Gold shop
-
భలే చోరీ చేసినవ్ అవ్వ..
-
బంగారం షాపులో దోపిడీ..సీసీటీవీ విజువల్స్
-
హైదరాబాద్ : జువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి శ్రీముఖి (ఫోటోలు)
-
అన్న దుకాణంలో చోరీ.. తమ్ముడి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె సావుకారుపేట పెరియనాయకన్ పేటవీధికి చెందిన యోగేష్ జైన్ నగల దుకాణం నడుపుతున్నారు. ఇతని దుకాణంలో ఈ నెల 3వ తేదీ రూ.15 లక్షల విలువైన బంగారు కడ్డీ చోరీకి గురైంది. దీనిపై ఎలిఫెంట్ గేట్ పోలీసులకు యోగేష్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. యోగేష్ జైన్ తమ్ముడు వినోద్ జైన్ నగలు అపహరించి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ప్రత్యేక బృందం పోలీసులు వినోద్‌ను అరెస్టు చేసి, అతని నుంచి కేజీ బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. -
విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం: హనీ రోజ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని జైహింద్ కాంప్లెక్స్ నందు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రైడల్ విభాగాన్ని ఆదివారం సినీ నటి హనీ రోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చూపించే అభిమానం మరువలేదనిదని చెప్పారు. షోరూంలో బ్రైడల్ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. డైమండ్ సెట్ ధరించి చూశానని, చాలా బాగా ఉందన్నారు. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం లోనే తాను డైమండ్స్ కొనుగోలు చేస్తానన్నారు. నగరంలోని మహిళలు షోరూం కు వచ్చి కలెక్షన్స్ వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. షోరూం అధినేత రాజేష్ మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వివాహాది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలసి వచ్చే ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షోరూం అధినేతలు వి. సుధాకర్, వి. జగదీశ్, బ్రహ్మేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో రూ. కోటి వజ్రాభరణాల చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): రెండు రోజుల క్రితం ఫిలింనగర్ ఫేజ్–2లోని శమంతక డైమండ్స్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డైమండ్స్ నాణ్యతను పరిశీలించే భూతద్దం ఆధారంగా దొంగను పట్టుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే... మాజీ మంత్రి చెంచు రామయ్య మన వడు పవన్‌కుమార్ ఫిలింనగర్లో శమంతక డైమండ్స్ షోరూం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20న సింగాడికుంటకు చెందిన మైలారం పవన్ కుమార్, చింతల్‌బస్తీకి చెందిన మచ్చ అలియాస్ అంజి నెంబరు ప్లేట్ లేని బైక్‌పై వచ్చి షోరూం కిటికీ అద్దాలు తొలగించి రూ. కోటి విలువైన ఆభరణాలతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా వారి ఓ దొంగ ఆ సమయంలో సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులో బంజారాహిల్స్ క్రైం పోలీసుల ఎదుటే ఉన్నాడు. చదవండి: (Hyderabad: రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ) దొరికింది ఇలా.. ఈ నెల 19న పవన్‌కుమార్ సింగాడికుంటలోనే పక్కింట్లో రెండు సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదు తస్కరించి పరారయ్యాడు. ఆ మర్నాడు రాత్రి స్నేహితుడు అంజితో కలిసి ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డాడు. సెల్ఫోన్లు తస్కరించిన అనంతరం బాధితుడు ప్రవీణ్ అక్కడి సీసీ ఫుటేజీ పరిశీలించగా పక్కింట్లో ఉంటున్న పవన్ వాటిని దొంగిలించినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని పవన్‌కు ఫోన్ చేసి అడగ్గా ఆ రెండు సెల్ఫోన్లు పంపించాడు. అయితే దొంగిలించిన నగదు ఇవ్వాలంటూ బాధితుడు కోరగా సమాధానం చెప్పలేదు. ఈ నెల 22న ఉదయం జహీరానగర్ చౌరస్తాలో ఉన్న పవన్‌ను ప్రవీణ్ అతడి స్నేహితు పట్టుకున్నారు. డబ్బుల కోసం నిలదీయగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాధితుడు 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పవన్‌ను నెంబరు ప్లేట్ లేని స్కూటర్‌తో సహా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లపై నిందితుడిని ప్రశ్నిస్తుండగా జేబుల్లో ఉన్న ఇతర సామగ్రిని తీసి క్రైం ఎస్ఐ టేబుల్‌పై ఉంచాడు. అందులో డైమండ్స్‌ను పరీక్షించే భూతద్దం కూడా ఉంది. దొంగతనం జరిగిన ఇంటికి పెయింటింగ్ వేసిన వారితో పాటు మరికొందరిని విచారించే క్రమంలో ఆభరణాల వ్యాపారి పవన్‌కుమార్‌ను పోలీసులు పిలిపించారు. ఎస్ఐ ఎదురుగా ఉన్న భూతద్దాన్ని చూసిన నగల వ్యాపారి పవన్‌కుమార్ ఇది తమ షోరూంలోదేనని ఇక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీంతో నిందితుడు పవన్‌ను పోలీసులు లోతుగా విచారించగా సదరు భూతద్దాన్ని నగల షోరూం నుంచి తెచ్చిందేనని తనతో పాటు అంజి చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. దొంగను ఎదురుగానే పెట్టుకుని సీసీ ఫుటేజీల పేరుతో ఐదు ప్రత్యేక బృందాలు నగరమంతా గాలిస్తున్న విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. చోరీకి వినియోగించిన బైక్‌ను పరిశీలించగా అందులో కొన్ని ఆభరణాలు, డైమండ్లు లభ్యమయ్యాయి. మిగతా వాటి కోసం గాలిస్తుండగా మరో దొంగ పరారీలో ఉన్నాడని, డైమండ్స్ ఉన్న లాకర్‌ను శ్మశానంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ శ్మశానం ఎక్కడ ఉందో తేలాలంటే మరో దొంగ అంజి దొరకాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత నేరస్తుడే.. చోరీ కేసులో నిందితుడు మైలారం పవన్‌కుమార్ సెపె్టంబర్ 15న పోక్సో యాక్ట్ కింద బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందే పవన్‌పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున ఆరు స్నాచింగ్ కేసులు నమోదై ఉన్నాయి. పేదోడి ఇంట సీసీ కెమెరా.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని సింగాడికుంటలో ఈ నెల 19న ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆయన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొంగను పట్టించింది. స్థానికంగా పవన్ అనే పాత నేరస్తుడు ఈ సెల్‌ఫోన్ తస్కరించగా సీసీ ఫుటేజీలో స్పష్టంగా నమోదైంది. ఈ సీసీ ఫుటేజీ ఆధారంగానే రూ. కోటి విలువైన ఆభరణాల దొంగను పట్టించాయి. తీరా చూస్తే ఆభరణాలు దొంగిలించిన షోరూం యజమా ని సీసీ కెమెరాలే పెట్టుకోలేదు. చుట్టుపక్కల ప్రాంతా లు, రహదారులపై కెమెరాలు లేకపోవడంతో పోలీసులు మళ్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు ఓ సాధారణ పౌరుడు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఓ పేరు మోసిన దొంగల ముఠాను పట్టించినట్లయింది. -
ఈ–చలానే పట్టించింది!
సాక్షి, సిటీబ్యూరో: ‘సాధారణంగా నేరం జరిగిన సమయం నుంచే పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తుంటారు. కానీ, ఎల్బీనగర్ సీసీఎస్ క్రైమ్ ఇన్స్పెక్టర్ టీ రవి కుమార్ అలా చేయలేదు. చోరీ తర్వాత నంబర్ ప్లేట్ లేని బైక్‌పై పారిపోతుండగా కెమెరాల్లో రికార్డయిన నిందితుడు వేసుకున్న వైట్ కలర్ షర్ట్ ఆధారంతో కేసుకు మూలమైన సికింద్రాబాద్ పీఓటీ మార్కెట్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఓ బైక్ రైడర్ అదే వైట్ షర్ట్‌తో చోరీ కంటే కొన్ని గంటల ముందు మార్కెట్లో రెక్కీ చేసినట్లు గుర్తించారు. అయితే ఆ ఫుటేజీలో బైక్ నంబరు అస్పష్టంగా ఉండటంతో.. ఇన్స్పెక్టర్ మిగిలిన నంబర్లను కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి ఓ బైక్‌పై మెదక్‌లోని రామాయంపేటలో ఈ–చలాన్ జనరేట్ అయినట్లు గుర్తించారు. చలాన్‌లోని ఫొటోలను గమనించగా.. అందులో బైక్ రైడర్, చోరీలో పాల్గొన్న నిందితుడు ధరించిన వైట్ షర్ట్ ఒక్కటేనని తేలిపోయింది. ఇక ఇక్కడి నుంచి దర్యాప్తును ప్రారంభించిన రాచకొండ పోలీసులు చైతన్యపురి ఠాణా పరిధిలోని మహాదేవ్ జ్యువెల్లరీలో దోపిడీ, కాల్పుల కేసు పోలీసులు చేధించారు.’ వివరాలు వెల్లడిండిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. - రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన మహేందర్ చౌదరి గజ్వేల్‌లో జయలక్ష్మి పేరిట జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయన ఫిర్యాదుదారుడు రాజ్‌కుమార్ సురానా తమ్ముడి బంగారం షాపులో పనిచేశాడు. ప్రతి గురువారం పీఓటీ మార్కెట్ నుంచి నగరంలోని వేర్వేరు జ్యువెల్లరీ షాపులకు ఆభరణాలు డెలివరీ అవుతాయన్న విషయం మహేందర్‌కు తెలుసు. తన షాపు పెద్దగా నడవకపోవటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భార్య గుడియా, బావ సిద్దిపేటలోని గౌరారంలో బంగారం షాపు ఉద్యోగి సుమేర్ చౌదరిలతో కలిసి పథకం వేశారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చి రామాయంపేటలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న భన్సీ రామ్ అలియాస్ మనీష్ దేవాసి, గజ్వేల్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్, కొండపాకకు చెందిన మనీష్ వైష్ణవ్, పాలకుర్తికి చెందిన రితేష్ వైష్ణవ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రితేష్ తనకు పాత పరిచయస్తులైన హర్యానా, ఢిల్లీలకు చెందిన ప్రొఫెషనల్ నిందితులు సుమిత్ డాగర్, మనీష్, మానియాలను రంగంలోకి దింపారు. వీరికి తుపాకులు, డాగర్లను సమకూర్చాడు. - ఈనెల 1న భన్సీ రామ్, మానియా, సుమిత్, మనీష్ రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. గణపతి జ్యువెల్లర్స్ యజమాని రాజ్ కుమార్ సురానా, షాపులో ఉద్యోగి సుఖ్దేవ్ల కదలికలను గమనిస్తూ వారిని వెంబడించారు. రాత్రి 8 గంటల సమయంలో ఇరువురూ స్నేహపురి కాలనీలోని మహాదేవ్ జ్యువెల్లర్స్‌కు చేరుకున్నారు. సుమిత్, మనీష్ షాపులోకి చొరబడగా మానియా బయటి నుంచి షాపు షట్టర్‌ను మూసేశాడు. పక్కన సందులో భన్సీ రామ్ హోండా బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు. షాపులో ఉన్న ఇద్దరు దుండగులు కల్యాణ్ చౌదరి, సుఖ్‌దేవ్‌లపై కాల్పులు జరిపి.. బంగారం బ్యాగుతో ఉడాయించి, బైక్‌లపై ఉప్పల్‌కు చేరుకున్నారు. హబ్సిగూడలో పల్సర్ బైక్‌ను వదిలేశారు. సుమిత్నూ ఇక్కడే వదిలేసి భన్సీరామ్ రామాయంపేటకు వెళ్లిపోయాడు. - అప్పటికే గజ్వేల్ నుంచి కారులో ఉప్పల్‌కు వచి్చన ప్రధాన నిందితుడు మహేందర్, ఫిరోజ్ సుమిత్‌ను ఎక్కించుకుని పాలకుర్తిలోని రితేష్ వైష్ణవ్ ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి హబ్సిగూడ వద్ద మనిష్, మానియాలు వదిలేసిన పల్సర్ బైక్‌ను సుమేర్ చౌదరి తీసుకొని, గుడియా జాత్తో కలిసి కొండపాకలోని మనీష్ వైష్ణవ్ ఇంటికి వెళ్లి బైక్, మారణాయుధాలను భద్రపరిచి, గౌరారంకు పరారయ్యారు. అనంతరం సుమేర్ కారు అద్దెకు తీసుకొని పాలకుర్తిలో ఉన్న మహేందర్, సుమిత్, మనీష్, మానియాలను తీసుకొని గజ్వేల్‌కు వెళ్లిపోయారు. రూ.4 లక్షల నగదు ఇచ్చి సుమిత్ నుంచి బంగారం బ్యాగు, తుపాకులను స్వా«దీనం చేసుకున్న మహేందర్ వీటిని గుడియా, సుమేర్లకు అందించగా.. వారు సొత్తుతో కొండపాకకు పారిపోయారు. - మహిళ కారులో ఉంటే పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకోవచ్చని పథకం వేసిన ప్రధాన నిందితుడు మహేందర్, తన భార్య గుడియా, సుమిత్, మనీ‹Ù, మానియాలతో కలిసి రాష్ట్రం దాటేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు గాలిస్తుండటంతో నిర్మల్‌లో గుడియాను వదిలేసి.. మహారాష్ట్రకు బయలుదేరారు. ఆమె తిరిగి బస్‌లో గజ్వేల్‌కు చేరుకుంది. అప్పటికే ఆధారాలను సమీకరించిన పోలీసులు.. గజ్వేల్‌లో గుడియా, సమీర్, ఫిరోజ్‌లను అరెస్టు చేశారు. రామాయంపేటలో భన్సీ రామ్, కొండపాకలో మనీష్ వైష్ణవ్, పాలకుర్తిలో రితేష్ వైష్ణవ్‌లను పట్టుకున్నారు. - నిందితుల నుంచి 2,701.8 గ్రాముల బంగారం, మూడు తుపాకులు, 7.65 ఎంఎం 25 లైవ్ బుల్లెట్లు, ఎయిర్ పిస్తోల్, డాగర్, నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, 6 సెల్ఫోన్లు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి మహేందర్, సుమిత్, మనీ‹Ù, మానియా పరారీలో ఉన్నారు. -
హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్‌లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే, కల్యాణ్ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
వరలక్ష్మీ వ్రతం.. బంగారం కొనుగోలుకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
పక్కా స్కెచ్‌తో పనిచేస్తున్న సంస్థకే కన్నం.. రెండు గంటల్లోనే..
సాక్షి, భవానీపురం(విజయవాడ పశ్చిమ): అన్నం పెట్టే సంస్థకే కన్నం వేసిన వ్యక్తి ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు. విజయవాడ కృష్ణలంక రాణీగారితోటకు చెందిన శిరికొండ జయచంద్రశేఖర్ (25) తాను పనిచేస్తున్న సంస్థలోనే దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగినట్లు వచ్చిన సమాచారం తర్వాత కేవలం 2 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరానికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా శనివారం సాయంత్రం తన కార్యాలయంలో వెల్లడించారు. నమ్మకంగా పనిచేస్తూ.. విజయవాడ బందరు రోడ్‌లోని అట్టికా గోల్డ్ షాపులో జయచంద్రశేఖర్ కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు రెండు నెలల క్రితం ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో 45 రోజుల క్రితం సంస్థ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సిబ్బంది భోజనం చేసే సమయంలో లాకర్ తాళాలు దానికేపెట్టి ఉండటంతో.. జయచంద్రశేఖర్ లాకర్ తాళంతోపాటు మెయిన్ డోర్ షట్టర్ తాళం, బిల్డింగ్‌కు కింద వేసే తాళం తీసుకుని పీవీపీ మాల్ సమీపంలో మారు తాళాలు తయారుచేసే షాపునకు వచ్చి.. నకిలీ తాళాలు తయారు చేయించి, పావు గంట వ్యవధిలో తిరిగి అసలు తాళాలను వాటి స్థానంలో పెట్టేశాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వివిధ బ్రాంచిల నుంచి తీసుకువచ్చిన బంగారం, వెండి, నగదు లాకర్లో పెట్టడాన్ని గమనించాడు. పక్కా స్కెచ్‌తో.. ఆ రోజు సాయంత్రం షాపు కట్టేసి వెళ్లిపోయిన తర్వాత రాత్రి 1.30 గంటల సమయంలో మారు తాళాలతో ముందు కింది గేటు తాళం, తర్వాత రెండో అంతస్తులో ఉన్న మెయిన్ డోర్ తాళం తీశాడు. దొంగలు బలవంతంగా పగుల కొట్టారని నమ్మించేందుకు తాళం కప్పను రాయితో పగులకొట్టాడు. మారు తాళంతో లాకర్ తెరిచి అందులో ఉన్న రూ.60 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండిని తనతో తెచ్చుకున్న రెండు బ్యాగుల్లో సర్దుకున్నాడు. అక్కడి నుంచి షట్టర్‌ను దించి దొంగిలించిన సొమ్మును ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. ఆ తర్వాత సొమ్మంతటినీ ఒకే బ్యాగ్‌లో సర్దేసి.. శనివారం ఉదయం తన స్నేహితుడు నాగేంద్ర (పాల వ్యాపారి)కు ఫోన్ చేశాడు. అతను బయట ఉన్నానని చెప్పడంతో.. ఆఫీస్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాగ్ తన వద్ద ఉందని, దానిని మీ ఇంట్లో పెడుతున్నానని చెప్పి.. నాగేంద్ర తల్లికి ఆ బ్యాగ్ ఇచ్చి యథావిధిగా షాపునకు వచ్చేశాడు. రెండు గంటల్లోనే.. శనివారం ఉదయం షాపు తెరిచేందుకు ప్రయత్నించిన యాజమాన్యం తాళాలు పగలగొట్టి ఉండటంతో, విషయాన్ని ఆ సంస్థ హెడ్ ఆఫీస్‌కు తెలియజేసి, మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో ఈస్ట్ డీసీపీ హర్షవర్ధన్‌రాజు పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజ్, షట్టర్, లాకర్ తెరవబడిన విధానాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనేనని భావించి.. దర్యాప్తు ప్రారంభించారు. పట్టించిన వస్త్రాలు.. నిందితుడు దొంగతనం చేసే క్రమంలో సీసీ టీవీపై దుప్పుటి కప్పాడు. ఆ సమయంలో అతను వేసుకున్న దుస్తులను ఆ సంస్థ యాజమాన్యం గుర్తించింది. అది జయచంద్రశేఖర్ ఒక సారి షాపునకు వేసుకొని వచ్చాడని స్పష్టం చేసింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో నిందితుడు తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాక సీసీటీవీపై కప్పిన దుప్పటిపై నిందితుడి వేలిముద్రలు ఉండటంతో దొంగతనం చేసింది అతనే అని నిర్ధారించారు. ఆ తర్వాత అతని స్నేహితుని ఇంటి వద్ద ఉంచిన బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం..
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్): దొంగలు ఓ నగల దుకాణంలోకి చొరబడి 3 కిలోల వెండి నగలు అపహరించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో శ్రీగణేష్ జ్యువెల్లర్స్ పేరిట సుమన్ చౌదరి అనే నగల షాపు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఆయన సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి షాపు తెరిచాడు. దుకాణం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం కనిపించడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సుమారు 3 కిలోల వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. దొంగలను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: కేటీఆర్ దిష్టిదొమ్మలు తగలబెట్టండి -
పాపం.. దొంగొడి మాస్టర్ ప్లాన్ .. ట్విస్ట్ ఏంటంటే..
బ్యాంకాక్: మీరు ‘అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి’ అనే సామెత వినే ఉంటారు. దీన్ని, మనం ఒకటి ఊహించి పనిచేస్తే.. దానికి పూర్తి వ్యతిరేకంగా దాని ఫలితం ఉంటున్నదన్నమాట. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడో వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు..ఈ సంఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. ఛోబూరి పట్టణానికి చెందిన సుఫాచాయ్ పాంథాంగ్కు 27 ఏళ్లు. ఇతను గత కొంత కాలంగా చోరీలకు అలవాటుపడ్డాడు.దీంతో, ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. బంగారం చాలా విలువైంది.. దాన్ని చోరీచేస్తే కొంత కాలం హయిగా ఉండోచ్చని అనుకున్నాడు. ఒక రోజు ఛోబూరిలోని ఒక బంగారు దుకాణంలో కస్టమర్లా వెళ్లి అక్కడి ఆభరణాలను చూశాడు. అదునుకోసం ఎదురు చూశాడు. ఆ దుకాణంలో రద్దీ కూడా లేదు. కాసేపటికి మెల్లగా, అటూ.. ఇటూ చూసి చైన్‌ను ట్రయల్ చేస్తున్నట్లు మెడలో వేసుకున్నాడు. ఆ షాపు యజమాని వేరే పనిలో ఉండటాన్ని గమనించాడు. అప్పుడు, మెల్లగా జారుకుని.. షాపు నుంచి బయటకు వెళ్లే మార్గం వైపుకు పరిగెత్తాడు. వెంటనే హడవుడిగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. పాపం.. అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతను ఎంత గింజుకున్నా ఆ తలుపు తెరుచుకోలేదు. దీంతో అతగాడికి చెమటలు పట్టాయి. నిజానికి ఆ దుకాణం తలుపు రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. కాసేపటికి, ఆ యువకుడు ఏమికానట్లు ఆ చైన్‌ను షాపు యజమానికి తిరిగి ఇచ్చేశాడు. అయితే, ఆ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు, ‘నన్ను ఒక కంపెనీవారు ఉద్యోగం నుంచి తొలగించారు. కేవలం, ఆర్థిక సమస్యల వలన చోరీ చేశానని తెలిపాడు. ఈ వీడియో గతంలోనే జరిగింది. ప్రస్తుతం తిరిగి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. అతని మాస్టర్ ప్లాన్ ఫెయిలయ్యింది..’, ‘అయ్యో.. అతను ఉద్యోగం లేకపోవడంతోనే ఇలాచేశాడు..’ ‘ ఏదైన.. అతను చేసింది తప్పే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/dZFHz5NtqS — people who died but are doing well (@jamorreram0) June 27, 2021 -
వామ్మో.. కిలేడీ గ్యాంగ్.. బంగారం కొనేందుకు వచ్చి.. ఎంత పనిచేశారు!
సాక్షి, కొత్తగూడెంటౌన్(ఖమ్మం): పట్టణ పరిధిలోని చిన్నబజార్‌లోని నగల షాపులో చోరీలకు పాల్పడిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం త్రీటౌన్ సీఐ వేణుచందర్ కథనం ప్రకారం... చిన్నబజార్‌లోని శ్రీనిధి జ్యూయలరీ షాపులో ఈ నెల 23న ఐదుగురు మహిళలు బంగారం కొనేందుకు వచ్చి రూ.60 వేల విలువైన బంగారు చెవి దిద్దులు దొంగిలించారు. యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం కొత్తగూడెం బస్టాండ్‌లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలోని షకీరాతండాకు చెందిన గుగులోతు గోబీ, భూక్యా బుల్లి, భూక్యా మంగతి, భూక్యా అంకు, భూక్యా సీతలుగా గుర్తించారు. వీరు కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, సిద్దిపేట, జిల్లాల్లో వస్త్ర దుకాణాల్లో, బంగారం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. చదవండి: నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్ చేస్తే.. -
యజమానిని నమ్మించి 10 కిలోల నగల బ్యాగ్‌తో జంప్
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారం షాపులో పనిచేసే ఓ గుమస్తా యజమాని కళ్లుగప్పి రూ. 4.84 కోట్ల విలువైన 10 కిలోల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. విజయవాడలోని గవర్నర్ పేటలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గవర్నర్‌పేట జైహింద్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మహవీర్ జైన్ అనే వ్యక్తి రాహుల్ జ్యువెలరీ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనవద్ద రవితేజ, హర్ష అనే ఇద్దరు గుమస్తాలు పనిచేస్తున్నారు. అదే సముదాయంలోని ఐదో అంతస్తులో యజమాని మహవీర్ జైన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా కారణంగా వ్యాపారం తక్కువగా జరుగుతుండటంతో మహవీర్ జైన్ ఆభరణాలను ఇంట్లోనే ఉంచి కొనుగోలు దారులు వచ్చినప్పుడు గుమస్తాలను పంపి వాటిని షాపులోకి తెప్పిస్తున్నాడు. అనంతరం తిరిగి ఇంటికి పంపుతున్నాడు. మంగళవారం ఉదయం ఆభరణాలు తీసుకొచ్చేందుకు ఇద్దరు గుమస్తాలను యజమాని ఐదో అంతస్తులోని తన ఇంటికి పంపాడు. అతని భార్య, కుమారుడు రెండు బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను వారిద్దరికీ ఇచ్చి పంపారు. అనంతరం 11 గంటల తర్వాత ఆ ఆభరణాలను తిరిగి ఇద్దరు గుమస్తాలు యజమాని ఇంటికెళ్లి ఇచ్చి వచ్చారు. మహావీర్ సోదరుడు ఇటీవల కోవిడ్ బారిన పడి స్థానికంగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతన్ని చూసి వచ్చేందుకు మహావీర్ 11.30 గంటల సమయంలో షాపు నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. అదే అదనుగా భావించిన గుమస్తా హర్ష 12.30 గంటల సమయంలో యజమాని ఇంటికి వెళ్లి ఆభరణాలు అడిగాడు. ఎప్పటిలాగే కొనుగోలుదారులకు చూపడానికే అనుకుని మహవీర్ భార్య, అతని కుమారుడు తిరిగి రెండు బ్యాగుల్లో ఉన్న ఆభరణాలను హర్ష చేతికి అందజేశారు. రెండు బ్యాగులతో కిందకు వచ్చిన హర్ష దుకాణానికి వెళ్లకుండా వాటితో ఉడాయించాడు. నగల దుకాణం కౌంటర్లో హర్ష (ఫైల్ ఫొటో) ఆస్పత్రికి వెళ్లిన మహవీర్ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం యథావిధిగా దుకాణం తెరిచి ఆభరణాల కోసం ఆరా తీయగా.. అసలు విషయం బయట పడింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారం దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్న హర్ష విజయవాడకు చెందినవాడేనని పోలీసులు గుర్తించారు. ఆభరణాలు అపహరించే ముందు హర్ష తనకు సంబంధించిన ఆధారాలు దుకాణంలో లేకుండా జాగ్రత్త పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన విషయం తెలిసిన వెంటనే నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. -
17 కేజీల బంగారం చోరి.. అడ్డొచ్చిన తల్లీ,కుమారుడి హత్య
సాక్షి, చెన్నై: శీర్గాలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం ఓ నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి నలుగురిపై కత్తులతో దాడి చేశారు. ఇంట్లో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ దొంగను ఎన్కౌంటర్ చేయగా, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మైలాడుతురై జిల్లా శీర్గాలి రైల్వేస్టేషన్ రోడ్డులో నగల వ్యాపారి ధనరాజ్ (50), ఆయన భార్య ఆశ(48), కుమారుడు అఖిల్(25), కోడలు నిఖిల(24) నివసిస్తున్నారు. బుధవారం వేకువజామున 6 గంటలకు దుండగులు ఆయన ఇంటి తలుపుతట్టారు. హిందీలో ఏదో అడుగుతున్నట్టుగా నటించి క్షణాల్లో ఆయనపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆశ, అఖిల్, నిఖిలపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి కత్తులతో పొడిచారు. అనంతరం బీరువాలో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి బయట పార్క్ చేసిన ధనరాజ్ కారులో ఉడాయించారు. తక్షణం స్పందించిన పోలీసులు దనరాజ్ కేకలతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆశ, అఖిల్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ధనరాజ్, నిఖిలను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్రీనాథ్, డీఎస్పీ యువప్రియ, ఇన్స్పెక్టర్ మణియన్, ఎస్ఐ మణిగండ గణేషన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ధనరాజ్ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా వారిని వెంబడించారు. ఎలుగురులో కారును వదలిపెట్టిన దుండగులు, అక్కడి నుంచి పంట పొలాల మీదుగా వెళ్లారు. కరుప్పన్నతోట్టంలో భుజాన ఓ సంచి వేసుకుని అనుమానాస్పదంగా ఉత్తరాది యువకులు తిరుగుతున్నట్టు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. అక్కడున్న ముగ్గురు యువకుల్లో ఒకరు పోలీసులను చూడగానే తనవద్దనున్న తుపాకీతో ఫైరింగ్ చేయడం మొదలెట్టాడు. దీంతో ఆత్మ రక్షణకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఒకరు హతమయ్యాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కాల్పుల్లో స్పెషల్ టీం పోలీసులు ఇద్దరు గాయపడ్డారు. అన్ని తెలిసిన వాడే... పోలీసుల ఎన్కౌంటర్లో మణిపాల్ సింగ్ (24) హతమయ్యాడు. ఉత్తరాదికి చెందిన ఇతను గతంలో ధనరాజ్ వద్ద పనిచేశాడు. ధనరాజ్ వ్యాపారం గురించి పూర్తిగా తెలిసిన వాడు. ఇటీవల ఓ తప్పు చేసి అడ్డంగా బుక్కవడంతో పని నుంచి తొలగించారు. దీంతో తంజావూరులోని ఓ దుకాణంలో పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన మిత్రులు మనీష్(22), రమేష్(22)తో కలిసి దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. లలితాలో 5 కేజీల బంగారం అపహరణ చెన్నై హబీబుల్లా రోడ్డులో లలిత జ్యువెలర్స్ ఉంది. ఇక్కడ ఆభరణాల లెక్కింపు సమయంలో 5 కేజీల బంగారం మాయమైంది. ఇక్కడ పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ సింగ్ చేతివాటం ప్రదర్శించి ఉండడం సీసీ కెమెరాలో నమోదైంది. తేనాంపేట పోలీసులు విచారణ చేపట్టారు. బంగారంతో ప్రవీణ్‌కుమార్ రాజస్థాన్‌కు ఉడాయించడంతో అతడి కోసం ప్రత్యేక బృందం బుధవారం అక్కడికి వెళ్లింది. -
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, డిచ్పల్లి: నిజామాబాద్‌లోని డిచ్పల్లి మండల కేంద్రంలో చోరీ జరిగింది. డిచ్పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు ఆభరణాల దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బ్యాగును తన బైక్‌పై పెట్టి దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే అదనుగా భావించిన దొంగలు సినీ ఫక్కీలో మరో బైక్‌పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగు తిన్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బంగారు వ్యాపారికి మస్కాకొట్టిన కిలేడీ
నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ బంగారు వ్యాపారిని మస్కా కొట్టి నెక్లెస్ తస్కరించి అక్కడ నుంచి జారుకుంది. సీసీ పుటేజ్‌ల ఆధారంగా కిలేడిని బాధిత వ్యాపారి గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుండడంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హడావుడిగా కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు నగరంలోని కాపువీధికి చెందిన లలిత్ బంగారు వ్యాపారి. ఆయన అదే ప్రాంతంలో ఫైనాన్స్ అండ్ పాన్‌బ్రోకర్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ మహిళ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చింది. ఓ నెక్లెస్‌ను సెలక్ట్ చేసి తన కుమారుడు వచ్చి నగదు చెల్లిస్తాడని అక్కడే కూర్చొంది. దీంతో వ్యాపారి ఆ నెక్లెస్‌ను ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచాడు. ఈ నేపథ్యంలో ఆ దుకాణానికి కొంతమంది వచ్చి బంగారు ఆ భరణాలు పరిశీలిస్తుండగా ఆమె కూడా ఆభరణాలు చూస్తున్నట్లు నటించి సుమారు రూ.1.59 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు నెక్లెస్‌ను కాజేసి దుస్తుల్లో దాచేసింది. అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకుంది. దుకాణంలో కొనుగోలుదారులందరూ వెళ్లిపోయిన అనంతరం యజమాని లలిత్ ఆభరణాలు సరిచూసుకోగా 53 గ్రాముల బంగారు నెక్లెస్ కనిపించలేదు. దీంతో లలిత్ తన దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా తొలుత వచ్చిన మహిళ బంగారు ఆభరణాన్ని తస్కరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆమె గురించి ఆరా తీయగా కుక్కలగుంటకు చెందిన మహిళ అని తేలింది. ఆమె తన స్నేహితుడి ద్వారా దానిని కరిగించి మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితులు బుధవారమే సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించినట్లు తెలిసింది. దీంతో బాధితులు గురువారం ఈ విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ అధికారులకు తెలియజేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సంతపేట పోలీసులతో మాట్లాడడంతో గురువారం రాత్రి çబాధితుల నుంచి మరోసారి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకుని హæడావుడిగా కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కిలేడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
సనా... ‘సోనా’
-
కంటె కనువిందు
నానమ్మ, అమ్మమ్మల మెడలలో అప్పట్లో కంటె ఆభరణం (దీని నుంచే కంఠాభరణం అనే పేరు వచ్చి ఉంటుంది) ఉండేది. వేడుకలకే కాకుండా ఎప్పుడూ ధరించి ఉండేవారు. ఆ తర్వాత గోల్డ్ షాపుల్లో ‘కంటె’ కరిగి ఆధునిక నగగా రూపాంతరం చెందింది. కానీ, ఇప్పుడు ‘కంటె’ ట్రెండ్ మళ్లీ వచ్చింది. వేడుకలలో కనువిందు చేసే కంఠాభరణమైంది.కంటె ట్యూబులా ఉంటుంది. దీంట్లో వేల డిజైన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కంటెకు పెండెంట్ వేసుకోవచ్చు. పెండెంట్ లేకుండానూ కంటెను ధరించవచ్చు. 25 గ్రాముల నుంచి ఎంత మొత్తం బంగారంతోనైనా డిజైన్ని చేయించుకోవచ్చు. లైట్ వెయిట్లోనూ కంటె డిజైన్లు చేయించుకోవచ్చు. వివాహ వేడుకలలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ డిజైన్ బాగా అమరుతుంది. ఆభరణాల అలంకరణలో వయసుతో నిమిత్తం లేనప్పటికీ కంటె ఆభరణానాన్ని 50 ఏళ్ల లోపు వయసువారికి బాగా నప్పుతుంది. నవతరం అమ్మాయిలు ఆధునిక దుస్తుల మీదకు అలంకరించుకోవాలంటే స్టైల్‌గా ఉండే నెక్‌పీస్ కావాలి. ఇందుకు సన్నటి డిజైన్లలో ఉన్న కంటెను ఎంపిక చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్లెయిన్‌గా ఉండే కంటెకు రాళ్లు, రత్నాలు పొదిగి, పెండెంట్లు జత చేయడం కంఠాభరణం కమనీయంగా మారిపోయింది. – శ్వేతారెడ్డి ఆభరణాల నిపుణురాలు -
దోపిడీ కలకలం
పటాన్చెరు టౌన్: అమీన్పూర్ మండలం బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన చోరీ కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, దొంగల దాడిలో గాయాలపాలైన షాపు యజమాని జైరాం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు ఆరు నెలల క్రితం ఒక సారి షాపునకు వచ్చివెళ్లారని చెప్పడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దొంగతనం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మంగళవారం రాత్రి 9. 45 సమయంలో బురఖా వేసుకున్న ఓ మహిళ, ఓ వ్యక్తి బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులోకి వచ్చి నగల మోడళ్లను చూపించాలంటూ యజమానిని కోరారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. అనంతరం షాపు యాజమాని జైరాం లోపలికి వెళ్లి సేఫ్ లాకర్లో నగలు పెడుతుండగా పిస్టల్‌తో బెదిరిం చారు. అతను పిస్టల్ గుంజుకోవడానికి యత్నించడంతో బురఖా వేసుకున్న మహిళ అతని కళ్లలో కారం చల్లింది. వెంటనే ఇద్దరు కలసి వెంట తెచ్చుకున్న రాడ్‌తో జైరాం తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలాడు. అతడిని బాత్రూంలోబందించి షాపులో ఉన్న 1 కిలో బంగారు ఆభరణాలు, రూ. 4.5 లక్షల నగదు తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న షాపు యజమాని బాత్రూం తలుపులు పగులగొట్టి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి చోరికి పాల్పడిన నిందితుడి ఫోటోను బుధవారం ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి విడుదల చేశారు. ఎవరైనా నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించారు. -
రూ.31.50లక్షల నగదు స్వాధీనం
సాక్షి, తాడిపత్రి టౌన్ : స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం రూ.31.50లక్షల నగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం పతాంజలి వీధికి చెందిన నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు పట్టణ సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నజీర్ జువెలర్స్ యజమాని నజీర్ అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు డీఎస్పీకి వచ్చిందన్నారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం ఎస్ఐలు రాఘవరెడ్డి, శ్రీధర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బంగారు షాపు యజమానిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. -
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
మహబూబాబాద్ రూరల్ : దుకాణంలో దొంగలు పడిన ఘటనను ఓ యజమాని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. తన షాపులో 80 తులాల బంగారం, 20 కేజీల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు అప్పటికప్పుడు కథ అల్లి రక్తి కట్టించాడు. ఇప్పటికే వరుస దొంగతనాలతో గస్తీ ముమ్మరం చేసిన పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం ఇది భారీ చోరీ ఘటన కావడంతో ఏకంగా ఎస్పీ, అదనపు ఎస్పీలే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించడంతో చోరీ గుట్టు రట్టయ్యింది. దొంగతనం జరిగింది నిజమే అయినప్పటికీ సొత్తు పోలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన బుధవారం సంచలనం సృష్టించింది. అదనపు ఎస్పీ కథనం గిరిధర్ ప్రకారం.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన సత్యమనోరమ బంగారు నగల దుకాణం యజమాని నారోజు సుభాష్‌చంద్రబోస్ నిత్యం ఇంటి నుంచి ఒక పెట్టెలో బంగారం, రెండు బ్యాగుల్లో వెండి నగలు, రెండు బ్యాగుల్లో పత్రాలు తెచ్చుకుని షాపులో వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రాత్రి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఆభరణాలను తిరిగి తన వెంట తీసుకెళ్తాడు. మంగళవారం రాత్రి కూడా అలాగే తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గుమస్తా వెంకటేశ్వర్లు 10.30 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చి రిమోట్ సాయంతో షెట్టర్ తీసి లోపలికి వెళ్లగానే షాపులోని ఫర్నిచర్, ఇతర వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. వెంటనే అతడు యజమాని సుభాష్‌చంద్రబోస్‌కు సమాచారమిచ్చాడు. ఇదే అదునుగా భావించిన యజ మాని తన షాపులో పెద్దమొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఇందుకు సహకరించాలని వర్కర్లను కోరాడు. వర్కర్లు అనిల్ వద్ద 20 తులాలు, వెంకటేశ్వర్లు వద్ద 15 తులాల బంగారం ఉంటే ఇదే షాపులో భద్రపరిచినట్లు పోలీసులకు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశాడు. అలాగే తన కౌంటర్లో ఉన్న మరో 45 తులాల బంగారం, 20 కిలోల వెండి, రూ. 90 వేల నగదు చోరీకి గురైనట్లు కథ అల్లాడు. యజమాని ఫిర్యాదు ప్రకారం భారీ చోరీ కావడంతో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు నాలుగు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్కర్లు నరేష్, అనిల్‌ను విడివిడిగా విచారించడంతో వాస్తవం బయటపడింది. మంగళవారం రాత్రి సుభాష్‌చంద్రబోస్ తన గుమాస్తా అనిల్‌తో కలిసి ఆభరణాలు ఇంటికి తీసుకెళ్లడం లక్ష్మీ, నరేష్ ప్రత్యక్షంగా చూసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చివరికి యజమాని కూడా నిజం ఒప్పుకుని తన షాపులో ఎలాంటి వస్తువులు పోలేదని చెప్పినట్లు ఏఎస్పీ గిరిధర్ వెల్లడించారు. కాగా సంఘటన స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి సందర్శిం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, టౌన్ సీఐ జబ్బార్, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ రమేష్‌కుమార్, ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు అరుణ్‌కుమార్, ఏఎస్సై వెంకటరమణ, పీసీ వేణుగోపాల్, అశోక్ పాల్గొన్నారు. నష్టాల నుంచి బయటపడేందుకే.. మానుకోటలో వరుస దొంగతనాలు జరుగుతుం డడం, సోమవారం ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని బంగారు నగలను రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన దుకా ణంలో చోరీ జరగడంతో అప్పటికే నగల వ్యాపారంలో నష్టపోయి, అప్పులపాలైన సుభాష్‌చంద్రబోస్ ఈ ఘటనను అనుకూలంగా మార్చుకోవా లని భావించినట్లు తెలిసింది. అందుకే భారీ చోరీ జరిగినట్లు కథ అల్లినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో గుమాస్తాలను విచారించడంతో అసలు విషయం బయటపడింది. -
బంగారం షాపులో చోరీ
మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఓ జ్యూలరీ షాపులో చోరీ జరి గింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకా రం.. మునవర్ నాగేశ్వరరావుకు మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనగల రామవిలాస్ వీధిలో శ్వేత జ్యూలరీ షాపు ఉంది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి గడ్డపారలతో దుకాణం షెట్ట ర్ను పైకి లేపి దోపిడీకి పాల్పడ్డారు. 46తులాల వెండి, 4కిలోల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించారు. వీటి విలువ రూ. 15.10లక్షలు ఉంటుంది. అంతేకాకుండా షాపులో ఏర్పాటుచేసిన సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. దొంగలను పట్టుకుంటాం.. వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మరిపెడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం వద్దకు పోలీస్ జాగిలాలను రప్పించి పరిశీలించారు. కాగా, ఇదే ప్రాంతంలో ఉన్న మరో సీసీ కెమెరాలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బంగారు దుకాణంలోకి చొరబడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. వీటికి సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం వద్ద రోడ్డు పక్కన చోరీ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని ఖాళీబాక్స్‌లు, చోరీకి ఉపయోగించిన గడ్డపారలు పడేసినట్లు గుర్తించామన్నారు. ఆయనతో పాటు తొర్రూర్ డీఎస్పీ రాజారత్నం, మరిపెడ సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్సైలు పవన్‌కుమార్, మద్దెల ప్రసాద్‌రావు తదితరులున్నారు. -
బంగారం దుకాణంలో పేలిన గ్యాస్‌సిలిండర్
మిర్యాలగూడ అర్బన్: బంగారం దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గ్యాస్ సిలిండర్ పేలిం ది. ఈ ఘటన పట్టణంలోని పెద్దబజారులో శుక్రవా రం చోటుచేసుకుంది. స్థానికులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్యజువెల్లరి దుకాణంలో నగలను తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో పనిచేస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సిలిండర్ ద్వారా వచ్చిన మంటలు సామగ్రికి అంటుకుని ఒక్కసారిగా భవనాన్ని కమ్మెశాయి. అనంతరం సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో భవనం కుప్పకూలి పోయింది. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అం దించారు. ఫైర్ట్యాంకర్ సకాలంలో రాకపోవడంతో భవనం మెత్తం కాలిబూడిదైంది. దీంతో సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మున్సిపల్ అధికారులతో మా ట్లాడారు. స్పందించిన మున్సిపల్ అధికారులు రెండు వాటర్‌ట్యాంకర్లను రప్పించారు. స్థానికులు, ఫైర్‌స్టేషన్ సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటలు విపరీతంగా చెలరేగడంతో పక్క బిల్డింగ్‌కు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఇంటిని ఖాళీ చేయించారు. కాగా సంధ్యజువెల్లరి దుకానం నిర్వాహకుడు నారాయణసింగ్ మా ట్లాడుతూ ఆ దుకాణంలో సుమారు 40తులాల బం గారం ఉందని, సుమారు 20లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. దుకాణం నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఘటన స్థలాన్ని తహసీల్దార్ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. -
గోల్డ్ బజార్లో అగ్ని ప్రమాదం