్ మంజూరుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా లంచాలు ఇవ్వకుండా రావడం లేదని వెల్లడైంది. అడంగల్ 1బి మంజూరుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, విశాఖపట్టణం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నూటికి నూరు శాతం మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించడం గమనార్హం. -
‘ఎన్నికల’ రేషన్ కార్డులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రేషన్ కార్డులను ఇష్టారాజ్యంగా తొలగించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తుండడంతో కొత్త రేషన్ కార్డుల మంజూరు పేరిట ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అడిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఏకంగా 24 లక్షల రేషన్ కార్డులను తొలగించింది. అర్హత ఉన్నా కార్డులను రద్దు చేయడంతో లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు. అయినా ప్రభుత్వం లెక్కచేయలేదు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1.44 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక భారం పేరిట రేషన్ కార్డులను తొలగించారు. ఆధార్ కార్డు అనుసంధానం చేయలేదని, ఈ–పాస్ యంత్రాల్లో వేలిముద్రలు సరిగా పడలేదంటూ సాకులు చూపి కార్డులను తొలగించారు. పేదలకు సబ్సిడీ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో 2015 ఏప్రిల్ నుండి ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో రేషన్ కార్డులో పేర్లు నమోదైన వారిలో ఒకరు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు వేస్తేనే సబ్సిడీ బియ్యంతోపాటు ఇతర సరుకులు ఇచ్చే విధానం అమలవుతోంది. స్థానికంగా పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు, వేలిముద్రలు సరిగ్గా పడని లబ్ధిదారులు సరుకులు తీసుకోనందున దాదాపు రూ.1,500 కోట్ల విలువైన సరుకులు ఆదా అయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కార్డులు ఉండేది ఎన్నికల దాకేనా? రేషన్ కార్డులు రద్దయిన లబ్ధిదారుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతుండడంతోపాటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం గతంలో నిర్వహించిన ప్రజాసాధికార (పల్స్) సర్వేలో నమోదైన వివరాల ప్రకారం కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసే బాధ్యతను రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్)కు అప్పగించింది. అడిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే రేషన్ కార్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని, కొత్తగా ఇచ్చే కార్డులు కేవలం ఎన్నికల వరకే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు కావాలని అడిగినా, అడగకపోయినా కొన్ని జిల్లాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు, న్యాయవాదులు, గెజిటెడ్ అధికారుల పేరిట కూడా రేషన్ కార్డులు ఇచ్చేశారు. దీన్నిబట్టి చూస్తే ఇవన్నీ ఎన్నికల కార్డులేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసిన వాటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం కంటే ప్రస్తుతం 1,36,608 కార్డులు తక్కువగా ఉండడం గమనార్హం. అయినా లక్షలాది రేషన్ కార్డులు మంజూరు చేశామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. -
మూడేళ్లలో మూడు లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో మూడేళ్లలో దాదాపు మూడు లక్షల ఆహార భద్రత కార్డులు రద్దయ్యాయి. బోగస్, అనర్హుల ఏరివేతలో భాగంగా అధికారులు అర్హుల కార్డులనూ తొలగించారు. ఆధార్ అనుసంధానంతో కొన్ని కార్డులు రద్దు కాగా... జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, ఆదాయ, ఇతరాత్ర పన్నుల పరిధిలోకి వచ్చిన కుటుంబాల కార్డులు రద్దయ్యాయి. అప్పట్లో వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని కార్డులు సైతం తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ఈ–పాస్ యంత్రాల విస్తరణ కార్య క్రమం కొనసాగడంతో ఆ ఏడాది మార్చి వరకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆన్లైన్ వెబ్సైట్ నిలిచిపో యింది. దీంతో కార్డుల్లో మార్పుచేర్పులు, పునరుద్ధరణ లేకుండా పోయింది. ఆ తర్వాత వెబ్ సైట్ ప్రారంభమైనా కార్డుల పునరుద్ధరణ, యూనిట్లలో మార్పుచేర్పులు ఆలస్యంగా జరుగు తున్నాయి. రద్దయిన అర్హుల కార్డులను తిరిగి పునరుద్ధరించకపోవడంతో పేదలు పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదీ పరిస్థితి... పేదలు దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యంగా వెంటనే ఆహార భద్రత కార్డులను మంజూరు చేసిన పౌరసరఫరాల శాఖ... ఆ తర్వాత దశల వారీగా వాటిని ఏరివేస్తూ వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది. ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నగరవాసులతో పాటు వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన పేదలు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ వద్ద సిబ్బంది కొరతతో క్షేత్రస్థాయి విచారణ లేకుండానే కేవలం ఆధార్ కార్డులను పరిగణలోకి తీసుకొని ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. దీంతో బోగస్, డబుల్, ఇతర రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు సైతం మంజూరు కావడంతో కార్డుల సంఖ్య ఒకేసారి పైకి ఎగబాకింది. ఆ తర్వాత ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధార్ నంబర్లను ఎన్ఐసీతో అనుసంధానం చేయడంతో బోగస్, డబుల్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు ఉన్నవారిని గుర్తించింది. ఆయా కార్డులతో పాటు కోటా రద్దు చేసింది. కార్డుల ఏరివేతలో అనర్హులతో పాటు అర్హుల కార్డులూ రద్దయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పౌరసరఫరాల పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అర్బన్ పరిధులున్నాయి. మొత్తం 12 సివిల్ సప్లయిస్ సర్కిల్స్ ఉండగా అందులో హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, మేడ్చల్ అర్బన్‌లో రెండు సర్కిల్స్, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒక సర్కిల్ ఉన్నాయి. మొత్తం మీద ఆహార భద్రత కార్డుల సంఖ్య సరిగ్గా మూడేళ్ల క్రితం వరకు 14.04 లక్షలు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 11.09 లక్షలకు చేరింది. -
మంత్రి పితానిపై సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులు కోరుతూ పేదలు మీ సేవాకేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోరా అంటూ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పితాని మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వేను ఆధారంగా చేసుకుని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని, దీనివల్ల గతంలోని పేదల దరఖాస్తులను పరిశీలించకపోవడంతో వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం కలుగజేసుకుని.. రేషన్ కార్డులు ఎవ్వరికి రాలేదు? అనవసరంగా మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? పేదలకు కార్డులివ్వలేదని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ మంత్రిపై అసహనం వ్యక్తం చేశారు. మీ తీరు చూస్తుంటే బస్సెక్కి మా ఊరికి టికెట్టివ్వండి అన్నట్టుగా ఉందని.. ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన వివరాలు దగ్గర పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆధారాల్లేకుండా మాట్లాడను : పితాని దీంతో మంత్రి అదే తరహాలోనే స్పందిస్తూ ఆధారాల్లేకుండా నేను మాట్లాడను సర్.. మీ సే వా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, రేషన్ కార్డులు మంజూరుకాని పేదల వివరాలిస్తాను. వారికి రేషన్ కార్డులివ్వండి.. అంటూ మంత్రి కోరారు. -
‘రియల్ టైమ్’ మాయాజాలం
తూర్పుగోదావరి, రామచంద్రపురం రూరల్: అన్నమో రామచంద్రా అంటూ ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా నాలుగున్నరేళ్లుగా కనికరించని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. వేలాదిమందికి తెల్ల రంగు రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. ఇలా రేషన్ కార్డులు పొందుతున్నవారిలో చనిపోయినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. రేషన్ కార్డుల ముద్రణ జరిగిపోయి గ్రామ రెవెన్యూ అధికారుల చేతికి వచ్చి న తరువాత అసలు విషయం తెలియడంతో ఏం చెయ్యాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. గతంలో రేషన్ కార్డు కావాల్సినవారు తహసీల్దార్ కార్యాలయంలోనో, జన్మభూమి గ్రామసభల్లోనో, మీసేవ కేంద్రాల ద్వారానో దరఖాస్తు చేసేవారు. దానిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, అర్హులని నిర్ధారిస్తే.. కార్డులు ఇచ్చేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ కా ర్డులకు అర్హుల ఎంపికలో కూడా జన్మభూమి కమి టీల పెత్తనం సాగేది. అయితే, అధికారులు చెబుతున్నదాని ప్రకారం, రెండేళ్లుగా ఈ విధానంలో మా ర్పు చేశారు. రేషన్ కార్డు కావాల్సినవారు రియల్‌టైమ్ గవర్నెన్స్ విధానంలో 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ వివరా లు నమోదు చేసుకున్న అనంతరం ఎటువంటి విచా రణా లేకుండానే నేరుగా ఆయా దరఖాస్తుదార్ల పేరుతో రేషన్ కార్డులు జనరేట్ అయిపోతున్నాయి. వాటి ని ప్రభుత్వం తాజాగా ముద్రించి, జిల్లాలకు పంపిం చింది. ఈవిధంగా జిల్లాకు వచ్చిన కార్డుల్లో సగానికి పైగా అనర్హులకు మంజూరైనట్టు సమాచారం. మన జిల్లాకు మొత్తం 30,386 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటికి అదనంగా మలివిడతలో మరో 5 వేల కార్డులనుకూడా మంజూరు చేశారు. ఇలా మొత్తం 35,386 కార్డులు ఆయా గ్రామాలకు చేరాయి. వీటిలో 50 శాతం పైగా అనర్హులకు మంజూరయ్యాయని తెలియడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటిని అర్హులైనవారికి పంపిణీ చేయాలో లేక అనర్హులు కూడా ఉండడంతో పంపిణీని ఆపాలో తెలియక గ్రామ రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయకుండా ఉన్నతాధికారుల ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్‌టైమ్ గవర్నెన్స్ పుణ్యమా అని ఇలా జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక సాంకేతిక తప్పిదమా అనేది తేలాల్సి ఉంది. -
రేషన్‌కు గండికొట్టడం అన్యాయం
-
ఉద్యోగులపై మళ్లీ నోరు పారేసుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేశారు. వారి పనితీరు బాగోలేదంటూ మండిపడ్డారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్త స్థాయి పెంచడంలో దారుణంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. మిమ్మల్ని మేము ఎందుకు మేపాలంటూ ఔట్సో ర్సింగ్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యద ర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. గృహ నిర్మాణాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచాలని సూచించారు. పరిష్కార వేదిక ద్వారా రియల్ టైమ్‌లో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అవసరమైనచోటల్లా పీపీపీ రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా ప్రజా సాధికార సర్వే నిర్వహించామని, భూ సమస్యల పరిష్కారానికి భూధార్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టామని, మునిసిపల్ పరిపాలనలో పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లామన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలొచ్చాయని చెప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాలు, వస్తువుల పంపిణీలో ప్రజల నుంచి మరింత సంతృప్తి వ్యక్తం కావాలన్నారు. 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రతి సోమవారం వ్యవసాయం, అనుబంధ రంగాలలపై టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం ఇ–ప్రగతి, ప్రతి బుధవారం రాజధాని, సంక్షేమంపై టెలికాన్ఫరెన్సులతో దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆర్నెల్లపాటు సర్కారు ప్రచారోద్యమం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూలై 15కి 1,500 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాల ద్వారా ప్రచారోద్యమం చేపట్టాలని సీఎం సూచించారు. సంతృప్తి శాతం పెరగడంలో సర్వీసు ప్రొవైడర్లు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అక్టోబర్‌లోగా ఈ ప్రగతి పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని సర్వీసులను ఆన్లైన్లో చేర్చి శాఖాధిపతుల్లో కాగిత రహిత పాలన రావాలన్నారు. 75 లక్షలకుపైగా పేద కుటుంబాల ఎదురుచూపులు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం 75 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు.. పరిశీలన దశ దాటి ముందుకు కదలడం లేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీరు, పెన్షన్లు తదితర పథకాల మంజూరు కోసం అందిన 75,17,255 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయినా మంజూరు చేయాల్సి ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడైంది. ఆర్థికేతర అంశాలతో కూడిన మరో 3,02,750 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. -
కొత్త రేషన్ కార్డులేవీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (ఆహార భద్రత) కోసం లబ్ధిదారుల పడిగాపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్కరికీ కొత్త రేషన్‌కార్డు జారీ కాలేదు. విచారణ దశలోనే దరఖాస్తులు మగ్గిపోతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారులు గత తీరికలేకుండా ఉండటంతో కార్డుల మంజూరు, దరఖాస్తుల వెరిఫికేషన్ మరుగున పడింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో జాప్యం కారణంగా దాదాపు 90 శాతం దరఖాస్తులు మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా రేషన్ సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పరిశీలన దశలోనే.. - ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మొత్తం 26,080 దరఖాస్తులు గ్రామ స్థాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలనలోనే ఆగిపోయాయి. మరో 11,522 దరఖాస్తులు తహసీల్దార్ల పరిశీలనలో, 993 దరఖాస్తులు అసిస్టెంట్ కమిషనర్ పరిశీలనలో, 1,768 దరఖాస్తులు డీఎస్ఓ పరిశీలనలో ఉన్నాయి. - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 23,511 దరఖాస్తులు రాగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు కేవలం 148 దరఖాస్తులు (హార్డ్ కాపీలు) మాత్రమే చేరాయి. వాటిని ఓకే చేసి కమిషనరేట్‌కు పంపించారు. మిగతావి వివిధ దశల్లో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39,795 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా 31,908 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. - ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 42,188 దరఖాస్తులు వచ్చాయి. అందులో 32,030 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 29,539 దరఖాస్తులు రాగా వాటిలో 28,713 మండల స్థాయిలో, మిగతా దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఈ ఏడాది కొత్త కార్డులకు, మార్పుచేర్పుల నిమిత్తం 28,777 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. తహసీల్దార్ల వద్ద, డీఎస్ఓ, కమిషనరేట్ పరిధిలో 27,845 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 932 దరఖాస్తులకు మోక్షం లభించింది. - ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 83,536 దరఖాస్తులు రాగా అందులో 83,412 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మిగతా వాటిలో కొన్ని ఆమోదం పొందగా మరికొన్నింటిని తిరస్కరించారు. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో 27,294 దరఖాస్తులు వస్తే 23,175 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో 81,386 దరఖాస్తులు రాగా అందులో 68,816 దరఖాస్తులను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. వాటిలో 8,406 దరఖాస్తులకు ఆమోదం లభించగా 60,410 పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఎదురుచూపు నాకు గతంలో రేషన్ కార్డు ఉండేది. ఆన్లైన్ విధానం వచ్చాక దాన్ని తొలగించడంతో సరుకులు రావడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం 2014 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ కార్డు రాలేదు. మూడు నెలల కిందట మీ–సేవ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అదే పరిస్థితి. – బూర్ల వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల జిల్లా రెండుసార్లు దరఖాస్తు చేసిన నాకు రేషన్ కార్డు లేదు. గతంలో తల్లిదండ్రులతో 2002లో ఇచ్చిన కార్డులో నా పేరు ఉంది. నాకు మూడేళ్ల క్రితం పెళ్లి కావడంతో భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్న. ఇప్పటివరకు రెండుసార్లు రేషన్ కార్డు కోసం తహసీల్దార్ కార్యాలయంలో, మరోసారి మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. – రౌతు రాజేందర్, మోతుగూడ, ఆసిఫాబాద్ మండలం అంతా ఆన్లైన్లోనే.. రేషన్ కార్డుల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం విచారణ జరిపి రేషన్ కార్డు జారీ చేస్తున్నాం. ఒక్కోసారి ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వస్తున్నాయి. – కష్ణప్రసాద్, డీఎస్ఓ, నిజామాబాద్ -
ఆహార భద్రత కార్డు వెబ్సైట్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : పేదల ఆహార భద్రత (రేషన్) కార్డు వెబ్సైట్ బుధవారం పునఃప్రారంభమైంది. దీంతో మీ–సేవ, ఈ–సేవల ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. 9 నెలల విరామం తర్వాత వెబ్సైట్ పునఃప్రారంభమవడంతో తొలిరోజే దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దీంతో మీ–సేవ, ఈ–సేవ సర్వర్లపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని కేంద్రాల్లో వెబ్సైట్లో లాగిన్ కావడానికి అధిక సమయం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు కోసం ఈ వెబ్‌సైట్‌ను నిలిపేయడంతో కొత్త కార్డుల మంజూరు, మార్పులు, చేర్పులు, పునరుద్ధరణకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటికే వచ్చిన సుమారు 3 లక్షలకుపైగా దరఖాస్తులను సైతం పౌరసరఫరాల శాఖ నిలిపేసింది. ఇటీవల మొత్తం 17,027 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికావడంతో ఈ నెల 13న ఆహార భద్రత కార్డు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఎన్ఐసీ, మీ–సేవ డైరెక్టర్లకు లేఖ రాశారు. ఈ మేరకు అధికారులు బుధవారం వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 50,24,511 ఆహార భద్రత కార్డులుండగా, అందులో 1,91,71,623 లబ్ధిదారులు ఉన్నారు. కార్డుల్లేని కుటుంబాలు సుమారు 12 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏప్రిల్ ఆఖరుకల్లా అందరికీ రేషన్ కార్డులు
రాష్ట్రంలో 75 వేల మందికి రేషన్ కార్డులను క్లియర్ చేశారని, మిగతా వారికి ఏప్రిల్ నెలాఖరులోగా ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ పద్దుపై చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. ఈపాస్ సమస్యలను పరిష్కరిస్తామని, వేలిముద్రలు పడకపోయినా రేషన్ ఇమ్మని చెప్పామని తెలిపారు. వారికి ఐరిష్‌కు లింకు చేయమని సూచించామన్నారు. ప్రజలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే రేషన్ బియ్యం తీసుకునే విధానం తెచ్చామన్నారు. కిరోసిన్ వినియోగం ప్రస్తుతం తగ్గిందని, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పూర్తిగా తగ్గిస్తామన్నారు. -
అమ్మకు పార్టీ బ్యాగు అందజేయయ్యా!
పర్చూరు: ‘అమ్మ విజయమ్మ కోసం పార్టీ రంగులతో సంచి తయారు చేశాను. మీ ద్వారా ప్రజాసంకల్పయాత్రలో అందజేయటానికి వచ్చాను’ అని రామనాథపురం గ్రామానికి చెందిన పుట్టంరాజు రామలక్ష్మమ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపారు. రేషన్ కార్డులు.. పింఛన్లు రాకుండా చేస్తున్నారు ఉలవపాడు: తమకు రేషన్ కార్డులు, పింఛన్లు రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మల్కాపురం ఎస్టీ కాలనీకి చెందిన కావమ్మ, సీతమ్మ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయింది. తాము వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తెలిపింది. లోన్లు కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారంది. పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే జన్మభూమి కమిటీల సంతకాలు కావాలంటున్నారని..వారు పట్టించుకోవడంలేదని చెప్పింది. న్యాయం చేయండి ఒంగోలు వన్‌టౌన్: ‘వికలాంగులకు పర్సంటేజీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2 వేలు పింఛన్ మంజూరు చేయాలి. ప్రతి వికలాంగుడికి ఉచిత బస్సు పాస్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న 40 పర్సంటేజీని సవరించి 30 శాతంగా మార్చి మెడికల్ సర్టిఫికెట్ మంజూరుకు కృషి చేయాలి. ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు వేలిముద్రలను సడలించి.. ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి’ అంటూ తాళ్లూరు వికలాంగుల సంఘం ప్రెసిడెంట్ లోకిరెడ్డి సుబ్బారెడ్డి జగన్‌కు వినతిపత్రం అందించారు. -
‘మీ–సేవ’ 2.0!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇది మీ–సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రజలు డిజిటల్ విప్లవం బాట వేయాలని, సాంకేతిక విజ్ఞాన ఫలాలను ప్రజలు ఆర్థికాభివృద్ధికి వినియోగి ంచుకోవాలని పిలుపునిచ్చారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన మీ–సేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో జరిగిన లావాదేవీల సంఖ్య ఇటీవలే 10 వేల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో 4,500 మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పౌర సేవల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించి పరిపాలన పాత్రను విస్తృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. వాహన యజమానుల సమస్యలను తొలగించేందుకు ‘ఆర్టీఏ ఎం–వ్యాలెట్’పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టగా తొలి మూడు నెలల్లోనే 13 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’కింద పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, ఇప్పటివరకు 6 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రూ. 1.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. సులభతర సంస్కరణల అమలులో రాష్ట్రం గతేడాది అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భవన నిర్మాణ అనుమతులకు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ చేసేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. టీ–ఫైబర్ కార్యక్రమం ద్వారా 15 ఎంబీపీఎస్ల వేగంతో రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలకు 2 జీబీ వేగంతో నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా టీవీలనే స్మార్ట్ కంప్యూటర్లుగా వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. 2.95 కోట్ల బోగస్ రేషన్‌కార్డులు తొలగించాం: కేంద్ర మంత్రి చౌదరి పౌర సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతోపాటు వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఈ–గవర్నెన్స్ దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానం కాని 2.95 కోట్ల రేషన్ కార్డులకు నిత్యవసర వస్తువులను నిలిపివేశామన్నారు. దీంతో ఏటా రూ. 17 వేల కోట్ల విలువైన నిత్యవసర సరుకులు అర్హుల చేతికి అందుతున్నాయన్నారు. ఐటీ, ఈ–గవర్నెన్స్‌లో తెలంగాణ పనితీరు బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో కేంద్ర ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్ని, యూఐ డీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జీఎస్టీఎన్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
విచిత్రం
సాధారణంగా జిల్లాలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు తక్కువగా ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల సంఖ్యకు సరిసమానంగా అయినా రేషన్ కార్డులుండటం సహజం. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం విచిత్రం. కుటుంబాల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు లక్ష వరకు అధికంగా రేషన్ కార్డులు ఉన్నాయి. డబుల్ ఎంట్రీలు, బోగస్ రేషన్ కార్డులు ఇలా అన్ని కలుపుకుని లక్ష వరకు అదనంగా కార్డులు జిల్లాలో ఉండటం గమనార్హం. ఇటీవలే ఈపాస్ మిషన్లను కూడా ట్యాంపరింగ్ చేసిన ఘనులు జిల్లాలో ఉన్నారు. దీంతో ప్రతి నెలా వందల టన్నుల రేషన్ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో మొత్తం 1,873 మంది రేషన్ డీలర్ల ద్వారా 8,74,120 మందికి తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇది అధికారిక గణాంకాలు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రం 7,78,420 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా జనాభా సుమారు 29.64 లక్షలు ఉంది. వాస్తవానికి దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలను గుర్తించి వారికే ప్రతి నెలా రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని వారిని గుర్తిస్తారు. ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతుంది. అది కూడా సగటున జిల్లా జనాభా ప్రతి పదేళ్లకు 5 నుంచి 10 శాతం లోపు పెరుగుతుంది. ఉద్యోగరీత్యా జిల్లాకు వచ్చే వారు, వ్యాపార నిమిత్తం వచ్చే వారు ఇలా అనేక కేటగిరీల వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో సగటున 10 శాతం పెంపుదలను ప్రామాణికంగా తీసుకున్నా వారిలో 6 శాతం మంది దారిద్య్రరేఖ దిగువున ఉన్న మిగిలిన వారు మధ్యతరగతి వారు ఉన్నారు. జిల్లాలో పరిస్థితి మాత్రం గణాంకాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికే కుటుంబాల సంఖ్య కంటే 94 వేల కార్డులు అధికంగా ఉన్నాయి. వీటిలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డులు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడేళ్లలో పెళ్లిళ్లు ఎక్కువ జరిగి వేరు కాపురాలు, కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన కుటుంబాల సంఖ్య 2.50 లక్షల వరకు ఉంది. అంటే ఇప్పటికే సగటున 7 నుంచి 10 లక్షలు జిల్లా జనాభా పెరిగింది. దీనిని ప్రామాణికంగా తీసుకుంటే ఉన్న కార్డులు పెద్ద ఎక్కువేమీ కాదని వాఖ్యానిస్తున్నారు. ఈ–పాస్ ట్యాంపరింగ్ ఘనులు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ జిల్లాలోనే జరిగింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు డీలర్లతో కుమ్మక్కై ఈ–పాస్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.20 లక్షలు విలువ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి తరలించి విక్రయించారు. ఈ వ్యవహరంలో కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిపి 46 మందిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో 41 మంది డీలర్లను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన దుకాణలకు సమీపంలోని డీలర్లకు ఇన్చార్జిలుగా నియమించారు. అలాగే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి.ధర్మారెడ్డిని బాధ్యుడ్ని చేసి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో గత నెలలో నూతన డీఎస్‌ఓగా ఎంవీ రమణను నియమించారు. అయితే జిల్లాలో గతంలో సస్పెండ్ అయిన డీలర్ల వల్ల 30 డిపోలు, తాజాగా సస్పెండ్ అయిన 41 మంది వల్ల మరో 41 దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీలయ్యాయి. జిల్లాలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డుల సంఖ్య కొంత ఎక్కుగానే ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం వీటి సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఉండవచ్చు ముఖ్యంగా కోవూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో అధికంగా ఉన్నాయి. ఇంటి పేరుతో సçహా ఒక కార్డు, ఇంటి పేరు లేకుండా మరో కార్డు.. ఇలా డబుల్ ఎంట్రీ కార్డులతో పాటు, వేల సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నాయి. అధికారులు నామాత్రంగా తనిఖీలు నిర్వహించి మామూళ్లతో సరిపెట్టుకోవటంతో కార్డులు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. జిల్లాకు తాను కొత్తగా వచ్చానని అన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ రమణ సాక్షి ప్రతినిధికి తెలిపారు. అన్నింటినీ పరిశీలించి బోగస్ ఉంటే తొలగించటంతో పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వేలిముద్ర వేస్తేనే రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇక ఆహార భద్రత(రేషన్) కార్డు లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తేనే రేషన్ సరుకుల పంపిణీ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఈ–పాస్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,031 రేషన్ షాపులు ఉండగా వాటిలో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో పూర్తి స్థాయిలో బయోమెట్రిక్‌పైనే సరుకులు పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఛత్తీస్గడ్ తరహాలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానం ఏప్రిల్ నుంచి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ–పాస్ విధానంలో సరుకుల పంపిణీ జరుగుతుండటం రేషన్ పోర్టబిలిటీకి కలిసి వచ్చింది. ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల డేటా ఉండటంతో వేలిముద్ర లతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగింది. -
మాకిది కావాలని అడిగేవారు తక్కువ!
ఒంగోలు టౌన్: జిల్లాలో మాకిది కావాలని అడిగేవారు చాలా తక్కువగా ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఐదో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమ ముగింఫు సభ శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు క్లియర్ చేయడంతో జన్మభూమి–మాఊరు సాఫీగా సాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు వేదికగా నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో పనిచేసి ప్రభుత్వాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అందరికీ అందేలా చూడాలన్నారు. సీఎంను నవ్వుతూ పంపించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వేది చాలా తక్కువని, అలాంటి ఆయన్ను జిల్లాలో జరిగిన జన్మభూమి సభ అనంతరం అధికారులు నవ్వుతూ పంపించారని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశంసించారు. జిల్లాలో మైనస్ 72శాతం రెయిన్ ఫాల్ ఉందని, రాబోయో రోజుల్లో మరింత క్రిటికల్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. లీకేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందుబాటులో ఉండే నీటిని సక్రమంగా సరఫరా చేసేలా చూడాలని సూచించారు. బాగా పనిచేశారు: కలెక్టర్ జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భయం, ఆందోళనకరంగా ఉన్నా అధికారులు బాగా పనిచేశారని కలెక్టర్ వి. వినయ్‌చంద్ ప్రశంసించారు. చిట్టచివరి గ్రామాల వరకు జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఏరోజుకారోజు స్వీకరించి వాటిని ట్యాబ్‌ల ద్వారా అనుసంధానం చేసి నేరుగా తనతో పాటు ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు డ్వాక్రా మహిళలను సాధికార మిత్రులుగా నియమించినట్లు తెలిపారు. 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి 15 రకాల భద్రతలు, 10 రకాల హామీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూస్తున్నారన్నారు. సభలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు పాల్గొన్నారు. దర్శిలో జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సమయంలో ఆయన్ను ఆకట్టుకున్న ముండ్లమూరు మండలం బృందావనం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి విజయకుమార్ పేరున సీఎం ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్‌ను మంత్రి శిద్దా అందించారు. బెస్టు అవార్డులు జన్మభూమి–మాఊరు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచిన జిల్లాస్థాయి అధికారులు, మండలాలు, నగర పంచాయతీ అధికారులకు బెస్టు అవార్డులు ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు సభలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అవార్డులు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ఐసీడీఎస్ పీడీ సరోజిని, సీపీఓ కేటీ వెంకయ్యలకు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పోలప్ప (యర్రగొండపాలెం), రవి (దర్శి), ప్రభాకరరావు (పర్చూరు), శ్రీనివాసరావు (అద్దంకి), మురళి (చీరాల), శ్రీనివాసరావు (సంతనూతలపాడు), అన్నపూర్ణ (ఒంగోలు), మల్లికార్జున(కందుకూరు), ఉమాదేవి (కొండపి), కొండయ్య (మార్కాపురం), కిషోర్(గిద్దలూరు), కైలాస్ గిరీశ్వర్ (కనిగిరి)లకు అవార్డులు అందించారు. ఉత్తమ మండలాలుగా మార్కాపురం, జరుగుమల్లి మండలాలను ఎంపిక చేశారు. ఉత్తమ మునిసిపాలిటీలుగా కందుకూరుకు మొదటి స్థానం, మార్కాపురానికి రెండో స్థానం కింద అవార్డులు ఇచ్చారు. ఉత్తమ పంచాయతీలుగా అద్దంకి మండలం ధేనువకొండ, అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామాలకు అవార్డులు అందించారు. ఉత్తమ నగర పంచాయతీలుగా అద్దంకి, చీమకుర్తిలకు అవార్డులు అందించారు. చీరాల మునిసిపాలిటీలోని 1వ వార్డు, గిద్దలూరులోని 14వ వార్డు, కందుకూరులోని 12వ వార్డు, కనిగిరిలోని 15వ వార్డు, మార్కాపురంలోని 13వ వార్డు, ఒంగోలులోని 10వ డివిజన్‌ను ఎంపిక చేసి అవార్డులు అందించారు. చేదు అనుభవం ఐదో విడత జన్మభూమి–మాఊరు ముగింపు సభకు హాజరైన వారికి చేదు అనుభవం ఎదురైంది. సభకు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారు. జిల్లా యంత్రాంగం వారికి అరకొరగా భోజన వసతి కల్పించింది. అతిథుల ప్రసంగాలు, సత్కారాలు ముగిసిన అనంతరం భోజనం చేసేందుకు వెళ్లిన వారికి అక్కడ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు జనాలు ఉండటంతో ఆతృతగా అక్కడకు వెళ్లారు. అక్కడి సర్వర్లు తమ వద్ద మిగిలిన కిళ్లీలను ఇవ్వడం ప్రారంభించడం గమనార్హం. -
ఇదేమి విచిత్రం?
కర్నూలు, మద్దికెర: హడావుడిగా జరిపిన ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో ఓ వింత చోటు చేసుకుంది. రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకునేందుకు అధికారులు నానా హంగామా చేసి చివరికి లబ్ధిదారులకు ఆవేదన మిగిల్చారు. మండలంలో గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిల్లో 123 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వాటిని 5వ విడతలో పంపిణీ చేయాలని సిద్ధం చేశారు. తీరా కార్డుల్లో లబ్ధిదారుల ఫొటోలు లేకపోవడంతో అధికారులు నాలుక కరుచుకొని తూతూ మంత్రంగా ప్రతి పంచాయతీలో నలుగురికి చొప్పున పంపిణీ చేసి మిగతావి అలాగే ఉంచేశారు. -
నిరసనల జన్మభూమి
‘గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదుల సంగతి ముందు చెప్పండి..మాకు పింఛన్లు ఎందుకు పీకేశారు? రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు?. మా గ్రామాలకు సీసీ రోడ్లు లేవు..మంచినీటి సదుపాయం లేదు..ఇన్నాళ్లు ఏమైపోయారు? ముందు వీటికి సమాధానం చెప్పండి.. ఆ తర్వాతే సభలు పెట్టుకోండి అంటూ’ మంత్రులు, ప్రజాప్రతినిధులనే కాదు.. నోడల్ అధికారుల బృందాలను ఎక్కడికక్కడ జనం నిలదీశారు. ముచ్చెమటలు పోయించారు. ఈ నెల 2న ప్రారంభమైన ఐదో విడత ‘జన్మభూమి–మావూరు’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. విశాఖ సిటీతో పాటు మారుమూల గ్రామీణ, ఏజెన్సీ పల్లెల్లో సైతం తొలిరోజు నుంచి చివరి రోజు వరకు నిరసనలతో హోరెత్తిపోయింది. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం నిలదీశారు. కడిగి పారే శారు. మరికొన్ని చోట్ల సభలను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల పక్షాన నిలిచి దాదాపు గ్రామసభ జరిగిన ప్రతి చోట ప్రజాసమస్యలపై ప్రజాప్రతి నిధులు, అధికారులను ఎండగట్టారు. సాక్షి, విశాఖపట్నం: కొత్తగా పింఛన్లు మంజూరు చేశాం..కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం.. ఇంకేముంది ప్రజలు తమకు జేజేలు పలుకుతారంటూ ‘జన్మభూమి–మావూరు’ సభలకు వెళ్లిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అడుగడుగనా నిరసనలు, ప్రతిఘటనలే ఎదురయ్యాయి. కొత్త పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ మాట దేముడెరుగు గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీల సంగతేమింటూ వెళ్లిన ప్రతిచోటా నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు..శ్రేణులు దాదాపు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో పాల్గొని ప్రజల తరపున అధికారులను నిలదీశారు. కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకు న్నాయి. పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను నిలువరించలేక అధికారపార్టీ నాయకులు దౌర్జన్యాలకు సైతం తెగపడ్డారు. నక్కపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, అచ్యుతాపురం, మునగపాక తదితర మండలాల్లో జరిగిన సభలోŠల్ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మంత్రులకూ తప్పని నిరసనలు.. తొలిరోజే మంత్రి గంటా శ్రీనివాసరావుకు సొంత నియోజకవర్గమైన భీమిలి మండలం కాపులుప్పాడలో గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్‌బాబులకు సైతం నిరసనల సెగ తప్పలేదు. ఇక టీడీపీ పంచన చేరిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు గిరిజనులు ఏకంగా చుక్కలు చూపించారు. ఇటీవల పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి టీడీపీ తరపున గ్రామాల్లోకి వెళ్తుంటే పొలిమేరల్లో సైతం అడుగుపెట్ట కుండా గంటల తరబడి ఘెరావ్ చేశారు. ఇక పల్లెల్లో గ్రామసభలు నిర్వహించిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నోడల్ అధికారులు కనివినీ ఎరుగని రీతిలో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఎదుర్కొనలేక గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. 70 శాతం సభల్లో ఆందోళనలు.. జిల్లాలో 923 పంచాయతీలకు నాలుగింట సభలను బహిష్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కనీసం మరో వందకు పైగా గ్రామాల్లో ప్రజల నిరసనలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నారు. ఆయా సభలను ఐదు పదినిమిషాల్లోనే ముగించేశారు. మరో 150కి పైగా సభలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. 600కు పైగా సభల్లో నిరసనలు హోరెత్తిపోయాయి. కేవలం 120 పంచాయతీల్లోనే సభలు సజావుగా సాగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 190 వార్డుల్లో సభలు జరగ్గా వాటిలో సగానికి పైగా నిరసనలు..నిలదీతలు తప్పలేదు. అన్నీ కాకిలెక్కలే.. 2016 డిసెంబర్ నాటికి జిల్లాలో 3,24,932 పింఛన్లు ఉండేవి. 2017 జనవరిలో 15వేలు కొత్తగా మంజూరు చేయగా..వాటి సంఖ్య 3,47,449కు పెరిగింది. కానీ గడిచిన ఏడాదిలో పెంచిన ఆ 10వేలకు పైగా కోత పెట్టేశారు. చివరకు గత నెలలో 3.37లక్షలకు చేరగా..ప్రస్తుతం కొత్తగా మంజూరైన వాటి మాట దేవుడెరుగు జనవరిలో 3,36,607 పింఛన్లు మంజూరుచేయగా జన్మభూమి సభల్లో పంపిణీ చేసింది. 3,07,966 మందికి మాత్రమే పంపిణీ చేయగలిగారు. కొత్తగా పింఛన్ల కోసం 50వేల మంది అప్లోడ్ చేసుకోగా 30 వేల మందికి పింఛన్లు మంజూరు చేసినట్టుగా ప్రకటించారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ప్రస్తుత జన్మభూమి సభల్లో పింఛన్ పంపిణీ చేసిన పాపాన పోలేదు. రేషన్ కార్డుల పరిస్థితి కూడా అంతే. కొత్తగా 21వేల కార్డులు మంజూరు చేశారు. కానీ వారికి రేషన్ సరుకులు కాదు కదా.. కనీసం చంద్రన్న కానుకలు కూడా ఇవ్వలేదు. -
ఆశగా వెళ్లి.. బిక్కమొహంతో వెనక్కి
జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు హోటల్లో పనిచేస్తారు. రేషన్‌కార్డు లేదు. జన్మభూమి సందర్భంగా ఇస్తారంటే దరఖాస్తు చేసుకున్నారు. కానీ రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ఏం జరిగింది అని ఆరా తీస్తే ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉందంట. అందుకని రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజాసాధికార సర్వేలో ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు నమోదు కావడంతో రేషన్‌కార్డు తిరస్కరించారు. ఆయనకు కనీసం ద్విచక్ర వాహనం కూడా లేదు. ఇదేంటని అధికారులను అడిగితే మాకేం తెలియదని సమాధానం చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం: ఏ ఒక్క పేద కుటుంబం రేషన్‌కార్డు లేకుండా ఉండకూడదు. 5వ విడత జన్మభూమిలో రేషన్‌కార్డు లేని కుటుంబాలు అన్నింటికీ కార్డులు ఇస్తాం. ఇదీ ప్రభుత్వ ప్రకటన. అయితే ఆచరణలో మాత్రం కానరావడం లేదు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమకు కార్డులు వస్తాయని ఆశగా జన్మభూమి సభలకు వెళితే, అక్కడ తమకు కార్డు రాలేదని అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు బిక్కమొహంతో వెనుదిరుగుతున్నారు. రేషన్‌కార్డు అనేది ప్రస్తుతం అందరికీ అవసరమే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు, గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగపడుతోంది. దీంతో సగటు మనిషి రేషన్ కార్డు కోసం కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వ పథకాలు గతంలో ఏడాదిలో ఎప్పుడైనా అందించే వారు. కాని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ప్రభుత్వ పథకాలను జన్మభూమి మా ఊరు గ్రామసభలు నిర్వహించి అందులో మాత్రమే అందిస్తుంది. దీంతో గ్రామసభలు జరిగిన ప్రతీసారి రేషన్‌కార్డులు కోసం ఎదరుచూడటం, అదే గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే కార్డుల కోసం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసే సమయంలో కొర్రీలు వేసి ఇవ్వడం లేదు. రేషన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం ఆన్లైన్లో ప్రజాసాధికార సర్వేను ఆనుసంధానం చేసింది. దీంతో 70శాతం మంది అనర్హులుగా గుర్తించింది. ప్రజాసాధికార సర్వే సక్రమంగా జరగకపోవడంతో అర్హులకు రేషన్‌కార్డు మంజూరు భ్రమే అని తేలిపోయింది. ఇల్లున్నా, వాహనం ఉన్నా కార్డు ఇవ్వరట ప్రజా సాధికార సర్వే ప్రకారం రేషన్‌కార్డు దరఖాస్తు దారుడికి ఇల్లు ఉన్నా రేషన్‌కార్డు మంజూరుకాదట. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా రేషన్‌కార్డు దరఖాస్తు ఆన్లైన్లో తిరస్కరణకు గురవుతోంది. ఉపాధి కోసం నాలుగు చక్రాల వాహనం తిప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి రేషన్‌కార్డులు మంజూరుకావడం లేదు. ప్రజాసాధికార సర్వేలో పలు ఆప్షన్లను రేషన్‌కార్డు దరఖాస్తుకు అనుసంధానం చేయడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుచేస్తే చేసిన చాలా మందికి రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ప్రజాసాధికార సర్వే సరిగా జరగకపోవడంతో అర్హులైన వారు కూడా రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఉన్నట్లు, వాహనం లేని వారికి వాహనం ఉన్నట్లు ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో జన్మభూమి సభల్లో రేషన్‌కార్డు కోసం వెళ్లి, అది మంజూరు కాక బేలగా వెనుదిరుగుతూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. జిల్లాలో ఇవీ వివరాలు జిల్లాలో సుమారు 34వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిలో 11 వేల మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ మండలంలోను వేలాది కార్డులు ప్రజాసాధికార సర్వే ప్రకారం తిరస్కరణకు గురయ్యాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 259 మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయి. మిగిలిన వారందరికీ మంజూరు కాలేదు. ఇలా ప్రతీ మండలంలోను వేలాది మంది దరఖాస్తు చేసుకుంటే వందల్లో మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన కె.హరిబాబుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కార్డు కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రాలేదు. ఈసారి జన్మభూమిలో వస్తుందేమో అని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దఫా కూడా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. చేసేది చిరుద్యోగం. ఉన్న కొద్దిపాటి సంపాదనతో బయట నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు వస్తే నిత్యావసరాలు ఆసరాగా వస్తాయని ఆశ. కాని రేషన్‌కార్డు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. -
పించన్లు, రేషన్ కార్డులు.. భారీగా అడుగుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా అందిన అన్ని అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లూ అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా జన్మభూమి సభల్లో జనం నిలదీతలు, నిరసనలతోపాటు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో మాట మార్చారు. తాను స్వయంగా నిర్వహించిన సర్వే ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోందని జన్మభూమి నిర్వహణ తీరుపై గురువారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి 3,00,570 ఆర్జీలు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇందులో అత్యధికం ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించినవేనని తెలిపారు. సీఎం నిజాలను ఒప్పుకోవటానికి కారణం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రేషన్ డీలర్ల పరేషాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఏళ్లకు ఏళ్లుగా డీలర్లుగా పనిచేస్తున్నవారు ఇప్పటికిప్పుడు వాటిని వదులుకుని, వేరే వృత్తిలోకి మారలేక, ప్రభుత్వం తీరు మింగుడుపడక కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళదామనుకున్నా ప్రభుత్వ హెచ్చరికలతో, డీలర్‌షిప్పులు పోగొట్టుకోలేక వచ్చీరాని ఆదాయంతో నెట్టుకొస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ–పాస్ అమలు చేస్తున్న రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కేంద్రం సాయం చేస్తోంది. డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్లో సగం భరిస్తోంది. ఈ–పాస్ అమలు చేస్తున్నందున డీలర్లకు కిలోకు 70 పైసల కమీషన్ చెల్లించాలి. ఇందులో కేంద్రం 35 పైసలు ఇస్తుండగా దానికి రాష్ట్ర ప్రభుత్వం 35 పైసలు కలిపి చెల్లించాలి. కానీ, వీరికి కేవలం కిలోకు 20 పైసల కమీషన్ మాత్రమే చెల్లిస్తున్నారు. కేరళలో అక్కడి ప్రభుత్వం ఏకంగా కిలోకు రూ.2.50 చొప్పున కమీషన్ చెల్లిస్తోందని ఉదహరిస్తున్నారు. ఈ స్థాయిలో కాకున్నా తమకు న్యాయంగా చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించకుండా పొట్టకొడుతోందన్న ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పౌరసరఫరాల శాఖలో ఏకంగా రూ.16 వందల కోట్లు ఆదా చేయగలిగారని, కేవలం ఈ– పాస్‌తో ప్రభుత్వానికి ఏటా రూ. 828 కోట్లు మిగులుతోందని పౌరసరఫరాల అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నుంచే డీలర్లకు నిర్ణీత కమీషన్ కిలోకు 70 పైసల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏటా రూ. 120 కోట్లకు మించదని పౌరసరఫరాల అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. కేంద్రం రూ. 75 కోట్లు ఇచ్చినా.. ఎన్ఎఫ్ఎస్ఏ కింద కేంద్రం డీలర్ల కమీషన్ కోసం ఇప్పటికే రూ. 75 కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు. కాగా, ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే పెండింగులో ఉంది. ఒక్కో డీలర్‌కు కనీసం రూ. రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బకాయిల కోసమే కొందరు డీలర్లు.. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోని డీలర్లు కష్టమైనా డీలర్‌షిప్పులను కొనసాగిస్తున్నారని అంటున్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడంలో గతంలో డీలర్లదే ప్రధాన పాత్రగా ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం, మెజారిటీ షాపుల్లో ఈ–పాస్ మిషన్లు ఏర్పాటు చేయడంతో డీలర్ల చేతివాటానికి ఆస్కారం లేకుండా చేయగలిగామని సివిల్ సప్లైస్ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పట్టించుకోని ప్రభుత్వం! రాష్ట్ర వ్యాప్తంగా 17వేల రేషన్ షాపుల్లో 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.75 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతోంది. అత్యధికులు లబ్ధిపొందే పీడీఎస్‌లో రేషన్ షాపులు అత్యంత కీలకమని, కానీ, డీలర్ల కమీషన్ల చెల్లింపు, ఇతర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం అంతగా పట్టింపుతో లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యధికంగా 400 నుంచి 500 రేషన్ కార్డులున్న షాపులే అధికం. దీంతో వీరికి ఇచ్చే కమీషన్ గిట్టుబాటు కావడం లేదంటున్నారు. చాలీచాలని కమీషన్‌తో షాపులు నిర్వహించడం భారంగా మారినందున తమ బకాయిలు చెల్లించడంతో పాటు, కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
తప్పుల తడకలు
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా పౌర సరఫరాల కార్యాలయం వద్ద చిన్న పిల్లతో పడిగాపులు కాస్తున్న ఫొటోలోని మహిళ పేరు వారణాసి గౌతమి. ఆమెది బొబ్బిలి పట్టణం. వీరి రేషన్ కార్డులో ఆమె భర్త ప్రసాద్ కుమారుడు జయదీప్, కుమార్తె రితక్ష ఉన్నారు. కానీ రేషన్ మాత్రం కేవలం ఇద్దరికే వస్తుంది. తన భర్త ప్రసాద్, కుమారుడు జయదీప్ పేర్లు రెండు నెలలకు పైగా ఆన్లైన్లో కనిపించడం లేదని బొబ్బిలిలోని పౌర సరఫరాల కార్యాలయాన్ని సంప్రదిస్తే ప్రసాద్ పేరు చనిపోయినట్టు ఉందని, కుమారుడు జయదీప్ పేరు ఆన్లైన్ ఆధార్ లింక్ కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. సరిదిద్దాలని కోరగా ఇక్కడ వీలు కాదనీ, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందేనని చెప్పారు. దీంతో ఆమె ఇక్కడకు వచ్చి సంప్రదించారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు.. ఇదే సమస్యతో బాధపడుతున్న వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరాల కోసం రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకుంటున్న యంత్రాంగం ఈ పేర్లను మార్పిడి చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. జిల్లాలోని రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లుతున్నా వాటిని సరిదిద్దే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో సరిదిద్దాలంటూ లబ్ధిదారులు పలు మార్లు మండల, జిల్లా కేంద్రాల్లోని పౌర సరఫరాల కార్యాలయాలకు తిరుగుతున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్‌కార్డే కీలకం.. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులు సుమారు 18 లక్షల మంది ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా రేషన్‌కార్డు కీలకమవుతుంది. ఆ సమయంలో రేషన్ కార్డు తీసుకువెళితే ఆ కార్డు డెడ్ అయిందనీ, లేదా సభ్యుడు చనిపోయాడనీ, వలస వెళ్లాడనీ, ఆధార్ లింక్ తప్పిందనీ సమాచారం వస్తోంది. దీంతో లబ్ధిదారులు జిల్లా కేంద్రానికే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లబ్ధిదారులు వ్యవప్రయాలకు ఓర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. పట్టించుకోని మండల సిబ్బంది.. జిల్లాలో రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారులు, సిబ్బంది విషయాన్ని వినకుండా నేరుగా డీఎస్ఓ కార్యాలయానికి పంపించేస్తున్నారు. దీంతో ఇక్కడకు వచ్చేందుకు లబ్ధిదారులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. ప్రతీ చిన్న పనికి జిల్లా కేంద్రానికి వస్తున్నాం ఇక్కడి వాళ్లమో తిరిగి పంపించేస్తున్నారు. దీంతో తాము అవస్థలు పడుతున్నామని పలువురు లబ్ధిదారులు వివరిస్తున్నారు. వైద్య సేవలకు విజయవాడ వెళ్లాల్సిందే..! రేషన్ కార్డుల్లో తప్పిదాల వల్ల చివరకు వైద్య సేవలకూ లబ్ధిదారులు దూరం కావాల్సి వస్తోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాల్లో సేవలు అందుకోలేకపోతున్నారు. కార్డుల్లో పేర్లు చేర్చాలంటే చివరకూ విజయవాడ కాల్‌సెంటర్‌కు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. చిన్న సమస్యలను పరిష్కరించేందుకు అంత దూరం ఎందుకని, మమ్మల్ని ఇబ్బందులు పెట్టేందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉండేటప్పుడు ఇన్ని ఇబ్బందులు లేకుండా వైద్యం అందేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ సెలవులో డీఎస్ఓ.. జిల్లా పౌరసరఫరాల అధికారి జె.శాంతికుమారి మళ్లీ సెలవులో వెళ్లారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె వారం రోజుల పాటు సెలవు పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించక లేదు. -
గల్ఫ్ వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వరా.?
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది గల్ఫ్ వలసకార్మికులు రేషన్ కార్డుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ద్యావన్ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గల్ఫ్ వలసజీవుల గాథ వినండి. బొల్లం నర్సయ్య: ఇతనికి 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు (20.11.2006) ఇతని తండ్రి బొల్లం మల్లయ్య రేషన్ కార్డులో పేరు నమోదు అయ్యింది. దాని ఆధారంగానే 2010 లో పాస్ పోర్ట్ పొంది 2011 సౌదీ అరేబియాకు వెళ్ళాడు. ఎడారిలో గొర్రెలకాపరిగా ఆరేండ్లు పనిచేసి మార్చి 2017 న మాతృభూమికి చేరుకున్నాడు. వచ్చిన తరువాత ఆధార్ కార్డు పొందాడు. రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. రెబ్బాస్ రాజన్న: 2015 లో బహరేన్ వెళ్లిన ఇతను మధ్యలో రెండు సార్లు స్వగ్రామానికి వచ్చివెళ్ళాడు. 2005 డిసెంబర్ లో తిరిగి వచ్చాడు. వచ్చిన తరువాత ఆధార్ కార్డు పొందాడు. రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు, కానీ ఫలితం లేదు. గల్ఫ్ వలస కార్మికులందరికీ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు లింకు పెట్టి వేదిస్తున్నారని, ఆధార్ కార్డు తీసికెళ్తే వెబ్ సైటు పనిచేయడం లేదని తహసీల్దార్లు జవాబు ఇస్తున్నారని ఆయన అన్నారు. -
కార్డులకు కత్తెర
- ఆరు అంచెల్లో వడబోత – సమాయత్తమైన ప్రభుత్వం – అదను చూసి వేటు వేసేందుకు సిద్ధం అనంతపురం అర్బన్ : తెల్ల కార్డులకు కోత పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు ఆరు అంచెల (సిక్స్ స్టెప్స్) ప్రణాళిక తయారు చేసింది. వీటిలో ఏ ఒక్కటి వర్తించినా కార్డుకు కోత పెట్టాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారిగా కాకూండా అదను చూసి వేటువేసేందుకు సంసిద్ధంగా ఉంది. ఇందులో ఇప్పటికే రెండు అంచెల కింద జిల్లావ్యాప్తంగా నాలుగు వేల కార్డులు తొలగించింది. కార్డుల కోతకు అరు అంచెలు ఇవే + నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం + విద్యుత్ వినియోగం 200 యూనిట్లుకు బిల్లు చెల్లిస్తే + ఆదాయ పన్ను చెల్లించి ఉండడం + సొంత ఇల్లు 750 చదరపు అడుగులకు మించి ఉండడం. + వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతంల్లో రూ.60 వేలు మించి ఉండడం + తరి పొలం 2.50 ఎకరాలు లేదా మెట్ట పొలం 5 ఎకరాలకు మించి ఉండడం... ఇలా ఏ ఒక్కటి వర్తించినా రానున్న రోజుల్లో తెల్లరేషన్ కార్డు రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నాలుగు వేల కార్డుల తొలగింపు ప్రస్తుతానికి మూడు అంచెలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వంల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వేల కార్డులను తొలగించింది. నాలుగు చక్రాల వాహనం ఉందని, వార్షిక ఆదాయం నిర్దేశించిన మొత్తాని కంటే అధికంగా ఉందని, ఇంటి అద్దె ఎక్కువగా చెల్లిస్తున్నారని ఇలా జిల్లాలో మొత్తం నాలుగు వేల తెల్లరేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అదను చూసి వేటేసేందుకు ఇప్పటికే ఆరు అంచెల్లో మూడు అంచెల నిర్దేశాల మేరకు నాలుగు వేల కార్డులు తొలగించిన ప్రభుత్వం, మిగతా మూడు అంచెలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి తొలగింపు అంశాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పొలం విషయంలో నిర్దేశించిన తరి 2.50 ఎకరాలు, మెట్ట 5 ఎకరాలకు మించి కలిగి ఉన్న అర్హత ప్రకారం జిల్లాలో చాలా మందికి కార్డులు తొలగించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిబంధన ప్రకారం కార్డుల తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఎప్పటికైనా ప్రభుత్వం ఆరు అంచెల నిర్దేశాల మేరకు కార్డులు తొలగించి తీరుతుందని అధికారులు స్పష్టం చేశారు. -
‘ఆధార్‌తో రూ.14 వేల కోట్ల ఆదా’
న్యూఢిల్లీ: రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రూ.14 వేల కోట్లను ఆదా చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించి నకిలీ వాటిని తొలగించామని తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘ఇండియా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సమావేశం–2017’లో మంత్రి ప్రసంగించారు. అవినీతిని అరికట్టడానికి ఈ–పీఓఎస్‌లను ఏర్పాటు చేసి అన్ని చౌక ధరల దుకాణాలను కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఆహార ధాన్యాలు పాడవకుండా ఉండటానికి, అవి సమయానికి మార్కెట్ చేరడానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఉండాలని సూచించారు. జాతీయ ఉమ్మడి మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైలు, రోడ్డు, జల మార్గాల మధ్య అనుసంధానత ఏర్పడితే రైతు తన పంటను సమయానికి మార్కెట్‌కు చేర్చి, మెరుగైన ధర పొందుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన పంచ‘ధార’
రేష¯ŒS కార్డుదారులకు చేదు కబురు ఇకపై పంచదార పంపిణీ అనుమానమే ఈ నెల కోటాలో అరకొర కేటాయింపులు ఒక్కొక్కటిగా సరుకులకు ఎసరు పెడుతున్న టీడీపీ సర్కారు కాకినాడ సిటీ : బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోగా రేష¯ŒS దుకాణాల్లో కార్డుదారులకు అందించే సరుకులకు ఎసరు పెడుతోంది. పేదల సంక్షేమమే లక్ష్యమని ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం రేష¯ŒS కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో సరైన విధానాన్ని అనుసరించడంలో ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి సబ్సిడీ ధరలలో పంపిణీ చేసేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, కిరోసిన్, పంచదార మినహా మిగిలినవాటికి ఈ మూడు సంవత్సరాల కాలంలో మంగళం పాడింది. ఇప్పుడు తాజాగా పంచదార విషంలోనూ చేతులెత్తేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తి వేయడంతో తమకేం సంబంధం లేనట్టుగా ఈ నెల కోటా విడుదల చేయకుండా పంచదార పంపిణీ నుంచి పక్కకు తప్పుకుంది. సబ్సిడీ కొనసాగించాలని కేంద్రానికి ఒక వినతిని పంపి ఊరుకుంది. సుగర్ ఫ్యాక్టరీల నుంచి రాని సరుకు ప్రతినెలా 20వ తేదీలోపు వివిధ సుగర్ ఫ్యాక్టరీల నుంచి జిల్లాలోని పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు పంచదార చేరుతుంది. మే నెల కోటాకు సంబంధించి ఏప్రిల్ 20లోపు పంచదార రావాల్సి ఉండగా మే ఒకటో తేదీ వచ్చినా ఇంకా స్టాకు రాలేదు. దీంతో జిల్లాలో గత నెల పంపిణీ చేయగా మిగిలి ఉన్న పంచదారను చౌక ధరల దుకాణాలకు అరకొర కేటాయింపులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో షాపులకు ముందుగా వెళ్లే కార్డుదారులకే పంచదార అందే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 64 మండలాల్లో ఉన్న 2,643 చౌకధరల దుకాణాల పరిధిలో తెలుపురంగు కార్డుదారులు, అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డులు 16,11494 ఉన్నాయి. ఈ కార్డుదారులకు ఒక్కొక్కరికి అరకిలో చొప్పున పంచదార పంపిణీ చేయాలంటే 805.862 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండాలి. కానీ గోదాములలో మాత్రం కేవలం 415 మెట్రిక్ టన్నులే ఉంది. దీంతో ఈ నెల(మే) కోటాలో పంపిణీ కోసం అరకొరగా రేష¯ŒS షాపులకు సర్దుబాటు చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని 50 శాతం షాపులకు పంచదార కేటాయించ లేదు. దీంతో సోమవారం ఆయా షాపులకు పంచదార కోసం వెళ్లిన కార్డుదారులకు నిరాశే ఎదురైంది. రేష¯ŒS దుకాణాల్లో ఇచ్చే అరకేజీ పంచదారæ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రాల్లోనే పంపిణీ కరప : బయట మార్కెట్లో కిలో పంచదార రూ.42 ఉంటే చౌకడిపోల ద్వారా రూ.13.50కు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల నుంచి మండల కేంద్రాల్లోని వినియోగదారులకు తప్ప మిగిలిన గ్రామాల్లోని కార్డుదారులకు పంచదార కోటా రద్దు చేశారు. రేష¯ŒSషాపులకు వెళ్లిన వినియోగదారులకు పంచదార ఇవ్వడంలేదని డీలర్లు చెప్పడంతో గ్రామాల్లో ప్రజలు రిక్తహస్తాలతో తిరిగివస్తున్నారు. కోటాలో పంచదార ఇస్తుంటేనే బయట ధర పెంచేస్తున్నారని, మొత్తానికి పంచదార కోటా ఎత్తేస్తే మరింతగా పెరిగిపోతుందని, ఇక నుంచి కాఫీ, టీలు తాగలేమని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో గులాబీరంగు కార్డుదారులకు 2 కిలోలు, తెలుపురంగు కార్డుదారులకు ఒక కిలో వంతున పంచదార పంపిణీ చేసేవారు. కొన్నాళ్లకు గులాబీరంగు కార్డుదారులకు నిలిపివేసి, తెలుపురంగు కార్డుదారులకు అరకిలో వంతున ఇస్తున్నారు. ఈ నెల నుంచి మండల కేంద్రంలోని తెలుపురంగు రేష¯ŒSకార్డుదారులకు యథావిధిగా పంచదార ఇస్తూ, గ్రామీణ ప్రాంతాలవారికి కోటా రద్దు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టాకు ఉన్నంత వరకు కేటాయింపులు జిల్లాలో పంచదార స్టాకు ఉన్నంత వరకు చౌక దుకాణాలకు కేటాయించాం. రంపచోడవరం, పెద్దాపురం డివిజన్లలో అన్ని షాపులకు పూర్తిగానూ, కార్పొరేష¯ŒSలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో 90 శాతం కేటాయించాం. ఈ నెల కోటా రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మిగిలినవారికి పంపిణీ చేస్తాం. – వి.రవికిరణ్, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి -
సీఎం యోగి మరో తీవ్ర నిర్ణయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఆయన తాజాగా మరో శాఖకు పరుగుపందెం పెట్టినంత పని చేశారు. దాదాపు 60 లక్షల రేషన్ కార్డులను వెనక్కి తీసుకుంటున్నారు. వీటన్నింటిపైనా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే హడావుడిగా అఖిలేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు కోట్ల రేషన్ కార్డులను ముద్రించారు. వీటిల్లో దాదాపు 60లక్షల కార్డులపై అఖిలేశ్ ఫొటోలు ముద్రించారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం మూలంగా వాటిల్లో చాలా కార్డులు పంపిణీ చేయలేదు. ఈ కార్డులపై సమాజ్‌వాది పార్టీ జెండా రంగులు ఎరుపు, ఆకుపచ్చ ముద్రించారు కూడా. ప్రస్తుతం యోగి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రేషన్ కార్డులపై ప్రభుత్వ పెద్దల ఫొటో ఉండరాదని పేర్కొంటూ ఆ కార్డులను వెనక్క తీసుకుంటుంది. అలాగే, ఆ సమయంలో ముద్రించిన నాలుగు కోట్ల కార్డులను రద్దు చేయనుంది. -
అఖిలేశ్‌కు 'బొమ్మ' పడింది!
