
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.
ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్‌లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్‌లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.
ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక..