thiefs
-
ఇద్దరు దొంగల ఫైటింగ్ కథ..
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక.. -
Hyderabad: దోమలగూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలోని గగన్‌మహల్ రాధామదన్‌నివాస్‌లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్‌లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్‌కు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్‌గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్‌గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చదవండి: TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్ -
నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్‌లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్లో రిపోర్ట్‌ను ఫైల్ చేయమని కోరింది. Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu — Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023 -
Hyderabad: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు
సాక్షి, కూకట్పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఓ ఇంట్లో గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్‌టాప్ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ పరిశీలన దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్‌రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, రాము, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. -
దోపిడీ దొంగల బీభత్సం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్‌ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్‌షాకోట్‌కి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక(నరేష్) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్‌ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు. కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్లను డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్‌రెడ్డి(35)కి ఫోన్ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. శివరాజ్ ఆ తర్వాత దారి కాచి హత్య... ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్‌రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్‌లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటి పోలీసులపై దాడి జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్‌సింగ్.. కూకట్పల్లి సిక్ బస్తీలోని భగవాన్‌సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్ సింగ్ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్ను మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్ డీసీపీ సందీప్ గోనె, మాదాపూర్ ఎస్ఓటీ క్రై మ్ అడిషనల్ డీసీపీ నారాయణ, బాలానగర్ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బంజారాహిల్స్: ముసుగు ధరించి నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి, అతడి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నివాసం ఉంటున్నాడు. ఇతడి వద్ద పని చేసే సేల్స్‌మెన్ ఆనంద్ మంగళవారం రాత్రి 9 గంటలకు ఆభరణాల దుకాణాన్ని మూసివేశాడు. రెండు షట్టర్లు, లాకర్ల తాళం చెవులు బ్యాగ్‌లో వేసుకొని యజమానికి ఇవ్వడానికి స్కూటీపై అతని నివాసానికి వచ్చాడు. హెల్మెట్ తీసి తన వాహనంపై పెడుతుండగా అప్పటికే పంజగుట్ట నుంచి అనుసరిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆనంద్ కళ్లల్లో కారం కొట్టి బ్యాగు లాక్కొని ఉడాయించారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అదే రోజు రాత్రి ఆగంతకులు ఆ బ్యాగును పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ ముందు పడేసి పరారైనట్లుగా గుర్తించారు. ఈ బ్యాగులో డబ్బు లేదా నగలు ఉంటాయని వారు భావించి ఉంటారని, అందులో తాళం చెవులు మాత్రమే ఉండటంతో బ్యాగు ను షాపు వద్ద పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాళాలతో షాపు షట్టర్లు తెరుద్దామని వెళ్లి ఉంటారని,అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో బ్యాగ్‌ను షాపు ముందు పడేసి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
-
సినిమాను తలపించే ట్రైన్ ఛేజింగ్! రైల్వే పోలీసుల సాయంతో..
సాక్షి, చెన్నై: ఇప్పటి వరకు దొంగల వేటలో బైక్, కారు ఛేజింగ్‌లు చేసిన తమిళ పోలీసులు.. తాజాగా ట్రైన్ ఛేజింగ్‌తో ఉత్తరాది ముఠా ఆటకట్టించారు. వివరాలు.. తిరుప్పూర్‌కు యూనియన్ మిల్‌రోడ్డు కేపీఎన్ కాలనీకి చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో కుదువ దుకాణం నడుపుతున్నాడు. ఈనెల మూడో(గురువారం) తేదీ అర్ధరాత్రి ఆ దుకాణంలో దోపిడీ జరిగింది. నాలుగో తేది ఉదయాన్నే(శుక్రవారం) ఈ ఘటన వెలుగు చూసింది. ఈ దోపిడిలో 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 25 లక్షల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దొంగల కోసం వేట మొదలెట్టారు. నలుగురు యువకులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. తిరుప్పూర్ నుంచి ఈ యువకులు చెన్నైకు చేరుకున్నట్లు గుర్తించారు. చివరికి చెన్నై నుంచి ముంబై వైపుగా వెళ్లే రైలు ఎక్కినట్టు తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా మరో రైలులో తమిళ పోలీసులు ఛేజింగ్‌కు బయలుదేరారు. రైల్వే పోలీసుల సాయంతో ఆదివారం ఉదయాన్నే ఆ నలుగురు యువకులను చాకచక్యంగా నాగ్‌పూర్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి వద్ద నుంచి 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 14 లక్షల నగదు లభించాయి. 24 గంటల్లో 11 లక్షలు మాయం చేసి ఉండడంతో, వీరికి సహకరించిన వారెవ్వరైనా తిరుప్పూర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. బిహార్‌కు చెందిన ఈ నలుగురిని సోమవారం నాగ్‌పూర్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం తిరుప్పూర్‌కు తరలించనున్నారు. -
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు
-
యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం..
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్): దొంగలు ఓ నగల దుకాణంలోకి చొరబడి 3 కిలోల వెండి నగలు అపహరించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో శ్రీగణేష్ జ్యువెల్లర్స్ పేరిట సుమన్ చౌదరి అనే నగల షాపు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఆయన సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి షాపు తెరిచాడు. దుకాణం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం కనిపించడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సుమారు 3 కిలోల వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. దొంగలను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: కేటీఆర్ దిష్టిదొమ్మలు తగలబెట్టండి -
రూ.1.26 కోట్లతో పరారైన దొంగలు దొరికారు
నెల్లూరు (క్రైమ్): బ్యాంకులో జమ చేయాల్సిన నగదుతో పరారైన నిందితులు దొరికారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు సారాయంగడి సెంటర్‌కు చెందిన షేక్ రబ్బాని మూడేళ్లుగా బాలాజీనగర్‌లోని రైటర్స్ సేఫ్ గార్డ్స్ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ నిర్దేశిత షాపింగ్‌మాళ్లు, హాస్పిటళ్లు తదితర సంస్థల వద్ద రోజువారీ కలెక్షన్ సేకరించి ఆ వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంటాడు. ఈ క్రమంలో ఆగస్టు 31న రబ్బాని, అతని సహచర ఇద్దరు కస్టోడియన్లు రోజువారీ కలెక్షన్ రూ.1,26,08,450 నగదును సేకరించారు. దాన్ని బ్యాంకులో జమచేయాలని వారు రబ్బానికి ఇచ్చారు. రబ్బాని తన స్నేహితులైన సారాయంగడి సెంటర్‌కు చెందిన పాతనేరస్తుడు షేక్ రఫీ అలియాస్ గాంధీ, నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంకు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ దూద్కలతో కలిసి నగదుతో ఉడాయించాడు. కొంత నగదును తెలిసిన వారివద్ద పెట్టి మిగిలిన నగదును తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంస్థ రూట్ లీడర్ తిరుపతిరావు ఈనెల 1న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర, సీసీఎస్ డీఎస్పీలు జె.శ్రీనివాసులరెడ్డి, శివాజీరాజా తమ సిబ్బందితో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు సాంకేతికతను వినియోగించుకుని నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ జల్సాలు చేయసాగారు. తీసుకెళ్లిన నగదు ఖర్చు అయిపోవడంతో మిగిలిన నగదును తీసుకెళ్లేందుకు సోమవారం నెల్లూరుకు వచ్చారు. నవబాల దుర్గాదేవి గుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. -
దొంగను దోచుకోబోయిన మరో దొంగ!
న్యూయార్క్ : దొంగ దగ్గరే తన చేతికి పని చెప్పి దొరికిపోయాడో దొంగ. తను దొరికిపోవటమే కాకుండా ఆ మరో దొంగను కూడా పోలీసులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే.. మార్చి 10వ తేదీన షమారి జే రియెడ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి టయోటా ఆర్ఏవీ4లో వెళుతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కగా టైకెల్ విల్సన్ అనే 19 ఏళ్ల యువకుడు పంక్షరైన తన కారు టైరు మార్చటానికి కష్టపడిపోతూ కనిపించాడు. దీంతో వారు టైకిల్కు సహాయం చేయటానికి కిందకు దిగారు. వారు కారు టైరు మారుస్తూ ఉండగా టికైల్.. రియెడ్ కారులోకి చేరుకున్నాడు. ఆ కారును దొంగిలించటానికి ప్రయత్నించాడు. కారును రివర్స్ చేయగా అది కాస్తా పుట్‌పాత్‌ను ఢీకొట్టి ఎటూ కదలకుండా నిలబడిపోయింది. ఆ వెంటనే స్పందించిన రియెడ్ తన కారులోకి చేరి హ్యాండ్ గన్‌తో టికైల్ను నిలువరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు యజమానిగా చెప్పుకుంటున్న రియెడ్ ఓ దొంగని, సదరు టయోటా కారును ప్రిన్స్ జార్జ్ కౌంటీనుంచి అతడు దొంగిలించాడని గుర్తించారు. టికైల్, రియెడ్లను అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలేశారు. చదవండి : వృథా అయిన డోసులు 23 లక్షలు, ఇలా అయితే బెటర్! -
పెళ్లింట భారీ చోరీ
కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి. విందు నుంచి వచ్చేసరికి చిందరవందర పెళ్లి, రిసెప్షన్ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్ బెల్ కొడుతూ వాచ్‌మన్‌ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
దొంగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా జైలు నుంచి బయటపడ్డ ముగ్గురు దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడి మళ్లీ జైలుపాలయ్యారు. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ కేంద్రంగా నేరాలకు పాల్పడుతూ జైలు పాలైన రాహుల్, సాగర్, ప్రమోద్ అనే ముగ్గరు వ్యక్తులు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలలలో బెయిల్ మీద విడుదలయ్యారు. కానీ, బయటికొచ్చినా వారు నేరాలు చేయటం మానుకోలేదు. నగరంలోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ( ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి ) దీంతో అంజనీ ప్రసాద్ శాస్త్రి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డుపై వెళుతుండగా ఓ ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి తన మొబైల్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్సుతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగల్ని పట్టుకోవటానికి ఆపరేషన్ మొదలుపెట్టారు. సీసీ కెమెరా ఫొటేజీల ద్వారా ఆధారాలు సంపాదించారు. అనంతరం పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ( భార్య చేతిలో.. తాగుబోతు భర్త హతం ) -
ఓజీ కుప్పం గ్యాంగ్ చిక్కింది
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి ఆ డబ్బుల్ని దొంగిలించే ఓజీ కుప్పం గ్యాంగ్ నగర పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక నగరాలు, పట్టణాల్లో తమ పనికానిచ్చింది. నలుగురున్న ఈ గ్యాంగులో ఇద్దరిని పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.9.4 లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ పి. రాధాకిషన్‌రావుతో కలసి గురువారం మీడియాకు వెల్లడించారు. రైళ్లలో వాహనాలతో సహా వచ్చి.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓరన్ థంగల్ గొల్ల కుప్పంను ఓజీ కుప్పంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 మంది నేరగాళ్ళు 12 గ్యాంగ్‌లుగా పని చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్లు మినహా సభ్యులు ఒక్కోసారి ఒక్కో గ్యాంగ్‌లో కలిసి ‘పని’కి వెళ్తుంటారు. తెలుగు, తమిళం బాగా, హిందీ ఓ మోస్తరుగా తెలిసిన వీళ్ళు దక్షిణాదినే లక్ష్యంగా చేసుకుంటారు. ఓ నగరం/పట్టణాన్ని టార్గెట్‌గా చేసుకుని వారంతా ఆ ప్రాంతానికి బైక్‌లు తీసుకుని బయల్దేరతారు. లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి వాహనాలను రైల్వే పార్శిల్ ద్వారా తాము వెళ్లే రైల్లోనే తీసుకువస్తారు. అక్కడకు చేరుకుని లాడ్జిల్లో లేదా శివార్లలో ఇళ్ళు అద్దెకు తీసుకుని బస చేస్తారు. అనంతరం ఓ బ్యాంకుపై దృష్టి సారించి ముగ్గురు వ్యక్తులు బ్యాంకు బయట, మరో వ్యక్తి బ్యాంకులోపల ఉంటారు. అక్కడ నగదు డ్రా చేస్తున్న వ్యక్తులను ప్రధానం వయసు మళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని అతడి కదలికలను ఎప్పటికప్పుడ బయటివారికి దొంగిలించి న సెల్‌ఫోన్ ద్వారా చేరవేస్తుంటాడు. డబ్బు డ్రా చేసిన వ్యక్తి బయటకొచ్చినప్పటినుంచి ఈ గ్యాంగ్ సమయం కోసం వేచి చూస్తూ అతడిని వెంబడిస్తుంది. ఖాతాదారుడు కనుక కారులో వస్తే తమ వద్ద ఉన్న పంక్చర్ చేసే ఉపకరణంతో టైర్‌కు రంధ్రం చేసి, లేదా కారులో డ్రా చేసిన డబ్బు తీసుకువెళ్ళేప్పుడు యజమానితో పాటు డ్రైవర్ కూడా ఉంటే రూ.50, రూ.100 నోట్లు పక్కన పడేయటం ద్వారా అవి మీవే అంటూ తీసుకునేలా చేసి తమ పని పూర్తి చేస్తారు. ఒకవేళ బైక్‌లోని డిక్కీలో నగదు పెడితే పార్క్ చేసేంత వరకు తెలియకుండా వెంటబడతారు. అనంతరం డిక్కీని పగలగొట్టి డబ్బును దొంగిలిస్తారు. ఈ మూడు కాకపోతే వీరి వద్ద దురద పుట్టించే ఓ స్ప్రే సిద్ధంగా ఉంటుంది. ఓ ముఠా సభ్యుడు తమ టార్గెట్ గమనించకుండా అతడి పై దీన్ని స్ప్రే చేసి వెళ్ళిపోతాడు. బాధితుడు ఆ దురదతో ఇబ్బంది పడుతుంటే వెనుక వచ్చే గ్యాంగ్ సభ్యులు సహకరిస్తున్నట్లు నటించి డబ్బు కాజేస్తారు. 300 కెమెరాల ఫీడ్ విశ్లేషించి.. నగరాన్ని టార్గెట్ చేసిన ఈ ముఠా గత నెల, ఈ నెల్లో కలిపి నల్లకుంట, అంబర్పేట్, ఫలక్‌నుమ, మీర్పేట్ ఠాణాల పరిధుల్లో నాలుగు నేరాలు చేసి రూ.16 లక్షలు ఎత్తుకుపోయారు. ఈ కేసుల్ని ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో పాటు గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఫలక్‌నుమ డీఐ కేఎస్ రవి సైతం బృందంగా ఏర్పడ్డారు. వీరు నేరం జరిగిన నాలు ప్రాంతాల్లోని సుమారు 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. రెండు వాహనాలపై తిరుగుతున్న నలుగురు వ్యక్తులు ఈ నేరాలు చేశారని, నేరం తర్వాత తమ ముఖాలు కప్పుకుని తప్పించుకుంటున్నారని గుర్తించారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు తమ వేగుల సాయంతో ఆ నలుగురూ ఓజీ కుప్పం ప్రాంతానికి చెందిన ఆకుల కిరణ్, జి.తులసింధర్, ప్రభుదాస్, శామ్యూల్రాజ్గా నిర్థారించారు. అనంతరం వీరికోసం ఓజీ కుప్పం వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే ఉండి నిందితులు కిరణ్, తులసింధర్లను పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.9.4లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగరంలో నాలుగు నేరాలతో పాటు ఏపీలోని పెనమలూరు, పామర్రు, చిలకలపూడి, కర్ణాటకలోని బీదర్, తుముకూర్ల్లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌పై మూడు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయి. తులసింధర్పై గతంలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నేరగాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
కార్యాలయం ఉద్యోగులే దొంగలు!
సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్‌టౌన్ సీఐ ఎం.భీమానాయక్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్ ఫోన్లు, వైర్లెస్ స్పీకర్–1, సన్ గ్లాసెస్–1, బైక్ హారన్–1, రిస్ట్వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్ అలియాస్ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్ఐ నఫీజ్ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్ అభినందించారు. -
దొంగలు దొరికారు
సాక్షి, విజయవాడ, గుంటూరు : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బందరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీసీఎస్ బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన రాజేష్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. భార్య లక్ష్మితో పాటు బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురకా మమత, బత్తుల రేణు, తమ్మిశెట్టి బాలవీరాస్వామిలకు ఈజీ మనీ ఆశ చూపించి అతనితో కలుపుకున్నాడు. నేరాలు చేసేందుకు చేయి కలిపిన బంధువులతో కలిసి జనాన్ని మోసగించడం ప్రారంభించాడు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చిత్రీకరించి అమాయకులను అడ్డంగా దోచేయడం ప్రారంబించాడు. అలా జూన్ మాసంలో పెడన మండలం సింగరాయపాలెంలో బం«ధువులతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందరూ కూలి పనులు చేసుకుంటున్నట్లు గ్రామస్తులను నమ్మించారు. జూన్ 21న సింగరాయపాలెంకు చెందిన దుర్గాభవానీ అనే మహిళను కలిసి తనకు బంగారం బిస్కెట్ దొరికిందని నమ్మించాడు. అది అమ్మడం తనకు కష్టమని చెప్పి అతి తక్కువ ధరకు దొరికిన బిస్కెట్ అమ్మేస్తానంటూ అమాయకంగా నటించాడు. రాజేష్ మాటలు నమ్మిన దుర్గాభవానీ తన ఒంటిపై ఉన్న బంగారు నానుతాడు, చెవిదిద్దులతో పాటు రూ. 20వేల నగదును అప్పజెప్పి బిస్కెట్‌ను తీసుకుంది. అనుకున్న విధంగా పని ముగియడంతో రాజేష్, అతని బంధువులు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న దుర్గాభవానీ జరిగిన ఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజేష్, అతని బంధువులు చిలకలపూడి రైల్వేస్టేషన్లో అదే తరహాలో ప్రయాణికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. నిందితుడు రాజేష్‌తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేసి 24 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ముఠాను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీసీఎస్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావులను అబ్దుల్ అజీజ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ హనుమంతరావు, పెడన ఎస్ఐ మురళి, జి. సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జల్సాల కోసం చోరీ
సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు. అయితే 24 గంటలు గడవకుండానే పోలీసులు వారిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని ఏవీ గోడౌన్ సమీపంలో శనివారం ఐదుగురు నిందితులను సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ 5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోతురాజు ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లకు చెందిన సూర విష్ణువర్ధన్‌రెడ్డి, దొర్ని పాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి గత నెల 29వ తేదీ సాహు సినిమా చూడటానికి ఆళ్లగడ్డకు వచ్చారు. నైట్ షో తర్వాత గ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో ఎక్కారు. అయితే వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులున్నట్లు భావించిన ఆటో డ్రైవర్ జెట్టి లక్ష్మణ్ తన మిత్రులు నీలిశెట్టి భూపతి శివ, దొమ్మరి దామోదర్, భూపతి సురేష్‌బాబుకు ఫోన్ చేసి రప్పించాడు. ఆటో చింతకుంట శివారు హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపానికి వెళ్లే సరికి వారంతా బైకులపై వచ్చి చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న సూర విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని కిందకు దింపి దగ్గరున్న సొమ్ములు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు లేవని చెప్పడంతో విపరీతంగా కొట్టి మూడు సెల్ఫోన్లు, రూ.5,500 నగదు లాక్కొని వెళ్లి పోయారు. బాధితులు శుక్రవారం పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ రమణ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 24 గంటలు గడవకుండానే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. -
టేక్మాల్ మార్కెట్లో దొంగల హల్చల్
సాక్షి, టేక్మాల్(మెదక్): టేక్మాల్ మార్కెట్లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు. అధికంగా సెల్ఫోన్ల చోరీ.. మార్కెట్లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ వచ్చే వారి సెల్ఫోన్లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్‌కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్‌కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. స్టేషన్లో ఫిర్యాదులు.. వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్‌పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది. దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్లోని దొంగలతో పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశా.. గత వారం మార్కెట్లోకి కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. మార్కెట్లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్ పట్టుకుంటాం.. పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతాం. మార్కెట్‌కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – షాబొద్దీన్, ఎస్ఐ, టేక్మాల్ -
మిరపకాయల దొంగలు ఇద్దరు అరెస్టు
