Gas Cylinder
-
పొయ్యిల కట్టెల కష్టాలు !
సిరిసిల్ల: ఎలక్ట్రిక్ కుక్కర్, గ్యాస్ సిలిండర్‌పై వంట లు చేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు వంటకు కట్టెలనే వినియోగిస్తున్నారు. సగటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగైందని నివేదికలు వస్తున్నా ఆకలిమంటను తీర్చుకునేందుకు వంట చేయాలంటే కట్టెల పొయ్యిని వెలిగించాల్సిందే. ఇంటింటికీ దీపం పథకంలో ఉచితంగా సిలిండర్లు ఇచ్చామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటించిన సిరిసిల్ల కార్మికక్షేత్రంలో ఇంకా కొందరు పేదలు వంట కోసం కట్టెల వేటలో కష్టాలు అనుభవిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని పేద కుటుంబాలు వారంలో ఒక్క రోజు ఇలా ఎండిన కట్టెల కోసం సిరిసిల్ల శివారులో అన్వేషిస్తున్నారు. దొరికిన కట్టెలను మోపులుగా కట్టుకుని నెత్తిన మోస్తూ ఇంటికి చేరుతున్నారు. సిలిండర్ కూడా కొనలేని స్థితిలో కట్టెలను నమ్ముకుని ఇలా కష్టాలను అనుభవిస్తున్నారు. వంట బాధ్యత మహిళలదే కావడంతో కట్టెలను సమకూర్చుకునే అదనపు బాధ్యతలు తీసుకుంది. సిరిసిల్లలో నిత్యం కట్టెల వేటలో మహిళలు సర్కారుతుమ్మ, తుంపల్లో తిరుగుతూ కట్టెలు, కాగితం అట్టపెట్టెలను ఏరుతూ కనిపిస్తున్నారు. ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి. కానీ గిన్నెలపై మా నాన్న పేర్లు’ ఉన్నాయని ఓ మహిళా రచయిత్రి పురుషాధిక్య సమాజాన్ని రెండు దశాబ్దాల కిందటే ప్రశ్నించారు. కట్టెల కష్టాలకు ఎదురీదుతూ వండివారుస్తున్న ‘ఆమె’కు వందనం. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో ఇంకా సిలిండర్ లేని కుటుంబాలను గుర్తించి వారికి ఉచితంగా ‘దీపం’ పథకంలో సిలిండర్లు అందిస్తే ఇలాంటి కట్టెల కష్టాలు తీరుతాయి. -
వంట చేస్తుండగా పేలిన సిలిండర్
-
అందరికీ కాదు.. కొందరికేనా..!
అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు. విజయనగరం అర్బన్: ‘ఆడపడుచుల కష్టం తీర్చుతా.. మీకు తెల్లకా ర్డు ఉంటే చాలు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. నా మాట నమ్మండి..’ ఇదీ గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత గ్యాస్‌కు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అమలు పేరుతో గ్యాస్ తుస్సుమనిపించారు. అన్ని అర్హతలుండీ సిలిండర్లు పొందిన వారిలోనూ వేలాది మందికి ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత గ్యాస్ పేరిట మరోసారి పొగ పె ట్టారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం మాట మూన్నాళ్ల ముచ్చటగా మారింది. డబ్బులిచ్చి గ్యాస్ కొంటే నగదు రానంటోంది.ఉచిత గ్యాస్ డబ్బులు కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు నగదు కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై మహిళ లు మండిపడుతున్నారు. సూపర్ సిక్స్ ప్రామాణికంగా కూటమిలో టీడీపీ ఇచ్చిన హామీ ఉచిత గ్యాస్ పథకం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత ఉచిత గ్యాస్ పథకాన్ని హడావుడిగా తెరపైకి తీసుకొచ్చింది. ఉచితం అంటూ లబ్ధిదారులపై తొలుత భారం వేసి ఆ తరువాత నగదు బ్యాంకు ఖాతాకు జమ వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చింది. అయితే ఈ గ్యాస్ ఉత్తి గ్యాస్ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి రోజున ప్రకటించిన ఈ ఉచిత గ్యాస్ బండ పేలని టపాసులా మిగిలింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న 6 వేల మంది జిల్లాలో 5.5 లక్షల మంది తెల్లకార్డుదారులు ఉన్నా రు. వీటిలో దాదాపు 3 లక్షల మంది వరకు మూడు గ్యాస్ ఏజెన్సీల నుంచి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పథకం అమలు చేసిన తరువాత సిలిండర్ కోసం బుకింగ్ చేసిన 3 లక్షల 60 వేల 461 మహిళామణులలో 6 వేల మందికి ఇప్పటికీ డబ్బులు అకౌంట్ లో జమ కాలేదు. నిర్ణీత సమయంలోపు వంట గ్యా స్ నగదు ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారు లు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్యాస్ నగదు వివరాల కోసం ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.టోల్ ఫ్రీ కూడా డమ్మీ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1967కి తెలియజేయొచ్చని విస్తృత ప్రచా రం చేసారు. అయితే ఈ నంబరు డమ్మీలాగ ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండడం లేదు. ఈ కారణంగా గ్యాస్ ఏజెన్సీ వద్ద లబ్ధిదారు లు క్యూ కడుతున్నారు. వారు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఉచిత గ్యాస్ పథకం అందరికీ కాదని.. కొందరికేనా... అని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఫ్రీ గ్యాస్ పథకంలో మోసాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ బొత్స
-
Hyderabad: పేలిన రిఫ్రిజిరేటర్ సిలిండర్
మణికొండ: రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్‌కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్.. గోల్డెన్ ఓరియల్లో రెండు బ్లాక్‌ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.కేసు నమోదు గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
ఆంధ్రప్రదేశ్‌లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం
-
ఆ పథకం ‘గ్యాసే’నా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అందని ద్రాక్షగానే తయారైంది. ఒక కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. లబి్ధదారులు కలెక్టరేట్ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దరఖాస్తులు సవరించుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపేదలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాదిరిగానే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాపాలనలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్ కుటుంబాలను గుర్తించింది. అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత సాధించిన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం అందడం లేదు. ఇదీ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ పరిధిలో అధికారికంగా గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్ కలిగిన కుటుంబాలు 30.18 లక్షలకు పైనే ఉన్నాయి. అందులో 20 శాతం మినహా మిగతా 80 శాతం కుటుంబాలు మ హాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం పది శాతం దరఖాస్తుదారులకు కూడా గ్యాస్ సబ్బిడీ వర్తించలేదు. పరిష్కారమేదీ? గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్యాస్కనెక్షన్ నెంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్లను సవరించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రూర్కీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు. ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజయ్ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలుఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్ స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్ దిగువ భాగంలోని రబ్బర్ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు. -
పండుగ పూట మరో మంట! మొన్న నూనె.. ఇవాళ..
పండుగల పూట.. మొన్న నూనె.. ఇవాళ మరో మంట -
రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా?
సాక్షి, హైదరాబాద్: రూ.500 లకే గ్యాస్ సిలిండర్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 42,90,246 కుటుంబాలకే అందుతోంది. మొదటివిడత ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాల్లో కోటి ఐదు లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 89,21,269 దరఖాస్తులను కంప్యూటరైజ్ చేశారు. కానీ ఇందులో సగానికన్నా తక్కువ 42.90 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు అర్హులుగా ఎంపిక చేశారు.వీరికి గత ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు 56,46,808 గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని భరించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలకు రూ.168.17 కోట్లు చెల్లించింది. రేషన్‌కార్డు (ఆహారభద్రత కార్డు) ఉన్న ప్రతీ కుటుంబానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచి్చన హామీని నెరవేర్చాలనే తొందరలో లబి్ధదారుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డు ఉన్నా... రాష్ట్రంలో భారత్, ఇండేన్, హెచ్పీలకు చెందిన కోటి 30 లక్షలకు పైగా గృహావసర (డొమెస్టిక్) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మినహా రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్న వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలే అని ప్రభుత్వం భావిస్తే మహాలక్ష్మి పథకం కనీసం 70 లక్షల కుటుంబాలకైనా వర్తించాలి.కానీ ప్రస్తుతం కేవలం 42.90 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తుండడాన్ని బట్టి మహాలక్ష్మి పథకానికి రేషన్‌కార్డుతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 500 సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని రేషన్‌కార్డుదారులంతా కోరుతున్నారు. కాగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబి్ధదారుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. -
గ్యాస్ దొంగ ను ఎప్పుడైనా చూసారా..!
-
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
అయ్యో పాపం.. గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి కుటుంబం
మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసివారిది 10 ఇన్ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్ వాసన వస్తోంది.ఒక రోజంతా అలాగేసోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్‌కాల్ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్ సిలిండర్లను విచారణ కోసం సీజ్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్ రమేశ్ బానోత్ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్ లీక్ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా 19 కిలోగ్రాముల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గింది. సవరించిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీలో రూ.1,745.50, ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కోల్‌కతాలో రూ.1,859 గా ఉన్నాయి. -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రేటుకట్ చేస్తున్నట్లు తెలిపాయి. సవరించిన ధరల ప్రకారం చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.30.50 తగ్గించాయి. దిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50గా నిర్ణయించారు. ముంబయిలో రూ.1719గా ధర ఉంటుంది. చెన్నైలో రూ.1930, కోల్‌కతాలో రూ.1881గా ఉండనుంది. 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను రూ.7.50కు కట్ చేశారు. అయితే ఈ ధరలను క్రూడ్కంపెనీలు మార్చిలో పెంచిన విషయం తెలిసిందే. మారుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ లభ్యత వంటి పరిస్థితుల కారణంగా తాజాగా రేట్లను కట్ చేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను యథాతథంగానే 14.2 కేజీకు రూ.855గానే ఉంచినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ధరను రూ.955 నుంచి రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ -
Congress Guarantees: 10.80 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (రేషన్) కార్డుతో మెలిక పెట్టడంతో గ్రేటర్లో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అర్హతలున్నా..కేవలం రేషన్ కార్డులు లేని కారణంగా దాదాపు 18 లక్షల కుటుంబాలు ఈ పథకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై లబి్ధదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహానగరంలో దారి్రద్యరేఖకు దిగువనగల దాదాపు 38 శాతం పైగా కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, జీరో విద్యుత్ బిల్లు లబ్ధి చేకూరనుంది. మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీ పధకాల్లో భాగంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పధకాలు ప్రారంభించారు. ప్రభు త్వం రెండు పథకాల వర్తింపునకు రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలను మాతమే అర్హులుగా గుర్తించింది. అయితే..నగర పరిధిలో సగానికి పైగా నిరుపేద కుటుంబాలకు రేష¯న్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడగా, మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు మొక్కుబడికి పరిమితమైంది. దీంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. బీపీఎల్ కుటుంబాలు 28 లక్షలపైనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 48 లక్షలకుపైగా కుటుంబాలు ఉండగా..అందులో దారిద్య్రరేఖకు దిగవన గల కుటంబాలు 28 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర జిల్లాల తెల్ల రేష¯Œన్ కార్డులు కలిగిన కుటుంబాలు మరో ఐదు లక్షలకు పైగా ఇక్కడే నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో ఆరు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. అందులో ఇటీవల జరిగిన ప్రజా పాలనలో సుమారు 5.73 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవంగా గత పదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నగర పరిధిలో కేవలం 1.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేసింది. పెళ్లిళ్లయి కొత్తగా ఏర్పాటైన చాలా కుటుంబాలకు రేష¯Œన్ కార్డులు లేవు. అలాంటి కుటుంబాలు సుమారు 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అందులో సగం కుటుంబాల వరకు కొత్త రేషన్న్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. 10.80 లక్షల కనెక్షన్లకే వర్తింపు మహానగర పరిధిలో సుమారు 10.80 లక్షల గ్యాస్, విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే పథకాలు వర్తించనున్నాయి. అధికారికంగా గహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన కుటుంబాలు సుమారు 30 లక్షల వరకు ఉండగా, మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. అదేవిధంగా గృహోపయోగ విద్యుత్ కనెక్షన్లు సుమారు 48.03 లక్షలకు పైగా ఉండగా, అందులో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు సుమా రు 30 లక్షలకుపైగా ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రజాపాలన సందర్భంగా దాదాపు 19.80 లక్షల వరకు కుటుంబాలు సబ్సిడీ వంటగ్యాస్, ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటికి రేషన్‌న్‌కార్డు, ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడంతో అందులో సుమారు 10.80 లక్షల కుటుంబాలు మాత్ర మే అర్హత సాధించాయి. దీంతో మిగతా కు టుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. -
ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు పంపించింది. తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందనుంది. జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి రీఫిల్‌కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు. మార్చి1 అనంతరం జీరో బిల్లులు.. జిల్లాలో ఉచిత కరెంట్ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
గృహలక్ష్మీ: సిలిండర్‌కు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్ సిలిండర్) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్ చేయనుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. అలాగే తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురానున్నట్టు సమాచారం. -
రేషన్‌కార్డే ప్రామాణికం! లేకపోతే నో
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్ శాఖ, రూ 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కోత తప్పదా? రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ (గృహ వినియోగ) గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్‌కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్‌ను యాక్టివేట్ చేస్తారు. రేషన్‌కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. ఏడాదికి ఆరు సిలిండర్లు! గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి.. సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్ సిలిండర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్‌కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. -
Anantapur: పేలిన గ్యాస్ సిలిండర్
-
‘మహాలక్ష్మి’ సిలిండర్ల కోసం బారులు
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. వినియోగదారులు తమ వివరాలను (కేవైసీ) అప్డేట్ చేయించుకుంటే నే ఈ పథకం వర్తిస్తుందని జరిగిన ప్రచారంతో వారం రోజులుగా ప్రజలు గ్యాస్ కనెక్షన్ బుక్‌లు, ఆధార్‌కార్డులతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈనెల 28 నుంచి ప్రారంభం కాను న్న ‘ప్రజా పాలన’కార్యక్రమం ఎజెండాలో కూడా గ్యాస్ సిలిండర్ల అంశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇందులో మహాలక్ష్మి పథకానికి అర్హులెవరనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగుతుండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. రేషన్ తరహాలోనే గ్యాస్‌కూ... కేంద్ర ప్రభుత్వం అర్హులకు రేషన్ ఇచ్చేందుకు కార్డులో నమోదైన సభ్యులందరూ వేలిముద్రలు వేసి, ఈ–కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలిచ్చి ంది. దీంతో గత మూడు నెలలుగా రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ ప్రక్రియ సాగుతోంది. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ వేలిముద్రలు వేస్తున్నారు. రేషన్ కార్డుల్లో అర్హులను గుర్తించేందుకు కేవైసీ అప్డేట్ చేసినట్లుగానే వంటగ్యాస్ వినియోగదారులు సైతం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం చెప్పింది. అయితే, ఇది కేవలం గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుమీద ఉంది? కనెక్షన్ ఉన్న వ్యక్తి మరణించాడా లేక బదిలీ చేసుకున్నాడా? లేక కనెక్షన్ వద్దనుకుని వదిలేశాడా..అన్న అంశాలను తెలుసుకోవడానికేనని గ్యాస్ ఏజెన్సీలు చెప్పాయి. అయితే వినియోగదారులు ఈ–కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదనే అపోహతో గ్యాస్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. ఎలాంటి గడువు లేదు.. గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేవైసీ అప్డేట్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గడువును విధించలేదు. వినియోగదారుల సమగ్ర సమాచారం కోసం సేకరిస్తున్న కేవైసీ అప్డేట్కు మహాలక్ష్మి పథకానికి సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఏజెన్సీ బాయ్ ఇంటికొచ్చినప్పుడు కేవైసీ వివరాలు సేకరిస్తారని, ప్రజలెవరూ ఏజెన్సీల వద్దకు రావద్దని కోరారు. కాగా, గ్యాస్ వినియోగదారుల కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, పౌరసరఫరాల శాఖకు గానీ ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈకేవైసీ చేసుకుంటేనే ఇస్తారట.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గ్యాస్ బండ రూ. 500కే ఇస్తోందని చెప్పారు. అయితే ఈ–కేవైసీ చేసుకుంటేనే సబ్సిడీ వస్తుందన్నారు. అందుకోసమే ఒకరోజు పనికి పోకుండా గ్యాస్ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకుంటున్నా. కాలనీలోని అందరూ అప్డేట్ చేయించుకున్నారని ప్రచారం జరగడంతో నేను కూడా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చాను. – ఇస్లావత్ మురళి, మంగళి కాలనీ, మహబూబాబాద్ -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
రూ.500 గ్యాస్‌పై సర్కార్ ఫోకస్
నల్లగొండ : ఎన్నికల హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అధికారులతో చర్చించి విధి, విధానాలు ఖరారు చేస్తోంది. ప్రస్తుతం రూ.1000 చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందుతున్న వినియోగదారులు.. రూ.500కే సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.6.16 కోట్ల భారం నల్లగొండ జిల్లాలో మొత్తం 4,66,150 ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) ఉన్నాయి. హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,28,180 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి నెల లక్షా 30 వేల వరకు సిలిండర్ రీఫిల్లింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.974 ఉంది. రూ.500కే సిలిండర్ రీఫిల్లింగ్ చేసి ఇస్తే మిగిలిన రూ.474 ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అలా అయితే ఒక లక్షా 30 వేల సిలిండర్లను ప్రతి నెల రీఫిల్లింగ్ చేస్తే రూ.6.16 కోట్ల భారం పడనుంది. కార్డు లేని వారికి కూడా..! రేషన్ కార్డులు మొత్తం ఎన్ని ఉన్నాయి.. కార్డులు లేని వారు అర్హులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరిస్తోంది. గత ప్రభుత్వం పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నికల సందర్భంలో కొన్ని ఇచ్చినా ఇంకా పెండింగ్‌లో చాలా ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు ఉన్న వారితో పాటు లేని వారిలో కూడా అర్హులు ఉంటే సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్డు ఉన్నా.. లేకున్నా.. రూ.500కు సిలిండర్ ఇచ్చేలా విధి విధానాలు రూపకల్పన చేస్తుండడంతో పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద జనాల క్యూ.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ నమోదు చేసుకోవాలని పుకార్లు రావడంతో ప్రజలంతా గ్యాస్ ఏజెన్సీ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేసుకునేందుకు రద్దీ పెరుగుతోంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పినా.. జనం మాత్రం ఏజెన్సీల వద్ద భారీగా బారులుదీరుతున్నారు. -
రూ.500 గ్యాస్ సిలిండర్‌పై వదంతులు .. ఏజెన్సీల ముందు క్యూలు! (ఫొటోలు)
-
TS:రూ.500కే గ్యాస్ సిలిండర్..మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్ సప్లై అధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ‘గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్ తెలిపారు. ఇదీచదవండి..జనార్ధన్ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై -
గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ తెలుసుకోవడం ఎలా?
ప్రతి ఇంట్లో దాదాపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇంతకు ముందు అయితే వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి వాడేవాళ్లు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పల్లెటూర్లలో కూడా కట్టెల పొయ్యి వాడకం బాగా తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. అయితే కొందరు సిలిండర్ ఎన్ని రోజులు వాడాలి? దాని ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది చాలామందికి అవగాహన ఉండదు. అయితే సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దానిపై ఉండే ప్రత్యేక రకం కోడ్‌ను తప్పకుండా చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి. ఇంతకీ ఆ కోడ్ ఏంటి? ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు చూస్తుంటాం. అందుకే గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్లు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ఉండే కోడ్ నెంబర్లను బట్టి గడువు ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ కోడ్ అంటే ఏమిటి..? గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీని సూచిస్తుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D..సంవత్సరంలో 12 నెలలను చూపిస్తుంది. ఈ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ గురించి చెబుతుంది.ఏడాదిలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజిస్తారు. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీలు నెలలను సూచిస్తుంది. ఉదాహరణకు సిలిండర్లోపై A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు 23- జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్లలో ముగుస్తుందని అర్థం. దీన్ని బట్టి సిలిండర్ గడువు తేదీని అంచనా వేయొచ్చు. గడువు తేదీ దాటక సిలిండర్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదం. సిలిండర్ పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే తీసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ అయిపోయిన గ్యాస్ సిలిండర్‌ను తీసుకోరాదు. -
AP: గ్యాస్ సిలిండర్ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు
సాక్షి, అమరావతి: గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: రాహుల్
-
‘ఒంటె సిద్ధాంతా’నికి విరుగుడు..‘గుర్రం’ స్టెప్పు!
కాస్త ఊపిరాడేలా, కొద్దిగా గాలీ–వెలుతురూ వచ్చేలా..కూసంత ‘‘సౌకర్యంగా’’ ఉండే ఓ గుడారాన్ని అడుగుతాడు ఓటరు. ఈ ‘సౌకర్యం’ అనే మాట ఏలినవారికి ‘విశాలం’ అనేలా ధ్వనిస్తుంది. ‘కోర్కెలు అనంతాలూ..వనరులు పరిమితాలు’ అనే ఎకనమిక్స్ సిద్ధాంతం ఇటు ఓటరుకూ, అటు పాలించేవారికీ అడ్డుపడుతుంది.గుడారం సైజు పెంచలేం. కాబట్టి దాంట్లోకి ఒంటెను వదలమంటారు ప్రభువులవారు. ఒక్కసారిగా కాదు. మెల్లమెల్లగా. మొదట తల, మెడ, తర్వాత సగం వరకు..అటు పిమ్మట మొత్తం ఒంటె దేహాన్ని. ఆ పైన ఒంటెను కొద్దిగా బయటకు తెచ్చినా..ఆ చర్య ఇచ్చే కాస్తంత వెసులుబాటూ ఎంతో గొప్పగా, మరెంతో ‘విశాలం’గా, ఇంకెంతో ‘సౌకర్యంగా’ అనిపిస్తుంటుంది. ఇదీ ఒంటె సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అన్నది ఆల్వేస్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతుందని కనిపెట్టినవారు రాజకీయవేత్తలే. అందుకే ‘సైంటిస్టు’ల సంక్లిష్ట సూత్రాల కన్నా..మన పొలిటికల్ లీడర్ల ప్రాక్టికల్ సిద్ధాంతాలే మిన్న. ఈ సిద్ధాంతం అమల్లో కేంద్రంలోని పాలకులు ఇంకా గ్రేట్. వారు ఒకటీ, అరా కాకుండా ఏకంగా రెండుమూడు ఒంటెల్ని గుడారంలోకి ఒకేసారి ప్రవేశపెడతారు. వాటితో చాలాసేపు సహజీవనం చేయిస్తారు. ఆ తర్వాత ఒక్క ఒంటెను కాస్తంత బయటకు తెచ్చినా చాలు..అదే పదివేలు అనేలా సర్దుకుపోతాడు ఓటరు. కేంద్రంలోని పాలకులు ఈ ఒంటె సిద్ధాంతాన్ని అనేక విషయాల్లో అమలు చేస్తున్నారూ..చేస్తుంటారు. అన్నీ చెప్పుకోవడం కుదరదు కదా. మచ్చుకు గ్యాస్ సిలిండరును ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు రూ.400 దగ్గరున్న సిలెండరు చకచకా రూ.1200 వరకు వెళ్తుంది. కానీ ఎన్నికలప్పుడు కేవలం రూ.200 మాత్రమే తగ్గుతానంటుంది. ఘనత వహించిన బీఆర్ఎస్వారు ఒంటె సిద్ధాంతానికి బ్రహ్మాండమైన ఓ విరుగుడు కనిపెట్టారు. వారి వాగ్దానం ప్రకారం... సిలిండర్ ధరను ఒకేసారి పదేళ్ల కిందటి ధరకు నెడతామంటున్నారు. దాంతో జేబుగలిగిన ప్రతి మారాజుకూ, కిచెన్ గలిగిన ప్రతి మహారాణికీ ఒక్కసారిగా ఎంతో భారం తొలగుతుందీ. మరెంతో భాగ్యం కలుగుతుంది. టైమ్–మెషీన్లో ఒకేసారి పదేళ్ల వెనక్కు వెళ్లడమంటే మాటలా! ప్రజలందరికీ మూకుమ్మడిగా పదేళ్ల కిందినాటి వయసూ, యౌవనమూ, పదేళ్ల కిందటి విగరూ, పొగరూ పునర్–ప్రాప్తించిన ఫీలింగ్ కలగదా? విగరూ, పొగరూ పాలితులకూ!... ‘పవరు’పాలకులకు!! చదరంగంలో ‘గుర్రం’ స్టెప్పు ఒకటుంటుంది. దాన్ని ప్రయోగిస్తే..ఏకకాలంలో అది రెండు ‘ఫోర్సు’లకు ఎసరు పెడుతుంది. ఇక్కడ సిద్ధాంతపు ‘ఒంటె’ సిద్ధాంతాన్ని దెబ్బకొట్టడానికి ‘గుర్రం’ స్టెప్పు వేశారు..వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్వారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు. ఒక పిట్ట..కేంద్రంలో గ్యాస్ సిలిండరు ధరను మూడు రెట్లు పెంచేసిన పార్టీ! మరో పిట్ట..పొరుగు రాష్ట్రంలోలా ఇక్కడా మహిళా సోదరీమణుల్ని బస్సుల్లో ఉచితంగా తిప్పాలనుకుంటున్న పార్టీ. ఎప్పుడో ఓసారి చేసే ‘ప్రయాణం’ కంటే రోజూ కిచెన్‌లో చేసే ‘వంట’కే కదా ప్రయారిటీ!! ఇక... మూడో పిట్ట గురించి వేరే చెప్పాలా..ఇతర పిట్టలు తప్పించుకున్నా..ఇప్పటికిప్పుడు వేటకూ, వేటుకూ గురితప్పకుండా గురయ్యే ‘ఓటరు’ పిట్ట!!! -
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్‌బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్‌ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
హమ్మయ్య.. బండ భారం తగ్గింది
రాయవరం: మహిళలకు కేంద్ర ప్రభుత్వం రాఖీ పండగ కానుకగా తీపి కబురు అందించింది. గృహావసర గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం వెలువరించింది. ప్రధానమంత్రి ఉజ్వల స్కీం లబ్ధిదారులకు మరో రూ.200 తగ్గించాలని సంకల్పించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 6,10,042 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది. తక్షణమే అమల్లోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో లబ్ధిని పొందే వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు గృహావసరానికి వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం జిల్లాలో రూ.1,132 ఉంది. దీపం, జనరల్ లబ్ధిదారులకు రూ.200 తగ్గడంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.932గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ ధర రూ.732గా ఉంటుంది. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు వంట గ్యాస్ ధర భారీగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించింది. జనరల్ కనెక్షన్ లబ్ధిదారులకు ఇది వరకు రూ.200 సబ్సిడీని అందిస్తుండగా తాజాగా మరో రూ.200 ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. దీంతో వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.400 తగ్గనుంది. మధ్య తరగతి కుటుంబం సగటున 45 రోజులకు ఒక సిలిండర్ ఉపయోగిస్తుండగా, ఉజ్వల కనెక్షన్‌దారులు మూడు నెలలకు ఒకటి వంతున ఉపయోగిస్తున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని గ్యాస్ కనక్షన్లకనుగుణంగా ప్రతి నెలా సుమారుగా 3.40 లక్షల సిలిండర్లు వినియోగిస్తున్నట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
దేశ ప్రజలకు శుభవార్త.. రూ. 200 తగ్గిన గ్యాస్ ధరలు
రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' గ్యాస్ ధర తగ్గింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎల్పిజి సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌పై రూ. 200 తగ్గనుంది. అంతే కాకుండా పీఎంయూవై వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా పీఎంయూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని తెలిపారు. ఎల్పిజి సిలిండర్లపై అదనపు సబ్సిడీ 33 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనకారిగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి ఎల్పిజి సిలిండర్‌పై రూ. 200 తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల మహిళల కోసం 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేయడానికి ప్రారంభించారు. #WATCH | "PM Modi has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders, for all users...this is a gift from PM Narendra Modi, to the women of the country, during the occasion of Raksha Bandhan", says Union Minister Anurag Thakur pic.twitter.com/QTy6YB0x4u— ANI (@ANI) August 29, 2023 -
జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్
జైపూర్: శిఖర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ శాసనసభలో ఎర్ర డైరీ ఒకటి హల్చల్ చేసింది. అది గాని బహిర్గతమైతే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ ఎర్రటి టమాటాలు, సిలిండర్లను వంటగది బడ్జెట్ పెంచేసిన విషయం మాత్రం కానరాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఎమ్మెల్యే మంత్రి రాజేంద్ర సింగ్ గుదా రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేసి, ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ ఇది రాజస్థాన్ సీఎం భవిష్యత్తును తేల్చే భవిష్యవాణి అంటూ సంచలనం సృష్టించారు. ఆ డైరీలో 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన లావాదేవాల వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ వేయడంలో తనదైన మార్క్ ప్రదర్శించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శిఖర్ సభలో ఈ ఎర్ర డైరీ గురించి ప్రస్తావించి సీఎం అశోక్ గెహ్లాట్ కు కౌంటర్ వేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ఎదో కార్యక్రమం చేశారు. అది మొహబ్బత్ కీ దుకాణ్ కాదు "లూటీ కీ దుకాణ్-ఝూటీ కీ దుకాణ్" అని అన్నారు. ప్రజలను లూటీ చేసిన సమాచారం తోపాటు వారు చెప్పిన ఝూటా కబుర్ల గురించిన వివరమంతా ఎర్ర డైరీలో ఉన్నాయి. ఆ నిజాలు బయటకు వస్తే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. लाल डायरी..... अब अच्छे-अच्छे निपट जाएंगे! लाल डायरी का नाम सुनते ही कांग्रेसियों के मुंह में दही जम जाता है?#Rajasthan #AshokGehlot #congrees #NarendraModi#sikar #RajendraGuda pic.twitter.com/fafANrlwlp — Priti charan (@CharanPriti) July 27, 2023 అసలే దుందుడుకు స్వభావి అయిన సీఎం ఈ కామెంట్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. మీకు ఊహాజనితమైన ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ కళ్ళ ముందున్న ఎర్రటి టామాటాలు, ఎర్రటి గ్యాస్ సిలిండర్లు కనిపించవు.. వాటి కారణంగా ఎర్రగా మారిన ప్రజల ముఖాలు కూడా కానరావు. చూస్తూండండి వచ్చే ఎన్నికల్లో జనం మీకు ఎర్రటి జెండా చూపించడం ఖాయమని కౌంటర్ వేశారు. "PM को लाल टमाटर, महंगाई से हुए लोगों के लाल चेहरों पर बात करनी चाहिए" ◆ राजस्थान CM अशोक गहलोत का बयान @ashokgehlot51 #AshokGehlot pic.twitter.com/1F4wdPPlVV#राजस्थान_में_मोदी_मोदी — Nemi saini (@NemiSainiINC) July 27, 2023 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కార్యక్రమంలో తన పేరును తొలగించారన్న కారణంతో ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇలా హాటు హాటుగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం -
సగం ధరకే గ్యాస్ సిలిండర్!
కర్ణాటక: రాష్ట్రంలో జేడీఎస్ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ ధరలను 50 శాతం తగ్గిస్తామని మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. మంగళవారం యశవంతపురలో పంచరత్న రథయాత్రలో మాట్లాడారు. కేంద్రం ఉచితంగా గ్యాస్‌ను అందిస్తుందని ఉజ్వల యోజన పథకాన్ని నమ్మిన మహిళలు ఒక సిలిండర్ తీసుకున్న తరువాత షాక్‌కు గురయ్యారు. ఇప్పడు సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిందని కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏటా ఐదు సిలిండర్లు ఉచితంగా, మరో 10 సిలిండర్లు సగం ధరకు అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్లుకు ప్రతి నెల రెండు వేలు ఇస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. -
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
మళ్లీ కట్టెల వంటే గతి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని మహిళలు కట్టెలతో వంట చేసుకునే రోజులు మళ్లీ దాపురించబోతున్నాయని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కె.పుష్పలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గురువారం గాంధీ భవన్లో విలేకరులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కోట నీలిమ, కల్వ సుజాతలతో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరడం శోచనీయమన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపే బీజేపీకి మహిళలపై ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని విమర్శించారు. -
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్‌కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్‌ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్‌వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్న జనాన్ని ఇప్పటికైనా ఆదుకోండని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా రాజస్థాన్ పేదలకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ కల్పిస్తున్న ఉపశమనాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ మంగళవారం హిందీలో ట్వీట్లు చేశారు. ‘ కేంద్ర ప్రభుత్వం వసూలుచేస్తున్న ధర కంటే సగం ధరకే రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది చూసైనా మీ బడా పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు లబ్ధి చేకూర్చడం ఆపి ప్రజలకు ఉపశమనం కల్పించే పనులు మొదలుపెట్టండి’ అని ట్వీట్‌చేశారు. చదవండి: ఖర్గే వ్యాఖ్యలపై... దద్దరిల్లిన పార్లమెంటు -
గుడ్‌న్యూస్: గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై 4 ఆఫర్లు, రూ.1000 వరకు తగ్గింపు!
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. సిలిండర్ బుకింగ్‌పై మీకోసం పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm). ఈ యాప్‌ను ఉపయోగించి ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ద్వారా రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌పై 4 రకాల ఆఫర్లను ప్రవేశపెట్టింది పేటీఎం. వీటిని ఉపయోగించి కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అనగా రూ. 5 నుంచి రూ. 1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు. ఈ ఆఫర్లను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం! మొదటి క్యాష్‌బ్యాక్ ఆఫర్ కోసం ప్రోమోకోడ్ GAS1000. ఈ ప్రోమోకోడ్‌ని ఉపయోగించి కస్టమర్ రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా FREEGAS ప్రోమోకోడ్తో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న ప్రతి 500వ వినియోగదారునికి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఏయూ క్రెడిట్ కార్డ్‌తో (AU Credit card) సిలిండర్‌ను చెల్లింపుపై పేటీఎం రూ.50 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ ప్రోమోకోడ్ AUCC50. వీటితో పాటు యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో (YES Bank Credit Card) గ్యాస్ సిలిండర్ చెల్లింపుపై రూ.30 తగ్గింపు లభిస్తుంది. దీని కోసం బుకింగ్ చేసేటప్పుడు GASYESCC ప్రోమోకోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా వీటి ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉండే అవకాశం ఉంది. చదవండి భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్‌పై ఓ లుక్కేద్దాం.. LPG Gas Cylinder Price: ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది. Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్లో మార్పులు ఉన్నాయి. ATM withdraw: డిసెంబర్ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్లో మీ డెబిట్ కార్డ్‌ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్‌పై ఆంక్షలు తప్పవని పీఎన్బీ హెచ్చరించింది. Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్ నుంచి హీరో బైక్‌ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు!
దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్ గ్యాస్ (Bharatgas), ఇండేన్ (Indane), హెచ్‌పీ( HP) సంస్థల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్‌ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్ల బుకింగ్ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్ కోసం యూజర్లు 17-అంకెల ఎల్పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
సికింద్రాబాద్ చిలకలగూడలో పేలిన గ్యాస్ సిలిండర్
-
ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన గ్యాస్ సిలిండర్ల లారీ
-
గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట!
Govt Reduced to LPG Cylinder Weight: గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఇది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు అంశం కాదండోయ్. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ బరువుగా ఉండటంతో వాటిని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి జరపాలని అనుకున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతకు ముందు, భారీ సిలిండర్ బరువు కారణంగా మహిళలకు కలిగే అసౌకర్యం గురించి ఒక సభ్యుడు ప్రస్తావించారు. "మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బందిపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. దాని బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నామని" కేంద్రమంత్రి తెలిపారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును ఐదు కిలోలకు తగ్గించడం లేదా మరేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. (చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు!) -
నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!
ఇంటి గుమ్మం వద్దకు ఎల్పీజీ సిలిండర్ మోసుకొచ్చే బాయ్స్ నిర్ణీత రీఫిల్ ధరపై అదనంగా వసూలు చేసేది కొంత మొత్తమే అయినా.. మహానగరంలో దినసరి మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.. రోజుకు అక్షరాలా రూ.22.40 లక్షలు. నెలకు రూ.6.72 కోట్ల పైమాటే. సిలిండర్లపై ఇంతలా అదనంగా బాదుతున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ.. ఇది నిప్పులాంటి నిజం. అగ్గిలాంటి వాస్తవం. సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వంట గ్యాస్ ధర మంట మండిస్తుండగా.. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం.. సిలిండర్‌పై అదనపు మోత మోగిస్తున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సిలిండర్ రీఫిల్ నిర్ణీత ధర కంటే అదనంగా వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గృహాపయోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.952. డోర్‌డెలివరీ బాయ్స్ మాత్రం రూ.980కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత బిల్లు కంటే రూ.28 అదనం. అయినా చెల్లించాల్సిందే. చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. గ్యాస్ ధర, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితరాలన్నీ కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్ల బిల్లింగ్‌తో వినియోగదారులకు సిలిండర్ సరఫరా అవుతోంది. చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు రవాణా భారాన్ని మాత్రం డెలివరీ బాయ్స్‌పై వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ డీలర్లు డెలివరీ బాయ్స్‌కు నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు డీలర్లు రీఫిల్ డోర్ డెలివరీపై కమీషన్‌న్ అందిస్తున్నట్లు సమాచారం. వేతనాలు సరిపడకపోవడంతో బాయ్స్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదీ లెక్క.. నగరంలో వంటగ్యాస్ వినియోగదారులు సుమారు 26.80 లక్షల వరకు ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 90 వేల మంది వరకు రీఫిల్ కోసం బుకింగ్ చేస్తుంటారు. ప్రధాన ఆయిల్కంపెనీల సుమారు 115 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు తమ 1,250 బాయ్స్ (సిబ్బంది) ద్వారా ప్రతి నిత్యం కనీసం 80 వేల వరకు రీఫిల్స్ డోర్ డెలివరీ చేస్తుంటాయి. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం ప్రస్తుత సిలిండర్ ధరను బట్టి ఒక్కో రీఫిల్‌పై రూ.28 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.22.40 లక్షలు అంటే నెలకు వసూలయ్యేది రూ. 6.72 కోట్లకు పైమాటే. ఇలా బహిరంగా దోపిడీ జరుగుతున్నా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేదెలాగో ప్రభుత్వ యంత్రాంగమే జవాబు చెప్పాలి మరి. రీఫిల్ డెలివరీ నిబంధనలివీ... ► వినియోగదారులు ఆన్లైన్లో సిలిండర్ రీ ఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా డిస్ట్రిబ్యూ టర్లు తమ సిబ్బందిచే వినియోగదారులకు రీఫిల్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ► స్ట్రిబ్యూటర్ తమ గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ డోర్ డెలివరీ చేయాలి. 6– 15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీలకు రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలో మీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి. ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది. ► సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది. -
ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బరువుతో తేలికగా, దృఢంగా ఉండే ఫైబర్ గ్యాస్ సిలిండర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్‌తో తయారయ్యే ఈ సిలిండర్లు 10, 5 కిలోల గ్యాస్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉంటాయి. వాటిలో 14.5 కిలోల గ్యాస్ ఉంటుంది. బరువు ఎక్కువకావడంతో వాటిని తరలించడం ఇబ్బందికరం. పైగా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయి. అదే ఫైబర్ సిలిండర్లు తేలికగా ఉంటాయి. మోసుకెళ్లడం సులభం. చిలుము, మరకలు వంటివి ఉండవు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫైబర్ సిలిండర్‌ను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ అక్షిత చెన్నంకుట్టి శనివారం హైదరాబాద్‌లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందచేశారు. -
వంట చేస్తున్న సమయం లో సిలిండర్ నుంచి మంటలు
-
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త!?
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, అక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ పొంద వచ్చని ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా... ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ... ‘ ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, వారి వద్ద నుంచే సిలిండర్ ను ఫిల్ చేయించుకోవచ్చు’ అని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటి వరకు సిలిండర్ వినియోగదారులు ఒక్క డిస్టిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచైనా గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టుగా చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయం గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించింది. -
30 నిమిషాల్లో అగ్నికి ఆహుతయిన ఇళ్లు
జయపురం: నవరంగపూర్ జిల్లా తెంతులికుంఠి సమితి కమతా పంచాయతీ కుసిమి గ్రామంలో గాŠయ్స్ సిలిండర్ పేలి, అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ధర్మేంద్ర సాగరియ ఇంట్లో విలువైన సంపద అంతా కాలి బూడిదయ్యింది. భారీ శబ్ధంతో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినా.. సిబ్బంది వచ్చేసరికే సర్వం బూడిదయ్యింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు అగ్నికి ఆహుతయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇంటికి సంబంధించిన పత్రాలు, ఇతర సామగ్రీ కాలిపోవడంతో ధర్మేంద్ర కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మహా బలశాలిని: గ్యాస్ బండతో మహిళ ఫీట్లు వైరల్
గ్యాస్ సిలిండర్‌తో ఏం ఉపయోగమంటే ఏం చెప్తాం.. వంటలు చేసుకునేందుకు అని. కానీ ఈ మహిళ గ్యాస్‌బండను కసరత్తులు చేసేందుకు ఉపయోగిస్తోంది. గ్యాస్ బండను అమాంతం ఎత్తేసి ఎక్ససైజ్లు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది కూడా చీర ధరించి చేయడం గమనార్హం. ఆమెనే షైలీ చికరా. ఈమె ఫిట్నెస్ నిపుణురాలు. ఆమెకు సాహసాలు చేయడం అలవాటు. వ్యాయామాలు కొత్త తరహా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను షైలీ వరండాలోకి తీసుకువచ్చి అమాంతం సింపుల్‌గా ఎత్తేసింది. రెండుసార్లు పైకి కిందకు ఎత్తి దింపింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘చూద్దాం నా వీడియో ఎక్కడెక్కడకు వెళ్తుందో’ అని మెసేజ్ చేసి పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన వారందరూ ఆమెను అభినందిస్తున్నారు. షైలీ గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసింది. గతనెలలో పంటితో గ్యాస్ సిలిండర్ ఎత్తేసి ఔరా అనిపించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా ఆమెను ఫాలోవుతున్నారు. ఆమె ఐటీ ఉద్యోగిని అని కూడా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Shaili Chikara-Wonder Woman (@shaili_chikara) -
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన రెండు ఇళ్లు, ఏడుగురు మృతి
-
నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సాక్షి, కర్నూలు: నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చెక్‌పోస్ట్ సర్కిల్ పక్కనే ఉన్న గుడిసెలు దగ్ధమవుతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాప్‌లకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో నంద్యాల, నందికొట్కూరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చా: మంత్రి కేటీఆర్
బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ఎవరో మహానుభావుడు చెప్పినట్లు ఓటేసే ముందు ఇంట్లో సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చానని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం నిర్వహించగా మంత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 39% మంది మాత్రమే ఎమ్మెల్సీ ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈసారి పోలింగ్ శాతం పెరిగాల్సిన అవస రం ఉందన్నారు. విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనరన్న అపవాదును తొలగించుకోవాలన్నారు. విద్యావంతులకు కృతజ్ఞతలు... పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యావంతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ఈ హక్కుని వినియోగించుకోవాలని చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిలుగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ అభ్యర్థిగా పోటీ చేసిన వాణీదేవి విజయం ఖాయమని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు అన్నారు. -
చెడు వ్యసనాలకు బానిసై.. చెల్లిని చంపేస్తానంటూ!
సాక్షి, విశాఖపట్నం: చెడు వ్యసనాలకు బానిసై, అల్లరి చిల్లరిగా తిరుగుతూ కుటుంబానికి తలనొప్పిగా తయారైన ఓ కొడుకుని కన్నతల్లే చంపేసింది. విశాఖ నగర శివారు మధురవాడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీను, మాధవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు అనిల్, మరొక కుమార్తె ఉంది. 20 ఏళ్లు కూడా దాటని అనిల్ చిన్నప్పటి నుంచే అల్లరిచిల్లరిగా తిరగడం అలవాటయింది. ఆ క్రమంలో మద్యం, గంజాయి సేవించడానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం అలవాటుగా మారింది. ఈ దశలో డబ్బులు ఇవ్వకపోతే చెల్లిని చంపేస్తానని కూడా తల్లిని పలు సందర్భాల్లో బెదిరించేవాడు. అదే క్రమంలో ఆదివారం రాత్రి డబ్బులు కోసం తల్లిదండ్రులను వేధించాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో తల్లి కోపం పట్టలేక ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కొడుకుపై వేసింది. దీంతో అనిల్ ఇంట్లోనే మృత్యువాత పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్ తల్లి మాధవిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే మృతుడు అనిల్ ఇప్పటికే విశాఖ పరిధిలో పలుకేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీపీ చెబితేనే.. వంటగ్యాస్
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ బుక్ చేసినా.. ఇంటికి సిలిండర్ డెలివరీ కాలేదా?. డెలివరీ కాకుండానే పక్కదారి పట్టిందా? డోంట్‌వర్రీ. ఇక నుంచి ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించేందుకు, వినియోగదారులకు సక్రమంగా సిలిండర్లు అందించేందుకు ఆయిల్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే సిలిండర్ పంపిణీ చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయి. నగరంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతి అమలు ప్రారంభమైంది. సాధారణంగా మొబైల్ ద్వారా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేస్తే ఆ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అంటే సిలిండర్ బుక్ చేసినట్లు లెక్క. ఇలా బుక్ చేసిన సిలిండర్ సదరు వినియోగదారుడికే చేరుతుందా? లేక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందా? అనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్ డెలివరీ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేశారు. డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్లో నమోదు చేసుకుని సిలిండర్ అందజేస్తాడు. దీంతో బుక్ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్ అందుతుంది. అంతేకాదు కరోనా నేపథ్యంలో డోర్ డెలివరీ బాయ్‌కి నగదును నేరుగా కాకుండా ఆన్లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్ సరఫరా సంస్థలు కల్పించాయి. ప్రస్తుతం ఆన్లైన్లో బిల్లు చెల్లించిన తర్వాత జనరేట్‌తో పాటు డెలివరీ అక్నాలెడ్జిమెంట్ కోడ్ (డీఏసీ) వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో పంపించి దాని ఆధారంగా సిలిండర్ డెలివరీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ గ్యాస్ సిలిండర్ బుకింగ్, బిల్లు చెల్లింపు విధానాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు అప్డెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో డీలర్ కార్యాలయానికి ఫోన్ చేసి గాని, నేరుగా వెళ్లి గాని సిలిండర్ బుక్ చేసుకునే వారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చింది. ఇటీవల యాప్‌ల ద్వారా బుక్ చేస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాస్ సరఫరా సంస్థలు యాప్‌లను ప్రవేశపెట్టాయి. అమెజాన్ ద్వారా రీఫిల్ బుక్ చేసిన వారికి రూ.50 రాయితీ కూడా ప్రకటించింది. తాజాగా కొత్తగా ఓటీపీ విధానం అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం తాజాగా ఏజెన్సీలు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సాప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రిజిస్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. వినియోగదారులకు మరింత అవగాహన పెంచడం ద్వారా డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దీపం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం వంటగ్యాస్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో ఉచిత సిలిండర్ (రీఫిల్) సొమ్ము జమ కానుంది. ముందస్తుగా బ్యాంక్ ఖాతాలో జమ అయిన నగదును వినియోగించుకొని వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు నెలల పాటు మార్కెట్ రీఫిల్ ధరను బట్టి నగదు బదిలీ జరగనుంది. మొదటి నెల బ్యాంక్ ఖాతాలో పడిన నగదును వినియోగించుకుని సిలిండర్ కొనుగోలు చేస్తేనే మరుసటి నెల రీఫిల్ నగదు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. వాటిని వినియోగించుకొని రెండో నెల రీఫిల్ కొనుగోలు చేస్తేనే మూడో నెల నగదు బదిలీ కానుంది. కేంద్ర ప్రభుత్వం రీఫిల్ ధర మొత్తం నగదు బదిలీతో లబ్ధిదారులకు ముందస్తుగానే అందిస్తుండటంతో సబ్సిడీ సొమ్ము ప్రసక్తి ఉండదు. సిలిండర్ రీఫిల్ బుకింగ్ కోసం ఆన్లైన్ పక్రియ యథాతథంగా ఉంటుందని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉజ్వల యోజన పథకం కింద హైదరాబాద్ మహా నగరంలోని సుమారు 84,710 పేద కుటుంబాలకు మాత్రమే ఉచిత వంట గ్యాస్ లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్‌లో ఉంటే మాత్రం నగదు బదిలీ వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. గ్రేటర్లో 28 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు... గ్రేటర్ పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన సుమారు 28 లక్షల ఎల్పీజీ గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో పేద కుటుంబాలు 18 లక్షల వరకు ఉంటాయి. అధికార గణాంకాల ప్రకారం మూడు జిల్లాల పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలు సుమారు 16 లక్షలకుపైగా ఉండగా అందులో కేవలం 84వేల పైచిలుకు కుటుంబాలకు మాత్రమే ఉజ్వల యోజన (దీపం) పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా మూడేళ్ల క్రితం ప్రతి ఇంట వంట గ్యాస్ ఉండాలన్న కేంద్రప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు కలిగి వంట గ్యాస్ కనెక్షన్లు లేని సుమారు రెండు లక్షల కుటుంబాల్లో 1.65 లక్షల పైచిలుకు కుటుంబాలను గుర్తించి.. ఉజ్వల యోజన పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు దాదాపు 98 శాతం వరకు ఉజ్వల యోజన పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ల ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందించి చేతులు దులుపుకొన్నారు. తదుపరి పర్యవేక్షణ కొరవడటంతో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్లక్ష్యంతో కేవలం 84వేల పైచిలుకు కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. మూడేళ్లుగా దీపం కనెక్షన్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. -
గడువు తీరితే గండమే..!
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదేవిధంగా మనం వంట గదిలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దానిని సరైన సమయంలో గుర్తించి, సిలిండర్ మార్చుకోవడం వలన ప్రమాదాలు నుంచి బయటపడవచ్చు. ఎక్స్పైర్ డేట్ గుర్తించడం ఎలా..? గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముద్రించి ఉంటుంది. దీనిలో సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా గుర్తించి మూడు నెలలకు ఒక ఇంగ్లిష్ అక్షరం చొప్పున ఏ, బీ, సీ, డీగా ముద్రిస్తారు. అంటే జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో సూచిస్తారు. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ ‘బీ’ గాను, జూలై నుంచి సెప్టెంబర్‌ను ‘సీ’ గాను, అక్టోబర్ నుంచి డిసెంబర్‌ను ‘డీ’ తో సూచిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై డీ 19 అని ఉంటే ఆ సిలిండర్‌ను 2019 డిసెంబర్ వరకు మాత్రమే ఉపయోగించాలి అని అర్థం. గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం చాలా వరకు గ్యాస్ సిలిండర్లతో ప్రమాదాలు ఏజెన్సీల నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లను ఏజెన్సీలు వినియోగదారులకు అందిస్తున్నారు. దీంతో అవి లీకవుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పాటు గ్యాస్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు పొందూరు మండలంలోని రాపాకలో నవంబర్ 22, 2017న, జనవరి 02, 2018న గ్యాస్ లీకేజి వలన ప్రమాదం జరిగింది. అక్టోబర్ 10, 2018న పొందూరులోని గాంధీనగర్ వీధిలోను, నవంబర్ 09, 2018న రాపాక గ్రామంలోను, జనవరి 01, 2019న పొందూరులోని పార్వతీనగర్ కాలనీలోను, జి.సిగడాం మండలం నక్కపేట గ్రామంలో డిసెంబర్ 13, 2017న, జనవరి 14, 2018న వాండ్రంగి గ్రామంలోను, మార్చి 01, 2019న పార్వతీనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం లోను, జూన్ 09, 2019న పైడిజోగిపేటలోను గ్యాస్ లీకై ప్రమాదాలు సంభవించాయి. అప్రమత్తమవ్వండిలా... ఏజెన్సీల నుంచి లక్షల సంఖ్యలో గ్యాస్ సిలండర్లు డిస్ట్రిబ్యూటర్‌కు వస్తుంటాయి. వాటన్నింటినీ పరిశీలించే సమయం వారికి లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాలు నుంచి తప్పించుకోవచ్చునని మేధావులు సూచిస్తున్నారు. → సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. → సిలిండర్ కన్నా స్టవ్ ఎత్తులో ఉండాలి. → ఇండ్లలోనైనా, హోటళ్లలో అయినా వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ను ఆపాలి. → సిలిండర్ ఎక్స్పైర్ డేట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. గ్యాస్ వాసన వస్తే.. ⇒ ఇంట్లో గ్యాస్ వాసన వచ్చినట్లయితే వెంటనే రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. ⇒ సిలిండర్ మూతకు సేఫ్టీ కప్‌ను బిగించాలి. ⇒ విద్యుత్ స్విచ్‌లు వేయరాదు. ⇒ అగ్గిపుల్ల వెలిగించకూడదు. ⇒ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరవాలి. ⇒ దగ్గరలోని ఎల్పీజీ డీలర్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కార్ రెండవ సారి కొలువుదీరిన తరువాత వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. సవరించిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.1.23 పైసలు పెంచింది. అలాగే నాన్ సబ్సీడీ సిలిండర్ ధరను రూ. 25 పెంచింది. అయితే విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది. సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1.23 పైసలు పెరిగింది. రాయితీలేని సిలిండర్ ధర రూ.25 పెరిగింది. సబ్సిడీదారులు సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో జమ అవుతాయి. కాగా ఎల్పీజీ ధర పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. -
గ్యాస్ డెలి‘వర్రీ’
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ బుక్ చేసి పది రోజులు దాటినా రీఫిల్ ఇంటికి చేరడం లేదు. ప్రధాన చమురు సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిస్ట్రిబ్యూటర్ల వద్ద సుమారు రెండున్నర లక్షలకు పైగా కాల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మొబైల్ ద్వారా ఆన్లైన్లో రెండు పర్యాయాలు సిలిండర్ బుక్ చేస్తే తప్ప.. రీఫిల్ ఇంటికి చేరే పరిస్థితి లేదు. గ్యాస్ డిస్టిబ్యూటర్ల చేతివాటమో.. లేక డెలివరీ బాయ్స్ జమ్మిక్కులో తెలియదు కానీ ‘డోర్‌లాక్’ లేకున్నా వంట గ్యాస్ సిలిండర్ మాత్రం సకాలంలో ఇంటికి రాని పరిస్థితి. కొన్ని సార్లు బుకింగ్ రద్దయింది మళ్లీ బుక్ చేయమని సంక్షిప్త సందేశం వస్తుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. డిస్టిబ్యూటర్‌కు ఫోన్ చేసి నిలదీస్తేగానీ సిలిండర్ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి గ్యాస్ సరఫరా కొరత లేనప్పటికీ పంపిణీదారులే కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగదు బదిలీ పథకం కింద వినియోగదారులకు ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లు సబ్సిడీపై సరఫరా చేయాలి. ఆపై తీసుకుంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండడంతో నెల రోజుల నుంచి కాల్స్ పెండింగ్‌లో పడిపోవడం, బిల్లు జనరేట్ తర్వాత బుకింగ్ అటోమెటిక్‌గా రద్దు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు ఫుల్ ప్రస్తుతం ఇంటి గ్యాస్ కొరత ఉన్నా.. వాణిజ్య అవసరాలకు మాత్రం సరఫరా భేషుగ్గా ఉంది. అడిగిందే తడవుగా రీఫిల్స్ హోటళ్లకు చేరుతున్నాయి. దీన్నిబట్టి గృహావసరాల సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి వసరాలకు ఉపయోగపడాల్సిన గ్యాస్.. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. నగరంలో పెద్ద హోటల్స్ 5 వేలకు పైగా ఉండగా, చిన్న చితకా హోటళ్లు టీ, టీఫిన్ సెంటర్లు సుమారు లక్షల వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, చిన్నవాటిలో మాత్రం డొమెస్టిక్ సిలిండర్లే వినియోగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు లక్షకు పైగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిన్న సిలిండర్లలో సైతం డొమెస్టిక్ ఎల్పీజీ అక్రమంగా రీఫిల్లింగ్ అవుతోంది. గ్యాస్ కొరత లేదు ప్రస్తుతం గ్రేటర్లో వంట గ్యాస్ కొరత లేదు. బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లో సిలిండర్లను డెలివరీ చేస్తున్నాం. డోర్‌లాక్, ఇతర సాంకేతిక కారణాలతో కొన్నిసార్లు బుకింగ్ రద్దవుతోంది. డిస్టిబ్యూటర్ దృష్టికి తీసుకొచ్చి తిరిగి బుక్ చేస్తే వెంటనే సిలిండర్ డెలివరీ చేస్తున్నాం.– అశోక్ కుమార్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డీలర్ల సంఘం -
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు
ఇచ్ఛాపురం: వంట చేద్దామని గ్యాస్ స్టౌ వెలిగిస్తే ఎంతకీ మంట పుట్టకపోగా, అనుమానంతో పరిశీలించగా సిలిండర్‌లో నీళ్లు ఉండటాన్ని చూసి ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. పట్టణంలోని కొండివీధిలో గురువారం కాయ శ్రీను అనే వినియోగదారుడు తన ఇంట్లో ఇండియన్ గ్యాస్ సరఫరా చేసిన సిలిండర్‌ను స్టౌవ్‌కు అనుసంధానించి వెలిగించే ప్రయత్నం చేశాడు. ఎప్పటికీ మంట పుట్టకపోవడంతో అనుమానం వచ్చి నిశితంగా పరిశీలించాడు. ఈ మేరకు సిలిండర్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నీళ్లు ఉన్న వైనాన్ని స్థానికులకు చూపించాడు. ఈ విషయమై స్థానిక గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయడంతో దానికి బదులుగా మరొక సిలిండర్‌ను అందజేశారు. ఇటీవల ఇదేవీధికి చెందిన సంతోష్ అనే విని యోగదారుడికి, గిలాయివీధిలో మరో వినియోగదారునికి ఇదే అనుభవం ఎదురవడంతో ఏజెన్సీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విషయమై స్థానిక ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వజ్రపు వెంకటేష్‌ను ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఏదేమైనా వినియోగదారుడు నష్టపోకుండా వెం టనే సిలిండర్ మార్పు చేస్తున్నామని తెలిపారు. -
పెళ్లి ఇంట్లో విషాదం.. 9మంది సజీవ దహనం
జైపూర్ : రాజస్థాన్ బీవర్‌లోని నంద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు. ఆ సిలిండర్ పక్కనే నిండుగా ఉన్న మరో సిలిండర్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పాటు దగ్గరలో ఉన్న రెండు కార్లు కూడా దగ్ధమయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దదరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. -
ఇక నిలకడగా సిలెండర్ ధర
సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ ధరను నెలకు రూ. 4 చొప్పున పెంచుతూ వచ్చే మార్చినాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలని సంకల్పించుకున్న కేంద్ర ప్రభుత్వానికి వ్రత భంగమైంది. ఇకపై ధర పెంచొద్దని చమురు రంగ సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మౌఖికంగా చెప్పడం వల్లనో ఏమో... వాస్తవానికి మొన్న అక్టోబర్ నుంచే సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధర పెరగడం ఆగింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు ఇప్పుడొచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణా లేమిటో మాకు చెప్పలేదని చమురు సంస్థలు అంటున్నాయి. ప్రజలకు చెప్పిన కారణమైతే అంత హేతుబద్ధంగా లేదు. ఓ వైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం... మరోవైపు సిలెండర్ ధర పెంచుకుంటూ పోవడం పరస్పర విరుద్ధమైన విధానాలుగా గుర్తించడంవల్ల ఈ నిర్ణయం తీసుకు న్నామని కేంద్రం ప్రకటించింది. ‘కారణమేదైనా ధర పెరగదన్నారు అదే పదివేల’ని మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకూ తాజా నిర్ణయానికి కారణ మేమిటి? దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు వచ్చే మూడేళ్లలో ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుడు మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని ప్రారంభించింది. అది విజయవంతంగా అమలవుతోంది. దానికింద ఇప్పటికి 3.2 కోట్ల మంది లబ్ధి పొందారు. ఆ పథకం ప్రారంభమైన రెండు నెలలకే...అంటే నిరుడు జూన్‌లో సబ్సిడీ సిలెండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచాలని కేంద్రం ఆదేశా లిచ్చింది. మొన్న జూన్ నుంచి ఆ రెండు రూపాయలు కాస్తా రూ. 4 అయింది. ఇలా పెంచుతూ వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పీఎంయూవై పథకానికీ, సబ్సిడీ సిలెండర్ ధర పెంచుకుంటూ పోవాలన్న నిర్ణయానికీ మధ్య వైరుధ్యం ఉన్నదని గుర్తించడానికి ఏణ్ణర్ధం పట్టిందంటే అది నమ్మదగినదిగా లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలనూ, నిర్ణయాలనూ ప్రకటిం చేది వివిధ శాఖల మంత్రులు కావొచ్చుగానీ... ఆ నిర్ణయానికొచ్చే ముందు వేర్వేరు స్థాయిల్లో మథనం జరుగుతుంది. పలు కోణాల్లో ఉన్నతాధికారులు, నిపుణులు పరి శీలించి తమ అభిప్రాయాలు చెబుతారు. ఈ క్రమంలో ఏ దశలోనూ వైరుధ్యం ఉన్నట్టు తాను గుర్తించలేదని ప్రభుత్వం చెప్పడమంటే నిర్ణయం తీసుకునే ప్రక్రియ సరిగా లేదని అంగీకరించినట్టు లెక్క. సిలెండర్ ధర పెంపును ఆపేయాలని మొన్న అక్టోబర్‌లో మౌఖికంగా చమురు సంస్థలకు చెప్పినప్పుడే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ప్రారంభమై దాని ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై చూపడం మొదలయ్యాక జనంలో ఆగ్రహా వేశాలు మొదలయ్యాయి. అందువల్లే వాటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయిం చారు. ఇదిగాక గత నెలాఖరులో చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)కూ, రష్యాకూ మధ్య చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదిరాక చమురు ధరలు మరింత పెరగడం మొదలైంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కొందరు అంచనా వేస్తున్నట్టు వాటితోపాటు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, వాటికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వానికి క్షేమం కాదు. మన పాలకుల్లో సంస్కరణలు అమలు చేయాలన్న తహతహకూ, వాటి పర్య వసానంగా ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల ప్రయోజనాలకు మధ్య ఎప్పుడూ వైరుధ్యం ఉంది. ధరలు పెరిగితే ప్రజలు వెనువెంటనే రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయకపోవచ్చుగానీ... ఎన్నికల్లో అధికార పక్షాన్ని శిక్షించిన దాఖలాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈమధ్య జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో స్థానాలు లభించకపోవడం వెనకున్న అనేక కారణాల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి. ఇప్పటికే సబ్సిడీ సిలెండర్లకు రకరకాల కారణాలతో కోత మొదలైంది. రూ. 10 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి 12 సిలెండర్లు మాత్రమే ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం పదవినుంచి వైదొలగే ముందు నిర్ణయించింది. అంతకు మించితే ఆ వర్గాలవారు మార్కెట్ ధర చెల్లించి సిలెండర్లు కొనుక్కోవలసి వస్తోంది. అదిగాక ఆధార్‌తో అనుసంధానించడం తప్పని సరి చేయడంతో 3.5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయని, అందువల్ల రూ. 21,261 కోట్లు ఆదా అయ్యాయని కేంద్రం చెబుతోంది. దీనికితోడు కారున్న కుటుంబాలకు వంటగ్యాస్ సబ్సిడీ తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆమధ్య వార్తలొచ్చాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచీ సంక్షేమ భావన కొడిగడుతోంది. కేంద్రంలో ఏ కూటమి పరిపాలించినా ఈ సంస్కరణల విషయంలో ఒకేలా ఆలోచిస్తున్నాయి. విపక్షంలో ఉండగా వ్యతి రేకించడం, అధికారంలోకొచ్చాక ఆ విధానాలనే కొనసాగించడం ఆనవాయితీగా మారింది. అయితే దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం వల్ల ఈ సంస్కరణలకు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. బహుశా అందుకే కావొచ్చు... ఈమధ్య లోక్‌సభకూ, అసెంబ్లీలకూ జమిలి ఎన్ని కలు జరగాలన్న వాదన తెరపైకొచ్చింది. ఏదేమైనా వంటగ్యాస్ సిలెండర్ ధర పెంపుదలకు బ్రేక్ పడిందన్న వార్త పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తుంది. పనిలో పనిగా చమురు సంస్థలపై విధిస్తున్న రకరకాల పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధం చేస్తే వీటి ధరలు నిలకడగా ఉండటంకాదు... గణ నీయంగా తగ్గుతాయి కూడా. మన పాలకులు ఆ దిశగా ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నారు. -
నెల రోజులు సిలిండర్ల కొరత తప్పదు
-
ఎల్పీజీ ‘సబ్సిడీ ఎత్తివేత’పై భగ్గు
► పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసన ► యూపీఏ హయాం నాటి నిర్ణయమేనన్న ప్రభుత్వం న్యూఢిల్లీ: గృహవినియోగ వంటగ్యాస్ సిలిండర్‌పై ప్రతి నెలా రూ. 4 పెంచి, మార్చి నాటికి సబ్సిడీని ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చకు డెరెక్ ఓబ్రియాన్(తృణమూల్) నోటీసు ఇచ్చారు.బ్యారల్ చమురు ధర 111 డాలర్ల నుంచి 48కు తగ్గినా ప్రభుత్వం మాత్రం వంటగ్యాస్ ధరలు పెంచుతోందని మండిపడ్డారు. చర్చకు డిప్యూటీ చైర్మన్ కురియన్ తిరస్కరించడంతో విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లాయి. దీంతో కురియన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలను చంపుతోందని అన్నారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇస్తూ.. సబ్సిడీల ఎత్తివేత కోసం నెలనెలా ధరలు పెంచాలని 2010 జూన్‌లో అప్పటి యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించే తాజా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరోపక్క.. ప్రభుత్వ నిర్ణయం దారుణమని లోక్‌సభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. సబ్సిడీ ఎత్తివేతతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్) ఆందోళన వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు తగ్గుతుండగా దేశంలో ధర పెంచడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసనతో విపక్షాలు వాకౌట్ చేశాయి. గోరక్ష దాడులపైనా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కంపెనీల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడానికి 27 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఉపసంహరించుకుంది. 2018 వరకూ రూ.3కే సబ్సిడీ బియ్యం దేశంలో 81 కోట్ల మంది పేదలకు సబ్సిడీపై బియ్యం, గోధుమలు అందిస్తున్న పథకాన్ని 2018 వరకూ సమీక్షించబోమని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ప్రస్తుతం సబ్సిడీ బియ్యాన్ని కిలోకు రూ.3, గోధుమలను రూ.2 చొప్పున అందిస్తున్నారు. ప్రొటోకాల్ వివాదం: పార్లమెంటుకు అనుబంధంగా నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఎంపీలను ఆహ్వానించకపోవడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’పై నిరసన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేలకు అభ్యర్థులందర్నీ తిరస్కరించడానికి వీలుగా, ‘పై అభ్యర్థుల్లో ఎవరికీ కాదు’(నోటా) ఆప్షన్ కల్పించడంపై రాజ్యసభలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని సవరించకుండా కేవలం ఎన్నికల సంఘం ఆదేశంపై ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ డిప్యూటీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. గుజరాత్‌కు ప్రత్యేక రాజ్యాంగమేదైనా ఉందా అని గులాం నబీ ఆజాద్.. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల వివాదాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ అంశంపై ఈసీతో చర్చించాలని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే నోటా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శర్మ స్పందిస్తూ.. వచ్చే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నోటాను పొందుపరచాలన్నారు. -
సబ్సిడీ గ్యాస్‌పై రూ. 32 పెంపు
న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రభావం పేద, మధ్య తరగతి ఎక్కువగా వాడే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పైనా పడింది. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై జీఎస్టీ కింద 5 శాతం పన్ను విధించడంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 32 వరకూ పెరిగింది. ప్రస్తుతం రూ. 446.65గా ఉన్న 14.2 కేజీల సిలిండర్ ధర జీఎస్టీ ప్రభావంతో రూ.477.46లకు చేరింది. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్, సేల్స్ ట్యాక్స్ లేదు. మిగతా రాష్ట్రాల్లో 1 శాతం నుంచి 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలు తర్వాత అన్ని చోట్ల 5 శాతం పన్ను అమల్లోకి రావడంతో ఇప్పటి వరకూ పన్నులేని రాష్ట్రాలు, 5 శాతం కన్నా తక్కువ పన్ను రాష్ట్రాల ప్రజలపై భారం పడనుంది. కోల్‌కతాలో రూ. 31.41, చెన్నైలో రూ. 31.41, ముంబైలో రూ. 14.28 పెరిగినట్లు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 2011, జూన్ 25న ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. తర్వాత ఒకేసారి ఇంత మొత్తంలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. లక్షల మంది ప్రజలు వినియోగించే సబ్సిడీ గ్యాస్‌పై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
భువనగిరిలో పేలిన్ గ్యాస్ సిలిండర్
భువనగిరి: వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రెండిళ్లతో పాటు మూడు బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి సిలిండర్ పేలడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే పక్కనే ఉన్న పూరిళ్లుకు మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలి.. ముగ్గురు మృతి
వైట్‌ఫీల్డ్(బెంగళూరు) : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుంటంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని మహదేవపుర నియోజకవర్గం వినాయక లేఅవుట్ సమీపంలోవున్న కావేరీ నగర్లో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మహదేవ పుర ఎస్ఐ నారాయణస్వామి తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన ప్రశాంత కుమార్(36), భార్య బసంతిలత (30), కొడుకు ఆదిత్య(9), కూతురు మౌనిషా(2)లు కావేరి నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత కుమార్ ఐటిపిఎల్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న రాత్రి బసంతిలత పాలను వేడిచేయడానికి స్టౌవ్‌మీద పెట్టి మరచిపోయి నిద్రపోయింది. పాలు పొంగి స్టౌవ్ ఆరిపోవడంతో.. గ్యాస్ లీకైంది. మరుసటి రోజు తెల్లవారు జామున ప్రశాంత కుమార్ టీ పెట్టడానికి స్టౌవ్‌ను లైటర్‌తో వెలిగించాడు. దీంతో వెంటనే గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ప్రశాంతకుమార్తోపాటు అతని భార్య బసంతి లత, కూతురు, కొడుకులు తీవ్రంగా కాలి.. గాయపడ్డారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చి వారిని 108 వాహనంలో విక్టోరీయా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఈనెల 14న ప్రశాంతకుమార్ మృతి చెందాడు. మరుసటి రోజు అతని కూతురు మౌనిషా, కొడుకు ఆదిత్యలు చనిపోయారు. అతని భార్య బసంతి లత ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. మృతి చెందిన ప్రశాంతకుమార్, అతని బిడ్డల మృతదేహాలను ఒడిస్సాలోని వారి బంధువులకు అప్పగించి... కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ స్వామి తెలిపారు. -
పేలిన గ్యాస్ సిలిండర్
– దాదాపు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం ఎమ్మిగనూరు రూరల్: కోటేకల్ గ్రామ మలుపు బస్టాండ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన గౌస్‌బాషా బస్టాప్ హైవే దగ్గర టీ స్టాల్, అందులో కిరాణం సరుకులను కూడ పెట్టుకొని నిర్వహిస్తున్నాడు. టీ చేస్తుండగా గ్యాస్ లీకు అవుతున్నట్లు గమనించి లీకును నివారించేందుకు గౌస్ ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న వారంతా గమనించి దూరం పురుగులు తీశారు. ఇంతలోనే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.మంటల తాకిడికి పక్కన ఉన్న రెండు చెట్లు కాలిపోయాయి. పేలిన సిలిండర్ శకలాలు 200 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఈ ప్రమాదంలో టీ స్టాల్ ఉన్న రూ. 15 వేల నగదు, సరుకులు, వస్తువులు పూర్తిగా మంటల్లో బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు
అక్కిరెడ్డిపాలెం: సిలిండర్‌లో గ్యాస్ ఉండటం లేదు. అయితే సిలిండర్ బరువు మాత్రం ఎంత ఉండాలో అంతే ఉంది. కానీ నెలున్నర రోజులు రావాల్సిన ఇండియన్ గ్యాస్ సిలిండర్ కేవలం 10 రోజులు మాత్రమే వచ్చింది. అనుమానంతో స్థానిక మహిళలు సిలిండర్‌ను కదిపి చూడగా నీళ్లు ఉన్న శబ్ధం రావడంతో సిలిండర్‌ను తిరగేశారు. ఇంకేముంది సిలిండర్ హెడ్ నుంచి నీళ్లు బయటకు చిందాయి. అక్కిరెడ్డిపాలెంలో ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఘటన ఇది. తమ పేరు చెబితే గ్యాస్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తారని సంబంధిత బాధితులు వివరాలు వెల్లడించలేదు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని, గ్యాస్ సరఫరా చేస్తున్న వారిని అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి
పాలకోడేరు : వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ మృతి చెందిన ఘటన ఇది. విస్సాకోడేరు పంచాయతీ పరిధిలోని వంకాయలపాలెంకు చెందిన బొల్ల సత్యనారాయణ భార్య లక్ష్మి (55) ఆదివారం రాత్రి వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబలెన్సులో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ.. రాత్రి 1 గంట సమయంలో మృతి చెందింది. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేష¯ŒS హౌస్ఆఫీసర్ సూర్యనారాయణ తెలిపారు. -
సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
సంతమాగూలూరు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొత్తరం గ్రామంలో గురువారం ఉదయం సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైంది. మేస్త్రీగా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీమ్ ఉదయం కూలీపనికు వెళ్లాడు. ఆయన భార్య ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. గమనించిన ఇరుగుపొరుగువారు ఇబ్రహీమ్ భార్యను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. పేలుడు దాటికి పూరిల్లు కుప్పకూలి దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు రెండు లక్షల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో ఉదయం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. పేలుడు ధాటికి వంటగదితో పాటు పక్కనే ఉన్న ఓ కిరాణా షాపు ధ్వంసమయ్యాయి. -
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రాము అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడుధాటికి ఇంటి గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ‘గమనించండి’
► సిలిండర్ సీల్‌ను తనిఖీ చేయండి ► బరువుందా తెలుసుకునేందుకు తూకం వేయించండి ► అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి కొవ్వూరునగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరి చేసేందుకు బాయ్స్ తీసుకొచ్చారు. దానికి సీల్ లేదు. సీల్ ఎందుకు తొలగించారని బాయ్స్‌ను అడిగితే, వాచర్ లికేజీ ఉందేమోనని చెక్ చేసేందుకు సీల్ తొలగించామని చెప్పి సిలిండర్ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే సిలిండర్ నిర్ణీత బరువు లేదు. స్పింగ్ త్రాసు బాయ్స్ వెంట తెచ్చుకోకపోవడంతో తూకం వేయించుకోలేక పోయాడు. అనంతపురం అర్బన్ : వంట గ్యాస్ సిలిండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా..? గ్యాస్ నిర్ణీత బరువు ఉందా లేదా...? అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ సిలిండర్లు సీల్ తొలగించి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో డెలివరీ బాయ్స్ చేతి వాటం ప్రదర్శిస్తూ సిలిండర్ నుంచి గ్యాస్ తస్కరించే అవకాÔ¶ ం లేకపోలేదు. ప్రధానంగా విద్యావంతులు కాని వారికి ఇలాంటి సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సీల్ ఉందా లేదో చూసుకోండి గ్యాస్ సిలిండర్ నాబ్‌కు సదరు కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్‌ని ఒకసారి చూడండి. అది ఊడిపోయినట్లు ఉంటే తీసుకోవద్దు. దానికున్న సీల్ తొలగించడం నేరం. అలా డెలివరీ బాయ్స్ తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్ తొలగించి సిలిండర్ సరఫరా చేసినట్లయితే తక్షణం అధికారులు ఫిర్యాదు చేయండి. స్రింగ్ త్రాసు తప్పని సరి వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్ వెంట తప్పని సరిగా స్పింగ్ త్రాసు ఉండాలనేది నిబంధన. గహ అవసర సిలిండర్‌లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్ త్రాసు ద్వారా తూకం వేసి వినియోగదారునికి దాని బరువును చూపించి ఇవ్వాల్సి ఉంది. మీరు అందజేసిన సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లండి. లీకేజి చెక్ చేయించుకోవాలి సిలిండర్‌కు రెగ్యులేటర్ అమర్చే నాబ్లోని వాచర్ కొన్ని సందర్భాల్లో పాడై ఉంటుంది. అలాంటి వాటికి రెగ్యులేటర్ బిగించిన వెంటనే గ్యాస్ లికవుతుంది. సిలిండర్ తీసుకున్న వెంటనే స్వయంగా సీల్ తీసేసి వాచర్ చెక్ చేయించుకోవాలి. గ్యాస్ లికవుతున్నట్లు గుర్తిస్తే తక్షణం వాచర్ వేయించుకోవాలి. ఫిర్యాదు చేయండి కంపెనీ వేసిన సీల్ లేకుండా గ్యాస్ సిలిండర్ సరఫరా చేసినప్పుడు. లేదా తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరించినప్పుడు వెంటనే మీరు జిల్లా పౌర సరఫరాల అధికారి ఫోన్ 8008301418 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సీల్ తీసి డెలివరీ చేస్తే చర్యలు గ్యాస్ సిలిండర్‌కుS కంపెనీ వేసే సీల్తోనే డెలివరీ చేయాలి. అలా చేయలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ తప్పని సరిగా తమ వెంట స్పింగ్ త్రాసు ఉంచుకోవాలి. సిలిండర్ డెలివరీ చేసేప్పుడు తూకం వేసి వినియోగదారునికి అందజేయాలి. – ప్రభాకర్‌రావు, డీఎస్ఓ -
సిలిండర్ పేలి వ్యక్తి మృతి
-
సిలిండర్ పేలి వ్యక్తి మృతి
తిరుపతి క్రైం: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని కనకభూషణం లే అవుట్లో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రయ్య(58) ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుండటంతో.. దాన్ని ఆపేందుకు యత్నిస్తున్న క్రమంలో అది పేలడంతో.. ఎర్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య రెడ్డమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని రుయా ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
కళ్యాణదుర్గం: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో బుధవారం గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. హజీజ్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఉదయం 10 గంటల సమయంలో దుకాణ నిర్వాహకుడు గ్యాస్‌స్టౌలు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్లైట్లు, చిన్న గ్యాస్ స్టౌవ్‌లకు వినియోగించే చిన్న సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో హజీజ్, అతని భార్య, కుమార్తెలు అక్కడి నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ క్రమంలో హజీజ్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఉన్నఫలంగా భారీగా పేలుడు శబ్ధం వచ్చి మంటలు ఎగిసి పడడంతో ఇరుగు పొరుగు వ్యాపారులు, నివాసమున్న కుటుంబాల వారు పరుగులు తీశారు. రూ.15 లక్షలకు పైగా ఆస్తి నష్టం హజీజ్ ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో గ్యాస్లైట్లు, గ్యాస్‌స్టౌవ్‌లు, బ్యాటరీలు, కుక్కర్లు, మిక్సీలు, జార్లు అన్నీ కాలిబూడిదయ్యాయి. దీంతో బాధితునికి రూ.15 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు శ్రమించిన ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఒకే అగ్ని మాపక వాహనంతో మంటలు ఆర్పేందుకు సాధ్యపడకపోవడంతో రాయదుర్గం అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రమించారు. భవనానికి సంబంధించిన పక్క గోడలు ధ్వంసం చేసి మంటలార్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రమాద సంఘటనను తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, తహశీల్దార్ రవీంద్ర మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆర్డీఓ రామారావు కూడా సంఘటనా స్థలాని చేరుకుని పర్యవేక్షించారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట్‌లోని కుమ్మరివాడీ బస్తీలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్తీకి చెందిన ముంతాజ్ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ముంతాజ్‌తోపాటు పర్వేజ్, అఫ్రోజ్ అనే బాలురు గాయపడ్డారు. కుటుంబీకులు వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పర్వేజ్ చనిపోగా మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
సబ్సిడీ రావడం లేదా?
సిద్దిపేటకు చెందిన రాము గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. బండ వచ్చింది. కానీ, రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడలేదు. వారమైనా ఫలితం లేదు. డీలర్‌ను సంప్రదిస్తే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెబుతున్నాడు. ఈ సమస్య ఒక్క రాముదే కాదు చాలామంది లబ్ధిదారులది! సిద్దిపేట రూరల్: రాయితీ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీ చేతిలో ఉన్న మొబైల్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది వరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా.. మళ్లీ మరో ఖాతా తెరవాలన్నా ఆధార్‌నెంబర్ తప్పనిసరి. కొత్త అకౌంట్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం కావడంతో ఆ సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు వెళ్తుంది. దీంతో ఆటోమెటిక్‌గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది. ఈ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే లబ్ధిదారులు చూసుకుంటుంటారు. మొబైల్లో ూ99ూ99ు నెంబర్‌కు డయల్ చేయాలి. వెంటనే మీ ఆధార్‌నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్మాఫ్ చేయడానికి 1 నొక్కాలి. అంతే మీ ఆధార్‌నెంబర్ చూపిస్తూ.. అది ఏ బ్యాంక్‌కు అనుసంధానమైందో, చివరిసారి ఎప్పుడు రాయితీ పడిందో సమాచారం తెలియజేస్తుంది. పాత ఖాతాలో రాయితీ కోసం.. కొత్తగా రాయితీ పడే బ్యాంక్ అకౌంట్లో కాకుండా గత ఖాతాలో నగదు పడాలనుకుంటే సదరు బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌కార్డు జిరాక్స్ ఇచ్చి ఖాతాకు అనుసంధానం చేయించుకోవాలి. అప్పటికే మరో అకౌంట్‌కు అనుసంధానం అయితే, ఎన్పీసీఐ సర్వర్‌కు ఎటాచ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. లావాదేవీలు ఫెయిల్ అయితే. ఎన్పీసీఐ నుంచి లబ్ధిదారుడి ఖాతకు పంపిన లావదేవి ఒక్కోసారి ఫెయిలైతే వెంటనే సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించాలి. అవసరమనుకుంటే మళ్లీ ఆధార్నెంబర్ను అప్డేట్ చేయించుకోవాలి. ఇబ్బందులు లేని భాష భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్‌లో ఎదైనాసరే టోల్‌ఫ్రీ నెంబర్ 1800-23-33-555కు ఫిర్యాదుచేయవచ్చు. గ్యాస్ సమస్య అనగానే ముందుగా గృహిణికే ఇబ్బంది. కాల్‌సెంటర్ అంటే ఇంగ్లిష్‌లోనో.. హిందీలోనో మాట్లాడతారని వారు కంగారుపడుతుంటారు. దీంట్లో ఈ రెండిటితో పాటు ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, కన్నడం, తమిళం, మలయాళంలో మాట్లాడే ప్రతినిధులు ఉంటారు. టోల్‌ఫ్రీకి కాల్చేసి 3 నొప్పి తెలుగుని ఎంపికచేసుకోవాలి. ఆపై ఏ కంపెనీ గ్యాస్ సమస్య అనేది నంబర్ ద్వారా తెలియజేయాలి. ఇండేన్ గ్యాస్ కోసం 1, హెచ్‌పీ కోసం 2, భారత్ గ్యాస్ కోసం 3 బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత రాయితీ సమస్య అయితే 1, ఇతర సమస్యల కోసమైతే 2 నొక్కి వేచి ఉండాలి. సంబంధిత గ్యాస్ సంస్థ ప్రతినిధి మీతో మాట్లాడుతారు. మన సమస్య చెప్పి ఫిర్యాదు నంబర్(ఎస్ఆర్ నంబర్) తీసుకోవాలి. ఆ నంబర్ మన మొబైల్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ సమస్యలకు.. గ్యాస్ తూకం తగ్గిన, సీల్ లేకుండా వచ్చి ఇచ్చినా, నిర్ణీత సమయంలో డెలవరీ చే యకపోయినా, గ్యాస్ డీలర్ మోసం చేసినా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్‌కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఏడు గుడిసెలు దగ్ధం
వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో శనివారం ఉదయం సిలిండర్ పేలి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. కల్పాల రవి అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించి ఏడు ఇళ్లు కాలిపోయాయి. సదరు ఇళ్లలోని వారంతా ఈ రోజు ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తికి చెందిన 5 గొర్రెలు కూడా చనిపోయాయి. ఇంట్లోని సామాగ్రి అంతా దగ్ధం కావడంతో ఏడు కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. -
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
గ్యాస్ వినియోగంలో మెళకువలివీ.. రాయవరం : పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి అయ్యింది. సిలిండర్ వినియోగంలో మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇలా వేరు చేయాలి గ్యాస్ సిలిండర్ పొయ్యికి అమర్చే ముందు ఇంట్లో ఏదేని మంటలు వెలుగుతున్న కొవ్వొత్తి, నిప్పులను ఆర్పేయాలి. బర్నల్ మీదున్న అన్ని రంధ్రాలను మూసివేసేలా ఏదైనా పళ్లెం లాంటిది పెట్టాలి. రెగ్యులేటర్‌కు ఉన్న స్విచ్ నాబ్‌ను ఆన్ స్థానం నుంచి ఆఫ్ స్థానంలోకి తిప్పుకోవాలి. రెగ్యులేటర్‌ను గట్టిగా పట్టుకుని కింది వైపున ఉన్న నల్లటి బుష్‌ను పైకిలాగి రెగ్యులేటర్‌ను నెమ్మదిగా కదుపుతూ పైకి ఎత్తాలి. దీంతో గ్యాస్ సిలిండర్‌ను వేరు చేసినట్టవుతోంది. గ్యాస్ సిలిండర్ వాల్వుపైన సేఫ్టీ క్యాప్‌ను పెట్టి క్లిక్‌మనే శబ్ధం వస్తే అది సరిగ్గా అమర్చినట్టు భావించాలి. ఇలా అమర్చాలి సిలిండర్‌కున్న సేఫ్టీ క్యాప్‌ను దానికున్న దారాన్ని లాగి తొలగించాలి. రెగ్యులేటర్‌కు ఉన్న స్విచ్ నాబ్‌ను ఆఫ్ స్థానంలో పెట్టి, కింద ఉన్న నల్లని ప్లాస్టిక్ బుష్‌ను పైకిలాగి వాయు సిలిండర్ వాల్వు మీద నిలువుగా పెట్టి కిందకు నొక్కాలి. క్లిక్‌మనే శబ్ధం వస్తేనే సరిగ్గా అమరినట్లు. గ్యాస్ ఆన్ చేసి వెంటనే స్టౌవ్ వెలిగించకుండా కాసేపాగి గ్యాస్ వాసన చూసి లీక్ కాలేదని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత అగ్గిపుల్లను తీసుకుని బర్నల్ దగ్గర పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి వెలిగించుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి.. వంట చేస్తున్న సమయంలో నైలాన్ దుస్తులు ధరించరాదు. వంట పూర్తయ్యేదాక వంటింట్లోనే ఉండాలి. వంట గదిలో కర్టెన్లు వాడకూడదు. వంట సమయంలో కిటికీలను కచ్చితంగా తెరిచే వంట చేసుకోవాలి. గ్యాస్ స్టౌకు దగ్గరలో ఎలక్ట్రిక్ ఓవెన్, కిరోసిన్ స్టౌలాంటివి పెట్టకూడదు. రబ్బర్ ట్యూబ్ మాసిపోతుందని దానిపైన ఎలాంటి కవర్ వేయరాదు. స్టౌ వెలిగించే ముందు వంటగదిని గమనించాలి. స్టౌవ్‌కు స్విచ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. పనిచేయకుంటే గ్యాస్ ఆన్‌లో పెట్టి మరమ్మతులు చేయరాదు. నిపుణనుడైన మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి మరమ్మతు చేయించుకోవాలి. వంట పని అయిపోగానే స్టౌకు ఉన్న, సిలిండర్‌కు ఉన్న స్విచ్‌లు ఆఫ్ చేయాలి. సురక్షితమైన సురక్ష ట్యూబ్‌ను మాత్రమే వాడాలి. సురక్ష ట్యూబును కూడా రెండేళ్లకు ఒక సారి మారిస్తే మంచిది. ప్రమాదం సంభవించకుండా.. సిలిండర్ మీద రాసి ఉన్న కాలపరిమితిని గమనించాలి. సదరు తేదీ దాటితే సంబంధిత డీలర్‌కు తెలియజేయాలి. సిలిండర్‌ను నిటారుగా, స్టౌకు కింద భాగాన ఉండేటట్టు చూసుకోవాలి. సిలిండర్‌ను స్టౌ కంటే ఎత్తులో ఉంచరాదు. స్టౌకు కిందనే కదాని సిలిండర్‌ను పడుకోబెట్టరాదు. సిలిండర్‌ను గాలి తగిలే చోట పెట్టాలి. అల్మరాలో పెట్టి డోర్లు వేయరాదు. ఒకటి కంటే మించి స్టౌవ్‌లకు వినియోగించాలనుకుంటే శాస్త్రీయ విధానాన్ని పాటించాలి. అలా కాదని ‘టీ’ ఆకారంలో ఉండే పరికరాన్ని ఉపయోగించి దానికి పైపులు తొడగరా దు. గ్యాస్ బాయ్ తెచ్చిన సిలిండర్‌ను అతడితోనే రెగ్యులేటర్ పట్టి సరిచూసుకోవాలి. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు వంట గదికి నేలకు అడుగు ఎత్తులో చిన్నపాటి కిటికి పెట్టించుకోవడం మంచిది. ఆదాలో చిట్కాలు .. వంట చేసేందుకు ఉపక్రమించే ముందు అన్నం, కూరలకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే స్టౌ వెలిగించాలి. వంట పదార్థానికి తగినన్ని మాత్రమే వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రెజర్ కుక్కర్ వాడకం చాలా ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉండే ప్రెజర్ కుక్కర్ వాడకం చాలా ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉండే పదార్థాలతో పంట చేయాలనుకున్నప్పుడు ముందుగానే వాటిని బయటకు తీసి, బయటి వాతావరణానికి అనువుగా వచ్చిన తర్వాత వాటిని స్టౌ మీద పెట్టుకోవాలి. గుండుగా ఉన్న గిన్నెల వాడకం బాగుంటుంది. గిన్నెలకు కింద రాగి కలిగిన వాటిని వాడితే మరీ మంచిది. మంట నీలం రంగులో రావాలి. ఎర్రగా వచ్చిందంటే స్టౌ సరిగ్గా లేదని గుర్తించాలి. -
పేలిన గ్యాస్ సిలిండర్: తప్పిన ప్రమాదం
అల్లాదుర్గం(మెదక్): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకుని గుడిసె కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలిపూర్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాయికొటి నాగయ్య గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్ద గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నాడు. వంట చేసుకోవడానికి గుడిసెలో గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. గురువారం పొలం పనులు చేసుకునేందుకు నాగయ్య వెళ్లగా షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలి, గుడిసె కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. -
గ్యాస్ లీకై ఇంట్లో అగ్నిప్రమాదం
వాంఖిడి (ఆదిలాబాద్ జిల్లా) : గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. వాంఖిడి మండలకేంద్రంలో నివాసముండే అంజెలి గౌరాబాయి అనే మహిళ ఇంట్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవదహనం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ గ్యాస్‌సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో సామంతుల అంజయ్య(25) అనే యువకుడు ఇంట్లో ఉన్నాడు. మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయనగరంలో అగ్నిప్రమాదం
కట్టెల పోయి మీద వంట చేస్తున్న సమయంలో ఎగిసిపడిన మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుంకోవడంతో అది పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేటలో బుధవారం చోటుచేసుకంంది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో వంట చేస్తున్న సంయలో ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు గ్యాస్‌కు అంటుకోవడంతో.. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి చుట్టుపక్కల మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
‘గ్యాస్’ కాలపరిమితి.. గుర్తించేదెలా?
మనం వాడే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది. అది తినే వస్తువు కావొచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడే మందులు కావొచ్చు.. ఇంట్లో ఉపయోగించే వస్తువు కావొచ్చు. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అన్ని వస్తువులపై పలానా సంవత్సరం.. పలానా నెలలో డేట్ అయిపోతుందని ముద్రించి ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఒక ‘కోడ్’ రూపంలో దాని కాలపరిమితి ముద్రించి ఉంటుంది. మరి ఆ కోడ్‌ను ఎలా గుర్తించాలి..? ఏ నెలలో దాని కాలపరిమితి ముగుస్తుంది..? తదితర విషయాలు మీకోసం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * ప్రతి సిలిండర్‌పై ప్రత్యేక ‘కోడ్’ * దానిని బట్టే కాలపరిమితి గుర్తింపు * వినియోగంలో జాగ్రత్త సుమా! ప్రయోజనం.. ⇒ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ‘ఆల్ఫా న్యూమరికల్’ పద్ధతిలో ముద్రితమై ఉంటుంది. ⇒ సిలిండర్ హ్యాండిల్ రాడ్ వద్ద ఏదో ఒకదానిపై ఒక ఇంగ్లిష్ అక్షరం, రెండు సంఖ్యలు ముద్రించి ఉంటాయి. ⇒ ఇంగ్లిష్ అక్షరం సిలిండర్ కాల పరిమితిలో నెలను.. పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదా: సిలిండర్‌పై ‘డి 16’ అని ఉందనుకుంటే.. ‘డిసెంబరు- 2016’ సంవత్సరానికి దాని కాలపరిమితి ముగుస్తుందని అర్థం. ⇒ ఇక్కడ నెలను ముద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు. ⇒ సంవత్సరంలోని 12 నెలలను ‘ఎ,బి,సి,డి’గా విభజించారు. వీటిలో ఒక్కోదానికి మూడు నెలలుగా కేటాయించారు. ⇒ అంటే ‘ఎ’ సిరీస్‌కు మెదటి భాగం మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి), ‘బి’ సిరీస్‌కు రెండో భాగం మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్), ‘సి’ సిరీస్‌కు (జూలై, ఆగస్టు, సెప్టెంబరు), ‘డి’ సిరీస్‌కు నాలుగో భాగం మూడు నెలలు (అక్టోబరు, నవంబరు, డిసెంబరు)గా ఉన్నాయి. ⇒ సిలిండర్‌పై ‘ఎ’ ఉంటే మార్చి వరుకు, ‘బి’ ఉంటే జూన్ వరకు, ‘సి’ ఉంటే సెప్టెంబరు వరకు, ‘డి’ ఉంటే డిసెంబరు వరకు అని అర్థం. ఉదా: ‘ఎ 20’ అని ఉంటే.. ‘మార్చి 2020’ నాటికి సిలిండర్ గడువు ముగుస్తుంది. సూచన: కాలపరిమితి అయిన సిలిండర్‌ను గుర్తించి అప్పుడే మార్చుకోవాలి. లేకపోతే దాన్ని వాడే సమయంలో ఒత్తిడికి గురైనా, దాన్ని అలాగే వాడినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
కోటగిరి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటగిరి మండలం వల్లభాపూర్‌లో మేకల రాజు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అతని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం కలిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
గ్యాస్ సిలిండర్‌పేలి ముగ్గురికి గాయాలు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గంగరపర్రు గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు గ్యాస్ పొయ్యి వెలిగించగా అది లీకై మంటలు లేచాయి. అనంతరం సిలిండర్ పేలి ఇల్లు దెబ్బతినంటంతోపాటు ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకోడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది. రోడ్డు నంబర్ 7 లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించడంతో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. -
పసిబిడ్డ ప్రాణం తీసిన అంబులెన్స్
-
పేలిన సిలిండర్..తప్పిన పెను ప్రమాదం
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్దపల్లి కొత్తంవాడ కాలనీలో పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలిన గ్యాస్ సిలిండర్, 10 మందికి గాయాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం కోస్తాలో ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
ధర్మవరం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ధర్మవరంలోని పీఆర్టీ వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. పండ్ల వ్యాపారం చేసే మల్లేశ్ కుటుంబం మంగళవారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఇంట్లోని తలుపులు, కిటికీలు మంటలకు కాలిపోయాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ యజమాని మల్లేశ్ చెప్పారు. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
పేలిన సిలిండర్: లక్షన్నర ఆస్తి నష్టం
ప్రకాశం (సంతమాగులూరు) : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలోని దొండపాటి కోటేశ్వరరావు ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో డబ్బుతోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. గ్యాస్ లీకవుతుండటం గమనించి ఇంట్లో వాళ్లు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. -
పాతపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. జిల్లాలోని పాతపట్నం మండలం గంగువాడలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిలిండర్ పేలి హోటల్ దగ్ధం
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాళెం గ్రామంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలి ఒక హోటల్ దగ్ధమైంది. మంగమ్మ అనే మహిళ స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ రోజు మధ్యాహ్నం హోటల్లోని గ్యాస్ సిండర్ లైకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్లో అల్పాహారం సేవిస్తున్నవారంతా భయంతో పరుగుతీశారు. అందరూ చూస్తుండగానే హోటల్ కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. గల్లాపెట్టెలో ఉన్న రూ.10వేల నగదు సహా మొత్తం రూ. 2.5లక్షల ఆస్థినష్టం సంభవించడంతో యజమానురాలు మంగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరికి గాయాలు
మహబూబ్‌నగర్: గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మండలం కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సిలిండర్ లో మిగిలి ఉన్న గ్యాస్ ను మరొక సిలిండర్ లో నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంజయ్(8), భూమిక(10) అనే ఇద్దరు చిన్నారులతో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సంజయ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ పేలి ముగ్గురి మృతి
-
వంట గ్యాస్ ఉంటే కిరోసిన్ బంద్
సాక్షి, ముంబై : వంట గ్యాస్ సిలిండర్ ఉన్న రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ నిలిపేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొందుతున్న వారికి రేషన్ కార్డుపై కిరోసిన్ పంపిణీ చేయకూడదని జారీచేసిన సర్క్యులర్‌లో ఎఫ్డీ స్పష్టం చేసింది. సిలిండర్ లేని గ్రామీణ, పట్టణ వాసులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన నాగ్‌పూర్ బెంచి.. పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన కోటా ఇవ్వాలని తీర్పివ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డి మాండ్ చేసిన కిరోసిన్‌లో ప్రస్తుతం 28 శాతం మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1.77 లక్షల లీటర్ల కిరోసిన్ కావాలని డిమాండ్ చేస్తుండగా 46 వేల లీటర్లు మాత్రమే కేంద్రం పంపిణీ చేస్తోందని ఎఫ్డీ అధికారులు తెలిపారు. -
ఓజిలిలో పేలిన సిలిండర్.. ఒకరి మృతి
నెల్లూరు(ఓజిలి): ఓజిలి మండలం పోలిపాడు గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పుస్తకాల నాగభూషణమ్మ(60) అక్కడికక్కడే మృతిచెందింది. గ్యాస్ సిలిండర్ పేలుడుతో వ్యాపించిన మంటలకు రెండు పూరిళ్లు కూడా దగ్ధమయ్యాయి. -
బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు
ప్రకాశం(గిద్దలూరు): గిద్దలూరు మండలం షరఫ్ బజార్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ షాపులో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఓ పాపతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులకు సరైన వైద్యం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు డాక్టర్లను తెప్పించి వైద్యం అందిస్తున్నారు. -
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా
-
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా
- వంట గ్యాస్ ప్రమాదానికి రూ.40 లక్షల బీమా! - వినియోగదారునికి తెలియకుండా దాచిఉంచిన ఇంధన కంపెనీలు, డీలర్లు సంగారెడ్డి టౌన్: వంట గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వినియోగదారునికి రూ. 40 లక్షలు బీమా కవరేజ్ ఉంది. అంతే కాకుండా సిలిండర్ పేలి బతికి బయట పడ్డ వారికి కూడా రూ. 30 లక్షల బీమా ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎంతమంది వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకు తెలుసనేది ప్రశ్న? ప్రమాదాలు జరిగిన వారికి ఇంధన కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన సందర్భాలున్నాయి? ఆలోచించాల్సిందే. వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. సదరు వినియోగదారుడు బీమాకు అర్హుడవుతాడు. ఈ విషయం గ్యాస్ కంపెనీలలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలియపోవడం విడ్డూరం. ఉద్యోగస్తులకే తెలియంది సామాన్యులకు ఎలా తెలుస్తుంది. అంతే కాదు.. గ్యాస్ కనెక్షన్ తీసుకోవడంతోనే తమకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని వారికే తెలియదాయే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిబంధన ప్రకారం వంట గ్యాస్ వినియోగదారులందరికీ కంపెనీలు బీమా చేస్తారు. ఈ విషయం గ్యాస్ వినియోగదారులకు సంబంధిత డీలర్లు చెప్పడం లేదు. అసలు వారికి కూడా ఈ విషయం తెలుసనేది సందేహం. ఎందుకంటే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కుమ్మక్కై ఇలాంటి ముఖ్య సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు. ఇప్పటి వరకు కొన్ని వందల గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలు జరిగాయి. ఏ ఒక్కరికి ఈ పాలసీ ద్వారా లబ్ధిపొందిన దాఖలాలు లేవు. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగిన వెంటనే వినియోగదారులు సంబంధిత డీలరుకు విషయం తెలుపాలి. ఆ డీలర్ ఈ విషయం కంపెనీకి తెలపాల్సి ఉంటుంది. విచారణ జరిపి బాధితునికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం రహస్యంగా ఉండడం శోచనీయం. ఈ విషయంపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 18002333555కు ఫిర్యాదు చేయవచ్చు. -
కర్రీస్ పాయింట్లో గ్యాస్ సిలిండర్ లీక్
హైదరాబాద్ : కూకట్పల్లి ఎల్లమ్మబండ ఇందిరా గాంధీ విగ్రహం వద్దనున్న ఓ కర్రీస్ పాయింట్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్‌లో లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కర్రీస్ పాయింట్లో పనిచేస్తున్న సుమన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని రెండు చేతులకు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అప్రమత్తమై మట్టితో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. -
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. భారీగా మంటలు ఎగిసిపడ్డ సంఘటన బుధవారం సాయంత్రం నగరంలోని అత్తాపూర్‌లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ సమీపంలోని ఇందిరాగాంధీ బొమ్మ పక్కన టీ దుకాణంలో సిలిండర్ ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. -
గ్యాస్ సిలిండర్ల కంటైనర్ బోల్తా
కర్నూలు : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో కర్నూలు- తిరుపతి రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత్ గ్యాస్ సిలండర్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ఆళ్లగడ్డ సమీపానికి రాగానే బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఆళ్లగడ్డ) -
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
కరీంనగర్: గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం మామిండ్లవాడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ మతిన్ ఇంట్లో ఈ ప్రమాదం సంభవించిది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడికి ఇళ్లు పూర్తిగా ధ్వసం అవడమే కాక చుట్టు పక్కల ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్థులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
కరీంనగర్: గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం మామిండ్లవాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నాం జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ మతిన్ ఇంట్లో ఈ ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వసం అవడమే కాక చుట్టు పక్కల ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలం చిత్కుల్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా పటాన్చెరువు మండలంలోని చిట్కూల్ గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన తళారి బాబూరావు వెల్డర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య మాధవి, ముగ్గులు పిల్లలు మనోజ్(14), కవలపిల్లలు శ్రీరామ్(9), లక్ష్మణ్(9) లున్నారు. అయితే, గురువారం వారి ఇంటిలోని సిలిండర్ లీకై, గ్యాస్ పూర్తిగా వ్యాపించింది. ఇది తెలియని మాధవి వంట చేసేందుకు ప్రయత్నించగా సిలిండర్పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గాయపడిన వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బండ బద్దలైంది
-
గ్యాస్ సిలిండర్ పేలుడు : ఇద్దరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అగ్రా నగరంలో బాలుగంజ్ ప్రాంతంలోని హోటల్ యజమాని బల్జిత్ సింగ్ ఇంట్లో శనివారం అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరి కుమార్తెలు మరణించారు. బల్జిత్ సింగ్ దంపతులతోపాటు మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలుడికి బల్జిత్ సింగ్ నివాసం కుప్పకూలింది. గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం
ఆదోని(కర్నూలు జిల్లా): ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం రాత్రి ఆదోని పట్టణంలోని ఎన్జీవో కాలనీలో జరిగింది. వివరాలు..ఎన్జీవో కాలనీలోని ఒక దుకాణంలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా ఎగిసిపడిన మంటలు పలు దుకాణాలకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాంధోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి జరగలేదని సమాచారం. దుకాణాలన్నీ మూసి ఉండటంతో ఆస్తి నష్టం అంచనా వేయలేకపోతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం... అదుపులోకి మంటలు
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు 15కి పైగా ఫైరింజన్లు, ఒక వాటర్ క్యానన్లతో సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో మొదట మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎగసిపడిన మంటల కారణంగా ఒక షెడ్డులో 20పైగా సిలెండర్లు పేలాయి. ఐటీఐ గోదాముల్లో 30పైగా షెడ్లు అగ్నికి ఆహుతైయ్యాయి. దాంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఆయనతోపాటు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఇతర పోలీస్ అధికారులు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ :నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలో ఓ కార్ల్ షెడ్ లో సిలిండర్ పేలిన ఘటన భారీ ప్రమాదానికి దారి తీసింది. వివరాలు... నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఓ కార్ల షెడ్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చుట్టుముట్టాయి. గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీగా శబ్ధం రావడంతో ప్రజలు భయందోళనలకు గురయ్యారు. ఘటనాస్థలానికి 15 ఫైరింజన్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లను తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు సీపీ మహేందర్ రెడ్డిలు సందర్శించారు.ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేశారు.నాంపల్లి- మాసబ్ ట్యాంక్ మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను ఆసిఫ్ నగర్ మీదుగా మల్లించే యత్నం చేస్తున్నారు. ఒక షెడ్డులోని 20 పైగా సిలిండర్లు పేలాయి. షెడ్డులోని సామాన్లు దగ్ధమయ్యాయి. సిబ్బంది కొరతతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు వాపోతున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు
హైదరాబాద్: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌లీక్ అవడంతో ఇల్లు దగ్ధమయింది. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసి గూడకు చెందిన సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం రిజ్వాన్ భార్య పర్విన్ వంట చేస్తున్నప్పుడు ఒక్కసరిగా గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న పర్విన్ తన ఇద్దరు పిల్లలతో ఇంట్లోంచి బయటకు పరుగు తీసింది. కొద్దిసేపట్లోనే మంటల ధాటికి పెద్ద శబ్ధం చేస్తూ గ్యాస్‌సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగలేదు ఇంట్లో ఉన్న లక్ష రూపాయల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదయింది. -
రూ.600కే గ్యాస్ సిలిండర్
టీ నగర్: వంట గ్యాస్ సబ్సిడీని ఒకే నెలలో రూ.100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.600కు కొనుగోలు చేయవచ్చు. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి ప్రజలు కొనుగోలు చేయాల్సి వుంది. దీనికి సంబంధించిన సబ్సిడీ వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లించనున్నారు. జనవరిలో సిలిండరు ధర రూ.410, సబ్సిడీ రూ.300 మొత్తం రూ.710 చెల్లించి గ్యాస్ ఏజన్సీల వద్ద ప్రజలు సిలిండర్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన సబ్సిడీ సొమ్ము రూ.300 వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు చేరింది. వంట గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ పథకం రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నెలలోనే సబ్సిడీ మొత్తం హఠాత్తుగా తగ్గించారు. గత నెల సబ్సిడీ రూ.300 అందజేయగా ఈ నెల రూ.200కు తగ్గించారు. ఈ నెలలో సిలిండర్ కొనుగోలు చేసేవారు రూ.600 చెల్లించి కొనుగోలు చేయాల్సివుంటుంది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: 3 ఇళ్లు దగ్ధం
ముదినేపల్లి: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో శనివారం మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
బెజవాడలో భారీ పేలుడు
* ముగ్గురు మృతి * ఏడుగురికి గాయాలు * ఇద్దరి పరిస్థితి విషమం విజయవాడ: విజయవాడలో మంగళవారం భారీ విస్ఫోటం సంభవించింది. స్థానిక రాజీవ్ శర్మ కాలనీలోని అంబేద్కర్‌వాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన భవనం ధ్వంసమవగా మరో మూడు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారి మరుపిళ్ల బాలరాజుకు చెందిన మూడంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగిం ది. భవనం కింది భాగంలో నాలుగు పోర్షన్లలో వేర్వేరు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. వీటిలో కొత్తపల్లి శివలోకేశ్వరి (35) నివాసంలో పేలుడు సంభవించింది. ఆమెతో పాటు ఆమె పిల్లలు కీర్తి (10), నిఖిల్ (8), కొండేటి శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. పక్క పోర్షన్లో ఉంటున్న కూరాడ రాంబాబు అలియాస్ రమణ (45), అతని భార్య నిర్మల (35) అక్కడికక్కడే చనిపోయారు. పక్క భవనంలో ఉం టున్న రమణమ్మ (60) కూడా అక్కడికక్కడే మృతిచెందింది. పక్క భవనాల్లో ఉండే కార్తీక్ (14), స్వరూప్ (13), షేక్ బాజీ (55) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బాజీ, లోకేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, ఏసీపీ రాఘవరావు తదితరులు ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్, బాంబు నిపుణుల బృందం ఆధారాలు సేకరించాయి. జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ చెప్పారు. ప్రమాద స్థలాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమ, వల్లభనేని వంశీ, మేయర్ కోనేరు శ్రీధర్ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. గాయపడిన వారికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద వైద్యం అందిస్తామని చెప్పారు. ఘటనపై అనుమానాలు ఈ ఘటన పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. అక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. ఘటన జరిగిన భవనంలోని కింది మూడు పోర్షన్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. అక్కడ పేలిన గ్యాస్ సిలిండర్లు లేవు. భవనంలో మంటలు, పొగచూరిన ఆనవాళ్లు లేవు. దీనిపై పోలీసులకూ అనుమానాలు రావడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. లోతైన అధ్యయనం కోసం ప్రత్యేకంగా కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదం కాదని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై తాము ఎలాంటి నిర్ధారణకు రాలేదని సబ్ కలెక్టర్ నాగలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలూ వెల్లడిస్తామని తెలిపారు. -
విజయవాడలో పేలిన గ్యాస్ సిలిండర్...
-
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
రేపటి నుంచి నగదు బదిలీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వంటగ్యాస్ నగదు బదిలీ పథకం గురువారం నుంచి మళ్లీ ఆరంభమవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు కలిగిన వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ.861 చెల్లించాల్సిందే. ఆయా వినియోగదారులందరికీ కొద్దిరోజుల తరువాత సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో కేంద్రం జమచేయనుంది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన గ్యాస్ నగదు బదిలీ పథకం గందరగోళంగా మారడంతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు నడుం బిగించడంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ప్రజలకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే అంశమే కానుంది. ఇక గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై విధిగా ఆధార్, బ్యాంకు నెంబర్‌కు అనుసంధానించాల్సిందే. లేనిపక్షంలో వారికి సబ్సిడీ ధరపై గ్యాస్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారు. జిల్లాలో మొత్తం 7,26,707 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.861. గృహావసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీపై రూ.451కి అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి బ్యాక్ ఖాతా, ఆధార్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే తొలుత రూ.861 చెల్లించాల్సిందే. కేంద్రం ఇచ్చే సబ్సిడీ మాత్రం వెంటనే కాకుండా కొద్ది రోజుల తరువాత సదరు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. అయితే ఇందులోనూ కొంత తిరకాసు ఉంది. వాస్తవానికి నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ ధర 861.50 కాగా వినియోగదారులు ప్రస్తుతం 451.50 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.410 సబ్సిడీ చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ ఇకపై వినియోగదారుడి ఖాతాలో రూ.390 జమ కానుంది. ఎందుకంటే మిగిలిన రూ.20 వ్యాట్ కింద మినహాయిస్తారు. అంటే వినియోగదారుడిపై ఈమేరకు గ్యాస్ భారం కానుంది. గందరగోళం షురూ... మరోవైపు జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లుండగా, అందులో 40 శాతం మందికి ఇంతవరకు ఆధార్కార్డుల్లేవు. 70 శాతం మందికి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్లను అనుసంధానం చేయలేదు. నగదు బదిలీ పథకం ఆరంభానికి మరో 24 గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. కేంద్రం మాత్రం ఆరు నూరైనా ఈ పథకాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించాల్సిందేనని ఆదేశించడంతో అధికారులు, ఎల్పీజీ డీలర్లు తలపట్టుకుంటున్నారు. ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతం : ఈటెల ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని ఎల్పీజీ డీలర్లు సమావేశమై పథకం అమల్లో ఎదురుకానున్న ఇబ్బందులను చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్లనే గత ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని గుర్తు చేశారు. ‘వాస్తవానికి తెలంగాణలోని గ్రామాల్లో మెజారిటీ ప్రజలకు బ్యాంకు ఖాతాల్లేవన్నారు. ఈ దశలో రూ.861 చెల్లించి సిలిండర్ కొనాలనడం పెద్ద సమస్యే. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఇస్తున్నా విమర్శలొస్తున్నాయే తప్ప యాది చేసుకునేటోళ్లు లేరు. అట్లాకాకుండా గ్యాస్ నగదు బదిలీ పథకంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలనూ భాగస్వామ్యం చేసి ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతమవుతోంది. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా దానికి మమ్ముల్నే బాధ్యుల్ని చేస్తారు. ఎందుకంటే కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఉండేది మేమే కాబట్టి మేమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంతో మాకు సంబంధం లేదని తప్పుకునే పరిస్థితిని మాత్రం తీసుకురాకుండా పద్దతిగా చేయండి’ అని సూచించారు. గ్యాస్ వినియోగదారులందరు బ్యాంకు ఖాతాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం త్వరలోనే బ్యాం కర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడు తూ.. ఇప్పటివరకు తనకు ఆధార్ కార్డే లేదని, ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. గ్యాస్‌కు, ఆధార్ లింకు పెట్టడంవల్లే ఈ సమస్య ఎదురవుతోందని అభిప్రాయపడ్డారు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తే విజయవంతం అవుతుందని చెప్పారు. మార్చి వరకు గడువు ఎల్పీజీ జిల్లా సమన్వయకర్త నందకిషోర్ మాట్లాడుతూ.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడు వు ఉందని అన్నారు. ఈ రెండు ఖాతాలతో గ్యాస్ కనెక్షన్ అనుసంధానం చేసుకున్న విని యోగదారులు మాత్రం జనవరి నుంచే రూ. 861.50 చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయా ల్సి ఉంటుదన్నారు. ఆ తరువాత వారి బ్యాంక్ ఖాతాలో రూ.390 జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం నాయకుడు హెచ్.వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు రాధకృష్ణ, కార్యదర్శి హరిక్రిష్ణ, సభ్యులు సతీష్, సంపత్, గౌరవ్ పాల్గొన్నారు. -
బాధితులకు అండగా నిలుస్తా!
తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి నష్టపోయిన బాధితులకు అండగా ఉంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరిగొండ పంచాయతీ దేవుడుమాన్యం కాలనీలో ఈ నెల 25న పూనమల్లి రాధయ్య పూరింట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో స్థానికుడు సిరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎమ్మెల్యే కాకాణి బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం వరిగొండకు వచ్చారు. ముందుగా కాకాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అధికారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన సిరాజ్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన రాధయ్య కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన సిరాజ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామన్నారు. ఈ రెండు కటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఆర్థిక సాయంతో పాటు వ్యక్తిగతంగా తన వైపు నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తామని తెలిపారు. సిరాజ్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం అందజేయాలన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి వైద్యశాల్లో చికిత్స పొందుతున్న నాగభూషణమ్మ, కార్తీక్‌కు ప్రభుత్వమే వైద్యఖర్చులు భరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, నాయకులు టంగుటూరు శ్రీనివాసులురెడ్డి, నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, ఒబ్బారెడ్డి సురేష్‌రెడ్డి, పి.రామసుబ్బయ్య, అశోక్‌రెడ్డి, రామ్మూర్తి, సురేష్‌రెడ్డి, ఎన్.శ్రీనివాసులురెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డి, జాకీర్, ప్రవీణ్‌కుమార్, తహశీల్దార్ రామలింగేశ్వరరావు, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఆర్ఐలు రాజేష్, అబ్దుల్, సర్పంచ్ బొడ్డు రాజమ్మ పాల్గొన్నారు. పొదలకూరు సమగ్ర అభివృద్ధికి కృషి పొదలకూరు : పొదలకూరు మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత స్వయం గా కండలేరు సీపీడబ్ల్యూస్కీమ్ను పరిశీలిం చి ఒక ఫిల్టరు, ఒక విద్యుత్ మోటారును మరమ్మతు చేయించడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు. మరో రెండు ఫిల్టర్లు, రెండు మోటార్లను మార్చడం జరుగుతుందన్నారు. దీంతో వేసవిలో పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవన్నారు. పట్టణంలోని క్లస్టర్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉందన్నారు. వసతి గృహాల నిర్మాణం పూర్తిచేయించనున్నట్లు తెలిపారు. మండలంలోని అమ్మవారిపాళెం, ఆల్తుర్తి, కనుపర్తి తదితర గ్రామాలకు దక్షిణ కాలువ నుంచి సాగునీరు అందడం లేదన్నారు. అటవీశాఖ భూముల్లో కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. భూసేకరణకు అనుమతులు లభించినా ప్రభుత్వం అటవీశాఖకు నిధులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దక్షిణ కాలువ అటవీ భూముల్లో కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. పొదలకూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటునకు సంబంధితశాఖ మం త్రితో మాట్లాడినట్లు తెలిపారు. సమావేశం లో పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు శశిధర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సులోచన, పెంచలయ్య, ఎంపీడీఓ శ్రీహరి, పీఆర్, ట్రాన్స్‌కో ఏఈలు చంద్రశేఖర్, అమీర్జాన్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, యూసీ మస్తాన్‌రెడ్డి, ఆదూరు వెంకటసుబ్బయ్య, మస్తాన్, రామయ్య, అంకిరెడ్డి పాల్గొన్నారు. -
వచ్చేనెల నుంచే నగదు బదిలీ!