యూపీలో 60 లక్షల రేషన్‌కార్డులు ఔట్! ఉత్తరప్రదేశ్‌లో గత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ముద్రించిన 60 లక్షల రేషన్‌కార్డులను చెత్తకుండీలో పడేయాలని యోగీ ఆదిత్యనాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి సీఎం అఖిలేశ్ ఫొటోతో దాదాపు 60 లక్షల రేషన్ కార్డులను అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ముద్రించింది. వీటిని అట్టహాసంగా పంపిణీ చేయాలని అఖిలేశ్ భావించినప్పటికీ ఈలోపే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. దీంతో ఈ కార్డులను అప్పటి అఖిలేశ్ ప్రభుత్వం ప్రజలకు పంచలేకపోయింది. ఈ రేషన్ కార్డులపై అఖిలేశ్ బొమ్మతోపాటు సమాజ్‌వాదీ పార్టీ జెండాకు చెందిన ఎరుపు, ఆకుపచ్చ రంగులు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు అఖిలేశ్ ప్రభుత్వం దాదాపు మూడుకోట్ల ఈ తరహా రేషన్‌కార్డులను ప్రజలకు పంపిణీ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి అఖిలేశ్ బొమ్మను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముద్రించిన 60 లక్షల రేషన్‌కార్డులను బుట్టదాఖలు చేయాలని, వాటిని పంచకూడదని యోగి సర్కారు నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటికే పంపిణీ చేసిన మూడు కోట్ల రేషన్ కార్డులను కూడా తొలగించి.. వాటి స్థానంలో బీజేపీ సర్కారుకు సంబంధించిన చిహ్నాలతో కొత్తవి జారీచేయాలని భావిస్తోంది. -
కళ్లు చెదిరే కుంభకోణం.. దొరికిపోయాడు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కళ్లు విస్మయం చెందే కుంభకోణం బయటపడింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఓ డీలర్ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు. అసలు కుటుంబాలే లేని వాళ్ల పేరిట రేషన్ కార్డులు సృష్టించడమే కాకుండా అర్హత లేని వాళ్ల పేరిట కూడా వేలల్లో బియ్యం కార్డులు సృష్టించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సరుకులను తెప్పించి అక్రమాలకు పాల్పడ్డాడు. ఎంత ఆశ్చర్యపోయే విషయమంటే అతడు కూరగాయలు, పండ్లు, అలానాటి బాలీవుడ్ చిత్రాల పాటల తొలి పంక్తుల్ని లబ్ధిదారులుగా పేర్కొన్నాడు. ఆగ్రాలోని ఫతేహబాద్ పరిధిలోని నిబోరా అనే గ్రామంలో పదమ్ సింగ్ అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌరసరఫరాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు ఏకంగా 350 గుర్తు తెలియని కుటుంబాల పేరిట రేషన్ కార్డులు తయారుచేశాడు. వీటిల్లో కూరగాయలు, పండ్లు, అలానాటి బాలీవుడ్ చిత్రాల పాటల్ని కుటుంబ సభ్యులుగా పేర్కొన్నాడు. అంతేకాదు, 3,500 మంది అర్హతలేనివారిని లబ్ధిదారులుగా పేర్కొన్నాడట. ఒక రేషన్ కార్డులో మనోహర్ సింగ్(55) అనే వ్యక్తి బ్యాచిలర్ అని, అతడే కుటుంబ పెద్ద అని పేర్కొనడమే కాకుండా మరికొన్నిట్లో..లోకికి ఆలు తండ్రి అని, బిండీ తల్లి అని బాదం ఫాదర్ ఆప్ పిస్తా అని, సుఫారీ ఫాదర్ ఆఫ్ లాంగ్ అంటూ ఇలా చిత్ర విచిత్రమైన పేర్లను రేషన్ కార్డుల్లో పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా ఈ కార్డులతో పదమ్ సింగ్ ప్రభుత్వ సొమ్మును కాజేయడం మొదలుపెట్టాడు. చివరకు అదే గ్రామానికి చెందిన భగవాన్ అనే వ్యక్తి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అధికారులపైకి వత్తిడి చేయడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు కదిలారు. -
రేషన్ చక్కెర బంద్
- వచ్చే నెల నుంచి... - సబ్సిడీ ఆపేసిన కేంద్రం..చేతులెత్తేసిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు చక్కెర చేదెక్కనుంది. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తు న్న చక్కెరను ఏప్రిల్ నుంచి నిలిపి వేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. చక్కెరపై ఇచ్చే సబ్సి డీని ఎత్తి వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం చేతులె త్తేసింది. రాష్ట్రంలోనూ సబ్సిడీ చక్కెర నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి నెలా అరకిలో చక్కెరను పౌర సరఫరాల విభాగం పంపిణీ చేస్తోంది. రేషన్ షాపుల్లో కిలోకు రూ.13.50 చొప్పున రాయితీపై అందజేస్తుంది. ఏఏవై కార్డులున్న దాదాపు 5.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా రేషన్ చక్కెర పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతినెలా 4,500 మెట్రిక్ టన్నుల చక్కెరను సివిల్ సప్త్లస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కొనుగోలుకు రూ.143 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ భారం అంతకంతకూ పెరిగిపోతుంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 నుంచి రూ.43 ధరలో లభ్యమవుతోంది. ఈ లెక్కన సబ్సిడీ చక్కెర కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కనీసం రూ.235 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రేషన్ బియ్యం సబ్సిడీ భారం ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. ఏటా దాదాపు రూ.2,500 కోట్లకుపైగా భారం పడుతోంది. అందుకే సబ్సిడీ చక్కెరకు మంగళం పాడి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
బియ్యం కార్డులు మాయం
కడప నగరం భవానీనగర్‌కు చెందిన కె.రాఘవేంద్రరావు సరుకుల కోసం ప్రభుత్వ చౌక దుకాణానికి వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. తీరా ఆయన వంతు వచ్చింది. బియ్యం, చక్కెర తీసుకెళ్లేందుకు తెచ్చుకున్న సంచి ఓమారు విదిలించాడు. ఇంతలో నీ కార్డు కీరిజిష్టర్ నుంచి తొలగించారు....నీకు సరుకులు ఇవ్వడం కుదరదంటూ ఎఫ్పీ షాపు డీలర్ పిడుగులాంటి వార్త చెప్పడంతో హతాశుడయ్యాడు. చేసేది లేక దిగాలుగా ఇంటిముఖం పట్టాడు. ఒక్క రాఘవేంద్రరావే కాదు.. జిల్లాలో వేలాది మంది పేదలకు ఇదే చేదు అనుభవం ఎదురవుతున్న పరిస్థితి. ఎందుకు తొలగిస్తున్నారో విషయం తెలియదు. ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇదీ మన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వ తీరు. కడప సెవెన్‌రోడ్స్: చాలారోజుల నుంచి తమకున్న రేషన్‌కార్డులను అర్ధంతరంగా ఎందుకు రద్దు చేశారో అర్థం కాక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వందలాది మంది పేదలు తిరుగుతున్నారు. ఇలాంటి బాధితులతో తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్డులు డైనమిక్ కీ రిజిష్టర్ నుంచి ఎందుకు తొలగించారో స్థానిక పౌరసరఫరాల సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. కడప నగరంలో 1,807 కార్డులను ఏ కారణం చెప్పకుండానే తొలగించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వివరణ కోసం రాష్ట్ర పౌరసరఫరాల అధికారులకు రాశారు. అయితే ఇప్పటిదాక ఎలాంటి సమాచారం అందలేదు. ఇచ్చారు..రద్దుచేశారు పోతే మూడవ విడత జన్మభూమి, ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో తమకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలంటూ వేలాది మంది ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గవ విడత జన్మభూమిలో ప్రభుత్వం జిల్లాలో సుమారు 57 వేల కొత్తకార్డులు పంపిణీ చేసింది. కడపలో 7 వేలకుపైగా కొత్త కార్డులు ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి బియ్యం, చక్కెర, కిరోసిన్ తదితర నిత్యావసరసరుకులు పొందవచ్చని కార్డుదారులు ఎంతో సంతోషించారు. అయితే వీరి సంతోషం ఆవిరై పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. నగరంలో 1,370 కొత్తకార్డులను రద్దు చేశారు. ప్రజా సాధికారసర్వే ఆధారంగా సేకరించిన వివరాల మేరకు వీరంతా అర్హులు కాదని పేర్కొంటూ కార్డులను తొలగించినట్లు చెబుతున్నారు. కార్డుల రద్దుకు దారితీసిన కారణాలను పరిశీలిస్తే ఏమాత్రం సహేతుకంగా లేవని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారంటూ కొందరికి కార్డులు రద్దు చేశారు. అయితే తమకు ఎలాంటి ప్రాపర్టీ లేదని, ఉంటే ఎక్కడుందో చూపించాలని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా తహసీల్దార్ కార్యాలయంలోని పౌరసరఫరాల సిబ్బంది తలలు బాదుకుంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలున్నా..రద్దే ఔట్సోర్సింగ్ కింద చిన్నా, చితకా ఉద్యోగాలు చేస్తున్న కొందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్డులు తొలగించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు చేసుకుని జీవిస్తున్న తమ కార్డులు రద్దు చేయడం అన్యాయమని పలువురు వాపోతున్నారు. సరైన కారణం చూపకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా కార్డులు రద్దు చేయడంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్న ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించి సమాచారం ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని నియమించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బియ్యం ఇవ్వం పొమ్మన్నారు: నాకు రేషన్‌కార్డు ఇచ్చారు. ఏడాది కాలంగా చౌక దుకాణానికి వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటున్నాను. గతనెల కూడా ఇలాగే రేషన్‌షాపు వద్దకు వెళ్లాను. నీ కార్డు తీసేశారని డీలర్ చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – పఠాన్ బీబీ, రామకృష్ణనగర్, కడప రెండు నెలలుగా బియ్యం ఇవ్వలేదు నేను చాలా పేదరాలిని. ప్రభుత్వం మాకు గతంలో బియ్యం కార్డు ఇచ్చింది. అయితే ఉన్నట్లుండి కార్డు తొలగించారు. దీంతో రెండు నెలల నుంచి బియ్యం అందలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. – షేక్ బీబీ, మోచంపేట, కడప -
కలెక్టరమ్మా.. కనికరించవమ్మా..
► ప్రజావాణిలో విన్నపాలు ► 121 దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లిరూరల్ : తమ సమస్యలపై వినతిపత్రాలు అందించి వాటిని పరిష్కరించాలంటూ బాధితులు వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ వర్షిణి, డీఆర్వో వెంకటేశ్వర్లు వినతులు స్వీకరించారు. ఇల్లు లేని తమకు డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని, పింఛన్లు అందించాలని వృద్ధులు, రేషన్ కార్డులు కావాలని తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సోమవారం నాటి ప్రజావాణిలో 121 దరఖాస్తులు వచ్చాయి. ట్యాంకు కట్టకుండానే డబ్బు మింగిండ్రు.. మా ఊరిలో రూ. 6లక్షలతో మంచినీటి ట్యాంకు కట్టాల్సిఉంది. లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే ట్యాంకుకు మెరుగులు దిద్ది రూ.5.89లక్షల బిల్లులు పొందారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – పుట్ట రామయ్య, ఖానాపూర్,మంథని ఉపాధి మార్గం చూపించండి.. సుగ్లాంపల్లిలోని శాలివాహన పవర్‌ప్లాంటులో 8 ఏళ్లుగా పని చేస్తున్నాం. గతేడాది జూలై నుంచి ప్లాంటు మూసివేశారు. అప్పటినుంచి అక్టోబర్వరకు సగం జీతం ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత నుంచి పట్టించుకోవడంలేదు. కంపెనీలో పని చేస్తేనే మా కుటుంబం గడిచేది. ఇప్పుడు పనిలేక పాలుపోవడంలేదు. ప్లాంట్‌ను తెరిపించి పని కల్పించాలి. లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలి. – సుగ్లాంపల్లి పవర్‌ప్లాంట్ వర్కర్స్ పింఛన్ ఇప్పించండి దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. సర్కారు పట్టించుకోవడంలేదు. మొన్నటిదాకా మాలాంటోళ్లకు పింఛన్ డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటిదాకా ఇచ్చినోళ్లులేరు. ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం పింఛన్ పించి ఆదుకోవాలి. – రామగుండం జోగినులు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు చాలాఏళ్లుగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సర్వే నంబరు 45లో నివసిస్తున్నాం. ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు, ఆధార్‌కార్డులు ఇచ్చిం ది. అయితే ఇప్పుడు గ్రామానికి చెందిన మద్దెల శ్రీహరి భూమి తనదంటూ ఖాళీ చేయించాలని కొందరు అధికారులతో కలిసి బెదిరిస్తున్నారు. ఇళ్ల సమీపంలో మద్యం దుకాణం పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. –గర్రెపల్లి ఒడ్డెర కుటుంబాలు కనీస వసతులు కల్పించాలి సింగరేణి ప్రాజెక్టు కోసం మా భూములు తీసుకున్నారు. పునరావాసకాలనీలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, డ్రెయినేజీలు నిర్మించలేదు. విద్యుత్‌సౌకర్యం లేక అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎన్నోసార్లు సింగరేణి, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాం. – గోపాల్, రాజమల్లు, లద్నాపూర్ -
రేషన్ కార్డులపై ప్రభుత్వం కుయుక్తులు
-
ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులకు సరుకులు
నంద్యాలరూరల్: కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి నెల నుంచి సరుకులు అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాల టెక్కెమార్కెట్ యార్డు ఆవరణంలోని సివిల్ సప్లయ్ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డీలర్ల వద్ద మిగిలిన సంక్రాంతి చంద్రన్న కానుకలు వెనక్కు అందజేయాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో మిగిలిన ఆయిల్, కందిపప్పును ఉచితంగా ఐసీడీఎస్‌కు, శనగ పప్పు, గోధుమపిండి, నెయ్యి, బెల్లంస్టాక్ను.. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు ఉచితంగా అందివ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ గోదాము ఇన్చార్జి రామాంజనేయులు తదితరులు ఉన్నారు. -
సమస్యలు పట్టించుకోరా?
నెల్లూరు(సెంట్రల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న జన్మభూమి సభలు రసాభాసగా మారుతున్నాయి. అధికారం చేతపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు తమ సమస్యలు పట్టించుకోకుండా సభలు, సమావేశాలతో సరిపెట్టడం ఏమిటని ప్రజల అటు అధికారులను, ఇటు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ప్రధానంగా నిరుపేదలకు అవసరమైన రేషన్ కార్డులు, పక్కాగృహాలు, పింఛన్లు అర్హులైన వారికి ఇవ్వకపోవడంతో ఎక్కడిక్కడ జన్మభూమి సభలలో అధికార పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. గెలిచిన తరువాత మా బాగోగులు పట్టించుకోకుండా ఏ మొహం పెట్టుకుని మా వద్దకు వస్తున్నారంటూ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి సభలు పెట్టుకోమంటూ కరాఖండిగా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల మీరు సభలు పెట్టుకోండి మేము మాత్రం రామంటూ ప్రజలు స్వచ్ఛందంగా బాయ్‌కాట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ఈ విధంగా ప్రజలలో వ్యతిరేకత ఉండటంతో అధికార పార్టీ నాయకులే నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ► కావలి పట్టణంలోని 14వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారని అధికారులను, అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు ఎమ్మెల్యే మాటలకు అడ్డుతగులుతూ గందరగోళం సృష్టించారు. ప్రజల తరఫున అడుగుతుంటే అడ్డుకుని గందరగోళం సృష్టించడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ► గూడూరు నియోజక వర్గంలోని వాకాడు మండలం కాశీపురం, కొండాపురం గ్రామాలలో జన్మభూమి సభలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సుబ్రమణ్యం, ఎమ్మార్వో లావణ్య పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం అక్కడ పరిస్థితిని చూసి మొహం చాటేశారనే విమర్శలు వినిపించాయి. గ్రామస్తులు మాత్రం పక్కా గృహాలు, రేషన్ కార్డులు, భూసమస్యలు పరిష్కరించలేదని వచ్చిన అధికారులను నిలదీశారు. ► ఎస్ఆర్పురం బసినేనిపల్లిలో గ్రామాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. తాము మరుగుదొడ్లు కట్టుకున్నా వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని గ్రామస్తులు వచ్చిన అధికారులు, నాయకులను నిలదీశారు. ► ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలంలోని గుడిపాడులో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మొక్కుబడిగా పెన్షన్లు, రేషన్‌కార్డులు పంచడానికి జన్మభూమి సభలెందుకని ప్రత్యేకాధికారి నారాయణమ్మను గ్రామస్తులు నిలదీశారు. ► సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో ఉన్న అర్ధమాల, పునబాక గ్రామాల్లో జన్మభూవి గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పింఛన్లు ఇవ్వకుండా జన్మభూమి ఎందుకని అధికారులను ప్రశ్నించారు. ► ఇవే కాక చాలా నియోజక వర్గాల్లో కూడా జనం అధికారులు, అధికారపార్టీ నాయకులను నిలదీశారు. పలుచోట్ల సభలకు జనం రాలేదు. -
జిల్లాకు మూడో విడత రేషన్‌కార్డులు
కొత్తగా 24,665 కార్డులు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు కొత్త రేషన్ కార్డులు భారీగానే వస్తున్నాయి. ఈ పీడీస్ వెబ్సైట్లో నమోదు చేసిన దరఖాస్తుల్లో ఇప్పటికే దాదాపు 80శాతం వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండు విడతల్లో 52,747 రేషన్ కార్డులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో 24,665 కార్డులు రావడంతో కొత్త కార్డుల సంఖ్య 77,412కు పెరిగింది. తహసీల్దార్లు, ఏఎస్ఓలు రేషన్ కార్డుల కోసం దాదాపు 97 వేల దరఖాస్తులు ఈ– పీడీఎస్ వెబ్సైట్లో నమోదు చేశారు. మరో విడత కార్డులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడో విడతలో కర్నూలు డివిజన్‌కు 5871, నంద్యాల డివిజన్‌కు 6880, ఆదోని డివిన్కు 11914 ప్రకారం రేషన్ కార్డులు వచ్చాయి. పాణ్యం నియోజకవర్గంలోని గడివేములకు రెండు విడతల్లోనూ మొండిచెయ్యి ఎదురైంది. మూడో విడతలో మాత్రం 721 కార్డులు వచ్చాయి. బేతంచెర్లకు మొదటి విడతలో కేవలం 7 కార్డులు మాత్రమే రాగా రెండవ విడతలో ఒక్క కార్డు కూడా రాలేదు. తాజాగా ఈ మండలానికి 1553 కార్డులు వచ్చాయి. రెండో, మూడవ విడతలో మంజూరు చేసిన కార్డులు ఇంకా జిల్లాకు చేరలేదు. హైదరాబాద్‌లోనే ముద్రిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. -
జిల్లాకు కొత్త రేషన్ కార్డులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు 43, 962 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటిని హైదరాబాద్‌లోని ముద్రించి ఆదివారం మధ్యాహ్నం జిల్లాకు పంపారు. సోమవారం నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో వీటిని పంపిణీ చేయనున్నారు. జిల్లాలో లక్షకు పైగా దరఖాస్తులు రాగా 97వేలు మాత్రమే ఈ– పీడీఎస్ వెబ్సైట్లో నమోదు చేశారు. ఇందులో సగం దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు రాలేదు. కర్నూలు రెవెన్యూ డివిజన్‌కు 23,558, నంద్యాల రెవెన్యూ డివిజన్‌కు 9,669, ఆదోని డివిజన్‌కు 10,735 ప్రకారం కార్డులు వచ్చాయి. అర్బన్ ప్రాంతాల్లో కర్నూలు నగరపాలక సంస్థకు అత్యధికంగా 8,219 కొత్త కార్డులు వచ్చాయి. నంద్యాల మున్సిపాలిటీకి 861, ఆదోని మున్సిపాలిటీకి 34, ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి 684, డోన్ మున్సిపాలిటీకి 980 ప్రకారం కొత్త కార్డులు వచ్చాయి. కొత్త కార్డులన్నింటికీ చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారు. రేషన్ సరుకులు మాత్రం ఫిబ్రవరి నెల నుంచి ఇస్తారు. అతి తక్కువగా బేతంచెర్ల మండలానికి కేవలం 7 కార్డులు మాత్రమే మంజూరు కావడం గమానార్హం. ఈ మండలంలో 2000 దరఖాస్తులను అప్లోడ్ చేయగా ఏడుగురికి మాత్రమే మంజూరు కావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు, అన్నపూర్ణ కార్డులు కలిపి 10,77,528 ఉన్నాయి. కొత్తగా 43,962 రేషన్ కార్డులు రావడంతోనే ఈ సంఖ్య 11,12,490కు పెరిగింది. -
అధోగతి
- 42 వేల కుటుంబాలకు అందని బియ్యం కార్డులు - పేదలై ఉండీ ప్రభుత్వ పథకాలకు దూరం - రుణాలకు అనర్హత.. నిస్పృహలో నిరుద్యోగ యువత అనంతపురం అర్బన్ : కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతలో 42 వేల పేద కుటుంబాలు ఏ రకంగానూ ప్రభుత్వ సాయం అందక అధోగతి పాలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉండటం వల్ల వీరికి ఈ దుస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో దాదాపు లక్షకు పైగా రేషన్‌కార్డులను తొలగించింది. కొత్తకార్డులు పంపిణీ చేస్తామని చెప్పడంతో 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో అనర్హత పేరిట పది వేల దరఖాస్తులను తిరస్కరించారు. 8 వేల మందికి మాత్రమే కార్డులు అందజేశారు. ఇంకా 42 వేల మంది రెండేళ్లకు పైగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేక ఆయా కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హత కోల్పోయి నిస్పృహకు గురవుతోంది. 2014కు ముందు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి అర్హులైతే మంజూరు చేసేవారు. అంతే కాకుండా ప్రతి ఏడాదీ కోటా విడుదల చేసేవారు. దీంతో అర్హులైన పేదలందరికీ కార్డులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. రెండేళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుల సంఖ్య చేంతాడులా పెరిగిపోతోంది. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కప్పదాట్లతో కాలం వెళ్లదీస్తుండటం వారి పాలిట శాపంగా మారింది. పేదల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనేందుకు రేషన్‌కార్డుల మంజూరులో చూపిస్తున్న నిర్లక్ష్యమే నిదర్శనమని బాధిత కుటుంబాల నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు
► తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం ►అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు ►గడపగడపలో వైఎస్సార్ సీపీ నేతలకు ప్రజల వినతి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో మంగళవారం గిద్దలూరు, కందుకూరు, యర్రగొండపాలెం, పర్చూరు, కనిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల ఎదుట ఏకరువు పెట్టారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్లు పెంచాలని పెద్దదోర్నాల మండలం చినగుడిపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ, సీతమ్మతో పాటు పలువురు గడప గడప కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు విన్నవించారు. నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, మురికి కాలువలు సైతం సక్రమంగా లేవని కనిగిరి పట్టణం 4వ వార్డు చింతలపాలెం, రామాలయం వీధికి చెందిన హుస్సేన్‌బీ, ఖాసీంబీ, గౌస్‌బీ తదితరులు వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్‌కు విన్నవించారు. అధికారులకు వినతి పత్రాలిచ్చిన ఒక్క పక్కా గృహం మంజూరు చేయలేదని కందుకూరు పట్టణం 15వ వార్డు ఎర్రగుంటపాలేనికి చెందిన ఖాదర్‌బాషా, అబ్దుల్బాషాలతో పాటు పలువురు కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావుకు విన్నవించారు. అర్హులకు పక్కా గృహాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయలేదని, తాగునీటి కొళారుులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చినగంజాం మసీదుపేటకు చెందిన షేక్ కాలేషా, షేక్ ఇసుబ్లతో పాటు పలువురు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్‌కు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లు లేదని, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గిద్దలూరు మండలం దంతెరపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, శివారెడ్డిలతో పాటు పలువురు గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి విన్నవించారు. -
రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా
-
రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా
రాజమండ్రి: రేషన్ కార్డుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి లో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనలో నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, సూర్యప్రకాశ్ రావు, షర్మిలా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డుల విభజన ప్రక్రియను పౌర సరఫరాల శాఖ పూర్తి చేసింది. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను కేటారుుస్తూ నిర్ణయం చేసింది. 28 జిల్లాల కు రేషన్ కేటారుుంపుల ఉత్తర్వులను శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. 28 జిల్లాలకు గానూ 69.73 లక్షల కార్డులకు 1,40,538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 69 లక్షల 54వేల చక్కెర ప్యాకెట్లను, 69,72,029 ఉప్పు ప్యాకెట్లను డిసెంబర్ నెలకు కేటారుుంచారు. జిల్లాల పునర్విభజనకు ముందు 10 జిల్లాలో 85 లక్షల రేషన్ కార్డులున్నాయని, ఈ కార్డులను 31 జిల్లాలకు అనుగుణంగా విభజించామన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,77,391 కార్డులుండగా, అతి తక్కువగా ఆసిఫాబాద్‌లో 1,37,585 రేషన్ కార్డులున్నారుు. నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులకు సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. -
కోడుమూరు కేంద్రంగా బోగస్ కార్డులు
– 8 మంది డీలర్లపై నిఘా వేసిన సీసీఎస్ పోలీసులు – డీలర్లను రక్షించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం – తమ పేర్లు బయటపడకుండా ఉండేందుకు లాబీయిగ్ చేస్తున్న డీలర్లు – బోగస్ కార్డులున్నాయని ఆనాడే హెచ్చరించిన సాక్షి కోడుమూరు: ఇపాస్ యంత్రాలను బైపాస్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ సరుకులను దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. డేటాబేస్ ఆధారంగా గతంలో 100 శాతం సరుకులు డెలివరీ చేసిన డీలర్ల వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలానికి చెందిన డీలర్ ద్వారా ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా బోగస్ కార్డులపై డీలర్లే వేలిముద్రలు వేసుకుని సరుకులు తీసుకునే వెసులుబాటును అమర్చి భారీ ఎత్తున బోగస్ కార్డులు పొందినట్లు ఈ ఏడాది జులై 15న సాక్షిలో ‘బోగస్‌కార్డులు కుప్పలుతెప్పలు’ కథనం సాక్షాధారాలతో ప్రచురితమైంది. బ్యాక్లాగ్ సరుకులను డీలర్లు ఏ విధంగా స్వాహా చేస్తున్నారన్న విషయంపై సీసీఎస్ అధికారులు గుట్టు రట్టు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేయడంతో డీలర్ల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. తమ పేర్లు బయటపడకుండా రక్షించాలని ఎమ్మెల్యే మణిగాంధీని కొంతమంది డీలర్లు కలిసినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే 4 నెలల క్రితం కోడుమూరు పట్టణంలో ఓ డీలర్ 102 శాతం సరుకులను కార్డుదారులకు అందజేసిన విషయాన్ని తహసీల్దార్ నిత్యానందరాజు గమనించి ఆశ్చర్యపోయాడు. 102 శాతం సరుకులు ఎలా వేస్తారని డీలర్ల మీటింగ్‌లో తహసీల్దార్ హెచ్చరించారు. చింతమాను సుజాత(డబ్ల్యూఏపీ131900300325) పేరు మీదనున్న బోగస్కార్డుకు కర్ణాటకలో ఉన్న చింతమాను బొర్ర భారతి ఆధార్‌కార్డు(473296591029)ను అనుసంధానం చేసి ఓ డీలర్ ప్రతినెలా సరుకులను ఏ విధంగా తీసుకుంటున్నాడో అధికారులకే తెలియాలి. కామార్తి లక్ష్మీదేవమ్మ పేరు మీదనున్న (డబ్ల్యూఏపీ131900300307) బియ్యంకార్డుకు కృష్ణానగర్‌లో నివాసముంటున్న చెన్నమ్మ ఆధార్‌కార్డు(397119521043) నంబర్ అనుసంధానం చేసి సరుకులను సదరు డీలర్ సొంతంగా వేలిముద్రలు వేసి తీసుకుంటున్నాడని ఆధారాలు బయటపడ్డాయి. కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లు 2015 డిసెంబర్ నుంచి 2016 మే నెల వరకు 100 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు చూపించి ఇ–పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు వేసి సరుకులను స్వాహా చేశారు. బోగస్‌కార్డుల వ్యవహారం గుట్టురట్టు అవడంతో అక్రమాలకు పాల్పడిన డీలర్లు తమపేర్లు బయటికి రాకుండా ఉండేందుకు అన్నివిధాలా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 102 శాతం సరుకులెలా వేశారని మందలించా : నిత్యానందరాజు, తహసీల్దార్ కోడుమూరులో కొంతమంది డీలర్లు 100 శాతం సరుకులు వేసిన విషయం తెలియడంతో సమావేశం పెట్టి తీవ్రంగా మందలించా. ఇంకో డీలర్ 102 శాతం సరుకులెలా వేశాడో ఆశ్చర్యమేసి తీవ్రంగా హెచ్చరించా. ఈ సంఘటన 4 నెలల క్రితం జరిగింది. బోగస్‌కార్డుల వివరాల సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం. -
తాడుకు కోడిని కట్టి... చికెన్ తిన్నట్లుంది!
మహేశ్వరం: కేసీఆర్ పాలన చూస్తుంటే.. ‘తాడుకు కోడిని కట్టి ...చికెన్ తిన్నట్లు ఉంద’ని...పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అప్పులు చేసి...ఆటోలు, కార్లు తీసుకొని జీవిస్తున్న వారి రేషన్ కార్డులు, పింఛన్లు ప్రభుత్వం తొలగించడం దారుణమని అన్నారు. అర్హుల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించినందుకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ,, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కుంటిసాకులతో అర్హులకు పథకాలు అందకుండా చేస్తోందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీఎం వద్ద నియోజకవర్గ సమస్యలను లెవనేత్తే దమ్ము, ధైర్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని ఆమె విమర్శించారు. బతుకమ్మల పేరిట రూ.35 వేల కోట్లను సీఎం కుమార్తెకు విడుదల చేశారని ఆరోపించారు. ‘దసరా ముగిశాక విదేశాల్లో కవితమ్మ బతుకమ్మలు ఆడడం ఎంట’ని ఎద్దేవా చేశారు. చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ మీర్పేట్లోని టీకేఆర్ కాలేజ్‌లో ఇరిగేషన్, దేవాదాయ భూములు ఉన్నందుకు వాటిని కూల్చుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరారని విమర్శించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కనబడకుండా పోయారని అన్నారు. అంతకుముందు మహేశ్వరం చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలగించిన రేషన్ కార్డులను వెంటనే పురుద్ధరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ ఎనుగు జంగారెడ్డి, మహేశ్వరం ఎంపీపీ పెంటమల్ల స్నేహ, పీఎసీఎస్ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, సీనియర్ నాయకులు కె.రఘుమారెడ్డి, కె.నర్సింహరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బ్యాగరి సురేష్, ఎం.నవీన్, షేక్ అబుబాకర్, మహేశ్వరం, కందుకూరు పార్టీ మండల అధ్యక్షులు శివమూర్తి, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్ కార్డులపై ఆయన ఫోటో
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమాజ్‌వాద్ పార్టీ చీప్ ట్రిక్కులకు పాల్పడుతుందట. కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోటోలు ముద్రించి జారీచేస్తుడటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇది ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తున్నాయి. కొత్త రేషన్‌కార్డులపై ముద్రించిన అఖిలేష్ ఫోటోను ప్రభుత్వం వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో తాము ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య హెచ్చరించారు. ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ విషయంపై అనవసరంగా ఎగిరెగిరి పడుతున్నాయని, ఈ విషయానికి కొంచెం తక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అఖిలేష్ సుత్తిమెత్తంగా హెచ్చరించారు. ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలియడం కోసం ఇది ఎంతో అవసరమన్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ ఎందుకని ప్రజలు ప్రశ్నించవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాము పేదవారికి సాయపడుతుంటే, దానికీ కొంత పబ్లిసిటీ తాము ఇచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వారికోసం ఎవరు పనిచేస్తున్నారో వారికి తెలియాల్సి ఉందన్నారు. అయితే ఇది కేంద్రప్రభుత్వ పథకమని, ఆహార ధాన్యాలు కేంద్ర ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మార్చి1నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ కింద 3.15 కోట్ల రేషన్ కార్డులను రాష్ట్రం ముద్రించి జారీచేయాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద జారీచేసిన కొత్త కార్డులు కలిగి ఉన్న వారికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు, గ్రస్తీ కార్డు హోల్డర్స్‌కు 5 కేజీల ఆహార ధాన్యాలు అందనున్నాయి. -
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్
కొత్త జిల్లాల ఏర్పాటుతో నిలిచిన పంపిణీ కార్డులపై పాత జిల్లాల పేర్లే కారణం ముందు చూపులేక కోట్లాది నిధులు వృథా.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరా ల శాఖ అధికారులకు ముందు చూపులేకపోవడంతో రెండేళ్ల తరువాత చేతిదాక వచ్చిన కొత్త రేషన్ కార్డులు చేజారే పరిస్థి తి ఏర్పడింది. కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతో కొత్త రేషన్ కార్డులకు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి వేరే జిల్లాలను ఏర్పాటు చేయనుండడంతో రేషన్‌కార్డుల్లో లబ్ధిదారుల జిల్లా, మండలం పేర్లు మారనున్నాయి. దీంతో రేషన్ కార్డుల పంపిణీ పక్రియకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బ్రేక్ వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత రేషన్ కార్డులను తొల గించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి నేటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది జిల్లాలకు కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఆయా జిల్లాలకు పంపింది. ఇందుకు వీటి ముద్రణ కోసం ప్రభుత్వం ఓ సంస్థకు టెండర్లు అప్పగించింది. దాదాపు రూ.7 కో ట్ల వరకు నిధులు వెచ్చించి, కొత్త రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు వారి పేర్లను, ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలను సైతం ముద్రించింది. ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు వచ్చిన రేషన్ కార్డులను మండలాలు, మున్సిపాలిటీల వారీగా వేరు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా ల చిక్కు వచ్చి పడడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కొద్ది రోజులు అగితే... రూ.7 కోట్లు మిగిలేవి.... కాంట్రాక్టర్లకు ఆహార భద్రతా కార్డుల ముద్రణ బాధ్యత అప్పగించే సమయానికి కొత్త జిల్లాల పునర్విభజన పక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను దసరాకే ప్రారంభిస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ రేషన్ కార్డులను ఈ సమయంలో ముద్రిస్తే అవి ఉపయోగపడవని అధికారులు ఆలోచించలేకపోయారు. రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయడంలో దాదాపు రెండేళ్ల పాటు జాప్యం చేసిన సర్కారు మరి కొన్ని రోజులు ఆగి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎంచక్కా కొత్త జిల్లాలు, మండలాల పేర్లతో ముద్రణ జరిగేదంటున్నా రు. ఒకటి కాదు రెండు కాదు పది జిల్లాలకు సంబంధించిన లక్షల కొద్దీ రేషన్ కార్డులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనికి రాకుండా పోనున్నాయి. ఇటు వీటి ముద్రణ కోసం ఖర్చు చేసిన దాదాపు రూ.7 కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు లాగా అయ్యింది. మళ్లీ కొత్తవి ముద్రిస్తారా...? కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ముద్రించిన కార్డుల స్థానంలో జిల్లా, మండలం పేర్లు మార్పు చేసి మళ్లీ కొత్త కార్డులను ముద్రిస్తారా..? లేదా ముద్రించిన కార్డులపైనే స్టిక్కర్లు అతి కించి వాటినే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. కొత్త ముద్రణ జరిగితే మాత్రం ప్రభుత్వ నిధుల వృథాతో పాటు మరో ఆరు నెలల పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తప్పవు. ఇటు ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తమకు మాత్రం రాష్ట్ర అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, తాత్కాలికంగా రేషన్ కార్డుల పంపిణీ చేయకుండా నిలిపివేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
కొత్త కార్డులు హుళక్కే!
♦ ఇప్పటికే పూర్తయిన రేషన్‌కార్డుల ముద్రణ ♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో గందరగోళం ♦ జిల్లాల పేర్లు మారడంతో నిలిచిన పంపిణీ ♦ తలపట్టుకుంటున్న పౌరసరఫరాల శాఖ ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. వాస్తవానికి ఈ నెలలోనే కొత్తకార్డులు వస్తాయని భావించారు. కానీ, వీటిపై కొత్త జిల్లాల ప్రభావం పడింది. జిల్లా, మండలాల పేరు మార్చాల్సి ఉండడంతో వాటి పంపిణీని నిలిపివేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రేషన్ కార్డుల భాగ్యం లబ్ధిదారులకు ఇప్పట్లో కలిగే అవకాశం లేదు. వాస్తవానికి ఈ నెల మొదటివారంలో లబ్ధిదారులకు తెలంగాణ లోగోతో ఉన్న కొత్త ఆహార భద్రత కార్డులు అందించాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ సైతం ఈ మేరకు టెండర్లు పిలిచి ముద్రణ ప్రక్రియలో వేగం పెంచింది. దీంతో చర్యలకు దిగిన కాంట్రాక్టర్లు కొత్తగా కేటాయించే కార్డులను ముద్రించి పౌరసరఫరాలశాఖకు అప్పగించారు. సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాలని యంత్రాంగం భావించింది. తాజాగా కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి రావడం.. ప్రభుత్వం కూడా జిల్లాల ఏర్పాటును యుద్దప్రాతిపదకన భావిస్తూ చర్యలు వేగిరం చేయడంతో కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. వృథా ప్రయాసేనా...? జిల్లాలో 11.65 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ సర్వేలు నిర్వహిస్తూ అర్హతలేని కార్డుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనాలు, రూ.వేలల్లో ఆస్తిపన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తొలివిడత సర్వే పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ 1.10లక్షల కార్డులు అర్హత లేనివిగా తేల్చింది. వీటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా... అర్హత ఉన్న కార్డుదారులకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉన్న కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సర్కారు వాటిని ముద్రణకు పంపింది. ఈ క్రమంలో గత నెలాఖర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కొత్త కార్డులు చేరాయి. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2.5 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడంతో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకంగా జిల్లా పేరు, మండలాల పేర్లు మారే అవకాశం ఉండడంతో వాటి పంపిణీని యంత్రాంగం తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత వాటికి కాస్త మెరుగులు దిద్దాలా..? లేక తిరిగి కొత్త వాటిని ముద్రించి ఇవ్వాలా అనే అంశాన్ని పౌరసరఫరాల శాఖ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు కొత్తకార్డులు ఇప్పట్లో లేవనే చెప్పొచ్చు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి: డీఎస్ డీఓ
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతాం..
విజయవాడ: కొత్తగా రేషన్ కార్డుల కోసం 6లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పరిటాల సునీత తెలిపారు. పల్స్ సర్వేలో సమస్యలున్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. పల్స్ సర్వే తర్వాత రేషన్ కార్డుల మంజూరు పై నిర్ణయం తీసుకుంటామని సునీత వెల్లడించారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. నగదు రహిత రేషన్ పంపిణీ విధానంపై అధ్యయనం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రతి నెలా 15వ తేదీ వరకు రేషన్ అందిస్తామన్నారు. -
ఏపీలో రేషన్ కార్డుల తొలగింపు
-
ప్రతి గడపా సమస్యల నిలయమే
వైఎస్సార్ కాంగ్రెస్ సీపీ నేతలకు వినతుల వెల్లువ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న గడపగడపకూ.. కార్యక్రమం విశాఖపట్నం : ‘రేషన్ కార్డులు తీసుస్తున్నారు.. వృద్ధాప్య పింఛన్లు లేవంటున్నారు.. ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని, నడి రోడ్డులో వదిలేశారు.. రుణ మాఫీ అంటూ మాయ మాటలు చెప్పారు.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు.. నిలువునా మోసపోయామయ్యా’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నాలుగో రోజు సోమవారం కొనసాగింది. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ పేరుతో జనాన్ని మోసం చేసిందని, పంటల బీమా ఇవ్వకుండా రైతుల్ని దెబ్బతీసిందని విమర్శించారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గడపడగపకు వెళ్లి గిరిజనులతో మమేకమయ్యారు. పింఛన్లు అందడం లేదని గిరిజనులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అటవీ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. నిధుల్లో కోత విధించి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం అనకాపల్లి పట్టణం, నర్సింగరావుపేటలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో జరిగింది. దాదాపు వంద కుటుంబాలను అమర్ పలకరించారు. ప్రతి గడపలో సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదోనని ఆరాతీశారు. వృద్ధునికి వైఎస్సార్సీపీ నేతల పింఛన్ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలం దేవవరంలో వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, చిక్కాల రామారావు, డి.వి.సూర్యనారాయణరాజు, వీసం రామకృష్ణ పాల్గొన్నారు. పింఛన్ మంజూరు కాలేదని, నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు దమ్ము శ్రీరాములు నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకుల ముందు వాపోయాడు. వెంటనే స్పందించిన గొల్ల బాబూరావు తన వంతు సాయంలో భాగంగా కొంత నగదును వృద్ధుడికి అందించారు. రాజయ్యపేటకు చెందిన దుంగా రాజు, మైలపల్లి సూరిబాబులు ప్రతి నెలా రెండొందల రూపాయలు పింఛన్ రూపంలో ఆ వృద్ధుడికి ఇస్తామని ప్రకటించారు. యలమంచిలిలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు నేతృత్వంలో కొక్కిరాపల్లిలో జరిగింది. చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో సమన్వకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం నాగాపురంలో సమన్వయకర్త ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం దముకు, కొండిబల్లో త్రిసభ్య కమిటీ సభ్యురాలు అరుణకుమారి నేతృత్వంలో జరిగింది. -
ఎన్టీఆర్ కార్డు పంపిణీలో వసూళ్ల దందా!
► కార్డుకు రూ.10 నుంచి రూ.20 వసూలు ► ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు డబ్బు కొట్టు.. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు పట్టు అన్నట్లు రేషన్ డీలర్ల వ్యవహారం తయారైంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఇందుకు ఇంత ఖర్చయింది.. వీరికి అంత ఇస్తున్నాం.. అంటూ దబాయిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్డులు ఉచితంగా పంపిణీ జరగాల్సిఉండగా ప్రజల నుంచి ముక్కుపిండి నగదు వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెనాలి అర్బన్ : జిల్లా పరిధిలో సుమారు 13,58,883 తెల్ల, అన్నపూర్ణ, అంత్యోదయ రేషన్ కార్డులున్నాయి. వీరందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ ఆర్యోగశ్రీ కార్డులను ఉచితంగా అందజేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్పు చేసింది. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఫొటోలతో ఉన్న కొత్త కార్డులను జారీ చేసింది. వాటిని రెవెన్యూ అధికారులు తెల్లకార్డుదారులందరికీ అందజేయాల్సి ఉండగా ఆ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. ఇది రేషన్ షాపుల నిర్వాహకులకు వరంగా మారింది. కాసులు కురిపిస్తున్నఆరోగ్యసేవ కార్డుల పంపిణీ.. జిల్లా పరిధిలో ఉన్న రేషన్ డీలర్లు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు కార్డులను అందజేసినందుకు గాను రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే కార్డు లామినేషన్ చేయించామని, కార్డులు రెవెన్యూ కార్యాలయం నుంచి తెచ్చామని ఇలా రకరకాల కారణాలు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే కార్డు ఇవ్వకుండా సాకులు చెప్పటం.. రేషన్ ఇవ్వమని బెదిరించటం వంటివి చేసి తిప్పి పంపుతున్నారు. చేసేది లేక లబ్ధిదారులు వారడిగిన నగదును ముట్టజెప్పి కార్డు తీసుకెళుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కోసం ఇచ్చే నగదుతో ఒక నెల 5 కేజీల రేషన్ బియ్యం తెచ్చుకోవచ్చని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు.. జిల్లా పరిధిలో ఉన్న 13,58,883 కార్డులకు సంబంధించి లబ్ధిదారులు సగటున రూ.10 ఇచ్చినా సుమారు రూ.1.37 కోట్ల నగదు డీలర్లకు అదనంగా వచ్చే ఆదాయంగా చెప్పవచ్చు. ఈ వసూలు నగదులో కొంత మొత్తం కొందరు రెవెన్యూ అధికారులకు ముట్టచెబుతున్నట్లు ఆరోపణ ఉంది. అందువల్లే దీనిపై లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిఇలా ఉంటే కొద్ది నెలల క్రితం తెల్లరేషన్ కార్డు దారులందరికీ కూపన్ల బదులు ఒక చార్టును ఇచ్చారు. వాటి పంపిణీ సమయంలో కూడా ఒక్కొక్కరి నుంచి రూ.15 వసూలు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెనాలి తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డును లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాల్సి ఉందని తెలిపారు. నగదు వసూలు చేస్తున్నారనే విషయం తన దృష్టికి రాలేదన్నారు. వెంటనే దీనిపై విచారణ జరుపుతానని చెప్పారు. -
జనంలోకి వెళితే.. నిలదీస్తున్నారు
► టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ► ఎమ్మెల్యేల సీరియస్ ► అగ్రి జోన్ ఎత్తేయాలని డిమాండ్ ► రేషన్ కార్డులు, పింఛను కోతలపై నిరసన సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ అంతర్గత సమావేశం సోమవారం వాడీవేడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలుఅంశాలపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిం చారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు తమను నిలదీస్తున్నారని సీరియస్ అయ్యారు. అగ్రిజోన్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తక్షణం అగ్రిజోన్ను ఎత్తివేయించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య తదితరులు చెప్పినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా మంచినీటి సమస్య ఎదురైందని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ, మచిలీపట్నం డివిజన్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ గతంలో నాలుగు టీఎంసీల నీరు వది లితే ఒకటిన్నర టీఎంసీలు భూమిలోనే ఇంకిపోయిందన్నారు. మరో రెండు టీఎంసీల నీరు వదులుతామని హామీ ఇచ్చారు. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ, ఏలూరు కాల్వ మళ్లింపు వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డును పాకలు తొల గించకుండా డివైడర్ సైజు తగ్గించి కలిపే అవకాశాలను పరిశీలించి చర్చించేందుకు ఎన్‌హెచ్ రోడ్డు సేఫ్టీ విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల తొలగింపు అనివార్యమైతే రామవరప్పాడు, ప్రసాదంపాడులలోనే నిర్మించి ఇవ్వాలన్నారు. వేలిముద్రలు పడలేదని రేషన్ ఇవ్వకపోవడాన్ని పలువురు ఎమ్మెల్యేలు నిలదీశారు. ఈ-పోస్ విధానంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, తంగిరాల సౌమ్య, కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ చొక్కాల చేతిలో రేషన్ కార్డులు’
శ్రీకాకుళం టౌన్:జిల్లాలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని జన్మభూమి గ్రామసభల్లో ప్రకటించి, మంజూరైన కార్డులను టీడీపీ నాయకుల చేతికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలె క్టర్ పి.లక్ష్మీనృసింహంనకు ఫిర్యాదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని మగ్గూరు గ్రామంలో అరుుదుగురి రేషన్ కార్డులు సర్పంచ్ ఖగేంద్రవద్దే ఉంచుకొని లబ్ధిదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. అలాగే, కొట్టిశ, మద్దివలస గ్రామాల్లో అంత్యోదయ కార్డులున్న లబ్ధిదారులకు మూడు నెలలుగా తెలుపు రేషన్ కార్డుదారులకు ఇచ్చేవిధంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల లబ్ధిదారులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకాపల్లి పంచాయతీ కార్యదర్శి ఇంటిపన్ను వసూలు చేసి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫింఛనుదారుల నుంచి రూ.200 వంతున వసూలు చేసినట్టు ఆమెపై గతంలో గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నాయకుడు సురేష్ ముఖర్జీ, వంజరాపు విజయ్, సిరిపురం జగన్ తదితరులు ఉన్నారు. అంతకాపల్లి సెక్రటరీ సావిత్రి సస్పెన్షన్? రాజాం నియోజకవర్గంలోని అంతకాపల్లి పంచాయతీ సెక్రటరీ సావిత్రిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం చెప్పారు. ఎమ్మెల్యే కంబాల జోగులు గ్రామస్థుల ఫిర్యాదులను కలెక్టర్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన ఈ విషయూన్ని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అధికారికంగా జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఉత్తర్వులు ఇంకా ఆమెకు అందవలసి ఉంది. -
చిత్రం.. కార్డుల విచిత్రం
సాలూరు: అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరుచేస్తున్నామని పాలకులు గొప్పగా చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన విధానం చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సి వస్తోంది. రెండో విడత జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పేదలకు తెల్లరేషన్‌కార్డులు, అవసరమైనవారికి గులాబీకార్డులు ఇటీవల జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమం లో పంపిణీ చేయాలని భావించారు. అయితే వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉండట ం, పూర్తిస్థాయిలో మంజూరుకాకపోవడంతో గొడవలు వస్తాయని అధికారులు గుర్తించి పంపిణీ తాత్కాలికంగా నిలిపేశారు. జిల్లాలో రేషన్‌కార్డులకోసం దాదాపు 68వేల దరఖాస్తులు రాగా, వీరిలో ప్రాధమికంగా 60వేల మందిని అర్హులుగా గుర్తిం చారు. జన్మభూమికమిటీల జోక్యంతో వాటి సంఖ్య 38వేలకు దిగింది. ఇంతవరకు బాగానే వున్నా, మంజూరైనవారి జాబితాను చూస్తే విస్మ యం గొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఒకకార్డు వుండగానే ఇంకోటి : బార్యా, భర్త, పిల్లలతో వుంటున్నా, రేషన్కార్డుల్లేక అనేక ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేకపోతున్నారు. వారు కార్డులకోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకుండా ఇప్పటికే కార్డు వున్నవారికి మరోమారు రేషన్‌కార్డులను మంజూరు చేసేశారు. ఇలాంటివారు వందల సంఖ్యలోనే వున్నారు. అలాగే అర్హతున్నా మంజూరుకానివారు వేలల్లోనే మిగిలారు. వున్నవారికే మరలా మంజూరుకావడంతో అర్హులు గగ్గోలు పెడుతున్నారు. తాము ఏమిచేస్తే న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రిటైర్డు ఉద్యోగులు, ఆర్థికంగా స్థితిమంతులు గులాబీకార్డు మంజూరుచేయాలని దరఖాస్తు చేసుకుంటే ఏకంగా తెల్లరేషన్‌కార్డులను మంజూరుచేసేశారు. కొందరు వాటిని తీసేసుకోగా, ఇంకొందరు తిరస్కరిస్తుండడం గమనార్హం. అడ్రస్ లేని లబ్ధిదారులు : మంజూరైన కార్డులను పంపిణీ చేసేందుకు రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయా కార్డుల్లోని వారు తామిచ్చిన అడ్రస్‌లో లేకపోవడంతో ఏం చేయాలో తెలీక తెలీడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కార్డులు సాలూరు పట్టణంలోనే 250వరకు వున్నాయంటే మంజూరు ఎలా జరిగిందో ఊహించవచ్చు. జిల్లాలో 4వేల 800వరకు వున్నట్టు అధికారులు లెక్కలు తేలుస్తున్నారు. లబ్ధిదారులు లభ్యం కావడంలేదు కొత్తగా మంజూరైన తెల్లకార్డులను ఇద్దామంటే కొంతమంది లబ్ధిదారులు దొరకడంలేదు. వారికి కేటాయించిన డిపోల పరిధిలోను, వారిచ్చిన అడ్రస్‌లోనూ గుర్తించలేకపోతున్నాం. ఇబ్బంది పడుతున్నాం. కొద్దిరోజులు వేచిచూసి తిరిగి ఉన్నతాధికారులకు అప్పగించేస్తాం. - పి రాజు, పి శ్రీను, వీఆర్వోలు, సాలూరు -
రేషన్ కార్డుల కోసం అధికారుల నిర్బంధం
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బమ్మిడి గ్రామంలో రేషన్ కార్డులను ఇవ్వడం లేదని గ్రామస్థులు రెవెన్యూ అధికారులను శనివారం పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. జన్మభూమి కమిటీలో పేర్లు నమోదుచేసుకున్నప్పటికీ తమకు రేషన్ కార్డులు పంపిణీ చేయట్లేదని గ్రామస్థులు గ్రామ ఆర్ఐ,వీఆర్వోలను నిర్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసుల పహారాలో అధికారులు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. -
ఇదెక్కడి పరేషన్
కాకినాడ కలెక్టరేట్ :దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికార యంత్రాంగం పరిస్థితి. జిల్లాలో మూడు విడతలుగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. గత రెండు దల్ల్లో నిర్వహించిన జన్మభూమిలో దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. జిల్లాలో 1,34,680 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. వాటిని ఈ నెల 2 నుంచి 11 వరకూ నిర్వహించిన జన్మభూమిలో వాటిని పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాలు, వార్డుల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు.. రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరికి మాత్రమే కార్డులందాయి. అవి కూడా తప్పుల తడకలుగా ఉన్నాయి. యజమాని ఫొటో మాత్రమే కొన్ని కార్డుల్లో ముద్రితమైంది. కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో ఉన్నప్పటికీ, వారి ఫొటోలు లేవు. మరికొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లే లేవు. అవన్నీ సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు మినహా చర్యలు శూన్యం. కార్డుల్లో మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయంలోనే తప్పులు సరిచేస్తామని అధికారులు చెబుతుంటే, అవగాహన లేని కొంతమంది సిబ్బంది లబ్ధిదారులను మీ-సేవ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ కొత్తకార్డులు రావని చెబుతుండడంతో మళ్లీ తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. పాత కార్డుదారులు మీ-సేవకే వెళ్లాలి జన్మభూమి కార్యక్రమంలో (జేఏపీ) రేషన్ కార్డు మంజూరైన వారు తప్పుల సవరణ, మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి మాత్రమే వెళ్లాలి. గతంలో పంపిణీ చేసిన ఏఏఓ, డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ, టీఏపీ కార్డుదారులు తమ కార్డులో మార్పులుచేర్పుల కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. -
డప్పుకొట్టి.. మాటతప్పి..
ముగిసిన మూడో విడత జన్మభూమి సభలు నామమాత్రంగానైనా పరిష్కారం కాని సమస్యలు అధికార పార్టీ మద్దతుదారులకే రేషన్ కార్డులు 2 లక్షల వినతుల్లో అప్లోడ్ చేసింది 83,984 మాత్రమే సమస్యల పరిష్కారానికి చక్కని వేదికలు మూడో విడత జన్మభూమి-మా ఊరు గ్రామసభలు.. ప్రజలు ధైర్యంగా సమస్యలు చెప్పండి.. పరిష్కార మార్గాలను కనుక్కోండి.. అంటూ అధికారులు, నాయకులు ఊదరగొట్టేశారు. వీరి మాటలిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆశతో పేదలు పెద్ద సంఖ్యలో సభలకు తరలివెళ్లారు. కానీ వారికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. వీరి మొర ఆలకించేవారే కరువయ్యారు. అంతా ఆర్భాటం.. సొంత డబ్బాకే ప్రాధాన్యమిచ్చి సభలను ముగించేశారు. చిత్తూరు: గతంలో రెండు విడతలు నిర్వహించిన జన్మభూమి సభల్లో పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, ఇంటి స్థలాలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. జన్మభూమి కమిటీల ద్వారా రేషన్‌కార్డుల కోసం 1.42 లక్షల వినతులు వచ్చాయి. అర్హులైన వారు ఇంతకు రెట్టింపు వినతిపత్రాలు సమర్పించినట్లు సమాచారం. అయితే అధికారపార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు ససేమిరా అనడంతో అధికారులు వాటిని బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 1.02లక్షల కార్డులను మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా మొక్కుబడిగా వందల సంఖ్యలో రేషన్‌కార్డులను పంపిణీచేసి చేతులు దులుపుకుంది. సర్వర్, వెబ్సైట్ సమస్యలు, ఫొటోలు అందలేదనే సాకులు చూపి మిగిలిన కార్డులను పంపిణీ చేయకుండా చేతులు ఎత్తేసింది. సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీత ఈనెల 2న జన్మభూమి సభలు ప్రారంభంకాగా 11న (సోమవారం) ముగిశాయి. ఈ సభల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. నిరసనలు వ్యక్తంచేశారు. సమస్యలను పరిష్కరించనపుడు జన్మభూమి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి సమీప బంధువు రుణమాఫీ కాలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలిరోజు చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడులో అధికారపార్టీ నాయకులే మూడు గంటలు జన్మభూమిని అడ్డుకున్నారు. మూడో విడత 2లక్షలకు పైగా వినతులు మూడో విడత జన్మభూమిలో 2లక్షల పైచిలుకు వినతిపత్రాలు అందాయి. ఆదివారం సాయంత్రానికి 1.8లక్షల వినతిపత్రాలు అందగా, సోమవారం మరో 20వేల అర్జీలొచ్చాయి. అయితే ఇప్పటివరకు 83,984 వినతిపత్రాలు మీ-కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఇంకా 1.2 లక్షలకు పైగా వినతిపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందుకు మరో వారానికి పైగా గడువుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గత రెండు విడతల జన్మభూమిలో ఇచ్చిన లక్షలాది వినతిపత్రాలు పెండింగ్‌లో ఉండగా, తాజాగా అందజేసినవి మరో 2లక్షలకు పైగా తోడయ్యాయి. పాత వినతులనే పట్టించుకోని ప్రభుత్వం కొత్త వినతులను ఏమేరకు పరిష్కరిస్తుందో వేచి చూడాలి. -
నిరసనల భూమి
విశాఖపట్నం: సమస్యలు చెప్పేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు అడ్డుకొని మైకు లాక్కోవడంతో జీవీఎంసీ 18వ వార్డు పరిధిలోని చినవాల్తేరు ప్రాథమిక పాఠశాలలో జరిగిన జన్మభూమి గ్రామసభలో తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ నాయకుడు ప్రసాదుల భాగ్యానంద్ స్థానికంగా ఉన్న సమస్యల కోసం ప్రస్తావించేందుకు యత్నించగా, రేషన్ కార్డులు, చంద్రన్న కానుకల పంపిణీలు పూర్తయిన తర్వాత మాట్లాడేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో ఆగిపోయారు. పంపిణీలు పూర్తయిన తర్వాత పోతినమల్లయ్యపాలెం, సాగర్‌నగర్, ఆరిలోవ డిపోలల్లో కేటాయించడంతో లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారి జవాబు చెప్పక పోవడంతో టీడీపీ నాయకుడు సిహెచ్.బి.పట్టాభి ఆన్లైన్లో రేషన్ తీసుకోవచ్చును కదా అని సమాధాన్ని దాటవేశారు. మైక్‌లో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నించగా టీడీపీ నాయకులు మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు..ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన ఈ సభను ఆద్యంతం టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి, 8వ వార్డు మాజీ కార్పోరేటర్ పట్టాభి నిర్వహించడం పట్ల స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపట్టారు. బుచ్చెయ్యపేట మండలం ఆర్ శివరాంపురంలో జరిగిన జన్మభూమి సభలో గత జన్మభూముల్లో ఇచ్చిన దరఖాస్తులు పరిస్థతి ఏమిటో చెప్పాలంటూ సర్పంచ్ నమ్మి నీరజ, నాయకులు అప్పలరాజు అదికారులను నిలదీశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సర్పంచ్ తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేటలో కొత్త పంచాయితీ భవనం నిర్మించాలని, ప్రధాన రోడ్డును బాగు చేయాలని,అర్హత ఉన్న వారి పింఛన్లు మంజూరుచేయాలని సర్పంచ్ సుంకరి సత్యారావు, ఎంపీటీసీ సభ్యులు పాతాళ శ్రీను, సుంకరి భవాణి, ఆర్. భీమవరంలో ఎస్ఇజడ్కి మా భూములు తీసికోవద్దని రైతులు, మల్లాంలో అర్హత ఉన్నవారికి పలు సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయాలని సర్పంచ్ గొలగాని శ్రీను అధికారులను నిలదీశారు. చోడవరం మండలం దుడ్డుపాలెంలో జరిగిన జన్మభూమి సభలో కేంద్ర పౌరవినాయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు పాల్గొన్నారు. నాయకులు దత్తత తీసుకున్న గ్రామాలను పట్టించుకోకపోతే ప్రజలు క్షమించరని కేంద్రమంత్రి పక్కనే ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు చురక వేశారు. పలు గ్రామాల్లో జరిగిన సభల్లో కూడా ఇదే రీతిలో స్థానిక సమస్యలపై వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు అధికారులను నిలదీశారు. -
సంక్రాంతికి ఉచిత రేషన్ కార్డులు : సునీత
అనంతపురం : సంక్రాంతి సందర్భంగా ఉచితంగా రేషన్ కార్టులు పంపిణి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో పరిటాల సునీత మాట్లాడుతూ... కొత్తకార్డుల మంజూరు పేరుతో డబ్బులు వసూలు చేస్తే సహించమని అధికారులను ఆమె హెచ్చరించారు. సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సునీత స్పష్టం చేశారు. -
రేషన్‌కార్డులతో పరేషాన్
మంజూరైనా ప్రింటింగ్ కాని వైనం కొత్తకార్డులకూ వస్తువులు ఇస్తామంటూ ప్రభుత్వ ప్రకటన డీలర్ల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జారీచేసే రేషన్ కార్డులు ఒక ప్రహసనంగా మారింది. గతంలో తెల్లకార్డులు ఉండగా ప్రస్తుతం కొత్తగా ఇచ్చే కార్డుల రంగు మార్చేసి పచ్చకార్డులతో ప్రభుత్వం జారీచేస్తోంది. గతంలో జరిగిన జన్మభూమిలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా, వాటిని ఇప్పుడు మంజూరు చేస్తున్నారు. కార్డుల రంగు మార్చడంపై ప్రభుత్వం చూపించిన శ్రద్ధ పేదలకు కొత్తకార్డులు మంజూరు చేయడంలో చూపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. నగరంలో 22వేల కార్డులు... గత జన్మభూమిలో నగరంలో 28,480 మంది కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో సుమారు 19,500 పచ్చకార్డులు మంజూరయ్యాయి. ఇందులో డివిజన్-1లో 10,200 కార్డులు మంజూరు కాగా, డివిజన్-2 పరిధిలో 9,300 కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులను జన్మభూమిలో పేదలకు ఇస్తున్నారంటే తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వం సకాలంలో మంజూరు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల నగరంలో కేవలం 13000 కార్డులు ప్రింటిం గ్ కు వచ్చాయి. మిగిలిన 6,500 కార్డులు ఇం కా ప్రింటిం గ్‌కు నోచుకోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పరిస్థితి మరింత అయోమయంగా ఉంది. కార్డులు మంజూరైనట్లు జాబితాలు వచ్చినా కార్డులు రాకపోవడంతో ప్రజలకు సకాలంలో పచ్చకార్డులు అందచేయలేకపోతున్నారు. ప్రతి రోజూ జరిగే జన్మభూమి కార్యక్రమంలో కార్డులు మంజూరైన వారి పేర్లు చదివినా అందరికీ కార్డులు రాలేదని తరువాత ఇస్తామంటూ అధికారులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. కార్డు కోసం డీలర్ల చుట్టూ, సివిల్‌సప్లయీస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పేదలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆర్భాటం పేద ప్రజలందరికీ కార్డులు కాపోయినప్పటికీ కొత్త కార్డుదారులకు కూడా రేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కార్డులు రానివారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తమ పేరు లిస్టులో చదివారని, తమకు మాత్రం కార్డు ఇవ్వడం లేదని, డీలరు సూచన మేరకు కార్డు కోసం సివిల్ సప్లయీస్ కార్యాలయానికి వచ్చానని కృష్ణలంకకు చెందిన ఒక మహిళ సాక్షికి తెలిపింది. తప్పుల తడకలు కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులకు కుటుంబసభ్యులందరితో ఫొటోను, పేర్లు, వివరాలు ఇవ్వమని సూచించారు. అధికారులు కోరినట్లే కుటుంబసభ్యులందరితో కలిపిన ఫొటోలు ఇచ్చారు. ప్రస్తుతం అనేక కార్డులలో ఫొటోలో నలుగురు ఉంటే ఒకరిద్దరి పేర్లు మాత్రమే వస్తున్నాయని కార్డు దారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పేర్లు నమోదు కావడం లేదు. కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఫొటోలో నలుగురు ఉన్నట్లు చూపితే.. కార్డులో ఇద్దరి పేర్లు మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రేషన్ డిపో పరిధిలోనూ కనీసం నలుగురైదుగురికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సింగ్‌నగర్, పాయకాపురంలో ఫొటోలు లేకుండా కార్డులు వస్తున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఆధార్ నెంబర్లు సరిగా సరిపోల్చక పోవడం, ఆధార్ కార్డుల జిరాక్స్‌లు సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. -
మూడో రోజూ నిరసనల హోరు
అధికారులను నిలదీస్తున్న జనం పార్టీ కార్యక్రమాల్లా ‘తమ్ముళ్ల’ హడావుడి విశాఖపట్నం : వరసగా మూడో రోజు కూడా జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య కొనసాగింది. సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా ఎందుకొచ్చారంటూ ఆయా గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే నిలదీసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల సంగతి ఏంచేశారంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వారిని సముదాయించలేక అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. మరోవైపు అక్కడక్కడ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వీరితో స్వరం కలుపుతుండగా మరికొన్ని చోట్ల అన్నీ తామై పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. సోమవారం పాయకరావుపేట నియోజకవర్గం గుంటపల్లిలో టీడీపీ నాయకుడు గెడ్డం బుజ్జి నేతృత్వంలో సమస్యలు పరిష్కరించకుండా జన్మభూమి ఎందుకంటూ అధికారులను నిలదీశారు. జన్మభూమిని బహిష్కరించాలనుకున్నా జనం ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో విరమించుకున్నామని, సీఎం చంద్రబాబు దృష్టికి వాస్తవాలు తెలియాలని నిలదీశామని స్పష్టంచేశారు. కోటవురట్లలో జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలం గొటివాడలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నందున ఇసుక ర్యాంపుల వేలం వద్దని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మునగపాక మండలం నారాయడుపాలెంలో మరుగుదొడ్లు, ఇళ్లస్థలాలు మంజూరు చేయలేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. బుచ్చయ్యపేట మండలం కొండెంపూడిలో కార్డులు, పెన్షన్లు ఇచ్చాకే జన్మభూమి జరగనిస్తామని సర్పంచ్ సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదే మండలం గంటికొర్లాంలో సర్పంచ్‌ను కాదని, జన్మభూమి కమిటీల పెత్తనమేమిటని మండిపడ్డారు. రోలుగుంట మండలం కొమరవోలులో జాయింట్ కలెక్టర్ నివాస్‌ను గ్రామస్తులు, జెడ్పీ మాజీ చైర్మన్ రామ్మూర్తినాయుడు సమస్యల పరిష్కరించకపోవడంపై నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం తెనుగుబూడిలో జెడ్పీ చైర్పర్సన్ భవానీ భర్త లాలం భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలను ఎందుకొచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. జన్మభూమి వేదికపై టీడీపీ నాయకులు పార్టీ కార్యక్రమంలా జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణను సన్మానించారు. ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలో జన్మభూమి అధికారులను గిరిజనులు, వైఎస్సార్సీపీ నాయకులు నాలుగ్గంటల పాటు రోడ్డుపైనే నిలిపివేశారు. సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇచ్చేదాకా కదలనీయలేదు. దీంతో సభ జరగకుండానే అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. అరకు మండలం చొంపిలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్న జన్మభూమి సభ రసాభాసగా మారింది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, గతంలో గవర్నర్ చొంపిని ఆదర్శ గ్రామంగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీ నెరవేర్చలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంధ్యారాణి చంద్రబాబుకు ఇదొక్కటే పనా? ఇంకేమీ లేవా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో గ్రామస్తులు విరుచుకుపడ్డారు. అక్కడ గ్రామ సర్పంచ్ లక్ష్మిని పక్కనబెట్టి ఎంపీడీవో సభకు అధ్యక్షత వహించారు. అదే మండలం బొండాం సభలోనూ బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేదాకా సభ జరగనివ్వబోమని గిరిజనులు పట్టుబట్టడంతో చివరకు తీర్మానం చేశారు. భీమిలి నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరచూరి భాస్కరరావు అన్నీతానై వ్యవహరించారు. ప్రజల ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించారు. హామీలిచ్చారు. ఇదే నియోజకవర్గంలోని మధురవాడ స్వతంత్రనగర్‌లో ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడానికి మంత్రి గంటా ఆసక్తి చూపలేదంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా నినాదాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందపురం మండలం వేములవలసలో 2011లో మంజూరైన ఇళ్లకు ఎందుకు మోక్షం కలిగించలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. -
‘చిత్ర’మైన విస్మరణ
లబ్ధిదారుల ఫొటోలు లేకుండానే రేషన్‌కార్డులు జిల్లాలో 1.30 లక్షల కార్డులది ఇదే పరిస్థితి 2 నుంచి మూడోవిడత జన్మభూమి-మాఊరు పేదల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం నిరాశే..! ఆత్రేయపురం : ‘తాళం వేసితి.. గొళ్లెం మరిచితి..’ అని తన తింగరితనాన్ని ప్రదర్శిస్తుంది ‘యమగోల’ సినిమాలో చిత్రగుప్తుని పాత్ర. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగం నిర్వాకం ఆ బాపతుగానే ఉంది. కొత్త రేషన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పేదలకు కార్డులైతే వచ్చారుు కానీ.. వాటిపై వారి ఫొటోలు లేవు. దీంతో ఇటు కార్డుదారులు నిట్టూరుస్తుండగా.. వాటిని పంపిణీ చేసే గడువు దగ్గర పడడంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెండోవిడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో వాటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అర్హులకు మంజూరైన కార్డులు మండల కార్యాలయూలకు వచ్చినా అందులో ఫొటోలు మాత్రం మాయమయ్యాయి. ఆత్రేయపురం మండలంలో సుమారు 1,700 రేషన్ కార్డులు లబ్ధిదారుల ఫొటోలు లేకుండానే జిల్లా కార్యాలయం నుంచి వచ్చారుు. జిల్లాలోని 64 మండలాల్లో సుమారు 1.30 లక్షల కార్డులు ఫొటోల్లేకుండానే వచ్చినట్టు అంచనా. రేషన్ కార్డులు రూపొందించే పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన జిల్లా అధికారులు ఆ ప్రక్రియను ఓరకంటనైనా చూడలేదనడానికి ఫొటోలు లేకుండానే పంపిణీ చేయండంటూ పంపిన రేషన్‌కార్డులే సాక్ష్యం. రెండోరోజుల్లో అయ్యేపనేనా..! ఇప్పుడు వచ్చిన కార్డులను జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే 3వ విడత జన్మభూమి - మాఊరులో పంపిణీ చేయూల్సి ఉండగా ఫొటోలు లేకుండా వచ్చిన కార్డులను చూసి స్థానిక అధికారులు అవాక్కయ్యూరు. విషయం తెలిసిన కార్డుదారులు ఇన్నాళ్ల ఎదురుచూపునకు తెరపడుతుందనుకునే వేళ ఇలాంటి అవాంతరం వచ్చిందని నిట్టూరుస్తున్నారు. ఫొటోలు లేని కార్డులను వెన క్కి పంపించి, వాటిలో ఫొటోలు పొందుపరిచే ప్రక్రియను ఆదరాబాదరా చేరుుంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుల ఫొటోలతో కూడిన సీడీలను జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారు. అరుుతే.. కేవలం మరో రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల కార్డుల్లో ఫొటోలను పొందుపరచడం సాధ్యం కాదని ప్రభుత్వవర్గాలే అంటున్నారుు. ప్రై వేట్ సంస్థల పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, లోపాలుంటే సరి చేరుుం చాల్సిన అధికారుల అలసత్వం ఫలితమే ఫొటోలు లేని కార్డులన్నది ని స్సందేహం. సాంకేతిక సమస్య వల్ల ఫొటోల్లేని కార్డులొచ్చాయని అధికారు లంటున్నా మండల కార్యాలయూలకు చేరే వరకూ పొరపాటును గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఏదేమైనా..3వ విడత జన్మభూమి-మాఊరు లో ఈ విషయంపై జనం నుంచి తీవ్ర నిరసన ఎదురయ్యే అవకాశం ఉంది. -
ఉల్లి కోసం ఎదురుచూపులు
సారవకోట(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూ.20కే కిలో ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళలు బారులు తీరారు. రేషన్ కార్డులు పట్టుకుని, ఎండలోనే గంటలకొద్దీ ఎదురు చూశారు. గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆగడాలపై ఆగ్రహం
సాక్షి, గుంటూరు : ‘ఎమ్మెల్యే గారూ.. మన పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి.. ఇసుక ధరలు ఆకాశాన్నంటాయి.. మన పార్టీ నేతలే ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలకు దిగుతున్నట్లు చెబుతున్నారు.. దీన్ని అరికట్టే బాధ్యత మీకు లేదా..?’ అంటూ తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను గ్రామస్తులు నిలదీశారు. రాజధాని ప్రాంతంలో మొదటగా రుణమాఫీ చేయిస్తానని, రేషన్ కార్డులు, ఫింఛన్లు ఇప్పిస్తానని హామీలైతే ఇచ్చారు.. ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదు.. అంటూ సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేశారు. వివ రాలివి.. మందడం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించేందుకు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం తుళ్ళూరు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వెళ్లారు. టీడీపీలోని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.వెయ్యి ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3,500 పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందాకు పాల్పడే నేతలెవరో తేల్చి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యేపై గొడవకు దిగారు. మాఫీ ఊసే లేదు.. రాజధాని గ్రామాల్లో రైతులకు రుణమాఫీ జరిగేలా చూస్తామని, భూమిలేని నిరుపేదలకు ఫింఛన్లు ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని, ఇంత వరకూ అతీగతీ లేవని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఒక్కో గ్రామంలో వెయ్యి మంది భూమి లేని నిరుపేదలు ఉండగా రెండు, మూడు వందల మందికి ఫింఛన్లు ఇచ్చి అంతా ఇచ్చామని చెప్పుకోవడం ఏమిటంటూ నిలదీశారు. రెండు, మూడు రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ చెప్పి నెల దాటుతున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఏ విషయం తేల్చే వరకూ వినాయక విగ్రహాల వద్దకు వెళ్లనీయమంటూ ధ్వజమెత్తారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యేని నిలదీస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను నెట్టివేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారిని జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు నివాసానికి పిలిపించుకుని సర్ధిచెప్పే ప్రయత్నాలు చేశారు. టీడీపీకి బలం ఉన్న తుళ్ళూరు మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుండటంపై ఆపార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారు. -
పరేషన్
చిట్టినగర్ : వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని మీకు రేషన్ నిలిపేశారా..?, ఊళ్లో లేకపోవడంతో మీరు సకాలంలో రేషన్ తెచ్చుకోలేకపోయారా..?, అనారోగ్యం బారిన పడి నడిచివెళ్లే పరిస్థితి లేక ఆ నెల సరకులు వదులుకున్నారా? అయితే, మీ రేషన్‌కార్డుకు గ్రహణం పట్టినట్టే. పేదల సంక్షేమమే చంద్రన్న లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్తవారికి రేషన్‌కార్డులు ఇచ్చేందుకు.. ఎప్పటి నుంచో రేషన్ తీసుకుంటున్న వారి కార్డులను రద్దుచేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా లక్ష కార్డుల రద్దుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటుండగా, నగరంలో 15వేల కార్డులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న 255 రేషన్ డిపోల్లో కార్డుల రద్దు కోసం పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సర్వేకు సంబంధించిన పలు పత్రాలను డీలర్లకు అందజేశారు. ప్రతి రేషన్ డిపో నుంచి కనీసం 80 నుంచి 150 వరకూ కార్డులు రద్దు చేయనున్నారు. రద్దుచేసే వాటిని ఇటీవల కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రద్దుకు ప్రతిపాదించిన అంశాలివే.. డీలర్లకు ఇచ్చిన సర్వే పత్రంలో 18 రకాల కారణాలు తెలపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నెలలో సరకులు తీసుకోని వారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరణించిన వారితో పాటు ఆధార్‌కార్డు నమోదు సమస్య, మంచంపై అనారోగ్యంతో ఉన్నవారు, యూఐడీ కార్డులు, వేలిముద్రలు పడని వారితో పాటు ఆర్థికంగా కాస్త ఉన్నవారి వివరాలను ఈనెల 20వ తేదీ కల్లా అందజేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీలర్లు ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించడంతో పాటు వాటిని అందజేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేపై ప్రభుత్వం ఎంత కచ్చితంగా ఉందంటే సర్వే చేయని డీలర్లకు సరకులు నిలిపివేసేందుకు సైతం వెనుకంజ వేయడం లేదు. ఇంటి పన్నుతో లింక్ గత ప్రభుత్వం ఎవరికి పడితే వారికి తెల్లరేషన్ కార్డులు మంజూరు చేసిందని భావిస్తున్న ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తెల్లరేషన్ కార్డును కార్డుదారుడి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. మరోవైపు నగరంలో సొంత ఇళ్లు ఉన్నవారి ఇంటి పన్నుకు ఆధార్‌కార్డు అనుసంధానం పూర్తి కా గా, ఈ రెండు వివరాలతో బేరీజు వేసుకుని అధికంగా ఇంటి పన్ను చెల్లిస్తున్న వారి కార్డు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో రేషన్ షాపునకు వంద నగరంలోని 255 రేషన్ డిపోల్లో కనీసం 15వేల కార్డులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో రేషన్ షాపునకు కనీసం 600 పైబడి కార్డులకు సరకుల పంపిణీ జరుగుతోంది. అయితే, ఒక్కో షాపులో నెలకు కనీసం 50 నుంచి 80 వరకు వేలిముద్రలు సరిగ్గా పడకనో, సరకులు ఇచ్చే సమయానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారో ఉంటున్నారు. రెండు నెలలు వరుసగా సరకులు తీసుకోకుంటే.. ఇక ఆ రేషన్ కార్డుకు నూకలు చెల్లినట్టే. ఇక మంచంపై అనారోగ్యంతో ఉన్నవారితో పాటు మరణించినవారు, పింక్ కార్డును తెల్లకార్డుగా మార్చుకున్న వారు మరో 20 మంది ఉంటారు. ఇలా సరాసరిన ప్రతి డిపో నుంచి కనీసం వంద కార్డులను రద్దుచేస్తే నగరవ్యాప్తంగా15వేల పైబడే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మా పరిస్థితి ఏం కానూ.. కూలీ పనులకు ఇతర నగరాలకు వెళ్తుంటాం. ఇలా కార్డులు రద్దంటే మాలాంటి వారి పరిస్థితి ఏం కాను. నా బిడ్డ నడవలేడు. వాడికి సరకులు ఇవ్వడం లేదు. అసలు డిపోలో ఇచ్చేవే అరకొర. కార్డులు తీసేస్తామంటే ఎలా.. - కుంచం లక్ష్మి, కూలీ, వన్‌టౌన్ కార్డు పోతుందనే వస్తున్నా.. వయసు మీద పడటంతో నడిచి రాలేను. రెండు నెలలు సరకులు తీసుకోకుంటే కార్డు పోతుందనే భయంతో కళ్లు కనిపించకపోయినా.. చుట్టుపక్కల వారు, నా బిడ్డల సాయంతో డిపోకు వెళ్తున్నా. మాలాంటి వారిపై ఇది ప్రభుత్వ కుట్ర. - కొరగంజి రామయమ్మ, నడవలేని వృద్ధురాలు వేలిముద్రల కోసం పదిసార్లు వస్తా.. నా చేతి వేళ్లు సక్రమంగా ఉండవు. వేలిముద్రలు పడితేనే సరకులు అంటున్నారు. నెలలో ఒక్కసారి ఇచ్చే సరుకుల కోసం పనులు మానుకుని పదిసార్లు అయినా వస్తాను. కార్డు ఉంటే ఏదైనా ఉపయోగం ఉంటుందనే కదా. మాలాంటి వారి కార్డులు సాకులు చెప్పి తీసేయకండి. - శాన నరసింహారావు, కుష్టు వ్యాధిగ్రస్తుడు -
బోగస్ కార్డులు ఏరివేస్తాం: పరిటాల సునీత
అనంతపురం: ఈ నెలాఖరులోగా 13 జిల్లాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులను ఏరివేస్తామన్నారు. 8 లక్షల రేషన్ కార్డులు ఇంకా ఆధార్‌తో అనుసంధానం కాలేదని చెప్పారు. కొత్తగా 12 లక్షల కార్డులు ఇస్తామని తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లో 20 లక్షల దీపం కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అమరావతిలో రూ.2 కోట్లతో పౌరసరఫరా భవనం నిర్మిస్తామని తెలిపారు. -
విశాఖపై మమకారం
అభివృద్ధి కోసం తాపత్రయం ప్రగతికి అర్థం.. వైఎస్ హయాం సాక్షి, విశాఖపట్నం: అరకొరగా రేషన్ కార్డులు.. అదృష్టవంతులకే పింఛన్లు..ఏ కొందరికో ఇళ్లు..ఇదంతా 2004కు ముందు దుస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు వంటివి మంజూరయ్యాయి. ఆయన హయాంలో విశాఖపట్నం జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ దుర్మరణం చెంది ఆరేళ్లవుతున్న సందర్భంగా ఆయన హయాంలో విశాఖలో చేపట్టిన వివిధ పనులు, పథకాలపై ఈ కథనం.. వైఎస్ తన ఐదేళ్ల పదవీ కాలంలో జలయజ్ఞం పథకం కింద విశాఖ జిల్లాలో భారీ గా నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ పనులకు రూ. 42 కోట్లు కేటాయించారు. తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ. 55 కోట్లు, తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ. 18 కోట్లు వెచ్చించారు. ఇలా వివిధ సాగునీటి ప్రాజెక్టులతో వేలాది ఎకరాల కు అదనపు ఆయకట్టు పెంచారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. అంతేకాదు.. జిల్లాలో భారీగా గృహ నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో మొత్తం 3,20,621 ఇళ్లు నిర్మించారు. పెద్దసంఖ్యలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత అభయహస్తం తదితర పింఛన్లు ఇచ్చారు. ఇలా మొత్తం 3,20,123 మందికి లబ్ది చేకూర్చారు. ఇందుకోసం ఏడాదికి మొత్తం రూ. 8.24 కోట్లు ఖర్చు చేశారు. ఇక నగరం విషయానికొస్తే.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విశాఖకు అధిక నిధులు వచ్చేలా కృషి చేశారు. ఈ పథకంలో విశాఖ నగరానికి రూ.2200 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో విలీన గ్రామాలను కలుపుతూ వేసిన బీఆర్టీఎస్ రోడ్లకు రూ.450 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.250 కోట్లు, 15 వేల జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు రూ.450 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.23 కోట్లతో ఎండాడ వద్ద మంచినీటి పథకం, విశాఖ నగర దాహార్తిని తీర్చే తాటిపూడి పైప్‌లైన్‌కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్‌ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. అలాగే 1130 పడకలు, 21 సూపర్‌స్పెషాలిటీ బ్లాకులతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక విమ్స్ ఆస్పత్రికి రూ. 250 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకూ రూ.87 కోట్లు వెచ్చించి విశాఖలోనే తొలి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. విశాఖ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణకు రూ.100 కోట్లు, విమానాశ్రయం ముంపుబారిన పడకుండా కాలువ నిర్మాణానికి రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రస్తుత పరిస్థితి.. : వై.ఎస్. మరణాంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. జలయజ్ఞం ప్రాజెక్టులపై క్షక్ష కట్టింది. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చేసి పక్కన పెట్టేసింది. విమ్స్ ఆస్పత్రి అతీగతీ లేకుండా అక్కరకు రాకుండా నిరుపయోగంగా ఉంది. పైగా 1130 పడకలను 250కి కుదించాలని చూస్తోంది. అర్హులైన లబ్దిదార్లు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్కారు రకరకాల నిబంధనలతో సంక్షేమ పథకాలకు వీరిని దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాటి వైఎస్ హాయాంకు, నేటీ చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వర్థంతి సందర్భంగా విశాఖ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
ప‘రేషన్’
అనంతపురం అర్బన్ : జిల్లాలో రేషన్ కోసం పేదలు ఇబ్బంది పడుతున్నారు. కార్డులు రద్దు చేయడంతో కొందరికి.. కార్డు ఉన్నా వేలిముద్రలు సరిపోలడం లేదంటూ మరికొందరికి, కొత్త కార్డులు మంజూరు కాక ఇంకొందరికి రేషన్ అంద డం లేదు. ఈ-పాస్ యంత్రాలలో వేలిముద్రలు సరిపోలక రేషన్ అందని వారు జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉంటారని అధికారిక అంచనా. వీరు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. మండల స్థాయి అధికారుల ముందు వెళ్లబోసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది. దీంతో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. కార్డులు రద్దయిన పేదల పరిస్థితి మరింత దయనీయం. రోజు వారీ కూలీనాలి చేసుకుని బతుకులీడ్చే వీరికి రేషన్ సరుకులు కొంతవరకు ఆకలి బాధను తీర్చేవి. ఇప్పుడు అవి కూడా అందకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి. మరోవైపు కొత్తగా తెల్లకార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న పేదల సంఖ్య పెరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం రాకముందు జిల్లాలో 11,14,477 తెల్ల కార్డులు ఉండేవి. అనర్హుల ఏరివేతంటూ అధికారులు 94,014 కార్డులు రద్దు చేశారు. కొత్తగా కార్డుల కోసం 17,104 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,449 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 10,27,912 తెల్లకార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు సంబంధించి 40,15,694 మంది సభ్యులుండగా.. ఆధార్ అనుసంధానం 31,79,946 మందికి పూర్తయ్యింది. అనుసంధానం కాని వారు 89,525 మంది, పెండింగ్‌లో ఉన్నవారు 51,933, తిరస్కరించిన వారు 6,94,290 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,934 చౌక దుకాణాలున్నాయి. ప్రస్తుతం 1,193 దుకాణాల్లో ఈ -పాస్ విధానం అమలు చేస్తున్నారు. వీటిలో వేలిముద్రలు సరిపోలడం లేదంటూ దాదాపు 20 వేల మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు. అదే 2,934 దుకాణాల్లోనూ ఈ- పాస్ అమలు చేస్తే ఇలాంటి వారి సంఖ్య 50 వేలకు పైగానే చేరుకుంటుంది. వృద్ధుల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేక వేలిముద్రలు సరిగా పడవు. ప్రధానంగా ఇలాంటి వారే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఏ దిక్కూ లేని వారు అన్నపూర్ణ కార్డు ద్వారా వచ్చే బియ్యంతో బతుకీడుస్తున్నారు. ఇలాంటి వారికి బియ్యం అందకపోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు కోటా కింద 16,292.59 టన్నుల బియ్యం కేటాయించారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా 2,743 టన్నులు మిగులు చూపించారు. వేలిముద్రలు సరిపోలక, ఆధార్ లింక్ కాకపోవడం వల్లే ఈ బియ్యం పంపిణీ కాలేదని పౌర సరఫరాల శాఖ సిబ్బందే చెబుతుండడం గమనార్హం. -
పరేషాన్
- రేషన్‌కార్డుల కోసం అర్జీదారుల ఎదురుచూపులు - ఆధార్ పేరుతో 2 లక్షల మందికి ఎగనామం - 1.24 లక్షల మందికిపైనే మొత్తం దరఖాస్తులు - వెబ్‌లో అప్లోడ్ చేసింది 96 వేలేరేషన్కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. - మార్పులకు సైతం తప్పని తిప్పలు ఒంగోలు: రేషన్‌కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 54 వేల మంది దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు 53 వేలకుపైగా ఉన్న కార్డులను సైతం తొలగించేశారు. జన్మభూమి కమిటీల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడు కార్డులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటినా 1.24 లక్షల మంది అర్జీదారులకు కార్డులు మంజూరు చేయలేదు. ఏడాదిలోనే ఊహించని మార్పు: జిల్లాలో ఎన్నికలకు ముందు 8,89,593 బీపీఎల్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉండేవి. ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో 20,715 రేషన్‌కార్డుదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అవి కాకుండా ఎన్నికలకు ముందుగా మరో 33,772 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మొత్తంగా వాటి సంఖ్య 54,487. కానీ తెలుగుదేశం పార్టీకి అధికార పగ్గాలు చేతికి రావడంతోనే వాటన్నింటినీ పక్కన పెట్టేసింది. 8,89,593 కార్డుల్లో దాదాపు 26 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ప్రారంభించి 2 లక్షల మందికి తిలోదకాలు ఇచ్చింది. అంతే కాకుండా 20 వేల కార్డులను కూడా ఆధార్ అనుసంధానించలేదంటూ తిరస్కరించారు. ప్రస్తుతం ఉన్న కార్డులు కేవలం 8,36,061 మాత్రమే. వీటిలో 23 లక్షల మంది సభ్యులకే ఆధార్ అనుసంధానమైంది. ఇంకా దాదాపు 70 వేల మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. మిగులుపైనే దృష్టి: ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి వాటిని ఎలా అమలు చేయాలో అర్థంకాని టీడీపీ సర్కారు ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను ఏదో ఒకవిధంగా సంక్షోభంలోకి నెట్టేసేందుకు పడరాని పాట్లు పడుతోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సైతం రేషన్ సరుకులకు కోత పడింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటుచేసి దందాను అరికడుతున్నామని ప్రకటించారు. ఈ-పాస్ ద్వారా ఇప్పటికే నెలకు రూ.75 లక్షలు మిగులుతుందంటూ ప్రకటిస్తున్న అధికారులు కనీసం ఆ మొత్తాన్ని వెచ్చించి అయినా రేషన్ దుకాణాలలో సరుకులను పెంచి పేద కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు చర్యలు చేపట్టకపోతుండడం గమనార్హం. 1.24 లక్షల మందికి తిప్పలు: జిల్లాలో జన్మభూమి కమిటీల ద్వారా 1,24,713 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని భంగపడిన వారు కూడా ఉన్నారు. రెండోసారి అయినా దరఖాస్తు చేసుకుంటే కార్డు వస్తుందనుకున్న వారి ఆశలు అడియాసలుగానే ఉండిపోయాయి. అయితే వీరిలో కూడా ఇప్పటి వరకు కేవలం 96,134 కార్డులను మాత్రమే తహశీల్దార్లు వెబ్‌లో అప్లోడ్ చేశారు. మిగిలిన అర్జీలకు జన్మభూమి కమిటీల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో దాదాపు 28,579 దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు రావనే చెప్పవచ్చు. డీలర్లపై దయ...వృద్ధులపై నిర్దయ రేషన్ డీలర్లను ప్రభుత్వం దయతలిచింది. రేషన్ డీలర్, అతని కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా అతనికి సంబంధించిన వారెవరైనా వేలిముద్రలు ఈపాస్ మెషీన్లో అనుసంధానం చేసే అవకాశం కల్పించింది. దీనివల్ల బినామీలు సైతం తమ వేలిముద్రలను పొందుపరుచుకున్నారు. కానీ 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలు వికలాంగులుగా ఉన్న కుటుంబాలలో రేషన్ తీసుకోవాలంటే వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈపాస్ మెషీన్లో వారి వేలిముద్రలు తప్పనిసరి కావడంతో వయోభారంతో వారు నానా తిప్పలు పడుతున్నారు. గతంలో ఎవరో ఒకరు రేషన్ తీసుకువచ్చి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో చాలామంది రేషన్ తీసుకోవడానికి సైతం వెళ్లలేక పోతున్నారు. కనీసం 60 ఏళ్ల వయస్సు దాటిన వారి పట్ల, వికలాంగుల పట్ల కనికరం చూపి వారి అవస్థలకు స్వస్తి చెప్పాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్పులకు సైతం తిప్పలే ఇక రేషన్ కార్డుల సంగతి అలా ఉంచి కనీసం ఉన్న కార్డులలో మార్పులకు సైతం వెబ్సైట్ అంగీకరించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వెబ్సైట్లో మార్పులకు అవకాశం లేకుండా పౌరసరఫరాలశాఖ కమిషన్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. - ఒక ప్రాంతంలోని వ్యక్తి మరో ప్రాంతానికి బదిలీ అయితే చిరునామా మార్చుకోవచ్చు. కానీ వెబ్సైట్ అందుకు అంగీకరించడం లేదు. - కార్డు పొరపాటున పోతే తిరిగి ఆ కార్డు పొందడానికి సైతం వెబ్సైట్ అంగీకరించడం లేదు. గతంలో డూప్లికేట్ కార్డులను ఈ-సేవ, మీ-సేవల ద్వారా పొందే సౌకర్యం ఉండేది. - కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను కార్డుల్లో నమోదు చేయించాలంటే అందుకు వెబ్ ఆప్షన్ అంగీకరించని పరిస్థితి. ఆధార్‌లో తప్పులు దొర్లినందువల్ల వాటిని చాలామంది ఎడిట్ చేయించుకున్నారు. అయితే వారివి గానీ, కొత్తగా దిగిన వారి వివరాలుగానీ ప్రభుత్వ వెబ్సైట్లలో ఉండకపోతుండడంతో ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ ఫలాలను అందుకోలేని పరిస్థితి. - మండల కార్యాలయాల్లో ఆధార్ సీడింగ్ జరగకపోతుండడంతో చాలామంది ఆధార్‌నమోదు చేయించుకోలేకపోతున్నారు. అయితే పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం ఆధార్ సీడింగ్ జరుగుతుందని, అక్కడ చేయకపోతే జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయానికి వస్తే ఫీడ్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. -
నిరీక్షణ
సాక్షి, కడప : జిల్లాలో సుమారు 1747 చౌక దుకాణాల పరిధిలో 7,32,852 కార్డులు ఉండగా.. ఆధార్ సీడింగ్ పేరుతో దాదాపు 40వేల రేషన్ కార్డుదారులను అనర్హులుగా గుర్తించి తొలగించారు. ఇందులో కొన్ని కుటుంబాలకు సంబంధించి వేరే కార్డులో పేర్లు ఉన్నాయని.. మరికొంతమంది ఇళ్లలో లేకుండా ఉన్నారని సాకు చూపి తొలగించారు. ఆధార్ సీడింగ్ చేయకమునుపు 7,32,852 రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం ఆధార్ సీడింగ్ తర్వాత 6,98,982 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 40వేల కుటుంబాల వారు ఆధార్ సీడింగ్ పేరుతో కార్డులు కోల్పోవాల్సి వచ్చింది. లక్ష కుటుంబాలు.. కార్డుల కోసం ఎదురుచూపు జిల్లాలో సుమారు లక్ష కుటుంబాల వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. 2005-06 ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా.. కార్డులను వెంటనే అందించాలని ఆదేశించడంతో అప్పట్లో కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరయ్యేవి. ఆయన మరణానంతరం కిరణ్ కుమార్‌రెడ్డి పరిపాలనలో కూడా రచ్చబండ పేరుతో ఆర్ఏపీ కార్డులు రెండు సార్లు అందించారు. అయితే ప్రస్తుతం టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా మంజూరు కాలేదు. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను పొందుపరిచారు. ఇలా ఆన్లైన్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలే దాదాపు లక్ష వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూపులే సరిపోతున్నాయి తప్ప కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూపన్లతోనే.. జిల్లాలో ఇప్పటికీ కూపన్లతోనే రేషన్ తీసుకుంటూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సారి రచ్చబండ పథకం కింద ఆర్ఏపీ పేరుతో కార్డులు ఇవ్వగా.. తర్వాత కార్డులు ఇవ్వకుండా టెంపరరీ కార్డుల పేరుతో కూపన్లు ఇచ్చారు. అయితే ఈ కూపన్లు ఏడాదికో.. ఆరునెలలకో తహశీల్దార్ కార్యాలయంలో తెచ్చుకొని నెలనెలా రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. 4 నెలలుగా సరుకులు అందడంలేదు.. నా పేరు పాలగిరి చంద్రమోహన్. వేంపల్లెలోని 8వ నెంబరు రేషన్ షాపు నుంచి సరుకులు తీసుకుంటున్నా. ఆధార్ కార్డు నెంబరు సరిగా ఉన్నా.. 4నెలలుగా సరుకులు మంజూరు కాలేదు. అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. నిరుపేద కుటుంబం నాది. 4నెలలుగా రేషన్ సరుకులు రాకపోతే ఎలా బతకాలి. - పాలగిరి చంద్రమోహన్(గరుగు వీధి), వేంపల్లె పేదవాడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.. మూడేళ్లుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నా. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే రాలేదంటున్నారు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకోవాలి. పేద వాడి గురించి పట్టించుకొనేవారే కరువయ్యారు. - మమత(భజన మందిరంవీధి), పులివెందుల 5ఏళ్లుగా కొత్త కార్డు కోసం ఎదురుచూస్తున్నా.. నా పేరు మల్లేశ్వరి.. నేను పులివెందులలోని రెడ్డి వారి వీధిలో నివాసముంటున్నా. నా భర్త జగన్ పులివెందులలోనే మెకానిక్ పనిచేస్తున్నాడు. రేషన్ కార్డు కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేస్తూనే ఉన్నా. ఐదేళ్లయినా ఇంతవరకు కార్డు రాలేదు. - మల్లేశ్వరి(రెడ్డివారివీధి), పులివెందుల -
అర్హుల రేషన్‌కార్డులకు ఎసరు
నెల్లూరు(రెవెన్యూ) : దగదర్తి మండలానికి చెందిన రమణయ్య వ్యవసాయ కూలీ. ముగ్గురు పిల్లలు. కూలి చేసుకుంటూ రేషన్‌షాపులో వచ్చే బియ్యంతో ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆధార్ సీడింగ్ పేరుతో రమణయ్య రేషన్‌కార్డును తొలగించారు. పొదలకూరుకు చెందిన పెంచలయ్య ఎస్టీ. భార్య ముగ్గురు పిల్లలున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను గ్రామంలో లేడండూ రేషన్‌కార్డు తొలగించారు. ఇలా జిల్లాలో అనేకమంది ఉన్నారు. రేషన్‌కార్డులు కోల్పోయిన బాధితులు పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితంలేదు. ఇప్పటి వరకు వారి కార్డులను పునరుద్ధరించలేదు. ఆధార్ సీడింగ్‌కు ముందు 8.56 లక్షల కార్డులు జిల్లాలో ఆధార్ సీడింగ్‌కు ముందు 8.56 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి కందిపప్పు పంపిణీ చేసే అవకాశాలు కన్పించడంలేదు. ప్రస్తుతం 8.14 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఆధార్ సీడింగ్ పేరుతో వేల సంఖ్యలో కార్డులను తొలగించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టడంతో మరొక పర్యాయం ఆధార్ సీడింగ్ చేపట్టి వందల సంఖ్యలో కార్డులను పునరుద్ధరించారు. జిల్లాలో సుమారు 42 వేల మంది రేషన్‌కార్డులు కోల్పోయి ఇబ్బందులుపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అధికారపార్టీకి ఓటు వేయలేదనే కక్షతో రేషన్‌కార్డులు తొలగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పథకాల అమలుకు ఆధార్ సీడింగ్ అనుసంధానం చేశారు. గత ఏడాది రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి కమిటీలు సూచించిన వారి కార్డులు ఉంచి అర్హులైన లబ్ధిదారుల కార్డులు తొలగించారనే ఆరోపణలున్నాయి. ఆధార్ కార్డుల కాపీలు అధికారులకు ఇచ్చినా ఇంత వరకు వారి రేషన్‌కార్డులను పునరుద్ధరించలేదు. మూడంతస్తుల భవనం ఉన్న వ్యక్తికీ కార్డు నెల్లూరు ఏసీ నగర్లో మూడంతస్తుల భవనం ఉన్న ఓ వ్యక్తికి రేషన్‌కార్డు మంజూరు చేశారు. నెల్లూరు రామ్మూర్తి నగర్‌కు చెందిన ఓ వ్యక్తికు రెండు భవనాలు ఉన్నాయి. ఆయనకూ రేషన్‌కార్డు మంజూరు చేశారు. అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. రేషన్‌కార్డులు కోల్పోయిన వారు పలువు జిల్లా అధికారుల వద్దకు వచ్చినా ఫిర్యాదులును వారు తిరిగి మండల స్థాయి అధికారులకు పంపుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే మండల స్థాయి అధికారులు అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారు. ఆధార్ సీడింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్డులు కోల్పోయిన బాధితుల నుంచి ఆధార్ కార్డులు స్వీకరించారు. స్వీకరించిన వాటిని ఆన్లైన్లో అప్డేట్ చేశారేకానీ కార్డులు పునరుద్ధరించలేదనే విమర్శలున్నాయి. జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం 65,800 మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. జన్మభూమి సభలు, మండల కార్యాలయాలు, కలెక్టరేట్లో రేషన్‌కార్డుల కోసం లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హత ఉన్నవి 65,800గా గుర్తించారు. అర్హుల పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కనికరిస్తే కొత్త రేషన్‌కార్డులు మంజూరవుతాయి. ప్రభుత్వం అనుమతిస్తే కొత్త రేషన్‌కార్డులు : కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 65,800 అర్జీలను అర్హులకు సంబంధించినవిగా గుర్తించాం. అర్హుల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం. - టి.ధర్మారెడ్డి, డీఎస్ఓ -
పెండింగ్
రేషన్ కార్డుల కోసం 1.40 లక్షల మంది దరఖాస్తు 4,630 కార్డుల రద్దు ఆధార్ లింక్ లేదని 5,48,020 మందికి రేషన్ కట్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డులు 11,30,359 రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొత్త కార్డుల మంజూరు మాట అటుంచి పాత కార్డుల్లో కొన్నింటినిరద్దు చేశారు. ఆధార్ అనుసంధానం లేదంటూ కొందరు లబ్ధిదారులకు సరకుల సరఫరా నిలిపివేశారు. కొత్త కార్డులకోసం 1.43 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిచిపోయింది. ఉన్నవాటిలోనే 4,630 కార్డులను తొలగించారు. జిల్లాలో గతంలో 11,34,989 కార్డులు ఉండేవి. వీటిలో 10,66,897 తెల్లకార్డులు, 67,594 ఏఏవై కార్డులు, అన్నపూర్ణ కార్డులు 498 ఉండేవి. ఈ కార్డుల ద్వారా 37,43,749 మంది కుటుంబ సభ్యులు (యూనిట్స్) లబ్ధిపొందేవారు. రేషన్‌కార్డులోని పేర్లకు ఆధార్ అనుసంధానం చేయటంతో 31,95,729 మందికి సంబంధించిన ఆధార్ వివరాలను సేకరించి నమోదు చేశారు. మిగిలిన 5,48,020 మందికి ఆధార్ అనుసంధానం జరగకపోవటంతో వారికి సరకుల పంపిణీ నిలిపివేశారు. పెండింగ్‌లోనే 1.40 లక్షల దరఖాస్తులు : 2014 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల మంది రేషన్‌కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను తీసుకున్న అధికారులు ఎప్పుడు రేషన్‌కార్డులు మంజూరు చేసేదీ ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు. నూతనంగా వివాహం చేసుకున్న వారు నూతన రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే దానిని స్వీకరిస్తున్నారు తప్ప, కార్డు ఇవ్వటం లేదు. వివాహం అనంతరం పిల్లలు కలిగిన వారు పిల్లల పేరును రేషన్‌కార్డులో చేర్చాలంటే ముందుగా మీ-సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం రెవెన్యూ అధికారులు దానిని ధ్రువీకరించాలి. ఈ వివరాలను సివిల్ సప్లయీస్ కమిషనర్ కార్యాలయానికి పంపాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత పిల్లల పేర్లను కార్డులో చేర్చుతూ ఆమోదం ముద్ర వేయాలి. అయితే కొంత కాలంగా ఈ సర్వర్ సక్రమంగా పనిచేయకపోవటంతో పిల్లల పేర్లు చేర్చే అంశం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటోంది. రేషన్‌కార్డులో పేరు నమోదు కాకపోవటంతో వారి పేరున రేషన్ రాకపోగా ఏదైనా ధ్రువపత్రం కోసం కార్యాలయానికి వెళితే పేరు లేని కారణంగా ధ్రువపత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు అంగీకరించని పరిస్థితి నెలకొంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి ఏడాది కావస్తున్నా ఇంత వరకు కార్డులు ఎప్పుడిస్తారనే అంశంపై అధికారుల్లోనే స్పష్టత లేకుండాపోయింది. అక్టోబరు మొదటి వారంలో నూతన కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే నూతన కార్డుల మంజూరు ప్రక్రియ ముందడుగు వేస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మీ-సేవ కేంద్రాల్లో అందని సేవలు రేషన్ కార్డు ఉన్న వారు మీ-సేవ సర్వీస్ సెంటర్ల ద్వారా వివిధ సేవలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పినా అవి పూర్తిస్థాయిలో అమలు కాని పరిస్థితి నెలకొంది. రేషన్‌కార్డులో పేరు తొల గించడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తే వలస వెళ్లిన ప్రాంతంలో రేషన్ పొందడం, యజమాని పేరు మార్చడం, డూప్లికేట్ రేషన్‌కార్డు తీసుకోవడం, గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, రేషన్‌కార్డు సరెండర్ చేయడం, పిల్లలు పుడితే వారి పేర్లను కార్డులో చేర్చడం, తెలుపుకార్డు నుంచి గులాబీ కార్డుకు మార్చుకోవడం, గులాబీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం తదితర సౌకర్యాలను కల్పించారు. వీటిలో కొన్ని అమలవుతుండగా మరికొన్ని అసలు అమలే జరగని పరిస్థితి నెలకొంది. -
వుడా స్థానంలో వీఎండీఎ
వచ్చే నెల నుంచి కార్యకలాపాలు 100 గజాల్లోపు ఆక్రమిత పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చే నెలలో రేషన్‌కార్డుల జారీ సకాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి జిల్లా అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష విశాఖపట్నం : వుడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఎ) వచ్చే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనికి సీఎం చైర్మన్‌గా ఉండబోతున్నారు. ప్రతీ నెలా పెండింగ్ ప్రాజెక్టులను సీఎం స్వయంగా సమీక్షించనున్నారు. ప్రాజెక్టులనుసైతం నిర్ధేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో పెండింగ్ సమస్యలు..స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. వివరాలను మంత్రి అయ్యన్న మీడియాకు వివరించారు. వంద గజాల్లోపు స్థలంలో ఉంటున్న ఆక్రమిత నిరుపేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. స్వాతం త్ర వేడుకల సందర్భంగా 15న సీఎం అధికారికంగా ప్రకటిస్తారు. నగరంలో 80 వేల మంది వరకు ఉన్నట్టుగా అంచనా. అభ్యంతరాలు లేని ప్రాంతాలకు చెందిన 17వేలమందికి మాత్రమే తొలివిడత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు.అర్హులైన దరఖాస్తుదారులకు వచ్చే నెలలో రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందుగా రేషన్‌కార్డులివ్వాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల కోసం వెయ్యిఎకరాల భూములవసరమవుతాయని..వాటిని నిర్ధేశిత కాలపరిమితిలో సేకరించాలని సూచించారు. విశాఖ-భీమిలి మధ్య నాలుగులైన్ల రహదారిని నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.సాగర తీరంలోస్విమ్మింగ్ జోన్స్ గుర్తించి అభివృది ్ధచేయాలని సూచించారు.లంబసింగ్, అల్లూరి సీతామరాజు సమాధి, అరకు ప్రాంతాలను యనిట్గా తీసుకుని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తారు. లంబసింగిలో బొటానికల్ గార్డెన్, రోజ్గార్డెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.విశాఖలో మెగా ఆడిటోరియం నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి, గాదె శ్రీనివాసుల నాయుడు, జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని, అర్బన్,రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు. మధ్యాహ్నం వరకు మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిలు సీఎం పర్యటనలో పాల్గొన్నప్పటికీ సమీక్షలో మాత్రం కన్పించలేదు. -
తోఫా.. దోఖా..
నెల్లూరు(రెవెన్యూ): wap098204100397, RHP098204 140931 రేషన్ కార్డులు నెల్లూరులోని 41వ చౌకదుకాణంలో ఉన్నాయి. కార్డుదారులిద్దరూ 41వ చౌకదుకాణంలో ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. తోఫా ఇవ్వమని కార్డుదారులు వెళ్లి డీలర్‌ను అడిగారు. కార్డులు తోఫా జాబితాలో లేవని డీలర్ సమాధానం ఇచ్చారు. కార్డుదారులు ఏమి చేయాలో తెలియక డీఎస్ఓ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో ఇక్కడ కాదు.. నెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించమన్నారు. అక్కడకు పోతే మాకు సంబంధంలేదన్నారు. ఈ విధంగా అర్హులైన ముస్లింకార్డుదారులకు రంజాన్ తోఫా ఇవ్వకుండా ఇబ్బందులుపెడుతున్నారు. రంజాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న రంజాన్ తోఫా ప్రకటించింది. ముస్లిం కార్డుదారులకు ఐదు కిలోల గోదుమపిండి, రెండు కేజీల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింకార్డుదారుల వివరాలు అందజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ముస్లింకార్డుదారుల వివరాల సేకరణ ప్రక్రియను తహశీల్దార్లకు అప్పగించారు. జిల్లాలో 73 వేల మంది ముస్లింకార్డుదారులు ఉన్నారని తహశీల్దార్లు మొదటి విడత వివారలు అందజేశారు. ఇచ్చిన వివరాలు సక్రమంగా లేవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండో పర్యాయం వివరాలు సేకరించి 84,014 మంది ముస్లింకార్డులు ఉన్నాయని దానికి అనుగుణంగా తోఫా విడుదల చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర అధికారులు 84,014 మంది కార్డుదారులకు సంబంధించిన తోఫాను ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. అవసరమున్న దాని కంటే అదనపు కోటా విడుదల చేయించామని అధికారులు చెబుతున్నారు. అదనపు కోటా ఎందుకు విడుదల చేయించారో అధికారులకే తెలియాలి. తహశీల్దార్ కార్యాలయాల్లో ముస్లింకార్డుదారుల వివరాల జాబితాలను మాన్యువల్‌గా సిద్ధం చేశారు. ముస్లిం కార్డుదారుల జాబితాల సిద్ధం చేసే సమయంలో సంబంధిత అధికారులు చేతులకు పని చెప్పారని ఆరోపణలున్నాయి. అర్హుల పేర్లు పక్కన పెట్టి అనర్హుల పేర్లు జాబితాలో నమోదు చేశారనే విమర్శలున్నాయి. రేషన్ షాపులో ఉండాల్సిన ముస్లింకార్డుదారుల పేర్లు జాబితాలో చేర్చలేదు. ఫలితంగా డీలర్‌ను తోఫా ఇవ్వమని అడిగితే అధికారులు ఇచ్చిన జాబితాలో మీపేరు లేదు.. తోఫా ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారని బాధితులు వాపోయారు. పేర్లు జాబితాలో లేకుండా చేసి తోఫాను బహిరంగ మార్కెట్‌కు తరలించి సోమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. నెల్లూరు నగరం, రూరల్‌లో పరిధిలో 173 చౌకదుకాణాలున్నాయి. సుమారు 25 వేల ముస్లింకార్డులున్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. నగరంలో జాబితా సిద్ధం చేయడంలో ఒక ప్రైవేట్ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. కార్డుల జాబితా సిద్ధం చేయడం నుంచి డీలర్లకు జాబితాలు ఇచ్చేంత వరకు ఆ వ్యక్తి హహా కొనసాగింది. నగరంలోనూ రెండు రోజుల కిందట మూడు వేల కార్డులకు తోఫా ఇవ్వాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క సారిగా కాకుండా విడతల వారీగా కార్డుదారులు జాబితా సిద్ధం చేయడంలో అవకతవకలు జరిగి ఉంటాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన కార్డుదారులకు తోఫా పంపిణీ చేశాం: ధర్మారెడ్డి, డీఎస్ఓ రంజాన్ తోఫాను అర్హులైన ముస్లింకార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ముస్లింకార్డుదారుల ఎంపిక ప్రక్రియను తహశీల్దార్లకు అప్పగించాం. తహశీల్దార్లు ఇచ్చిన వివరాల ప్రకారం తోఫా విడుదల చేయించాం. అదనంగా తోఫాను తీసుకురావడం మంచిదైంది. దాని వలన జాబితాలో పేర్లులేని అనేక మంది ముస్లింకార్డుదారులకు తోఫా పంపిణీ చేశాం. -
40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు
మహారాణిపేట (విశాఖపట్నం) : సామాజిక భాద్యత(సీఎస్సార్) కింద డిసెంబర్ నాటికి 40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డెరైక్టర్ జి.రవిబాబు తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, ఐటీడీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 95లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 25లక్షల మంది వినియోగం సరిగ్గాలేదని గుర్తించామన్నారు. ఏజెన్సీలో అవగాహన లేక వాడడం లేదన్నారు. వారిలోని భయాందోళనలు తొలగించి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలకు సిలిండర్లు తరలించడం సమస్యగా ఉన్నందున 5 కేజీల సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నట్లు రవిబాబు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తామన్నారు. ఈ పాస్ వల్ల నిజమైన లబ్ధిదారుడికి రేషన్ అందడమే కాకుండా ఇప్పటి వరకూ రూ.43 కోట్లు ఆదా అయిందన్నారు. 20శాతం సరకు మిగిలిందని రవిబాబు తెలిపారు. ప్రతి ఇంటికీ ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వల్ల నెలకు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన కిరోసిన్ ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్, ఐటీడీఏ సబ్‌కలెక్టర్ వెంకటేశ్, విశాఖపట్నం, విజయనగరం డీఎస్ఓలు జె.శాంతకుమారి, నిర్మలాభాయి, ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
టీడీపీకి ఓటేయలేదని రేషన్ కార్డులు ఇవ్వరట..
శ్రీకాకుళం పాతబస్టాండ్ : మేమంతా టీడీపీకి ఓటేయలేదట.. అందుకే రేషన్‌కార్డుల మంజూరుకు cతెలపదట.. ఇదెక్కడి న్యాయం సారూ.. ఇదేనా ప్రజాస్వామ్యపాలన... ఇలా అయితే అధికారులు ఎందుకు.. ఎమ్మెల్యేలు ఎందుకు.. చట్టాల పనేమిటంటూ జి.సిగడాం మండలంలోని మెట్టవలస గ్రామస్తులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 58 అర్హతగల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు మంజూరుకు సిఫార్సు చేయడం లేదని ఆరోపించారు. గ్రీవెన్స్‌సెల్‌లో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఏజేసీ పి.రజనీకాంతారావు, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో జె.వసంతరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఎం.సునీల, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి తదితర అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. శ్రీకాకుళం పట్టణంలోని మదురానరగ్ కాలనీలో పార్కుగోడ కాలువలో కూలిపోవడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోందని, గోడ నిర్మించి, పార్కును ప్రజలకు అప్పగిస్తే సుందరంగా అభివృద్ధిచేస్తామని శ్రీనివాస అపార్టుమెంటు ప్రతినిధులు డి.వెంకటేశ్, కుమార్ వేనుగోపాల్ తదితరులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎచె ్చర్ల మండలం ఎస్.ఎం.పురం రెవెన్యూ ఫరీదుపేట పంచాయతీ పరిధిలో 2.03 ఎకరాల్లో వేసిన రియల్ ఎస్టేట్‌లో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు కె.అమ్మినాయుడు ఫిర్యాదు చేశారు. పట్టాదారు పాసుపుస్తకం మంజూరుకు లంచం తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని లావేరు మండలం హనుమంతుపురం గ్రామానికి చెందిన డి.అక్కమ్మ కోరింది. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంలో రాత్రి కాపలాదారుగా పనిచేస్తున్న తనను తహశీల్దార్ బలవంతంగా బయటకు పంపించార ంటూ శ్రీకాకుళానికి చెందిన ఉలుకు సరోజిని కలెక్టర్ వద్ద వాపోయింది. నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన కె.అప్పారావు ఫిర్యాదు చేశారు. అంత్యోదయ కార్డు మంజూరు చేయాలంటూ ఎల్.ఎన్.పేట మండలం ధనువాడ గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు అనే వికలాంగుడు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. తోటి డ్రైవర్లతో సమానంగా వేతనం ఇవ్వాలంటూ ఐటీడీఏలో పనిచేస్తున్న సీతంపేట మండలానికి చెందిన ఎల్.ప్రకాశరావు కోరారు. రోడ్డుపై ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని జలుమూరు మండలం రాణ గ్రామానికి చెందిన వాద సింహాచలం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నష్టపరిహారం అందజేయడలో వివక్ష చూపిస్తున్నారంటూ కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామానికి చెందిన ఉప్పాడ అప్పలనాయుడు ఫిర్యాదుచేశారు. ఎస్సీ రహదారిపై ఆక్రమణలు తొలగించాలని పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన వై.జగన్నాథరావు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో కుటుంబానికి నాలుగు పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నరసన్నపేట మండలం కంబకాయ గ్రామ సర్పంచ్ మహేశ్వరి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 12 వినతులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీసుకార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 12 వినతులు వచ్చాయి. ఓఎస్డీ అడ్మిన్ కె.తిరుమలరావు వచ్చిన వినతులను పరిశీలించారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వచ్చిన వినతుల్లో సివిల్ తగాదాకు సంబంధించి నాలుగు, కుటుంబ కలహాలపై మూడు, పాత కేసు విషయమై ఒకటి, పాతవి నాలుగు ఉన్నాయి. కార్యక్రమంలో డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, టి.మోహనరావు, కె.వేణుగోపాలనాయుడు, దేవానంద్‌శాంతో, పెంటారావు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'రేషన్‌కార్డుల రద్దుకు రహస్య ఎజెండా'
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దుచేసేందుకు రహస్య ఎజెండా రూపొందించిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల రిలేదీక్షా శిబిరాన్ని ఆయన సంద ర్శించి సంఘీభావం తెలిపారు. రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, పేదప్రజలకు రేషన్ ఎగ్గొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తోందన్నారు. ఈ-పోస్ విధానం ద్వారా అధికారులు దొంగలెక్కలు చూపించి రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులు రద్దుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. రానున్న కాలంలో తెల్లకార్డులను ఎత్తివేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్‌ను వ్యతిరేకించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆధార్ ద్వారా సంక్షేమ పథకాలకు కోత విధించే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కోసం ఆందోళన చేస్తున్న రేషన్ డీలర్లకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు మండాది వెంకట్రావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు తమ సమస్యలపై రఘువీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
ఈ ప్రయోగం ఫెయిల్
ఈ-పాస్ విధానంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రయోగ పరీక్షలోనే ఫెయిలైంది. ఆధునిక సాంకేతిక విధానంతో అనుసంధానించి తొలివిడతగా జిల్లాలోని 245 రేషన్ షాపుల్లో ఈ నెల నుంచి ఈ పాస్ అమలు ప్రారంభించారు. అయితే సాంకేతిక, ఇతరత్రా లోపాలతో కొత్త విధానంలో రేషన్ అందజేయడంలో అధికారులు విఫలమయ్యారు. సరుకులు అందక లబ్ధిదారులు గగ్గోలు పెడుతుండటంతో చివరికి ఈ పాస్ పని చేస్తున్న 50 డిపోలు మినహా మిగిలిన వాటిలో పాత విధానంలోనే ఈ నెల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాలకొండ: జిల్లాలో అన్ని రకాలు కలిపి సుమారు 11 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు సరుకులు అందజేసేందుకు సుమారు 2వేల రేషన్ డిపోలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా గత నెల వరకు సాధారణ తూనిక పద్ధతుల్లోనే సరుకులు అందించేవారు. దీని వల్ల డిపోల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని జీపీఎస్ విధానంలో ప్రజాపంపిణీ అనుసంధానించి బయోమెట్రిక్ కూడా జోడించి సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ-పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాటాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. తొలి విడతగా జిల్లాలో 245 రేషన్ డిపోల్లో వీటిని ఏర్పాటు చేసి, ఏప్రిల్ కోటా వీటి ద్వారానే పంపిణీ చేయాలని ఆదేశించారు. మొదట్లో రేషన్ డీలర్లు ఈ విధానంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరుకులను తూకం వేసి ఇస్తేనే తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. అలా తూకం వేస్తే ప్రతి బస్తాలో 2 నుంచి 3 కేజీల వరకు సరుకులు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందించి వేబ్రిడ్జిల్లో సరుకులు తూకం వేయించిన తర్వాతే డీలర్లకు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 5వ తేదీ దాటిపోయింది. అనంతరం రేషన్ పంపిణీకి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆది నుంచీ అవి మొరాయించడం ప్రారంభించాయి. చాలా వరకు ఈ-పాస్ యంత్రాలు ఆన్ కాకపోవడం, ఆన్ అయినా సర్వర్ డౌన్ అని చూపించటం వంటి సాంకేతిక కారణాలతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఉన్నతాధికారులు పరిశీలించి యంత్రాలకు మరమ్మతులు చేయించినా అవి తాత్కాలికంగానే పని చేశాయి. మరో వైపు ఈ నెల 15లోగా సరుకుల పంపిణీ పూర్తి చేయాల్సి ఉండటంతో లబ్ధిదారుల నుంచి డీలర్లపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. సక్రమంగా పనిచేసిన యంత్రాల ద్వారా కూడా రోజుకు 10 మంది కార్డుదారులకు మించి సరుకులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రేషన్ సరుకుల కోసం రాత్రుళ్లు కూడా లబ్ధిదారులు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. 50 డిపోలకు పరిమితం ఈ-పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీలో విఫలమైన అధికారులు ప్రస్తుతానికి ఈ విధానాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సక్రమంగా పని చేస్తున్న 50 పరికరాలున్న డిపోల్లోనే ఈ పాస్ విధానం కొనసాగించాలని, మిగిలిన డిపోల్లో వాటిని పక్కన పెట్టాలని జాయింట్ కలెక్టర్ వివేకయాద్ రెవెన్యూ అధికారులకు సూచించారు. పాతపద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలని ఆదేశిస్తూ.. దీనికి గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. చిత్తశుద్ధి లోపం ఈ పాస్ పరికరాల ఏర్పాటులో అత్యాత్సుహం చూపిన అధికారులు ఈ విధానం అమలులో మాత్రం చిత్తశుది ్ధ చూపకపోవడమే ఇది విఫలం కావడానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఈ-పాస్ విధానం ద్వారా బోగస్ లబ్ధిదారుల గుర్తింపు జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపాలను సకాలంలో పరిష్కరించడంలో అధికారులు ఎందుకు శ్రద్ధ చూపించటం లేదన్నది ప్రశ్నగా మారింది. 50 కేంద్రాల్లో ఈ విధానం కొనసాగించాలని అనుకున్నా అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. మిగిలిన కేంద్రాల్లో పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేసి 50 కేంద్రాల్లో యంత్రాల ద్వారా పంపిణీ చేసేందుకు డీలర్లు సుముఖంగా లేరు. ఈ సమస్యలన్నింటిని ముందుగానే అంచనా వేసి విధానం అమలు చేసి ఉంటూ అభాసుపాలయ్యేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డీలర్ చెబితేనే రేషన్ కార్డు!
సాక్షి, హన్మకొండ : ఒక రేషన్‌షాపు పరిధిలో ఉన్న రేషన్‌కార్డులు(ఆహార భద్రత కార్డు) మరో షాపు పరిధిలోకి మారుతున్నారుు. ఇది కంప్యూటర్ తప్పి దం వల్లో.. అధికారుల పొరపాటు వల్లో కా దు.. ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ఆదేశాల తో డాటా ఎంట్రీ ఆపరేటర్లు రేషన్‌షాపు డీలర్లకు చేస్తున్న సహాయం. 2015 జనవరిలో కొ త్త రేషన్ కార్డులు మంజూరైన తర్వాత రాంనగర్, యాదవనగర్, రెడ్డికాలనీ ప్రాంతాల్లోని రే షన్ దుకాణాలకు చెందిన వందకుపైగా కా ర్డులు 71వ నంబర్ రేషన్ దుకాణం పరిధిలోకి వెళ్లాయి. ఇదే పద్ధతిలో కాజీపేటలోని 102 నం బరు చౌకదుకాణం పరిధిలో ఉన్న లబ్ధిదారులను రహమత్ నగర్ రేషన దుకాణం పరిధిలోకి మార్చారు. ఇలా లాభం.. కార్డులు ఒక చౌకధర దుకాణం నుంచి మరో చౌకధర దుకాణం పరిధిలోకి మార్చడం వల్ల లబ్ధిదారులు మొదట ఇబ్బంది పడతారు. తెలియని ప్రాంతానికి వెళ్లి రేషన్ సరుకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఓ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ కార్డుకు 24 కిలోల బియ్యం వస్తాయి. ఇలా నాలుగు కార్డులు కలిస్తే ఒక క్వింటాలు బియ్యం మిగులుతారుు. రేషన్ దుకాణాల మార్పిడి ప్రక్రియ వల్ల ప్రస్తుతం కనీసం ఒక్కో చౌకదుకాణం పరిధిలో 50 రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఇంటి నంబర్లతో షాపుల కేటాయింపు సహజంగా పాతకార్డులు చించేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్నావారికి పాత కార్డు ఉన్న షాపులోనే కొత్త కార్డు ఇవ్వాలి. కానీ అధికారులు కొత్త పద్ధతికి తెరలేపారు. ఇంటి నంబర్ల ఆధారంగా కార్డులకు రేషన్‌షాపులకు కేటాయించారు. దీనివల్ల చాలా కార్డులు కంటి పక్కన ఉన్న షాపు కాకుండా ఎక్కడో ఉన్న షాపుకు మళ్లాయి. ఆపరేటర్ల అండతో.. రేషన్‌కార్డుల డేటా ఎంట్రీ విషయంలో ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం సాగుతోంది. కొందరు డీలర్లు ఆపరేటర్లను మచ్చిక చేసుకుని తమ పనులు చక్కబెట్టు కుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి అందాల్సిన వాటా వారికి పక్కాగా అందుతుండటంతో నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారం బాగుండటంతో పకడ్బందీగా అమలు చేసేందుకు కొద్ది రోజుల క్రితం కాజీపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లు, అధికారులు సమావేశమైనట్లు సమాచారం. విషయం వేరే వారికి తెలియకూడదని, అవసరాన్ని బట్టి రోటేషన్ పద్ధతి పాటించాలని సయోధ్య కుదుర్చుకున్నట్లుగా సమాచారం. దీనితోపాటు ఎక్కువ కార్డులు పొందిన డీలర్లు అదనపు మొత్తంలో ముట్టచెప్పాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. -
చౌకబారు చేతివాటం
రేషన్‌కార్డుకు ఆధార్ సీడింగ్‌లో అవకతవకలు ఒక ఐడీ నంబర్ 10 కార్డులకు అనుసంధానం ఉద్యోగులు, డీలర్లు కుమ్మక్కు దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు ఒక మార్గాన్ని ఎంచుకుంటే.. దొంగతనాలు చేయడానికి దొంగలు మరో మార్గాన్ని చూసుకుంటారనే చందంగా ఉంది పౌరసరఫరాల శాఖ పనితీరు. బోగస్ రేషన్ కార్డులను తొలగించి ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పౌరసరఫరాల శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. డీలర్లు పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు కుమ్మక్కై బోగస్ రేషన్‌కార్డులను సృష్టించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెల్లూరు(రెవెన్యూ) : ఖాదర్‌బాషా ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇతని ఆధార్ నంబర్ 982866757289. ఈ నంబర్‌ను 10 రేషన్ కార్డులకు అనుసంధానం చేశారు. ఎస్కె.మస్తాన్ యూఐడీ 731151265345ని తొమ్మిది కార్డులకు అనుసంధానం చేశారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఇలాంటివి జిల్లాలో అనేకం ఉన్నట్లు తెలిసింది. బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం ఆధార్ సీడింగ్ చేపట్టింది. అయితే ఆధార్ సీడింగ్‌లో ఉద్యోగులు డీలర్లు చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా రేషన్‌కార్డు లేనివారి ఆధార్ నంబర్లు అనుసంధానం చేశారు. ఒక ఆధార్ నంబర్ 10 నుంచి 12 కార్డులకు అనుసంధానం చేశారు. ఖాదర్‌బాషా అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. అతనికి రేషన్ కార్డులేదు. ఆయన ఆధార్ నంబర్‌ను ఎనిమిది కార్డులకు అనుసంధానం చేశారు. చౌకదుకాణాల్లో అతని ఆధార్ నంబర్ అనుసంధానం చేశారు. శంకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆధార్ నంబర్ తొమ్మిది కార్డులకు అనుసంధానం చేశారు. తొమ్మిది చౌకదుకాణాల్లో మస్తాన్ రేషన్ తీసుకుంటున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ విధంగా జిల్లాలో రెండు లక్షల ఆధార్ నంబర్లు అనుసంధానం చేసినట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి రేషన్‌కార్డులలో సభ్యులుగా ఉన్న సంగతి వారికే తెలియదు. ఇదంతా డీలర్లు ఉద్యోగులు కలసి చేసిన చేతివాటమని ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యూనిట్లు అంటే ఎనిమిది లక్షల కిలోల బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 1872 చౌకదుకాణాలు, 8.32 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ప్రతినెలా కార్డుదారులకు 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిత్యం వందలాది లారీల రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులుదాటి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి కింది నుంచి పై స్థాయి అధికారులకు వరకు మామూళ్లు అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండేళ్ల కిందట బోగస్ కార్డులు అప్పగించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనేక మంది డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను కొన్నింటిని మాత్రమే అందజేశారు. బోగస్ కార్డులు పూర్తి స్థాయిలో అందజేయకపోవడంతో రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేశారు. డీలర్లు పరిధిలో ఉన్న కార్డుదారుల ఆధార్ నంబర్లు తీసుకొచ్చి సీడింగ్ చేయించాలని అధికారులు ఆదేశించారు. ఈ-పాస్ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్ని సూక్తిని డీలర్లు ఆచరించారు. ఆధార్ సీడింగ్ సమయంలో కార్డులు లేని వారిని కుడా సభ్యులుగా చేసి సీడింగ్ పూర్తి చేయించారు. సీడింగ్ సమయంలో లక్షలాది మంది సభ్యులకు ఆధార్ నంబర్లు మంజూరు కాలేదు. అధికారుల ఒత్తిడి, డీలర్ల స్వలాభం కోసం సంబంధంలేని వ్యక్తుల ఆధార్ నంబర్లు అనుసంధానం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు సహకారం లేకుండా డీలర్లు బోగస్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేయలేరు. సీడింగ్ ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోను బోగస్ సీడింగ్ ప్రక్రియ జరిగింది. నెల్లూరు, కోవూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి తదితర మండలాల్లో బోగస్ సీడింగ్ అధికంగా జరిగినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపుల ఆధార్ సీడింగ్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే బోగస్ బండారం బయటపడుతుంది. సాఫ్ట్వేర్ బోగస్.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేందుకు ఆధార్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబరును ఒక పథకానికి అనుసంధానం చేయాల్సి ఉంది. వేరొక గ్రామంలో ఆ వ్యక్తి ఆధార్ నంబర్ సీడింగ్ చేస్తే సర్వర్ స్వీకరించదు. రేషన్‌కార్డులకు అదేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బోగస్ కార్డులను తొలగించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయలేదు. డీలర్లు, ఉద్యోగులు కలసి సాఫ్ట్‌వేర్‌ను లక్ష్యంవైపు పయనించకుండా మార్చివేశారు. విచారణ చేపట్టి సంబంధిత ఉద్యోగులు, డీలర్లపై చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ బోగస్ కార్డులను ఏరివేసేందుకే ఆధార్ అనుసంధానం చేసింది. ఆధార్ నంబర్ అనేక కార్డులకు అనుసంధానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పరిశీలన చేపట్టి బోగస్ సీడింగ్‌ను తొలగిస్తాం. ఈ విధంగా చేసిన డీలర్లను సస్పెండ్ చేస్తాం. ఈ-పాస్ విధానం పూర్తి స్థాయిలో అమలైతే ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగుపడుతుంది. -
అన్నింటా వారిదే పెత్తనం!
జన్మభూమి కమిటీలకే అధికారం డమ్మీలుగా మారుతున్న అధికారులు స్మార్ట్‌కార్డు తరహాలో రేషన్‌కార్డులు మార్గదర్శకాలు జారీ మొన్న రుణాలు.. నిన్న గ్యాస్ కనెక్షన్లు.. నేడు పింఛన్లు.. రేపు రేషన్ కార్డులు.. ఇలా ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలకే పెత్తనం కట్టబెడుతుండడంపై అధికార వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నెలలో మంజూరు చేయనున్న కొత్తరేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఏఎస్వో, తహశీల్దార్లకు అప్పగించినా, చివరకు ఆ జాబితాలను జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేశాకే కొత్తకార్డులివ్వాలని సర్కార్ మెలిక పెట్టడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. విశాఖపట్నం: ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అంతా గతంలో అధికారులే చేపట్టేవారు. 50 శాతం వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలలూపినా.. మరో 50 శాతమైనా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దక్కేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముందెన్నడూ లేని వింత సంస్కృతికి టీడీపీ సర్కార్ తెరలేపింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ పెత్తనం పూర్తిగా జన్మభూమి కమిటీలకు అప్పగించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సుల మేరకు జాబితాలు తయారుచేస్తూ వసూళ్లలో వారివాటాలను వారికి ముట్టజెబుతూ ఈ కమిటీలు అందినకాడకి దండుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి. మరో 2,10,378 గుబాబీ కార్డులున్నాయి. కొత్త కార్డుల జారీ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు మార్గదర్శకాలను జారీచేసింది. తెల్లకార్డుల కోసం దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని గుర్తించేందుకు నిర్దేశించిన అర్హతలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ నిబంధనలను ఇప్పటికే మనుగడలో ఉన్న కార్డులకు కూడా దశలవారీగా వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే కనుక జరిగితే భారీ సంఖ్యలో తెలుపుకార్డులపై కోతపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాల్లో కొత్తకార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించి అప్లోడ్ చేసే బాధ్యతను రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. కొత్తగా మంజూరు చేయనున్న రేషన్‌కార్డులను స్మార్ట్ కార్డుల తరహాలో జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తకార్డుల కోసం 64 వేల మంది ఎదురుచూపు గతేడాది అక్టోబర్-నవంబర్లలో రెండు విడతల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీల్లో అత్యధికం పింఛన్లు.. ఆ తర్వాత రేషన్‌కార్డుల కోసమే వచ్చాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 39,638 మంది, జీవీఎంసీతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో 25,007 చొప్పున మొత్తం 64,645దరఖాస్తులొచ్చాయి. ప్రాథమికంగా వీటి అర్హతను నిర్ధారించే బాధ్యతను అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారులు, తహశీల్దార్లకు అప్పగించారు. వయసు నిర్ధారణ, రెసిడెన్సీ, ఆధార్ కార్డులను ఈ దరఖాస్తులతో అప్లోడ్ చేసి అర్హత ఉందా లేదా అని వీరిద్దరూ నిర్ణయిస్తారు. ఎక్సల్షీట్లో అ ర్హులైన వారి జాబితాలను తయారు చేసి జన్మభూమి కమిటీలకు అప్పగిస్తారు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు అర్హులైన వారితో తుదిజాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తారు. అర్హుల జాబితాను అధికారులు తయారుచేసిన తర్వాత వాటిపై జన్మభూమి కమిటీ ఆమోదం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటప్పుడు మాతో ఎందుకు పరిశీలన చేయిస్తున్నారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాల ప్రకారం అర్హతలివే.. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు. వితంతువులకు,మహిళాధారిత కుటుంబాలు.మానసిక శారీరక వైకల్యం ఉన్న కుటుంబాలు. సొంత ఇల్లు, వ్యవసాయ భూమి లేని కుటుంబాలు. ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేసిన జాబ్‌కార్డుదారులు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీల్లో నివసించే వారు అర్హులు వీరు అనర్హులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు వర్తించదు. ఇంటి విద్యుత్ బిల్లు రూ.500 కంటే ఎక్కువగా చెల్లిస్తే అనర్హులు. 2.5 ఎకరాల మగాణీ లేదా 5 ఎకరాల పైబడి మెట్ట భూములుంటే అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో.. 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న ఇంటిలో నివసించాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. నెలకు చెల్లించే విద్యుత్ బిల్లు రూ. వెయ్యి లోపు ఉండాలి. వితంతు, మహిళాధారిత, శారీరక, మానసిక వికలాంగులు ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం అనర్హులెవరంటే..? ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు. క్రెడిట్కార్డులున్న కుటుంబాలు. 100 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న ద్విచక్రవాహనాలున్న కుటుంబాలు. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత గృహం ఉన్న కుటుంబాలు. -
అక్రమాలతో పరుగు
ఎమ్మిగనూరు : అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం.. అక్రమాలను కప్పి పుచ్చే అధికార యంత్రాంగం అండదండలు ఆ యువకుడిని వక్ర మార్గంలో నడిపించాయి. మీ సేవ ముసుగులో అక్రమాలతో పరుగులు తీసి చివరకు కటకటాల పాలయ్యాడు. నాడు బోగస్ కార్డుల సృష్టిలో డీలర్లకు వరమయ్యాడు.. నేడు బీమా సొమ్ము స్వాహాకు కంపెనీ ప్రతినిధులకు కీలకంగా మారి కటకటాల పాలైన మీ-సేవ షఫి ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరుకు చెందిన షఫీ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులకు తలలో నాలుకగా మారాడు. అధికారులతో ఉన్న చనువుతో అతడికి మీ సేవ కేంద్రం మంజూరైంది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తయినా ఎమ్మిగనూరులోని ఈ కేంద్రం నుంచి వేలకు వేలు బోగస్‌కార్డులు సృష్టించాడు. కార్డుకు రూ. 500ల నుంచి రూ. 1000 చెల్లించి బోగస్‌కార్డులను రేషన్ డీలర్లే తయారు చేయిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి డీఎస్ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరులో షఫీ నడుపుతున్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని డీపీఎల్ కేంద్రాల నుంచి రేషన్‌కార్డుల సమాచారం ఉన్న బ్యాక్అప్ను జిల్లా అధికారులకు అందించాల్సి ఉండగా షఫీ తన వద్దే ఉంచుకొని బోగస్‌కార్డుల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. అయితే రెవెన్యూ అధికారులతో ఉన్న పరిచయాలు - మామూళ్ల పంపకాల మూలంగా ఉన్నత స్థాయిలో అధికారులను మేనేజ్ చేసుకొని మళ్లీ మీ సేవ కేంద్రాన్ని పొందాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. అప్పటికే తనకున్న పరిచయాలతో వి-3 మనీ సర్క్యులేషన్ స్కీంలో పలువురిని చేర్పించి రూ. 80లక్షల దాకా కట్టించాడు. చివరకు మనీ సర్క్యులేషన్ స్కీం బోర్డు తిప్పేయడంతో బాధితులకు తిరిగి సొమ్ము చెల్లిస్తానని నమ్మబలికి వివిధ అక్రమాలకు తెరలేపాడు. ఈ మనీ సర్క్యులేషన్ వ్యవహారంలో అప్పటి పోలీస్ అధికారులను సైతం మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. రచ్చబండ కార్యక్రమం కింద చేపట్టిన కార్డుల పంపిణిలో రేషన్ డీలర్లకు మళ్లీ షఫియే వరమయ్యాడు. చివరకు బోగస్ రేషన్‌కార్డులకు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తుల ఆధార్‌కార్డుల నెంబర్లు ఫీడ్ చేస్తూ డీలర్లతో ఆమ్యామ్యాలు జరిపినట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది. తాజాగా బిర్లా సన్‌లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో తాను ఏజెంట్‌గా పని చేస్తూ ఏకంగా కంపెనీ సొమ్మును దిగమింగడంలో షఫీ కీలక పాత్ర పోషించాడు. తాను నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని బిర్లా సన్ లైఫ్‌లో చేరిన ఫారూక్ అనే వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, అతడి భార్య ఆధార్‌కార్డును మీ సేవ ద్వారా డౌన్లోడ్ చేసి కర్నూలులోని ఓ బ్యాంకులో వేరే స్త్రీతో అకౌంట్ తెరవడం, బీమా సొమ్ము స్వాహా చేయడం వరకు షఫీ పాత్రే కీలకమని ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు నిగ్గు తేల్చి కటకటాల్లోకి పంపారు. అయితే ఫారూక్ మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చింది ఓ గ్రామ వీఆర్వో అని, ఈ బీమా సొమ్ము గోల్‌మాల్‌లో ప్రస్తుత కంపెనీ ప్రతినిధుల పాత్ర కీలకమన్న కోణాలపై పోలీసు దర్యాప్తు జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన ఫారూక్ ఒక్కడే కాదు.. బిర్లా కంపెనీలో బీమా చేసిన పలువురిని చనిపోయినట్లు సృష్టించి కోట్లలో కంపెనీ సొమ్ము ఆరగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో బాధితుడు ఫారూక్ ఏకంగా బిర్లా కంపెనీపైనే పరువు నష్ట దావా వేయడం, కేసును సీఐడీకి అప్పగించాలని కోరడం జరిగింది. మున్ముందు పోలీసుల దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మీ సేవ కేంద్రాన్ని మంచి కోసం కాకుండా వక్రమార్గంలో ఉపయోగించుకుని ఊచలెక్కిస్తున్న షఫీ ఉదంతం ఇతరులకు కనువిప్పు కావాలని పోలీసులు, విజ్ఞులు పేర్కొంటున్నారు. రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇక నకిలీపై నజర్..!
హైదరాబాద్: తెలంగాణ రాజముద్రతో కొత్త ఆహార భద్రతా కార్డుల జారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం అంతకుముందే బోగస్ రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది. రెండేసి కార్డులున్న వారిని గుర్తించి బోగస్ కార్డులు తొలగించడం ద్వారా బియ్యం సబ్సిడీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం ఆధార్ సీడింగ్ డేటాబేస్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం జనవరి చివరి నాటికి అర్హుల గుర్తింపును పూర్తిచేసింది. ప్రస్తుతం చట్టం పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య సుమారు 2.80 నుంచి 2.90 కోట్ల మధ్య ఉంది. వీరందరికీ కిలో రూపాయికి ్రప్రతినెలా 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తోంది. ఇందుకు ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల భారం పడుతోంది. అయితే గతంలో మాదిరే కొత్తగా గుర్తించిన అర్హుల జాబితాలోనూ చాలావరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వలస వచ్చినవారు రాజధానితోపాటు, సొంత గ్రామాల్లోనూ కార్డులు కలిగిఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిలో కొందరు వారి రాష్ర్టంలో, ఇక్కడా కార్డులు పొందారు. దీనిపై కిందిస్థాయి అధికారుల నుంచి ఫిర్యాదులు రావడంతో కదిలిన పౌరసరఫరాల శాఖ ఆధార్ సీడింగ్ పూర్తయిన వెంటనే రెండేసి కార్డులున్న వారిని తొలగించాలని నిర్ణయించింది. ప్రసుతానికి రాష్ట్రంలో 88 శాతం వరకు ఆధార్ సీడింగ్ పూర్తయినందున ఈ ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని గుర్తించేందుకు ఆ రాష్ర్ట సాయం తీసుకోనుంది. ఆ రాష్ర్టం నుంచి ఆధార్ డేటాబేస్‌ను తీసుకుని దానిని ఇక్కడి డేటాబేస్‌తో సరిచూసుకుని బోగస్ కార్డులను తొలగించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. -
‘దీపం’పై శ్రద్ధ లేదా?
ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లాకు 19217 కేటాయించారు. దీపం మంజూరు గడువు దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. మహిళలంతా నన్ను అడుగుతున్నారు. మీకు దీపంపై శ్రద్ధ లేదా. మేం చేయమని చెప్పండి.. ప్రత్యామ్నాయం చూస్తానని’ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలశాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో ఆదివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం కనెక్షన్లు మంజూరు చేసిన విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియకుండా చేశారంటే మీ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయనపై మండిపడ్డారు. ఎంపీడీవోలు జాబితాలు తయారు చేయాల్సి ఉంటుంది, వారినుంచి వివరాలు వచ్చాయా అని అడిగితే డీఎస్ఓ నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ వెంటనే జోక్యం చేసుకుంటూ ఇటీవల తహ శీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఎందుకు దీపం కనెక్షన్ల విషయాన్ని ప్రస్తావించలేదని డీఎస్వోను నిలదీశారు. ఈనెల 28వ తేదీ నాటికి జిల్లాకు మంజూరైన దీపం కనెక్షన్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చూస్తానని జాయింట్ కలెక్టర్ మంత్రికి హామీ ఇవ్వగా, నమ్మమంటారా అంటూ తిరిగి ఆయనను మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వారి బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోపు నగదు జమ కావాలని ఆదేశించారు. పెట్రోలు బంకుల పేర్లు లేకుండా బుక్ ఎలా చేశారు: ‘జిల్లాలో 190 పెట్రోలు బంకులున్నాయి. ఏ రోజు ఎన్ని తనిఖీ చేస్తున్నారో వివరాలు లేవు. ఆర్డీవోలు, ఇతర అధికారులైనా తనిఖీలు చేస్తున్నారా’ అని మంత్రి సునీత ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసి 3 లక్షల 65 వేల రూపాయల ఫైన్ కట్టించినట్లు తూనికలు కొలతల శాఖ అధికారి సమాధానం చెప్పారు. కేసులు బుక్‌చేసి సాయంత్రానికి రిలీజ్ చేస్తున్నారా, ఇప్పటి వరకు ఎక్కడ కేసులు బుక్ చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. ఆ అధికారి నీళ్లు నమలడంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకుల పేర్లు లేకుండా కేసులు ఎలా బుక్ చేశారని నిలదీశారు. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ తెలుసా అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో కిరోసిన్ కార్డుదారులకు అందకుండా పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలో 19 మంది కిరోసిన్ డీలర్లు ఉన్నారని, నెలకు 1430 లీటర్లు సరఫరా చేస్తున్నారని, వారంతా సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోరా అని మంత్రి అధికారులను నిలదీశారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుంటూ కిరోసిన్ రవాణాకు సంబంధించి సోషల్ ఆడిట్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది చౌకధరల దుకాణ దారులు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఇకముందు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సునీత ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది తహశీల్దార్లు చౌకధరల దుకాణ దారులను ఇబ్బంది పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, తహశీల్దార్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సమీక్షించాలని జాయింట్ కలెక్టర్‌కు ఆమె సూచించారు. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలున్నాయని, అందులో 226 ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రేషన్ డీలర్లే ప్రచారం చేస్తున్నారు: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్‌కార్డులను తొలగిస్తుందని చౌకధరల దుకాణ దారులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోమారు ఈ జిల్లాకు వస్తానని, ఇలాంటి ఆరోపణలు పునరావృతం కాకూడదన్నారు. జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ మురళి, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఒంగోలు తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హైదరాబాద్ వాసులకు రుణమాఫీ లేదు
* ఆధార్ ఆధారంగా 4 లక్షల మందికి మాఫీ నిరాకరణ * ఇతర రాష్ట్రాల్లో ఆధార్ ఉందంటూ 9 లక్షల మందికి తిరస్కరణ * విషయం తెలిసినా పట్టించుకోని ప్రభుత్వం * చంద్రబాబుపై మండిపడుతున్న రుణ గ్రహీతలు సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లోని చిరునామాల్లో ఆధార్ కార్డు ఉందని 9 లక్షల మంది రైతుల ఖాతాలను రుణ విముక్తి నుంచి ప్రభుత్వం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే భూమి ఉండి అక్కడి బ్యాంకుల్లోనే రుణం తీసుకున్నప్పటికీ ఆధార్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉన్నందున స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ 9 లక్షల ఖాతాలను రుణ విముక్తికి అర్హత లేదని తిరస్కరించింది. ఇందులో ఏకంగా నాలుగు లక్షల మంది ఖాతాలు హైదరాబాద్‌లోని వారివే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ దారుల కుటుంబాలకు చెందిన లక్షల మంది వ్యాపారం లేదా జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారు హైదరాబాద్‌లోనే ఆధార్ నంబర్, రేషన్ కార్డు తీసుకున్నారు. ప్రభుత్వం రుణ విముక్తికి ఆధార్ నంబర్, రేషన్ కార్డులతో ముడిపెట్టిన విషయం తెలిసిందే. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన రైతు కుటుంబాలకు చెందిన వారు జీవనోపాధి నిమిత్తం బెంగళూరులో ఉంటున్నారు. ఇలాగ సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ వారు ఆధార్ నంబర్ తీసుకున్నారు. ఇలాంటి వారిచ్చిన ఆధార్ నంబర్‌ను డేటా హబ్ తిరస్కరించింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికి పట్టించుకోవడం లేదు. దీనిపై హైదరాబాద్‌లోని ఆంధ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడుతున్నారు. ఎన్నికల ముందు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో తమ కుటుంబాల్లోని అంతా వెళ్లి టీడీపీకి ఓటు వేశామని చెబుతున్నారు. తగిన శాస్తి చేశారు.. చంద్రబాబు అధికారంలో వచ్చారు కదా అని రుణం చెల్లించడం మానేసానని హైదరాబాద్ నివాసి వెంకట నారాయణ సాక్షికి తెలిపారు. తీరా ఇప్పుడు హైదరాబాద్‌లో ఆధార్, రేషన్ ఉన్నందున రుణ మాఫీకి అనర్హులంటున్నారని, దీంతో రుణాలకు వడ్డీ ఇప్పుడు తడిసిమోపెడైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో కడితే వడ్డీ లేని రుణం వర్తించేదని, అలా కాకపోయినా ఏడు శాతం వడ్డీ పడేదని, ఇప్పుడు 14 శాతం వడ్డీతో పాటు మరో రెండు శాతం ఫైన్‌తో మొత్తం 16 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 30 వేలు బ్యాంకుకు కట్టానని చెప్పారు. ఇంకా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగానే ఉందన్నారు. ఆధార్ హైదరాబాద్‌లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాకుండా పోతారా, అలా అయితే చంద్రబాబు ఆధార్ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నపుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆధార్ ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఓట్లు వేసినందుకు చంద్రబాబు సర్కారు తమకు తగిన శాస్తి చేసినట్లుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. హైదరాబాద్, బెంగుళూరు, మరో రాష్ట్రంలో నివస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల స్టేట్ రెసిడెంట్ డేటా అందుబాటులో లేదని తెలిపింది. వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నా అక్కడి బ్యాంకుల్లోనే రుణం తీసుకున్నప్పటికీ హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆధార్ ఉన్న వారికి రుణ విముక్తి కల్పించడం సాధ్యం కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాకు స్పష్టం చేశారు. -
పండుగ పూట పరేషన్
సర్కారీ రేషన్‌తో సంక్రాంతి పండుగకు సకినాలు, కారపప్పలు, పిండివంటలు చేసుకుందామని ఆశపడ్డ పేదలకు ఈసారి నిరాశే ఎదురైంది. పండుగనాడు అదనపు కోటా ఇస్తారని భావించి వెళితే... ‘రెగ్యులర్ కోటాలోని వస్తువుల కే దిక్కులేదు, ఇక పండుగ కోటా ఎక్కడిదంటూ’ రేషన్ డీలర్ల నుంచి వస్తున్న సమాధానంతో ప్రజలు బిక్కముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రాష్ట్రం, కొత్త ఏడాదిలో జరిగే తొలి పండుగను సంతోషంగా చేసుకుందామని భావించిన ప్రజలకు సర్కారు వారి రేషన్ కోతలు షాకునిచ్చాయి. కేవలం బియ్యం, అరకిలో చక్కెర మాత్రమే రేషన్ డీలర్ల వద్ద ఉండటంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ కొత్త వాటికి దిక్కులేదు... పాత కార్డులు పనికిరావు జిల్లాలో మొత్తం 9,92,457 రేషన్ కార్డులున్నాయి. వీటిలో 1347 అన్నపూర్ణ, 1,39,836 అంత్యోదయ, 6,823 ఆర్ఏపీ-2, 8,44,451 తెల్లకార్డులున్నాయి. ఈసారి రేషన్‌కార్డుల ఆధారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. రేషన్‌కార్డులు రద్దయినందున వాటి స్థానంలో ప్రవేశపెట్టిన ఆహారభద్రత కార్డుల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. అయితే ఆహారభద్రత కార్డుల జారీ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా పూర్తి కాలేదు. చాలాచోట్ల ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వేలాది మందికి నేటికీ ఆహారభద్రత కార్డులు అందలేదు. దీంతో ప్రజలు రేషన్ కార్డులు తీసుకుని చౌక దుకాణాల వద్దక వెళుతున్నారు. ఆహారభద్రత కార్డులుంటేనే రేషన్ ఇస్తామని డీలర్లు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళన పడుతున్నారు. మరోవైపు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం రేషన్‌కార్డుల ఆధారంగానే సరకులు పంపిణీ చేయాలని ఆయా ప్రాంతాల్లోని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రాంతాల్లో ఆహారభద్రత కార్డుల ప్రక్రియ పూర్తిస్థాయిలో కానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారభద్రత కార్డులు తమకు అందనందున రేషన్ కార్డులపైనే సరుకులు ఇవ్వాలని ప్రజలు ఒత్తిడి తెస్తుండటంతో రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినప్పటికీ అక్కడినుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. రెండింటితోనే సరి.. మరోవైపు జనవరి కోటాకింద జిల్లాలోని రేషన్ దుకణాలన్నింటికీ ఈసారి బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా అయ్యాయి. కిరోసిన్ పంపిణీ చేశామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా రేషన్ దుకాణాల్లో వాటి జాడ కన్పించడం లేదు. పామోలిన్ అయితే గత ఆరేడు నెలలుగా పంపిణీ చేయడం లేదు. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే పామోలిన్ పంపిణీని నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. గోధుమలు, గోధుమపిండి, ఉప్పు వంటి వస్తువులు కూడా రేషన్ దుకాణాల్లో ఇవ్వడం లేదని ప్రజలు చెబుతుండగా, ఆయా వస్తువులకు సంబంధించిన స్టాకు సిద్ధంగా ఉందని అధికారులు వివరణ ఇస్తున్నారు. అయితే ఈ వస్తువులకు సంబంధించి నాణ్యత లేకపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఇక అమ్మహస్తం కింద గత కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది వస్తువులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. వాస్తవానికి పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పాత రేషన్‌కు తోడు పండుగ నజరానాగా నెయ్యి, శనగలు, బెల్లం, పామోలిన్ వంటి ఆరు వస్తువులను ఆదనంగా అందజేసే పనిలో పడింది. తెలంగాణలో మాత్రం ఉన్న వాటికే కత్తెర వేస్తోందని రేషన్ డీలర్లు, ప్రజలు వాపోతున్నారు. 15 శాతం కోటా కట్ జనవరి నెలలో రేషన్ డీలర్లకు 10 నుంచి 15 శాతం మేరకు సరుకుల్లో విధించారు. ఆహారభద్రత కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఆ మేరకు బియ్యం, చక్కెర వంటి సరుకుల్లో కోత విధించినట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి రేషన్ దుకాణంలో ప్రతినెలా పంపుతున్న బియ్యం కోటాతో పోలిస్తే ఈసారి సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని తక్కువగా పంపినట్లు కరీంనగర్ పట్టణానికి చెందిన రేషన్ డీలర్ ఒకరు పేర్కొన్నారు. హాలో.. మీకు పండుగ సరుకులు అందాయా? జనవరిలో పాత కోటాకే కోతలు విధిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి రేషన్ డీలర్లకు విచిత్రమైన ఫోన్లు వస్తున్నాయి. బుధవారం నగరంలోని ఓ రేషన్ డీలర్‌కు 8333999999 అనే టోల్‌ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఁఈనెల మీకు బెల్లం, నెయ్యి, కొబ్బరి, చక్కెర, శెనగలు, పామోలిన్ అదనంగా పంపాం. అవి మీకు చేరినట్లయితే 9 బటన్ నొక్కండి. అందనట్లయితే 6 బటన్ నొక్కండి* అనే సమాధానం అక్కడినుంచి వచ్చింది. దీంతో విస్తుపోయిన సదరు డీలర్ మిగిలిన డీలర్లకు ఫోన్లు చేసి మీకేమైనా పండుగ కోటా వచ్చిందా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. వాళ్లకు సైతం ఈ మేరకు ఫోన్లు రావడంతో కొందరు డీలర్లు అధికారులకు ఫోన్లు చేసి విషయం అడిగి తెలుసుకునే పడ్డారు. జిల్లా పౌరసఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పండుగ కోటా ఏమీ ఇవ్వలేదని, ఆ నెంబర్ ఏపీ ప్రభుత్వానిదై ఉంటుందని వివరణ ఇచ్చారు. అందరికీ రేషన్ ఇస్తున్నాం : డీఎస్వో చంద్రప్రకాష్ జిల్లాలో ఆహారభద్రత కార్డులున్న ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో ఆహారభద్రత కార్డుల ప్రక్రియ పూర్తి కానందున అక్కడ మాత్రం రేషన్‌కార్డుల ఆధారంగానే సరకులు పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించామన్నారు. జిల్లాలో 9,92,457 రేషన్‌కార్డులుండగా, వాటి స్థానంలో ఆహార భద్రతాకార్డులను ప్రవేశపెట్టామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 9.45 ల క్షల ఆహారభద్రత కార్డులను పంపిణీ చేశామని, ఈ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందన్నారు. ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిర్ణీత గడువు లేదని, నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న సంవత్సర ఆదాయ పరిమితిని పెంచినందున రేషన్‌కార్డులతో పోలిస్తే అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఆహారభద్రత కార్డులు పంపిణీ చేసే అవకాశాలున్నారు. పండుగ కోటా అంశాన్ని ప్రస్తావించగా... ఈ ఏడాది పండుగ కోటా ఇవ్వని మాట వాస్తవమేనన్నారు. అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత లేనందున ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అయితే పేదలకు నాణ్యతతో కూడిన మరిన్ని వస్తువులు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. -
సమస్యలు పారిపోవాలె: కేసీఆర్
* సీఎం వస్తే అగ్గి మండాలె.. వరంగల్ పర్యటనలో కేసీఆర్ * మూడు రోజులుగా బస్తీల్లో పర్యటన.. పేదలతో మమేకం * పింఛన్లు, రేషన్‌కార్డులు, రోడ్లు, ఇళ్లపై పేదలకు భరోసా * నగరాభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి, సమీక్షలు.. తక్షణ ఆదేశాలు * మూడోరోజు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల సందర్శన * గరీబ్నగర్ను అమీర్‌నగర్‌గా మారుస్తానని హామీ * మహిళలు బిందెలతో బయటికొస్తే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న సీఎం * నేడు ఇళ్ల కాలనీలకు శంకుస్థాపన * రేపు కూడా జిల్లాలోనే.. ఐనవోలు పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం! ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి చూపిస్త. మీకు మొదట ఇళ్లు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పిస్త. - గరీబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి జూపిస్త’ అని వరంగల్ జిల్లాలోని పేదలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. మూడు రోజులుగా జిల్లాలోనే పర్యటిస్తున్న కేసీఆర్.. తన పర్యటన తర్వాత వరంగల్‌లో సమస్యలు ఉండకూడదని అధికారులను ఉద్దేశించి అన్నారు. బస్తీవాసులకు ఇళ్లు నిర్మించి నగరాన్ని అభిృవృద్ధి చేస్తామని చెప్పా రు. గురువారం నుంచి వరంగల్ జిల్లాలోనే పర్యటిస్తున్న సీఎం.. శనివారం కూడా అధికారులతో కలసి పలు ప్రాంతాలకు వెళ్లారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎస్ఆర్నగర్, పరకాల నియోజకవర్గంలోని గరీబ్‌నగర్ బస్తీలను రెండు గంటలపాటు సందర్శించారు. పేదల ఇళ్లలోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై అక్కడున్న వారికి భరోసా ఇచ్చారు. అధికారులు వెంటనే సర్వే చేసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తారని చెప్పారు. రెండు బస్తీల్లో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఈ గరీబ్‌నగర్‌కు నా పర్యటన లేకుండె. మీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ కడియం శ్రీహరి పట్టుబట్టిండ్రు. వస్తవా.. చస్తవా అని నన్ను గొర్రెను గుంజుకొచ్చినట్లు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. నేను ఇక్కడికి వచ్చుడు మంచిదైంది. ఎవడో దుర్మార్గుడు ఈ ఊరికి గరీబ్‌నగర్ అని పేరుబెట్టిండు. ఇది అమీర్‌నగర్ కావాలె. కలెక్టర్ గారు ఇది ప్రజల డిమాండ్. గరీబ్నగర్ను అమీర్‌నగర్‌గా మార్చాలి. ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి చూపిస్త. మీకు మొదట ఇళ్లు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పిస్త. తర్వాత సామాజిక పరిస్థితులను బట్టి ఉపాధి అవకాశాలను కల్పించేలా చేస్తా. ముందుగా అధికారులు సర్వే చేస్తరు. అర్హులను గుర్తిస్తారు. ఈ బస్తీల్లో అందరూ పేదలే. పింఛన్లు, కార్డులు అందరికీ వస్తయి. వారం రోజుల్లో మళ్లీ వచ్చి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా. ఎస్ఆర్ నగర్ బజార్లు బజార్ల లెక్క లేవు.. బండలు, రాళ్లు ఉన్నయి. ఇవి మారాలె. త్వరలో గరీబ్‌నగర్‌లో ఇంటింటికీ బల్దియా నల్లాలు పెట్టిస్తా. ఏ ఒక్క మహిళ బిందె పట్టుకుని నీళ్ల కోసం బయటికెళ్లినా మీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్ రాజీనామా చేయాలె. రాజీనామా ఎందుకుగాని ఇక్కడ ఉండి గట్టిగ పని జేయించుండ్లు’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘మీరు కొత్త ఇళ్లలోకి వచ్చినాక నాకు మంచి దావత్ ఇవ్వాలె. ఇత్తరా.. లేదా? గుడుంబాతో వద్దు. ముందు దాని సంగతి చూడాలె. గుడుంబాకు వ్యతిరేకులెవరో చేతులెత్తండి(సభలోని మహిళలు చేతులెత్తారు). మగవాళ్లు కూడా ఎత్తాలె. ప్రాణాలు తీసే గుడుంబాను బంద్బెట్టాలె’ అని బస్తీ వాసులతో కేసీఆర్ అన్నారు. డిప్యూటీ సీఎం రాజయ్య, జడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా సీఎం వెంట పర్యటించారు. సందర్శకులతో రెండు గంటలు జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే కేసీఆర్ బస చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. ఉదయం ప్రముఖ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు దాదాపు 2 వేల మంది వరకు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని బారీకేడ్లతో నిరోధించారు. భారీగా ప్రజలు తరలివచ్చిన విషయం తెలుసుకుని వారిని అనుమతించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటి ఆవరణలోనే అందరినీ కలిశారు. వినతులు, విజ్ఞప్తులు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారు, ఉద్యోగ సంఘాల నేతలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో కేసీఆర్‌ను కలిశారు. అందరి సమస్యలను ఆయన ఓపికగా విన్నారు. మధ్యాహ్మం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సందర్శకులతోనే బిజీగా గడిపారు. ‘కల్యాణలక్ష్మి’ ప్రారంభం వరంగల్ జిల్లాలో ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తొలిసారిగా 23 పెళ్లి జంటలకు రూ. 51 వేల చొప్పున మొత్తం రూ. 11.73 లక్షలను మంజూరు చేశారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను శనివారం జిల్లా కలెక్టరేట్లో పెళ్లి జంటలకు సీఎం స్వయంగా అందజేశారు. కేసీఆర్ కేరాఫ్ వరంగల్! ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 8న ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చిన కేసీఆర్ 3 రోజులుగా జిల్లాలోనే ఉన్నారు. ఆదివారం కూడా వరంగల్‌లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం వరకు ఆయన వరంగల్‌లోనే ఉంటారని తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుం డా జిల్లాకు వచ్చిన కేసీఆర్ ఎప్పుడు హైదరాబాద్‌కు వెళతారో ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ పర్యటన వెనుక కారణాలేమిటన్న దానిపై ఇటు రాజకీయవర్గాల్లో, అటు అధికారుల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. సాధారణంగా ఒక సీఎం జిల్లా కేంద్రంలో 4 రోజులు ఉండడం అరుదైన విషయమే. ఈ పర్యటనలో ఆయన పలు లక్ష్యాలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. పరిపాలనను వేగవంతం చేయడం, విమర్శలు ఎదుర్కొం టున్న సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై పేదలకు భరోసా ఇవ్వడం, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం, ఈ నగరంలో మేయర్ స్థానం దక్కించుకోవడం లక్ష్యాలుగా కేసీఆర్ వరంగల్ పర్యటన సాగుతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. వరంగల్‌లోని బస్తీల్లోనే పర్యటిస్తున్నారు. పేదల ఇళ్లలోకి వెళ్లి నేరుగా ముచ్చటిస్తున్నారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే కాకుండా.. సీఎంగా ఉన్నా తాను ఒకే రకంగా ఉంటాననే సందేశమిచ్చేలా సీఎం పర్యటన ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చిన తర్వాతే వరంగల్ వీడి వెళ్తానని స్పష్టం చేసిన కేసీఆర్.. అందుకు త గ్గట్టే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. గురువారం పర్యటించిన బస్తీల్లో కొత్త ఇళ్ల కాలనీలకు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు. తాను ప్రకటించిన వాటి అమలు కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి. ఇందులో సీఎం పాల్గొంటారని సమాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్ చర్యలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. -
24 గంటల్లో ఇళ్లపట్టాలు: కేసీఆర్
వరంగల్: దీన్‌దయాళ్‌నగర్‌లోని మురికివాడలలోని పేదలందరికీ అధికారులతో సర్వే చేయించి 24గంటల్లో ఇళ్లపట్టాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ దీన్‌దయాళ్‌నగర్‌లోని మురికివాడలను పరిశీలించి, అక్కడి ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చించారు. మురికివాడలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అలాగే రేషన్‌కార్డు, పెన్షన్ లబ్ధిదారులను కూడా గుర్తిస్తామన్నారు. -
టార్గెట్ కేసీఆర్
ఇందూరు : పెట్టుబడిదారులు, కేసీఆర్ కు టుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజల కోసం కాదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రిని ఇంతకుముందు చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ చౌరస్తాలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం జరిగిన టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం ఆ ద్యంతం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యంగా సా గింది. సమావేశంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపి వేది కపై ఉన్న టేబుల్‌ను లాగిపడేసిన సందర్భం గా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై విరుచుపడి చితకబాదారు. ఈ ఘటనను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలను తమ పార్టీ కార్యకర్తలు ఆడుకున్నారని పేర్కొన్నారు. ‘‘మా పార్టీ కార్యకర్తలు నిప్పురవ్వలు. కేసీఆర్... మీ పార్టీ కార్యకర్తలను పంపి చూడు మా వారిని ముట్టుకుంటే కాలిపోతా రు. మమ్మల్ని పట్టుకుంటే కరెంట్ తీగలను పట్టుకున్నట్లే’’ అని సవాల్ విసిరారు. అమరులకూ అన్యాయం ప్రజలను భిక్షం ఎత్తుకునే విధంగా చేస్తున్నారని కేసీఆర్‌పై రేవంత్ విమర్శల దాడికి దిగా రు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మందికి పైగా అమరులైతే 459 మందే ఉన్నారని చెప్పి కేసీఆర్ మిగతా బాధిత కుటుంబాలకు ఎలాం టి ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సర్వేలో కోళ్లు, మేకలు, పశువులు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, అవయవాలను కోల్పోయినవారి వివరాలను ఎందుకు అ డిగించలేదని ప్రశ్నించారు. జిల్లాలో గెలి చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పనికిమాలినవారేనన్నారు. టీఆర్ఎస్లో చేరిన పెద్ద మీ సాలాయన మీసాలకు సంపంగి నూనె ఇచ్చిం ది టీడీపీయేనని అన్నారు. ఇతర పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీచేయించాలన్నారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు కో ల్పోయినవారి ఉసురు ఊరికే పోదన్నారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడ అవకాశం కల్పించలేదన్నారు. దళితులకు భూములిచ్చే బదులు వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తే వడ్డీ నిధులతో కుటుంబాలు బతుకుతాయని సూచించారు. జిల్లాలో నడుస్తున్న ఇసుక దందాలో ఏ మంత్రి కొడుక్కు నెలానెలలా రూ. కోటి ముడుపులు ఇస్తున్నారో తెలి యదా అని ప్రశ్నించారు. టీడీపీలో కొనసాగిన సమయంలో అక్రమ ఇసుక దందాలను అడ్డుకున్న మంత్రి నేడు స్వయంగా ఇసుక దందా నడిపిస్తున్నారని ఆరోపించారు. రూ. లక్ష కోట్ల నిధులు వారికే టీటీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రూ. లక్ష కోట్ల నిధులను పారించి కుటుంబసభ్యులకే ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. రైతన్నకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పది లక్షల సభ్యులున్న పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, కార్యకర్తల శ్రమను టీడీపీ ఎన్నటికీ మరిచి పోదన్నారు. అనంతరం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 44 మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజే శారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించకుండా, కేసీఆ ర్ తన కూతురు బతుకమ్మ ఆడేందుకు రూ.10 కోట్లు ఇవ్వడం దుర్మార్గమైన చర్యేనన్నారు. ఏడు మాసాల్లో 700 మందికి పైగా రైతులు చనిపోతే పట్టించుకున్న పాపన పోలే దని, రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అం దిస్తున్న టీడీపీని చూసి ఓర్వలేక దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు. టీడీపీ టాటా కంపెనీ లాంటిది టీడీపీ జిల్లా కన్వీనర్ ఎమ్మెల్సీఅరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ టాటా కంపెనీ లాంటిదని, ఎంత మంది నాయకులనైనా తయారు చేసుకునే సత్తా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మోస పోయారని, మళ్లీ ఎన్నికల్లో టీడీపీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమాలను మొదలు పెట్టి మెడలు వంచుతామన్నా రు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ హామీని మరిచిపోయాడని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, రాజారాం యాదవ్, అమర్నాథ్ బా బు, బద్యానాయక్, తారాచంద్ నాయక్, వినో ద్, వేణు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్‌కు మంగళం!
జనవరి నుంచి 2.60 లక్షల మందికి సరకులు లేనట్టే.. సంక్రాంతి కానుకకూ వీరు దూరం యూఐడీ సీడింగ్ కాలేదంటూ సాకు రచ్చబండ కూపన్లూ రద్దు విశాఖపట్నం : జిల్లాలోని రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి రేషన్ సరకులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. సర్కారు విధిస్తున్న నిబంధనలు కార్డుహోల్డర్లపాలిట శాపంగా పరిణమించి రేషను అందకుండా చేయనున్నాయి. రూ.500కు పైబడి విద్యుత్ బిల్లులు వస్తున్నాయంటూ ఇప్పటికే 50వేల రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే రచ్చబండలో ఇచ్చిన 69వేల కూపన్లకూ జనవరి నుంచి సరకులకు మంగళం పలకనుందని తెలిసింది. కార్డుల్లో యూఐడీ సీడింగ్ కాలేదంటూ మరో 8.76లక్షల మందికి సరుకులు నిలిపి వేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2.60లక్షల కార్డుదారులకు కొత్త సంవత్సరం ఆరంభం నుంచి రేషను అందనట్టే. వరుస కత్తెర ఇలా: జిల్లాలో10,76,313 కార్డులపరిధిలో 4,13, 283 కార్డుదారులు(అన్‌సీడెడ్ యూనిట్స్)ను తొలగిం చారు. యూనిక్ ఐడీ సీడింగ్ కాని 7,50,354 సభ్యులతో పాటు ఇంతవరకు సీడింగ్ కాని 1,25,519 మందికి జనవరి నుంచి సరుకులు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియవచ్చింది. యూఐడీ నెంబర్లతో సీడింగ్ చేయించుకున్న వారికి మాత్రమే సరుకులు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్టుగా చెబుతున్నారు. గతసర్కార్ రచ్చబండ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 38,624, సిటీలో 57,276 కూపన్లు పంపిణీ చేసింది. వీటికి ఆధార్, ఫామిలీ ఫోటోలు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో 80 శాతంమంది సమర్పించినా సిబ్బంది వైఫల్యంతో అప్లోడ్ కాలేదని సమాచారం. సిటీలో 32,218, రూరల్ పరిధిలో 26,254మంది కూపన్లవారికి జనవరి 1వ తేదీ నుంచి సరుకులు నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలొచ్చినట్టు తెలిసింది. ఉచిత సరకుల జాబితాలో రచ్చబండ కూపన్ దారులు లేరని డీలర్లు బాహాటంగానే చెబుతున్నారు. యూఐడీ సీడింగ్ కాని వారితో పాటు రచ్చబండ కూపన్‌దారులకు పంపిణీ చేయనవసరం లేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి కానుక కొందరికే: సంక్రాంతికి సర్కారు ప్రకటించిన రాయితీ కొందరికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. నెలవారీ ఇచ్చే బియ్యం,పంచదారతో పాటు అరకేజి పామాయిల్, అరకేజి కందిపప్పు, కేజీ శెనగలు, కేజీ గోధుమ పిండి, వంద గ్రాముల నెయ్యి, అరకేజి బెల్లంతో కూడిన కిట్‌ను సంక్రాంతి కానుక పేరిట అల్పాదాయ వర్గాల వారికి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో నిరుపేదలైన కార్డుదారులంతా ఆనందపడ్డారు. సర్కారు కార్డులకు ఎసరు పెడుతుండటంతో రెండున్నర లక్షల మంది రేషనుతోపాటు ఈ సంక్రాంతి కిట్టును పొందే అవకాశం కోల్పోతున్నారు. పై విషయాలను కలెక్టర్ ఎన్.యువరాజ్ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమిలేదన్నారు. ఇంత వరకు అధికారికంగా ఆదేశాలు రాలేదని చెప్పారు. -
అర్హత సాధించిన ‘ఆహార భద్రత’ 8,35,000
నల్లగొండ : ఆహారభద్రత కార్డుల పరిశీలన దాదాపు పూర్తికావొచ్చింది. దరఖాస్తుల పరిశీలనకు విధించిన గడువు శనివారంతో ముగిసింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 8,35,000 దరఖాస్తులు ఆహారభద్రత కార్డు పొందేందుకు అర్హత సాధించాయి. జిల్లావ్యాప్తంగా 11,05,000 దరఖాస్తులు రాగా, అధికారులు 10.80 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. శనివారం సాయంత్రానికి కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే పెండి ంగ్‌లో ఉన్నాయి. పాత లెక్కల ప్రకారం జిల్లాలో 9.30 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే కార్డుల సంఖ్య తగ్గినప్పటికీ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం కుటుంబాలకు ఆహారభద్రత కార్డులు అందనున్నాయి. అర్హత సాధించిన దరఖాస్తుల్లో మొదటిస్థానంలో నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లు ఉండగా, దేవరకొండ డివిజన్ చివరిస్థానంలో ఉంది. డేటా ఎంట్రీ షురూ... ఆదివారం నుంచి అర్హత సాధించిన దరఖాస్తుల వివరాలను ఈ-పీడీఎస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రేషన్‌దుకాణం పేరును క్లిక్ చేయగానే, ఆ దుకాణం పరిధిలోని వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే రేషన్‌కార్డులకు ఆధార్ కార్డు నంబర్ సీడింగ్ చేసినందున, ఆ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాలు మొత్తం ఈ- పీడీఎస్‌కు అనుసంధానం చేస్తారు. అయితే డేటాఎంట్రీ చేసే క్రమంలో మార్పులు,చేర్పులు చేస్తారు. అంటే పాతకార్డులో ఉన్న కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించినా లేదా కొత్తగా పేర్లు చేర్చాల్సి వస్తే వాటిని జత చేస్తారు. అంతోద్యయ కార్డులు కలిగిన వాటిని కూడా వేరు చేస్తారు. ఈ కార్డుదారులకు కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా ప్రభుత్వం 35 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చే స్తుంది. మారిన మార్గదర్శకాల ప్రకారం ఆహార భ ద్రత కార్డుదారులకు కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా, ఒక్కొక్కరికి 6 కేజీలు చొప్పున పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ రెండు రకాల కార్డులను వేరు చేస్తారు. అనంతరం తహసీల్దార్ల ఆమోదానికి పంపుతారు. డేటాఎంట్రీలో పేర్కొన్న వివరాలు సవ్యంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆహారభద్రత కార్డులకు తహసీల్దార్లు ఆమోదముద్ర వేస్తారు. ‘కీ’రిజిష్టర్ ద్వారానే బియ్యం పంపిణీ... కొత్త కార్డుల పంపిణీ ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి... లబ్ధిదారులకు జనవరి 1 నుంచి ‘కీ’రిజిష్టర్ ఆధారంగానే బియ్యం పంపిణీ చేయనున్నారు. జవనరి 20 నాటికి కొత్తకార్డులు సిద్ధమవుతాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు నల్లగొండ, భువనగిరి డివిజన్లలోని 30 దుకాణాల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దుకాణాల వారీగా ఎన్ని కార్డులు ఉన్నాయో లెక్కకట్టి ఆ ప్రకారంగా డీలర్ల నుంచి డీడీలు కట్టించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుబాటులో బియ్యం... ఆహారభద్రత కార్డులకు సరిపడా బియ్యాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ అందుబాటులో ఉంచింది. పాతలెక్కల ప్రకారం 9.30 లక్షల కుటుంబాలకు 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా, తాజాగా పెరిగిన కోటా ప్రకారం జిల్లాకు ప్రతినెలా 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికిగాను ఇప్పటికే జిల్లాలో లక్షా మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.