కృష్ణాజిల్లా, చందర్లపాడు (నందిగామ) : కల్లాల్లో ఎండబెట్టిన మిరపకాయలను దొంగిలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌కుమార్, జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి సైదేశ్వరరావు గడిచిన రెండు మాసాలుగా పలు గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగిలిస్తున్నారు. చందర్లపాడు మండలంలో పోపూరు, చింతలపాడు, పాతబెల్లంకొండ వారిపాలెం, కంచికచర్ల మండలం పెండ్యాల, వత్సవాయి మండలం గట్టుభీమవరం, తెలంగాణ రాష్ట్రం మధిర మండలంలోని దేశినేనిపాలెం గ్రామాలలో 96 టిక్కీల మిరపకాయల దొంగతనం జరిగింది. పగటిపూట ద్విచక్ర వాహనంపై పొలాల్లోని కల్లాల వద్ద రెక్కీ నిర్వహించి, స్థానికులతో కొద్ది సేపు కలివిడిగా మాట్లాడతారు. రాత్రి సమయంలో కల్లాల వద్ద రైతులు కాపలా ఉంటున్నారా లేదా అనేది నిర్ధారణ చేసుకుంటారు. కాపలా ఉండరని తెలిస్తే రాత్రివేళ వచ్చి మిరపకాయలను టిక్కీలకు ఎత్తుకుని ఆటో ద్వారా తరలిస్తారు. నిందితుల్లో ఒకడైన సైదేశ్వరరావుకు సొంత ఆటో ఉంది. మిరపకాయలను ఆ ఆటో ద్వారా నందిగామలో ఆనంద్‌కుమార్ ఉంటున్న ఇంట్లో నిల్వ చేస్తారు. ఆయా గ్రామాల్లో మొత్తం 96 టిక్కీల కాయలను ఇప్పటి వరకు దొంగిలించారని, వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. వీరిరువురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. -
బాబోయ్ దొంగలు
సాక్షి,నాగర్‌కర్నూల్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కురుమూర్తి ఆలయం, అచ్చంపేట ఉమామహేశ్వరం, కొత్తకోట మండ లంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీల చోరీలు, ఇళ్లల్లో చోరీలతో మరింత భ యానికి గురవుతున్నారు. వేసవి ఉక్కపోతకు ఇళ్లలో పడుకోలేక.. ఆరుబయట నిద్రపోదామంటే ఒకింత ఆందోళనతో ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వేసవికాలం కావడంతో చాలామటుకు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, ఇంటి మిద్దెలపై నిద్రిస్తుంటారు. కానీ, దొంగలకు ఇదే మంచి అవకాశంగా మారుతుంది. తాళం వేసిన ఇళ్లనే వారు టార్గెట్ చేసి దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. ఇళ్ల యజమానులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వంతుగా దొంగతనాల నివారణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙వేసవి సెలవుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్‌ను పోలీస్ అధికారులకు తెలియజేస్తే అలాంటి ప్రాంతాలలో పోలీసులు నిఘా పెడతారు. ∙విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ∙పని నిమిత్తం ఎవరైనా ఇంటికి తాళం వేసి వె ళ్లాల్సి వస్తే పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. ఇళ్లు తా ళం వేసి ఉంటే దొంగతనం జరిగే ఆస్కారం ఉంది. ∙ఇంటి ఆవరణ, కాలనీ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ∙మేడపై నిద్రించే వారు మెడలో బంగారు, వెండి ఆభరణాలు వేసుకోవద్దు. ∙ఇళ్లలో ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రపోవద్దు. అలా ఉండడం వల్ల కిటికీ పక్కన ఉంచే షర్ట్స్, ప్యాంట్లలో నుంచి పర్సులు, నగదు, సెల్ఫోన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది. ∙అపరిచితులను నమ్మొదు. బంగారానికి మెరుగు పెడతామని వచ్చే వారికి విలువైన వస్తువులు ఇచ్చి మోసపోవద్దు. ∙మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటికి, శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మెడచుట్టూ కొంగు కప్పుకోవాలి. లేదంటే బైక్‌లపై వచ్చి చోరీ చేసే ఆస్కారం ఉంది. ∙తమ ఇంటి సభ్యుల సౌకర్యార్థం ఇంటి తాళాన్ని పరిసరాల్లో, కిటికీల పక్కన పెట్టవద్దు. దొంగలు వాటిని గుర్తించి దొంగతనం చేసే అవకాశం ఉంది. ∙వేసవి కావడంతో తాళం వేసిన ఇంటి ముందు వాహనాలు నిలపొద్దు. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. జనసంచారం కల్గిన పార్కింగ్‌లలో వాహనాలు ఉంచాలి. ∙ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లలో ఓ గదిలో లైట్ వేసి ఉం చితే మంచిది. రాత్రి వేళలో లైట్ వెలుగుతూ ఉం టే ఇంట్లో ఎవరో ఉన్నారని దొంగలు ఊహిస్తారు. ∙ఇంటి డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే, ఇంటి గేట్లకు సైరన్లను బిగించుకోవాలి. అపరిచితులు గేటు డోర్లను ముట్టుకుంటే శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ∙ఇంటి పరసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకుంటే 100 నంబర్‌కు డయల్ చేయాలి. -
నడ్డిరోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్ళిన ఇద్దరు యువకులు