మెదక్ రూరల్: జిల్లాలో నగదు బదిలీ పథకం మళ్లీ అమలుకాబోతోంది. కాంగ్రెస్ హయాంలో అమల్లోకొచ్చిన ఈ పథకం ఆ తర్వాత పలు కారణాలతో నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న సర్కార్ తిరిగి ఈ పథకాన్ని జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సిద్ధమైంది. అధికారిక లెక్కల ప్రకారం..జిల్లాలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ కంపెనీల పరిధిలో 3,39,742 కనె క్షన్లుండగా, దీపం పథకానికి సంబంధించిన మరో 1,75,391 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 5,15,133 కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులూ తప్పకుండా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అంతా పారదర్శకత మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే గ్యాస్ వినియోగదారుడు అంతమొత్తాన్ని గ్యాస్ డీలర్‌కు చెల్లించి గ్యాస్‌బండను పొందాల్సి ఉంటుంది. ఇలా గ్యాస్‌ను పొందిన వినియోగదారుల జాబితాను సదరు గ్యాస్ డీలర్ సర్కార్‌కు పంపితే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుంది. గ్యాస్‌బుకింగ్, డెలివరీ, సబ్సిడీ మొత్తం జమ అంతా ఆన్లైన్లో జరగడంతో అక్రమాలకు అవకాశం ఉండదని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిలో సగం మంది కూడా గ్యాస్‌ను వాడడం లేదని, అయినప్పటికీ వారిపేరు మీద కొందరు డీలర్లు, ఇతరులు గ్యాస్‌ను బుక్ చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే సర్కార్ ప్రతి వినియోగదారుడూ తన ఆధార్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఖాతా ప్రతిని గ్యాస్ డీలర్‌కు ఇవ్వాలని చెబుతోంది. అప్పుడు ఎవరైనా వినియోగదారునికి తెలియకుండా గ్యాస్ బుక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని, అందువల్ల అక్రమాలకు తావే ఉండదని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులంతా గ్యాస్‌కు పూర్తి డబ్బులను చెల్లించాల్సి ఉంటుందని పదే, పదే లబ్ధిదారుల ఫోన్లకు గ్యాస్ ఏజెంట్లు సంక్షిప్త సమాచారాన్ని పంపుతున్నారు. దూరాన్ని బట్టి ధర ప్రసుత్తం గ్యాస్ ధరను దూరాన్నిబట్టి రవాణా ఖర్చులను కలుపుకుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం మెదక్‌లో సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.451 నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో జమ అవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది. -
4కు చేరిన సిలిండర్ పేలుడు మృతుల సంఖ్య
విశాఖ:ఈనెల 9వ తేదీన నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. మంగళవారం పకోడీల వ్యాపారి సూరిబాబు సెవెన్స్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
గ్యాస్ సిలిండర్ పేలి తండ్రీకూతురు మృతి
తండ్రి వికలాంగుడు... కూతురు మానసిక రోగి కరీంనగర్లో ఘటన కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహ్మద్‌పురలో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రీకూతురు మృతి చెందారు. నగరంలోని మంగళవాడకు చెందిన కూర ప్రభాకర్(65), అతడి కుమార్తె పద్మ(35) ఇద్దరు నగరంలోని పాత శిశుమందిర్ వద్ద మిర్చిబండి నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ వికలాంగుడు కాగా, పద్మ మానసిక వ్యాధితో బాధ పడుతోంది. అయినప్పటికీ వీరు తమ కాళ్లపై తాము జీవిస్తుండగా, చివరికి తాము నమ్ముకున్న జీవనోపాధే బలిగొన్నది. మిర్చిబండికి అవసరమైన వంట సామగ్రి తయారీ కోసం మహ్మద్‌పురలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రభాకర్, పద్మ కలిసి అక్కడ వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ రెగ్యులేటర్ ఒక్కసారిగా ఎగిరిపోవడంతో పాటు స్టవ్ మీద ఉన్న వేడినూనె, నీళ్లు వీరిపై పడ్డాయి. నూనెకు మంటలు అంటుకుని పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఇంటి పై కప్పుకు రంధ్రం పడింది. ప్రభాకర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. పద్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పద్మను ఆస్పత్రికి తరలించగా సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది. -
‘బండ’పై నొక్కుడు
ఒక గ్యాస్ సిలిండర్‌పై రూ.40 అదనం జిల్లా మొత్తంమీద రోజుకు రూ.7 లక్షలు బలవంతపు వసూళ్లు లేదంటే సిలిండర్ ఇవ్వరు జిల్లాలో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే వ్యక్తులు ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతూ దౌర్జన్యం చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు నిర్ణయించిన నగదు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చోద్యం చూస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. రోజుకు రూ.7లక్షలు.. నెలకు రూ.2 కోట్లుపైనే చిత్తూరు (అర్బన్): ప్రజలు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకుంటే కంపెనీ డెలివరీ బాయ్స్ సిలిండర్లు ఇవ్వడం ఆనవాయితీ. గృహ అవసరాలకు ఆధార్ నెంబరు సీడింగ్‌లో ఉన్న వాళ్లు ఒక్కో ిసిలిండరుకు రూ.818.50 చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో వారం రోజుల్లో జమ అవుతుంది. ఆధార్ లేనివారు ిసిలిండరుకు రూ.440 చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 71 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అన్ని ఏజెన్సీల నుంచి రోజుకు 17,500 సిలిండర్లు డెలివరీ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను డెలివరీ ఇచ్చే సమయంలో ప్రతి ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం నగదు వివరాలను కంప్యూటర్ రశీదులో పొందు పరచి డెలివరీ బాయ్స్ వద్ద ఇచ్చి పంపుతున్నారు. ిసిలిం డర్ వినియోగదారుడికి డెలివరీ అయ్యే సమయానికి కంప్యూటర్ బిల్లుతో పాటు అదనంగా ప్రతి సిలిండర్‌కు రూ.40 వసూలు చేస్తున్నారు. దీనిపై విని యోగదారులు డెలివరీ బాయ్స్ తో గొడవ పడుతున్నారు. బిల్లు కాకుండా ఎందుకు అధిక మొత్తంలో ఇవ్వాలని అడుగుతుంటే.. తమకు గ్యాస్ కంపెనీలు జీతాలు ఇవ్వడం లేదని, ప్రతి సిలిండర్‌పై రూ.40 వసూలు చేసుకోమని నిర్వాహకులే చెబుతున్నారని డెలివరీ బాయ్స్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే జరుగుతున్న దందాపై ఏ అధికారి గానీ, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గానీ నోరు మెదపడం లేదు. అదనంగా డబ్బు ఇవ్వకుంటే సిలిండరు ఇచ్చేది లేదంటూ కొన్ని ప్రాంతాల్లో వెనక్కు తీసుకెళ్లిపోతున్నారు. ఇలా జిల్లా మొత్తం మీద ఒక్కరోజుకు దాదాపు 17,500 ిసిలిండర్లు డెలివరీ చేస్తూ ప్రజల నుంచి రూ.7 లక్షలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. తానే కూలీ... మరో ఇద్దరు అసిసెంట్లు..! గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ రోజుకు వేలాది రూపాయలు సంపాదించడంతో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి కూడా తానే ఉపాధి కల్పిస్తున్నారు. వేలాది ఇళ్లు ఉన్న ప్రాంతానికి ఒకే వ్యక్తి సిలిండర్లు పంపిణీ చేయడం సాధ్యం కాదు. అందుకే తాను ఓ ఏజెన్సీలో జీతం తీసుకుంటున్నా... సంస్థతో సంబంధం లేకుండా మరో ఇద్దరిని అసిస్టెంట్లుగా నియమించుకుంటున్నాడు. ఆ ఇద్దరు సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ చేయడం వారి నుంచి అదనంగా ముక్కుపిండి మరీ కనీసం రూ. 50 వసూలు చేస్తున్నారు. ఆ మొత్తం ప్రధాన గ్యాస్ డెలివరీ బాయ్ సగం, మిగతా ఇద్దరు సగం మొత్తం పంచుకుంటుంటారు. ఇళ్ల వద్ద ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం సిలిండర్ కావాలా? తీసుకుని వెళ్లిపోవాలా? అని దబాయిస్తున్నారు. ఈ తరహా సంపాదనతోనే చాలామంది గ్యాస్ డెలివరీ బాయ్స్ రూ. లక్షలకు పడగలెత్తుతున్నారు. ఇంకొందరు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. చట్టరీత్యా చర్యలు.. అదనపు డబ్బులు వసూలు చేయొద్దని ఇప్పటికే పలుమార్లు ఏజెన్సీల నిర్వాహకుల్ని హెచ్చరించాం. డెలివరీ బాయ్స్‌కు సక్రమంగా వేతనాలు ఇస్తే ఇలాంటి ఫిర్యాదులు రావు. ఐదు కిలోమీటర్ల పరిధి వరకు డెలివరీ చేసే సిలెండర్లకు ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. దీనిపై వారం రోజుల్లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని చెబుతాం. మాట వినకుంటే కలెక్టర్‌తో చర్చించి ఏజెన్సీలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అధికారులెవరైనా ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నట్టు ప్రజలు ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. - విజయరాణి, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారిణి -
గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్ తగ్గించండి
పౌరసరఫరాల శాఖ సిఫార్సు సాక్షి, హైదరాబాద్: సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌తో వినియోగదారుల పై అదనంగా పడుతున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) భారాన్ని తగ్గిం చేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆధార్ నంబర్‌తో అనుసంధానం అయిన విని యోగదారుల ఖాతాలో రూ.388 జమ కావాల్సి ఉన్నా, రూ.369.53 మాత్రమే జమ అవుతోంది. వ్యాట్ రూ.39.64గా ఉండడంతో రూ.18.47 మేర తక్కువగా జమ అవుతోంది. అదే ఆధార్ నమోదుచేసుకోని వారికి ప్రస్తుతం రాయితీ ద్వారా అందిస్తున్న సిలిండర్ ధర రూ.444.50 ఉండగా, అందులో వాస్తవ ధర 423.33, వ్యాట్ రూ.21.17గా ఉంది. ఇలా వ్యాట్ వ్యత్యాసం రూ.18.47 మేర ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భా రాన్ని తగ్గించేలా నిర్ణయం చేయాలని కోరింది. -
మృత్యువుతో పోరాటం
డాబాగార్డెన్స్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఏబీసీ ఆస్పత్రికి తరలించారు. రంగిరీజువీధిలో సోమవారం ఉదయం సంభవించిన గ్యాస్‌లీక్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (80 శాతం గాయాలు), పకోడి బండి వ్యాపారి కొల్లి సూరిబాబు (76 శాతం గాయాలు), శాంతమ్మ (50 శాతం గాయాలు), పేలుడు సంభవించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కోట సత్యనారాయణ మనుమరాలు పూజిత (60 శాతం గాయాలు) సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న 19 నెలల చిన్నారి జయరామ్ పరిస్థితి విషమించడంతో తొలుత ఏబీసీ ఆస్పత్రికి...అనంతరం ఓమ్ని ఆర్కె చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రెండున్నరేళ్ల చాందిని, ఎనిమిదేళ్ల తనూజను కూడా ఇదే ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది శాతం గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జి.నాగేశ్వరి, ఏడు శాతం గాయాలతో చికిత్స పొందుతున్న కీర్తిని బుధ, గురువారాల్లో డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో చికిత్స పొందుతున్న కోట బుజ్జికి కొల్లాజన్ (కాలిపోయిన చర్మానికి రక్షణ) వేశారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బుధవారం పరామర్శించారు. పట్టించుకునేవారే లేరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చూసి వెళ్లిపోయారే తప్పా తమ గోడు పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇక్కడ అందుతున్న వైద్యం కోసం ఆరా తీసేవారే లేకపోయారంటూ వాపోయారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. రాత్రి వేళల్లో సెలైన్ ఆగిపోతే నర్సింగ్ సిబ్బంది లేకుండా పోయారని, వాచ్‌మన్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ప్రాణాలతో దక్కాలంటే ఇక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించాలని మొర పెట్టుకున్నారు. నర్సింగ్ సిబ్బంది లేకపోవడం దౌర్భాగ్యం ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఇక్కడి వైద్యులు చికిత్స బాగానే అందిస్తున్నారని, నర్సింగ్ సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈ దౌర్భాగ్యం నెలకొందని వ్యాఖ్యానించారు. సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో 36 పడకలున్నాయని, ఇద్దరు నర్సులు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారని, ఎంసీఐ నిబంధన మేరకు చాలినంత సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. స్మార్ట్ సిటీ కన్నా ముందు కేజీహెచ్‌ను స్మార్ట్ కేజీహెచ్‌గా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. కేజీహెచ్ బాగుంటే ప్రజలకు వైద్య సదుపాయం దక్కుతుందని, ఆస్పత్రి అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. గ్యాస్ లీక్ సంఘటనలో ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధనబాబు, ఆర్ఎంఓ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బీజేపీ నేత చెరువు రామకోటయ్య తదితరులున్నారు. -
విశాఖలో సిలిండర్ విస్ఫోటనం
పసిపాప దుర్మరణం, 18 మందికి గాయాలు సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. 23వ వార్డు రంగిరీజువీధిలోని కొప్పుల ఈశ్వరరావు ఇంట్లో కోట సత్యనారాయణ అద్దె ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాసన వస్తుండగా సత్యనారాయణ కోడలు గమనించి మామకు చెప్పింది. ఆయన సమీపంలోని పకోడి బండి వర్తకుడు కొల్లి సూరిబాబును పిలిచి సిలిండర్ పరిశీలించాల్సిందిగా చెప్పి బయటకు వెళ్లిపోయాడు. సూరి బాబు వచ్చి సిలిండర్‌కు ఉన్న పిన్ను సరిచేస్తుం డగా గ్యాస్ ఒక్కసారిగా లీకై పేలుడు సంభవిం చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఎదురుగా ఉన్న ఇంటి పైకప్పు రేకులు కూలి ఆ ఇంట్లో నిద్రిస్తున్న రెండు నెలల పసిబిడ్డపై పడడంతో ప్రాణాలు విడిచింది. పేలుడు జరిగిన ఇంట్లో ఒకే కుటుంబానికి చెం దిన కోట వరలక్ష్మి, బుజ్జి, పిల్లలు కోట పూజిత, కోట చందినీ(రెండున్నరేళ్లు), జయరాంతో పాటు గ్యాస్లీక్ను అరికట్టేందుకు వచ్చిన సూరి బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమా ని కొప్పుల ఈశ్వరరావుతో పాటు స్థానికులు 11మంది కూడా గాయాలపాలయ్యారు. వీరందిరినీ వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విష యం తెలియగానే మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కేజీహెచ్‌కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫోన్ ద్వారా మంత్రి గంటాతో మాట్లాడారు. తీవ్రంగా గాయపడ్డ వారిని కేజీహెచ్ నుంచి సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, పేలుడు ధాటికి పరిసర భవనాల గోడలు విరి గిపడ్డాయి. ఇళ్లపైకప్పు రేకులు నేల కూలాయి. -
విశాఖలో సిలిండర్ పేలుడు : ఇద్దరు మృతి
-
విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలోని రంగ్రీజు వీధిలో ఓ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నెలల పసికందు మరణిచింది. మరో18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేస్థానికులు వెంటనే అగ్నిమాపకశాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. మరో నలుగురికి తీవ్రంగా గాయలయ్యాయని... వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. సిలిండర్ పేలుడులో ఇల్లు కుప్పకూలింది. పోలీసులు స్థానికులతో కలసి సహాయక చర్యల చేపట్టారు. పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
10 గ్యాస్ సిలిండర్లు సీజ్
నర్సింహులపేట : అక్రమంగా నిల్వ చేసిన 10 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామంలో కొన్నాళ్లుగా అధిక ధరకు భారత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వ్యవహారంపై ఇటీవల కొందరు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్, డీఎస్ఓకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో సివిల్ సప్లై డీటీ అశోక్ కుమార్ గ్రామానికి చేరుకుని కొనకటి దామోదర్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా 10 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యూయి. ఇంట్లో నిల్వ చేసినందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసి, నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. నిందితుడు దామోదర్‌రెడ్డిపై 6ఏ కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్‌కు రూ.550 వసూలు చేయడంపై గ్రామానికి చెందిన వీరభద్రి అనే యువకుడు ఇటీవల భారత్ గ్యాస్ కంపెనీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అరుుతే విషయం తెలుసుకున్న కొనకటి దామోదర్‌రెడ్డి కుమారుడు వెంకట్‌రెడ్డి అతడిని గత నెల 27న పిలిచి దుర్భాషలాడాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. అంతేగాక కనీసం ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు కూడా ఇవ్వలేదని బాధితుడు తెలిపాడు. కాగా తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల సమాచారం ఇచ్చాడనే నెపంతో అదే రాత్రి సమీపంలోని మరో యువకుడి ఇంటికి వెళ్లి దామోదర్‌రెడ్డి కుమారుడు దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. ఇతడి విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.113 తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలెండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 113 తగ్గించింది. దీంతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 865 నుంచి రూ. 752కి తగ్గింది. అంతర్జాతీయ ధరల తగ్గింపుతో ఈ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీయేతర లేదా మార్కెట్ ధరల ఎల్పీజీ సిలెండర్ ధర తగ్గించడం ఇది ఐదోసారి. ఐదు పర్యాయాలు ధర తగ్గించడంతో వంటకు వినియోగించని గ్యాస్ సిలెండర్ ధర రూ.170.5 తగ్గి మూడేళ్ల కనిష్టస్థాయికి చేరుకుంది. జెట్ ఇంధనం(ఏటీఫ్) ధరను కిలోలీటర్ కు 4.1 శాతం(రూ.2,594.93) తగ్గించింది. దీంతో ఏటీఫ్ ధర కిలోలీటర్ కు రూ. 59, 943కు చేరింది. -
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్రగాయాలు
మహబూబ్‌నగర్: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రగాయాలపాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కుర్వపల్లిలో చోటుచేసుకుంది. కొత్త గ్యాస్ కొన్న నాశయ్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ వెలిగించేందుకు యత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిలిండర్‌ను సరిగ్గా పెట్టకపోవడం వల్లే గ్యాస్ లీకై ఈ ప్రమాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. గ్యాస్ వెలిగించగానే ఒక్కసారిగా మంటలు అలమకున్నాయి. ఇంట్లో రెండు క్వింటాళ్ల పత్తి ఉంది. మంటలు పత్తికి అంటుకోవడంతో త్వరగా వ్యాపించినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
గ్యాస్ సరఫరాకు మళ్లీ ఆధార్ లింకు
* నగదు బదిలీ ద్వారా సబ్సిడీ చెల్లింపు * జిల్లాలో 2,85,719 మంది వినియోగదారులకు కష్టాలే * ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారి సంఖ్య 7,44,797 * బ్యాంక్ ఖాతాలున్నది 5,98,282 మందికే ఏలూరు సిటీ : వంటింట్లో గ్యాస్ బాంబు పేల్చేందుకు సర్కారు మరోసారి సన్నద్ధమైంది. గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు శనివారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే ఈ విధానాన్ని అమలు చేయగా, నగదు బదిలీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారులు నానాతంటాలు పడ్డారు. అనేకమంది సబ్సిడీ మొత్తం అందక నష్టపోయూరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి సర్కారు దీనిని రద్దు చేయగా, తిరిగి అదే విధానాన్ని శనివారం నుంచి అమలు చేయనుండటంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.951 కాగా, సబ్సిడీ పోగా రూ.444కే వినియోగదారులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు వినియోగదారులు నేరుగా రూ.444 చెల్లిస్తే సరిపోతుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇకపై సిలిండర్‌కు రూ.951 చెల్లించి గ్యాస్ పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్సిడీ సొమ్మును వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అంటే వినియోగదారుడు ప్రతిసారి సిలిండర్ కోసం సుమారు రూ.500 అదనంగా పెట్టుబడి పెట్టాల్సింది. ఆధార్ అనుసంధానం చేయించుకోని వారు, ఆధార్ కార్డు లేనివారు సబ్సిడీ మొత్తాన్ని కోల్పోతారు. ఆధార్ సీడింగ్‌కు ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నా.. అధార్ నమోదు చేరుుంచుకున్న వారు సైతం గతంలో సబ్సిడీ సొమ్ము అందక, కొందరికి పూర్తి సొమ్ము దక్కక అవస్థలు పడ్డారు. మరి వీరికో... నగదు బదిలీ పథకం వినియోగదారులకు పూర్తి స్థారుులో న్యాయం చేసేలా కనిపించటం లేదు. ప్రస్తుతానికి ఆధార్ సీడింగ్ చేరుుంచుకుని, బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన వినియోగదారులకు మాత్ర మే నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేస్తారు. ఫిబ్రవరి అనంతరం ప్రతి ఒక్కరూ ఈ పథకం కిందకు వెళ్లాల్సిందే. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు 8,84,001 మంది ఉండగా, వీరిలో 7,44,797మంది ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. మిగిలిన 1,39,204 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. ఆధార్ సీడింగ్ చేయించుకున్న వారిలోనూ బ్యాంక్ ఖాతాలు ఉన్న వారి సంఖ్య 5,98,282 మాత్రమే. ఆధార్ సీడింగ్ చేయించుకున్నా బ్యాంకు ఖాతా లేనివారు సుమారు 1,46,515 మంది ఉన్నారు. ఈ విషయూన్ని పక్కన ఉంచితే మొత్తానికి 2 లక్షల 85వేల 719మంది నగదు బదిలీ పథకంలోకి రావటం లేదు. వీరంతా అత్యవసరంగా ఆధార్ సీడింగ్ చేయించుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. ఇక దీపం పథకంలో బాగంగా జిల్లాలో 93,902 మందికి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ.. ఇందులో 89,624 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేయగా, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చింది 49,587మందికి మాత్రమే. మిగిలిన 44,315 మందికి ఈ పథకాన్ని అమలు చేయలేదు. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి!
ఇస్లామాబాద్: డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌పైకి దూసుకుపోయింది. దాంతో బస్సులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి బస్సులోని 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్లోని దక్షిణ సూక్కుర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. -
డేట్ దాటితే డేంజరే!
* వంట గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ డేట్ * వినియోగదారులూ జాగ్రత్త మండపేట రూరల్ : ఎక్స్పైరీ డేట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మెడిసిన్, ఇంజక్షన్లు, కూల్ డ్రింక్స్, తినుబండారాలు, ఎక్స్ట్రాఎక్స్ట్రా... అయితే మనం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్‌కూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే సంగతి మీకు తెలుసా..? చాలా మందికి తెలియదు కదూ... అయితే ఈ కథనం చదవండి... చాలా వరకు మనం ఇంటికి వచ్చిన సిలిండర్‌ను పూర్తిగా గమనించం... గమనిస్తే సిలిండర్ రింగ్ కింది భాగంలో వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్పైరీ డేటు) కూడా ముద్రిస్తారు. ఆ తేదీలను ఏ,బీ,సీ,డీలుగా విభజిస్తారు. అంటే జనవరి - మార్చి(ఏ), ఏప్రిల్- జూన్(బి), జూలై- సెప్టెంబర్(సీ), అక్టోబర్- డిసెంబర్(డి)గా ముద్రిస్తారు. ఉదాహరణకు సిలిండర్ కాలపరిమితి 2014 మే నెలతో ముగుస్తుందనగా, దానిపై బీ-14 అని ముద్రిస్తారు. ప్రమాదం సుమా! కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వాడడ ం వల్ల అవి పేలి ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇలా కాలపరిమితి ముగిసిన సిలిండర్లను కంపెనీలు ముందుగానే గుర్తించి వాటిని పక్కన పెడతాయి. అలా కాకుండా పొరపాటున కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వస్తే వాటిని గుర్తించి డెలివరీ బాయ్‌కు సమాచారమివ్వాలి. వారొచ్చి కొత్త సిలిండర్‌ను అందజేస్తారు. గ్యాస్ వినియోగంలో కొన్ని మెళకువలు... గ్యాస్ వినియోగంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. సిలిండర్‌కు స్టౌకి తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకే సిలిండర్‌కు రెండు స్టౌలు ఉంచకూడదు. సిలిండర్‌ను కబ్ బోర్డులో పెట్టినట్టయితే తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. వంటగది కిటికీలు తెరిచే ఉంచుకోవాలి. వంట చేసేటప్పడు మినహా మిగిలిన సమయంలో రెగ్యులేటర్ ఆఫ్‌లో చేయాలి. రెగ్యులేటర్ నుంచి స్టౌవ్‌కి గ్యాస్ సరఫరా చేసే ట్యూబ్‌కు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే పెనుప్రమాదాలు జరగకుండా చేయవచ్చు. -
గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా ...
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పట్టణాలు, పల్లెల నుంచి సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే రాయితీ సిలిండర్లను వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితరాల్లో గృహావసారాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు మామూలుగా తీసుకుంటున్నారు. 688 సిలిండర్లు.. 374 కేసులు.. జిల్లాలో అధికారులు 2010 నుంచి ఐదేళ్లుగా పలుమార్లు దాడులు నిర్వహించి 688 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నా రు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 374 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మల్‌లలో దాడులు నిర్వహించి 45 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 21 కేసులు నమోదు చేశారు. వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ‘ఆధార్’తో ఆగని దందా జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి ఏడాదికి పన్నెండు రాయితీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. గతేడాది ఇదే మాసంలో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. దీంతో కొన్ని అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఆ సమయంలో అర్హులై ఉన్న గ్యాస్ తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిం డర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చునని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం గ్యాస్‌కు ఆధార్ లింకును తీసేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. దీన్ని ఆసరగా చేసుకుంటున్న అక్రమార్కులు అక్ర మ గ్యాస్ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం వల్ల సుమారు 75 వేలకుపైగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం కనెక్షన్ కింద మంజూరు చేయబడిన వారు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరోకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు బోగస్ కింద గుర్తించి తొలగించారు. -
కిసాన్‌నగర్‌లో పెలిన రెండు సిలిండర్లు
-
గేట్స్ కాలేజీలో పేలిన గ్యాస్ సిలిండర్
గుత్తి : పట్టణ శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న క్యాంటీన్లో సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ వం ట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో క్యాంటీన్ నిర్వాహకుడు, పామిడి చెందిన వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులైన విద్యార్థులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో క్యాంటీన్ వంట గదిలో వెంకట రెడ్డి, విద్యార్థుల కోసం ఆమ్లేట్ వేస్తుండ గా హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. రెగ్యులేటర్‌లో లోపం కారణంగా గ్యాస్ లీకై భారీ శబ్ధంతో విస్పోటం సంభవించింది. సిలిండర్ ముక్కలైంది. ఈ ఘటనతో కాలేజీలోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేమి జరిగిందో కొంతసేపు ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రమాద సమయంలో క్యాంటీన్లోని వంట గది వద్ద ఉన్న సుమారు 60 మంది విద్యార్థులు అదృష్టవశాత్తు తప్పిం చుకున్నారు. దీంతో కాలేజీ నిర్వాహకు లు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకుడు వెంకటరెడ్డి మాత్రం గాయపడ్డాడు. భారీ విస్పోటంతో క్యాంటీన్ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. క్యాంటీన్లోని ఫ్యాన్లు, ఫ్రిజ్, 16 బస్తాల బియ్యం, ఇంటి డాక్యుమెంట్లు, వాటర్, కూల్ డ్రి ం క్ బాటిళ్లతో పాటు రూ.20 వేల నగదు మంటల్లో మాడిపోయాయి. పేలుడు ధాటికి వంట గది పక్కన ఓ గది కూడా దెబ్బతినింది. సుమారు రూ.2 లక్షల విలువైన వస్తు, సామాగ్రి నాశనమైందని బాధితుడి భార్య వాపోయింది. కరస్పాండె ంట్ వీకే సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
గ్యాస్ సింలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం
-
బొండాడలో భారీ అగ్ని ప్రమాదం
బొండాడ(కాళ్ల) : బొండాడలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించిర ది. క్షణాల్లోనే 14 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. గ్రామంలోని చెరువుగట్టు సమీపంలో సగర్ల కులస్తులు(ఉప్పర్లు) గుడిసెలు వేసుకుని చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటి స్థలాలు లేకపోవడంతో దగ్గర దగ్గరగా ఇళ్లు గుడిసెలు వేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. వీరంతా కూలీలే. భార్యాభర్తలు ఇద్దరూ కూలికి వెళుతుంటారు. ఆదివారం ఉదయం యథావిధిగా వారంతా కూలి పనికి వెళ్లారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పైపునుంచి గ్యాస్ లీకై అది అంటుకుంది. ఆ మంట ఇంటికి అంటుకుంది. అదే సమయంలో బలమైన గాలులు వీయటంతో ఒకదాని తరువాత ఒకటి క్షణాల్లో 14 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. కొన్ని ఇళ్ళలో ఉన్న వారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం బయటకు పరుగులు తీశారు. మంటలు ఒక్కసారిగా పెద్దవైపోవటంతో సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేక పోయారు. మొత్తం ఇళ్లనీ కాలిపోయాయి. సామగ్రి, బీరువాల్లోని బంగారం, నగదు కాలి బూడిదయ్యాయి. వారు దాచుకున బియ్యం, వడ్లు కూడా దక్కలేదు. ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లో ఉంచుకున్న స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు కూడా కాలి బూడిదవ్వడంతో పిల్లలూ విలపించారు. వారు పెంచుకుంటున్న కోళ్లు మాంసం ముద్దలయ్యాయి. ప్రమాదం విషయం తెలియగానే కూలికి వెళ్లిన వారు వచ్చి త మ ఇళ్లను చూసి బోరుమని విలపించారు. బీరువాలో దాచుకున్న బంగారం, నగదు కోసం వెతికితే వారికి బూడిదే కనిపించింది. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి బంగారం, నగదు కాలిపోవడంతో వారి దుఃఖానికి అంతులేకుండా పోయింది. భీమవరం అగ్ని మాపక దళ కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. కాళ్ల ఎస్సై బి.శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గండికోట నారాయుడు, గండికోట పాశారావు, గండికోట పర్లమ్మ, నక్కా పర్లమ్మ, గండికోట చినమంగ, నక్కా పాపయ్య, నిడమోలు వెంకన్న, నిడమోలు సత్యనారాయణ, గండికోట సోములమ్మ, గండికోట వెంకటేశ్వర్లు, గండికోట తాతయ్య, నక్కా భూలక్ష్మి, నిడమోలు శ్రీను, బోధనపు వెంకటేశ్వర్లు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వైసీపీ నాయకుడు, ఎఎంసీ మాజీ చైర్మన్ మన్నే నాగరాజు బాధితులను పరామర్శించారు. సర్పంచ్ మన్నే వరలక్ష్మి బాధితులకు హైస్కూల్లో పునరావాసం కల్పించి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్ఐ ప్రసాదు, వీఆర్వో ఎన్.సీతారాం వచ్చి నష్టాన్ని అంచనా వేశారు. సుమారు రూ.15 లక్షల వరకూ ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎంపీపీ ఆరేడు తాతపండు, టీడీపీ నాయకుడు బండారు వేణుగోపాలరావు ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి 10 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సాయం బాధితులకు ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే శివ ‘శివ స్వచ్ఛంద సంస్థ’ తరఫున ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం రూ.1000 నగదును ఎంపీపీ ఆరేటి తాతపండు ద్వారా పంపించారు. ఎంపీ గోకరాజు గంగరాజు ఒక్కో కుటుంబానికి రూ.1000 నగదు, 25 కేజీల బియ్యాన్ని చొప్పున తన సోదరుడు గోకరాజు రామరాజు ద్వారా బాధితులకు పంపించారు. -
గ్యాస్ సిలిండర్లపై ‘నగరం’ దెబ్బ
దేవరపల్లి:వంటగ్యాస్ సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడి గ్యాస్ రిఫైనరీ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. సిలిండర్లలోకి గ్యాస్‌ను నింపే కేంద్రాలకు సరఫరా లేకపోవడంతో జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గ్యాస్ ఏజెన్సీలకు తూర్పుగోదావరి జిల్లా గుమ్మందొడ్డి వద్ద గల రిఫైనరీ నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలో సుమారు 50 గ్యాస్ ఏజెన్సీలు నిత్యం దాదాపు 30 వేల సిలిండర్లను ఇస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో 21 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, రోజుకు సుమారు 12 వేల సిలిండర్లు అవసరం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఏజెన్సీలకు రోజుకు 600 సిలిండర్లు, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 900 సిలిండర్లు చొప్పున అవసరం ఉంటుంది. పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా నిలుపుదల చేయటంతో బుల్లెట్ (పెద్ద ట్యాం కర్ల) ద్వారా రిఫైనరీకి తీసుకువచ్చి ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా రోజుకు 9వేల సిలిం డర్లు మాత్రమే రావడంతో జిల్లా అవసరాలకు సరి పోవటం లేదు. రోజుకు 600 సిలిండర్లు అవసరమైన ఏజెన్సీలకు 300, పట్టణ ప్రాంతంలోని ఏజెన్సీలకు 600 సిలిండర్ల చొప్పున మాత్రమే వస్తున్నాయి. దీంతో కొరత ఏర్పడి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లను ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి తెచ్చుకునేందుకు సొంత లారీలను వినియోగిస్తున్న ఏజెన్సీలలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కంపెనీ లారీల ద్వారా తెచ్చుకునే ఏజెన్సీలకు సిలిండర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెల కొంది. గ్యాస్ పైపులైన్ తనిఖీ పూర్తరుుతే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. -
గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?
ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? అయితే.. మళ్లీ కట్టెలు కొనుక్కుని దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ దృష్టికి చమురు మంత్రిత్వశాఖ తీసుకెళ్లనుంది. కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరలను నిపుణుల కమిటీ సూచించిన మేరకు పెంచాలని ఈ శాఖ భావిస్తోంది. గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు కిరోసిన్‌ను లీటరుకు రూ. 4-5 చొప్పున, గ్యాస్ సిలిండర్లను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్నే కేబినెట్ కమిటీకి నివేదిస్తోంది. ఇక నెలకు డీజిల్ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కొనసాగించాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు.. ఇక సిలిండర్ల మీద భారీ వడ్డన తప్పకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగానే పరిణమిస్తుంది. -
‘ధర’ణి మండుతోంది
సాక్షి, ఏలూరు:కూరగాయలు, సన్న బియ్యం, పాలు, సిమెంట్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పెం చిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. గ్యాస్ సిలిం డర్, కిరోసిన్ ధరలను ప్రతినెలా పెంచుతామని కేంద్రం ప్రకటిం చింది. ఇలా అన్ని రకాలుగా ప్రజల నెత్తిన మోయలేని ఆర్థిక భారం పడుతుంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కూర ‘గాయాలే’ ఎండల కారణంగా కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30, వంకాయ రూ.60, బీరకాయ రూ.50, బెండ రూ.40, దొండ రూ.24, క్యారట్ రూ.60, బీట్రూట్ రూ.40, బీన్స్ రూ.120, క్యాప్సికం రూ.60 పలుకుతున్నాయి. ఇవే కూరగాయలు నెల రోజుల క్రితం ఇప్పుడున్న ధరల్లో సగం ధరకే వచ్చేవి. సన్న బియ్యం.. ధర ఘనం సన్నబియ్యం (సోనా, బీపీటీ, పీఎల్) ధరలు సామాన్యుడు కొనేలా లేవు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.30 నుంచి రూ.35కే దొరికే సోనా రకం బియ్యం ధర రకాన్ని బట్టి రూ.40-రూ.50 మధ్య పలుకుతోంది. బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు వారివైపు కన్నెత్తి చూడటం లేదు. సాధారణ రకం బియ్యం ధరలు కూడా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకూ పెరిగాయి. సిమెంటు, ఇసుక ధరలకు రెక్కలు గుట్టలుగా నిల్వ చేసిన ఇసుకను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఐదు యూనిట్ల లారీ ఇసుక రూ.20వేలు పలుకుతోంది. ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు ఉన్నప్పుడు యూనిట్ ధర కేవలం రూ.1,500 నుంచి రూ.2,000 ఉండేది. గతంలో బస్తా సిమెంటు రూ.200 ఉంటే ప్రస్తుతం రూ.300కు చేరింది. భవన నిర్మాణాలకు అనువైన కాలం కావడంతో డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగానే సరుకు కొని నిల్వచేసి ఇప్పుడు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. పాల ధరలూ పెరిగాయ్ వర్షాలు కురవకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కొరత కారణంగా పాల ధరలు పెరిగాయి. మొన్నటి వరకూ లీటరు పాలు రూ.42 ఉంటే ప్రస్తుతం రూ.46కు పెరిగింది. దీంతో పెరుగు, వెన్న ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరాభారాన్ని భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు పాలు, వాటి ఉప ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. సిలిం‘ఢర్’ గ్యాస్ సిలిండర్, కిరోసిన్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఇకపై ప్రతినెలా సిలిండర్‌పై రూ.5, కిరోసిన్‌పై రూ.1 చొప్పున పెంచుతామని ప్రకటించింది. విద్యుత్ కోతలతో రాత్రివేళ చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్న పేద ప్రజలకు కిరోసిన్ దీపమే ఆధారం. ఇకపై వారికి ఈ కాస్త వెలుగు దూరం కానుంది. గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్ మార్కెట్ బాటపట్టి అందనంత దూరంలో ఉంటున్నాయి. వీటి ధరల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. మూడు నెలల వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయబోమని బుధవారం స్పష్టం చేసింది. ఆ తరువాత అరుునా ధరల మోత తప్పేట్టు లేదు. -
సిలిం‘డర్’..
సాక్షి, ఒంగోలు: సామాన్య, మధ్యతరగతి కుటుంబీకుడు ఈనెల నుంచి ఇంటి బడ్జెట్లో రూ.5 అదనంగా లెక్కవేసుకోవాలి. గ్యాస్‌సిలిండర్ బిల్లు పెంచేందుకు కేంద్రం నడుంకట్టింది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట చమురు మంత్రిత్వశాఖ గ్యాస్ సిలిండర్‌పై రూ.5 పెంచాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్‌సిలిండర్ ధరపెంపుపై ప్రకటన జారీ చేయనుంది. దీంతోపాటు దిగువ స్థాయి పేదలు వినియోగించే కిరోసిన్ ధరను పెంచనున్నట్లు కేంద్రం సూచన ప్రాయంగా మంగళవారం మీడియాకు సమాచారమిచ్చింది. కిరోసిన్ లీటర్‌కు రూ.1 పెరగనున్నట్లు తెలిసింది. ప్రధానిగా నరేంద్రమోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల రైల్వేచార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. తాజాగా గ్యాస్‌ధర పెంచనున్నట్లు చెప్పడం జిల్లావాసుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. అసలే, నింగినంటుతోన్న నిత్యావసరాల ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు నడుపుకునేందుకు నానాకష్టాలు పడుతున్నాయి. అన్ని ఖర్చులు కలుపుకుని నెలవారీ బడ్జెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. రూ.30 లక్షలకు పైగా భారం.. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీలుండగా, వీటి పరిధిలో మొత్తం 6,69,571 మంది గ్యాస్ కనెక్షన్లు పొందిన వినియోగదారులున్నారు. వీరిలో సింగిల్ సిలిండర్ వినియోగదారులు 2,87,696 మంది ఉండగా, డబుల్ సిలిండర్లు ఉన్న వారు 2,41,671 మంది ఉన్నారు. వీరుకాకుండా దీపం పథకం కింద 1,30,322 మంది లబ్ధిదారులు నెలనెలా సిలిండర్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీతో కలుపుకుని ఒక్కో సిలిండర్ ధర రూ.445.50 కు వినియోగదారునికి పంపిణీ చేస్తున్నారు. అయితే, తాజాగా కేంద్రం పెంచనున్న రూ.5 అదనపు ధరతో రూ. 450.50 చెల్లించాల్సి వస్తుంది. ఈమేరకు సుమారు జిల్లాలోని గ్యాస్ కనెక్షన్‌దారులు నెలకు రూ.30 లక్షలకు పైగానే అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. మురికివాడల్లోని పూరిపాకల్లో బతికే పేదలు విద్యుత్ కనెక్షన్లకు నోచుకోక.. కిరోసిన్ బుడ్డిదీపాలనే ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా గ్యాస్‌పొయ్యి కనెక్షన్‌కు నోచుకోని పేదలు కూడా కిరోసిన్ వాడుతుంటారు. అలాంటి పేదలు పెరిగిన కిరోసిన్ భారంతో ఇబ్బందులు పడక తప్పదు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ.50 పెంచగా..దాన్ని రాష్ట్రప్రభుత్వమే భరించి పేదలపై భారం పడకుండా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం వడ్డించే వడ్డింపులకు తానాతందానా.. అనడం మినహా పేదల పక్షాన నిలవకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.