సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (రేషన్) కార్డుతో మెలిక పెట్టడంతో గ్రేటర్‌లో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అర్హతలున్నా..కేవలం రేషన్ కార్డులు లేని కారణంగా దాదాపు 18 లక్షల కుటుంబాలు ఈ పథకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై లబి్ధదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహానగరంలో దారి్రద్యరేఖకు దిగువనగల దాదాపు 38 శాతం పైగా కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, జీరో విద్యుత్ బిల్లు లబ్ధి చేకూరనుంది.
మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీ పధకాల్లో భాగంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పధకాలు ప్రారంభించారు. ప్రభు త్వం రెండు పథకాల వర్తింపునకు రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలను మాతమే అర్హులుగా గుర్తించింది. అయితే..నగర పరిధిలో సగానికి పైగా నిరుపేద కుటుంబాలకు రేష¯న్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడగా, మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు మొక్కుబడికి పరిమితమైంది. దీంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది.
బీపీఎల్ కుటుంబాలు 28 లక్షలపైనే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 48 లక్షలకుపైగా కుటుంబాలు ఉండగా..అందులో దారిద్య్రరేఖకు దిగవన గల కుటంబాలు 28 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర జిల్లాల తెల్ల రేష¯Œన్ కార్డులు కలిగిన కుటుంబాలు మరో ఐదు లక్షలకు పైగా ఇక్కడే నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో ఆరు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. అందులో ఇటీవల జరిగిన ప్రజా పాలనలో సుమారు 5.73 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవంగా గత పదేళ్లలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నగర పరిధిలో కేవలం 1.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేసింది. పెళ్లిళ్లయి కొత్తగా ఏర్పాటైన చాలా కుటుంబాలకు రేష¯Œన్ కార్డులు లేవు. అలాంటి కుటుంబాలు సుమారు 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అందులో సగం కుటుంబాల వరకు కొత్త రేషన్‌న్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.
10.80 లక్షల కనెక్షన్లకే వర్తింపు
మహానగర పరిధిలో సుమారు 10.80 లక్షల గ్యాస్, విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే పథకాలు వర్తించనున్నాయి. అధికారికంగా గహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన కుటుంబాలు సుమారు 30 లక్షల వరకు ఉండగా, మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. అదేవిధంగా గృహోపయోగ విద్యుత్ కనెక్షన్లు సుమారు 48.03 లక్షలకు పైగా ఉండగా, అందులో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు సుమా రు 30 లక్షలకుపైగా ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రజాపాలన సందర్భంగా దాదాపు 19.80 లక్షల వరకు కుటుంబాలు సబ్సిడీ వంటగ్యాస్, ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటికి రేషన్‌న్‌కార్డు, ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడంతో అందులో సుమారు 10.80 లక్షల కుటుంబాలు మాత్ర మే అర్హత సాధించాయి. దీంతో మిగతా కు టుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment