
తిరువొత్తియూరు: చైన్నె సావుకారుపేట పెరియనాయకన్ పేటవీధికి చెందిన యోగేష్ జైన్ నగల దుకాణం నడుపుతున్నారు. ఇతని దుకాణంలో ఈ నెల 3వ తేదీ రూ.15 లక్షల విలువైన బంగారు కడ్డీ చోరీకి గురైంది. దీనిపై ఎలిఫెంట్ గేట్ పోలీసులకు యోగేష్ ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. యోగేష్ జైన్ తమ్ముడు వినోద్ జైన్ నగలు అపహరించి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ప్రత్యేక బృందం పోలీసులు వినోద్‌ను అరెస్టు చేసి, అతని నుంచి కేజీ బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.