
షాపు వెనుకభాగంలో దుండగుల వేసిన కన్నం
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్): దొంగలు ఓ నగల దుకాణంలోకి చొరబడి 3 కిలోల వెండి నగలు అపహరించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో శ్రీగణేష్ జ్యువెల్లర్స్ పేరిట సుమన్ చౌదరి అనే నగల షాపు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఆయన సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు.
మంగళవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి షాపు తెరిచాడు. దుకాణం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం కనిపించడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సుమారు 3 కిలోల వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. దొంగలను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు
దర్యాప్తులో ఉంది.