బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు | Six injured, Cylinder blasted due to leakage at Gold shop | Sakshi
Sakshi News home page

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

Published Sun, Aug 16 2015 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

ప్రకాశం(గిద్దలూరు): గిద్దలూరు మండలం షరఫ్ బజార్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ షాపులో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఓ పాపతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులకు సరైన వైద్యం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు డాక్టర్లను తెప్పించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement